Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదిరెండవ యధ్యాయము - బాలతంత్రము

పుష్కరః-అతః పరం ప్రవక్ష్యామి నరాణాం తే చికిత్సతమ్‌ | తత్రా7ప్యాదౌ తథా స్త్రిణాం యన్మూలం ప్రజనం యతః ||

మహాజంబు ద్వయం రోధ్రం మధుకం మధు శర్కరా | తండు లోదక సంయుక్తం శోణిత ప్రదరే పిబేత్‌ ||

ఊర్థ్వం సంవత్సరా న్నారీ రక్తగుల్మే విరేచయేత్‌ | స్నిగ్ధస్విన్న శరీరాం చ రామా తీక్‌ష్ణై ర్విరేచనైః ||

జ్వరేణ చ పలాశస్య సంసిద్ధం యావకం పిబేత్‌ | అగ్ని సంధుక్షణం చా7స్యా స్తథా కార్యం ప్రయత్నతః ||

ప్రస్థం వృషక మూలస్య తైలం ప్రస్థం విపాచయేత్‌ | యోనీనాం పరికోపేషు వేదనా మపకర్షతి ||

సౌదాష్ట్రీ రోచనా రోధ్రం మధూకం త్రిఫలా మధు | భద్ర ముస్తాని చూర్ణాని వాజీకరణ ముత్తమమ్‌ ||

అశ్వ గంధావిపక్వేన వరాహస్య తు మేదసా | గ్రంధీ కరణ మభ్యంగం యోషితాం పరికీర్తితమ్‌ ||

ఏక మామలకం కాలే సలిలాంజలినా పిబేత్‌ | స్పష్టం కాలాయసే భాండే తేన శాతోదరీ భ##వేత్‌ ||

త్రిఫలాం చిత్రకం శుంఠీం మధునా తు లిహే త్సదా | స్థూలానాం వర నారీణాం కృశీకరణ ముత్తమమ్‌ ||

అశ్వగంధాం పయస్యాం చ సంసృజ్య పయసా పిబేత్‌ | మాస మేత త్ప్రయుం జానా కృశాభవతి మాంసలా || 10

వరాహ వసయా కార్య మశ్వగంధ వివక్వయా | స్తనానాం మర్దనం తేన నారీ పీనస్తనీ భ##వేత్‌ ||

పుష్కరుండనియె: ఈపైని నరచికిత్సను దెల్పెద. అందులోగూడ ప్రజనన మూలము గావున (సంతానాధారముగావున) స్త్రీల చికిత్స ముందు వచించెద. మహాజంబూద్వయము రెండు నేరేడులు అల్లనేరేడు కాకినేరేడు లోధ్ర (లొద్దుగ) యష్టిమధుకము తేనే పంచదార బియ్యపుకడుగుతో కలిపి రక్త ప్రదరమను వ్యాధిలో త్రాగవలెను. ఏడాదిపైని రక్తగుల్మవ్యాధియందు స్నిగ్ధము స్విన్నము (చెమటపట్టునది) నైన శరీరముగలదానిని తీక్ష్నములయిన విరేచకమైన మందులచే వీరేచింపవలెను. వీరేచన శోధన చేయవలెను. పలాశము నేలగుమ్ముడు యావర్త గంజి (జావ) త్రాగిన అగ్నిదీపనమగును. వృషకమూలము పిండికొండచెట్టు వేళ్ళు ప్రస్థపరిమాణము వేసి కాచిన తైల మొక ప్రస్థము వాడిన యోని ప్రకోపము వేదనయు పోవును. సౌరాష్ట్రి కుందురుష్కము గోపిచందనము రోచన కానుగ లొద్దుగ ఇప్ప త్రిఫల కరకతాడి ఉసిరికలు తేనె భద్రముస్తలు అనువాని చూర్ణ ముత్తమ వాజీకరణము. (సత్తువ నిచ్చు మందు) అశ్వగంధ పెన్నేరుతో కాచిన వరాహము యొక్క మేధస్సుతో గలిపి అభ్యంగనము చేయించిన స్త్రీల కది గ్రంధీకరణౌషధము, ఒక్క ఉసిరికాయని కాలాయసభాండములో వేసి దోసెడు నీళ్ళతో కాచి త్రాగిన సన్నని నడుముగల దగుదు. త్రిఫలములు చిత్రకము చిత్రమూలము శుంఠియు తేనెతో పూసిన స్థలశరీరులగు స్త్రీలు సన్ననగుదురు. పెన్నేరి పయస్య పిన్న పాలయు పెన్నేరువేసి పాకముచేసిన వరాహవసతో వసుమేద స్తనములకు మర్దనము చేసిన స్త్రీ పీనస్తని యగును.

మూలకస్య చ్యుతం బీజం తథైవ త్రసదస్య చ | సప్తరాత్రం తు గోమూత్రే సిధ్మ నాశన ముత్తమమ్‌ ||

క్షారేణ హస్తి పిండస్య అవల్గుజ రసేన చ | ఏతేన ప్రోక్షితం శ్విత్రం త్రిరాత్రేణ వినశ్యతి ||

గుంజయా స్సఫలం మూలం చిత్రకం తగరం తథా | భల్లాతకానాం చ ఫలం మూలం చైవా7శ్వ మారకమ్‌ ||

అర్కక్షీర సమంతైలం ద్రవ్యై రేతై ర్విపాచయేత్‌ | ప్రోక్షణన వినిర్దిష్టం రోమశాతన ముత్తమమ్‌ ||

హస్తి దన్తమయీం పిష్ట్వా పయసా లేపయే చ్ఛిరః | అజాతేష్వపి కేశేషు రోమ సంజననం పరమ్‌ ||

భృంగ రాజరసై సై#్తలం సిద్ధ మభ్యంజనా ద్ద్రుతమ్‌ | దృఢ మూలాని కేశాని కుర్యాత్‌ కృష్ణా సితాని చ ||

కటుకం దంతకాష్ఠం తు గో మూత్ర పరి భావితమ్‌ | భుక్త్వా తైలేన గండూషం వక్త్రే గంధ హరం పరమ్‌ ||

ఇందీవరాణి శుష్కాణి ప్రాశ్యాని తండులై స్సహ | సర్వరాత్రం ముఖే వాతి సుగంధివిశదం శుచి ||

సర్షపోన్మథితం కృత్వా శాల్మలీనాంతు కంటకైః | పయః పిష్టైః ముఖే లేపా న్ముఖం స్యా త్కమలోపమమ్‌|| 20

ముల్లంగి విత్తులు తగరము విత్తులు (గ్రంధితగరమన్నమాట) గోమూత్రమునందు వేసి కాచినది యేడు రోజులు వాడిన సిధ్మము శోఫ-శోష శోషితము వాపు పోవును. అవల్గుజ రసముతో బావంచాల రసముతోడి హస్తి పిండ క్షారము ప్రోక్షించిన శ్విత్రము (బొల్లి) మూడు రాత్రులలో బోవును. గురివెంద తీగయు వ్రేళ్ళు గింజలతో చిత్రమూలము తగరము జీడిమామిడి పండ్లు మూలము (వేరు) కలిపివాడిన నశ్వవ్యాధిపోవును. జిల్లేడుపాలతో సమముగా నూనెయుం చేర్చి యింతమున్ను జెప్పిన వస్తువులు వేసి కాచిన నూనె రాసిన రోమములు పోవును. హస్తిదంత మయిని (దోస) పాలతో నూరి తలకు పూసిన బట్టతలంగూడ కేశములు పుట్టును. గుంటకలగరాకు రసముతో గాచిన తైలముతో తలంటుకొన్న వెంటనే జుట్టుకుదుళ్ళు గట్టిపడును. నెరసిన జుట్టు కూడ నల్లబడును. కటుకము (చేదైనది) దంతకాష్టము గోమూత్రముతో భావనచేయబడినది నూనెతో నమలి పుక్కిలించిన నోట దుర్వాసనపోవును. ఎండిన నల్లగలువలు బియ్యము గలిపి తిన్నచో రాత్రియెల్ల నోరు శుచియైన పరిమళించును. ముళ్ళతో గూడ బూరుగు గింజలను ఆవాలతో కలిపి నూరి పాలతో ముద్దచేసి ముఖము పద్మమువలె నగును.

వ్యంగానాం తిలకానాం చ శమనం తత్ప్ర కీర్తితమ్‌ | ¸°వనే పిటకానాం చ యే చ దోషాః ముఖేస్మృతాః ||

కషాయ కల్కసిద్ధేన శతావర్యా ఘృతేన చ | అభ్యంగ పానై ర్భవతి నారీస్యాత్‌ స్సృష్ట్యా తాం స్నాన మాచరేత్‌ ||

ఈ చెప్పినది వ్యంగములకు అవయవములలోని వికారములకు, తిలకములకు మచ్చలకు మొగమునందు ¸°వనమునందు వచ్చు పిటకములు (పొక్కులు) మొదలయిన దోషములకు నిది నివారకము. పిల్లి తీగ కషాయము కల్కముతో సిద్ధము చేయబడిన నేతితో తలంటుకున్నను దావినను స్త్రీకి మంచిరంగు వచ్చును.

షోడశర్తు నిశాః స్త్రీణాం ఆద్యా స్తిస్రస్తు నిందితాః | అస్సృశ్యా తాసు నారీ స్యాత్‌ స్పృష్ట్వా తాం స్నాన మాచరేత్‌ ||

దినత్రయం తు తన్నారీ స్నానా7భ్యంగౌ వివర్జయేత్‌ | ఆహారం గోరసానాం చ పుష్పలంకార ధారణమ్‌ ||

అంజనం కంకణం గంధాః పీతం శయ్యా7ధిరోహణమ్‌ | మృల్లోహ భాండ వర్జేషు తథా భాండేషు భోంజనమ్‌ ||

అగ్ని సంస్పర్శనం చైవ వర్జయేత్తు దినత్రయమ్‌ | చతుర్థే7హని కుర్వీత స్నానం సా తు యథావిధి ||

ఆభిషేకోదితాభిశ్చ మృద్భి రద్భిశ్చ మానసైః | ఓషథ్యశ్చ తథా కుంభే నిక్షిప్య స్నావ యేత్తు తామ్‌ ||

జ్యోతిష్మతీం త్రాయమాణా మభయా మపరాజితామ్‌ | జీవాం విశ్వేశ్వరీం పాఠాం సమంగాం విజయాం తథా ||

సహాం చ సహదేవీం చ పూర్ణకోశాం శతావరీమ్‌ | అరిష్టకాం శివాం భద్రాం గోలోమీం విజయ ప్రదామ్‌ ||

బ్రాహ్మీం క్షేత్రా మజాం చైవ సర్వబీజాని చా7ంజనమ్‌ | బిల్వం గంధాని రత్నాని వంచగవ్యం తథైవ చ || 30

కుంభే నిక్షిప్య కుంభం చ గంధమాల్యా7ను లేపనైః | పూజయిత్వా తతో దేవం తస్యా7త్ర శుభ వర్ణనమ్‌ ||

మంత్రం రాజా7భిషేకోక్తం పఠే దత్ర చ కాలవిత్‌ | వస్త్ర చ్ఛన్నముఖీ స్నాతా స్నాపకే చ వినిర్గతే ||

పశ్యేత్తదేవ ప్రతిమాం వాసుదేవస్య రూపిణః | అథవా రామ! భర్తారం నాన్యం కంచన సత్వరమ్‌ ||

తత్కాలే వదనం తస్య పశ్య త్యథ యథావిధి | సా ప్రసూతే సుతం రామ! శుభం వా ప్యథవా7శుచిమ్‌ ||

స్త్రీ ఋతుదినములు పదునారు. అందులో తొలిమూడు రోజులు నిందితములు. ఆరోజులలో స్త్రీ తాకతగదు. తాకెనో స్నానము చేయవలెను. అపుడు స్త్రీస్నానము తలంటు మానవలెను. అప్పుడు గోరసము లాహారముగా గొనుట కాటుక పెట్టుకొనుట కంకణములూనుట సుగంధసేవనము పానము పాన్పెక్కుట (చాపమీద కూర్చుండవలెను.) మట్టి లోహము గాని పాత్రలందు భోజనము సేయరాదు. అగ్ని సంస్పర్శమాత్రమపుడు కూడదు. నాల్గవనాడు యథావిధి స్నానము సేయనలెను. అభిషేకమునకు జెప్పబడిన మంటితో మానసోదకములతో ఓషధులు నింపి స్నానము చేయవలెను. 1. జ్యోతిష్మతి (రక్షణచేయు స్వభావముగలది) 2. అభయను (విరాజితముగానిది - తిరుగులేనిది) జీవ విశ్వేశ్వరి పాఠ మంగ విజయ సహా సహదేవి పూర్ణకేశ శతావరి అరిష్టక శివ భద్ర గోలోమి విజయప్రద బ్రాహ్మి, క్షేత్ర, అజ, సర్వబీజములు, నవధాన్యాలు, అంజన బిల్వము, గంధములు, రత్నములు, పంచగవ్యములు, కుంభమందుంచి యా కుంభమును గంధమాల్యానులేపనములచే ఆమెకు శుభాభివర్ధనుడైన వాసుదేవుని బూజించి రాజాభిషేకోక్త మంత్రపఠనమును దైవజ్ఞుడు సేయగా వస్త్రము మొగమున గప్పుకొని స్నానముసేసి స్నానము చేయించినవారు వెళ్ళిపోయినతరువాత యా వాసుదేవ ప్రతిమను దర్శింపవలెను. స్నానము చేసిన వెంటనే వాసుదేవ స్వరూపుడగు భర్తను జూడవలెను. కాని మరియెవ్వనిని జూడరాదు. భర్తను జూచిన యామె శుభుడైన కొడుకునుం గనును. అట్లు చేయదేని అశుచియైనవానిం గనును.

పూజనం వాసుదేవస్య సా కృత్వా7త్మన ఏవ చ | మండనం చ యథాన్యాయం శుక్ల వస్త్రోత్తర చ్ఛదా ||

షష్టికాన్నం తు పయసా సమశ్నీయాత్‌ ఘృతేన సా | ఘృతస్య పీత్వా ప్రసృతిం నాగపుష్పా7వ చూర్ణితమ్‌ ||

ఋతుకాలే సమాప్నోతి నారీ గర్భం ద్విజోత్తమ! ఉపోషితేన శుచినా శుక్లపక్షే సముద్భవమ్‌ ||

పుష్యేణ బృహతీమూల ముత్తరాం వా ముఖే నయేత్‌ | శ్వేత పుష్పా తు బృహతీ ద్రుమూలసై#్యష నిశ్చయః ||

నస్యా దేయాశ్చ చత్వాఠః ఉన్మూలా ద్రుమబిందవః | తస్మి న్నహని సాతేన గర్భం ధత్తే వరాంగనా ||

ఏవ మప్యభవ న్తీ తు పుత్రీయాం రామ: సప్తమీమ్‌ | పుత్రీయ మథవా స్నానం కేశవారాధనం వ్రతమ్‌ || 40

పుత్రీయ మేవ వా కుర్యాత్‌ కేశవా7రాధనం ప్రియా | స్నాతును7లిప్తా భర్తారం హృష్టె ర్భృంహిత మేవ చ ||

యాయా ద్రాత్రౌ తథా నారీ గంధ ధూపా7ది వాసితా | ఆత్త గర్భాం చికిత్సేత తతస్తా మపరాజితః ||

వాసుదేవపూజచేసి తాను సర్వాలంకారము సేసికొని శుక్లవస్త్రము ధరించి షష్టికలను నొకరకము బియ్యము నన్నము పాలతో నేతితో దినవలెను. నాగపుష్పచూర్ణము గలిపిన నేతిధారను ద్రావిన వనిత ఋతుకాలమందు (ఆపదునారురోజులలో) గర్భము ధరించును. ఉపవాసముండి శిచియై శుక్లపక్షమందు పుష్యమీనక్షత్రమందు గొనివచ్చిన బృశూతీములమును వాకుడు వేరును ఉత్తరము గాని ముఖమందుంచుకొనవలెను. శ్వేతపుష్పమయిన బృహతియొక్క మూలమే యిందులకవసరము. ఆ చెట్టు యొక్క వేళ్ళ రసము నాల్గు చుక్కలు ముక్కులో పోయవలెను. అందువలన నామె యానాడే గర్భవతి యగును ఈలాగున నొకవేళకాదేని పుత్రీయ సప్తమీత్రముగాని పుత్రీయస్నానము కేశవారాధన వ్రతముగాని చేయవలెను. స్నానముసేసి గంధము పూసికొని హర్షభరితుడైన భర్త నారేయి గంధధూపాదివాసితయై పొందవలెను. గర్భవతియైన తర్వాత నామెకు కొన్ని చికిత్సలు చేయవలెను.

మధురౌషధి సిద్ధేన పయసా సర్పిషా తథా | ఇచ్ఛా విమానగాః కాశ్చి న్నస్యాః కార్యాః కథంచన ||

కటుతిక్త కషాయాణి చా7త్యుష్ణ లవణాని చ | ఆయాసం చ వ్యవాయం చ గర్భిణీ వర్జయే త్సదా ||

వినా కర్మ న తిష్ఠేత తథా సా రాహు దర్శనే | ప్రాదుర్భవాణి వేదే7స్య విష్ణోరమిత తేజసః ||

శృణుయా త్తన్మనా భూత్వా చరితం చ మహాత్మనః | పున్నామ్ని నామనక్షత్రే హ్యాసన్న ప్రసవా గృహమ్‌ ||

ప్రవిశే త్సూతికా సంజ్ఞం కృతం రక్షం సమన్తతః | సుభూమౌ నిర్మితం రమ్యం వాస్తు విద్యా విశారదైః ||

ప్రాగ్ద్వార ముత్తరాద్వార మథవా సుదృఢం శుభమ్‌ | దేవానాం ద్రాహ్మణానాం చ గవాం కృత్వా చ పూజనమ్‌ ||

విప్ర పుణ్యాహ ఘోషేణ శంఖవాద్య రవేణచ | ప్రసూతా బహుశ స్తత్ర కథా క్లేశక్షమాశ్చ యాః ||

హృద్యా విశ్వసనీయాశ్చ పరిచరేయుః స్త్రియశ్చ తామ్‌ | వాతాను లోమనై ర్హృద్యై స్తత్రైనా ముపచారయేత్‌ || 50

మధురౌషధిసిద్ధమైన పాలతో నేతితో ఇచ్చావిమానమునందు జెప్పబడిన నస్యములామెకు జేయవలెను. కారము, చేదు, వగరు పదార్ధములు, మిక్కిలివేడిగానున్నవి. ఉప్పు, గర్భిణీస్త్రీ తినరాదు. ఆయాసము వ్యవాయము (రతి) ఆమె నిషిద్ధము. పని చేయకుండ కూర్చుండరాదు, రాహు గ్రహణ సమయమందు కదలకుండ నుండి విష్ణుదేవుని యవతార చరిత్రల తదేకమనస్కయై వినవలెను. పురిటి సమయమయినపుడు పున్నామ నక్షత్రమందు సురక్షితమైన పురిటింట బ్రవేశింపవలెను. అతిచక్కని ప్రదేశమునందు వాస్తువిద్యా విశారదులచే రమ్యముగా నిర్మింపబడి తూర్పవైపు ఉత్తరపువైపు ద్వారములు గలదియు శుభలక్షణమైనది, దృఢమైనదిగా నుండవలెను. దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పూజసేసి విప్రుల పుణ్యాహవాచన ధ్వనితో; మంగళవాద్య ఘోషముతో, నామెయట ప్రవేశింపవలెను. శ్రమకోర్చుకొనువారు, చక్కనివారు, విశ్వాసపాత్రములునైన స్త్రీ (మంత్రసానులు) లామెకు పరిచ్యలు సేయవలెను.

ఆహారైశ్చ విహారైశ్చ ప్రసవాయ సుఖం ద్విజః | ఏరండ మూల మిశ్రేణ సఘృతేన తథైవ తామ్‌ ||

సుఖ ప్రసవనా7ర్థాయ పశ్చాత్కాయే తు మ్రక్షయేత్‌ | బలాకల్క కషాయేణ సిద్ధం క్షీరం చతుర్గుణమ్‌ ||

తైల మభ్యం జనా7ర్థాయా సుతాయా ముపకల్పయేత్‌ | అథ జాతా7న్న పానేచ్ఛాం పంచకోల ప్రసాదితామ్‌ ||

పిబేద్యవాగూం సస్నేహాం తథా వై నీలకుంచికామ్‌ | దశా7హం సూతికా 7గారం చా7యుధైశ్చ విశేషతః ||

వహ్నికా తిందుకా7లాతైః పూర్ణకుంభైః ప్రదీపకైః | ముసలేన తథా ద్వారి వర్ణకై శ్చిత్రితేన చ ||

రక్షణియా తథా షష్ఠీ నిశా తత్ర విశేషతః | రామ! జాగరణం కార్యం జన్మదానాం తథా7ర్చనమ్‌ ||

పురుషా శ్శస్త్రా హస్తాశ్చ నృత్యగీతైశ్చ యోషితః | రాత్రౌ జాగరణం కుర్యు ర్దశ##మే7హని సూతికా ||

స్నాతా పూర్వ విధానేన రక్షణీయా సమీరణాత్‌ | బాలస్య జాతమాత్రస్య నాభిం ఛిత్వా యథావిధి ||

తాలు ముత్తాపయే న్నారీ పిచునా శోధయే న్ముఖమ్‌ | బ్రహ్మీ సువర్చలా సోమం సైంధవం పిప్పలీ వచా ||

కనకం సర్పిషా దద్యా ల్లేహ్య మేత ద్ద్విజోత్తమ! | లేహ్యే నా7నేన మేధావీ శూరః పండిత ఏవ చ || 60

దర్శనీయో యశస్వీ చ సుభగ స్స భవిష్యతి | విభీతకాస్థి క్షౌద్రేణ ఘృష్టం శ్రేష్ఠ మధాంజనమ్‌ ||

నేత్రరోగేషు బాలానాం సహరిద్రం చ గోరసమ్‌ | శారిబా చందనం కుష్ఠం సమభాగాని కారయేత్‌ ||

శిరోలేప మిదం దద్యా దక్షిరోగ వినాశనమ్‌ | ఆమ్రా7స్థి సైంధవం లాజా మధునా సహ లేహయేత్‌ ||

ఏష లేహవర శ్రేష్ఠః ఛర్ది ప్రశమున శ్శుభః | అపామార్గ విడంగాని పిప్పలీ మరిచం తథా ||

సైంధవం తండులం చైవ మధుసర్పి స్సమన్వితమ్‌ | వ్యాఘ్రీ రసేన లేహో 7యం హిక్కాశ్వాస వినాశనః ||

చక్కని యనుకూల వాయుప్రసరణముచేతను సుఖ ప్రసవమగుట కనువైన ఆహార విహారములచేత, నామెనుపచరింపవలెను. ఆముదపువేళ్ళతో గూడిన నేతితో నామె శరీరపశ్చాద్భాగము తోమవలెను. ముత్తప పులగముయొక్క కల్కకషాయమునకు నాల్గురెట్లు పాలు, తైలమును, ఆమీద నామె కన్నపానముల మీద కోరికగల్గగానే పంచకోలిములతో (పిప్పలి, పిప్పలికట్టె, గజపిప్పలి, చిత్రమూలము, శొంఠి, ఇవి పంచకోలములు) గలిపికాచిన గంజిని నూనెతో నీలకుంచికతో గూడినదాని నామెకీయవలెను. పురిటింటిని పదిరోజులు ఆయుధములు వహ్నికాతిందుకాలాతములతో ఈదచెట్టు (ద్వీపాంతరఖర్జూరచెట్టు) పూర్ణకుంభములతో, దీపములతో, నచట ద్వారమందు పలురంగులతో చిత్రితమైన రోకలిని సూతికాగృహములో కల్పింపవలెను. పురుడు వచ్చిన యారవ రాత్రి యీరక్ష మిక్కిలి విశేషముగా నోనరించి ఆ రాత్రి జాగరణము చేయవలెను. జన్మమిచ్చిన వారి నర్చించి శస్త్రకర్తలయిన పురుషులు నృత్యగీతములు పాడుచు స్త్రీలు రాత్రిజాగరణము సేయవలెను. పదియవరోజున పురిటిస్నానము చేసిన యాస్త్రీ గాలితగలకుండ రక్షణయీయవలసి యుండును. పుట్టగానే బాలునియథా విధిగా బొడ్డుకోసి దాది తాలువును దవడను కాచవలెను. పిచువుతో = (దూదితో) ముఖశోధన సేయవలెను. బ్రహ్మ సువర్చల సోమము సైంధవలవణము పిప్పలి వస వసకమును వాని లేహ్యమును నేతితో బెట్టవలెను. ఈ లేహ్యముచేత నాశిశువు మేధావి, శూరుడు, పండితుడు, అందగాడు, కీర్తిశాలి సుభగుడును నగును. బాలుర నేత్ర వ్యాధులకు విభీతకాస్థి = తాండ్రచెక్కను తేనెతో నూరి అంజనము పెట్టవలెను. పసుపుతో గలిపి గోరసమైనను మంచిదే. శారిబ, చందనము, కోష్ఠు, సమభాగములు చేసి నూరినముద్ద శిరస్సునకు బూసిన కంటిరోగుములు శమించును. మామిడిచెక్క, సైంధవ లవణము, పేలాలు తేనెతోగలిపిన లేహ్యము ఛర్దిని మాన్చును, ఉత్తరేణు, వాయువిడంగాలు, పిప్పలి, మిరియాలు, సైంధవము, తండులము, తేనె నెయ్యితో వ్యాఘ్రీరసముతో, వాకుడు రసము, (వ్యాఘ్రి = వాకుడు 7ములక) కలిపిచేసిన లేహ్యము ఎక్కిళ్లు శ్వాసము హరించును.

విభీతక త్వచా శ్రేష్ఠం హరితాలం మనశ్శిలా | ఏత త్తైలం వచే ద్దద్రు పామా కిటిభ నాశనమ్‌ ||

క్షౌద్రేణ లేహ్యా తువరా పిప్పల్యతివిషావహా | శ్లేష్మ రోగేషు సర్వేషు బాలానాం భేషజం పరమ్‌ ||

రోధ్ర త్మఙ్మధునా సార్థ మతీసార వినాశినీ | సప్తపర్ణత్వక్చ దూర్వా తథా కటుక రోహిణీ ||

ఏత దుద్వర్తనం శ్రేష్ఠం సర్వగ్రహ వినాశనమ్‌ | భంగాం వచాం శంఖపుష్పీ మేరండం సప్తవర్ణకమ్‌ ||

సమస్త పుష్పీ సంయుక్త మపామార్గం చ పుష్కరమ్‌ | క్వాథయిత్వా చ దాతవ్యం స్నానం సద్యస్సుభావహమ్‌ || 70

సర్పిషా నింబ పత్రాణి గోవిషాణం ఘృతం మధు | ఏతేన ధూపితా బాలో గ్రహదోషై ర్విముచ్యతే ||

అపామర్గస్య బీజాని బిల్వమూల ఫలాని చ | అగురుం చందనం చైవ సప్తపర్ణస్య వల్కలమ్‌ ||

ఏత దాలేపనం కుర్యా త్సర్వగ్రహ వినాశనమ్‌ | మాతరశ్చ గ్రహాశ్చైవ బాలంతు బలి కర్మణా ||

క్షిప్రమేవ ప్రముచంతి తస్మా ద్యత్నేన కారయేత్‌ | తరక్ష్వరక్ష వరాహాణాం దంష్ఠ్రా గోరోచనా వచా ||

రత్నాన్యయ స్తథా కృష్ణం వస్త్రం ధార్యం తు బాలకైః | జాతస్య రామ! బాలస్య హేమన్తే ప్రథమే7థవా ||

శిశిరేవా7పి కర్తవ్యం కర్ణవేధం తథా శృణు ! | గ్రహాణాం తత్ర సర్వేషాం దినవారః ప్రశస్యతే ||

తిథిం చతుర్థీం నవమీం వర్జయిత్వా చతుర్దశీమ్‌ | సావిత్రం వైష్ణవం త్వాష్ట్రం ఆదిత్యం పౌష్ణమాశ్వినమ్‌ ||

కర్ణవేధే ప్రశస్యన్తే సోమదేవం తధైవ చ | పూర్వాహ్ణే పూజనం కృత్వా కేశవస్య హరస్య చ ||

బ్రహ్మణ శ్చంద్ర సూర్యాభ్యాం దిగీశానాం తథైవ చ | నాసత్యయో స్సరస్వత్యా బ్రాహ్మణానాం గవాం తథా ||

తాండ్రపట్ట అరిదళము, మణిశిల, అనువానితోడి తైలము ద్రావిన దద్దుర్లు, గజ్జి, కిటిభ పోవును. తువర పిప్పతి, అతి విషమును హరించును. బాలురకు శ్లేష్మరోగము పోగొట్టును. లొద్దుగపట్ట తేనెతో గలిపి యిచ్చిన అతీసారము నశించును. ఏడాకుల అరటి పట్ట, గరిక, కటుకరోహిణి. కలిపినూరి యొదలికి నలుగుపెట్టిన సర్వగ్రహ బాధలుపోవును. తెగడ వస, శంఖపుష్పి (దింటిన) ఆముదము, సప్తవర్ణి, సమంతపుష్పి ఆముదము, సప్తవర్ణి, పుష్టి, ఉత్తరేణు పుష్కరములతో క్వాథముసేసి రాచి స్నానము చేయించిన సర్వసుకరమగును. నెయ్యి, వేపాకులు, ఆవుకొమ్ము తేనె అనువానితో ధూపమువేసిన బాలునికి గ్రహబాధ తప్పును, ఉత్తరేణువిత్తులు, మారేడువేరు, మారేడుపండు, యిగురు, చందనము, సప్తవర్ణిపట్ట, అనువానిముద్దను పూసిన సర్వగ్రహశాంతి యగును. బలికర్మచేసిన బాలునికి మాతరః = గ్రహములును శమించుచు తరక్షువు ఎలుగుబంటి, పంది, అనువాని కొమ్ములు గోరోచనము, వస, రత్నాలు, ఇనుము నల్లనివస్త్రము, బాలుని ధరింపచేయవలెను. హేమంతమురాగానేకాని శిశిరర్తువులో గాని బాలునికి చెవులు కుట్టించవలెను. దానికి అన్ని గ్రహములు వారముమంచిదే. చవితి నవమీ చదుర్దశి పనికిరావు, సావిత్రము వైష్ణవము త్వాష్ట్రము ఆదిత్యము పౌష్ణము ఆశ్వసము సోమదేవము = ఆనునక్షత్రములుకర్డవేధకు శుభములు పూర్వాహ్ణమందు బ్రహ్మ విష్ణు శివ సూర్యచంద్ర దిక్పాలక పూజ అశ్వినీదేవతలు సరస్వతి బ్రాహ్మాణులు గోవులను గురువులను పూజించవలెను.

గురూణాం మండలం కృత్యా తత్ర దత్వా సుఖాసనమ్‌ | దత్వో పవేశ##యే త్తత్ర ధాత్రీం శుక్లాంబరాం తథా || 80

స్వలంకృతం తదుత్సంగే బాలం కృత్వా తు సాన్త్వితమ్‌ | ధృతస్య నిశ్చలం సమ్యగ్గలే కుకరసా7ంకితే ||

విధ్యే ద్దైవకృతే ఛిద్రే సకృదేవ తు లాఘవాత్‌ | ప్రాగ్దక్షిణం కుమారస్య భిషగ్వామంతు యోషితః ||

స్నేహా7క్తం సూచ్యనుస్యూతం సూత్రం వా7నునిధాపయేత్‌ |

తైలా7భ్యక్తే తతః కర్ణే కార్య మాభరణం భ##వేత్‌ | కర్ణ వేధ దినే విప్రం సాంవత్సర చికిత్సకౌ ||

పూజ్యాశ్చా7విధవా నార్యః సుహృదశ్చ తథా ద్విజాః |

వారికి మండలమేర్పరచి యందు సుఖాసనము గల్పింపవలెను. అక్కడ తెల్లని చీరకట్టుకొని చక్కగ నలంకరించికొన్న దాదియెడిలో సముదాయించిన శిశువును కదలకుండ పట్టుకొని కుకరసము పూసి దైవజ్ఞుడు చూపినచోట నొక్క మాటుగానే లాఘవముగా కుట్టవలెను. ముందు బాలునికి కుడిచెవి బాలికకు యెడమచెవి వైద్యుడు కుట్టవలెను. నూనెలో తడిపిన సూది గాని దాని ననుస్యూతమైన దారముగాని చొప్పించవలెను. అవ్వల చెవిని నూనె రాచి ఆభరణము పెట్టవలెను. చెవులు కుట్టినవానిని బ్రాహ్మణుని దైవజ్ఞుని వైద్యుని సువాసినులను సహృదయులకు బ్రాహ్మణులను పూజింపవలెను.

చతుర్ధేమాసి కర్తవ్యం శిశోర్నిష్ర్కమణం గృహాత్‌ | సౌరభౌమ దినం చైవ అధిం రిక్తాం చ వర్జయేత్‌ ||

చతుర్థీ నవమీ చైవ రిక్తా చైవ చతుర్దశీమ్‌ | అర్యవ్ణుం వైష్ణవం హస్తమాదిత్యం పౌష మాశ్వినమ్‌ ||

భాగ్యం త్వాష్ణ్రం చ పుష్యం చ తత్ర కర్మణి శస్యతే | దిగిశానాం దిశం తత్ర తథా చంద్రార్కయే ర్ద్విజ! ||

పూజనం వాసుదేవస్య గగనస్య చ కారయేత్‌ | తత్ర స్వలంకృతా ధాత్రీ బాల మాదాయ పూజితమ్‌ ||

బహిర్నిష్క్రామయే ద్గేహాత్‌ శంఖ పుణ్యా7హ నిస్వనైః | తత స్తత్ర పఠే న్మంత్రం యందు రామ! నిబోధ మే ||

చంద్రార్కయో ర్దిగీశానాం దిశాం చ గగనస్య చ | నిక్షేపార్థ మిదం దద్మి తే మే రక్షస్తు సర్వదా ||

అప్రమత్తం ప్రమత్తం దివా రాత్రా వథా7పి వా | రక్షస్తు సర్వత స్సర్వే దేవా శ్శక్ర పురోగమాః || 90

స్త్రీణా మవిధవానాం తు ద్విజానాం సుహృదాం తథా | తదా తు పూజా కర్తవ్యా గీతనృత్యై స్తథోత్సవైః ||

నాల్గవమాసమునందు శిశువును (నిష్క్రమణము) ఇంటినుండి తరలింపవలెను. దీనికి చవితి, నవమి, రిక్తతిథి, చతుర్దశి, ఆదివారము మంగళవారము, ఆర్యణమము, (ఉత్తర) శ్రవణము, హస్త ఆదిత్యము వునర్వసు పౌషము రేవతి అశ్వినము (అశ్విని) పుబ్బపుష్యము, శుభనక్షత్రములు. దికృతులను నిష్క్రమణము చేయు దిశను, చంద్ర సూర్యులను బూజింపవలెను. గృహమునుండి నిష్క్రమించినపుడు శంఖాది మంగళవాద్యము. పుణ్యాహవాచనము సేయింపవలెను. ఆనిష్క్రమణమందు చంద్రసూర్యలుకు, (క్షేమ నిమిత్తము ఈ శిశువు నప్పగించుచున్నాను. ఎల్లరునిన్ను నన్ను రక్షింతురుగాక! పగలు, రాత్రి, ప్రమత్తుడైనపుడు ఆ ప్రమత్తుడు గానున్నను, అన్నియెడల నందరు నింద్రాదిదేవతలు రక్షింతురుగాక! సువాసినులకు, బ్రాహ్మణులకు, మిత్రులకు గీతనృత్యాద్యుతసవములతో బూజచేయవలెను.

పంచమే చ తథా మాసి భూమౌ సముపవేశ##యేత్‌ | తత్ర సర్వే గ్రహాః శస్తాః భౌమో రామ! విశేషతః ||

తిథిం చ వర్జయే ద్రిక్తామృక్షాణి శృణు భార్గవ! || ఉత్తరాత్రితయం సౌమ్యం చా7శ్వత్థం శక్రదైవతమ్‌ ||

ప్రాజాపత్యం చ హస్తం చ శ స్త మాశ్విన దైవతమ్‌ | వరాహం పూజయే ద్దేవం పృథివీం చ ద్విజోత్తమ! ||

పూజనం సర్వతః కృత్వా గురుదేవ ద్విజన్మనామ్‌ | భూభాగ ముపలిప్యా7థ కృత్వా తత్ర తు మండలమ్‌ ||

శంఖ పుణ్యాహ శ##బ్దేన భూమౌ త ముపవేశ##యేత్‌ | మంత్ర శ్చాత్ర భ##వే ద్రామ! తన్మే నిగదతః శృణు||

రక్షణం వసుధే! దేహి సదా సర్వగతం శుభే! | ఆయుః ప్రమాణం సకలం నిక్షేపస్తే హరి ప్రియే ! |

ఆంతరా దాయుష స్తస్య యే కేచి త్పరిపంథినః | జీవితారోగ్యవిత్తేషు నిర్దహస్వా7చిరేణ తాన్‌ ||

వరేణ్యా శేష భూతానాం మాతా త్వమసి కామధుక్‌ | అజరా చా7ప్రమేయాచ సర్వభూత నమస్కృతా ||

చరా7చరాణాం భూతానాం ప్రతిష్ఠాత్వం త్వ మర్హసి | కుమారం పాహిః మాతస్త్వం బాలం తదనుమన్యతామ్‌ || 100

తస్యోపవేశనం కృత్వా భూమౌ కృత్వా భూమౌ బ్రాహ్మణ భోజనమ్‌ | శక్త్వా కృత్వా తతః కార్య శ్చోతవః పూర్వవద్ద్విజ! ||

అయిదవ నెలలో భూమిమీద కూర్చుండబెట్టవలెను. ఆ ఉపవేశనమున కన్ని గ్రహములును మంచివే, కుజుడు మరియు శుభుడు. రిక్తతిథిని విడువవలెను. ఇక నక్షత్రములు ఉత్తరాత్మరయము, మృగశిర అశ్వత్థము, ఇంద్రము, చిత్త ప్రాజాపత్యము, హస్త, అశ్విని ప్రశస్తములు. వరాహావతారముర్తిని, పృధివిని గురుదేవ ద్విజులను బూజించి భూమిభాగమునలికి, యటమంటపమేర్పరచి, శంఖాది పుణ్యాహవాచన ఘోషముతో, నా శిశువును భూమిపై నుపవేశింప జేయవలెను. ఇక్కడ మంత్రము సెప్పెద. ఓ వసుధాదేవి! కల్యాణి! ఎల్లపుడెల్లచోటుల రక్షణ దయసేయుము. ఆయుః ప్రమాణమంతయు నీనిక్షేపము. దానికి నీవు నిధివి. ఓహరిప్రియా! ఆ ఆయుర్దాయమునకు నెవ్వరేని వాని జీవితమున కారోగ్యమునకు విత్తములకు హాని చేయుదురో, వారిని వెంటనే దహింపుము. నీవు సర్వభూత జననివి. వరేణ్యవు. కామదోగ్ధ్రివి. జరలేనిదానవు. అప్రమేయవు. సర్వభూత వందనీయవు. చరాచర భూతములకు ఆధరామైనదానవు. మాతా! అమ్మా నీవీకుమారుని రక్షింపుము. అనుమతింపుమని యా కుమారుని భూమిపై నుపవేశింపజేయవలెను. బ్రాహ్మణసంతర్పణము యధాశక్తిగావించి ముందటియట్లుత్పవము గావింపవలెను.

షష్ఠే7న్న ప్రాశనం మాసి కర్తవ్యం భౌమవర్జితే | దినవారే తిథిం వర్జనీయాం తథైవచ ||

నక్షత్రాణి తథైవా7త్ర దాదుణో గ్రాణి వర్జయేత్‌ | సాధారణ తథా రామ! జ్యేష్ఠా7న్తేష్వపి శస్యతే ||

బ్రహ్మాణం శంకరం విష్ణుం చంద్రార్కంచ దిగీశ్వరాన్‌ | భువం దిశశ్చ సంపూజ్య హుత్వా వహ్నిం తధా చరుమ్‌ ||

ఏఏషా మేవ దేవానాం కృత్వా బ్రాహ్మణా పూజనమ్‌ | దేవతా పురతస్తస్య ధాత్రుత్సంగ గతస్యచ ||

అలంకృతస్య దాతవ్యం వీర! కాంస్యే తు కాంచనే | మధ్వా7జ్య కనకోపేతం ప్రాశ##యే త్పాయసం తతః ||

తతస్త్వన్న పతే రామ! మంత్ర శ్చాత్ర విధీయతే | కృత ప్రాశం తదోత్సంగా ద్ధాత్రీ బాలం తు విన్యసేత్‌ ||

దేవా గ్రతో7థ విన్యస్య శిల్ప భాండాని సర్వశః | శస్త్రాణి చైవ శాస్త్రాణి తతః పశ్యేత లక్షణమ్‌ ||

ప్రథమం యం స్పృశే ద్బాలః శిల్పభాండం స్వయం తథా | జీవికా తస్య బాలస్య తేనైవ తు భవిష్యతి ||

ఆరవ మాసమందన్న ప్రాశనము మంగళవారము తప్ప మిగతావారములందు జేయవలెను. ఇందు దారుణములు ఉగ్రములునైన నక్షత్రములను వర్ణింపవలెను. జ్యేష్ఠవరకుగల నక్షత్రములు మంచివి. బ్రహ్మా, శంకరుడు, విష్ణువు, చంద్రసూర్యులు, దిక్పాలురను భూమి, దిక్కులను, బూజించి, అగ్నియందు ఈ పేరనున్న దేవతలకు చరువును వేల్చి, బ్రాహ్మణపూజసేసి, దేవతలముందు దాదిచేతిలోనున్న యా శిశువు నలంకరించి, కంచు-బంగారపుగిన్నెలో నేయిపోసి పాయసమును (పరమాన్నమును) శిశువును ప్రాశనము సేయింపవలెను. ఆమీద అన్నపతింగూర్చిన మంత్రము పఠింపవలెనని విధియున్నది. అన్న ప్రాశనము సేసిన శిశువును దాది దేవతాగ్రమందొడిలోనుండి దించి కూర్చుండబెట్టి, వివిధ శిల్పములతో చేయబడిన భాండములను, అన్నివైపుల శస్త్రములను శాస్త్రములను నుంచి బాలుని లక్షణము గనిపెట్టవలెను. బాలుడు మొదట తనంత నే వస్తువుల దాకునో దానిచేతనే యాతని జీవిక జరుగగలదు.

దన్తజన్మని బాలానాం తేనైవతు భవిష్యతి | దన్తజన్మని బాలానాం లక్షణం తు నిబోధ మే || 110

ఉపరి ప్రధమం యస్య జాయన్తే చ శిశో ర్ద్విజాః | దన్తైర్వా సహ మస్య స్యా జ్జన్మ భార్గవ! జాయతే ||

మాతరం పితరం వా7పి ఖాదేదాత్మానమే వచ | తత్ర శాన్తిం ప్రవక్ష్యామి తన్మే నిగదతః శృణుః ||

గజ వృష్ఠ గతం బాలం నౌస్థం వా స్థాపయే ద్విచ! | తదాభావేతు ధర్మజ్ఞ! కాంనే తు వరా7సనే ||

సర్వౌషధై స్సర్వగంధై ర్బీజైః పుషై#్పః ఫలై స్తథా | పంచగవ్యేతు రత్నైశ్చ పతాకాభిశ్చ భార్గవ! ||

స్థాలీ పాకేన ధాతారం త్తదనన్తరమ్‌ | సప్తాహం చా7త్ర తథా బ్రాహ్మణభోజనమ్‌ ||

అష్టమే7హని విప్రాణాం తథా దేయా చ దక్షిణా | కాంచనం రజతం గాశ్చ భువం చాత్మాన మేవచ ||

దన్త జన్మని మాసా7న్య సంభ##వే సప్తమాదపి | అష్టమే7హని విప్రాణాం శృణు స్నాన మతఃపరమ్‌ ||

భద్రాసనే నివేశ్యైనం మృద్భి ర్మూలైఫలై స్థథా | సర్వౌషధైః సర్వగంథైః సర్వబీజై స్తథైవ చ ||

స్నాపయే త్పూజయే చ్చా7త్ర వహ్నిం సోమం సమీరణమ్‌ | పూర్వతశ్చ తథా ఖ్యాతాన్‌ దేవదేవం చ కేశవమ్‌ ||

ఏతేషా మేవ జుహుయాత్‌ ఘృత మగ్నౌ యథావిధి | బ్రాహ్మణానాం చ దాతవ్యా తతః పూజా చ దక్షిణా || 120

తతస్త్వలంకృతం బాలం చా7సనే తూపవేశ##యేత్‌ | ఆసనం ఛత్ర మూర్ధానాం బీజైస్తంస్నాపయే త్తతః ||

సుస్విన్నైర్బాలకానాం చ తైశ్చ కార్యం చ పూజనమ్‌ | పూజ్యాశ్చా7విధవా నార్యో బ్రాహ్మణా స్సుహృదః తథా ||

బాలునికి పండ్లువచ్చినదానింబట్టియు లక్షణమును గనిపెట్టవలెను. ముందుగా పైపన్ను వచ్చినను దంతములతోనే పుట్టినను వాడు తల్లిదండ్రులను దననుంగూడ దినివేయును. అక్కడ చేయవలసిన శాంతి దెల్పెదవినుము. శిశువును యేనుగుమీదగాని పడవలో గాని కూర్చుండబెట్టవలెను. అవి కానపుడు కనకాసనమందు గూర్చుండబెట్టవలెను. సర్వౌషధులు, సర్వగంధములు, సర్వబీజములు (ధాన్యములు), పుష్పఫలములు, పంచగవ్యము, రత్నాలు, పతాకలు సమకూర్చి స్థాలీపాకముచేసి బ్రహ్మను బూజింపవలెను. అవ్వల నేడురోజులు బ్రాహ్మణభోజనము జరుపవలెను. ఎనిమిదవనాడు విప్రులకు దక్షీణయీయవలెను. బంగారము, వెండి, ఆవు, భూమి, తనకు గూడను దానము చేయవలెను. ఏడవమాసముదాక పండ్లురానిచో ఏడవమాసము వెళ్ళిన యెనిమిదవరోజున స్నానము విధింపబడినది. ఈ బాలుని భద్రాసనుమందుంచి (శుభాసనమునందు) మూలములు ఫలములతో సర్వౌషధులతో సర్వగంధములతో సర్వబీజములతో స్నానముచేయించి అగ్నిని సోముని ఈముందుచెప్పినవారిని దేవదేవుని విష్ణుని బూజించి యగ్నియందు వారివారి కాజ్యాహుతు లీయవలెను. బ్రాహ్మణపూజచేసి దక్షిణలీవలెను. ఆమీద బాలు నలంకరించి యాసనముపై కూర్చుండబెట్టవలెను. ఆ యాసనమును బాలుని శిరస్సును నవధాన్యములతోగూడ స్నానము చేయింపవలెను. అటనున్న బాలురకుకూడ స్నానములు సేయించి వారితోగూడ సువాసినీపూజ, బ్రాహ్మణపూజ, సుహృత్పూజ, మిత్రుల పూజ చేయవలెను.

ప్రాప్తే7థ పంచమో వర్షే త్వప్రసుప్తే జనార్ధనే | ప్రతిపదాం తథా షష్టీం వర్జయిత్వా తథా7ష్టమీమ్‌ ||

రిక్తాం పంచదశీం చైవ సౌరభామ దినే తథా | ధ్రువాణి యామ్యం చ తథా నక్షత్రాణి వివర్జయేత్‌ ||

సౌమ్యవర్గ శ్చరే లగ్నే హితే తత్ర నవాంశ##కే | త్రికోణ కేంద్రగా స్సౌమ్యాః పాపా శ్చోపచయే శుభాః ||

నక్షత్రాణాం వివర్జ్యానాం ముహూర్తాశ్చ వివర్జయేత్‌ | ఏవం సునిశ్చితే కాలే విద్యారంభం చ కారయేత్‌ ||

పూజయిత్వా హరిం లక్ష్మీం తథా దేవీం సరస్వతీమ్‌ | సువిద్యాం సూత్రకారాంశ్చ స్వాం విద్యాం చ విశేషతః ||

ఏతేషా మేవ దేవానాం నామ్నాతు జుహుయాద్‌ ఘృతమ్‌ | దక్షిణాభిః ద్విజేంద్రాణాం కర్తవ్యం చా7త్ర పూజనమ్‌ ||

ధాత్ర్యుత్సంగా దథా77దాయ బాలం తు కృత వాపనమ్‌ | స్వలంకృతం ప్రదాతవ్య ముత్సంగే తు తదా గురోః ||

గురుశ్ఛా7త్ర భ##వే ద్విద్వాన్‌ స్నాతః శుక్లాంబరః శుచిః | ప్రగృహ్య తం తు నిక్షేపం గుర్వురప్యథ భార్గవ: || 130

ప్రాజ్ముఖం స్సముఖా7సీనః వారుణాశా ముఖం శిశుమ్‌ | అధ్యాపయేత్తు ప్రథమం కుర్యా రాబాలో7పి వందనమ్‌ ||

బ్రాహ్మణానాం గురూణాం చ దేవతానా ముఖం శిశుమ్‌ | అధ్యాపయేత్తు ప్రథమం కుర్యా రాబాలో7పి వందనమ్‌ ||

బ్రాహ్మణానాం గురూణాం చ దేవతానా మనన్తరమ్‌ | తతస్తు పూజ్యా విత్తేన ధాత్రీ రామ! గురుస్తథా ||

దక్షిణాభి ర్ద్విజేంద్రాణాం కర్తవ్యం తర్పణం తథా | తతః ప్రభృత్యనధ్యాయాన్‌ వర్జనీయాన్‌ వివర్జయేత్‌ ||

అయిదవ యేడు రాగానే విష్ణువుత్థానము సేసిన తరువాత పాడ్యమి, షష్ఠి, అష్టమి, రిక్త, పూర్ణిమ తిధులు, ఆది మంగళ వారములు, ధ్రవనక్షత్రములను, యమదేవతాకనక్షత్రమును దప్పించి లగ్నమందు సౌమ్యగ్రహములుండగా శుభనవాంశయందు సౌమ్యగ్రహములు కేంద్ర త్రికోణములందుండగా, పాపులుపచయమందుండగా, తారాబల చంద్రబలములు చూచి, సముహూర్తము నిశ్చయముససేసి, విద్యారంభము సేయవలెను. అందుహరిని, లక్ష్మిని, సరస్వతీదేవిని, సూత్రకారులగు ఋషులను విశేషించి యజమాని తన కులవిద్యను బూజించి, వీరికి ఆజ్యాహుతుల నీయవలెను. బ్రాహ్మణులను దక్షిణలతో సత్కరింపవలెను. చూడాకర్మచేసిన బాలుని దాది యెడినుండిగైకొని చక్కగా నలంకరించి గురువునొడిలో గూర్చుండబెట్టవలెను. విద్వాంసుడగుగురువు స్నానము సేసి శుభ్రవస్త్రములుదాల్చి శుచియై యా బాలుని జేకొని తూర్పుగా కూర్చుండి పిల్లవానిని బడమటిముఖముగా నుంచి తొలుత నధ్యయనము సేయింపవలెను. బాలుడు వందనమును గావింపవలెను. బ్రాహ్మణులకు గోవులకు దేవతలకు బ్రహ్మకు నామీద పూజసేయవలెను. విప్రులకు దక్షిణలు నొసంగి సంతర్పణము చేయవలెను. అది మొదలు యనధ్యాయములను వదలవలెను.

అష్టమీ ద్వితయం రామ! పక్షాన్తే చ దిన ద్వయమ్‌ | ఆశౌచ మింద్రయాత్రాం చ భూకంపం రాహు దర్శనమ్‌ ||

వ్యతీతం చా7ప్యహోరాత్ర ముల్కా పాతం చ భార్గవ! | అకాల స్తనితం చైవ నిర్జ్యోతిష మధా7ంబరమ్‌ ||

తథా కాలే ప్రచండశ్చ యదా వాయు స్తదా భ##వేత్‌ | ప్రదోషే చా7ప్యసంశ్రద్ధే చైత్యవృక్ష చతుష్పధే ||

గోయానే కుంజరే చా7శ్వే న చ నావి తథా భ##వేత్‌ | శ్వశృగాల రవే ఘోరే తథా చ ఖరనిస్వనే ||

తథా వాదిత్ర శ##బ్దేచ తథైవ నగరోత్సవే |

కాలేషు దేశేషు మయోదితేషు | పఠన్తి యే నామన తేషు విద్యా |

ఫలం ప్రయచ్ఛే త్యథవా7రి శత్రోః | లోకే పరే వా యది వా7పి చాస్మిన్‌ || 139

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే బాలతంత్రోనామ ద్విపంచాశత్తమో7ధ్యాయః.

అష్టమి, విదియ చతుర్దశి పూర్ణిమ అమావాస్యలను విడిచి, ఆశౌచ సమయము, ఇంద్రయాత్రాసమయము, భూకంపము, గ్రహణము, వ్యతీతాహోరాత్రము, ఉల్కాపాతము, ఆకాలములో నురుము, మేఘచ్ఛన్నమయిన నహస్సు, ప్రచండవాయువు వీచునపుడు, ప్రదోషమందు, శ్రద్ధలేనపుడు, చైత్యవృక్షమునీడ చతుష్పధమందు, గోయానమందు, (ఎడ్లబండిమీద) ఏనుగెక్కి, గుఱ్ఱము, పడవలమీద, నక్కల కూతలు ఘోరముగా వినబడునపుడు, గాడిదలరచినపుడు, వాద్యములు మ్రోగుచుండునపుడు నగరోత్సవమందు (ఊరేగింపులో) నధ్యయనము నిషిద్ధము. నేను జెప్పిన కాలములందు దేశములందు పఠించినచో వారికి విద్య రాదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున బాలతంత్ర మను నేబదిరెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters