Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదియొకటవ యధ్యాయము - పురుషప్రశంస

పుష్కరః- దుర్గమాయుధ సంఘాతం కుంజరా స్తురగా స్తథా | పురుషైశ్చ వినా రామ! సర్వమేత దపార్థకమ్‌ || 1

తస్మా త్ప్రయత్నం కుర్వీత పురుషాణాం సమర్జనే | తేషాం చైవాంతర జ్ఞానే మూల మేత ద్యతః శ్రియః ||

సుసహాయార్థ సంపన్నం బలం యస్య మహీపతేః | సంగ్రామే తుములే రామ! నూనం తస్య జయో భ##వేత్‌ ||

సకృద్యేన కృతం పాపం తస్య రాజా న విశ్వసేత్‌ | పాపం తు సుకరం తస్య సుకృతం చాస్య దుష్కరమ్‌ ||

యథా హి మలినై ర్వసై#్త్ర ర్యత్ర తత్రోపవిశ్యతే | తథా చలిత వృత్తస్తు వృత్తశేషం న రక్షతి ||

రాజా న వేశ##యే త్కార్యే జనో యో నాస్తికో భ##వేత్‌ | ఆస్తికా ఆపి తత్సంగాత్‌ ప్రాప్ను యు స్సంశయం ద్విజ! ||

అనాహార్య ప్రభస్యాపి త్రైలోక్యోద్భాసితాత్మనః | కృష్ణతా రామ సంసర్గాత్‌ కిం న సూర్యస్య వా భ##వేత్‌ ||

ఆకార్య మిత్యకార్యాణి కుర్యాత్‌ కార్యవశేన యః | విచికిత్సుః ధ్రువం రామ! పశ్చాదపి నివర్తతే ||

కార్యం బుద్ధ్వాప్య కార్యాణి యః కరోతి నరాధమః | ఆకార్య కరణ శ్రద్ధా తస్య భూయోభి వర్థతే ||

లోక స్సర్వో మహాభాగ! పరలోక నిబన్ధనః | నిరపేక్షస్య తత్రాన్యా కాగతి స్స్యా న్నిబంధనే || 10

పుష్కరుండనియె: కోటలో అస్త్రశస్త్రాలు ఏనుగులు గుఱ్ఱము లిదంతయు పురుషులు లేనిచో వ్యర్థము. అందుచే నుత్తమ పురుష సంపాదన ప్రయత్నము రాజు సేయవలెను. రాజైశ్వర్యమునకు మూలము యాయా పురుషులం యంతరమును గూర్చిన తెలివియే. ఏరేనికి మంచి సహాయసమృద్ధిగల బలముండునో యారాజునకు సంకుల యుద్ధమునందు జయము గల్గును. ఏ పురుషు డొక్కమారు రాజునెడ తప్పొనరించినను రాజు వానిని మరి నమ్మరాదు. అట్టి యుద్యోగికి పాపము చేయుట సులభము మంచి పని చేయుట దుర్లభము నగును. మాసిన బట్టలు కట్టుకొనువాడెక్కడనైన కూర్చుండునట్లు ఒక్కసారి నడవడి చెడ్డవాడు తక్కిన నడవడిని గాపాడుకొనడు. రాజు నాస్తికుని (దేవుడులేడు గురువులేడను వానిని) తన పనిలో నియోగింపరాదు. వాని సంగము వలన అస్తికులు గూడ సందేహములో పడుచుందురు. శంకించవలసిన వారగుదురుని జెప్పవచ్చును. సహవాస దోషము ప్రమాదమనుట కుదాహరణ మిచ్చుచున్నాడు. ముల్లోకములం భాసింపజేయుమూర్తి కలిగి యింకొకరినుండి ప్రభను (కాంతిని) ఎఱవుతెచ్చుకొన నవసరములేని వాడైనను సూర్యునికి రాహు సంసర్గమువలన నలుపు గలుగదా! కార్యవశమున జేయగూడని పనిని (తప్పని సరియై) చేసినవాడు గూడ తరువాత వివేచనము చేసికొని తప్పక యా తప్పుపనినుండి మరలును. ఇది తప్పుపని తెలిసియు నా పనిచేయు నరాధమునికి తప్పుపని యందు శ్రద్ధకల్గుట సహజము. రామా! లోకమెల్ల పరలోకముతో ముడిపడియున్నది. అట్టి పరలోకముసంగతి పట్టనట్లుండువానికి ఇక కట్టుబాటున నడువ వలయునన్న మరిగతియేది?

మహా పాతకినో యేపి తేభ్యోపి చ మహత్తరః | పాపకృ న్నాస్తికో లోకః తస్మా త్తం పరివర్జయేత్‌ ||

ఆస్తికానాం చ సాధూనాం సంగ్రహ శ్శస్యతే పరా | తే సహాయా నరేంద్రాణాం తథా యే రామ! పండితాః ||

న పండితో మతో రామ! బహు పుస్తక ధారణాత్‌ | పరలోక భయం యస్య తమాహుః పండితం బుధాః ||

అగ్నిహోత్ర ఫలా వేదాః దత్త భుక్తఫలం ధనమ్‌ | రతి పుత్ర ఫలా దారాః శీల వృత్త ఫలం శ్రుతమ్‌ ||

శీలోపపన్నో నృఫతి స్సహాయైః | శ##రై స్తథాల్పైరపి సంప్రయుక్తః |

ప్రభూత నాగాశ్వ బలోత్కటానామ్‌ | కరోత్యరీణాం కదనం రణషు || 15

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే పురుష ప్రశంసా నామ ఏక పంచాశత్తమోధ్యాయః.

మహాపాపు లందరికంటె మహాపాపి నాస్తికుడు. కాన లోకము వానిం బూర్తిగా విసర్జించవలెను. ఆస్తికులయిన సాధువుల యెక్క సంగ్రహము రాజునకు నిత్యము ప్రశంసార్హమయినపని. పండితుని వలె (తెలిసినవానివలె) ఆస్తికులును రాజును సహాయ భూతలు బహుప్రస్తకములు గలవాడు (అనేక గ్రంథాలు చదివినవాడు) పండితుడుగాడు. ఎవనికి పరలోక భయముగలదో వానినే పండితుడందురు. పుణ్యలోకము రాదేమో నరకలోకమునకు పోదునేమో యను భయము కలిగి పుణ్యము సేయుచు పాపము సేయవెరచువాడే పండితుడని తాత్పర్యము. వేదములకు ఫలము అగ్నిహోత్రము. ఒకనికి పెట్టుట తాను దినుట ఫలముగాగలది ధనము. రతియు పుత్రులు ఫలముగాగల వారు భార్యలు. పాండిత్యమునకు శీలము = పరదారధనముల జోలికి పోకుండుట వృత్తము = చక్కని నడవడి గలిగియుండుట ఫలము. శీలవంతుడైన నరేశ్వరుడుత్తమ పురుష సహాయ సంపత్తిగలవాడల్పములయిన బాణములతో గూడియు సమృద్ధమయిన చతురంగ బలము గల వారితో దైవరణమండీకొని పోరును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణముద్వితీయభాగమున పురుషప్రశంసయను యేబదియొకటవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters