Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదితొమ్మిదవ యధ్యాయము - గజచికిత్స

పుష్కరః- అతః పరం ప్రవక్ష్యామి కుంజరాణాం చికిత్సి తమ్‌ | పాకలేషు తు సర్వేషు కర్తవ్య మనువాసరమ్‌ ||

ఘృత తైల పరీషేకః స్థానం వాత వివర్జితమ్‌ | స్కంధేషు చ తథా కార్యా క్రియా పాకలవద్ద్విజ ! ||

గోమూత్రం పాండురోగే తు రజనీభి ర్యుతం హితమ్‌ | ఆనాహే తైలసిక్తస్య నివాతస్థం ప్రశ్యశ##తే ||

లవణౖః పంచభి ర్మిశ్రా ప్రతిపానాయ వారుణీ | విడంగ త్రిఫలా వ్యోష సైంధవైః కబలాః కృతాః ||

మూర్ఛా స్వభోజయే న్నాగం క్షౌద్రతోయం తు పాయయేత్‌ | అభ్యంగ శ్శిరసః కార్యో నస్యశ్చైవ ప్రశస్యతే ||

నాగానాం స్నేహ కటుకైః పాదరోగా నుపక్రమేత్‌ | పంచ కల్క కషాయేణ శోధనం చ విధీయతే ||

-------- మందనం కార్యం మృదు స్నిగ్ధం చ భోజయేత్‌ | శిఖి తిత్తిర లావానాం పిప్పలీ మరిచా7న్వితైః ||

రసై స్సంభోజయే న్నాగం వేపధు ర్యస్య జాయతే | బాలబిల్వం తథా రోధ్రం ధాతుకీం వితుషా సహ ||

అతీసార వినాశాయ పిండం భుంజీత కుంజరః | నస్యం కరగ్రహే దేయం ఘృతం లవణ సంయుతమ్‌ ||

మూగధీ మరిచాఢ్యా చ యవాగూ ర్మస్తు సాధితః | తత్కర్ణకే చ దాతవ్యం వారా7హం చ తథా రసమ్‌ || 10

దశమూలకులుత్థావ్లు కాకమాచీ విషాచితమ్‌ | తైల మూషణ సంయుక్తం గళగ్రహ గదా7పహమ్‌ ||

అష్టభి ర్లవణౖః పిష్టైః ప్రపన్నాం పాయయే ద్యుతామ్‌ | మూత్ర సంఘే7థవా బీజం క్వథితం త్రపుసస్య చ ||

పుష్కరుండనియె : ఇక గజ చికిత్సం గూర్చి తెల్పెద. పాకలములందు (ఏనుగునకు గల్గు పిత్తజ్వరము పాకలము) దిన దినము నెయ్యి నూనెపూయుట, గాలిలేనిచోట నుంచుట, స్కంధము లందు పాకలవ్యాధిలోవలెనే చికిత్సింపవలెను. పాండురోగమందు గోమూత్రమును పసుపును గలిపి త్రావించుట మంచిది. అనాహమందు (మూత్రకృచ్ఛము) మల మూత్రముల బంధించుట యందు నూనెతో నేన్గును దడిపి, గాలిలేనిచోట నుంచవలెను. మూర్ఛయందు పంచలపణములతో 1. ఉప్పు 2. సైంధవలణము 3. బిడాలము 4. సౌవర్చము 5. కాచలవణములతో సారాయి త్రాగింపవలెను. వాయువిడంగాలు, కరకతాడి ఉసిరికలు, వ్యోషము, శొంఠి, పిప్పలి మిరియాలు, తేనెనీళ్ళు త్రావింపవలెను. తల కభ్యంగము, నస్యముచేయుట, నూనెతో, కటాకములతో, చేయుట మంచిది. ఇక పాదరోగములు; వంచవల్కలముల (1. మర్రి 2. రావి 3. మేడి 4. జువ్వి 5. వేప) కషాయముతో శోధనము సేయవలెను. (శోధనమనగా కడుపులో దోషములు లేకుండ కడుగుట) (7వ శ్లోకము పూర్తిగాలేదు) మృదువైన స్నిగ్ధమైన (నూనెగల పదార్ధముల తోడి) ఆహారము పెట్టవలెను. నెమలి, తిత్తిరిపక్షి లావుకము అనువాని రసమును పిప్పలి మిరియాలతో గలిపిన దానిని దినిపించిన వణకురోగము పోవును. బాలబిల్వము, లొద్దుగ. ధాతుకి, అరెపువ్వు, వితుష నూరినముద్ద తినిన, అతిసారము (గ్రహణి రోగము) పోవును. కరగ్రహమను రోగమందు (అనగా తొండము మొద్దువారినపుడు) ఉప్పుతోడి నెయ్యి నళ్యము గావింపవలెను. మాగధి (అడవి మొల్ల) మిరియాలు, ఉండ్యా, గంజి, మస్తు, (పెరుగుమీది మీగడ) వారాహీరసము, దశమూలము, కులుత్థము, ఆవ్లుము, కాకమాచి, విషా అనువాని కషాయముతోడి తైలము గళగ్రహము (గొంతుక పట్టుకపోవుట) యను రోగమును బోగొట్టును. ఎనిమిది లవణములతో గూడిన ప్రపన్నను (తంటిస-తగిరస) త్రాగించిన మూత్రకృచ్ఛము మారును. దోసవిత్తులు, కషాయమునకు మంచిదే.

త్వగ్దోషేషు పిబేన్నింబం వృషం వా క్వథితం ద్విపః | గవాం మూత్రం విడంగాని కృమి దోషేషు శశ్యతే || 13

శృంగబేర కణా ద్రాక్షా శర్కరాభి శ్శృతం పయః | క్షత క్షయ హరం పానా త్తథా మాంసరస శ్శుభః ||

ముద్గౌదనం వ్యోషయుతం హ్యరుచౌ చ ప్రశస్యతే | ద్రోణికా శాన్తయే యూషం పటోలీ నింబ దుర్గజమ్‌ ||

త్రివృ ద్యోషా7గ్ని దన్త్యర్క శ్యామ క్షీరేభ పిప్పలీ | ఏష గుల్మహర స్స్నేహః కృత శ్చైవ తథా 77సవః ||

క్షీర వృక్ష నదీజంబు మల్లకీనాం త్వచ శ్శుభాః | హృద్రోగ శాన్తయే దేయా విదార్యశ్చ రసోదనాత్‌ ||

భేదన శ్రావ7ణాభ్యంగ స్నేహ పానా7ను వాసనైః | సర్వానేవ సముత్ఫన్నాన్‌ విద్రవేత్‌ సముపాచరేత్‌ ||

యష్టికం ముద్గయూషేణ శారదేషు తథా పిబేత్‌ | బాలబిల్వై స్తథా లేపః కటిరోగేషు శస్యతే ||

విడంగేంద్ర యవా హింగు సరలం రజనీ ద్వయమ్‌ | పూర్వా7హ్ణేదాపయే త్పిండం సర్వశూలోప శాన్తయే || 20

చర్మదోషములందు వేప గాని, వృషము=అడ్డసరము(వైద్యమాత)కషాయము గాని త్రాగించవలెను: గోమూత్రము, వాయు విడంగాలు, కృమి దోషము హరించును. శొంఠి, ద్రాక్ష, పంచదారయుం గలిపి కాచిన పాలు క్షతక్షయమును హరించును. మాంసరసము త్రాగినను మంచిదే. ముద్గాన్నము వ్యోషయుతము త్రికటుములతో త్రాగించిన నరుచి పోవును. ద్రోణికారోగశాంతికి, పొట్ల, వేప. దుర్గజముల యొక్క కషాయము మంచిది. త్రివృత్తు యోష, చిత్రమూలము, దంతి, జిల్లేడు, శ్యామ, తిప్పతీగ, తెగడ, పసుపు, బదనిక, క్షీర, గజపిప్పలి వీనితో గూడిన నూనె గుల్మరోగము హరించును. వీనితో తయారైన ఆసవమైనను సరియె. క్షీరవృక్షము, నది, జంబు, మల్లెతీగ, దానియొక్క త్వక్కు, నేలగుమ్మడి, వారాహి కంద వీని రసము కలిపి వండిన అన్నము తినిపించిన, హృద్రోగము పోవును. భేదనము శ్రవణాభ్యంగము- చెవిలో నూనెపోయుట లేక శ్రావణమనే ప్రక్రియ యా స్నేహపానము అనువచనములచేత (అనుకూలమైనచోట వసింపజేయుట గావలయు) సర్వవ్యాధులు మానును. పెసరకట్టుతో యష్టి మధుకమును శరత్కాలములందు త్రావుట బాలబిల్వములతో (లేతమారేడుకాయలతో) పైపూత ఏనుగు కటిరోగము (నడుము పట్డుట) పోవును. వాయువిడంగాలు ఇంద్ర యవలు ఇంగువ దేవదారు రెండురకాల మ్రాని పసుపు కస్తూరి పసుపు నూరిముద్ద సేసి పూర్వాహ్ణ మందు వెట్టిన సర్వవిధశూలలు తగ్గును.

భారేణ చలితం దన్తం కుంజరస్య సముద్ధరేత్‌ | ప్రధానా భోజనే తేషాం యష్టికా వ్రీహి శాలయః ||

మధ్యమౌ యవ గోధూమౌ శేషాః ప్రత్యవరా స్మృతాః | విధౌ యోగే ప్రయత్నేన దగ్ధికాం తు వివర్జయేత్‌ ||

యవసేషు తథై వేక్షు ర్నాగానాం బలవర్ధనమ్‌ | నాగానాం యవసం శుష్కం కఫవాత ప్రకోపనమ్‌ ||

మదక్షీణస్య నాగస్య పయఃపానం ప్రశస్యతేః జీవనీయై స్తథా ద్రవ్యైః శృతో మాంస రసః శుభః ||

మదవృద్ధికరాన్‌ యోగాన్‌ వక్ష్యామ్యహ మతః పరమ్‌ | రణకాలే సమాపన్నే యాన్‌ రాజా సంప్రయోజయేత్‌ ||

వాయసః కురవ శ్చోభౌ కాకోలీ నాకులీ హరిః | భ##వేత్‌ క్షౌద్రేణ సంయుక్తః పిండ స్సద్యః ప్రభేదనః ||

జాతి భంగః సమూలశ్చ కపోత త్వక్‌ తథేంగుదీ | అశ్వసారక భంగశ్చ పిండో7య మపర స్తథా ||

అజశృంగ్యర్క మూలాభ్యాం సకుంజ మధు సంయుతః | మధు మిశ్రో7ప్యయం పిండః పుష్పమూల ఫలా7న్వితః ||

యుద్ధకాలే7త్ర నాగస్య కర్తవ్యా మదవర్థినీ | కటు మత్స్యా విడంగాని క్షారః కోశాతకీ పయః ||

హరిద్రా చేతి ధూపో7యం కుంజరస్య జయావహః | పిప్పల్యః శ్వేతలశునః హరితాలం మనశ్శిలా || 30

అశ్వ మూత్రోషితో ధూపః స్యాత్‌ సూర్య పరిశోషితః | మాధ్వీకం కటుమత్స్యాశ్చ తథా కటుకరో హిణీ ||

అభయం చ త్రయః శైలం ధూపో7య మపర శ్శుభః | అగ్నిక స్శర్వవర్ణశ్చ పీలు రిత్యేష దీపనః ||

ప్రదేయః కబలో యుద్ధే మనుష్యాస్థి ప్రధూపితః | జీర్ణే విధానో దేయ స్స్యా త్పిండశ్చ తృట్‌ క్షయం కరః ||

పిప్పలీ తండుల సై#్తలం మాధ్వీకం మాక్షికం తథా | నేత్రయోః పరిషేకో7యం దీపనీయః ప్రశస్యతే ||

పురీషం వృశ్చికాయాశ్చ తథా పారావతస్య చ | క్షీర వృక్ష్య కరీరాశ్చ ప్రపన్నా7విష్ట మంజనమ్‌ ||

అనేనాం7జిత నేత్రస్తు కరోతి కదనం రణ | ఉత్పలాని చ నీలాని ముస్తం తగర మేవ చ ||

తండు లోదక పిష్టాని నేత్ర నిర్వాపణం పరమ్‌ | ప్రవృద్థయే నదీ జానాం పంచమే7బ్దే వనౌకసామ్‌ ||

దంత మూల పరీణాహా ద్ద్విగుణా త్కల్పయేత్‌ పరమ్‌ | వనే వృద్ధై ర్నవే చ్ఛేదః కర్తవ్యశ్చ తదా భ##వేత్‌ ||

బరువుచే కదలిన దంతమును బెరికివేయవలెను. వానికి బెట్టు దాణాలో యుష్టిమధుకము, వ్రీహి ధాన్యము, శాలిధాన్యము, ముఖ్యములు. యవలు, గోధుమలు, పెట్టుట మధ్యమ విధము. మిగతా దాణా యేదియు తక్కవ రకములే.

గడ్డిజాతులలో చెరకు బలవర్ధకము. ఏనుగుల కెండుగడ్డి కఫవాతప్రకోపమునుజేయును. మదము క్షీణించిన దానికి పాలు త్రావించుట మంచిది. జీవనీయద్రవ్యములతో గలిపి కాచిన మినపకట్టు మంచిది.

ఇకమీద వృద్ధిచేయు నౌషషలుధ చెప్పెదను. యుద్ధసమయమందు రాజు వానిని బ్రయోగింపజేయవలెను. వాయసము, అగురు, కురవము, కాకోలి, నాకులి నాకుళీకంద వసుదుంప, వెదురు, తెనెతో గలిపి ముద్దచేసిపెట్టిన, నప్పటికప్పుడే మదముపెరుగును. జాతిభంగము వ్రేళ్ళతోగూడ, కపోత త్వక్కు (కళ్ళరావిచర్మము) గారకాయలు, అశ్వసౌరకభంగము, వీనిముద్ధ యిదొక మందు. దుష్టుపాకుతీగ, జిల్లేడువేళ్ళు పువ్వులతో తేనెతో గలిపి ముద్దచేసి, యుద్ధసమయమందు బెట్టిన మదమెచ్చును. త్రికటుకమును, మత్స్య వాయువిడంగములు, క్షారము, కోశాతకీ, పయస్సు పసుపు నను వీనిచే ధూపమువేసిన కుంజరము జయముం గూర్చును. పిప్పళ్ళు వెల్లుల్లి, హరిదళము, మణిశిల అశ్వమూత్రమందు నానబెట్టియెండబెట్టి ధూపము వేయవలెను. మాధ్వీకయు త్రికటుకములు, మత్స్య, కటుకరోహిణి, అభయత్రయ, శిలాజితు వీనితో ధూపముగూడ శుభదము. చిత్రమూలమన్నిరంగులది, గొలుగుచెట్టు. వీనిని ముద్దచేసి మనుష్యుని యెముకతో ధూపమువేసి తినిపింపవలెను. ఇది జీర్ణకారి. దప్పిక హరించును. పిప్పలి, బియ్యము, నూనె, సారా, తేనె యివి వీని మునికండ్లలో పరిషేకించినచో నిది దీపనీయమగును. ఆకలిపుట్టించును. వృశ్చిక పురీషము పావురముయొక్క పురీషము క్షీరవృక్షకరీరములు ప్రపన్నావిష్టము, కాటుక, వీనితో నేత్రములకు కాటుక పెట్టిన యేనుగు యుద్ధమందు తీవ్రయుద్ధము చేయగలదు. నల్లగలువలు, తుంగుమున్తలు తగరము బియ్యపుకడుగుతో చేసిన ముద్ద కంటికి కలికము (అంజనము)పెట్టుట ప్రశస్తము. నది యందు బుట్టిన అడవులందు బుట్టినవావికి దంతముల పెరుగుదలకు ఐదవ యేట దంతముల నరుకవలెను. దానివలన దంతమూలములు రెండింతలు పెరుగును.

శయ్యాస్థానం భ##వే చ్చా7స్య కరీషైః పాంసుభి స్తథా | తైలా7వసేకః శేతే స్స్యాత్‌ మాసి మాసి తథైవ చ ||

శరన్ని దాఘయోః సేకఃసర్పిషా చ తథైష్యతే | రాజ ద్విపా దభ్యధికాం తుశోభాం నాగస్య చా7న్యస్య న జాతు కుర్యాత్‌ ||

శోభావిధానం త్వధికం సదైవ | రాజద్విపసై#్యవ నృపస్తు కుర్యాత్‌ || 40

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే హస్తిచికిత్సా నామ ఏకోన పంచాశత్తమో7ధ్యాయః.

ఏనుగులు పరుండుచోటును చలియెత్తినతరి నేలధూళితోడి నూనె చల్లవలెను. శరద్ధృతువులో, గీష్మర్తువులో, నేతితో జల్లవలెను. రాజకుంజరమునకు మించినశోభ మరి యెవ్వని యేనుగునకు నెన్నడుం జేయగూడదు. ఎప్పుడును రాజు రాజద్విపమునకు శోభావిధాన మెక్కువగా జేయవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున హస్తి చికిత్స యను నలుబదితొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters