Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదిఏడవ యధ్యాయము - అశ్వములకు జేయనగు శాంతివిధానము

పుష్కరః- నిత్యం నైమిత్తికం కామ్యం శాన్తికర్మ నిబోధమే | పంచమీషు చ సర్వాసు శ్రీధరం పూజయేద్‌ భృశమ్‌ ||

శ్రియశ్చ పూజనం కార్యం హయరాజ్ఞ స్తథైవ చ | రామోచైశ్శ్రవసో నిత్యం గంధమాల్యా7ను లేపనైః ||

ధూపదీప నమస్కారై స్తథా చైవా7న్న సంపదా | శరద్వసన్తయోః కార్య మేకదన్తస్య పూజనమ్‌ ||

ప్రతిపత్‌ పంచమీ షష్ఠీ సప్తమీ ద్వాదశీ తథా | ప్రశస్తా స్తిథయో రామ! సూర్యవారో విశేషతః ||

కృత్తికాం రోహిణీం భాగ్యం చా7ర్యవ్ణు మశ్వినీం తథా | త్వాష్ట్రం సావిత్ర మాదిత్యం వాయవ్యం చ భృగూత్తమ! ||

నక్షత్రాణి ప్రశస్తాని శుక్లపక్ష స్తథైవ చ | ఉద్యానేఘ విచిత్రేషు నదీనాం పులినేషు చ ||

దేవతా7యతనే రామ ! పూజనం తస్య కారయేత్‌ | అర్ఘధూప నమస్కార దీప పుష్పా7న్న సంపదా ||

కుల్మాషోల్లోపికా భక్ష్య మద్య మాంస సురా7సవైః | ఓదనైః పరమా7న్నేన ఫలైః కాలోద్భవై శ్శుభైః ||

నృత్యగీతేన వాద్యేన శంఖశ##బ్దైః తథైవ చ | సావిత్రైశ్చ తథై వా7జ్యం జుహుయా జ్జాతవేదసి ||

ఓంకార పూర్వం చ తథా రేవన్తాయ పునః పునః | ద్విజాతి పూజనం కార్యం మాల్య మోదక చందనైః || 1

దక్షిణాభిశ్చ ధర్మజ్ఞ ! యథావ దనుపూర్వశః | నారీషు వర్జయే త్సర్వం రేవన్తస్య నివేదితమ్‌ ||

పుష్కరుండనియె ః అశ్వశాంతి నిత్యము, నైమిత్తికము, కామ్యము, నని మూడు విధములు. అన్ని పంచములందును శ్రీధరుని మిక్కిలిగా బూజింపవలెను. లక్ష్మీపూజ అశ్వరాజు పూజయు నొనరింపవలెను. గంధమాల్య ధూప దీప నివేదనాదులచే నుచ్చైశ్శ్రవము బూజసేయవలెను. అన్న సమృద్ధిగా సంతర్పణము సేయవలెను శరద్వసంతములం దేకదంతు పూజింపవలెను. పాడ్యమి, పంచమి, షష్ఠి, సప్తమి, ద్వాదశీ తిథులు, భానువారము, కృత్తిక, రోహిణి, పుబ్బ ఉత్తర, అశ్విని, త్వాష్ట్రము, హస్త, పునర్వసు, స్వాతి నక్షత్రములు ప్రశస్తములు. విచిత్రోద్యానములందు నదీపులినములందు దేవాలయమునందును విష్ణుపూజ చేయవలెను. పాద్యార్ఘ్యాది షోడశోపచారములు సేయవలెను. గుగ్గిళ్ళు, ఉల్లోపికలు, మద్యము, సుర, ఆసవము, మాంసము, రకరకాల ఓదనములు, దధ్యోదనము, చిత్రాన్నము, తిలాన్నము మొదలయినవి నివేదింపవలెను. నృత్య గీత వాద్యాదులు శంఖనాదము సేయవలెను. అగ్నియందు సావిత్రకములతో ఆజ్యహోమము సేయవలెను. రేవంతునికి ప్రణవపూర్వకముగా నాహుతి యియ్యవలెను. గంధమాల్యాదులచే పూలమాలలచే బ్రాహ్మణపూజ నెరపవలెను. దక్షిణ తాంబూలాదు లీయవలెను. రేవంతునికి నివేదితమైన ప్రసాదము స్త్రీలకు బెట్టరాదు. అవ్వల గంధమాల్యాదులతో గుఱ్ఱముల పూజింపవలెను.

ఏవం సంపూజతో దద్యాత్తురంగమ శతాన్యపి | బలం తేజ స్తథా77రోగ్యం తురంగాణాం చ భార్గవ ! ||

ఈపూజ వందలకొలదిగనశ్వసంపదను సమకూర్చును. గుఱ్ఱములకుగూడ దీనివలన బలము తేజస్సు ఆరోగ్యమునుగల్గును.

ఆశ్యయుక్‌ శుక్లపక్షస్య పంచదశ్యాం నరోత్తమ ! | తురంగమాణాం కర్తవ్యం శాన్తికం తన్నిబోధమే ||

దిగీశానాం వినిష్కృష్యగ్రామోద్దేశే మనోరమే | ప్రాగుదక్‌ ప్రవణ రామ ! స్థండిలం పరి కల్పయేత్‌ ||

నా సత్యౌ వరుణం దేవం తథై వాశ్వయుజే ద్యిజ ! | పూజయేత్‌ ప్రయతో విద్వాన్‌ గంధమాల్వా7ను లేపనైః ||

ధూపైర్దీపై ర్నమస్కారై స్తథా చా7న్నేన భూరిణా | సముల్లిఖ్య తతో వేదిం శాఖాభిః పరివారయేత్‌ ||

సమన్తత స్తథా77ర్థ్రాభివసై#్త్ర శ్చా7ప్యహతై స్తథా | ఘటాన్‌ సర్వరసైః పూర్ణాన్‌ దిక్షుదద్యా ద్యథావిథి ||

విదిక్షు చ తథా దద్యా ద్థ్వజ ఛత్రాణి బుద్ధిమాన్‌ | తత స్సముపధాయా7గ్నిం జయ ప్రభృతిభిః పునః ||

హుత్వోక్త దేవతా లింగైః మంత్రైశ్చ జుహుయాద్‌ ఘృతమ్‌ | తత స్సంపూజనీయాన్తు గంధ మాల్యై స్తురంగమాః ||

ఆశ్వయుజ పూర్ణిమనాడు చేయవలసిన నైమిత్తిక శాంతి తెల్పెద వినుము గ్రామ సరిహద్దులందు చక్కనిచోట దిక్పతుల పూజకు స్థండిల మేర్పరచవలెను. అది ప్రాగుత్తర ప్రణవముగా నుండవలెను. అశ్వయుజ మందశ్వినీ దేవతలను వరుణుని షోడశోపచారములతో నర్చింపవలెను. సమృద్థముగ నన్నము నివేదింపవలెను. అగ్ని వేదికోల్లేఖనముచేసి చుట్టును కొమ్మలు పరుపవలెను. కొత్త తడిబట్టలను గప్పవలెను. దిక్కులందు సర్వరసపూర్ణ ఫలములుంచవలెను. మూలలందు ధ్వజ ఛత్రాదుల నలంకరింపవలెను. అటుపై నగ్న్యుపధానముసేసి జయాదులతో దేవతాలింగములైన మంత్రములతో ఆజ్యహోమము గావింపవలెను.

సన్నద్ధ పురుషా7రూఢాః సుసన్నద్ధా స్తురంగమాః | సాయుథైః పురుషై స్సార్థం వహ్నిం కుర్యుః ప్రదక్షిణమ్‌ || 2

త్రిః పరి క్రామతో వహ్నిం క్ష్వేడోత్కృష్ట నినాదితైః | శంఖ వాద్య రవోన్మిశ్రెః తవ్యా నేస్స్వగృహం తతః ||

రసాని తాని వాసాంసి గౌః కాంస్యం కనకం తథా | దక్షిణాయై ప్రదాతవ్యం కర్తుర్ద్విజవరోత్తమ ! ||

కర్మణా7నేన భవతి ప్రభూతం రామ ! వాహనమ్‌ | హృష్ట పుష్టం చ ధర్మజ్ఞ ! గదా7మయ వివర్జితమ్‌ ||

కవచములు దొడిగికొని ఆయుధములు బూనిన రౌతులతో సుసన్నద్ధములైన గుఱ్ఱములు అగ్నికి బ్రదక్షిణము సేయవలెను. మూడుమార్లు సేయు నా ప్రదక్షిణమందు క్ష్వేడా నినాదములతో శంఖ భేర్యాది వాద్యములతో గృహమునకు గొనిరావలెను. అవ్వల నాయా మధురసములు, వస్త్రములు, గోవులు, కంచు, బంగారము పూజసేసినవారికి దక్షిణగా నీయవలెను. ఈపూజచే అశ్వసంపద గల్గును. ఆ యశ్వము లానందభరితములు, పుష్టి కలవి, రోగము, బాధయు లేనివిగా నుండున. ఇది నిత్యశాంతి పూజావిధానము.

నిత్యమేత త్తవోద్దిష్టం శృణు ! నైమిత్తికం తథా | అశ్వానాం మారకే ప్రాప్తే వ్యాధౌ వా7ప్యతి దారుణ ||

ప్రకృతేశ్చ విపర్యాసే తథా భృగులోద్భవ ! | హయచారే శుభే దేశే స్ధండిలం పరికల్పయేత్‌ ||

విన్యసే త్కమలం తత్ర తన్మధ్యే పూజయే ద్ధరిమ్‌ | శ్రియాం చ దేవీం తత్త్రెవ కేసరేమ చ దేవతాః ||

బ్రహ్మాణం శంకరం సోమ మాదిత్యం చ తథా7శ్వినౌ | రేవంత ముచ్చైశ్శ్రవసం దిక్పాలాంశ్చ దళేష్వపి ||

సర్వేషాం పూజనం కార్యం గంధ ధూపా7న్న సంపదా | దీపమాల్య నమస్కార పుషై#్ప ర్మూలైః సగోరసైః ||

ప్రత్యేకం పూర్ణ కుంభైశ్చ గంధమాల్య7ద్యలంకృతైః | తథా7పి శిత వసై#్త్రశ్చ వర్థమానై స్సతండులైః ||

తథా ప్రతిసరా సూత్రైః పతాకాభిశ్చ భార్గవ ! | తసై#్య వోత్తరతో వేదిం కల్పయిత్వా యథావిథి || 3

తథా స్సముపధాయా7గ్నిం యథోక్తానాం పృథక్‌ పృథక్‌ | తతో7గ్నిహవనస్యా7ను కాంస్యం గాం కాంచనం తథా ||

దేయం వస్త్రయుగం కర్త్రే కారయిత్రే తథైవ చ | కర్మైతత్‌ సర్వరోగఘ్నం సర్వబాధా వినాశనమ్‌ ||

ఉపోషితేన కర్తవ్యం బ్రాహ్మణన యథావిథి | ఉపోషిత స్తదా తిష్ఠే ద్యజమానో7పి భార్గవ! ||

ఇక నైమిత్తిక శాంతి వినుము. మారకమేర్పడినపుడు (మహమ్మారి) దారుణ వ్యాధులు వచ్చినపుడు ప్రకృతి విపర్యాసమందు నశ్వశాలయందు లేదా అశ్వములు సంచరించు ప్రదేశమందు స్థండిల మేర్పరచి (స్థండిలము = మంత్రపూర్వకముగా సంస్కరించిన ప్రదేశము) యందు కమలముంచి యందు శ్రీహరిని, శ్రీదేవిని. ఆ కమలకేసరములందు దేవతలను రేకులందు బ్రహ్మ శివ సోమాదిత్యాశ్వినీ దేవతలను, రేవంతుని దేవతల దేవతాశ్వమగు ఉచ్చైశ్శ్రవమును, దిక్పాలురను, ప్రతిష్టించి, గంధమాల్యాది షోడశోపచార పూజలు సేయవలెను. గోరసములు నివేదింపవలెను. నమస్కరింపవలెను. ప్రత్యేకముగ పూర్ణకుంభములను గంధమాల్యాదులచే నలంకరించి నూతన వస్త్రములు కప్పి బియ్యము నింపిన వర్ధమానముల (ముకుళ్లలో) నునిచి ప్రతిసరాసూత్రములు (మామిడిఆకులు తమలపాకులు పసుపుదారములను) వానికి జుట్టి పతాకలనెత్తి, వాని కుత్తుంగముగ నగ్నిహోత్రవేది నేర్పరచి యగ్నిప్రతిష్ఠసేసి, యాయా దేవతలకు వేర్వేర సమంత్రకముగా హోమములు సేయవలెను. ఆవెంటనే చేసినవానికి చేయించిన పురోహితునికి కంచును, గోవును, బంగారమును, వస్త్రయుగ్మము, నొసంగనగును. ఈ శాంతికర్మ సర్వరోగబాధా నివారకము. దీని నుపవాసముచేసి బ్రాహ్మణుడు యథావిధిగ జేయవలెను. యజమానుడు గూడ నుపవసింపవలెను.

ఆతః పరం ప్రవక్ష్యామి కామ్యం కర్మ తవా7నఘ ! | ఉపోషితౌ సదా పౌష్ణే యజమాన పురోహితౌ ||

ఆశ్వినరేక్ష సదా స్నానం కుర్యు ర్యన్మే నిబోధత ! | అకాలమూలౌ ద్వౌ కుంభౌ మధూక కుసుమోత్కటౌ ||

అశ్వగంధాయుతౌ కృత్వా స్నాప్య స్తాభ్యాం తథా భ##వేత్‌ | ఉత్తమం పూజయే ద్విద్వాన్‌ నాసత్యౌ శశినం తథా ||

అశ్వినౌ వరుణం చైవ శుక్లవాసా స్తథా హరిమ్‌ | గంధమాల్య నమస్కార ధూపదీపా7న్న సంపదా ||

తతో7శ్వ మిధునం కార్యం సర్వౌషధియుతం మృదా | ప్రణతేన తతో విద్వాన్నా7సత్యాభ్యాం నివేదయేత్‌ ||

ధూప మశ్వశఫం దద్యాద్దైవతానాం తథైవ చ | యథోక్తానాం ద్విజ శ్రేష్ఠ ! జుహుయాచ్చ పృథక్‌ పృథక్‌ ||

చతుర్థ్యన్తేన నామ్మా తు ప్రణవా7ద్యేన న భార్గవ ! స్వాహా7న్తే నా7థ శతశో మన్త్రపూతం ఘృతం ద్విజ ! || 4

అశ్వలోమ తథా ధార్యం ఫలమూలే తథైవ చ | ఏకత్ర త్రివృతం కృత్వా మణి ర్థార్యస్తు పూర్వవత్‌ ||

అలంఘయ న్నశ్వనతిం సదైవ | స్నానం చ కుర్యాత్ప్రయతో మనుష్యః |

అశ్వా నవాప్నోతి సహస్రసఖ్యాన్‌ | కులోద్భవాన్‌ వీర్య బలోపపన్నాన్‌ || 42

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే అశ్వానాం శాన్తి కర్మ విధానం నామ సప్త చత్వారింశోధ్యాయః.

ఇక కామ్య శాంతి విధానము దెల్పెద. యజమాన పురోహితులు పుష్యమీనక్షత్రయుక్త పూర్ణమినాడు ఉపవసించి, అశ్వినీ నక్షత్రమురోజున స్నానముసేసి, రెండు కుంభములందు అకాలమూలములుంచి ఇప్పపూవు పెన్నేరు అనువానింజేర్చిన నీటితో స్నానము సేయవలెను. ఉత్తముని అశ్వినీదేవతలను చంద్రుని బూజింపవలెను. తెల్లని మడువులుదాల్చి అశ్వములను, వరుణుని, హరిని, షోడోపచారముల నొనర్చి మృత్తికతో అశ్వమిథునమును (బొమ్మలుగా) జేయించి ప్రణామ పూర్వముగా నశ్వినీదేవతలకు వానిని సమర్పింపవలెను. గుఱ్ఱపుడెక్క ధూపము దేవతలకు వేయవలెను. వేర్వేర నా యా దేవతల నుద్దేశించి హోమము సేయవలెను. చతుర్థీ విభక్తి చివర నుండునట్లు ప్రణవాద్యముగ స్వాహాకారముతో మంత్ర పూతమైన యాజ్యమును వందలకొలది హోమము సేయవలెను. గుఱ్ఱము రోమములను పండ్లను, మూరికలను, ధరింపవలెను. మూడు పేటలు గావానిని పేని మణితో ధరింపవలెను. అశ్వినీదేవతలకు నమస్కరించుట నతిక్రమింపక నియమముతో నిత్యము స్నానము చేసిన యతడు వీర్యబల సమేతములు నుత్తమజాతి గుఱ్రములను వేలకొలదిగా బొందగలడు.

ఇది విష్ణుధర్మోత్తరమహాపురాణము ద్వితీయఖండమున అశ్వముల శాంతి విధాన మను నలుబదియేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters