Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదియారవ యధ్యాయము - అశ్వచికిత్స

పుష్కరః- అతః పరం ప్రవక్ష్యామి శృణు! తేషాం చికిత్సతమ్‌ | వృషో నింబ బృహత్యౌ చ గుడూచీ చ సమాంసికా || 1

శింఘాణ కహరా పిండీ స్వేదస్య శిరస స్తథా | యావశూకం సమదనం పిప్పలీ విశ్వభేషజమ్‌ || 2

సర్షపా గృహ ధూమశ్చ నిర్గుండీ సురసా వచా | నింబ పత్రయుతా పా¸° వర్తి శ్శూల వినాశినీ || 3

హింగు పుష్కర మూలం చ నాగరం సావ్లువేతసమ్‌ | పిప్పలీ సైంధవయుతం శూలఘ్నం తూష్ణవారిణా|| 4

నగరాతి విషౌ ముస్తా సానన్తా బిల్వమాలకా | క్వాథో మాసం పిబే ద్వాజీ సర్వాతీసార నాశనమ్‌ || 5

ప్రియంగు శారిబాభ్యాం చ యుక్త మాజం శృతం పయః | పర్యాప్త శర్కరాం పీత్వా శ్రమా ద్వాజ్యవముచ్యతే || 6

ద్రోణీకాయాం తు దాతవ్యా తైల వస్తి స్తురంగమే | కోష్ఠజాశ్చ శిరా వేధ్యా స్తేన తస్య సుఖం భ##వేత్‌ || 7

దాడిమం త్రిఫలాం వ్యోషం గుడం చ సమభాగితమ్‌ | పిండ మేతత్‌ ప్రదాతవ్యం అశ్వానాం కాస నాశనమ్‌ || 8

ప్రియంగు రోధ్ర మధుభిః పిబ న్తిస్మ రసం హయాః | క్షీరం వామం చ కాలోడ్యం కశ్మలా ద్విప్రముచ్యతే || 9

ప్రస్కన్నేషు చ సర్వేషు శ్రేయ ఆదౌ విశోషణమ్‌| అభ్యంగోద్వర్తన స్నేహ నస్య వర్తి క్రమ స్తతః || 10

ప్రస్కన్నం ప్రశమం యాతి యది నానేన కర్మణా | ఉరస్యుపాన్త పార్శ్వే చ తతో విశ్రావయేచ్ఛిరామ్‌ || 11

జ్వలితానాం తురంగాణా మయమేవ క్రియా క్రమః | నస్య మేకం వినా రామ! సర్వమే తత్‌ ప్రశస్యతే || 12

రోధ్ర కదంజయో ర్మూలం మాతులుంగాగ్ని నాగరాః | కుష్ఠ హింగు వచా రాస్నాలేపోయం శోషనాశనః || 13

సమానేన శిరాం విధ్యా దేయా వాపి జలౌకసః | త్ర్యహే త్ర్యహే వా ధర్మజ్ఞః నస్య కర్మ సమాచరేత్‌ || 14

మంజిష్ఠా మధుకం ద్రాక్షా బృహత్యౌ రక్త చందనమ్‌ | త్రపుసీ బీజ మూలాని శృంగాటక కశేరుకమ్‌ || 15

అజా పయః శృత మిదం సుశీతం శర్కరాన్వితమ్‌ | పీత్వా నిరశనో వాజీ ర్తమేహాత్‌ ప్రముచ్యతే || 16

మన్యా హను నిగాలస్థః శిర శ్శోఫో గల గ్రహః | అభ్యంగః కటు తైలేన తత్ర తేష్వేవ శస్యతే || 17

యవైః స్నిగ్ద కులు త్థైశ్చ తతః స్వేదం ప్రయోజయేత్‌ | మృదూ కృతే తతః శోఫే నస్య కర్మ సమాచరేత్‌ || 18

వచా............... సైంధవం స్వరసో రసః | కృష్ణా హింగు యుతై రేభిః కృత్వా నస్యం న సీదతి || 19

నిశా జ్యోతిష్మతీ పాఠా కృష్ణా కుష్ఠా వచా మధు | జిహ్వా స్తంభే చ లేపోయం గుడ మూత్ర యుతో హితః || 20

తిలై ర్యుక్తా రజన్యా చ నింబ పత్రైశ్చ యోజితా| క్షౌద్రేణ శోధనీ పిండీ సర్పిషా వ్రణ రోపిణీ || 21

అభిఘాతేన ఖంజన్తి యేనాశ్వ స్తీవ్ర వేదనాః | పరిషేక క్రియా తేషాం తైలేనాశు రుజా పహా || 22

దోషకోపాభిఘాతాభ్యాం తిలజే జృంభ##తే సదా | శాన్తిర్మధ్వాజ్య బంధాభ్యాం పక్వం భిన్నేవ్రణక్రమః || 23

అశ్వత్థో దుంబర ప్లక్ష మధూక వట కల్కకైః | ప్రభూత సలిలః క్వాధః సుఖోష్టో వ్రణ శోధనః || 24

శతాహ్వా నాగరం రాస్నా మంజిష్ఠా కుష్ఠ సైంధవైః | దేవదారు వచా యుగ్మ రజనీ రక్తచందనైః || 25

తైలం సిద్ధం కషాయేణ గూడూచ్యా పయసా సహ | ప్రక్షీణ వస్తి నస్యే చ యోజ్యం సర్వత్ర లంఘనే || 26

రక్తస్రావో జలౌకాభి ర్నేత్రాన్తే నేత్ర రోగిణః | ఖదిరో దుంబరాశ్వత్థ కషాయేణ చ ధావనమ్‌ || 27

ధాత్రీ దురాలభా తిక్తా ప్రియంగు కుంకుమై స్సమైః | గుడూచ్యా కృతకః కల్కో హిత ముష్ణా లంవబితే || 28

ఉపాన్తే చ శిరా స్రావే ముష్క శోభే తథైవ చ | క్షిప్రకారిణి దోషే చ సద్యో వేధన మిష్యతే || 29

గోశకృత్‌ సర్జికాకుష్ఠ రజనీతిల సర్షపైః | గవాం మూత్రేణ పిష్టైశ్చ మర్దనం కండు నాశనమ్‌ || 30

సితా మధుయుతః క్వాథో వాశికాయాః స శఠ్కరః | రక్తపిత్తహరః పానా దశ్వకర్ణా త్తథైవ చ || 31

ఆమే పరిణతే పక్వం పక్వమాంసే జరాం గతే | పక్వమాంసయుతం నేష్టం సర్వం జీర్ణం ప్రశస్యతే || 32

సప్తమే సప్తమే దేయ మశ్వానాం లవణం దినే | తథా భుక్తవతాం దేయా పరిపానే తు వారుణీ || 33

జీవనీయే స్సుమధురై ర్మృద్వీకా శర్కరా యుతైః | స పిప్పలీకైః శరది ప్రతిపానం స పద్మకమ్‌ || 34

విడంగ పిప్పలీ ధాన్యా శతాహ్వా రోధ సైంధవైః | సావిత్రకై స్తురంగాణాం ప్రతిపానం హిమాగమే || 35

పుష్కరుడనియె:- ఈ పైని యా యశ్వముల చికిత్సావిధాన మెరిగింతు వినుము. అడ్డరసము, దూలగొండి, వేప, వాకుడు, తిప్పతీగ, జటామాంసి, మంగయు కలిపిన ముద్ద తలకు పట్టించిన గుఱ్ఱముల రొంపకు మందు. తలకు పట్టించిన చెమటయుం బోవును. యావశూకము లోలుగు ఆవాలతో గుఱ్ఱములశాలలో ధూపము వేయవలెను. మద్ది వావిలి దాల్చిన ఆకు వస (పొత్తిదుంప) వేపాకుల రసముతో వర్తిజేసి పాయువునందు జొనిపిన శూల (కడుపునొప్పి) మాన్చును. ఇంగువ, తామరదుంప తుంగముస్త, పుల్ల ప్రబ్బలి, పిపృలి, సైంధవ లవణము వీనిని వేడి నీళ్ళలో కలిపి యిచ్చిన శూల హరించును. నాగరము, అతివస, భద్రముస్తలు, సుగంధిపాల బిల్వమాలము కందము, వీనితో గాచిన క్వాథము త్రాగించిన గుఱ్ఱమునకు అతిసారము తగ్గును. ఆరెపువ్వు సుగంధిపాలు, కాచిన మేకపాలు, సరిపోయిన పంచదార కలిపి త్రాగించిన గుఱ్ఱమాయాసమును బాయును. నూనెవస్తి ద్రోణిక యందిచ్చిన కోష్ఠరోగములు శిరావేధయు మానును. దానిమ్మ కరకతాడి ఉసిరికలు వోషము కొద్దిగ బెల్లము సమభాగములుగా ముద్దచేసి పెట్టిన కాసరోగము పోవును. ఆరెపువ్వు లొద్దుగ రసము, తేనె, పాలు, వామమును కలిపి త్రాగించిన మూర్ఛబోవును. సర్వరోగ ములకు ముందుగా విశోషణము (శోషింపజేయుట) అనగా ఆహారము పెట్టకుండుట, తోముట, (మాలీసు) నూనెరాచుట నస్యవర్తియు క్రమముగా చేయవలయును. దీనిచే ప్రస్కన్న రోగము మానదేని రొమ్మునందు రొమ్మువీపున నిరుప్రక్కలంగల నరమును కాచవలెను. జ్వరితములయిన తురంగముల నస్యమొక్కటి తప్ప మిగిలిన వైద్య ప్రక్రియ యిదే. లొద్దుగ కరంజము వెల్లులలి పిన్న కానుగ చెట్టు వేళ్ళు (కరంజము = గంటకలగర అనికూడా ఉన్నది.) మాతులుంగము = మాదీఫలము చిత్రమూలము తుంగముస్త చెంగల్వకోష్ఠు ఇంగువ వస సర్పాక్షి వీని నన్నిటిని కలిపిన రసముతో వేధ చేయవలెను. జలగలు గూడ గరిపించవలెను. ప్రతి మూడురోజులకు నస్యకర్మ చేయవలెను. మంజిష్ఠ, యష్టిమధుకము, ద్రాక్ష, తెల్లనల్ల వాకుడులు, రక్త చందనము త్రపుసి విత్తులు, దోసగింజలు, శృంగాటకము, దిరిశెనపువ్వు వీనిని మేకపాలలోవేసి కాచి బాగా చల్లార్చి పంచదారచేసి త్రాగించిన నిరశన మైన మఱియాహారమేది తినకున్న గుఱ్ఱమురక్తమేహ వ్యాధినిబాయును. (దవడలయందు) పెడ తలవాపు గుఱ్ఱము మెడదగ్గర తలవాపు కంఠము బిగియుట అను వ్యాధులందు గుఱ్ఱమునకు తైలముతో నభ్యంగము చేయించుట మంచిది. యవలు, ఉలవలు అను వానిచే స్వేదకర్మ చేయవలెను. దానివలన శోఫ కొంచెము నయమగును. తర్వాత సస్యము సేయవలెను. వస సైంధవలవణము స్వరసమైన రసము పిపృలి ఇంగువ కలిపి వీనితో నస్యము సేసిన వోషము వాపు నయమగును. పసుపు, జ్యోతిష్మతి, పాఠ, కుష్ఠ, వస, తేనె అను వానిని గలిపి పాత బెల్లముతో గోమూత్రముతో గలిపి నాలుకపై పూసిన జిహ్వాస్తంభము (నాలుక మొద్దువారుట) పోవును. తిలలతో గూడిన రజని వేపాకులు గలిపి తేనెతో శోధన చేసి నేతితో గలిపిన పిండి పుండ్లమీద వేసినచో నఖిఘాతమున తీవ్రవేదన నంది నడవలేని గుఱ్ఱము కాబాధ పోవును, పై తైలమును పరిషేకము (పుండ్లపై పూయుట) వలన నా బాధ పోవును.

దోష ప్రకోపము వలన వ్రణమేర్పడగా యావు పాలను తేనె, నెయ్యి, వీటితో తడిపిన గుడ్డలు కట్టుటవలననా వ్రణము పక్వమై పగులును. ఆప్పుడు రావి, మేడి, జువ్వి, ఇప్ప, మఱ్ఱియాకులు కల్కముతో జలసమృద్దిగా కాచిన గోరువెచ్చని నీటితో వ్రణశోధన చేయవలెను. సదాప, నాగరము, సన్న రాష్ట్రము మంజిష్ఠ, చెంగల్వకోష్ఠు, సైంధవలవణము, దేవదారు, రెండురకాల వస, పసుపు చందనములతోగూడ కాచిన తైలము, గుడూచి తిప్పతీగ పాలు చిక్కిపోయినపుడు వస్తియందు, నశ్యమందు, లంఘనమందెల్లయెడల నుపయోగింప వలెను. నేత్రరోగమందు నేత్రము చివర జలగంబట్టించి రక్తస్రావము చేయించవలెను. చండ్ర, మేడి, రావి, యాకుల కషాయముతో గడుగుట, ఉసిరి దురాలభ దూలగొండి కటుక రోహిణీ ప్రియంగువు, కుంకుమపువ్వు సమభాగములుగా గూడూచియను వానితో జేసిన బిడాల లవణము కల్కము ఎండదెబ్భదిన్న గుఱ్ఱమునకు మందు. శిరాస్రావమందు కుష్కశోఫవాపునందు క్షిప్రకారియను దోషమందు వేంటనే వేధము చేయవలెను. ఆవుపేడ సర్జిక, చెంగల్వకోష్టు, పసుపు, నువ్వులు, ఆవాలు గోమూత్రముతో నూరిన ముద్దతో మర్దనముసేయుట వలన గుఱ్ఱము దురద పోవును. పంచదార, తేనెలో కాచిన క్వాథము ముక్కులో బోసినను గుఱ్ఱము చెవిలో బోసినను రక్తపిత్తము హరించును. ఆవల దోషము పక్వము గాగా ఆమాంసము పక్వమయి జీర్ణమయినపుడు ఈ వ్యాధికి వేయవలెను. అది జీర్ణము కాంకుండనిది యీయరాదు ఏడేసి రోజులకొకసారి గుఱ్ఱముల కుప్పుదినిపింపవలెను. అది తిన్న తరువాత మద్యము త్రాగింపవలెను. జీవనీయములు సత్తువకూర్చు మధురములు ద్రాక్ష, పంచదారతో కలిపినవి పిపృళ్లతో, పద్మకముతో శరత్కాలమందు రెండునెలలును గుఱ్ఱములకు త్రాగించవలెను వాయి విడంగాలు, పిప్పళ్లు, ధాన్యము, శీతాహ్వ, లొద్దుగ సైంధవలవణము, సావిత్రికములతో హిమవంత ఋతువున త్రావింపవలెను.

రోధ్రం ప్రియంగుకా రాస్నా పిప్పలీ విశ్వభేషజైః | సక్షౌద్రైః ప్రతిపానంస్యా ద్వసంతే కఫనాశనమ్‌ || 36

ప్రియంగు పిప్పలీ రౌద్ర యష్ట్యాహ్యైః సమహౌషధైః | నిదాఘే సగుడా దేయా మదిరా ప్రతిపానకే || 37

భద్రకాష్ఠా సలవణం పిప్పల్యా విశ్వభేషజమ్‌ | భ##వేత్తైల యుతై రేభిః ప్రతిపానం ఘనా7గమే || 38

నిదాఘా7వృత పిత్తానాం క్షర న్మందోష్ణ శోణితాః | ప్రావృడ్‌ భిన్న పురీషాశ్చ పిబేయు ర్వాజినో ఘృతమ్‌ || 39

పిబేయు ర్వాజిన సై#్తలం కఫ వాయ్వధికాస్తు యే | స్నేహ వ్యాపద్భవే ద్యేషాం తేషాం కార్యం విరూక్షణమ్‌ || 40

త్రహ్యం యవాగూ రూక్షా స్యా త్సురా చ లవణా న్వితా | భోజనే తక్ర సంయుక్తం హ్యేషవై రూక్షణ విధిః || 41

ప్రాయోగిక స్తథా దేయో వస్తి స్తస్య నిరత్యయః | యే పిబన్తి హయాః స్నేహం తేషాం వస్తిం న దాపయేత్‌ || 42

లొద్దుగ ప్రియంగవును సన్నరాష్ట్రము పిప్పలి శొంటి, తేనెకలిపి వసంతఋతువులో త్రాగింపవలెను. అదికఫహారము ప్రియంగువు పిప్పలి, రుద్రజట, గంటుభారంగి, శొంఠి అనువానితో గ్రీష్మ ఋతువునందు, కల్లు బెల్లముతో గుఱ్ఱములను ద్రాగింపవలెను దేవదారు, పిప్పలి శొంఠి, యను వీని రసమును ఉప్పుతో వర్షఋతువున ద్రాగింపవలెను.

కఫము వాతము ప్రకోపించినపుడు శరీరములో చమురారిపోవును. అపుడు వానికి విరూక్షణము సేయవలెను. మూడురోజుల మజ్జిగతో కల్లు, ఉప్పుతో రూక్షము చేసినప్పుడాహారమది ఎల్లప్పుడు గుఱ్ఱములకు వస్తి చేయవలెను. నూనెత్రావిన గుఱ్ఱములకు మాత్రము వస్తికర్మ పనికిరాదు.

శరన్నిదాఘయోః సర్పిసై#్తలం శీత వసన్తయోః | వర్షాసు శిశిరే చైవ వస్తే దేయ మిహేష్యతే || 43

గుర్వభిష్యంది భక్తాని వ్యాయామః స్నానమాతపమ్‌ | పాయుర్వస్తిం చ వాహస్య స్నేహ పీడస్య వర్జితమ్‌ || 44

స్నానం పానం సకృ ద్దృష్ట మశ్వానాం సలిలా7గమే | అత్యర్థ దుర్దినే కాలే స్నాన మేకం ప్రశస్యతే || 45

యుక్త సీతాతపే కాలే ద్విః పానం లవణం సకృత్‌ | గ్రీష్మే త్రిః స్నాన పానం స్యా చ్చిరం తస్యా7వగాహనమ్‌ ||

నిస్తుషాణాం ప్రదాతవ్యం యవానాం చతురా7ఢకమ్‌ | వవర్ణ ప్రీతి మౌదాలా కలనాం వాపి దాపయేత్‌ || 47

అహోరాత్రేణ చా7న్త్రస్య యవసస్య తులా దశ | అష్టౌ శుష్కస్య దాతవ్యా శ్చతస్రో7థ బుసస్య వా || 48

దూర్వా పిత్తం బుసః కార్శ్యం తద్బుసః శ్లేష సంచయమ్‌ | నాశయ త్యర్జునః శ్వాసం తథా మాషో బలక్షయమ్‌ || 49

వాతికాః పైత్తికాశ్చైవ శ్లేష్మజాః సాన్నిపాతికాః | న రోగాః పీడయిష్యన్తి దూర్వా7హారం తురంగమమ్‌ || 50

ద్వౌ రజ్జు బంధౌ దుష్టానాం పక్షయో రుభయో రపి | పశ్చా ద్బంధశ్చ కర్తవ్యో హర కీల వ్యపాశ్రయః || 51

కేశా7నురూప మాస్యస్య కేశ పుచ్ఛ ప్రకల్పనమ్‌ | ఛేదః ఖుర ప్రవృద్ధౌ చ వర్జయేత్తు కనీనికామ్‌ || 52

యత్నోప న్యస్త యవసః కృత ధూపన భూమయః | వసేయు స్సంభృతే స్థానే ప్రదీపై స్పార్వరాత్రికైః || 53

శాఖామృగా7జాః కృకవాకవశ్చ | ధార్యాశ్చ శాలాసు తథైవ ధేనుః |

కుర్యు ర్నిశీథే పురుషా స్సశస్త్రాః | సంరక్షణం నామ తురంగమాణామ్‌ || 54

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పుష్కరోపాఖ్యానే ఆశ్వచికిత్సా నామ షట్చత్వారింశో7ధ్యాయః.

వసంతగ్రీష్మవర్షా శిశిరఋతువులందు వస్తికర్మ చేయనగును. స్నేహపీడనొందిన గుఱ్ఱమునకు గుర్వభిష్యంది భక్తములు బలహారము చేయునవి అభిష్యందులు నైన యాహారములు వ్యాయామము స్నానము ఎండ, పాయువునందు వస్తికర్శ=చేయగూడదు వర్షఋతువునందు స్నానము పానము చేయించుటమంచిది. చలి యెండ యెక్కువగానున్నపుడు రెండుస్నానములు అపుడప్పుడు ప్రశస్తములు. గ్రీష్మర్తువున మూడు సార్లు పానము తలమునుగ స్నానము విహితము. పొల్లు లేనియవలు (దంచినయవలబియ్యము నాల్గు ఆఢకములు వవర్ణ వ్రీహి మోదాలాకలనను దినిపింపవలెను ఒక్క పగలు రాత్రి ఆంత్రము = ఈతూనికతో గడ్డి పదితులములు ఎండుగడ్డి ఎనిమిది తులములు, పొల్లు నాల్గుతులముల తూనికలివ్వవలెను. గరిక పిత్తమును. హరించును. బుసము శ్లేష్మ ప్రకోపమును దహించును. అర్జునము మద్దియాకు శ్వాసరోగమును, బలహీనతను మినుము హరించును. గరిక తిను నశ్వమునకు వాత పిత్తశ్లేష్మవ్యాధులపీడ గల్గదు. దుష్టహయమున కిరుప్రక్కల రెండు వారులు పట్టెళ్లతో కట్టుట, వెనుక హరకీల వ్యపాశ్రయమయిన బంధము నవసరము. జూలు కనురూపముగ సప్రయత్నముగా గడ్డి పెట్టుట సాలలో ధూపములు వేయుట, చక్కగ నమర్పబడిన సాలలో నుంచుట. రాత్రులందెల్ల హారతులిచ్చుట చాల యవసరము. కోతులు మేకలు కోళ్ళు ఆవులను గుఱ్ఱపు సాలలందుంచి పోషింపవలయును. అర్ధరాత్రులందు శస్త్రధారులై కావలివాండ్రు తురంగమ రక్షణము సేయవలెను.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters