Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబది మూడవ యధ్యాయము - గో చికిత్స

పుష్కరః- అతః పరం ప్రవక్ష్యామి తవ రామ! చికిత్సితమ్‌ | సంక్షేపేణ గవాం పుణ్యం సారభూతం శృణుష్వ! తత్‌ ||

శృంగమూలేషు ధేనూనం తైలం దద్యా త్ససైంధవమ్‌ | శృంగీ వీరబలా మాంసీ కల్క సిద్ధం సమాక్షకమ్‌ || 2

సిమిచూర్ణయుతం దేయ మథవా7పి తథా ఘృతమ్‌ | కర్ణమూలేషు సర్వేషు మంజిష్ఠా హింగు సైంధవైః || 3

సిద్ధం తైలం ప్రదాతవ్యం గోరసోవా7థవా పునః | మాక్షికం సైంధవం శంఖం తగరీం పిప్పలీం సిహామ్‌ || 4

అజా క్షీరేణ సంపేష్య గులికాం కారయే ద్భిషక్‌ | ఏత న్నేత్రాంజనం శ్రేష్ఠం ఘృతమాక్షిక సంయుతమ్‌ || 5

బిల్వ మూల మపామార్గం ధాతకీం చ సపాటలామ్‌ | కుటజం దంతమూలేషు లేపం తచ్ఛూల నాశనమ్‌ || 6

దంత శూల హరై ర్ద్రవ్యై ర్ఘృతం రామ! విపాచితమ్‌ | ముఖరోగ హరం జ్ఞేయం జిహ్వా రోగేషు సైంధవమ్‌ || 7

శృంగబేరం హరిద్రే ద్వే త్రిఫలాంచ గల గ్రహే | శృంగబేరం హరిద్రే ద్వే వల్కలం కుటజస్య చ || 8

అపామార్గ విడంగాశ్చ లవణన విమిశ్రితమ్‌ | ఔషధం ముఖరోగఘ్నం జ్వరదాహ వినాశనమ్‌ || 10

శతపుష్పాయుతం పక్వం తైలం కుటజ చిత్రకైః | గవాం రామ! ప్రదాతవ్యం సర్వ హృద్రోగ నాశనమ్‌ || 11

అతీసారే హరిద్రే ద్వే పాఠాం చైవ ప్రదాపయేత్‌ | ఆనాహే ఘృత సంయుక్తాం దావయే త్పద్మచారిణీమ్‌ || 12

సర్వేషు కుష్ఠ రోగేషు తథా శాఖా గదేషు చ | శృంగబేరం చ దార్వీంచ కాసే శ్వాసే ప్రదాపయేత్‌ || 13

దాతవ్యే భగ్న సంధానే ప్రియంగు ర్లవణాన్వితా | వాతరోగేషు సర్వేషు శత పుష్పావిపాచితమ్‌ || 14

గవాం తైలం ప్రదాతవ్యం సర్వవాత గదాపహమ్‌ | యూషణం మధు సంమిశ్రం కఫ రోగేషు దాపయేత్‌ || 15

పిత్తరోగేషు సర్వేషు మధు యష్టి విపాచితమ్‌ | గవ్య మాజ్యం ప్రదాతవ్యం సర్వ పిత్త గదా 7పహమ్‌ || 16

శాఖోటక రసాపానం రక్తపిత్తే ప్రశస్యతే | గోధూమానాం చ చూర్ణాని మాషా శ్చైవ ససర్షపాః || 17

పయసా చ సమాలోడ్య గురు మిశ్రాః ప్రదాపయేత్‌ | రక్తస్రావేషు కృచ్ఛేషు గవా మేత త్ప్రశస్యతే || 18

తిలా7ంభకరుహాంశ్చైవ హరితాళం ఘృతం తథా | భగ్నక్షతానాం ధేనూనాం లేపనే తత్ప్రశస్యతే || 19

వత్సానాం చ సరోగాణాం పాఠాం తక్రేణ పాయయేత్‌ | హరిద్రాం క్షీర సంయుక్తా మథవారోగ శాంతయే || 20

మాషా స్తిలా స్సగోధూమాః పశు క్షీరం ఘృతం తథా | ఏషాం పిండాః ప్రదాతవ్యాః లవణన సుసంస్కృతాః |

పుష్టి ప్రదా తు వత్సానాం వృషభాణాం బలప్రదా || 21

దేవదారు వచా మాంసీ గుగ్గులు ర్హింగు సర్షపాః | ఏషాం ధూపః ప్రదాతవ్యః కించిత్‌ ఘృత పరిప్లుతః || 22

సర్వగ్రహ వినాశాయ పలంకశయుతః శుభః | ఘంటా చా7పి గవాం కార్యా ధూపేనా7నేన ధూపితా || 23

అశ్వగన్ధా తిలం చుక్రం వస్తియోగే ప్రశస్యతే | అశ్వగంధాయుతం తీవ్రం తిలా స్వస్తి ప్రశస్యతే || 24

పిణ్యాకమేవ నిర్దిష్టం గవాం రామః రసాయనమ్‌ | శీతోద పాన మార్ద్రం చ యవసం చ వివర్జయేత్‌ || 25

జురాన్వితా తథా స్థానం తచ్చ శీతం ద్విజోత్తమ! | ధార్యం చైవ గవాం మధ్యే మత్తోజః సర్వథా భ##వేత్‌ || 26

గవాం వేశ్మని దీపాస్తు దాతవ్యా రామః రాత్రికాః || 27

గవాం హి రోగోపశమాయ శస్తం | గతే7ర్థమాసే లవణం సదైవ |

ఆనాహ శూలా7రుచివాశనం తత్‌ | ఆజా7వికస్యాపి తథా ప్రశస్తమ్‌ || 28

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే గోచికిత్సితం నామ త్రిచత్వారింశో7ధ్యాయః.

పుష్కరుడనియెః పరుశురామ! ఇక నీకు గోచికిత్సా విధానమును సంక్షేపముగా వచించెద. సారవంత మది. పుణ్యప్రద మాలింపుము. ఆవు కొమ్ము మొదట సైంధవ లవణం కలిపి నూనె పోయవలెను. లేదా అల్లము వీరబల జటామాంసియు కలిపిన ముద్దను తేనెతో గలిపి సిమి చూర్ణముగాని, ఆవు నెయ్యిగాని చెవుల మొదట పోయవలెను. మంజిష్ఠ ఇంగువ సైంధవలవణముతో కలిపిన తైలము పూయవచ్చును. గోరసము (ఆవుపాలు నెయ్యి వెన్న మొదలయినవి) తేనెతో సైంధవలవణము కలిపి శంఖ పాషాణము పిప్పలి సింహ పిప్పలి మేకపాలతో నూరి యుండచేసి ఆవునెయ్యితో కలిపి నేత్రాంజనము (కండ్లకు కాటుక పెట్టిన మంచి పనిచేయును. మారేడు వేళ్ళు ఉత్తరేణు ఆరె పువ్వు కలిగొట్టు పువ్వు (లొద్దుగ) నూరి దందమూలములందు పట్టించిన దంతముల పోటు హరించును. దంత శూల హరించు వస్తువులు నేతిలో వేసి కాచి యిచ్చిన ముఖ రోగములు పోవును. దీనినే సైంధవము కలిపి దినిపించిన నాలుకకు సంబంధించిన రోగము పోవును. శొంఠి మానిపపుసుపు మామూలు పసుపు కరకతాడి ఉసిరికలు గలగ్రహ రోగమునకు ఇవ్వవలెను. శొంఠి రెండు రకాల పసుపు కొడిసెపాలపట్ట ఉత్తరేణు వాయువిడంగాలు ఉప్పుతో గలిపిన మందు ముఖరోగ హితము. జ్వర దాహముల హరించును. గుండెపోటు పొత్తికడుపు శూల యందు వాతరోగమందున నరకు పడినపుడు పై ¸°షధముల త్రిఫలములు నెయ్యితో గలిపి త్రావించిన నుపశమించును. పెద్దసదాప సోపు చిత్రమూలము కొడిసె పాలయు వేసి కాచిన తైలము నిచ్చిన సర్వహృదయ రోగములు నశించును. పారుడు రోగమందు రెండు పసుపులు పాఠతీగ కలిపి మాత్ర చేసి యివ్వవలెను. ఆనాహ రోగమందు నేతితో గలిపి మెట్టదామర (కుందుష్కములో రకము (నవనీతఖోటీ) కలిపి పెట్టవలెను. కుష్ఠురోగము లన్నింటను శాఖారోగములందును శొంఠి మ్రాని పసుపు శ్వాస కాసలందు యివ్వవలెను. విరిగిన ఎముకలు అతుకు కొనుటకు ప్రియంగువును ఉప్పుతో యివ్వవలెను.

ప్రియంగువు ఆరె చెట్టుకటుకరోహిణి నల్ల ఆవాలు నల్లసుగంధి ఆళ్ళు వాతరోగము లన్నిటిలో శతపుష్పా కషాయము నివ్వవలెను. వాతరోగమందు కఫరోగములందు నువ్వులనూనె తేనెతో కలిపిన యూషణము నివ్వవలెను. పిత్తరోగమందు యష్టి మధుకము తేనెతో కాచి యివ్వవలెను. మరియు ఆవునెయ్యి త్రాగింపవలెను. రక్త పిత్త వ్యాధియందు శాఖోటక రసాపానము భరణిక చెట్టురసము త్రాగింపవలెను. గోధుమపిండి ఆవాలు మినుములు పాలతో గలిపి గురుమిశ్రమములను బెట్టవలెను. తిలాంచకహము ముష్టిచెట్టు ఆకులు హరిదళము నెయ్యి కలిపి రాసిన దెబ్బలు నరకులు మానును.

ఆవు దూడలకు రోగము వచ్చినప్పుడు మజ్జిగతో గలిపి పాఠతీగరసము పసుపును పాలతో ద్రాగింపవలెను. మినుముల నువ్వులు గోధుమలు పశుక్షీరము ఘృతము వీనిని ముద్దచేసి ఉప్పుతో దినిపింపవలెను. దూడలకు పుష్టినిచ్చును. వృషభములకు దేవదారు వస మాంసి గుగ్గులు ఇంగువ ఆవాలు వీనిలో కొంచెము నెయ్యి గుగ్గిలము కలిపి ధూపము వేసిన సర్వగ్రహశాంతి యగును. ఈ ధూపము వేసిన ఘంటకూడకట్టవలెను. అశ్వగంధ నువ్వులు చింతపండు వస్తి చికిత్సకు ప్రశస్తము (వస్తి పొత్తికడుపు) అశ్వగంధ తిలలు మజ్జియునేని దీనికి మంచిది. ఆవుపాలు బాగుగ యిచ్చుటకు పిండియే చాలామంచిది. చన్నీళ్ళు తాగుట పచ్చిగడ్డి మాత్రము ఆవులకు పనికిరాదు. చలిచోటునను గట్టరాదు. గోవుల మంద నడుమ మత్తోజము నుంచ వలెను. గోష్ఠమందు గోశాలలో దీపములు హారతులు నివ్వవలెను. గోవు లీనిన తరువాత పదునేను రోజులు వెళ్ళినప్పటి నుంచి నిత్యము నుప్పు తినిపింప వలెను, ఆనాహము శూల (కడుపునొప్పి) అరుచియును దానిచే పోవును. మేకలకు గొఱ్ఱలకు గూడ యిది మంచిది.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున గోచికిత్సయను నలుబది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters