Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదిరెండవ యధ్యాయము - గోమాహాత్మ్యము- గోమతీవిద్య

పుష్కరః- గవాం హి పాలనం రాజ్ఞా కర్తవ్యం భృగునందన! | గావః పవిత్రాః సంగత్యా గోషులోకాః ప్రతిష్టితాః ||

గావో వితన్వతే యజ్ఞం గావో విశ్వస్య మాతరః | శకృన్మూత్రం పరంతాసామలక్ష్మీః నాశనం స్మృతః || 2

తద్ధిసేవ్యం ప్రయత్నేన తత లక్ష్మీః ప్రతిష్టితా | ఉద్వేగం చ న గంతవ్యం శకృన్శూత్రస్య జానతా || 3

గవాం మూత్రపురీషేషు ష్ఠీవనాద్యం న సన్త్యజేత్‌ | గోరజః పరమం పుణ్య మలక్ష్మీ విఘ్న నాశకమ్‌ || 4

గవాం కండూయనం చైవ సర్వ కల్మష నాశనమ్‌ | తాసాం శృంగోదకం చైవ జాహ్నవీ జల సన్నిభమ్‌ || 5

గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిశ్చ రోచనమ్‌ | షడంగ మేత న్మాంగళ్యం పవిత్రం తు పృథక్‌ పృథక్‌ || 6

గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌ | పవిత్రం పరమం జ్ఞేయం స్నానే పానే చ భార్గవ ! 7

రక్షోఘ్న మేత న్మాంగళ్యం కలిదుఃఖ ప్రణాశనమ్‌ | రోచనా చ తథా ధన్యా రక్షోరగ గదా 7పహా || 8

యస్తు కల్యే సముత్థాయ ముఖమాజ్యే నిరీక్షతే | తస్యా7లక్ష్మీః క్షయం యాతి వర్ధతే న తు కిల్చిషమ్‌ || 9

గవాం గ్రాస ప్రదానేన పుణ్యం సుమహ దశ్నుతే | యావత్యః శక్ను యా ద్గావః సుఖం ధారయితుం గృహే || 10

ధారయే త్తావతీ ర్నిత్యం క్షుధితాస్తు న ధారయేత్‌ | దుఃఖితా ధేనవో యస్య వసన్తి ద్విజమందిరే || 11

నరకం సమవాప్నోతి నాత్రకార్యా విచారణా | దత్వా పరగవే గ్రాసం పుణ్యం సుమహ దశ్నుతే || 12

శైశిరం సకలం కాలం గ్రాసం పరగవే తథా | దత్వా స్వర్గ మవాప్నోతి సంవత్సర శతాని షట్‌ || 13

అగ్రభక్తం నరోదత్వా నిత్యమేవ తథా గవామ్‌ | మాసషట్కేన లభ##తే నాకలోకం సమాయతమ్‌ || 14

సాయం ప్రాత ర్మనుష్యాణా మశనం దేవ నిర్మితమ్‌ | తత్రైవ మశనం దత్వా గవాం నిత్య మతంద్రితః || 15

ద్వితీయం య స్సమశ్నాతి తేన సంవత్సరాన్నరః | గవాం లోక మవాప్నోతి యావ న్మన్వంతరం ద్విజ! 16

గవాం ప్రచారే పానీయం దత్వా పురుష సత్తమః |

వారుణం లోక మాసాద్వ క్రీడత్యబ్ద గణా7యుతమ్‌ | పరాం తృప్తి మవాప్నోతి యత్ర యత్రా7భిజాయతే|| 17

గవాం ప్రచార భూమింతు వాహయిత్వా హలా7దినా | నరకం మహా దాప్నోతి యావదింద్రా శ్చతుర్ధశ || 18

గవాం పాన ప్రవృత్తానాం యస్తు విఘ్నం సమాచరేత్‌ | బ్రహ్మహత్యా కృతా తేన ఘోరా భవతి భార్గవః ||

సింహ వ్యాఘ్ర భయ తస్త్రాం పంక మగ్నా జలే స్థితామ్‌ || 19

గా ముద్ధృత్య నర స్స్వర్గే కల్ప భోగా నుపాశ్నుతే | గవాం యావస దానేన రూపవా నభిజాయతే || 20

సౌభాగ్యం మహదాప్నోతి లావణ్యంచ ద్విజోత్తమ! | ఔషధం చ తథా దత్త్వా విరోగ స్త్వభిజాయతే || 21

ఔషధం లవణం తోయమాహారం చ ప్రయచ్ఛతః | విపత్తౌ పాతకం నా7స్య భవత్యుద్బంధనా7దికమ్‌ || 22

వక్తవ్యతా దివాపాలే రాత్రౌ స్వామీ న తద్గృహే | తత్రా7పి తన్నియుక్తశ్చ కశ్చి దన్యో నచే ద్భవేత్‌ || 23

తాసాం చే దవిరుద్ధానాం చరన్తీనాం మిథో వనే | యచా ముత్పత్య వృకో హన్యా న్న పాల స్తత్ర కిల్బిషీ || 24

సంరుద్ధాసు తధైవా7సు వృకైః పాలే త్వనాయతి | యా ముత్పత్య వృకో హన్యాత్‌ పాలే తత్కిల్బిషం భ##వేత్‌ || 25

గోవధేన నరో యాతి నరకా నేక వింశతిమ్‌ | తస్మాత్సర్వ ప్రయత్నేన కార్యం తాసాంతు పాలనమ్‌ || 26

విక్రయాచ్ఛ గవాం రామ! న భద్రం ప్రతిపద్యతే | తాసాం చ కీర్తనా దేవ నరః పాపా ద్విముచ్యతే || 27

తాసాం సంస్పర్శనం ధన్యం సర్వ కల్మష నాశనమ్‌ | దానేన చ తథా తాసాం కులాన్యపి సముద్ధరేత్‌ || 28

ఉదక్యా సూతికో దోషో నైవ తత్ర గృహే భ##వేత్‌ | భూమి దోషా స్తథా7న్యే7పి యత్రైకా వసతేతు గౌః || 29

గవాం నిశ్వాస వాతేన పరాశాన్తి ర్గృహే భ##వేత్‌ | నీరాజనం తత్పరమం సర్వ స్థానేషు కీర్తితమ్‌ || 30

గవాం సంస్పర్శనా ద్రామ క్షీయతే కిల్బిషం నృణామ్‌ | గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌ || 31

ఏకరాత్రోపవాసంచ శ్వపాక మపిశోధయేత్‌ | పృధక్త్వ ప్రత్యయా7భ్యస్త మతి సన్తవనం స్మృతమ్‌ || 32

సర్వా7శుభ విమోక్షాయ పురా7చరిత మీశ్వరైః | ప్రత్యేకం చ త్ర్యహా7భ్యస్తం చా7తిసాంతపనం స్మృతమ్‌ || 33

సర్వ కామప్రదం రామ! సర్వా7శుభ వినాశనమ్‌ | కృచ్ఛ్రా7తి కృచ్చం పయసా దివసా నేక వింశతిమ్‌ || 34

నిర్మలాస్తేన చీర్ణేన భవన్తి పురుషోత్తమాః | త్ర్యహ ముష్ణం పిబే న్మూత్రం త్ర్యహ ముష్ణం ఘృతం పిబేత్‌ || 35

పుష్కరుడనియె: భృగునందన! రాజు గోరక్షణము సేయవలెను. గోవులు సాంగత్యముచే (కలిసిచరించుటచే) పవిత్రము సేయునవి. గోవులందు లోక ప్రతిష్ఠయున్నది లోకముయొక్క నిలుకడ గోవులపై నాధారపడియున్నది. గోవులు యజ్ఞముల కొనరించును. గోవులు విశ్వమాతలు. గోమూత్ర గోమయములలకక్ష్మీనాశనములు, పనిబూని వానిని సేవింపవలెను. వానియందు లక్ష్మీ ప్రతిష్ఠితమైయున్నది. తెలిసినవాడు వానియెడ నుద్వేగ పడగూడదు. (అసహ్యించుకొనరాదు) గోవులపై గోమూత్రములపై చీదరాదు, ఉమియురాదు, గోపాదధూళియలక్ష్మీనాశనము. విఘ్ననాశనముగూడ. మేడమేను గోకుట వలన సర్వపాపములు హరించును ఆవుకొమ్ములలోని జలము గంగాజలతుల్యము. గోవుమూత్రము గోమయము ఆవుపాలు పెఱుగు నెయ్యి గోరోచనము నునుషడంగము మంగళకరము. ఒకొక్కటి కుశోదకము వేర్వేర స్నావమునకు పానీయముగను పరమ పవిత్రము. ఇది రక్షఃపిశాచ సంహారకము. మంగళ పదార్థము. కలిదుఃఖహరము, గోరోచనము రక్షోహరము. సర్వవిష రోగహరము. వేకువలేచి గోముఖమును నేతిలో దర్శించినవాని కలక్ష్మి నశించును. అలక్ష్మియన పెద్దమ్మ. దారిద్ర్యము పాపమడగును. గోవులకు గ్రాసము (మేత) పెట్టిన మహాపుణ్యమందును. ఇంటనెన్ని గోవులను ధరింపగల డన్నింటిని ధరింపవలెను. వానినాకలితో మాత్రము నిలుపరాదు. ద్విజునింట గోవులు దుఃఖించుచుండు నాతడు నరకమందును. ఇందాలోచింపవలసిందిలేదు. ఇతరుని గోవునకు మేతవెట్టన గల్గు పుణ్యమపరిమితము. శిశిర ఋతువులో (మాఘ పాల్గుణ మాసమందు ఇంకొకరి గోవునకు గ్రాసముపెట్టిన యతడు వందలకొలది యేండ్లు స్వర్గముం బొందును. అగ్ర భక్త మును (తొలిముద్దను) ఆరు మాసములు గోవునకుబెట్టిన యితడు పదివేలేండ్లు స్వర్గముం జూరలాడును. సాయంప్రాతః కాలములందు మానవుల కాహారము దేవనిర్మితము. అట్టియాహార మొక్క సంవత్సరము తొలుత గోవులకుబెట్టి రెండవదితిన్నవాడు మన్వంతరకాలము గోలోకమునందుండు. గోవులు సంచరించుచోట పానీయవసతి (నీళ్లయేర్పాటు) సేసినపుణ్యుడు పదివేలేండ్లు వరుణలోకమంది విహరించును.మరియు జన్మమెత్తిన చోటనెల్ల పరమతృప్తినందును. గోవులు స్వేచ్ఛగా నిర్భాధకముగా సంచరించి మేత మేయుటకు వదలబడిన భూమిని నాగలి మొదలగువానిచే దున్నినవాడు పదునాల్గింద్రులకాలము నరకమొందును ప్రభువులగ్రహారాది దానములు చేసినపుడు విశాలములైన ప్రాంతములను గోవుల ప్రచారమునకు మేతకు వదలెడువారు. దానికి గోభూమియని పేరు ప్రసిద్ధము. దాని నాక్రమించి ప్రక్కపొలములలో గలుపుకున్నవాండ్రకు మహాపాపమని జెప్పబడినది. ఆవులు నీరు ద్రావుచుండ నంతరాయము గలిగించినవాడు ఘోరమైన బ్రహ్మహత్యాపాపమునకు గురియగును. సింహవ్యాఘ్రాదులనుండి నీటినుండి బురదనుండి గోవునుద్ధరించిన వాడా కల్పాంతము స్వర్గభోగములందును. గోవులకుగడ్డిపెట్టుట వలన రూపసాభాగ్యలావణ్యములు గలవాడగును. ఔషధము ఉప్పునీరు మేతనుబెట్టిన యతడు మరణించినపుడు పాతకము తన్నిమిత్తమైన నరకబంధమును నుండవు. పగలు గోవునకు ప్రమాదమేని సంభవించిన నాపాపము ఆలకాపరిదని చెప్పవలెను. ఆగోవున్న యింట యజమాని గోరక్షణ వెల కొకని నేర్పరచి యుండనిచో రాత్రియా గోవునకు జరుగు ప్రమాదమువలన పాపము గృహయజమానికి లోకుండబోదు. గోవులు తమంత గుమ్ముకొనక యడవిలో సంచరించు చున్న తరి తోడేలువానిపై కురికి చంపినచో నా పాపము గోపాలునకురాదు. ఆవులను రాటకు గట్టినతరి ఆలకాపరిరాని సమయములో తోడేలు గోవుపైబడి చంపినచో నా పాపము గోపాలునికి వచ్చును. నరుడు గోవుంజంపిన నిరువదియొక్క నరకముల ననుభవించును. గావున సర్వప్రప్రయత్నమున గోవులను రక్షింపవలెను. గోవులనమ్ముటగూడ శుభము గలుగదు. గో సంకీర్తన మాత్రమున నరుడు పాపమువాయును. గోవులను స్పృశించిన ధన్యత గల్గును. సర్వపాపములనది హరించును. గోదానము పెక్కుతరములనుద్ధరించును. ఒక్కగోవింటనున్న ముట్టు పురుడు దోష మాయింట గలుగదు. మరియు భూమిదోషములేవియుం గల్గవు గోవుల నిశ్శ్వాస వాయువు వలన (ఊపిరివలన) పరమగృహశాంతి యగును. సర్వస్థానములందు గోవులకు నీరాజనమిచ్చుట పరమోత్తమమని కీర్తింపబడినది. గోవుల స్పర్శవలన పాపము పోవును. గోమూత్రము గోమయము పాలు పెరుగు నెయ్యి కుశోదకము ఏకరాత్రోపవాసమనునవి కుక్క మాంసముదిన్న పాతకమునేని హరింపగలదు. పృథక్త్వప్రత్యయాభ్యస్త అతిసంతపనమనబడును. సర్వాశుభవిముక్తి కల్గుటకు దానిని మహానుభావులు మున్నుజేసినారు. ప్రత్యేకముగా మూడు రోజలు చేసిన యా యభ్యాసము అతి సాంతపనమన బడినది. అది సర్వకామప్రదము. సర్వాశుభ వినాశము. కృచ్ఛము అతికృచ్ఛమునకు వ్రతము కేవలము పాలతోనిరువదియొక రోజు లాచరించిన పుణ్యులు నిర్మలురై పురుషపుంగవు లగుదురు. మూడురోజులు వేడిగో మూత్రమును ద్రావవలెను.

త్ర్యహ ముష్టం పయః పీత్వా వాయుభక్షః పరం త్ర్యహమ్‌ | తప్త కృచ్ఛ్ర మిదం ప్రోక్తం సర్వా7శుభ వినాశనమ్‌ || 36

శీతకృచ్ఛ్ర స్తథైవైషః క్రమా చ్ఛీతైః ప్రకీర్తితః | సర్వా7శుభ వినాశాయ నిర్మితో బ్రాహ్మణా స్వయమ్‌ || 37

గోమూత్రేణ చరేత్‌ స్నానం వృత్తిం కుర్యాత్తు గోరసైః | ఉత్థితసూత్థిత స్తిష్ఠే దుపవిష్టాసు నా స్థితః || 38

అభుక్త వత్సు నా7శ్నీయాత్‌ అపీతాసు చ నో పిచేత్‌ | త్రాణం తు రామ కృత్వైవ తథా దేవే ప్రవర్షతిః || 39

త్రాణం నైవాత్మనః కార్యం భయార్తాంశ్చ సముద్ధరేత్‌ | ఆత్మానపి సంత్యజ్య గోవ్రతం తత్ప్ర కీర్తితమ్‌ || 40

సర్వపాప పశమనం మాసేనైకేన భార్గవ! | వ్రతేనా7నేన చీర్ణేన పావనం పురుషో వ్రజేత్‌ || 41

అభీష్ట మథవా రామ! యావదింద్రా శ్చతుర్దశ | గవాం నిర్హార నిర్ముక్తా నశ్నన్‌ ప్రతిదినం యవాన్‌ 42

మూడురోజులు వేడి గోక్షీరము త్రావి యామీద మూడురోజులు వాయుభక్షణము సేసిన (గాలిమాత్రముగొననది) తప్త కృచ్ఛమనబడును. సర్వాశుభ వినాశనము. మూడవ రోజున చెప్పిన గోమూత్రాదులను చల్లనివానిని సేవించిన శతకృచ్ఛవ్రతమనబడును. ఇది బ్రహ్మ యేర్పరచినది. గోమూత్రముతో స్నానము చేయవలెను. గోరసముతో వృత్తిని (ప్రాణధారణమును) జేయవలెను. గోవునిలిచిన దాను నిలువవలెను. గోవులుకూర్చుండిన కూర్చుండవలెను. అవి మేతదిననంతసేపు దానాహారము తినరాదు. అవి నీరు ద్రవానిచో దాను ద్రావరాదు. భగవంతుడు వర్షము కురిపించుచుండ గోవులను రక్షింపకుండా తాను రక్షణపొందరాదు. భయార్తయైన గోవును తన ప్రాణమునకైన తెగించి కాపాడవలెను. ఇదే గోవ్రతమని పొగడందినది. ఒక్క మాసము ఘనమైన ఈగోవ్రతమును జరించినవాడు గోలోకమున. కేగును లేదా పదునల్గు రింద్రుల కాలమభీష్టములను బడయును. గోవుతినగా మిగిలిన యవలను ప్రతిదినము యొక్క మాసము దిన్న యత డేది మనసు పడు నది పొందును.

మాసేన తదవాప్నోతి యత్నించిన్మనసేచ్ఛతి | గోమతీం చ తథా విద్యాం సాయం ప్రాత స్థతా జపన్‌. 43

గోలోక మాప్నోతినరో నా7త్రకార్యా విచారణా | ఉపర్యుపరి సర్వైషాం గవాం లోకః ప్రకీర్తితః || 44

నివసన్తి సదా యత్ర గావ స్త్వాకాశగా దివి | విమానేషు విచిత్రేషు వృతే ష్వప్సరసాం గణౖ || 45

కింకిణీ జాల ఛత్రేషు వీణా మురజనాదిషు | సదా కామజలా నద్యః క్షీరపాయస కర్దమాః || 46

శీతలా7తుల పానీయాః సువర్ణసికతా స్తథా | పుష్కరిణ్యః శుభా స్తత్ర వైడూర్య కమలోత్పలాః || 47

మానసే చ తథా సిద్ధిః తత్ర లోకే భృగూత్తమ! | తం చ లోకం నరాయన్తి గవాం భక్త్యా న సంశయః || 48

గోమతీం కీర్తయిష్యామి సర్వపాప ప్రణాశినీమ్‌ | తాం తు మే వదతో విప్ర! శృణుష్వ! సుసమాహితః || 49

గావ స్సురభయో నిత్యం గావో గుగ్గులు గంధికాః || గావః ప్రతిష్ఠా భూతానాం గావ స్స్వస్త్యయనం పరమ్‌ || 50

అన్నమేవ పరం గావో దేవానం హవి రుత్తమమ్‌ | పావనం సర్వభూతానాం రక్షన్తి చ వహన్తి చ || 51

హవిషా మన్త్రపూతేన తర్పయాన్త్యమరాన్‌ దివి | ఋషీణా మగ్నిహోత్రేషు గావో హోమే ప్రయోజితాః || 52

సర్వేషా మేవ భూతానాం గావశ్శరణ ముత్తమమ్‌ | గావః పవిత్రం పరమం గావో మంగళ మత్తమమ్‌ || 53

గావ స్వర్గస్య సోపానం గావో ధన్యా స్సనాతనాః | (ఓం) నమోగోభ్య శ్శ్రీమతీభ్య సౌరభేయీభ్య ఏవ చ || 54

గోమతియను విద్యను (మంత్రమును) సాయం ప్రాతేర్వేళల జపించినపుణ్యాత్ముడు గోలోకమందును. అన్ని లోకములపై పైని గోలోకమున్నది. అందాకాశమున కేగిన గోవులు నివసించిను. చిరుగంటలతో వింతగొల్పు విచిత్ర విమానములు యందప్సరోగణములతో గూడి వీణామురజాది మంగళ వాద్యములు మ్రోయుచుండు నాగోలోకమున విహరించును. అక్కడ చల్లని చక్కని స్వచ్ఛములయిన జలములు బంగారుసైకతము (ఇసుక) వైడూర్య రత్నములయిన కమలములు కలువలు గల శుభకరములైన పుష్కరిణులుండును. అందే పుణ్యలు విహరింతురు. ఆలోకమందు సర్వకార్యసిద్ధియు మనస్సు చేతనే గోభక్తిచే నాగోలోకమునకు పుణ్యులేగుదురు. గోమతి యను మంత్రము సర్వపాప ప్రణాశినిం గీర్తించెద. దానినో విప్రోత్తమ! రామా! శ్రద్ధయై నాలింపుము. గోవులు సురభులు. సువాసన భరితలు. నిత్యము గుగ్గులు పరిమళము నించునవి. గోవులు భూతప్రతిష్ఠములు. (సర్వభూతాధారములు) ఆవులు పరమ మంగళ స్థానములు. దేవతలకు గోవులు పరమాన్నములు. పరమోత్తమ హవిస్సులు. గోవులు సర్వభూతపావనములు. రక్షకములు ధారకములు. మంత్ర పూతమైన హవిస్సుచేత దేవతలను సంతర్పితుల నొనరించును. ఋషుల యగ్నిహోత్రములందు హోమములందు గోవు లుపయోగింపబడును. సర్వభూతములకు గోవులు సర్వోత్తమ శరణములు. గోవులు పరమపవిత్ర పరమోత్తమ మంగళములు. గోవులు స్వర్గసోపానము. ఆవులు సనాతములు. ధన్యములు. శ్రీమతులయిన గోదేవతలకు నమస్కారము. సౌరభేయులకు వందనము.

నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః | బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విథా స్థితమ్‌ || 55

ఏకత్ర మంత్రా స్తిష్ఠంతి హవి రేవా7త్ర తిష్ఠతి | దేవబ్రహ్మణ గోసాధు సాధ్వీభి స్సకలంజగత్‌ || 56

ధార్యతే వై సదా తస్మా త్సర్వే పూజ్యతమా స్సదా |

యత్ర తీర్థే సదా గావః పిబన్తి తృషితా జలమ్‌ | ఉత్తరన్తీ పథా యేన స్థితా తత్ర సరస్వతీ || 57

గవాం హీ తీర్థే వసతీహ గంగా | పుష్టి స్తథా తద్రజసి ప్రవృద్ధా |

లక్ష్మీః కరిషే ప్రణతౌ చ ధర్మః | స్తాసాం ప్రణామం సతతం చ కుర్యాత్‌ || 58

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే గోమహాత్మే గోమతీ విద్యానామ ద్విచత్వారింశో7ధ్యాయః.

బ్రహ్మకూతుండ్రకు నమస్కారము. పవిత్రమూర్తులకు నమస్కారము. నమస్కారము. బ్రాహ్మణులు, గోవులు ననుపేర నొక్కటే కులము (కుటుంబము) రెండుగానున్నది. ఒక చోటమంత్రములున్నవి. ఇంకొకచోట హవిస్సున్నది. దేవ బ్రాహ్మణ గోసాధు సాధ్వీమ తల్లులచే సకల జగమ్ము సదా ధరింపబడుచున్నది. అందు వలన నీయందరు పరమ పూజ్యులు. ఏ తీర్థమందు గోవులు దప్పికగొని యేవేల నీరుద్రావును, అవియేదారి వెంట ముందునకు జనునక్కడ సరస్వతి యుండును. గోతీర్థమందిక్కడనే గంగ వసించును. అట్లే గోపాదధూళియందు పుష్ఠి సమృద్ధముగనుండును. గోమయ కరీషమున (పిడక యందు) లక్ష్మీ యున్నది. గోవు నెడ చేయు ప్రణతి యందు నమస్కారమందు ధర్మమున్నది. ఆ గోదేవతా మాతలకు సతతము ప్రణామము సేయవలెను.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున గోమతీ విద్యయను నలుబదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters