Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదియొకటవ యధ్యాయము - సావిత్రీవ్రతసమాప్తి - వ్రతసాఫల్యము

పుష్కరః- సావిత్రీ చ తత స్సాధ్వీ జగామ వరవర్ణినీ | యథాయథా గతేనైవ యత్రా7సౌ సత్యవాన్‌ మృతిః || 1

హస్తమాసాద్య భర్తారం తస్యోత్సంగ గతం శిరః | కృత్వా వివేశ తన్వంగీ లంబమానే దివాకరే || 2

సత్యవానపి నిర్ముక్తో ధర్మరాజ్ఞా శ##నై శ్చనైః | ఉన్మీలయతి తే నేత్రే ప్రస్పందత చ భార్గవః || 3

తతః వ్రత్యాగత ప్రాణః ప్రియాం వచన మబ్రవీత్‌ | క్వా7సౌ ప్రయాతః పురుషోయోమా మాకృష్య గచ్ఛతి || 4

జానామి న వరారోహేః కశ్చా7సౌ పురుషశ్శుభే! వనే7స్మిన్‌చారు సర్వాంగి! సుప్తస్య చ చిరం గతమ్‌ || 5

ఉపవాస పరిక్లాంతా కర్శితా భవతీ మయా | అస్మాద్దుర్హృదయేనా7ద్య పితరౌదుఃఖితౌ తథా || 6

ద్రష్టు మిచ్ఛామ్యహం సుభ్రు! గమనే త్వరితా భవ! | సావిత్రీ-ఆదిత్యో7స్త మనుప్రాప్తో యదితే రుచితం ప్రభో! || 7

ఆశ్రమం తు ప్రయాస్యావః శ్వశురౌ తప్యతో మమ | యథావృత్తం చ తత్రైవ తవ వక్ష్యామ్యథాశ్రమే || 8

పుష్కరః- ఏతావ దుక్త్వా భర్తారం సహభర్త్రా య¸° తదా | ఆససాదా7శ్రమం చైవ సహభర్త్రా నృపాత్మజా || 9

పుష్కరుడనియె: సాధ్వి సావిత్రి తావచ్చిన దారిని మృతుడై సత్యవంతుడున్న చోటికేగెను. ఏగి భర్త శిరమును దన యొడినుంచికొని సూర్యాస్తమయమం దట గూర్చుండెను. పరశురామా! సత్యవంతుడను ధర్మరాజుచే విముక్తుడై మెలమెల్లన కన్నులు దెరచెను. కదలెను గూడ. అవ్వల ప్రాణము రాగా ప్రయపత్నింగని యిట్లనియె ఏడీ! ఎటువోయినాడా పురుషుడు నన్ను లాగికొని పోయినవాడు? రమణీ! కల్యాణి! ఈ పురుషుడెవ్వడో యెరుంగను. ఓసర్వాంగసుందరి! ఈ యడవిలో నిద్రవోయి చాలా సేపయినది. ఉపవాస వశమున మిగుల డస్సితిని. నాచే జాల బాధింప బడితివి. ఈ దుష్టహృదయునిచే తలిదండ్రులెంతో యేడిపింపబడిరి. వారిం జూడ గోరెద. వెళ్ళుదము, త్వరపడుము. అన సావిత్రి, సూర్యుడస్తమించెను, స్వామీ! నీకభిమతమేని యాశ్రమమునకు జనుదము నా అత్తమామలు పరితామపడుచుందురు. ఇట జరిగినదెల్ల అక్కడనే యాశ్రమమునుందు తెలిపెదను. అని పలికి, యానృపాత్మజ భర్తతో నయ్యాశ్రమముంజేరెను.

ఏతస్మిన్నకాశేతు లబ్ధచక్షు ర్మహీపతిః | ద్యముత్యేనః సభార్యస్తు పర్యతప్యత భార్గవ! || 10

సావిత్ర్యపి వరారోహా సహ సత్యవతా తదా | వవందే తత్ర రాజానం సభార్యం భృగునందన! | 11

పరిష్వక్త స్తదా పిత్రా సత్యవాన్రాజనందనః | అభివాద్య తత స్సర్వాన్‌ వనే తస్మిన్‌ తపోధనాన్‌ || 12

ఉవాస తాం తదా రాత్రి మృషిభిః సహ ధర్మవిత్‌ | సావిత్ర్యపి జగాదా7థ యథావృత్త మనిందితా || 13

వ్రతం సమాపయామాస తస్యామేవ తదానిశి | తతస్తు రామ! రాత్ర్యన్తే శాల్వేభ్య స్తస్య భూపతేః || 14

ఆజగామ జన స్సర్వో రాజ్యా7ర్థాయా నిమంత్రణ | ఆజ్ఞాపయామాన తదా తథా ప్రకృతి శాసనమ్‌ || 15

విచక్షుషస్తే నృపతే ! యేన రాజ్యం పురా హృతమ్‌ | ఆమాత్యై స్సహ భోక్తవ్యం రాజ్యమస్తు పురే నృప ! 16

ఏతచ్ఛ్రుత్వా య¸° తత్ర బలేన చతురంగిణా | లేభే చ సకలం వాక్యం ధర్మరాజ్ఞో మహాత్మనః || 16

భ్రాతౄణాం చ శతం లేభే సావిత్ర్యపి వరాంగనా | ఏవం పతివ్రతా సాధ్వీ పితృపక్షం నృపాత్మజా || 17

ఉజ్జహార వరారోహా భర్తృపక్షం తథైవ చ | మోచయామాస భర్తారం మృత్యుపాశ వశీకృతమ్‌ || 19

తస్మాత్సాధ్వ్యః స్త్రియః పూజ్యా స్సతతం దేవవ జ్జనైః | తాసాం రామ! ప్రసాదేన ధార్యతే వై జగత్త్రయమ్‌ || 20

తాసాం న వాక్యం భవతీహ మిథ్యా | న జాతు లోకేషు చరా7చరేషు |

తస్మా త్సదా తాః పరిపూజనీయాః | కామా న్సమగ్రా నభికామయానైః || 21

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే సావిత్రీ వ్రత సమాప్తిర్నామ ఏకచత్వారింశో7ధ్యాయః.

ఈలోన ద్యుమత్సేనరాజు కన్నులు రాగా భార్యతో పరితాపపడుచుండెను. సావిత్రియు సత్యవంతునితో గూడచని రాజునకు భార్యకును వందనములు చేసెను. అంతట నా రాజనందనుడు తండ్రిచే కౌగిలించుకొనబడి యావనమందలి తపోధనుకలందరకు నభివాదముసేసి ధర్మజ్ఞుడా రాకుమారుడారాత్రి ఋషులతో గూడ వసించెను. పరమపవిత్ర సావిత్రి జరిగినదెల్ల నివేదించెను. నిరాహారాదివ్రతము నారాత్రియే సమాప్తి చేసెను. అవ్వల తెల్లవారగనే శాల్వదేశములనుండి యారాజుయొక్క ప్రజలందరు రాజ్యము నిమిత్తము రమ్మని పిలువవచ్చిరి. రాజ్య ప్రకృతులను (ప్రజలను) శాసింపుమని విన్నవించిరి. ప్రభూ! కన్నులులేమి నింతమున్ను రాజ్యముహరింపబడినది. కావున నిప్పడు మంత్రులతో నీరాజధానినుండి నీవు రాజ్యమనుభవింప వలసిన దనువారి మాటవిని చతురంగ బలముతో నగర ప్రవేశము సేసి యమధర్మరాజు వాక్యానుసారము సర్వమునుం బొందెను. సావిత్రి నూరుగురుతమ్ములం బడసెను ఇట్లా మహాసాధ్వి తండ్రివైపు, భర్తవైపు, రెండు కుటుంబముల నుద్ధరించు కొనినది. మృత్యుపాశవశుడైన భర్తను విముక్తుని జేసికొనెను. అందువలన జనులు సతతము దేవతలట్లు పతివ్రతలు పూజ్యలు. వారి యనుగ్రహముచేతనే రామా! ముల్లోకములు ధరింపబడుచున్నవి పరమ సాధ్వులమాటెన్నడు పొల్లువోదు. చరాచర లోకములంరు సంపూర్ణకామములనభలషించువారు వారిం బూజి పవలయును.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమ ద్వితీయఖండమున సావిత్రీవ్రత సమాప్తి వ్రత సాఫల్యము నను నలుబదియొకటవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters