Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది తొమ్మిదవ యధ్యాయము - తృతీయవరలాభము

ధర్మో హి దైవతం స్త్రీణాం పతిరేవ పరాయణమ్‌ | అనుగమ్యః స్త్రియాసాధ్వ్యా పతిః ప్రాణ ధనేశ్వరః || 1

ధర్మా7ర్జనే సుర శ్రేష్ఠ ! కుతో గ్లానిః కుతః క్లమః | త్వత్పాదమూల మేవేదం పరమం ధర్మకారణమ్‌ || 2

ధర్మార్జనం సదా కార్యం పురుషేణ విజానతా | తల్లాభః సర్వలాభేభ్యో యతో దేవ! విశిష్యతే || 3

ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రివర్గం జీవతః ఫలమ్‌ || ధర్మహీనస్య కామార్థౌ వంధ్యాసుత సమా వుభౌ || 4

ధర్మాదర్థ స్తథా కామో ధర్మాల్లోక ద్వయం తథా | ధర్మ ఏకోనుయాత్యేనం యత్రకుత్ర య గామినమ్‌ || 5

శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్ఛతి | ఏకో హి జాయతే జన్తు రేక ఏవ విపద్యతే || 6

ధర్మస్తమనుయా త్యేకో న సుహృన్న చ బాంధవాః | రూపసౌభాగ్య లావణ్యం సంపద్ధర్మేణ లభ్యతే || 7

బ్రహ్మంద్రో పేంద్ర శ##ర్వేంద్ర యమార్కాగ్న్యని లాంభసామ్‌ | వస్వశ్విధనదా ద్యానాం యేలోకాః సర్వకామదాః ||

ధర్మేణ తా నవాప్నోతి పురుషః పురుషాన్తక! | మనోహరాణి ద్వీపాని వర్షాణిసుసుఖాని చ || 9

ప్రయాన్తి ధర్మేణ నరాస్తథైవా మరతామితాః | నందనాదీని ముఖ్యాని దేవోద్యానాని యాని చ || 10

తాని పుణ్యన లభ్యన్తే నాకపుష్ఠం తథా నరైః | విమానాని విచిత్రాణి తథైవా ప్సరస శ్శుభాః || 11

తైజసాని శరీరాణి సదా పుణ్యవతాం ఫలమ్‌ | రాజ్యం నృపతి పూజా చ కామసిద్ధి స్తథేప్సితా || 12

ఉపస్కరాణి ముఖ్యాని ఫలం పుణ్యస్య దృశ్యతే | రుక్మ వైడూర్య దండాని చంద్రాంశు సదృశాని చ || 13

చామరాణి సురాధ్యక్ష ! భవన్తి శుభ కర్మణామ్‌ | (పూర్ణేందు మండలాభేన రక్తాంశుక సితే న చ || 14

ధార్యతాం యాన్తి ఛత్రేణ నరః పుణ్యన కర్మణా) | జయ శంఖస్వనా దేవ సూతమాగథ నిస్వనమ్‌ || 15

వరాసనం స భృంగారం ఫలం పుణ్యస్య కర్మణః | వరాన్నపానం గీతం చ నృత్యమాల్యానులేపనమ్‌ || 16

రత్నవస్త్రాణి ముఖ్యాని ఫలం పుణ్యస్య కర్మణః | రూపోదార్యగుణోపేతాః స్త్రియశ్చాతి మనోహరాః || 17

సావిత్రియనియె: స్త్రీలకు ధర్మము దైవము. భర్త పరమ దైవము. అంగన ప్రాణములను ధనములకు ప్రభువకు భర్తననుసరించి యుండవలెను. ధర్మ సంపాదన మందు దుఃఖము శ్రమయును దోపవు. నీపాద మూలమిదియే పరమధర్మ కారణము. ఎరిగిన మానవుడు ధర్మసంపాదన మెడతెగకుండ చేయవలెను. అన్ని లాభముకంటె ధర్మలాభ మెక్కువది. ధర్మ-అర్థ-కామములు త్రివర్గ మనబడును. అదియే జీవిత ఫలము. ధర్మహీనుని కర్థకామములు గొడ్రాలి సంతానమట్టివి. అనగా శూన్యములన్నమాట. ధర్మము వలననే కామము ధర్మమువలన ఇహపరలోకములుం గల్గును. ఈ జీవుడెటువోయినను ధర్మమొక్కటియే యాతని వెంటజనును. శరీరముతో బాటు మిగత దంతయు నాశమగును. జంతువొక్కడుగానే పుట్టును. ఒక్కడుగానే గిట్టును. వానిని వెంబడించునది యొక్క ధర్మమేగాని స్నేహితుడుగాని చుట్టాలుగారు. రూపము సౌభాగ్యము లావణ్యము సంపత్తు ధర్మముచేతనే లభించును. బ్రహ్మేంద్రో పేంద్ర శంభు చంద్రయమ, సూర్యాగ్ని వాయు జల వసు అశ్విన కుబేరాదుల లోకములు సర్వకామప్రదము లేవి గలవో పుణ్యలోకములనన్నింటిని పురుషుడు ధర్మము చేత బొందును. సుసుఖములయిన మనోహరమైన ద్వీపములను వర్షములను గూడ దానిచేతనే. ఇటనుండి ధర్మనిష్ఠులు చనిపొందుదురు. నందనాది దేవోద్యానములు ముఖ్యతిముఖ్యములు పుణ్యముచేతనే లభించును స్వర్గము దాననే నరుడందును. విచిత్ర విమానములు చక్కని యప్సరసలు తేజోవయవశరీరములు పుణ్యవంతుల పుణ్యఫలములు. రాజ్యము రాజువలన పూజ, కామసిద్ధి, ముఖ్యములైన భోగోపకరణములను, పుణ్యము యొక్క ఫలములుగా గనబడుచున్నవి. స్వర్ణవైడూర్య దండములు, చంద్రకిరణములట్టి చామరములు, శుభ కర్ములకు లభించును. అనగా మహారాజు యోగము పుణ్యఫలమన్నమాట. పూర్ణ చంద్రబింబమట్టిది రక్తవస్త్రాలంకృతము కేవలము తెల్లదియునగు వెలిగొడుగు పైని జెప్పిన మహారాజ చిహ్నములు పుణ్యశీలురకు ధరింపనైనవగును. జయజయ శంఖనినాదములతో వందిమాగధగానములతో భద్రాసనము, బంగారుగిండియు, పుణ్యకర్మఫలములు మృష్టాన్న పానములు, గీతము, నృత్యము, సుమమాలలు, సుగంధానులేపనములు, రత్నములు, అమూల్యవసనములు, పుణ్యకర్మ ఫలములు రూపౌదార్యాది లక్షణవతు లతిమనోహరిణు లంగనామణులు పుణ్యవంతులకు లభింతురు.

వాసః ప్రాసాద పృష్ఠేషు భవన్తి శుభకర్మణామ్‌ | సువర్ణ కింకిణీ మిశ్ర చామరాః పీఠధారిణః || 18

వహన్తి తురగా దేవ ! నరః పుణ్యన కర్మణా | హేమకక్షైః సమాతం గైశ్చల త్పర్వత సంనిభైః || 19

ఖేలాంఘ్రిపద విన్యా సైర్యాన్తి పుణ్యన కర్మణా | సర్వకామ ప్రదే దేవే సర్వాప ద్దురితాపహే || 20

వహన్తి భక్తిం పురుషా స్సదా పుణ్యన కర్మణా | తస్య ద్వారాణి యజనం తపో దానం దయాక్షమా || 21

బ్రహ్మచర్యం చ సత్యం చ తీర్థానుసరణం శుభే! | స్వాధ్యాయ సేవా సాధూనాం సహవాసః సురానమ్‌ || 22

గురూణాం చైవ శుశ్రూషా బ్రహ్మాణానాం చ పూజనమ్‌ | ఇంద్రియాణాం జయశ్చైవ మార్దవం హ్రీ రమత్సరమ్‌ ||

తస్మాద్ధర్మ స్సదా కార్యో నిత్యమేవ విజానతా | న హి ప్రతీక్షతే మృత్యుః కృత మస్య న వా కృతమ్‌ || 24

బాల ఏవాచరే ర్ధర్మ మనిత్యం దేవ! జీవితమ్‌ | కోహి జానాతి కస్యాద్య మ్యత్యుః కేన భవిష్యతి || 25

వస తోప్యస్య లోకస్య మరణం పురతః స్థితమ్‌ | అమరస్యేవ చరిత మత్యాశ్చర్యం సురోత్తమ! || 26

యువత్వాపేక్షయా బాలో వృద్ధత్వాపేక్షయా యువా | మృత్యో రుత్సంగ మారూఢః స్థవిరః కిమపేక్షతే || 27

భువశ్శైలం సమారూఢః తతో వృక్షాగ్ర మాశ్రితః | తత్రాప్యవిందత స్త్రాణం మృత్యోర్భీతస్య కా గతిః || 28

న భయం మరణాద్దేవ! ప్రాణినా మధికం క్వచిత్‌ | తత్రాపి నిర్భయాః సన్తః సదా సుకృత కారిణః || 29

యమః - తుష్టోస్మి తే విశాలాక్షి! వచనై ర్ధర్మ సంగతైః | వినా సత్యవతః ప్రాణన్‌ వరం వరయ మా చిరమ్‌ || 30

సావిత్రీ - వరయామి త్వయా దత్తం పుత్రాణాం శత మౌరసమ్‌ | అనపత్యస్య లోకేషు గతిః కిల న విద్యతే || 31

యమః-కృతేన కామేన నివర్త భ##ద్రే! భవిష్యతీదం సఫలం త్వయోక్తమ్‌|

మమోపరోధశ్చ తవ క్లమఃస్యాత్‌ తథాధునా తేన తవబ్రవీమి || 32

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే సావిత్ర్యుపాఖ్యానే తృతీయ వరలాభో నామ ఏకోన చత్వారింశోధ్యాయః.

శుభకర్ములకు ప్రసాదములందు నివాస మేర్పడును. బంగారు రంగుల చామరములచే వీవబడును. పుణ్యకర్మునికి బంగారు జీనులతోడి గుఱ్ఱములు వాహనములగును. కదలుచున్న పర్వతములట్లుండు సవిలాస పద విన్యాసములుసేయు నేనుగుల యంబారియెక్కి పుణ్యాత్ములేగుదురు. పుణ్యకర్మ వశముననే మానవులు సర్వకామ ప్రదుడు సర్వాపత్పాపహరుడు నగు భగవంతుని యందు భక్తి గల్గియుందురు. ఆ భక్తిద్వారములు యజనము తపస్సు దానము దయ క్షమ (ఓరిమి) బ్రహ్మచర్యము సత్యము తీర్థ సేవనము స్వాధ్యయసేవనము సాధు సహవాసము దేవతార్చనము గురుశుశ్రూష బ్రాహ్మణపూజ ఇంద్రియజయము మార్దవము హ్రీ = సిగ్గు మచ్చరములేమియును. అందుచే తెలిసినవాడు నిత్యము ధర్మము సేయవలెను. చేసిన చేయని పనిం గూర్చి మత్యువు నిరీక్షింపదు. జీవతమనిత్యము. బాలుడే యయ్యు ధర్మము నాచరింపవలెను ఎపుడు మృత్యువగునో యెవ్వడెరుంగును? మృత్యువు చూచు చుండగనే లోకము కెదురనేయున్నది. అట్టియెడ అమరుడట్లు ప్రవర్తించుటత్యాశ్చర్యము. బాలుడు యువకుడుగావలెనను నపేక్షతో నుండును. యువకుడు వృద్ధుగనుగావలెనని కోరుచుండును. మృత్యువునొడిలో నున్నపుడిడింకేమికోరును? మృత్యువున కడలి భూమి నుండి కొండ యెక్కినాడు అక్కడ నుండి చెట్టుకొన లెక్కినాడు రక్షణ లభింపని వాని కింకేమి గతి? ప్రాణులకు మరణముకంటె యెక్కువ భయములేదు. అప్పడుకూడ నిర్భయులగువారు నిరంతరము పుణ్యమాచరించినవారు. అని సావిత్రి పలుక విశాలాక్షీ! నీధర్మసంహితములైన పలుకులకు సంతుష్టుడనైతిని. సత్యవంతుని ప్రాణములదక్క మరియొకవరము వెంటనే కోరుమన సావిత్రి నా కౌరసులు నూరుగురు కొడుకులు నీవనుగ్రహించిన నాకు గావలెనని కోరుచున్నాను. సంతానము లేనివారికి లోకమునందు గతిలేదుగదా! అన యన యముడు ఈ నీ సఫలమగు కోరికతో నో కల్యాణీ! ఈకమరలుము. నీ యన్నదది యెల్ల కాగలదు నన్ను వెంటాడుట మాత్రము నీకు శ్రమావహము. అందుచే నేనిపుడు చెప్పుచున్నాను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణము ద్వితీయఖండమున సావిత్ర్యుపాఖ్యానమున తృతీయవరలాభము నను ముప్పదితొమ్మిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters