Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పదియెనిమిదవ యధ్యాయము - సావిత్ర్యుపాఖ్యానము - ద్వితీయవరలాభము

సావిత్రీ - కుతః క్లమః కుతో దుఃఖం సద్భిస్సహా సమాగమే | సతాం తస్మాన్నమే గ్లాని స్త్వత్సమీపే సురోత్తమ! || 1

సాధూనాం వా7ప్యసాధూనాం సన్త ఏవ పరాగతిః | నైవా7సతాం నైవసతా మసన్తోనైవ చా 7త్మనః ||

విషా7గ్ని సర్వశ##స్త్రేభ్యో న తథా జాయతే భయమ్‌ | అకారణ జగద్వైరి ఖలేభ్యో జాయతే యథా || 3

సన్తఃప్రాణానపి త్యక్త్వా పరా7ర్థం కుర్వతే యథా | తథా7సన్తోఫి మనోజాః పరపీడాసు తత్పరాః || 4

త్యజత్త్యసూ నయంలోక స్తృణవ ద్యస్య కారణాత్‌ | పరోపధాన సక్తా స్తే పరలోకం తథా సతః || 5

నికాయేషు నికాయేషు పురా బ్రహ్మా జగద్గురుః | అసతా ముపఘాతాయ రాజానం కృతవాన్‌ స్వయమ్‌ || 6

చారైః పరీక్షయే ద్రాజా ధూర్తాన్‌ సమ్మార్జయే త్సదా | నిగ్రహం చా7సతాం కుర్యాత్సతు లోకజిదుత్తమః || 7

ధాన్య సంరక్షణా7ర్థాయ నిర్మార్‌ష్ట్రా కక్ష ముద్ధరన్‌ | యథా వర్ధయతే ధాన్యం వర్ధనీయా స్తథా ప్రజాః || 8

నిగ్రహేణా7సతాం రాజ్ఞా సతాం చ పరిపాలనైః | ఏతావదేవ కర్తవ్యం రాజ్ఞా స్వర్గ మభీప్సతా || 9

రాజకృత్యం హి లోకేషు నాస్త్యన్య జ్జగతీపతేః | అసతాం ని గ్రహాదేవ సతాం చ పరిపాలనాత్‌ || 10

రాజా7నుశాసితా తేషా మసతాం శాసితా భవాన్‌ | తేన త్వ మధికోదేపః దేవేభ్యః ప్రతిభాసి మే || 11

జగత్తు ధార్యతే సద్భిః సతామగ్ర్య స్తథా భవాన్‌ | తేన త్వా మభియాన్త్యా మే క్లమోదేవ న విద్యతే || 12

యమః- తుష్టో7స్మి తే విశాలక్షి ! వచనై ర్ధర్మ సంహితైః | వినా సత్యవతః ప్రాణాన్‌ వరంవరయ మాచిరమ్‌ || 13

సావిత్రీ - సహోదరాణాం భ్రాతౄణాం కామయామ శతం విభో! అనపత్యః పితా ప్రీతిం పుత్రలాభా త్ప్రయాతు మే ||

యమః- కృతేన కామేన నివర్త భ##ద్రే ! భవష్యతీదం సకలం తవోక్తమ్‌ |

మమోపరోధస్తవచ క్లమస్స్యాత్‌ | త్తథా7ధునాతేన తవ బ్రవీమి || 15

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే - సావిత్ర్యు పాఖ్యానే ద్వితీయ వరలాభో నామ అష్టత్రింశో7ధ్యాయః.

సావిత్రియమునితో, సురోత్తమ! సత్పురుష సమాగము మయినపుడు శ్రమయేమి? దుఃఖమేమి? నీ సన్నిధానమున నాకెట్టి శ్రమయులేదు. సాధువులకు ఆసాధువులకుగూడ సత్పురుషులే దిక్కు. మనస్సునకు అసత్పురుషులు దిక్కుగారు గాని మంచివారికి చెడ్డవారికి కూడా విషాగ్ని సర్వశస్త్రములచే గూడ భయముకల్గును. లోకమునకు శత్రువు లయిన దుష్టులవలన కలుగు భయము విషాగ్ని నర్ప శస్త్రములవలన కూడా భయము గలుగదు. సజ్జనులు ప్రాణములకై తెగించి పరోపకారము సేయునట్లు ఆసజ్జనులు పరపీడాతత్పరులగుదురు. దుష్టుడీలోకము కలుగవలెనను కారణమున ప్రాణములనెట్లు త్యజించునో పరోపకారశక్తులయిన సత్పుషులు పరలోకమును గూడ యంత సులభముగా త్యజింతురు. సత్పురుషులకు పరోపకారమే ప్రధానము గాని స్వర్గసుఖముగూడ యంతముఖ్యము గాదు. మున్ను బ్రహ్మ జగద్గురువు గావున ప్రతి సమాజమునందు దుష్టనాశనము కొఱకై స్వయముగా రాజును నిర్మించెను. రాజు ధూర్తులెవరో చారుల వలన నెరిగి వాండ్రను దుడిచి బెట్టవలెను. దుష్టశిక్షణము సేసిన రాజు పుణ్యలోకముల జయించును. ధాన్యము గాపాడుకొనుటకు కలుపుతీసి కసపూడ్చి ధాన్యవర్ధనము సేయవలెను. స్వర్గాభిలాషగల రాజు చేయవలసినదిదుష్ట నిగ్రహము శిష్టానుగ్రహము మాత్రమే. ఇంతకంటె రాజునకు మరికృత్యములేదు. ప్రజలకు రాజు శాసకుడు. ఆసజ్జన శాసకుడవునీవు. అందుచే నీవెల్ల దేవతలకంటే నధికుడవని నాకు తోచుచున్నది. సజ్జనులచే జగత్తు ధరింపబడును. అట్టి సజ్జనులకు నీవగ్రేసరుడవు. అందుచే నిన్ను వెంబడించుచున్న నాకేలాంటి శ్రమయు కనబడుటలేదు. అనవిని యముడు విశాలాక్షి! ధర్మసంకాశములైన నీవచనములచే సంతుష్టుడనైతిని. సత్యవంతుని ప్రాణములుతప్ప మరియొక వరము వెంటనే కోరుకొనుమన సావిత్రి నూరుమంది సోదరులుగావలెనని కోరుచున్నాను. మాతండ్రి సంతాన రహితుడు. పుత్రలాభమువలన నతడు ప్రీతినొందుగాక యన, యముడు నీ కోరిక నేను సఫలము చేసితిని. కల్యాణీ! నీపలికినదెల్ల కాగలదు. నన్ను వెండించుట శ్రమావహమగును. అందుచే నిపుడేను రావలదనుచున్నానని యనియె.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండము సావిత్ర్యుపాఖ్యామున ముప్పది యెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters