Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పదియేడవ యద్యాయము - సావిత్య్రుపాఖ్యానము

సత్యవాన్‌ - వనే7స్మిన్‌ షట్పదా7కీర్ణం సహకారం మనోహరమ్‌ | శ్రోత్రఘ్రాణ సుఖం పశ్య వసన్తే రతివర్ధనమ్‌ ||

వనే సపుష్పం దృష్ట్వైషా రక్తా7శోకం మనోహరమ్‌ | హసతీవ మనః సేర్ష్యం త్వామివా7యత లోచనే || 2

దక్షిణ! దక్షిణ నైతాం పశ్య రమ్యాం వనస్థలీమ్‌ | పుష్పితైః కింశుకైర్యుక్తాం జ్వలితామివ సప్రభైః || 3

సుగంధి కుసుమా7మోదీ వనరాజీ వినిర్గతః | కరోతి వాయు ర్దాక్షిణ్యా దావయోః క్లమనాశనమ్‌ || 4

అప్యుత్పల విశాలాక్షి ! కర్ణికారై స్సుపుష్పితైః | కాంచనైరివ భాత్యేషా వనరాజీ మనోహరా || 5

అతిముక్తలతా జాల రుద్ధమార్గ వనస్థలీః | పశ్యోచ్చైశ్చారు సర్వాంగి! కుసుమోత్కర భూషణాః || 6

మధుమత్తాళి ఝూంకార వ్యాజేన వరవర్ణిని ! | చాపయష్టిం కరోతీవ కామః పాంథ జిఘాంసయా || 7

పుల్లచంపక స ద్వక్త్రా పుంస్కోకిల వినాదినీ | విభాతి చారుతిలకా త్వమివైషా వనస్థలీ || 8

కోకిల శ్చూతశిఖరే మంజరీరేణు పింజరః | గదితైర్వ్యక్తతా మేతి కులీన శ్చేష్టితైరివ || 9

పుష్పరేణ్వును లిప్తాంగః ప్రియా మనుసరన్వనే | కుసుమాత్కుసుమం యాతి కూజన్‌ కామీ శిలీముఖః || 10

మంజరీం సహకారస్య కాంతా చంచ్వగ్రఖండితామ్‌ | స్వాదయత్యతిపుష్పే7పి పుంస్కోకిలయువాద్రుమే || 11

కాకః ప్రసూతాం వృక్షా7గ్రే సామిషా7గ్రేణ చంచునా | కాకీం సంపాయయత్యేషా పక్షాచ్ఛాదిత పుత్రకామ్‌ || 12

భూభాగం నిమ్న మాసాద్య దయితా సహితోయువా | నా7హారమపి చా7దత్తే కామీ కామం కపింజలః || 13

కలవింకస్తు విరుతైః సప్రియో విటపే స్థితః | ముహూర్ముహు ర్విశాలాక్షి ! ఉత్కంఠాయతి కామినః || 14

క్షుద్రశాఖాం సమా7రూఢం శుకో7యం కాంతయా సహ | భారేణ నమయన్‌ శాఖాం కరోతి సఫలామివ || 15

వనేభ పిశితా7స్వాద తృప్తో నిద్రాముపాగతః | శేతే సింహాయువా కాంతా చరణా7 వరణా7 ననః || 16

వ్యాఘ్రయోర్మిథునం పశ్య శైలకందర సంస్థితమ్‌ | యయో ర్నేత్ర ప్రభాలోకై ర్గుహాభిన్నేవ లక్ష్యతే || 17

సత్యవంతుడిట్లనియె. భామిని! ఈ వనమునందు తుమ్మెదలు ముసురుచున్న యీ మనోహరమైన వసంతమందు చెవులకు నాసికకు సుఖము కూర్చుచు నివ్వనాంతమందు రతివర్థనమైన యీ సహకారమును (తీయమామిడిచెట్టును) జూడుము. ఓ దక్షిణా! అందరియెడ సమాదరముగలదానా ! దక్షిణ దెసనున్నయీ రమ్యమైన వనప్రదేశము పుష్పించి ప్రభాభరితమైన కింశుకములతో (మోదుగులతో) నుద్దీపించుచున్నట్లున్నది. సుగంధికుసుమ వాసనలం బరవళించుచు నీ వనరాజియందు వీచు నీ వాయువు దాక్షిణ్యముచే దక్షిణమునుండి వచ్చు మలయమారుత మగుటచే) మన యెడలగల దయచేత మన శ్రమను వారించుచున్నది. నల్లగలువరేకులట్టి వెడదకనుగవ గలదాన ఈవనరాజి చక్కగ పూచిన కర్ణికార కుసుమములతో(కొండగోగులపూలతో)సువర్ణ కుసుమములట్లు మనోహరమగుచున్నది. ఓ సర్వాంగసుందరి! ఆతిముక్తలతాజాలములలుముకొని (అతిముక్తము = వంజులము నెమ్మి తినిశమనుతీగె) యడుగిడరాని యీ మహోన్నతములయిన వనస్థులుల ప్రోవులుపడిన పూవుల నెంతబాగున్నవి? చూడుము! తేనెలమత్తెక్కిన తుమ్మెదల ఝంకారముల వ్యాజమున మన్మథుడు పాంథులంజంప ధనుస్సంధానము సేయుచున్నాడా! యన్నట్లున్నది. వికాసమందిన నదరుగా కనిపించు సంపెంగపువ్వుల సంపంగిలాంటి ముఖముతో పుంస్కోకిల నినాదములతో నీ మాటలట్లున్న వనిశ్లేష. చక్కని తిలకములతో నిండి (బొట్టువులతో నవ్వుబువ్వులతో చక్కని బొట్టుబెట్టుకొన్న దియనిశ్లేష) నీవలె నీయీ స్థలి శోభిల్లుచున్నది. మామిడిచెట్టు కొనకొమ్మపై మామిడిపూల పుప్పొడింగ్రందుకొని మాటలచే నత్తికలవాడి చేష్టలంబోలే తేటతెల్లమగుచున్నది. గండుతుమ్మెద పూలపుప్పొడి మేనెల్ల బూసుకొని యివ్వన మందాడు తుమ్మెదను వెంబడించుచు (కామివలె) కాముకమై కూయుచు పూవునుండి పూవునకు జనుచున్నది. ఈ మగ కోకిల తీయమామిడి పూగుత్తిని తన ప్రేయసి కొనముక్కునం గొరుకబడిన దానిని పూలన్నియు రాలిపోయినను గూడ దానిని రుచిచూచుచున్నది. వృక్షాగ్రమందు పొదిగిన పిల్లలను ఱక్కలం గ్రమ్ముకొనుచున్న ఆడుకాకిని మాంసపుముక్క ముక్కుకొనం గొని (యా మాంసమును) ద్రావించుచున్నది. వయసులోనున్న కాముకమయిన కపింజలము = కౌజుపిట్ట యాడుపిట్టతో భూమికలుగునంజేరి మేతకైన పోకున్నది. కలవింక పక్షి (ఊరబిచ్చుక) మగనితో గొమ్మపై నిలిచి యూరక కూతలిడుచు నోవిశాలాక్షి! కాముకులకును తహతహ పుట్టుచున్నది. ఈ చిలుక పెంటి చిలకతో చిన్న కొమ్మపై కెక్కి బరువున నా కొమ్మ నూగించి వంచుచు దానిండ్లతోడి దానింగా గావించుచున్నది. ఆ చిలుక యొక పండువలె నందు శోభిల్లుచున్నదని తాత్పర్యము. ఒక సింహము యేనుగు మాంసముదిని తృప్తిగొని నిద్రనిచ్చి ఆడసింహము యొక్క చరణములను మొగము చాటుబెట్టుకొని నిద్రపోవుచున్నది. కాంతులొలకు కనుజూపులం గొండగుహ తెరచుకొన్నట్లు కనిపించుచున్నది. అదిగో చూడు మీ కొండబిలము నందున్న యీ పులుల జంటం గనుగొనుము.

అథ ద్వీపీ ప్రియాం లేఢి జిహ్వా7గ్రేణ పునః పునః | ప్రీతి మాయాతి మహతీం లిహ్యమానశ్చ కాంతయా | 18

ఉత్సంగ కృత మూర్థానం నిద్రాపహృత చేతసమ్‌ | జంతూద్ధరణతః కాంతం సుఖయత్యేవ వానరీ || 19

భూమౌ నిపతితా కాంతాం మార్జారీ దర్శితోదరా | నఖైర్దనై స్తుదత్యేషా న చ పీడయతే తథా || 20

శశకః శశికా చోభే సంసుప్తే పీడితే ఇమే | సంలీన గాత్రచరణ కర్ణైర్వ్యక్తి ముపాగతే || 21

స్నాతం సరసి పద్మాఢ్యే వారణం మదమన్ధరం | సంభాపయతి తన్వంగి ! మృణాల శకలైర్వశా || 22

కాంత పోత్ర సముత్ఖాతైః కాంతా మార్గాను సారిణీ | కరోతి కబలం ముసై#్తః వరాహీ పోతకాననే || 23

దృఢాంగసంధి ర్మహిషః కర్దమా7ర్ద్రత ర్వనే | అనువ్రజతి ధావన్తీం ప్రియాం బద్ధచతుష్కకః || 24

పశ్య! చార్వంగిః సారంగం త్వత్కటాక్షనిభం వనే | సభార్యాంమాం తు పశ్యన్తం కౌతూహలసమన్వితమ్‌ || 25

పశ్య! పశ్చిమ పాదేన రోహీ కండూయతే ముఖమ్‌ | స్నేహా7 ర్ద్రభావః కషతి భర్తా శృంగా7గ్ర కోటినా || 26

దాడిమే చమరీం పశ్య! సితవాలా మగచ్ఛతీమ్‌| అన్వాస్తే చమరః కామీ వీక్షతే మాం చ గర్వితః || 27

ఆతపే గవయః పశ్య! నివిష్టో భార్యయా సహ | రోమన్థ మాస్యే కుర్వాణః కాకం కకుది ధారయన్‌ || 28

ఈ పులి నాల్క కొనతో నాడు పులిని మరిమరి నాకుచున్నది. దానిచే నాకబడి యెనలేని ప్రీతింబొందుచున్నది. ఆడుకోతి తన యొడిలో దలవెట్టి నిద్రపోవచు మైమరచియున్న జంతువును కోతిపిల్ల నెత్తివైచి తనకాంతుని సుఖింపజేయు చున్నది. ఆడుపిల్లి భూమిపైపడి కడుపు చూపుచు మగపిల్లిని గోళ్లచే దంతములచే గీరుచున్నది. కాని బాధ కల్గించుటలేదు. కుందేలు ఆడుశకము నీరెండునొండొంటిని గౌగిలించుకొని కాళ్ళు మేనులు నొదిగించుకొని యుండి చెవులచేత మాత్రము తెలియ వచ్చుచున్నవి. తామరపూల కొలనిలో స్నానమాడిన మదమంథరమైన మగయేనుగు నాడేనుగు తామర తూడుతునుకల గోలించుచున్నది. మగపంది ముట్టెతో బెల్లగింప గరిక దుంపలతో నాడుపంది పందిపిల్లల నోట కబలమును సమకూర్చుచున్నది. గట్టి శరీర సంథులుగల దున్నపోతు రొంపిచే నొడవెల్ల దడిసి యీవనమందు ప్రియురాలైన గేడెను వెంబడించుచు నలుదారుల కూడలిని బంధించుచున్నది. దారిలేకుండ జేయుచున్నరి. సుందరాంగి! నీ కటాక్షములం బోలిన నీలెడి పెంటిలేడితో నీతో నున్న నావంక వేడుకయై చూచుచున్నది. యిదే దీనిం జూడుము. ఆడు కొండగొఱ్ఱ వెనుక పాదమున మగగొఱ్ఱ ముగముం గోకుచున్నది. కొమ్ముతుదికొనచే మగగొఱ్ణ స్నేహార్ద్రభావమున దానింగీరుచున్నది. చూడుము తెల్లనివాలము తోడి దానిని ముందునకు పోనీ యాడు చమరీమృగమును చమరమృగము తమకముతో దానిమ్మచెట్టు నీడ గర్వముగా నావైపు చూచుచున్నది. చూడుము ఈ యెండలో మృగపోతు (శరభము) మూపురమున కాకింబూని మొగమున నెమరు వేయుచు గవయితో గూడియున్నది.

పశ్యాజం భార్యయా సార్థం న్యస్తాగ్ర చరణద్వయమ్‌ | విపులే బదరీ స్కంధే తచ్ఛద గ్రాస కామ్యయా || 29

హంసం సభార్యం సరసి విచరన్తం సునిర్మలే | సుశుక్లస్యేందు బింబస్య పశ్చైనం సదృశ శ్రియమ్‌ || 30

సభార్య శ్చక్రవాకోయం కమలాకర మధ్యగః | కరోతి పద్మినీం కాంతాం స పుష్పామివ సుందరిః || 31

మయా ఫలోచ్చయః సుభ్రుః త్వయా పుష్పోచ్చయః కృతః | ఇంధనం న కృతం కించి త్తత్కరిష్యామి సాంప్రతమ్‌ ||

త్వమస్య సరసస్తీరే ద్రుమచ్ఛాయా ముపాశ్రితా| క్షణమాత్రం ప్రతీక్షస్వ! విశ్రమస్వ చ భామిని! || 33

సావిత్రీ - ఏవమేత త్కరిష్యామి మమ దృష్టి పథాత్త్వయా | దూరేకాంత ! న గన్తవ్యం బిభేమి గహనే వనే || 34

పుష్కరః- తస్య పాతయతః కాష్ఠం జజ్ఞే శిరసి వేదనా | స వేదనార్తః సంగమ్య భార్యాం వచన మబ్రవీత్‌ || 35

అల్లదిచూడు మామేక యాడుదానితో విశాలమైన రేగుచెట్టు మొదల నాయాకులు తినవలెనని ముంగాళ్ల మీదకెత్తి నిలుచున్నది. మిక్కిలియచ్ఛమైన సరస్సులో భార్యతో జరించుచున్న మిక్కిలి తెల్లనైన చంద్రబింబముతో నీడైన తనుశోభగల్గిన యీ హంసను గనుము. ఈ చక్రవాకము పెంటితో తామరకొలని నడుమ నిలిచి యీ పద్మినిని (తామరలతకు) పుష్పముతోడి దానింగావించున్నది. సుందరి! యిదె కనుగొనుము. నేను పండ్లు గోసితిని. నీవు పుష్పావచయము గావించితిని. ఇంధనమే కొంచమేని సేకరింపలేదు. ఇప్పుడది నేను జేసెదను. నీవు సరస్తీర మందు చెట్టునీడం జేరి క్షణమాత్రము నిరీక్షింపుమిట విశ్రమింపుమన సావి తియనెను. అట్లేసెదను. నీవు నా కనుమరుగుగా దూర మేగవలదు. ఈ గహనమైన యడవిలో నేడు జడిసిపోయెదననెను. సత్యవంతు డప్పుడు గట్టెలం గొట్టుచుండ శిరోవేదన గల్గెను. ఆ తలనొప్పిం గొని యాతడు ధర్మపత్నితో నిట్లనియె.

సత్యవాన్‌ - ఆయాసేన మమానేన జాతా శిరసి వేదానా | తమశ్చ ప్రవిశామీవ న చ జానామి కించన || 36

త్వదుత్సంగే శిరః క్భత్వా నిదోపహత లోచనః |

పుష్కరః - తదుత్సంగే శిరః కృత్వా సుష్వాప గతచేతనః || 37

పతివ్రతా మహాభాగా తతస్సా రాజ కన్యకా | దదర్శ ధర్మరాజం తు స్వయం తం దేశ మాగతమ్‌ || 38

నీలోత్పల దళ శ్యామం పీతాంబరధరం ప్రభుమ్‌ | విద్యుల్లతా నిబద్ధాంగం సతోయ మివ తోయదమ్‌ || 39

కిరీటేనర్క వర్ణేన కుండలాభ్యాం విరాజితమ్‌ | హార భారార్పితోరస్కం తథాంగద విభూషితమ్‌ || 40

తథానుగమ్యమానం చ కాలేన సహమృత్యునా | సతు సంప్రాప్య తం దేశం దేహా త్సత్యవత స్తదా || 41

అంగుష్ఠమాత్రం పురుషం పాశబద్ధం వశంగతమ్‌ | ఆకృష్య దక్షిణా మాశాం ప్రయ¸° సత్వరం తదా || 42

ఈ యా యాసముచే నాకు దలనొప్పివచ్చినది. చీకటి పడినట్లున్నది. ఏమియుం గనబడుటలేదు. నీయొడిలో దలపెట్టుకొని నిద్రగ్రమ్ము కన్నులం బరుండుదునని యాతడెట్లుసేసి చేతనము పోయి నిదిరించెను. ఆమహానుభావురాలగు రాజకన్య పతివ్రత యట కేతెంచిన ధర్మరాజుం చూచెను. నల్లగలువరేకులట్లు నల్లగనున్నాడు. పీతాంబరము ధరించినాడు. మెఱపుదీగ లలముకొన్న నీటితోడి మేఘమట్లున్నాడు. కిరీటము సూర్యుని వన్నెనున్నది. చెవుల కుండలము లూగుచున్నవి. ఱొమ్మున పలు హారములు దూగుచున్నవి. అంగదములు వెట్టికొన్నాడు (అంగదము = భుజకీర్తులు) కాలుడు (మృత్యువు) ఆయనను వెంబడించుచుండెను. అతడచ్చోటి కెతెంచి యా సత్యవంతుని దేహమునుండి అగుష్టమాత్రుడైన పురుషుని పాశములబంధించి స్వాధీనము సేసికొని లాగికొని సత్వరము దక్షిణ దిశ##కేగెను.

సావిత్ర్యపి వరారోహా త్వక్త్వా తం గత జీవితమ్‌ | అనువవ్రాజ గచ్ఛన్తం ధర్మరాజ మతంద్రితా || 43

తా మువాచ యమః ''గచ్ఛ! యధాగత మనిందితే! ఔర్ధ్వ దైహిక కృత్యేషు యుక్తా భర్తు స్సమాచర! || 44

నా7ను గంతు మసౌ శక్త స్త్వయా లోకా 7తరం గతః | పతివ్రతా7సి తేన త్వం ముహూర్త మపి పశ్యసి || 45

గురు శుశ్రూషణా ద్భద్రేః తథా సత్యవతో మహత్‌ | పుణ్యం సమార్జితం యేన నయామ్యేన మహం స్వయమ్‌ || 46

ఏతావ దేవ కర్తవ్యం పురుషస్య విజానతః | మాతుః పితుశ్చ శుళ్రూషా గురోశ్చ వరవర్ణిని! || 47

గురు త్రితయ మేతచ్చ సదా సత్యవతా వనే || 48

పూజితం పూజిత స్స్వర్గ స్తదా7నేన చిరం శుభేః | తపసా బ్రహ్మచర్యేణ త్వగ్ని శుశ్రూషయా తథా || 49

పురుషా స్స్వర్గ మాయాన్తి గురుశుశ్రూషణన చ | ఆచార్య శ్చ పితాచైవ మాతా భ్రాతా చ పూర్వజః || 50

నా7ర్తేనా7ప్యవమన్తవ్యా బ్రాహ్మణన విశేషతః | ఆచార్యో బ్రాహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతేః || 51

మాతా పృథివ్యా మూర్తిశ్చ భ్రాతా వై మూర్తి రాత్మనః | యన్మాతా పితరౌ క్లేశం సహేతే సంభ##వే నృణామ్‌ || 52

న తస్య నిష్కృతి శ్శక్తా కర్తుం వర్షశ##తై రపి | తయోర్నిత్యం ప్రియం కుర్యా దాచార్యస్య చ సర్వదా || 53

తేష్వేవ త్రిషు తుష్టేషు తప స్సత్యం సమాప్యతే | తేషాం త్రయాణాం శశ్రూషా పరమం తప ఉచ్యతే || 54

నతై రనభ్యనుజ్ఞాతో ధర్మమన్యం సమాచరేత్‌ | త ఏవ త్రయో లోకాస్త ఏవ త్రయ ఆశ్రమాః || 55

త ఏవ చ త్రయో వేదా స్తఏవోక్తా స్త్రయో7గ్నయః | పితా వై గార్హపత్యో7గ్నిర్మాత్మా7గ్ని ర్దక్షిణ స్స్మృతః || 56

గురు రాహవనీయస్తు అగ్నిః త్రేతా గరీయసీ | త్రిష్వప్రమాద్య న్నేతేషు త్రీన్‌లోకాన్‌ జయతే గృహీ || 57

స హి దివ్యేన వపుషా దేవవర్ణిని! మోదతే| ఇమం లోకం మాతృభక్తః పితృభక్తస్తు మధ్యమమ్‌ || 58

గురు శుశ్రూషయా త్వేవం బ్రహ్మలోకం సమశ్నుతే | సర్వే తస్యా7దృతా ధర్మాయసై#్యతే త్రయ ఆదృతాః || 59

అనాదృతా స్తు యసై#్యతే సర్వా స్తస్యా7ఫలాః క్రియాః | యావత్త్రయ స్తే జీవేయు స్తావ న్నాన్య త్సమాచరేత్‌ || 60

తనుం నివేదయే త్తేభ్యో మనో వచన కర్మభిః | త్రిష్వేతేష్వితి కృత్యం హి పురుషస్య సమాప్యతే || 61

ఏష ధర్మః పర స్సాక్షా దుపధర్మో7న్య ఉచ్యతే | గురుపూజారతి ర్భర్తా త్వం చ సాధ్వీ పతివ్రతా || 62

వినివర్తస్వ ధర్మజ్ఞే! గ్లాని ర్భవతి తే7ధునా | సావిత్రీ - పతిర్హిదైవతం స్త్రీణాం పతిరేవ పరాయణమ్‌ || 63

సావిత్రియుం బ్రాణముపోయిన యాతని విడిచి యచటచనుచున్న ధర్మరాజు నేతొందరపాటుగొనక వెన్నంటెను. ఆమెంగని యముడు పొమ్ము. వచ్చినజాడనేగుము. భర్తయూర్ధ్వలోక క్రియలందునిమగ్నవై కావింపుము. లోకాంతమేగిన యీతని నీవు వెంబడింప లేవు. పతివ్రతవుగావున నీవిది ముహూర్తకాలము చూచితివి. కల్యాణీ! సత్యవంతుడితడు చేసిన మహత్తరమగు గురు శశ్రూషచే నీతడెంతేని పుణ్యమార్జించుకొనుచున్నాడు. కావుననే నేను స్వయముగా నీతనిం గొంపోవుచున్నాను. ఓసుందరీ! తెలిసిన పురుషుడు తల్లికి దండ్రికి గురువులకు శుశ్రూష చేయవలసినది. ఈ సత్యవంతుడడవిలో నీగురుత్రయమును బూజించినాడు. అందుచే నితడు స్వర్గమున బూజితుడయ్యెను. తపస్సుతో బ్రహ్మచర్యముచే అగ్నిశుశ్రూషచే గురుశశ్రూషణముచే పురుషులు స్వర్గమునకు వత్తురు. ఆచార్యుడు తండ్రి తల్లి అన్న అనువారిని తానెంత యార్తుడైయున్నను (బాధలోనున్నను) అవమానింపరాదు. విశేషించి బ్రాహ్మణుడు బొత్తిగా నదిచేయరాదు. ఆచార్యుడు బ్రహ్మయొక్క స్వరూపము తండ్రి ప్రజాపతి రూపము తల్లి పృధవీమూర్తి అన్న ఆత్మస్వరూపుడు. తల్లిదండ్రులు సుతుని పుట్టుకయెడ కెంతోక్లేశమనుభవింతురు. దానికి నిష్కృతి చెల్లించుట నూరేండ్లకైనను శక్యముగాదు. వారికి ఆచార్యునకు నిరంతర ప్రియమాచరింప వలెను. ఆ ముగ్గురు సంతుష్టులైనచో తపస్సు సత్యము సమాప్తి యగును. ఆ ముగ్గురి శుశ్రూష పరమతపస్సు అనబడినది. వారియభ్యనుజ్ఞగొనక మరిధర్మమేదియుం చేయరాదు. వారు ముగ్గురే మూడులోకములు. వారే మూడాశ్రమములు. వారే మూడు వేదములు వారే మూడగ్నులని చెప్పబడినది. తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురువావహనీ యాగ్ని. ఇవి మూడగ్నులు చాలా గౌప్పవి. ఈ మూడింట ప్రమాదపడనివాడు ముల్లోకములం జయించును. అతడు దివ్యశరీరముతో దివంబున దేవుడట్లు ప్రకాశించును. మాతృభక్తు డీలోకమును, పితృభక్తుడు మధ్యమలోకమును, గురుభక్తుడు బ్రహ్మలోకము, ననుభవించును. ఈముగ్గురి యందాదరముగలవాని కన్ని ధర్మములా దృతములే. ఆ ముగ్గురు జీవించియున్నంతదాక మరియేమియుం జేయరాదు. వారికి తనువును మనస్సును, నూటను, సమర్పింపవలెను. మనోవాక్కాయ కర్మములచే నీముగ్గురియెడ కర్తవ్యమంతయు సమాప్తినందును. ఇది సాక్షాత్పరమ ధర్మము. మిగిలినది ఉపధర్మము. నీమగడు గురుపూజా రతుడు. నీవు సాధ్వివి. పతివ్రతవు. ధర్మజ్ఞురాలా! నీవు మరలిచనుము. నీకిపుడుగ్గాని శ్రమగలుగదు. అనవిని సావిత్రియిట్లనియె.

అనుగమ్యః స్త్రియా సాధ్వ్యా పతిః ప్రాణ ధనేశ్వరః | మితం దదాతి హి పితా మితం భ్రాతా మితం సుతః || 64

అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్‌ | నీయతే యత్ర భర్తా మే స్వయం వా యత్ర గచ్ఛతి || 65

మయా7పి తత్ర గన్తవ్యం యథాశక్తి సురోత్తమ! | పతి మాదాయ గచ్ఛన్త మనుగన్తు మహం యదా || 66

త్వాం దేవ! న హి శక్ష్యామి తదా త్యక్ష్యామి జీవితమ్‌ | మనస్వినీ తథా కాచ వైధవ్యా7క్షరదూషితా || 67

ముహూర్త మపి జీవేత మండనా7ర్హా7వ్యమండితా| యమః- పతివ్రతే! మహాభాగే! పరితుష్టో7స్మితే శుభే! || 68

వినా సత్యవతః ప్రాణాన్‌ పరం వరయ! మా చిరమ్‌ |

సావిత్రీ - వినష్ట చక్షుషో రాజ్యంచక్షుషా సహకామయే | చ్యుత రాజ్యస్య ధర్మజ్ఞ! శ్వశురస్య మహాత్మనః || 69

యమః- కృతేన కామేన నివర్తభ##ద్రే ! భవిష్య తీదం సకలం త్వయోక్తమ్‌ |

మమోపరోధస్తవ చ క్లమస్స్యా | త్తథా7ధ్వనా తేన తవబ్రవీమి || 70

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - త్వితీయఖండే - సావిత్ర్యుపాఖ్యానే సప్తత్రింశో7ధ్యాయః.

స్త్రీలకు పతిగదా దైవము! స్త్రీలకు పతియే పరమగతి - సాధ్వియైన స్త్రీయొక్క ప్రాణధనములకు భర్త ప్రభువు స్త్రీకి భర్త అనుసరింప వలసినవాడు. తండ్రి మితముగా నిచ్చును. అన్నదమ్ములు మితముగానిత్తురు. కొడుకు మితముగా నిచ్చును. అమితముగా నిచ్చువాడు భర్త. ఆయననెవ్వతె పూజింపరు? నామగడెటకు గొంపోబడును, తనంతటతా నాయనెచ్చోజనును, నేను నటకు యథాశక్తింబోవలయును. నాభర్తంగొని చనువానిని నిన్ను నేను వెంబడింప చేతగాదేని నేనును జీవితము విడిచెదను. మానవతి యెవ్వతె వైధవ్యమును నక్షరములచే దూషితయైముహూర్తమేని జీవించును? భూషణార్హులరాలెట్లు భూషితగా గలదు? అనవిని యముడు పతివ్రతా! మహానుభావురాలా! కల్యాణీ! నీయెడ సంతుష్టుడనైతిని. సత్యవంతుని ప్రాణములుగాక మరియొండు వరము కోరుకొనుము. ఆలస్యము వలదన సావిత్రీదేవి మా మామగారు మహాత్ముడు రాజ్యభ్రష్టుడయ్యెను. కన్నులు పోయినవి యాయంధునికి కంటితోపాటు రాజ్యమును కోరెదను. అన యముడు నీకోరిక నెరవేర్పబడినది. గాన నోకల్యాణీ! నీవికమరలుము. నీచెప్పినదెల్ల గాగలదు నాకుపరోధము (ఇబ్బంది) కల్గును. నీకు శ్రమకల్గును.అందుచే నిట్లంటి ననెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున సావిత్ర్యుపాఖ్యానమందు ముప్పదియేడవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters