Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదియైదవ యధ్యాయము - అనుజీవివృత్తము

పుష్కరః యథానువర్తితవ్యం స్యా ద్రామ! రాజోపజీవిభిః | తథా తే కధయిష్యామి నిబోధ! గదతో మమ|| 1

ఆజ్ఞా సర్వాత్మనా కార్యా స్వశక్త్యా భృగునందన ! | ఆక్షిప్య వచనం తస్య న వక్తవ్యం తథా వచః 2

అనుకూలం ప్రియం తస్య వక్తవ్యం జనసన్నిధౌ | రహోగతస్య వక్తవ్య మప్రియం య ద్ధితం భ##వేత్‌ || 3

పరార్థ మథ వక్తవ్యం స్వస్థే చేతసి భార్గవ ! | స్వాస్థ్యం సుహృద్భి ర్వక్తవ్యం న స్వయం తు కథంచన || 4

కార్యాతిపాతకం కార్యే రక్షితవ్యం ప్రయత్నతః | న చ హింస్య ధనం కించి న్నియుక్తేన చ కర్మణి || 5

నోపేక్ష్యం తస్య మానం చ తథా రాజ్ఞా ప్రియో భ##వేత్‌ | రాజ్ఞశ్చ తథా కార్యం వేశభాషిత చేష్టితమ్‌ || 6

రాజలీలా న కర్తవ్యా తద్ద్విష్టం చ వివర్జయేత్‌ | నరాజ్ఞ స్సమాధికౌ వేశౌ నతు కార్యౌ విజానతా || 7

ద్యూతాదిషు తథై వాస్య కౌశలం తు ప్రదర్శయేత్‌ | ప్రదర్శ్య కౌశలం చాస్య రాజానం న విశేషయత్‌ || 8

అంతఃపుర ధనాధ్యక్షైః వైరిదూతై ర్నిరాకృతైః | సంసర్గం న వ్రజే| దామ! వినా పార్థివశాసనమ్‌ || 9

నిస్స్నేహతం చావమానం తత్ర్పయుక్తంచ గోపయేత్‌ | యచ్చ గుహ్యం భ##వే ద్రాజ్ఞః తన్న లోకే ప్రకాశ##యేత్‌ || 10

నృపేణ శ్రావితం యత్‌ స్యాత్‌ గుహ్యా ద్గుహ్యం భృగూత్తమ ! | న తత్‌ సంశ్రావయేత్‌ లోకే తథా రాజ్ఞః ప్రియో భ##వేత్‌ ||

పుష్కరుండనియె, రాజుయొక్క అనుజీవులు (ఉద్యోగులు) ఎట్లు ప్రవర్తింపవలె నది వచింతు వినుము. భార్గవనందన! రాజానుజీవి రాజు యొక్క యాజ్ఞను సర్వ విధముల తన శక్తికొలది నెరవేర్పవలెను. ఆతని మాట గాదని యెన్నడు మాటలాడ రాదు పదిమందిలో నా రాజు కనుకూలముగ ప్రియముగనే మాటలాడవలెను. రహస్య మందున్నపుడాతనికేది హితమో అది చెప్పవలెను అతడు మనసులో స్వస్థుడై యున్నపుడితరుల ప్రయోజనము కవసరమైనది జెప్పవచ్చును. కాని స్వార్థమైన విషయము తానుగాక మిత్రుల చేత జెప్పించ వలెను. ఏదైన పని చెడిపోవు స్థితి వచ్చెనేని తప్పక ప్రయత్న పూర్వకముగా దానిని రక్షింపవలెను. రాజిచ్చిన ధనమును మానమును (గౌరవమున) అతనికి బాధ కలిగించు రీతిలో నుపేక్షింపరాదు. (తీసికొనుకుండనుండరాదన్నమాట) అప్పుడు రాజునకా భృత్యుడు ప్రీతి పాత్రుడగును. రాజు వేసిన వేషము అతడు పలికిన పలుకులు అతని చేష్టలను దా ననుకరించ రాదు. రాజు సేసిన విలాసచేష్ట తాను జేయరాదు. రాజాజ్ఞను మీరరాదు. రాజుతో సమానము అధికమునైన వేషము వేయ రాదు. రాజుతో జూదము మొదలయిన క్రీడలందు తన నేర్పు చూపవచ్చును. నేరిమి చూపియు రాజును మీర గూడదు. అంతఃపురాధ్యక్షులు

ధనాధ్యక్షులు శత్రువులనుండి వచ్చిన రాజునే నిరాకరింపబడిన దూతలతో రాజు నాజ్ఞ లేకుండ(సంపర్కము) పెట్టుకొనరాదు. రాజు తనయెడ జూపిన నిస్నేహత్వము =అనిష్టతను అవమానమును గోపనచేయవలెను. వెల్లడింప రాదు. రాజుయొక్క రహస్య మేదేని యున్న దానిని లోకమందు వెల్లడింపరాదు. రాజు తన కేకాంతమునం జెప్పిన రహస్యాతి రహస్యమును లోకమునం దేరికిని వినిపింప రాదు ఆ విధముగనున్న యా యుద్యోగి రాజున కిష్టుడగును.

ఆజ్ఞప్యమానే చాన్యస్మిన్‌ సముత్థాయ త్వరాన్వితః | అహం కింకరవాణీతి వాచ్యో రాజా విజానతా || 12

కార్యవస్థాం చ విజ్ఞాయ కార్యమేత త్తథా భ##వేత్‌ | సతతం క్రియామాణస్మిన్‌ లాఘవం తు వ్రజే ద్బుధః || 13

రాజ్ఞః ప్రియాణి వాక్యాని న చాత్యర్థం పునః పునః | న హాస్యశీలశ్చ భ##వే న్నచాపి భృకుటీముఖః || 14

నాతి వక్తా న నిర్వక్తా న చ మాత్సరిక స్తథా | ఆత్మసంభావితశ్చైవ న భ##వేత్తు కథంచన || 15

దుష్కృతాని నరేంద్రస్య నచ సంకీర్తయే త్క్వచిత్‌ | వస్త్రం పత్ర మలంకారం రాజ్ఞా దత్తం తు ధారయేత్‌ || 16

ఔదార్యేణ న తద్దేయ మన్యస్మిన్‌ భూతి మిచ్ఛతా | న చైవాధ్యశనం రాజ్ఞః స్వవనం చాపి కారయేత్‌ || 17

నానిర్దష్టే తథా ద్వారే ప్రవిశేత కధంచన | నచ పశ్యేత రాజనం మమోగ్యాసు చ భూమిషు || 18

రాజ్ఞస్తు దక్షిణ పార్శ్వేవామే చోపవిశే త్తథా | పురస్తాత్తు యథా వశ్చా దాసనం తు విగర్హితమ్‌ || 19

జృంభా నిష్ఠీవనం కామం కోపం పర్యంకికాశ్రయమ్‌ | ముకుటం వాత ముద్గారం తత్సమీపే వివర్జయేత్‌ || 20

స్వయం తథా న కుర్వీత స్వగుణాఖ్యాపనం బుధః | స్వగుణాఖ్యాపనే కుర్యాత్‌ పరానేవ ప్రయోజనకాన్‌ || 21

హృదయం నిర్మలం కృత్వా పరం భక్తి ముపాశ్రితైః | అనుజీవిగణౖ ర్భావ్యం నిత్యం రాజ్ఞా మతంద్రితైః || 22

శాఠ్యం లౌల్య మపైశున్యం నాస్తిక్యం క్షుద్రతాం తథా | చాపల్యం చ పరిత్యాజ్యం నిత్యం రాజానుజీవినా|| 23

శ్రుతేన విద్యాశిల్పైశ్చ సంయోజ్యాత్మాన మాత్మనా | రాజసేవాం తతః కుర్యాత్‌ భూతయే భీతివర్ధనః || 24

నమస్కార్యా స్సదా చాస్య పుత్ర వల్లభ మన్త్రిణః | సచివై శ్చాస్య విశ్వాసం న తు కార్యం కథంచన || 25

అపృష్టశ్చాస్య న బ్రూయాత్‌ కామం బ్రూయా త్తథాపది | హితం పథ్యం చ వచనం హితైస్సహ సునిశ్చితమ్‌ ||

చిత్తం చైవాస్య విజ్ఞేయం నిత్య మేవానుజీవినా | భర్తు రారాధనం కుర్యాచ్చిత్తజ్ఞో మానవ స్సుఖమ్‌ || 27

రాగాపరాగౌ చైవాస్య విజ్ఞే¸° భూతి మిచ్ఛతా | త్యజే ద్విరక్తం నృపతిం రక్తా ద్వృత్తిం తు కామయేత్‌ || 28

కర్మోపకారయో ర్నాశం విపక్షాభ్యుదయం తథా | ఆశాసంవర్ధనం కృత్యా ఫలనాశం కరోతి చ || 29

అకోపోపి ప్రకోపాభః ప్రసన్నోపి చ నిష్పలః | వాక్యం సమందం వదతి వృత్తిచ్ఛేదం కరోతి చ || 30

ప్రవేశ వాత్యా7నుదితౌ న సంభావయతీ త్యథ | ఆరాధనాసు సర్వాసు సుప్తవచ్చ విచేష్టతే || 31

కథాసు దోషైః క్షిపతి వాక్యచ్ఛేదం కరోతి చ | లక్ష్యతే విముఖ శ్చైవ గుణ సంకీర్తనే కృతే || 32

దృష్టిం క్షిప త్యథా7న్యత క్రియామాణ చ కర్మణి | విరక్త లక్షణం శ్రుత్వా శృణు రక్తస్య లక్షణమ్‌|| 33

దృష్ట్వా ప్రసన్నో భవతి వాక్యం గృహ్ణాతి చాదరాత్‌ | కుశలాది పరిప్రశ్నే సంప్రయచ్చతి చా7 సనమ్‌ || 34

వివిక్త దర్శనే చాస్య రహస్యే న చ శంకతే | జాయతే హృష్టవదనః శ్రుత్వా తస్యతు సంకథామ్‌ || 35

ఆప్రియాణ్యపి వాక్యాని తదుక్తా న్యభినందతి| ఉపాయనం చ గృహ్ణాతి స్తోక మప్యాదరా త్తథా || 36

కథాతంరేషు సరతి ప్రహృష్ట వదన స్తథా |

ఇతి రక్తస్య కర్తవ్యా సేవా భృగుకులోద్వహ ! | ఆపత్సు న త్యజేత్పూర్వం విరక్త మపి సేవితమ్‌ || 37

మిత్రం నచాపత్సు తథాన భృత్యం | వ్రజన్తి యే నిర్గుణ మప్రమేయమ్‌ |

ప్రభుం విశేషణ చ తే వ్రజన్తి | సురేంద్ర ధామాసురబృందజుష్టమ్‌ || 38

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయఖండే అనుజీవి వృత్తంచామ పంచవింశోధ్యాయః.

రాజింకొకని కాజ్ఞ యిచ్చుచుండ దాను వేచి త్వరతో నేనేమిచేయుదు నన వలెను. పనియొక్క స్థాయి యెఱిగి యిటు సేయవలెను. ఎల్లవేళల నిట్లే తొందరపడి చేసినను తేలికయి పోవును. రాజునకు ప్రియము లయిన విషయమును జెప్పవలెను. అవి మాటి మాటికి యెక్కువగా జెప్పరాదు. రాజు సమీపమున హాస్యమాడరాదు. అట్లని మొగము ముడిచికొనను రాదు. ఎక్కువ పలుకగూడదు. అసలు పలుకకుండ నుండ రాదు. మాత్సర్యమూనరాదు రాజుయొక్క చెడు పను లెన్నడు పలుక రాదు. రాజిచ్చిన వస్త్రము పత్రము అలంకారమును ధరింపవలెను. ఐశ్వర్యము గావలెనని కోరు వారు ఆ వస్తువులను ఔదార్యమున నింకొకని కీరాదు. రాజుకంటే ముందు భోజనము పడకయు చేయరాదు. అనుజ్ఞ గొనకుండ నెన్నడు రాజద్వారమున బ్రవేశింపరాదు అయోగ్య భూమికలలో రాజును జూడరాదు. రాజునకు కుడి యెడమ ప్రక్కలం గూర్చుండ వలెను. రాజున కెదురుగా వెనుకగా గూర్చుండుట నింద్యము. ఆవులింత చీదుట కామము కోపము మంచము మీద కూర్చుండట కిరీటము ధరించుట వాతము (ఆపానువాయువు) ఉదారము (త్రేణువు) రాజు ముందు చేయరాదు. తన గుణములను దాను జెప్పుకొన రాదు. ఒకవేళ తన గుణాఖ్యాపనము సేయవలసివచ్చినపు డితరులను దానికి బ్రయోగింపవలెను. హృదయము నిర్మల మొనరించు కొని రాజునందు భక్తిగొని యెట్టి తొందరపాటు లేకుండ యను జీవిగణము (సేవకవర్గము) నిత్యమును ప్రవర్తింప వలెను. శౌర్యము (మొండితనము) తౌల్యము (ఉబలాటము) పిశాచత్వము, లోభము నాస్తిక్యము నీచత్వము (దీనత్వము) చాపల్యమునను గుణములు రాజోద్యోగికి బనికిరావు. శ్రుతము=పాండిత్యము విద్యశిల్పము ననువానిచే దనను దాగూర్చు కొని యనుజీవి భయము పెంపుగొని ఐశ్వర్య కాముడగు వాడు రాజుల సేవింపవలెను. రాజు యొక్క పుత్రులు నిష్టులు మంత్రలకు నమస్కరించు చుండ వలెను. సచివులతో నెక్కువ విశ్వాస ముంచ రాదు. (వారి నెక్కువగా నమ్మరాదు) అడుగనిదే చెప్పరాదు. ఆపదలలో తప్పక చెప్పి తీరవలెను. హితము పథ్యము నైనది హితులచే బాగుగా నిశ్చయింప బడినదియు నైన మాట నడుగ నిదే చెప్పరాదు. ఆపదలో మాత్రము చెప్పి తీరవలెను. అనుజీవి రాజుయొక్క మనుసు నెల్లపుడు కనిపెట్టుచుండ వలెను. అతని చిత్త మెఱిగి మానవుడు స్వామి సేవ యొనరింపవలెను. ఐశ్వర్యము గోరువాడు రాజు అనురాగముతో నున్నది విరక్తితో నున్నది తెలుసు కొనవలయును. విరక్తుడైన రాజును విడచి రక్తుని వలన వృత్తి నపేక్షింపవలెను. సేవకునియందు విరక్తుడయినరాజు సేవకుడుచేసిన పనియొక్కయు నుపకారము యొక్కయు గుణమునాశమునుచేయుటయు, శత్రువుల యభివృద్ధిని కోరుటయు, ఆశ##బెట్టి చెఱచుటయు, కోపము లేకపోయినను కోపము గలవాడుగానుండుటయు, ప్రసన్నుడుగా కనబడినను నిష్పల మగుటయు, మందముగా మాట్లాడటయు, వృత్తిచ్ఛేదము సేయుట, ప్రవేశమునకు మాటలకు విలువ నివ్వకపోవుట చేయునట్టి సర్వసేవలను చూచుచున్నను నిదురపోయిన వాని వలె చేష్టలు చేయుట, ఏదేని చెప్పుచున్న సమయమున దోషములతో నాక్షేపించి వాక్యచ్ఛేదము సేయుట, గుణములను కొనియాడు చున్నపుడు విముఖుడుగా నుండుటయు, చేయుచున్న పనియందు గాక వేరుగా దృష్టి నుంచుటయు నను నివి విరక్తుడైన రాజు యొక్క లక్షణములు పిమ్మట రక్తుడైన రాజు యొక్క లక్షణములు చెప్పెద వినుము. చూడుగానే ప్రసన్నుడగును. మాటను ఆదరముతో స్వీకరించును. కుశలము నడుగును. ఆసనమిచ్చును. ఏకాంత దర్శన మందు గాని రహస్య మందు గాని అనుమానించడు. తాను చెప్పు మంచి కథలను విని ప్రసన్నముఖుడగును. ఆ ప్రియ వాక్యము లయినను అతను చెప్పిన వాటి నభినందించును. స్వల్పమయినను అతను యిచ్చిన కానుకల నత్యాదరముతో గ్రహించును. కథాంతరముల యందు ప్రహృష్ట ముఖు డగును. భార్గవరామ! ఇట్టి రక్తుడైన రాజు యొక్క సేవ సేయవలయును. విరక్తుడయిన నాపదల యందు తాను సేవించిన రాజు నొదిలిపెట్టగూడదు. ఆపదలయందు భృత్యునిగాని మిత్రునిగాని రాజును గాని వదలకుండ నెవరుందురో వారు దేవతా బృంద వంద్యమగు దేవేంద్ర లోకమునకు పోవుదురు.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున అనుజీవి వృత్తమను ఇరువది యైదవ ఆధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters