Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదియవ అధ్యాయము - వహ్నిలక్షణము

పుష్కరః : ప్రదక్షిణావర్తశిఖ స్తప్తజాంబూనద ప్రభః | రథౌమ మేఘ నిర్ఘోషో విధూమశ్చ హుతాశనః || 1

అనులోమ సుగంధశ్చ స్వస్తికా7కారసన్నిభః | వర్థమానకృతిశ్చైవ నంద్యావర్తనిభ స్తథా || 2

ప్రసన్నార్చి ర్మహాజ్వాలః స్ఫులింగ రహితో హితః | స్వాహాయమానే జ్వలనః స్వయం దేవముఖం హవిః || 3

యదా భుంక్తే మహాభాగ! తదా రాజ్ఞో హితం భ##వేత్‌ | హవిషస్తు యదా వహ్నే ర్నస్యాత్సిమి సిమాయితమ్‌ || 4

న గచ్ఛేయుశ్చ మధ్యేన మార్జార మృగ పక్షిణః | పిపీలికాశ్చధర్మజ్ఞ! తదా భూయా7జ్జయీ నృపః || 5

ముక్తాహార మృణాలాభే వహ్నౌ రాజ్ఞాం జయో భ##వేత్‌ | తథైవ చ జయం బ్రూయాత్‌ ప్రస్తరస్య ప్రదాయిని || 6

సంక్షేపత7స్తే7భిహితం మయా7ద్య యల్లక్షణం చారు హుతాశనస్య |

సర్వాగ్ని కర్మ స్వథ తేన విద్వాన్‌ భూయాత్త్రిలోకే తు జయీ ద్విజేంద్ర || 7

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తర-ద్వితీయఖండే వహ్నిలక్షణం నామ వింశతితమోధ్యాయః

పుష్కరుడనియె: ప్రదక్షిణముగా తిరిగిన శిఖలతో (జ్వాలలతో) మేలిమిబంగారు ప్రభలగొని రథములట్లు మేఘములట్లు ధ్వనించుచు పొగ గ్రమ్మక హుతాశనుడు వెలుగుచు, అనులోమముగ పరిమళములు వ్యాపింప స్వస్తికము వర్ధమానము నంద్యావర్త మును పోలి ప్రసన్నార్చియై మహాజ్వాలలు దీపింప స్ఫులింగములు (మిణుగురులు) చిటపటలు లేక యగ్ని యధావిధి హోమము గావింపబడి దేవముఖమైన అగ్ని హవిస్సును స్వయముగ నెప్పుడు భుజించు నప్పుడు రాజున కభిమతము సిద్ధించును. హవిస్సు వేల్చినప్పుడగ్నియం దది సిమసిమ లాడరాదు. హోమములు జరుగనెడు నడుమ పిల్లులు ఏవేని జంతువులు పక్షలు చీమలును పోరాదు. అట్లైన రాజునకు జయము కలుగును. వహ్ని ముత్యాలహారమట్లు తామర తూండ్లట్లు దీపించు నేని రాజునకు ప్రస్తరప్రదాతకు జయమగును. పరశురామ! వహ్ని లక్షణమును నీకు క్లుప్తముగా వచించితిని. దాని దెలిసినవాడు సర్వాగ్ని కార్యములందు త్రిలోకమున విజయి కాగలడు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున వహ్ని లక్షణమను నిరువదియవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters