Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

రెండవ యధ్యాయము - రాజప్రశంస

మార్కండేయ ఉవాచ:- సుఖాసీనో నరశ్రేష్ఠ! పుష్కరస్య నివేశ##నే ! పప్రచ్ఛపుష్కరం రామో ధర్మనిత్యో జితేంద్రియః || 1

రామఉవాచ:- రాష్ట్రస్య కింకృత్యతమం తన్మమాచక్ష్వ! పృచ్ఛత ఆదావేవ మహాభాగ ! యాదోగణ నృపా77త్మజ|| 2

పుష్కర ఉవాచ:- రాష్ట్రస్యకృతం ధర్మజ్ఞ! రాజ్ఞ ఏవాభిషేచనమ్‌ |

అనింద్ర మబలం రాష్ట్రం దస్యవోభిభవంత్యుత || 3

అరాజకేషు రాష్ట్రేషు ధర్మావస్థా న విద్యతే | వర్ణానా మాశ్రమాణాంచ వ్యవస్థానంచ భార్గవ! || 4

అరాజకేషు రాష్ట్రేషు నైవకన్యా ప్రదీయతే | విద్యతే మమతా నైవ తథా విత్తేషు కస్యచిత్‌ || 5

స్వాత్మ్యో న్యాయః ప్రవర్తేత విశ్వలోప స్తధైవచ | లోకే న కశ్చి ద్విద్యేత గురో ర్వచనకారకః || 6

నాధీయీరన్‌ త్రయీం విద్యాం త్రయోవర్ణా ద్విజాతయః | దేవానాం యజనం నస్యా దనావృష్టి స్తతో భ##వేత్‌ || 7

నృలోక సురలోకౌచ స్యాతాం సంశయితా వుభౌ | జనమారీ భ##వేద్ఘోరా యది రాజాన పాలయేత్‌ || 8

ప్రజానాం రక్షణార్థాయ విష్ణుతేజోప బృంహితః | మానుష్యే జాయతే రాజా దేవసత్త్వ వపుర్ధరః || 9

యస్మిన్‌ ప్రసన్నే దేవస్య ప్రసాదస్తూజాయతే | యస్మిన్‌ క్రుద్ధేజనస్యాస్య క్రోధ స్సముపజాయతే || 10

మహద్భిః పుణ్యసంభారైః పార్థివో రామ! జాయతే | యసై#్యకస్య జగత్సర్వం వచనే రామ! తిష్ఠతి || 11

చాతుర్వర్ణ్యం స్వధర్మస్థం తేషు దేశేషు జాయతే | యేషు దేశేషు రాజేంద్ర! రాజా భవతి ధార్మికః || 12

మారకం నచ దుర్భిక్షం నాగ్నిచోర భయం తథా | నచ వ్యాళ భయం తేషాం, యేషాం ధర్మపరో నృపః|| 13

ఆదౌ విందేత నృపతిం, తతో భార్యం తతో ధనమ్‌ | కురాజే తు జనస్యాస్య కుతో భారా కుతో ధనమ్‌ || 14

తస్మా త్సర్వ ప్రయత్నేన రాష్ట్రముఖ్యే నరేశ్వరః | పరీక్ష పూర్వైః కర్తవ్యో ధార్మికః సత్యసంగరః || 15

యేషాం హి రాజా భువి ధర్మనిత్య స్తేషాం నలోకే భయమస్తి కించిత్‌ |

తస్మా త్ర్పయత్నేన నరేంద్ర ! కార్యో రాష్ట్రప్రథానై ర్నృపతి ర్వినీతః || 16

ఇతి విష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే రాజప్రశంసా నామ ద్వితీయోధ్యాయః

మార్కండేయు డనియే. పుష్కరు గృహమందు పరుశురాముడు సుఖాసనముండి, ఓ వరుణకుమారా! రాష్ట్రమునకు (రాజ్యమునకు) రాజు సేయవలసిన యత్యంత ముఖ్య కర్తవ్యమేమి? అది మొదటనే యానతిమ్మన పుష్కరుడిట్లనియె. ఓ ధర్మజ్ఞ ! రాష్ట్ర ప్రప్రధమకర్తవ్యము. రాజపట్టాభిషేచనము. రాజులేని, బలములేని రాష్ట్రమును దొంగలుగూలద్రోయుదురు. ఆ రాజకమైన రాజ్యమందు ధర్మవ్యవస్థయుండదు. వర్ణాశ్రమవ్యవస్థానము లోపించును. ఆరాజకరాష్ట్రములయందు కన్యనిచ్చుట గ్రహించుటయునుండదు. ఎవ్వనికి గాని యీసోమ్ము, ఈభూమి నాది యనుకొనుట కవకాశము లేదు. ఏ యాస్తిపై నెవనికినేని స్వాత్మ్యము ఇది నాదియను కొనుట యన్యాయ మార్గముననే జరుగును. దానివవలన విశ్వమున కెల్ల పెద్ద ప్రమాదము జరుగును. పెద్దలమాట వినువాడొక్కడు నుండడు. ద్విజులు మూడువర్ణములవారు మూడు వేదముల నధ్యయనముసేయరు. దేవయజనముండదు (యజ్ఞములు సాగవు) దానిచే ననావృష్టి కలుగును. నరలోక సురలోకములు రెండును సందేహగ్రస్తములగును. నరులవలన యజ్ఞములు జరిగి హవిర్భాగము లీయబడునేని సురలువానిచే నుపజీవపమంది వనకషము గురిపింతురు. దాన నిక్కడ యాహార సమృద్ధిగలుగును. దీనిని హవిర్భాగములుగా నందుకొని దేవతలు జీవింతురు. ఈవిధమయిన యిచ్చిపుచ్చకొనుటయను నీ యుభయలోకముల సంబంధము అరాజక రాష్ట్రమందు తెగిపోయి దేవతావ్యాకోపమేర్పడి యతివృష్టి మొదలయిన యీతిబాధలకు గురియై యిక్కడ నక్కడను గల ప్రజల బ్రతుకు సంశయగ్రస్తమగునన్నుమాట. రక్షకుడుగాక భక్షకుడయిన రాజు రాష్ట్రజనమారకుడగును. రాజనువాడు విష్ణు తేజస్సముపబృంహితుడై ప్రజారక్షణకవనిం జనించును. అతనియందు సర్వ దేవతల సత్తువయు నుండును. అట్టి రాజు ప్రసన్నుడైన యెడల విష్ణు ప్రసన్న తగల్గును. అతడు క్రుద్ధుడైన విష్ణువు కుపితుడగును, దానిచే నీజనమునకు గూడ క్రోధావేశ##మెక్కువగును. పార్థివుడు మహా పుణ్యసంభారములతో రాజుగా బుట్టును. కావున జగమాతనియాజ్ఞలో నిలుచును. రాజు ధర్మ నిష్ఠుడైన రాజ్యమందే నాల్గు వర్ణముల ధర్మములు చక్కగా నడుచును. ఆరాజ్యమందు మారకము, అకాలమరణము, దుర్భిక్షము, అగ్ని, చోరభయము, వ్యాళభయము, సర్పభయము, కృరమృగభయము నుండవు. తొలుత రాజును ధర్మనిష్టుడైన వానింగడించుకొని ఆమీద భార్యను గడించికొనవలెను. పాలకుడు దుష్టుడైనతరి భార్యమేమి? ధనమేమి? ఆవియేవనిని వానికి దక్కవన్నమాట. ఉత్తమ రాష్ట్రముందత్త ముడగు పాలకుని సర్వ ప్రయత్నములచే నిలుపుకొనవలెను. ఆనిలుపుటకూడ రాష్ట్రములోని పెద్దలు ధర్మజ్ఞులు కలసి నిర్ణయింపవలెను. సత్యవ్రతిజ్ఞుడగువానిని రాజుగా గైకొనవలెను. లోకమం దేప్రజలకుత్తమ ప్రభువు లభించునో వారికి దేనంగాని భయము గలగదు. కావున అందుచే రాష్ట్రములో ప్రధానులయిన ధర్మనిత్యుని, వినయశీలియైన ''రాజును'' దమకు దామేర్పరచుకొనవలయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖంమున రాజ ప్రశంస యను రెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters