Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము - పురందరశాంతి

పుష్కరః : కార్యా పౌరందీర శాంతిః ప్రాగేవా7స్య పురోధసా | ప్రాప్తే7భిషేకదివసే సోపవాసః పురోహితః || 1

సోష్ణీషః శ్నేత వసనః సితచందన భూషితః | సితమాల్యోపవీతశ్చ సర్వాభరణ భూషితః || 2

వేది ముల్లిఖ్య యత్యేన కృత్వాచ విధివత్తతః | జుహుయా ద్వైష్ణవాన్‌ మంత్రాన్‌ తథా శాక్రాన్‌ విచక్షణః || 3

సావిత్రాన్‌ వైశ్వదేవాంశ్చ సౌమ్యాం చ విధివత్తతః | శర్మ వర్మగణం చైవ తధా స్వస్త్యయనం గణమ్‌ || 4

ఆయుష్య మభయం చైవ తథాచైవా7 పరాజితమ్‌ | సంపాతవన్తం కలశం తధా కుర్యాచ్ఛ కాంచనమ్‌ || 5

వహ్నే ర్దక్షిణ పార్వ్శస్థః శ్వేతచందనభూషితః | శ్వేతాను లేపన స్ర్సగ్వీ సర్వాభారణ భూషితః || 6

ఆసనస్థముఖం పశ్యేన్ని మిత్తానిహుతాశ##నే | 7

పశ్యేయు రన్యే చ తథా నృసింహా! | దైవజ్ఞవాక్య న్నిపుణం స్వరూపమ్‌ |

సాంవత్సరస్యా7థ సదస్యముఖ్యాః | సదస్యముఖ్యాశ్చ పురోహితస్య || 8

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే పురందరశాన్తిర్నామ ఏకోన వింశో7థ్యాయః

పుష్కరుడనియె: పట్టాభిషేకముముందే పురోహితుడు పౌరందరశాంతి (ఇంద్రశాంతి) కావింపవలెను. ఆనా డాత డుపవాసమునుండి తలపాగ దాల్చి తెల్లవస్త్రములు గట్టుకొని తెల్లని చందనము పూలమాలలు దాల్చి సర్వాభరణములు దొడిగికొని ఆగ్ని వేదియుల్లేఖనము యథావిధి నొనరించి విష్ణుదేవతాకము ఇంద్రదేవతాకములయిన మంత్రములతో హోమములు సేయవలెను. సవితృదేవతాకములు (సావిత్రముల) వైశ్వదేవములు సౌమ్యములు (సోమదేవతాకములు) శర్మగణము వర్మగణము స్వస్త్యయన గణము ఆయుష్యము ఆభయము అపరాజితము నను మంత్రములతో హోమములు సేయవలెను. బంగారపు సంపాతవంతకలశమును నుంచవలెను. (సంపాతమనగా-హోమాంతమునందు స్రువాంతమున గల ఆజ్యమును కలశములో నుంచుట) అగ్నికి దక్షిణము వైపు కూర్చుండి తెల్లని చందనము పూసికొని తెల్లనిపూలు దాల్చి సర్వాభరణ భూషితుడై సింహాసనమందున్న రాజుముఖమును జూడవలయును. అగ్నియందు శుభనిమిత్తముల నితరలు దిలకింపవలెను. జ్వాలలు ప్రదక్షిణముగా దిరుగుట మొదలయిన నక్కడి శుభనిమిత్తములను దైవజ్ఞుని మాటంబట్టి యటనున్న యందరును నేర్పగ స్వరూపమును జూడవలయును. సదస్సులు సాంవత్సరుని ముఖమును దర్శింపవలయును. పురోహితుని ముఖమును జూడవలయును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పురందరశాంతియను పందొమ్మిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters