Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఎనుబదిమూడవ అధ్యాయము - వాహన సజ్జీకరణము

పుష్కరఉవాచ :- సన్నద్ధైశ్చర్మభి ర్భావ్యం తథా బద్ధకృపాణిభిః | చర్మాణి తత్ర వైయాఘ్ర మాహిషాణ్యృషభాని చ.

ఖేటకాద్యథ వా రామ | చర్మాణి ప్రభవంతి తు | తథా వరణ ముఖ్యాని ఖడ్గాని వివిధాని చ.

బద్ధాదిభి స్సతూణీరై స్తథా రామ ! సతోమరైః | బద్ధగోధాంగుళిత్రాణౖ ర్బద్ధాదర్శై ర్విభీషణౖః.

తథా పరశ్వథోపేతై రామ ! స్వాసన యోధిభిః.

గదాధరా స్తథైవాత్ర సకృత్పాణి పరిచ్ఛదాః | సుసన్నద్ధా స్సుమనసో భ##వేయు ర్విపులౌజసః.

యత్రయస్య విశేషేణ శస్త్రాసై#్త్ర ర్ఘాతకౌశలమ్‌ | తదేవ తస్య నిర్దిష్టం యథావన్మనుజోత్తమ.

సఖలీనా స్సపర్యాణా స్తథా సాస్తరణా హయాః | కార్యాః సకవచా యుద్ధే చామరాపీడ ధారిణః.

అశ్వీ భ##వే త్సుసన్నద్ధో రశ్మిప్రగ్రహకోవిదః | తథా సావరణో రామః సకృపాణపరిచ్ఛదః.

బద్ధాసి ర్భద్ధ జీవశ్చ తురగారూఢ పిండకః | ససుప్రాసో భ##వే ద్రామ! నానాయుధ ధర స్తథా.

రథః కార్య స్తథా యుక్తః ఈషాదండక బంధురైః | సుచక్రోవస్కరయుతః సర్వరూపః పతాకరాట్‌.

త్రివేణు సంతత శ్చైవ వైయాఘ్రపిరివారణః | కింకిణీ జాలనిర్ఘోష స్తథా వై సుప్రతిష్ఠితః.

ఉపాసంగై ర్ని షంగైశ్చ తూణీరైర్వకార్ముకైః | సర్వాయుధైరుపే తశ్చ తథావృక్షాదనీయుతః.

తోయ జీరకపిండీభి ర్యుక్తః శృంగై స్తథైవ చ | సన్నద్ధ స్సారథి స్తత్ర భ##వేద్రామ! ప్రతోదవాన్‌.

రశ్మి గ్రహణ విచ్చాపి తథా మండలకోవిదః |

పుష్కరుం డిట్లనియె :- చర్మములు (కత్తియొరలు) గైకొని కత్తులు పూని ధనుర్విద్యాభ్యాసకులు సన్నద్ధులయి యుండ వలెను. చర్మము పెద్ద పులి మహిషము (దున్నపోతు) ఎద్దు అనువానిపై యుండవలెను. ఖేటకము మొదలయినవి కత్తులలో రకాలు చేకొనవలెను. బల్లెములు అమ్ముల పొదులు ఉడుము చర్మముతో జేసినవి చేతివ్రేళ్లకు దెబ్బ తగులకుండ తొడిగికొను తొడుగులు జడుపుగొలుపు నద్దములతో గూడినవి పరశ్వథములు =గట్టిగ నిలువబడి పోరగల యోధులు యుద్ధాదరులై చేతులకు గూడ తొడుగులూని దృఢమనస్కులై యాదకముగొని మంచి పరాక్రమవంతులై యుండవలెను. ఎవని కే యాయుధమందు ఏ రకమైన శస్త్రాస్త్ర ప్రయోగమందు నేరిమి యుండునో యదే వానికి నిర్దేశింపబడును. కళ్ళెములు పల్యాణములు జీనులు కవచములుం గల గుర్రములను ఆభరణము=కంబళి తలపై ఆపీడములు=చామరముల తురాయి లలంకరించిన గుర్రములు సుసన్నద్ధుడయిన ఆశ్వికుడు (గుర్ఱపు రౌతు) వలెను పగ్గములను పట్టు నేర్పు గలవాడు కవచము కత్తి మొదలయిన సామగ్రి కలవాడై యొరలో కత్తినిడుకొని వింటికి నారి దొడిగికొని పిక్కలు గుర్రముం దాకించి మంచి యీటె చేకొని సన్నద్ధుడు కావలెను. పోలుగర్ర చక్రాలు మొదలయినవి సరిగానున్న జెండాతోనుండు వెదురుగడలతో గూడి పులిచర్మము పరచి చిరుగంటలు మ్రోయ ఉపాసంగ అమ్ముల పొదులు కత్తియొరలు విండ్లు అన్ని యాయుధములతో వృక్షాదనైః=గండ్రగొడ్డళ్ళతో గూడి (వృక్షాదనీయతః అను పాఠమున్నది వృక్షాదని=బదనికనేలగుమ్ముడు ముయ్యాకు పొన్న అని యర్థము చెప్పవలెను. ఇక్కడ నీయర్థముకూడకుదరవచ్చును. ఈరథములో నుండవలసిన సామగ్రితో బాటు దెబ్బలు తగిలినపుడు చేయవలసిన చికిత్సల కుపయోగించు సామగ్రి యిక్కడ పేర్కొనబడినది కనుక) తోయ = వట్టివేళ్ళు - కురు వేరు జీరక - జీలకర్ర పిండీ=గ్రంధితగరము ఆనప పిండ ఖర్జూరము (ఇందేదో నిర్ణయింప వలసి యున్నది) శృంగైః=అల్లము వేగిస జీవకముదుంప ఇవి రథమునం దుండవలసిన యోషధులు. అందు సారథి ప్రతోదవాన్‌ =మునికోల-కొరడా-చేకొని పగ్గములు పట్టు నేర్పుగలిగి మండల కోవిదః=రథమును పలుతీరుల రథము త్రిప్పగలవాడై అశ్వ హృదయ మెరిగినవాడై చక్కని యిమిడిక ఆసన శుద్ధి గల్గి సమయమెరిగి కత్తి నొరలో గట్టుకొని చేతం బాశముగొని సారథి సన్నద్ధుడు కావలెను.

తథా7శ్వ హృదయజ్ఞశ్చ దూరదృష్టి స్సుయంత్రితః.

స్వాసనః కాల విచ్చైవ బద్ధాసిః పాశసం యుతః | పార్షిః స్యా దాయుధజ్ఞస్య తథైవాయుధ కోవిదః.

చిరేణ మూలే యస్యస్యా దవస్థానం మహాభుజః | పతాకావరణం యస్య ఆయుధానాం సమర్పణమ్‌.

సమాయాంతం మహాభాగం తథా సారథి రక్షణమ్‌ | స్యాతాం ధనుర్ధరౌ తత్ర తథా చ రథినా వుభౌ.

యోధౌ దనుర్భృతాం శ్రేష్ఠ! సర్వాయుధ విశారదౌ | తురగాశ్చ సుసన్నద్ధా దాంతాః కార్యాస్తథా రథే.

తుల్యవేగ బలాశ్చైవ తథా లఘు పరిచ్ఛదాః | అతః పరం ప్రవక్ష్యామి తథా నాగేంద్రకల్పనమ్‌.

కుంజరః స్యా త్సు సన్నద్ధః సపర్యాణః కుథావృతః | సర్వాయుధ ధరశ్చైవ తథా యోధా వరాయుధాః.

పరశ్వథకరా శ్చైవ తోయజీరక సంయుతాః | సమ్యగ్వి భాజ్యాశ్చతథా శృంఖలావ తతా స్తథా.

పతాకాశ్చ తథా కార్యాః కుంజరాణాం సుశోభనాః | వరాంకుశధరౌ తత్ర స్యాతాం మనుజ పుంగవౌ.

ఏకః పృష్ఠస్థిత స్తత్ర ద్వితీయః స్కంధగో భ##వేత్‌ | యోధౌ ద్వౌవరధానుష్కౌ ద్వౌచ ఖడ్గధరౌ వరౌ.

తయో రను భ##వేతాం వైతథా రక్షా పరాయణౌ | ఏకః పార్షిణః స్తత్ర వరశక్తిపతాకధృక్‌.

పాలయే జ్జఘనం యద్వ త్కుంజరస్య మహామతేః | ఏవం పరస్పరాయత్తా రక్షా తేషాం యథా భ##వేత్‌.

మహామాత్రస్య ధర్మజ్ఞ! తథా చ గజయోధినః | ఏవమేవ తథా రక్ష్యో రథిన స్సరథీ భ##వేత్‌.

కుంజరస్యతు రక్షార్థం భ##వేద్రథ చతుష్టయమ్‌ | రథే రథే గజే వాపి తురగాణాం త్రయం భ##వేత్‌.

ధానుష్కాణాం త్రయం ప్రోక్తం రక్షార్థం తురగస్య చ | ధన్వినో రక్షణార్ధాయ వర్మిణో7పి నియోజయేత్‌.

కార్యం సర్వం సుసంబాధం తథా తోరణ రక్షణమ్‌ | యోజనా చ తథా కార్యా యథా తు స్యా ద్ధృతి క్రమః.

సంబాధశ్చ తథా రామః నభ##వే చ్చ పరస్పరమ్‌.

నాగేంద్ర కల్పం తవ సర్వయుక్తమ్‌ | సంక్షేపతో భార్గవ వంశముఖ్య !

ఏతత్తు కృత్వాపి నరస్సయుద్ధే | జయత్యవశ్యం సముపార్జనే చ.

ఇతి శ్రీవిష్ణు మహాపురాణ ద్వితీయభాగే శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే మార్కండేయ వజ్ర సంవాదే రామం

ప్రతిపుష్కరోపాఖ్యానే ధనుర్వేద వాహన సజ్జీకరణో నామ త్ర్యశీ త్యుత్తర శతతమో7ధ్యాయః.

సమాప్తో7యం శ్రీవిష్ణు ధర్మోత్తర ద్వితీయ ఖండః.

పార్షిణ=ప్రక్కనుండు అంగరక్షకుడు-ఆయుధ ప్రయోగ నిపుణుడు - మూలబలములో జిరకాలమునుండి పనిచేయుచు నున్న వాడు వీరుడునై యుండవలెను. ఆయుధములన్ని వానిచేత నుంచవలెను. అతడు జెండాకు చాటున నిలువవలెను. సారథిరక్షణము వానిపని. ఇద్దరు రథికులుధనుర్ధరులై సర్వాయుధ విశారదులైన వారంగరక్షకులుగా నుండువలెను. సర్వసిద్ధములుగా నుశిక్షితము లయిన గుఱ్ఱములను రథములకు బూన్చవలెను. అవి యొకదానికొకటి తీసిపోని సమానవేగము బలముగలవై లఘువైన ఆవరణము గల్గియుండవలెను. (వానిపై బరువైన సామగ్రులుండరాదన్న మాట.)

ఏనుగును సర్వసిద్ధమొనరిపంవలెను. కంబళముమీద బరుచవలెను. పర్యాణము - జీను - నమర్పవలెను; యోధులు సర్వాయుధ ధరులు పరశ్వథము లూని తోయజీరకముల సేకరించుకొని లెస్సగ వీరర్హులని ఏర్పరింపబడినవారు శృంఖల+అవతతాః=గొలుసులయెడ జాగమురూకు మావటీండ్రుండవలెను. ఏనుగుపై చక్కని పతాక మెత్తవలెను. అంకుశముగొని యొకమావటీడు వెనుకను రెండవ వాడు మూపునను నుండవలెను. వారికంగరక్షకులుగా నిద్దరు యోధులాయుధములు కత్తులూని వారివెంట నుండవలెను. అందొకడు వెనుక శక్తి యనుయాయుధము జెండాపట్టుకొని యుండవలెను. ఇట్లు వారన్యోన్యరక్షణాయత్తులై యుండవలెను. మావటి వానికి గజమెక్కి యుద్ధము సేయువానికి రథికునికి రథసారథికిని నిట్లు అన్యోన్యరక్షకులుండవలెను. ఏనుగు రక్షణకొరకు రథము లుండవలెను. ప్రతి రథమునకు ప్రతి గజమునకు మూడు గుఱ్ఱములు (అశ్వములు) తోడుండవలెను. అశ్వరక్షణకు ముగ్గురు ధనుర్ధరు లుండవలెను. ధనర్ధరుల రక్షణకును వర్మిణులను (కవచధారులను) నియమింపవలెను. పురతోరణము సైన్యసమ్మర్ధము నొనరించి నగర రక్షణము సేయవలెను. ఆ సమ్మర్దము తమలోదమ కిరుకుగాకుండ ఇమిడికగ నాగేంద్రకల్పమును (గజసైన్య విధానమును పూర్తిగా నీకే తెల్పితిని. దీని నాచరణమందుంచిన నరుడు (నరపతి) పరరాజ్యసముపార్జనమునంది జయమునొందును.)

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమందు వాహన సజ్జీకరణమను నూటయెనుబదిమూడవ అధ్యాయము.

ద్వితీయ ఖండము ముగిసినది

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters