Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఎనుబదియవ అధ్యాయము - ఆయుధ ప్రయోగ వర్ణనము

పుష్కరఉవాచ :-

పూర్ణాయుధో భృతిం కృత్వా తతోమాంసైర్గతాయుషామ్‌ | వరాహ మృగమేషాణాం మహిషాద్యై స్తథా ద్విజ.

మునిధౌతం తతం కుర్యా ద్యుగ్యం భూపైర్విధానవిత్‌ | మృదు సంస్తరణోపేతం మృదు వల్గు చ యోజయేత్‌.

తతో వాహం సమారుహ్య దంశితః సుసమాహితః | తూర్ణ మాబధ్య బధ్నీయా ద్ద్పఢాం కక్షాం చ దక్షిణామ్‌.

వైకక్షమపి త చ్చాపం ధారయే ద్యంత్ర సంస్థితమ్‌ | తతః సముద్ధరే ద్బాణం తూణా ద్దక్షిణ పాణినా.

ఆయుధములు సంపూర్ణముగగాని చనిపోయిన జంతువులు మాంసముచే భృతిని ప్రాణధారను సేసికొని అశ్వమును వాహనమును మునిచేత (ముని వృక్షమనగా లొద్దుగ అవిసి దమనము మోదుగ సారమంగ గంధమాంసి గార గిలిగింతచెట్టు అని అనేకార్ధాలున్నవి. ఇందేదో ఒక ఓషధిచేత రాజవాహనమును ఏనుగునేని గుఱ్ఱమునేని కడుగవలెనని యిక్కడ తోచుచున్నది). ఆమీద దానిని మెత్తని ఆస్తరణము పఱచి మృదువుగ మధురముగ దానిం బూన్పవలెను. అటుపైని (దంశితః) కవచముతొడిగికొని దానిపైనెక్కి మనస్సు కుదుటబెట్టుకొని వేగముగ (తూణం) అమ్ములపొదిని చంకను బిగించుకొనవలెను. మంత్రస్థితమైన విల్లును (వైకక్షం) జందమువలె ఎడమభుజము మీది నుండి కుడి చేతిక్రిందికి వ్రేలాడునట్లు ధరింపవలెను. అవ్వల నమ్ములపొదినుండి కుడి చేత బాణమును గైకొనవలెను.

తద్ధనుః స్సుహితం సర్వం మధ్యే సంగృహ్య ధారయేత్‌ | వామహస్తేన వైకక్ష్యాద్ధను స్తస్మా త్స ముద్ధరేత్‌.

సునిషణ్ణ మతి ర్భూ త్వా గుణ పుంఖం నివేశ##యేత్‌ | సంపీడ్య సింహకర్ణేన పుంఖేనాపి సమే దృఢమ్‌.

వామకర్ణోపరిస్థం చ ఫలం వామస్య ధారణాత్‌ | బలా మధ్యమయా తత్ర వామాంగుత్యా చ ధారయేత్‌.

మనో లక్ష్యగతం కృత్వా దృష్టిం చ సువిధానవిత్‌ | దక్షిణ గాత్రభాగేతు బలా మాశు విమోక్షయేత్‌.

లలాటపుట సంస్థానం తూణం లక్ష్యే నివేశ##యేత్‌ |

ఆకృష్య తాడయే త్తత్ర దండకం షోడశాంగుళమ్‌ | ముక్త్వా బాణం తతః పశ్చా ద్బలాం శిక్షే త్తదా తదా.

విగృహ్ణీయా న్మధ్యమయా తతో7ంగుల్యా పునః పునః | అభిలక్ష్యాక్షిపే త్తూణాం శ్చతురస్రం చ దక్షిణమ్‌.

చతురస్రగతం వేధ్య మభ్యసే దాదితః స్థితః | తస్మాదనంతరం తీక్షణం పరావృత్తగతం చ యత్‌.

నిత్యమున్నత వేధ్యం త మభ్యసే త్తుష్యకం తతః | వేధ్యస్థానే ష్వథైతేషు సన్యస్త పుటకం ధనుః.

హస్తావాపగతైః స్రసై#్త ర్జపేద్ధస్త కరైరపి | తస్మిన్‌ వేధ్యగతే రామ ! ద్వేవేధ్యే దృఢ సంజ్ఞితే.

ద్వే వేధ్యే పుష్కరే విద్ధి ద్వే తథా చిత్ర పుష్కరే | చతురస్రం చ తీక్‌ష్ణం చ దృఢ వేధ్యే ప్రకీర్తితే.

చతురస్రం స్థూల తీక్షణం............. నిమ్న పుష్కర ముద్దిష్టం వేధ్య మూర్ధ్వగతం చయత్‌.

పుష్కరే7ధమవేధ్యే తు చిత్రపుష్కర సంజ్ఞకే | ఏవం వేధ్యగణం కృత్వా దక్షిణ నేతరేణ చ.

ఆరోహేత్‌ ప్రథమం ధీరో జిత లక్ష్య స్తతో నరః | ఏష ఏవ విధిః ప్రోక్తః తత్ర దృష్టః ప్రయోక్తృభిః.

చక్కగానమరించివిల్లు చంకనుండి నెడమ చేతబట్టి తిగిచి గ్రహించి మనస్సు నిలుకడగల వాడై నారియందు అమ్ము అమ్ముపిడిని నానించవలెను. ఆమీద (సింహకర్ణేన) బాణమువదలు నపుడుకుడి చేతి యందు ఒకానొక విన్యాసవిశేషముతోను (ధనుర్వేదపరిభాషయిది) దానితోగూడిన అమ్ముపిడితోను సరిగా గట్టిగా నానించి ఎడమచెవి మీదుగానున్న (ఫలమును) బాణపుకేడెము (బెత్తము)ను (బలామధ్యమయా) నడుమ బల-ముత్తవ పులగమనే వేరు-ను కట్టిన ఎడమవ్రేలితో దాని పట్టుకొని మనస్సునకు గురియైన వస్తువుపై దృష్టిని నిలిపి కుడి శరీరభాగమందు ఆ(బలను) మంత్రితమైన ఓషధిని విడిచి వేయవలెను.

లలాటపుటమున (నుదుట నడుమనన్నమాట) ఎదురుగా బాణమును గురి సేయవలెను. ఆమీద ధనుర్దండమును పదునారంగుళములు ఆకర్షించి (లాగి) బాణమును వదలి అపుడపుడు బలను అభ్యసించవలెను. నడిమి వ్రేలితో మరలమరల గురిని లక్షించి నాలుగువైపులకు కుడివైపునకు బాణాలను మరిమరి వదలవలెను. నలువైపులుగా జిమ్ముపద్ధతిని మొట్టమొదట అభ్యాసము సేయవలెను. అటుపైని తీక్షణము పరావృత్తగతము నిత్యము ఉన్నత వేధ్యము మొదలగు బాణప్రయోగ విశేషములను అలవరచుకొని తుష్యకమను దాని నాపైని అభ్యాసము చేయవలెను. అటుపై నీ వేధ్యసాధనములందు ధనుఃప్రేషకమునుంచి హస్తా అవాపములో చేతి కుదురులో (ముట్టుచు) నుంచినవి చేతనుంచగా జారిన వాని చేతను జపింపవలెను. ఆ రెండు రకాల వేధ్యములలో గురులలో రెండు దృఢ వేధ్యములను పేరుగలవి రెండు పుష్కరమందు రెండు చిత్రపుష్కరమందు దృఢవేధ్యము తీక్షణమునని రెండు విధములు. చతురస్రము స్థూలము తీక్షణము (సూక్ష్మముకాబోలు). నిమ్నపుష్కరమను వేధ్యము ఊర్ధ్వగతము ఊర్ధ్వముగా పోవునది.

అధమ వేధ్యములయిన పుష్కరములు చిత్ర పుష్కరములను పేరు గలవి. ఈ విధముగా వేధ్య గణమును దక్షిణముగా (కుడిగా) ఎడమగా పొనరించి ధీరుడు మొదటి వేధ్యగణము నధిరోహింపవలెను. లక్ష్యసిద్ధిని సాధించినవాడే యిది చేయగలడు. ఆయుధ ప్రయోగసిద్ధు లిదియే విధానమును చెప్పిరి.

ఆదికం భ్రమణం తస్య తస్మాద్విద్వన్‌ ః ప్రకీర్తితమ్‌ | లక్ష్యం సంయోజయే త్తత్ర ప్రతి యంత్ర గతం దృఢమ్‌.

భ్రాంతం ప్రచలితం చైవ స్థితం యచ్చ భ##వేదితి | సమంతా చ్ఛాదయే త్పశ్చా చ్ఛేదయే చ్ల్ఛథయేదపి.

కర్మయోగ విధానజ్ఞో జ్ఞ్వాత్వైవం విధిమాచరేత్‌ | మనసా చక్షుషా దృష్ట్వా యోగం శిక్షన్న్యముం జయేత్‌.

దత్వా ప్రయుక్తం సుకృతం ప్రమాణా | న్న్యస్యే త్సమంతా త్పుటకాన్వి చిత్రా&.

అప్యం గుళీయ ప్రతిమాం జపే చ్చ | వాలం గతాః కాష్ఠగతం ప్రలంబమ్‌.

సిద్ధార్థకా& గుంజయవాంశ్చ తస్మిన్‌ | న్యసే ద్విధిజ్ఞో భ్రమరీరికాం చ |

మృత్పిండ సంస్థాన్‌ ఫలకాంక్షితాంశ్చ | కబంధ నిష్పావక పేలవాంశ్చ.

హంసాన్‌ మయూరాన్కు రరాం స్తథాచ | కారండవాంశ్చైవ శిలీముఖాంశ్చ |

గృధ్రానులూకానథవా7పి చాషాన్‌ | కపోతగోథా శుక సారికాశ్చ.

పలాశమూలోర్ణవ పూర్ణ దేహాం శ్చర్మావ బద్ధాం మృదు చిత్రగాత్రామ్‌ |

వరత్రయంత్రై ర్వివిధై స్సుయుక్తాం కాష్ఠావసక్తైర్బహుభిః ప్రకారైః

చలాస్థిరాం శ్చాప్రగతాంశ్చ విద్వాన్‌ | న్యస్యేద్యథాన్యాయ మథోర్ధ్వ సంస్థా& |

వ్యాఘ్రాన్మృగేం ద్రాన్పృషతాన్రు రూంశ్చ | మృగాన్స గోకర్ణ వరాహ వక్త్రా&.

గోమాయు మార్జార శశాం స్తథాన్యా& | ఋక్షాన్మృ గాంశ్చంద్ర మయేందు పూర్ణాన్‌ |

అన్యాన్స మీపోపగతా న్మృగాంశ్చ | విధాన విత్తాన్ర్పతి యంత్ర సంస్థాన్‌.

జాతాం స్తథాన్యాంశ్చ బహు ప్రకారా& | అనే కసంస్థా నవిబద్ధ దేహా& |

నానావిధైసై#్త ర్విశిఖ భ్రమస్థః సంధానయోగై స్త్రివిధైశ్చ హన్యాత్‌.

ఇతిశ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ధనుర్వేదో నామ అశీత్యుత్తర శతతమో7ధ్యాయః.

దానికంటె మించినది వేధ్యము భ్రమణ మనునది. అందు లక్ష్మమును (గురి) దృఢమయిన యంత్రగతముగా నొనరింప వలెను. ఏది భ్రాంతము ప్రచలితము స్థితము (నిలుకడ గలతియు) నగునో గమనించి అంతట దానిని కప్పివేయవలెను. లేదా త్రెంచి వేయవలెను. ఏలదా వదలు గావింపవలెను.

కర్మయోగ విధానమెరిగి నాతడీ వేధ్యగణ విధి నాచిరంచవలెను. మనస్సుచేత దృష్టిచేత నీ యోగ శిక్షణ మొనరించి యిందు కృతార్థుడు గావలెను. చక్కని కూర్పుతో చక్కగా ప్రమాణానుసారము పుటకముల నుంచవలెను. అవి భ్రమరీ రకములు మృత్పిండ రూపములు ఫలాపేక్షితములు కబంధ నిష్పావక పేలవములునుగా పెక్కు రకములుగా నుండును.

హంసలు నెమళ్ళు కురరములు కారండవములు శిలీముఖములు గృధ్రములు (గ్రద్దలు) ఉలూకములు (గ్రుడ్లగూబలు) చాషములు కపోతములు గోధలు (ఉడుములు) చిలుకలు గోరువంకలు ఆకులు దుంపలు ఊర్ణవ = రోమ మయములు చర్మ మయములు మృదువయిన రంగు రంగుల శరీరములు గలవి.

వివిధ వరత్రయంత్రముల గూడినవి. కాష్ఠాగుప్తముపై అనేక ప్రకారములచే కదలనివి వదలనివి అప్రగతములు (ఎగిరి పోనివి) నైన వాని యథాన్యాయము పైనున్న వానిని వేధ్యగణమును విన్యాసము సేయవలెను. వ్యాఘ్రములు సింహములు పృషతములు సరువులును గోకర్ణములు వరాహవక్త్రములుగల మృగములను నక్కలను పిల్లులన ఎలుగుబంట్లను లేళ్ళను చంద్రమయములను చంద్ర పూర్ణములను మరి పెక్కింటిని దగ్గరగా వచ్చిన వానిని ప్రతి యంత్రమందున్న వానిని అనేక స్థానముల వానిని పట్టువడని దేహముల వానిని నానావిధములయిన సంధానయోగములచే విశిఖభ్రమస్థః=బాణ పరిభ్రమణమందు మంచి నిలుకడ (నేర్పు) గలవాడై సంహరింపవలెను.

ఇక్కడ వేధ్యగణము అనగా బాణమునకు యంత్రము గురిచేయవలసిన లక్ష్యములు. వానిని సరిగా వేధించుటకు బాణ ప్రయోగ సిద్ధుడనుటచే వేటయనునది రాజులకు హింసావిషయమైనను ధర్మవిషయముగా రాజ ధర్మశాస్త్రములంగీకరించినవని ఈ అధ్యాయమువలన స్పష్టపడుచున్నది. ఇందలి భావము సమగ్రముగా నవగాహన మగుటకు ధనుర్వేద గ్రంథాలింకను పరిశీలింప వసలియున్నది. (అనువాదకుడు)

ఇది ధనుర్వేదమందు వేధ్యవేధవిధియను నూటయెనుబదియవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters