Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము - ధనుర్వేదము

రామ ఉవాచ ః-

ధనుర్వేదం సమాచక్ష్వం సంక్షేపా త్సురనందన | సర్వం త్వేమేవ జానాసి యథా దేవః పితామహః ||

పరశురాము డనియె ః సురకుమార ! బ్రహ్మవోలె నీవు సర్వజ్ఞుడవు. ధనుర్వేదమును సంక్షేపముగ నానతిమ్మన పుష్కరుండిట్లనియె.

పుష్కర ఉవాచ ః-

చతుష్పాదో ధనుర్వేద స్తథా పంచవిధో ద్విజ ! | రథ నాగా7శ్వ పత్తీనాం పాదా నాశ్రిత్య కీర్తితః ||

యంత్రముక్తం పాణిముక్తం ముక్త సంధారితం తథా | ఆముక్తం బాహుయుద్ధంచ పంచధా తత్ర్పకీర్తితమ్‌ ||

తచ్చ శస్త్రాస్త్ర సంపత్త్యా ద్వివిధం పరికీర్తితమ్‌ | దండమాయా విభేదే న భూయో ద్వి విధముచ్యతే |

ఋజుమాయావిభేదేన భూయో ద్వివిధముచ్యతే |.

ధనుర్వేదమందు నాలుగు పాదములున్నవి. అది యైదు విధములు. రథములు గజములు తురగములు పదాతిబలము నను చతురంగములను గురించి యంత్రముక్తము పాణిముక్తము ముక్త సంధారితము అముక్తము బాహు యుద్ధము నను పంచ విధ యుధ్ధ విధానములను నైదు విభాగములుగ పేర్కొన్నారు. అదికూడ శస్త్రములు అస్త్రములు నను వాని వివరణముతో మరి రెండు విధములయినది. ఋజు యుద్ధము మాయా యుద్ధము నను పేర నింకను రెండు విభాగము లందు గలవు.

-ః ఆయుధ లక్షణానిః-

క్షేపణీచాపయంత్రాద్యం యంత్ర ముక్తం ప్రకీర్తితమ్‌ |

శిలాతోమర చక్రాద్యం పాణిముక్తం తథైవ చ | ముక్త సంధారితం జ్ఞేయం పాశాద్యమపి యద్భవేత్‌ ||

ఖడ్గాదిక మముక్తం చ తథా జ్ఞేయం మహాభుజ | నియుద్ధం వ్యాయుధం జ్ఞేయం పాణి ప్రహరణాదికమ్‌ ||

తత్రాదా వేవ యోగ్యత్వం గాత్రాణాం తు విధీయతే | తథా వ్యాయామ చారిత్వం భారకర్షణమేవ చ ||

జితశ్రమో నియుద్ధేషు కర్మయోగ్యత్వ మాప్నుయాత్‌ | రథౌ7శ్వ గజ పృష్ఠేషు తాని శస్త్రాణి చా భ్యసేత్‌ ||

తాని వై ఖడ్గ ముఖ్యాని బహు ప్రత్యవరాణి చ |

-ః ఆ యు ధ ల క్ష ణ ము లు ః-

యంత్ర ముక్తము క్షేపణి యంత్రము చాపములనుగూర్చిగలది యంత్రముక్తము. శిలలు తోరములు చక్రములం గురించినది పాణిముక్తము. పాశాదులకు సంబంధించినది ముక్త సంధారితము ఖడ్గాది విషయ మముక్తము. బాహువులతో కుస్తీ పట్టుట మొదలయినది యాయుధము లుపయోగించని యుద్ధము బాహుయుద్ధము నియుద్ధమునని యందురు. అఆందు మొట్టమొదటిది కేవలము శరీరము నుపయోగించునది; వ్యాయామాచరణము భార కర్షణము (బరువు లాగుట) మొదలయిన వందులో జేరును. బాహు యుద్ధము లందు పరిశ్రమ చేసినతడు కర్మ యోగ్యత గలవాడగును. ఏ పని చేయుటకైన సమర్థుడుగా నుండునన్న మాట. రథములు గుర్రములు నేన్గుల నెక్కి అస్త్ర ప్రయోగమును అభ్యసింపవలెను. ఖడ్గాద్యాయుధ ప్రయోగము బాహు యుద్ధాదుల క్రిందివి పెక్కు రీతులు నేర్చుకొనవలెను.

ధనుర్వేదే గురు ర్విప్రః ప్రోక్తో వర్ణద్వయస్య చ |

వైశ్యస్య గురుతాం కుర్యా న్నవా కుర్యాత్తథా ద్విజమ్‌ | ధనుర్వేదే న గురుతాం శూద్రః కుర్యా త్కదాచన ||

స్వయ మేవ తు శూద్రం చ కర్తవ్యా కర్మయోగ్యతా | తస్మాత్‌ యుద్ధాది కారోస్తి శూద్రస్యా7పివిశాం పతే ||

సంగరాణా మపిపధా హితః స్యాత్స స్వయం ప్రభోః | సర్వ యత్నైర్మహా రాజ రాజా రక్ష్యః ప్రయత్నతః ||

శ్రద్ధావతో భుక్తి మతః సుశీలా9| న మ్రాన్వినీతా9 క్షమయోపపన్నా9 ||

స్నిగ్ధా 9 నరేశాన్‌ సుధృఢాన్మనోజ్ఞా 9| అధ్యాపనీ యాంస్తు వదంతి సంతః ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ధనుర్వేదవర్ణనో నామ అష్టసప్తత్యుత్తుర శతతమో7ధ్యాయః ||

ధనుర్వేదము విషయమున బ్రాహ్మణ క్షత్రియులకు గురువు విప్రుడు. వైశ్యునికి బ్రాహ్మణుని గురువుగా జేయవచ్చును. చేయక పోవచ్చును. ధనుర్వేదమందు శూద్రుడెప్పుడును గురుత్వము వహింపరాదు. శూద్రునికి కర్మయోగ్యత రాజు స్వయముగా కల్పింపవలెను. అందువలన శూద్రునికి గూడ యుద్ధాధికారమున్నది. సంగర మొనరించుటకు గూడ నతడు స్వయముగ ననుకూలుడగును. సర్వ ప్రయత్నములతో రాజు రక్షింపవలసిన వారు శ్రద్ధాభక్తులు గలవారు ఉత్తమశీలురు వినయవంతులు సుశిక్షితులు ఓరిమి గలవారు స్నేహభావము గలవారు మిక్కిలి దార్ఢ్యవంతులు చక్కనివారునగు రాజులను ధనుర్వేదాధ్యయనము సేయింప దగినవారుగా మహాత్ములు చెప్పుదురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ధనుర్వేదమను నూట డెబ్బది యెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters