Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటడెబ్బదిమూడవ యధ్యాయము - సూర్యాది గ్రహోదయాస్తమయ ప్రకరణము

భౌమ జీవమందాః కేంద్రః శీఘ్రః బుధసితౌ వక్రీమందా వత్యంతశీఫ్ర° మందగ్రహార్కాంతరగాః కాల దృశ్యాంశేన యదాతదా పూర్వార్ధోదయాస్తమయో రర్కోదయికో కాలః వశ్చార్థేన తదాస్తమయికః తాత్కాలిక గ్రహస్ఫుట విక్షేప మధాబ్యాహత వ్యాసార్థేన విభ##జేత్‌; లబ్ధగ్రహజౌదయికే ఋణ మాస్తమయిక వన ఉత్తర విక్షేప పరమాపక్రమేణ విభ##జేత్‌; లబ్దమయన విక్షేపే7న్యే శోధ్యమన్యధా దేయమ్‌; ఏవం గ్రహోద యాస్త లగ్నే భవతః తతో గ్రహాం తరాల్లగ్న వత్కాలః కలాంశ గ్రహాన్తరాం శానాం భుజాన్తరేణ భాగమపహరేత్‌; గ్రహే వక్రిణి భుక్తి యోగేనా లబ్దో దినాదిః కాలము పాస్త మయస్య ఏవ నక్షత్రణాం తేషాం ద్వాదశ దృశ్వాదృశ్యాంశః అగస్త్య ధ్రువక దిక్కర్మ ద్వయకం కృత్వా తద్ఘటికాద్వయేన స్వదేశ రాశ్యుదయే వర్ధయేత్‌. తాదృశే7ర్కే అగస్త్యోదయః వక్రోనే7స్తమయః. ప్రతిదైవసిక ఉదయో గ్రహాంతం లగ్న వశేనేతి.

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తర ద్వితీయ ఖండే ఉదయాస్తమయ ప్రకరణం నామ త్రిసప్తత్యుత్తరశత తమో7ధ్యాయః.

కుజ గురు శని శుక్రులు వక్రమందు మందగతి కలవారై కనబడీ కనబడని భాగముతో వారు మంద గ్రహములకు సూర్యునికి నడుమ నుందురో అపుడు పూర్వార్థోదయాస్తమయాల యొక్క అర్కోదయ కాలమగును. తరువాతి సగముచేత నస్తమయ మగును. తాత్కాలిక గ్రహస్ఫుట విక్షేప ప్రమాణమును జ్యాహతమయిన వ్యాసార్ధముచేత భాగింపవలెను. ఈ విధముగా గ్రహోదయాస్తమయ లగ్నాలు ఏర్పడును.

అటువంటి సూర్యునియందు అగస్త్యోదయము - వక్రోనమం దస్తమయము. ప్రతి దినోదయము గ్రహాంతము లగ్నము వలన నేర్పడును.

సూర్యుని కంటె శీఘ్రగతి కలిగినందున బుధ శుక్రులకు కుజ గురు శనులవలె పశ్చాదస్త ప్రాగుదయములు ప్రాగస్త పశ్చాదుదయములు రెండు విధములుగా మౌఢ్య ప్రారంభ నివృత్తులగును. ఋజు గతితో నున్న బుధునికి 13, శుక్రునికి 9, కుజునికి 17, గురునికి 11, శనికి 15 భాగల ప్రాంతమందు సుమారుగ నస్తోదయములగును. తాత్కాలిక గ్రహ స్ఫుట విక్షేపము లను వ్యాసార్థములచేత (Diametre లో సగముచేత) భాగించవలెను. లబ్ధ గ్రహ స్ఫుట విక్షేపములను అత్యుచ్చ అతి నీచాంశలచే భాగింపగా నాయా గ్రహముల ఉదయాస్తమయ లగ్నము లగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ద్వితీయ ఖండమున గ్రహోదయాస్తమయ ప్రకరణమను నూట డెబ్బది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters