Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యరువదియారవ అధ్యాయము - జ్యోతిశ్శాస్త్రే - శాస్త్రశాఖా వర్ణనము

శ్రీ మార్కండేయ ఉవాచ :- అధభార్గమో రామో వరుణ నందనం పుష్కరం నామ పప్రచ్ఛ:- ''భగవన్‌ః జ్యోతిశ్శాస్త్రం శ్రోతు మిచ్ఛామి | తమువాచ వారుణిః :- పురా సురర్షి మధ్యగతం భగవన్తం అతిశయం సర్వజగత్పాలన సంహార కరం శ్రీబ్రహ్మాణం భృగుర్విజ్ఞాపయా మాస - ''భగవాన్‌ః జ్యోతిషా మయనం శ్రోతు విఛ్చామి ః తమువాచ భగవాన్‌ పితామహః :- యదా మేత్వం కల్పాదౌ హృదయా జ్ఞాతః తదా మయాతే శ్లోకానాం చతుర్వింశతి లక్షం జ్యోతి రయన ముక్తం | తదేవ అస్మిన్‌ వారుణ యజ్ఞే మహాదేవా శాపేన జ్వాలాం భిత్వా వినిర్గతస్య జన్మాంత రోత్పన్నస్య అతి సంక్షిప్తం వక్ష్యామి || తచ్ఛ్రుత్వా సర్వమేవతే పూర్వ జన్మాభి హితం జ్యోతిర్ఞాన మావిర్భవిష్యతి ||

శ్రీ మార్కండేయుడిట్లనియె. అవ్వల భార్గవరాముడు వరుణకుమార పుష్కరుంగని ఐశ్వర్యాది షడ్విధ సంవత్సమృద్ధడైన ఓ వరుణనందన! జ్యోతిశ్శాస్త్రమును వినవలతునని యడుగ వారుణి యిట్లనియె. మున్ను బృందారక బృందమందున్న భగవంతుని జగముల నేలువానిని సంహరించువానిని శ్రీమద్బ్రహ్మ అగు దేవుని సర్వాతిశయుని గూర్చి భృగుమహర్షి స్వామీ! నేను జ్యోతిశ్చక్రగమన మాలింప గోరెదనని విన్నవించెను. అతనింగని పితామహుండిట్లు వల్కెను. కల్పము మొదలు నెపుడు నీవు నా హృదయము నుండి జనించితి వప్పుడు నేనిరువదినాల్గు లక్షల శ్లోకములతో జ్యోతిరయనముం జెప్పితిని. అద్దానినే ఆ వారుణ యజ్ఞమందు మహాదేవ శాపముచే జ్వాలను భేదించుకొని వెలువడి వచ్చి యింకొక జన్మమున బుట్టిననీ కతి క్లుప్తముగ జెప్పెదను. అది వినుటచే పూర్వజన్మమందేను నీకు జెప్పినదెల్ల వెల్లడి కాగలదు.

అధ భగవాన్‌ సహస్రరశ్మిం విమలో విమలమయుఖః క్షేమాయ శిఖి పత్రాకారః స్తవ గ్రహాయ చంద్రఇవ దృష్టిగమ్యో రాజ్యస్యాప్తయె చ న్ద్రమాః సమాగమే గ్రహాణా ముదజ్మధ్య గతశ్చ దృశ్యతే యథా సంభవంచ నక్షత్రాణాం సమాగమే నక్షత్రాదీ న్యపి శస్యన్తే |

భగవంతుడు వేయికిరణముల వాడచ్చము స్వచ్ఛమైన కిరణములంగొని నెమలి పురివలెనై చూపుల కందుబాటై రాజ్య ప్రాప్తికి చంద్రుడై గ్రహముల సమావేశమునందు నడుమం గానబడుచున్నాడు. నక్షత్రములతో సమాగమందు యథాలాభముగ సంభవించినపుడు నక్షత్రములుగూడ రాణించుచున్నవి.

అథ యస్మి నక్షత్రే భౌమః ఉదయం ప్రతి పద్యతే తస్మాత్‌ సప్తాష్ట నవమర్షే పూష్ణోముఖం నామ వక్త్రం కరోతిః

యేనాగ్ని మంతో బ్రాహ్మణాః అగ్నిజీవినశ్చ పీడ్యన్తే | దశ##మైకాదశ ద్వాదశే7శ్వముఖం నామ మరక కారకం కరోతి | త్రయోదశ చతుర్దశయోః వ్యాలాఖ్యం వ్యాల వృద్ధికరమ్‌ | పంచదశ షోడశయోః రుచిర ముఖం సంగ్రామ సూచకమ్‌| సప్తదశాష్టా దశయో రసి ముఖం చౌర ప్రాబల్యకరమ్‌ |

ఏ నక్షత్రమందు కుజుడుదయమందునో యానక్షత్రము నుండి ఏడవ యెనిమిదవ నక్షత్ర మందు పూషన్ముఖమను పేర ముఖమును బూనును. అగ్నిహోత్రములయిన అగ్ని జీవులునైన బ్రాహ్మణులు నాతనిచే పీడితులగుదురు. పది పదకొండు పండ్రెండు నక్షత్రము లందు అశ్వముఖమనెడి మరకకారకము=దుర్భిక్ష కారకమయిన యాకారము నొనరించును. పదమూడవ పదనాల్గు నక్షత్రమునందు సర్పమను పేర సర్పవృద్ధికరమైన ముఖము నొనరించును. పదునైదు పదునారు చుక్కలందు యుద్ధసూచకమైన సొగసైన ముఖము నూనును. పదునేడు పదునెనిమిదింట కత్తివంటి ముఖము దొంగల ప్రాబల్యము గావించును.

అథ బుధో భరణీ కృత్తికా రోహిణీషు విచరన్‌ ప్రాకృతాం గతిం సుభిక్ష జననీం విచరతి | ఆశ్లేషా రౌద్ర పిత్ర్యేషు

మిశ్రాం మిశ్ర ఫలదాం, పునర్వసు పుష్య భాగ్యార్యవ్ణుెషు సంక్షిప్తం మిశ్ర ఫలదా మేవ| ఆహిర్భు ధ్న్యాజ పౌష్ణ

శక్రాగ్నినామ్ని తీక్ష్‌ం నామ విగ్రహ కారిణీం మూలాది త్రితయ సంయోగాత్‌ కాన్తి కీర్త్యాది ప్రదామ్‌ | శ్రవణ

ధనిష్ఠా వారుణీ త్వాష్ట్రాణి , ఘోరాంఘోరఫలామ్‌ | జీవ స్త్రయోదశభి ర్మాసైః రాశిం విచరన్‌ శుభో భవతి | అన్యధా కష్టఫలః ||

అవ్వల బుధుడు భరణీ కృత్తికా రోహిణులందు సంచరించువాడై సుభిక్షము సేయు ప్రాకృత గతిలో జలించును. ఆశ్లేషామఖా పూర్వ ఫల్గునలందు చరించుచు అటనుండి మిశ్రమఫలమిచ్చు మిశ్రగతిని పునర్వసు పుష్య భాగ్య ఆశ్లేష ఆర్యవ్ణు మొఖములందు మిశ్రఫలమైన సంక్షిప్త గతిని బొందును. ఆహిర్భుద్న్య(పుబ్బ) ఆజ ఉత్తర పౌష్ణ శక్రచిత్త అగ్నిస్వాతి నామ నక్షత్రములందు యుద్ధకారక తీక్ష గతిని, మూల పూర్వాషాడ ఉత్తరాషాడ లందు కాంతి కీర్తి మొదలయిన వానికి కారకమైన నడకగొని శ్రవణ ధనిష్ఠ శతభిష పూర్వాభాద్రలందు ఘోరగతి నంది ఘోర ఫలముల నొసంగ జీవుడు గూడ పండ్రెండు మాసముల యక్కొక్క రాశిం జరించుచు శుభుడగును. కష్టఫలమిచ్చును.

అధ ఉదయాస్తమయ చారైః శుక్రన్య యమాద్యం నక్షత్ర చతుష్టయం అలాకానిచో మాధ్యం మండలం సుభిక్ష జననం

రౌద్రాద్యమపి చతుష్టయం ద్విజ భయప్రదం, శక్రాద్యం పంచర్షం రోగజననంధ్రనిష్ఠాద్యం షణ్ణక్షత్రమతి వృష్టి కరమితి ||

శుక్రుని యుదయాస్తమయ సంచారములం బట్టె భరణి మొదలు నాలుగు నక్షత్రములు ప్రథమ సంచార మండలము సుభిక్షము సేయును. (ఆర్ద్ర) రౌద్రాది నాలుగు నక్షత్రములందు రోగము సేయును. ధనిష్ఠ మొదలారింట నుండి అతి వృష్టికరమగును.

యద్దేశ ద్రవ్య పురుషనక్షత్రేషు సౌరో విచరతి, తత్పీడా బహ్వ్యూ భవన్తి | యస్యాం దిశి కేతో శ్శిఖా దీప్తా భవతి,

తందేశం నృపతి రభి యుంజ్యాత్‌ | ఉపరాగః శ్వేత రక్త పీత కృష్ణో రాహో ర్ట్రాహ్మణ క్షత్రియ విట్‌ శూద్ర పీడాం

కరోతి | అగస్త్యః స్ఫురణో రూక్షతయో పహూతః శిఖిశిఖాస్తో భయాయ | ఏవం విధా సప్తర్ష యశ్చ | ఏవం

విధేత్రైలో క్యమపి పీడ్యతే ఐశాన్యాందిశి కృత్తికాభి స్సహోదేతి కుమారః తస్మి న్నేవంవిధే బాలపీడా ||

శని యేదేశము యొక్క ద్రవ్యముయొక్క నరునియొక్క నక్షత్రములందు జలించునో వానికనేక పీడలు గల్గును. ఏదిక్కు కేతువుయొక్క శిఖ = మంట దీపించునో యాదేశమునుగూర్చి రాజు యుద్ధయాత్ర వెడలవలెను. రాహుగ్రహణము తెలుపు, పుసుపుపచ్చ, నల్పు రంగు గల దగునేని వరుసగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు పీడ గల్గించును. అగస్త్య నక్షత్రము రూక్షసృరణమై తీవ్రమగు ప్రకాశము గలదై తీవ్రముగ రగుల్కొల్పబడిన అగ్నియొక్క జ్వాలవలెనున్నచో భయ కారణమగును. ఈలాగే సప్త ర్షులుం గూడ యున్నచో నీలాగుననే ముల్లోకములు పీడనందును. ఐశాన్యదిశ యందు కృత్తికలతో కుమారోదయమగునేని (కుజుడు) ఈ చెప్పిన విధముగా బాలపీడ గల్గును.

జీవజ్ఞ సౌరాః పౌరాః | కుజ శుక్రా యాయిగ్రహౌ | చంద్రా7ర్క్‌ మధ్యమౌ | తత్ర అర్కేణ సహ గ్రహాణా

మస్తమయో భవతి | చంద్రేణసహ సమాగమః పరస్పరం యుద్దమ్‌ | ఉదఙ్మర్గగతః సుప్రభో విజయూ భవతి |

యాయి గ్రహే విజయిని సబలేచ రాజా పరానభి యుంజీత | అన్యథా పేరేషు బలవత్సు యాయినాం నాశః స్యాత్‌|

అగస్త్యవదు పహతే నక్షత్రే తద్దేశ ద్రవన్యతజ్జాత పురుషపీడా | వాయవ్యాందిశి భూచలో యాతి తాందిశం రాజా

యాయాత్‌ | సనిర్ఘాతే దీర్ఘే రాజ మరణం స్యాత్‌ | యాందిశ ముల్కా యాతి తాందిశం నృపోయాయాత్‌ | దివోల్కా

చంద్రార్క విని | ర్గతా ఉద్ఘాతి న్యతి స్థూలా సస్పునింగా తతోర్ధ్వగా రాజ మృత్యవే స్యాత్‌ | బహువర్ణే పరివేషే ప్రజ

పీడా స్యాత్‌ | యతః ఖండః పరివేషః స్యాత్‌ | తాందిశం నృపతి ర్యాయాత్‌ | అతి భీమ నిర్ఘాతో రాజ మృత్యవే ||

గురు బుధ శనులు పౌరులు కుజశుక్రులు యాయిగ్రహములు చంద్రార్కులు మధ్యములు అందు సూర్యుని చేత గ్రహాములకు అస్తమయము గల్గును. చంద్రునితో గూడ పరస్పర సమాగమము యుద్ధము ఉత్తర ముఖముగా నేగిన మంచి ప్రభగల్గి జయించును, యా యిగ్రహములు జయములో నుండి బలవంతుడై యున్నచో రాజు శత్రువుల నోడించును. అటుగాక పౌరులు (సూర్యచంద్రులు) బలశాలులైనచో యాయి గ్రహములకు నాశనము గల్గును. అగస్త్య నక్షత్రము వలె నక్షత్రము పహతమైనచో నాదిక్కున గల దేశమునకు ద్రవ్యమునకు అచ్చట మనుష్యులకు పీడ గల్గును. ఏదిశను భూమి చలించు నాదిశ##పై రాజు దండెత్తవలెను. పగలుల్క (ఉల్క కొరని) చంద్ర సూర్యుల నుండి వెడలి పెద్దపెట్టున అతి స్థూలమై మిణుగుల జిమ్ముచు పడి పైకిలేచెనా రాజు మరణము గావించును.

యాంచ దిశం యాతి తాందిశం రాజా యాయాత్‌ || గంధర్వ నగరం శక్యోద్భూతం మహాభయాయ | రాత్రా వింద్ర

ధనుః శ్యేత వ్యభ్రే చ మహాభయాయ | ప్రతిసూర్య ఉద గ్దక్షిణన అర్కాద్వాతకృత్‌ | ఉభయ స్థితో మహా వర్షాయ |

ఉపరి రాజా మృత్యవే || తధా7థస్తా జ్జన వినాశాయ || ఉభయధా మహాభయాయ | సర్వతః త్రిభువన పీడా వహో

భవతి | యాది గ్దాహేన దీప్తాస్యా త్తాందిదిశం రాజా యాయాత్‌ | అతిదీప్తే చాయా ప్యంజకే రాజ మరణం వింద్యాత్‌ ||

దాపరి వేషము చుట్టుగటెనపుడు బహువర్ణమైనచో ప్రజలకు పీడ ఏవైపు పరివేషముఖండము తునుకగ తెగియుండును. ఆవైపునకు రాజుదండయాత్ర చేయవలెను. శక్సోద్భూతమైన గంధర్వ నగరము (ఆకాశమందు నగరాకారముగ మబ్బులు కనబడుట) మహాభయకారణము. రాత్రివేళ నింద్రధనుస్సు మబ్బులేనపుడు తెల్లగ గనిపించుట మహాభయమునూ ఉత్తర దక్షిణచనము దిశలుగా సూర్యునికి ప్రతి సూర్యుడు గనిపించెనేని విపరీత వాయుభయము. రెండు దిక్కులందును గనిపించినచో పెద్ద వానమీదుగా గనిపించునేని రాజునకు మృత్యువు చెప్పవలెను. ఆ సూర్యునికి క్రిందుగా కనిపించిన జననాశము. ఇట్టిటు రెండువైపుల గనబడినచో మహాభయము ఎటుచూచినను గనిపించెనా త్రిలోక పీడ. ఏదిశ దాహముచే మంటలచే దీపించు నావైపు రాజు దండెత్తవలెను. అది అత్యంత ముగ మండినను నీడ గ్రమ్మినట్లు తోచును. రాజు మరణమగునని తెలియనగును.

అథ వాధ్రువ దారుణోగ్ర క్షిప్ర చరసాధారణషుయధా స్వకర్మ ధ్రువాది కర్మ క్రియమాణం సిద్ధము పైతి || వ్యతీపాత విష్టి వైధృతా7స్తమిత నక్షత్రేషు నకించిదపి || తధాచ అర్కా7నల రాహుధూమిత జ్వలిత దగ్ద విద్ధేషు నక్షత్రేషు తధాచ వివిధోత్పాత భిహతేషు యత్ర యస్మిన్‌ నక్షత్రే పురుషస్య జన్మ తన్నక్షత్రం తస్మాన్నక్షత్రా చ్చ దశమం తత ఏకోన వింశ జ్జన్మనక్షఁ తమితి వింద్యాత్‌ | సర్వస్మా జ్జన్మ నక్షత్రా ద్ద్వితీయం సంపత్కరమ్‌ | తృతీయం విపత్కరమ్‌ | చతుర్థ క్షేమ్యమ్‌ | పంచమం ప్రత్యక్‌ | షష్ఠం సాధకమ్‌ సప్తమం నైధనమ్‌ | అష్టమం మైత్రమ్‌ | నవమం పరమం మైత్రంచేతి || తత్ర సంపత్కర క్షేమ సాధక మైత్రా 7తి మైత్రేషు సర్వాణి కర్మాణి కుర్యాత్‌ | దశమర్షేచ || యాధా వర్మసు నక్షత్రే తిధింరిక్తాం వినా కృతమ్‌ | సౌమ్యే దినవృతే వత్సః సిద్ధి మాయా త్యసంశయమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే జ్యోతిశాస్త్రే శాస్త్రశాఖా వర్ణనంనామ షట్‌ షష్ట్యుత్తర శతతమో7ధ్యాయః ||

ఇక ధ్రువ-దారుణ-ఉగ్ర -క్షిప్ర- చరములగు నక్షత్రమలందు తన ధ్రువాది కర్మము సేసెనేని సిద్ధించును. వ్యతీపాత విష్టి వైధృత్య - అస్తమిత నక్షత్ర ములందు జేసిన నేమాత్రము ఫలింపదు. అలాగే సూర్య - అనల - రాహు - ధూమిత - జ్వలిత - దగ్ధ - విధములయిన నక్షత్రములందు వివిధోత్పాతములచే హతములయిన వాని యందే దానియందెక్కడ మానవునికి జన్మగలుగునో యానక్షత్రము ఆనక్షత్రము నుండి పదియది

అక్కడ నుండి పందొమ్మిదవదియు జన్మ నక్షత్రమని యెఱుంగవలెను. అది జన్మ నక్షత్రమేయన్నమాట. ఈనక్షత్రములలో రెండవది సంపత్కరము. మూడవది విపత్కరము. నాల్గవది క్షేమ్యము. ఐదవది ప్రత్యక్‌ (అత్యన్తారియన్నమాట). ఆరవది సాధకము, ఏడవది నైదనము. ఎనిమిదవది మిత్రము. తొమ్మిదవది పరమ మైత్రము. అందు సంపత్కర క్షేమసాధన మైత్రాతి మైత్రిమ లందు సర్వకర్మములు జేయవచ్చును. పదియవ దానియందును జేయవచ్చును. శుభనక్షత్రమందు రిక్త గాక తక్కిన తిథులందు సౌమ్యదినమందుం గావించిన పని నిస్సంశయముగ సిద్ధించును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున జ్యోతిశ్శాస్త్రమందు శాస్త్ర శాఖా (భాగ) వర్ణనమను నూటయరువదియారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters