Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట అరువదియైదవ అధ్యాయము - అంగ విద్యా యెగము

పుష్కరః- ప్రష్టుద్దేశే శుభే వేద్యం శుభంభవతి భార్గవ | అశుభే వా7శుభం రామః తన్మే నిగదతః శృణుః ||

శ్మశాన సూనాభవన బంధనాగార వేశ్మను | రధ్యా కర్దమ దుర్గేషు శూన్యేషు భవనేషు చ ||

కంటికి ద్రుమ యుక్తేషు శీర్ణ ప్రాకార వేశ్మను | వల్మీక మూషికా సర్వ సకీటే ష్వశుభం వదేత్‌ ||

మాంస స్పృష్టో పలిప్తేషు సుపుష్పేషు విశేషతః | ప్రశస్తడుద్రుమ యుక్తేషు విద్యా ద్విజయ లక్షణమ్‌ ||

ప్రశ్నయడుగువాడు శుభ##మైన ప్రదేశములో నిలిచియుండునేని శుబముగల్గును. అశుభ ప్రదేశమందడుగునేని అశుభము కల్గును. స్మశానము కభేళా (మాంసవిక్రయశాల) కారాగారము. నడిబాటలో (రోడ్డుమీద) బురదగలచోట శూన్య దుర్గములందు (పాడుపడిన కోటలందు) పాడిండ్ల యందు ముండ్లచెట్లున్నచోట కూలిపోయిన ప్రాకారములుగల పాడుపడిన యిండ్లయందు పుట్టలు ఎలుక కన్నాలు పాముకలుగులు పురుగులు నున్నచోట నిలిచి యడిగినచోనశుభఫలముం జెప్పవలెను. మాంస స్పర్శగల మాంసముచే బూయబడినచోట మంచి పువ్వులున్నచోట మంచి వృక్షములున్నచోట నుండి ప్రశ్నించినచో విజయమగును అని తెలియనగును.

సశాద్వలేషు తీరేషు సరాతాం సరసా మపి | భవనేషు విచిత్రేషు శుభం వాచ్యం విజానతా ||

అఖ్యక్తం శోచ్యవానంచ ముక్తకేశం తధైవచ | భూమిష్ట ముపసర్పన్తి తేషాం విద్యా దశోభనమ్‌ ||

హృష్ట శుక్లాంబ రోపేతా సుమనస్కా స్తధైవచ | దైవజ్ఞ మునసర్పన్తి తేషాం విద్యాచ్ఛుభం ద్విజః ||

బహవోదండ హస్తాశ్చ కాషాయ వసనా స్తధా | అభ్యక్తముండ పతితా స్తధా క్లీబాశ్చ యోషితః ||

శృంఖలా రజ్జుహస్తాశ్చ సంక్లిన్న ఫలపాణయః పృచ్ఛన్త స్తేతు విజ్ఞేయాః నృష్వశేష భయావహోః ||

పశ్చికతోడి నదుల సరస్సుల యెడ్డులందు విచిత్రములైన (రకరకాల రంగులవేసిన) భవనములందు ప్రశ్నింపగా శుభముం జెప్పవలెను. నూనె రాచికొన్న వానిని ఏడ్చుచున్న వానిని జుట్టు విరబోసికొన్న వానిని భూమిమీద నిలువబడియున్న వాని దగ్గరగాజేరి ప్రశ్నించువారి కశుభము గల్గునని చెప్పవలెను. అనగా ప్రశ్న చెప్పువాడీ స్థితిలో నుండగా నడిగిన ప్రశ్నకు శుభఫలము గల్గుదన్నమాట, ఆనందభరితుయి తెల్లని వస్త్రములందాల్చి మంచిమనస్సు గల్గి జ్యోతిషికుని దగ్గరకు బ్రశ్నయడుగుటకు వచ్చిన వానికి శుభము గల్గునని తెలియనగును. దండహస్తులై గుంపుగావచ్చి కాషాయవస్త్రములు గట్టుకొని తలకు నూనె రాచికొనిన వాండ్రు జాతిభ్రష్టులు నపుంసకలు స్త్రీలు చేతిలో సంకెళ్ళు త్రాళ్ళు పట్టుకొన్నవాండ్రు తడిపండ్లు చేతిలోగల వాండ్రునై ప్రశ్నింపవచ్చిన వారు మానవులలో నత్యంత భయంకరులని తెలియవలెను. అనగా నట్టి వారికి గల్గు ఫలమతి భయంకరముగా నుండునని భావము.

శుక్లాంబరాః సపుష్పాశ్చ తధైవ షలఫాణయః | రత్న హస్తాః శుభాజ్ఞే యాస్తధా మంగళ వాదినః ||

తెల్లని వస్త్రములు దాల్చి పూలుపండ్లు పట్టుకొని రత్నములు చేకొనివచ్చిన వారు శుభఫలము నిత్తురు.

-:సమయానుసారి శకునాని:-

వేలాః సర్వాః ప్రవశ్యేత పూర్వాహ్ణే పరివృచ్ఛతః | సంధ్యయో రపరాహ్లేచ నిశాయాంచ విగర్హితాః ||

శాన్తాం దిశ మధా7స్థాయ ప్పచ్ఛత స్సద్ధి మాదిశేత్‌ | ఉదీచీం ప్రాగుదీచీంచ పూర్వాం చైవ విశేషతః ||

అంగుష్ఠ నఖ పాదోరుగుల్ప ముష్కమురఃస్తనాః | గండ శృంగాక్షికా కర్ణౌదన్తోష్ఠ భుజ మస్తకమ్‌ ||

-:సమయములనుబట్టి శకునములు:-

పూర్వాహ్ణ యినందు సంధ్యలందు అపరాహ్ణమందు రాత్రివేళలు దుష్పలములిచ్చును నింద్యములు ప్రశాంతమైన దిక్కున నిల్చి యడిగిన వానికి శుభము గల్గునని చెప్పవలెను. ఉత్తరదిక్కు ప్రాగుదీచి తూర్పు ఉత్తరమునకున డిమిది ఈశాన్యమూల తూర్పు దిశయు విశేష శుభఫల మిచ్చును. బొటన వ్రేళ్ళు గోళ్ళు పాదములు తొడలు మడమలు ముష్కములు (వృషణములు) రొమ్ము స్తనములు చెక్కిలి శృంగాక్షికలు, చెవులు, దంతములు, పెదవులు, భుజములు, నడినెత్తి

గురులు ర్గురు వస్తిశ్చ వక్షః కక్షోరు సంధయః | పున్నామా న్యేవ మాదీని స్పృశతః వృచ్ఛతః శుభమ్‌ ||

కర్ణపాళి ర్భువ్‌ నాసా జిహ్వా గ్రీవా కృకాటికాః | నాభిశ్రోణి స్ఫిచే జంఘే పిండి కాంగుళ యో7పి చ ||

పాణి పాదాశ్రయా రేఖావలయః సర్వ సంధిషు | పార్షణ్‌ రిత్యేవ మాదీని స్త్రినామా న్యభి నిర్దిశేత్‌ ||

గురులు=గురువస్తి వక్షః స్ధలము చంకలు తొడలు సంధులు నను సంస్కృతములో పులింగములో గల యవయవములను స్పృశించుచు ప్రశ్నియడిగినవానికి శుభఫలము గల్గునని చెప్పవలెను. కర్ణపాళి=చెవితమ్మె, కనుబొమ్మలు, ముక్కు, నాలుక చివర, మెడ, కృకాటిక=ముచ్చిలి, కంఠము వెనుకభాగము, బొడ్డుశ్రోణి, పిర్గుదు స్విక్కులు=మోకాళ్ళు, పిండికలు=పక్కలమీది మాంసము వ్రేళ్ళు చేతులలో నరికాళ్ళలో నున్న రేఖలు వళులు ప్రొత్తికడుపుమీది అన్ని గ్రంధులందునుగల ముడుతలు మడమ అనునవి సంస్కృతము నందు స్త్రీలింగ వాచకములగు నవయవములని తెలియవలెను.

శిరోలలాటం చిబుకం ముఖం పృష్ఠోదరం త్రితమ్‌ | జఠరం వస్తి శీర్షంచ మేహనం జానునీ తధా ||

కర్ణ పీఠే7క్షికూటే చ పార్శ్వేచ హృదయం తధా | నపుంస కాని జానీయు రంగ విద్యా విశారదాః ||

పుంనామానం దృఢం స్నిగ్ధ మవిభగ్న మపీ డితమ్‌ | సమం సమాహితం చాంగం విరుజంచ యదా స్పృశేత్‌ ||

యమర్థ మభి పృచ్ఛేత తస్య సిద్ధిం వినిర్దిశేత్‌ | శత్రుణా ప్యుదయే ప్రష్టు స్తల్లగ్నస్య తధో దయే ||

తల, లలాటము (నుదురు), చిబుకము=గడ్డము, ముఖము, వృష్ఠము=వీపు, ఉదరము=కడుపు, త్రికము=పొత్తి కడుపుమీది ముడుతలు, జఠరము=కడుపు, దస్తి=పొత్తి కడుపు, శీర్షము=నడినెత్తి, మేహనము (లింగము), జానువులు (మోకాళ్ళు), చెవిగూబలు, కంటికొలికలు, పక్కలు, హృదయము ననునవి నపుంసకలింగములని అంగవిద్యావిశారదులు గ్రహించిరి. పుంలింగ దృఢము స్నిగ్ధము (యెరుగు గలది) భంగమందనిది (చెడిపోనిది) ఎట్టియొత్తిడి (పీడము) లేనది సమమయినది చక్కగా నత్తుకొన్నదియు నేరోగములేనిదియు నైన అవయవమును స్పృశించినపుడు యాపృచ్ఛకునికి శుభము గల్గునని నిర్దేశింపవలెను.

శత్రురాశ్యుదయే ప్రష్టు స్తేషాం వా ప్యధి పోదయే | పరాజయంతు వక్తవ్యం స్వలగ్న స్యాష్ట మోదయే ||

స్వారాశేశ్చ మహాభాగః తధా విద్యా దశోభనమ్‌ | స్వలగ్న స్యోదయే రామః శత్రు రాశ్యు దయే తధా ||

లగ్నాద్వా రాశితో వాపి త్రిషష్ఠ దశ మోదయే | ఏకాదశోదయే వాపి తేషాం వాప్యధి కోదయే ||

వ్రష్టుః సర్వార్థ సంపత్తిః విజ్ఞేయా భృగునందనః | లగ్నేవా తచ్చ తుర్థేవాసప్తమే దశ##మే7పివా ||

పంచమే నవమే వాపి శస్తాః సౌమ్యగ్రహాః త్రిషడ్‌దశ సమే స్థానే పాపా శ్చైవాదశే శుభాః ||

ఏవిషయమును ప్రశ్నమడుగునో ఆవిషయమున గల్గనున్న ఫలసిద్దిని జెప్పవలయును. పృచ్ఛకుని ప్రశ్నలగ్నముం పెట్టి శత్రుస్థానాధిపతి యొక్క శత్రుకారకుని యొక్కగాని యుదయమును బట్టి శత్రురాశి యొక్క యుదయముబట్టిగాని ( ఉదయమనగా నిక్కడ బలముగానున్న సమయమన్నమాట) తన లగ్నమును కష్టమ స్థానము బలముగానున్నప్పుడో లేదా స్వరాశికి (తన శత్రు స్థానాధి పతికి) అష్టమస్థితి వచ్చినపుడును నడిగిన యారాజున కశుభము చెప్పవలెను. ప్రశ్నలగ్నము నుండి పండ్రెండు మూడు ఆరు పది స్థానములు ఏకాదశమునకు రాసులుగాని ఆరాశ్యధిపతులు గాని బలముగా నున్నచో ప్రశ్నమడుగువానికి సర్వార్థ సమృద్ధిని జెప్పవలెను. ప్రశ్నమడుగువానిక సర్వార్థ సమృద్ధిని చెప్పవలెను. ప్రశ్నలగ్న చతుర్ధ సప్తమి దశమ పంచమ నవమరాసులందు సౌమ్యగలహములు. మూడు ఆరు పదకొండు ఎ్థానములందు పాపులండుట శుభము.

సర్వార్ధ సాధకాః జ్ఞేయాః ప్రష్టు ర్భుగు కలోదద్వేహః | సౌమ్యా బలాధికా జ్ఞేయాః పాపా హీన బలా స్తధా ||

బలవచ్ఛ తధా లగ్నం ప్రశ్న కాలే శుభ ప్రదమ్‌ | ఏవంతు ప్రశ్నకాలేన శుభం విజ్ఞాయ భూపతిః ||

యాత్రా రామ! శుభా జ్ఞేయా నాన్యధాతు తదాచన | జాతకం చాధ విజ్ఞాయా దశాకాలే సుశోభ##నే ||

అష్ట వర్గ బలే శుద్ధే యాత్ర కాలః ప్రశస్యతే ||

పరస్య దైవేత్వ శుభే ద్విజేంద్రః | యాత్రా చ దేయా స్వశుభాయ నిత్యమ్‌ ||

గ్రహాది పావేషు శుభేషు చైత | దత్తా భ##వే త్కార్యకరీ యధావత్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే అంగ విద్యా యోగో నామ పంచ షష్ట్యుత్తర శతతమో7ధ్యాయః ||

బుజము నడినెత్తియును పృచ్ఛకునికి సౌమ్యములు (ముచ్చటైనవి) బలాధికములునైయున్నచో వాని యడిగిన ప్రశ్నకు శుభఫలముం జెప్పవలెను. అవి బలహీనములైయున్నచో పాపఫలముం జెప్పవలెను. ప్రశ్న లగ్నము బలముగానున్నచో శుభప్రదమగును. ఈ విధముగ ప్రశ్న కాలముననుసరించి భూపతి శుభ##మెరిగి చేసిన యుద్ధయాత్ర శుభప్రదమగును. అటుగాకున్న నది యెన్నడు ఫలింపదు. ప్రభువు జాతకము శుభదశాకాలము అష్టక వర్గు శుద్ధి నెరిగి దండయాత్ర సేయునేని శుభము నందును. శత్రువు నీకు దైవము (అదృష్టము) అశుభమయియున్న తటి యెరిగి నృపతి తనకు దైవ మనుకూలముగా నున్నట్లు తెలిసి గ్రహణక్షత్రాదులు శుభ పరిపాకములో నున్న యెడల జేసిన దండయాత్ర సంపూర్ణముగ కార్యకారియగును.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండము నందు అంగవిద్యాయోగమనెడి నూటయరువదియైదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters