Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఅరువది యొకటవ అధ్యాయము - ఘృతకంబల శాంతికథనము

పరశురామః - శాన్తిమాచక్ష్వః మాం దేవః ఘృతకంబల సంజ్ఞితామ్‌ | కార్యా యా పార్థివేంద్రాణాం విజయాయ పురోధసా ||

పుష్కరః పూర్వోత్తరేతు దిగ్భాగే నగరాత్సు మనోహరే | ప్రాగుద త్ర్పవణ దేశే శాన్త్యగారంతు కారయేత్‌ ||

తం తమత్యంత విస్తీర్ణం నానావస్త్ర విభూషితమ్‌ | పునర్వసౌ గతేచంద్రే తత్ర యాయా న్నరాధిపః ||

పురస్కృత్య మహాభాగ ! సాంవత్సర పురోహితౌ | ఆభిషేచనికా మంత్రాఃయే మయా7భిహితాః పురా ||

దేవాదయస్తు తేషాంవై స్థానంతత్ర ప్రకల్పయేత్‌ | గంధమండలికై ర్ముఖ్యై ర్యధాస్థానం పురోహితః ||

ఆవాహనం తతః కుర్యా త్స్నాతా స్తత్రచయే7పితే | దేవాదీనాంతు సర్వేషాం బ్రాహ్మణౖ స్సహితా ద్విజః ||

ఆవాహితానాం సర్వేషాం గంధ మాల్యాన్న సంపదా | దేవవత్పూజనం కుర్యాత్‌ తథా నృప పరోహితౌ ||

ఘృత కంబలమను శాంతి పార్థివేంద్రుల విజయముగోరి పురోహితుడు సేయవలసినది. దాని విధానముం దెలుపుమని పరశురాముడడుగ పుష్కరుండనియె. రాజధానికి తూర్పు ఉత్తర దిశల (ఈశాన్య) వైపున చక్కని చోట తూర్పు లేక ఉత్తరపు దిశ వాలుగొన్న చోట శాంతి గృహనిర్మాణము సేయవలెను. అది సువిశాలముగ నుండవలెను. అందు రకరకాల వస్త్రముల నలంకరింప వలెను. చంద్రుడు పునర్వసు నక్షత్ర మందున్నప్పుడు రాజు అక్కడకు వెళ్లవలెను. ఆ వెళ్ళునపుడు పరోహితుని జ్యౌతిషికుని ముందిడుకొనవలెను. మున్నేనుజెప్పిన అభిషేచనిక మంత్రముల అధి దేవతలకక్కడ స్థానము నేర్పరుపవలెను. గంధ మంత్రములతో నాయాస్థానములకు సంబంధించిన మంత్రముల సంపుటితో నాయా దేవతల నావాహనము చేయవలెను. బ్రాహ్మణులతో గూడ ఆవాహితులయిన దేవతలకు గంధమాల్యనైవేద్యాది సంపన్నముగా దేవతలట్లనేవారిని రాజు రాజపురోహితుడును బూజింపవలెను.

ఏవం సంపూజనం కృత్వా సోపవాసా స్తుతే త్రయః | స్వపుశ్చ తాం నిశాం తత్ర సర్వఏవ సమాహితాః ||

తతో నైరృతకం కర్మప్రదేశే తు పురోహితః | కృత్వా త్రిభాగ శేషాయాం రాత్రౌ కుర్యాత్తు శాన్తికమ్‌ ||

శ్రుత్వా దశగుణా నత్ర స్నాపయేత్తం నరాధిపమ్‌ | పూర్వమేవ తధా స్నానం సిద్ధార్థో త్సాదితం తధా ||

ఇట్లుపవాసము చేసి రాజు పురోహితుడు జ్యౌతిషికుడును దేవతా పూజనమొనరించి యందఱు నారాత్రి యక్కడనే సమాహితచిత్తులై పండుకొనవలెను. ఆ మీద పురోహితుడు నిరృతి దేవతాసంబంధమైన కర్మ మా ప్రదేశమందు గావించి మూడవ భాగము మిగులుగా నున్న రాత్రి అనగా సూర్యోదయమునకు పది గడియల ముందు శాంతి ప్రక్రియను జేయవలెను. రాజును దశ గుణ మంత్రములతో నావాలతో నలుగిడి స్నానము సేయింప వలెను.

పూర్ణేన ఘృతకుంభేన మంత్రేణానేన కాలవిత్‌ | ఆజ్యం తేః సముద్దిష్ట మాజ్యం తేజోహరం పరమ్‌ |

ఆజ్యం సురాణా మాహార మాజ్యే లోకః ప్రతిష్ఠితః | తేనాన్త రిక్షం దివ్యం వాధత్తే కల్మషనాశనమ్‌ ||

సర్వే తదాజ్య సంస్పర్శాత్‌ ప్రణాశ ముపగచ్ఛతు | తతో విరూక్షితం స్నాతం స్నానవేద్యాం నరాధిపమ్‌ ||

గచ్ఛేత్తంతుపురస్కృత్య సాంవత్సర పురోహితౌ | స్నాన వేదీతు కర్తవ్యా లాజా కుసుమ మండితా ||

చతుర్భిః పూర్ణకుంభైస్తు విధిక్షు హ్యుపశోభితా | చత్వారి తస్యా శ్చర్మాణి ప్రాగ్గ్రీవాణి సమాస్తరేత్‌ ||

వృషస్య ద్వీపిన శ్చైవ సింహశార్దూలయో స్తథా | భద్రాసనం న్యసేద్రాసుః తేషా ముపరి చర్మణామ్‌ ||

ఆ స్నానమును జ్యౌతిషికుడు ఘృత పూర్ణకుంభముతో గావింపవలెను. ఆజ్యము (ఆవునెయ్యి) తేజ స్సేయని చెప్పబడినది. ఆ ఆజ్యము తేజోహరమనియు జెప్పబడినది. అనగా శత్రువుల తేజస్సును హరింపగలది యన్న మాట. నెయ్యి దేవతల కాహారము. ఘృత మందు లోకము ప్రతిష్ఠింప బడినది. (కల్మష) పాపనాశనమైన యా నెయ్యి దేవతాస్థానమైన అంతరిక్షమును నిలుపుచున్నది. అంతరిక్ష గత జీవులైన దేవతలను భరించుచున్నది. అనగా వారి నిలకడ కాజ్య హవిస్సు ప్రధాన మన్నమాట. సమస్త కల్మషములు ఆజ్య స్పర్శమున నశించును. అవ్వల స్నానవేదికయందు స్నానమయియున్న రాజును జ్యౌతిషుకుడు పురోహితులను ముందిడు కొని రాజును చేరవలెను. స్నానవేదికను పేలాలతో బువ్వులతో నలంకరింపవలెను. ఆవేదికకు నలుమూలల నాల్గు పూర్ణకుంభముల నుంచవలెను. తూర్పు మెడలుగా నాల్గు చర్మములను గూడ పరువవలెను.

స్వాసీనం నృపతిం తత్రవసై#్త్ర రాచ్ఛేదయే న్నృపైః | కార్పాసికై స్తతః పశ్చా దావికైః కృమిజైస్తతః ||

తతస్తుసర్పిషః కుంభైః పూర్ణైస్తమభిషేచయేత్‌ | కుంభాష్టకంతు కర్తవ్య మష్టా వింశతిరేవవా ||

అధవా7ష్టశతం రామః వృద్ధిరేషా గుణోత్తరా | తతో7పనీయ వస్త్రాణి తస్యాం వేద్యాం పురోహితః ||

శూలేన మృణ్మయం భింద్యాచ్ఛత్రుం క్రోధసమన్వితః | రాజ్ఞస్తు కలశం దత్వా స్వయం సాంవత్సరస్తతః ||

ఆ చర్మములు ఎద్దు, చిఱుతపులి, సింహము, శార్దూలమునకు సంబంధించినవి కావలెను. వాని మీద భద్రాసనము నుంచవలెను. ఆ మంగళాసనము మీద గూర్చుండిన నృపతికి మీద నూలు గొఱ్ఱయున్ని పట్టు బట్టలను రాజులు గప్పవలెను. అవ్వల నా ఘృత పూర్ణకుంభములతో రాజునభిషేకింప వలెను. ఎనిమిది ఇరువదియెనిమిది యెనిమిదివందలు పూర్ణకుంభముల వృద్ధితో జేసిన కొలది రాజునకది సర్వాభివృద్ధిని గూర్చును. ఆ మీద పూరోహితుడు రాజుమీది వస్త్రములను దొలగించి యా స్నాన వేదిక మీద మట్టితో జేసిన శత్రువును (శత్రువు యొక్క బొమ్మను) కోపముతో శూలముతో ఛేదింపవలెను. ఆ మీద ఔతిషికుడు స్వయముగా కలశము పట్టుకొని రాజునభిషేకిం వలెను.

అభిషేచన మంత్రేణ స్వర్చితం కల్పితం దృఢమ్‌ | జ్యోతిష్మతీం త్రాయమాణా మభయామపరాజితామ్‌ ||

జీవాం విశ్వేశ్వరీం పాఠాం సమంగా మభయాం తధా | సహాంచ సహదేవాం చపూర్ణకోశాం శతావరీమ్‌ ||

అరిష్టికాం శివాం భద్రాం కలశే తత్ర విన్యసేత్‌ | బ్రాహ్మీం క్షేమా మజాం చైవ సర్వబీజాని కాంచనమ్‌ ||

ఆభిషేచన మంత్రముతో నభిషేకము చేయవలెను. ఆ అభిషేక పాత్ర ధృఢముగా నుండవలెను. షోడశోపచారములచే పూజింపబడవలెను. దానిలో వేయవలసిన యోషధులు. జ్యోతిష్మతి = చిన్న వెక్రుడు తీగ విశ్వేశ్వరి మంగ = పిండీతకం మరువము అభయ = వట్టివేరు సహ = సహదేవ = ముత్తవష్రగం పూర్ణకోశి=నాగర ముస్తలు శతావరి = పిల్లితీగ అరిష్టిక సరళ శివ=వసువు భద్ర=బ్రహ్మమేడి బ్రాహ్మి=సరస్వతి క్షేమ=మేడి అజ=తమలపాకులు మహౌషధి అను మూలకలు సర్వబీజములు నవధాన్యములు మఱియునుం గల మంగళకరమైన ఓషధులు (మూలికలు) రసము రత్నాలు సర్వ గంధములు మారేడు పత్రి వికంకతము ననునివి కలశమందుంచవలసినవి.

మంగళ్యాశ్చ యధాలాభం సర్వౌషధ్యో రస స్తధా | రత్నాని సర్ప గంధాశ్చ బిల్వంచసవికంకతమ్‌ ||

ఏవం స్నాతో ఘృతే ద్వష్ట్వా వదనం (తర్పణం) దర్పణ తధా | మంగళా లంభనం కృత్వా ధౌతవాసాః సమాహితః ||

అభ్యర్చనం తతః కుర్యాత్‌ దేవాదీనం పృధక్‌ పృథక్‌ | తేషా మేవ తో వహ్నౌ చతుర్థ్యన్తైస్తు నామభిః ||

ఓంకారపూతం జుహుయాత్‌ ఘృతం బహు పురోహితః | ఆయుధా7భ్యర్చనం కార్యం వాహనా7భ్యర్చనం తతః ||

భద్ర అను పదమునకు చాలా ఓషథుల యర్థము లున్నవి. శివ=కరక, పసవు, నల్లగరిక, మెంతులు, జమ్మి, నల్ల తెగడ, ఉసిరిక, నేల ఉసిరిక, అంబాళము చిఱుబొద్ది, గుమ్మడి రేగు ఇట్లు స్నానము సేసి నృపతి ఆవునేతిలో అద్దములో తనమోము చూచికొని మంగళ వస్తువులను చేతితో తాకి మడిబట్టలం గట్టుకొని మనస్సు సమాహితము సేసికొని ఆయా దేవతలకు వేర్వేర నర్చన సేయవలెను. ఆ దేవతలకే చతుర్థీ విభక్త్యంతములయిన నామములతో నగ్నిహోత్రమునందోంకార పవిత్రమైననేతిని హోమము సేయవలెను. ఇది పురోహితుడు సేయవలసినది. అటుపై నాయుధములకు వాహనాదులకు నర్చనము జరుపవలెను.

రాజచిహ్నార్చనం కృత్వా హల్యంకృత్య స్వకాం తనుమ్‌ | అనులేపన మాదద్యా ద్గంధద్వారేతి మంత్రతః ||

శుభం వసనమాదర్యా చ్ఛ్రీసూక్తేనా7 భిమంత్రితామ్‌ | శ్రియం ధాతః! మయిదేహి! మంత్రః సుమనసాం భ##వేత్‌ ||

రాయ స్పోషేతిచ తధా మంత్రో7 లంకరణ స్మృతః | తతో7నులిప్తః సురభి స్రగ్వీ రుచిర భూషణః ||

కేశవాభ్యర్చనం కృత్వా వహ్నిస్థానం తతో వ్రజేత్‌ | వహ్నే రుత్తర దిగ్భాగే తతః ప్రాగుక్త కర్మణామ్‌ ||

సింహాసనం న్యసే త్పృష్ఠే భవ్యాస్తరణ సంయుతమ్‌ | తతస్తు రామః చర్మాణి ప్రాగ్గ్రీవాణి తు విన్న్యసేత్‌ ||

వృషస్య వృషదంశస్య కర్తేశ్చ పృషతస్యచ | తేషా ముపరి సింహస్య వ్యాఘ్రస్యచ తతః పరమ్‌ ||

ధ్రువాద్యౌ రితి మంత్రేణ నృపం తత్రోపవేశ##యేత్‌ | దర్భపాణిస్తతో రాజా తధైవచ పురోహితః ||

తయోర్హస్తగతా వగ్రే దర్భా సంగ్రథయే ద్ద్విజః |

రాజ చిహ్నములైన ఛత్ర చామరాదులను గూడ పూజించి తానలంకరించుకొని ''గంధద్వారా'' అను మంత్రముతోనను లేపనము (గంధమును) బూసికొనవలెను. శ్రీ సూక్తముచే నభిమంత్రితమైన శుభ్రవస్త్రమును (తెల్లని వస్త్రమును) ధరింపవలెను. దేవతలకు ''శ్రియందాతః - మయిదేహి'' అను మంత్రము అలంకరణమందు ''రాయస్పోష'' అను మంత్రమును వాడవలెను. అవ్వల గంధముపూసికొని పరిమళించు పూలమాలలనుదాల్చి ఆభరణములనుగై సేసి విష్ణుపూజసేసి ఆమీద నగ్నిస్థానమున కేగవలెను. అగ్ని కింతకుమున్ను జెప్పిన పూజల కుత్తరమువైపు సింహాసనమును అమూల్యాస్తరణములం బఱచిన దాని నుంచవలెను. ఆమీద తూర్పు మెడగా నున్న చర్మములను ఎద్దు వృష దంశము =పిల్లి చర్మము పృషతము=బొట్లదుప్పి అను వాని చర్మములు పరచి యా మీద పులిచర్మము పరచి ''ధ్రువాద్యౌః'' అను మంత్రముతో ప్రభువును దాని మీద కూర్చుండ బెట్టవలెను. రాజు పురోహితుడును దర్భపాణులై యుండవలెను. బ్రాహ్మణుడా యిద్దరి చేతులందున్న దర్భలను గలిపి ముడివేయవలెను.

తతః పురోధా జుహుదాద్బ్రాహ్మై ర్మంత్రైర్ఘృతం శుచిః ||

రౌద్రవైష్ణవ వాయవ్య శాక్రసౌమ్యైః సవారుణౖః | బార్హస్పత్యై స్తతః కుర్యా త్తంత్ర ముత్తర సంజ్ఞకమ్‌ ||

దైవజ్ఞః ప్రయతః కుర్యాద్దైవతానాం విసర్జనమ్‌ | యాన్తు దేవగణాః సర్వే సానుగా స్సపరిచ్ఛదాః ||

ఆదాయ పార్థివా త్పూజా నగరాగమనాయచ | తతస్తు పూజయే ద్రాజా సాంవత్సర పురోహితౌ ||

ధనేన బ్రాహ్మణానాంచ తతోదద్యాచ్చ దక్షిణామ్‌ |

మంగళాలంభనం కృత్వా ఖడ్గపాణి ర్గృహా ద్వ్రజేత్‌ | శాన్తిఘేషేణ మహతారాజా కుంజరగ స్తతః ||

శాన్తిర్మయాతే7 భిహితా నృవీర ! ధన్యాయశస్యా రిపునాశనీచ |

సుఖావహా రాష్ట్ర వివృద్ధికర్త్రీ కార్యా నృపైర్ధర్మ వివృద్ధిదాచ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే ఘృతకంబల శాన్తి కధనం నామ ఏకషష్ట్యుత్తర శత తమో7ధ్యాయః ||

ఆ మీద పురోహితుడు శుచియై బ్రహ్మదేవతాక మంత్రములతో ఆజ్యహోమము గావింప వలెను. ఆ హోమము నందు రుద్రదేవతాకములు విష్ణుదేవతాకములు వాయుదేవతాకములు ఇంద్రదేవతాకములు సోమదేవతాకములనైన మంత్రములతో హోమములు సేసిచిట్టచివరి బార్హస్పత్యములు (బృహస్పతి దేవతాకమంత్రములతో నుత్తరతంత్రము) సేయవలెను. అటుపై నియమశాలియై జ్యౌతిషికుడు సపరివారులు సువాహన సర్వవిధాభరణాది పరికరముతో గూడిన దేవతలకు రాజు సేసిన పూజను జేకొని నగరమునకు పునరాగమనము సేయుటకై ప్రార్థించుచు నా దేవతలకు విసర్జనము సెప్పవలెను. ఆ మీద సాంవత్సర పురోహితులను బూజింప వలెను. బ్రాహ్మణులకు ధనము దక్షిణల నీయవలెను. మంగళవస్తు సమాలంభనము సేసి ప్రభువు ఖడ్గపాణియై ఏనుగునెక్కి స్వస్తి వాచన మంగళవాద్య ఘోషములతో తన గృహమునుండి వెడలవలెను. ఓ వీరాగ్రేసర! ధన్యము యశస్కరమునగు శత్రునాశనకము సుఖావహము రాజ్యాభివృద్ధికరము ధర్మ వివృద్ధికరమునగు శాంతి నరపాలుర కవశ్యకర్తవ్యమిది నీ కెఱింగించితిని.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణ మందు ద్వితీయ ఖండమున

ఘృతకంబల శాంతి కథనమను నూటయరువదియొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters