Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటేబది తొమ్మిదవ అధ్యాయము - నీరాజన శాంతివర్ణనము

రామః- నీరాజన విధిం త్వత్తంః శ్రోతు మిచ్ఛామి సత్తమ! | కధం కార్యా నరేంద్రస్య శాన్తిః నీరాజనే ప్రభో! ||

పుష్కరః- పూర్వోత్తరేతు దిగ్భాగే నగరాత్సు మనోహరే | విస్తీర్ణం కారయేద్రాజా సుమనోహర మాశ్రయమ్‌ ||

పటైర్గుప్తం కుశాస్తీర్ణం పతాకా ధ్వజశోభితమ్‌ | తోరణ త్రితయం తత్ర ప్రాజ్‌ముఖం కారయేచ్ఛుభమ్‌ ||

కార్యం షోడశహస్తంతు తోరణంతు సముచ్ఛ్రితమ్‌ | వైపుల్యం దశహస్తంతు తత్రకార్యం భృగూత్తమః ||

తోరణా ద్దక్షిణ భాగే తత్రకార్యం సమాశ్రయమ్‌ | దేవతార్చా భ##వేద్యత్ర తధాగ్ని హవనక్రియా ||

అష్టహస్తాయతోత్సేధ ముల్ముకానాంతు వామతః | కార్యం భవతి శుష్కాణాం కూటం భృగుకులోద్భవ ||

పంచ రంగక సూత్రేణ శతగ్రంధిం మనోరమామ్‌ | మధ్యమే తోరణ కుర్యాత్‌ శతపాశీంతు మధ్యగామ్‌ ||

ఛాదయిత్వా కుశైస్తాంతు బుదా సంఛాదయే త్పునః | తస్యాశ్చ లంఘనం వర్జ్యం ప్రయత్నా త్సర్వజంతుభిః ||

పరుశురాముడు నీరాజన విధి నీవలన వినవలతునన పుష్కరుం డిట్లనియో:

నగరమునకు పూర్వోత్తర దిగ్భాగమందు (ఈశాన్యమున) చక్కనిచోట నొక విశాల ప్రదేశమునందు చాపలు చుట్టను గట్టి దర్భలు పరచి పతాకాధ్వజ శోభిత మొనర్చి మూడు తోరణాలు గట్టి ప్రాజ్ముఖముగా రాజొక స్థానము నేర్పరుపవలెను. దానికి ముందు పదునారు మూరల యెత్తును పది మూరల వెడల్పునూగల తోరణము నేర్పరుపవలెను. తోరణమునకు దక్షిణదిశ పైనిజెప్పిన స్థానము నిర్మింపవలెను. ఇక్కడ దేవతార్చనము అగ్నిహోత్రక్రియము జరుగనగును. ఎడమవైపు ఎనిమిది మూరలెత్తున ఎండు కట్టెల గుట్ట నుంచవలెను. కాగడాలన్నమాట. తోరణము నడుమ నైదు రంగుల దారముతో చక్కని నూరు ముడులుగల నూరు త్రాళ్ళతో పేనిన పగ్గమును గట్టవలెను. దానిని దర్భలతో గప్పి యే జంతువును దానిని దాటిపోకుండ జూడపలెను.

నలంఘితా సా యావత్‌ స్యాత్‌ ప్రధమం రాజహస్తినా | చిత్రాం యదాస్వాతిం సవితా ప్రతిపద్యతే ||

తతః ప్రభృతి కర్తవ్యా యావత్‌ స్వాతౌ రవిః స్థితః | ఆశ్రమే ప్రత్యహం దేవాః పూజనేయాః ద్విజోత్తమః ||

బ్రహ్మా విష్ణుశ్చ శంభుశ్చ శక్ర శ్చైవానలానిలౌ | వినాయకః కుమారశ్చ మరుణో ధనదో యమః ||

విశ్వాన్‌దేవాన్‌ మహాభాగః ఉచ్చైశ్రవసమేవచ | అష్టౌమహాగజాః పూజ్యాః తేషాం నామాని మే శృణు ||

కుముదైరావణౌ పద్మః పుష్పదన్తో7ధ వామనః | సుప్రతీకాంజనౌ నీల ఏతే7ష్టౌ దేవయోనయః ||

పూజాకార్యా గ్రహర్షాణాం తధైవచ పురోధసా | తతస్తు జుహూయా ద్వహ్నౌపురోధాః సుసమాహితః ||

యధా7భిమత దేవానాం మంత్రైస్తల్లింగ సంజ్ఞకమ్‌ | తధాచ మంత్రహీనానాం ప్రణవేన మహాభుజః ||

పట్టపుటేనుగు దానిని దాటక ముందు ఏ జంతువును దానిని దాటి పోరాదు. చిత్తను దాటి సూర్యుడు స్వాతీ నక్షత్రమందు బ్రవేశించిన నాటి నుండి స్వాతియందుండు నంతవరకు నా యాశ్రమమందు దేవతలను బ్రతిదిన మర్చింపవలెను. ఆ దేవతలు బ్రహ్మ, విష్ణువు, శంభువు, ఇంద్రుడు, అగ్ని, వాయువు, వినాయకుడు, కుమారస్వామి, మరుణుడు, కుబేరుడు, యముడు విశ్వేదేవతలు, ఉచ్చైశ్రవము (ఇంద్రుని వాహనము గుఱ్ణము) ఎనిమిది యేనుగులు (దిగ్గజమలు) కూడ పూజనీయులు, ఆ ఏనుగుల పేర్లు కుముదము, ఐరావణము, పద్మము, పుష్పదంతము, వామనము, సుప్రతీకము, అంజనము, నీలము, ఇవి దేవగజములు. గ్రహనక్షత్ర పూజనప్పుడు పురోహితుడు గావించి మిక్కిలి శ్రద్ధతో నగ్నియందు హోమము సేయవలెను. అభీష్ట దేవతలను వారి వారి (లింగముల) పేర్లుగల మంత్రములతో నీ పూజహోమాదలు నిర్వర్తింప వలెను.

సమిధః క్షీరవృక్షాణాం తధా సిద్ధార్థకానిచ | ఘృతం తిలాంశ్చ ధర్మజ్ఞః తధా చైవాక్షతానిచ ||

హుత్వాచ కలశాన్‌ కుర్యాత్‌ సోదకాన్‌ గంధ సంయుతాన్‌ | పూజితాన్‌ మాల్య గంధైశ్చ వనస్పతి విభూషితాన్‌ ||

పంచరంగక సూత్రేణ కుర్యా ద్వస్త్రగతాం స్తధా | భల్లాతశాలి సిద్ధార్థా వచాకుష్ఠ ప్రియంగవః ||

తోరణాత్‌ పశ్చిమే భాగే కలశైః పూర్వకల్పితైః | తత స్సంస్థాపనీయాః స్యుర్మంత్రపూతైర్గ జోత్తమైః ||

తురంగాశ్చ మహాభాగః చాలంకృత్య తతస్తు తాన్‌ | తతో7భిషేక నాగస్య తధా తత్తురగస్యచ ||

అన్నపిండం తతో దేయమభిమంత్య్ర పురోధసా | తస్యాభినందనే రాజ్ఞో వినయః పరికీర్తితః ||

త్యాగేచ తస్య విజ్ఞేయం మహద్భయ ముపస్థితం | నిష్క్రామయే త్తోరణౖస్తు తతోహి ప్రథమం గజాన్‌ ||

తత్రాపి ప్రథమం రామ! అభిషిచ్య గజోత్తమమ్‌ | తస్యాదౌ శతపాశీంతు నరః పంచనఖో7పివా ||

అదహ్యన్యో లంఘయేత్తాం రాజ్ఞోమరణ మాదిశేత్‌ | దుర్భిక్షం తత్ర విజ్ఞేయం గోఖరోష్ట్రైశ్చ లంఘనే ||

పాల చెట్లసమిథలు ఆవాలు, నెయ్యి నువ్వులు అక్షతలు హోమము సేసి గంధోదక పూర్ఱ కలశములందు=గంధమాల్యాదుల చేత బూజించి వనస్పతులచే నలంకరించి పంచ వర్ణమయిన (అయిదు రంగులు గల) దారములు గట్టి వస్త్రములు పరచి వానమీద నుంచ వలెను. (వనస్పతులనగా పూలు లేక కాయలు గాచు చెట్లు) కలశముల నలంకరింప వలెనన్నమాట, జీడిమామిడి పండ్లు శాలిధాన్యము ఆవాలు వసకొమ్ములు కుష్ఠము=చెగల్వకోష్టు ప్రియంగువులు=నాకలశమందు వేయవలసిన ద్రవ్యములు తోరణమునకు పడమటి భాగమున పూర్వస్థాపితమైన కలశములతో గజోత్తములచే నభిషేకము సేయింప వలెను. అటు మీద జక్కగ నలంకరించిన గుఱ్ఱముల నక్కడ నిలుప వలెను. ఆమీద పట్టపుటేనుగునకు పట్టాభిషేక మందుపయోగించు గుఱ్ఱమునకును అన్నపు ముద్ద నభిమంత్రించి పురోహితుడు పెట్టవలెను. ఆ పెట్టిన ముద్ద నా ఏనుగు గుఱ్ఱము (మెచ్చి) ప్రీతితో దినెనేని రాజునకు శత్రుకూటములొంగునని చెప్పవలెను. అటుగాక దానిని తినకుండ వదలునేని మహాభయము రానున్నదని యెఱుంగవలెను. ఆ మీద మొట్టమొదట నేనుగును తోరణమును దాటింప వలెను. అక్కడ గూడ మొట్టమొదట నాగజరాజు నభిషేకించి తోరణము క్రింది నుండి నడిపింపవలెను. ఆ శత పాశిని (నూరు త్రాళ్ళతో పేనన పగ్గమును) మనుష్యుడు గాని పంచనఖము=అయిదు గోళ్ళుగల జంతువు. (చెవుల పిల్లి, ఏదుబంది, దాబేలు, ఖడ్గమృగము, ఉడుము) ఇవి భక్షింప వలసినవి యైదు) ఇవ గాక పంచనఖములుఏనుగు తాబేలు, సింహము మరియే జంతువేని పట్టపు టేనుగుకంటే ముందాతోరణమును దాటుట జరిగెనేని రాజునకు మృత్యు వగునని చెప్పవలెను. గొవు గాడిద ఒంటె కాని దాటినచో దుర్భిక్షము గల్గునని చెప్పవలెను.

లంఘయే ద్వామపాదేవ యది తాం నృపకుంజరః | రాజ్ఞాపురోహితా మాత్యరాజపుత్రహితం భ##వేత్‌ ||

రాజ్ఞస్తు మరణం బ్రూయా దాక్రమేత్తం యదాపరః | రాజ్ఞో7పి జయ మాచష్టేల్లంఘయన్‌ దక్షిణవ తామ్‌ ||

రాజహస్తిని నిష్క్రాన్తేసా త్వయాస్యాత్తదా భ##వేత్‌ | నిష్కామేయు స్తత స్సర్వే ప్రాజ్ముఖా స్తోరణౖర్గజాః ||

తతో7స్తాః సుమహాభాగః తతస్తు నరసత్తమ! తతశ్ఛత్రం ధ్వజం చైవ రాజలింగాని యానిచ ||

ఆశ్రమే తాని సంస్థాప్య పూజయే దాయుధానిచ | పంచరంగక సూత్రేణ యాస్తాః ప్రతిసరాః కృతాః ||

దూష్యాద్దూష్యేతి మన్త్రేణ నిబధ్నీయా త్సురోహితః | సర్వేషాం దృపనాగానాం తురగాణాంచ భార్గవ! ||

స్వగృహేషు తతోనేయా కుంజరాస్తురగై స్సహ | స్వాతిస్థః సవితా యావత్‌ తావచ్ఛాయాసు సంస్థితాన్‌ ||

పూజయే త్సతతం రామః నాక్రోశేన్నచ తాడయేత్‌ | రాజచిహ్నాని సర్వాణి పూజయే దాశ్రమే సదా||

ఆ తోరణము నా రాజకుంజర మెడమకాలు ముందుపెట్టి దాటునేని రాజపురోహితుడు, మంత్రులు, రాజపుత్రులకు అహిత మగును. ఆ యేనుగు కాక మరి యేది యా తోరణముందాటినను రాజమరణ మగును. కుడికాలితో దాటిన రాజునకు కూడ జయమగును. రాజగజము దాటివెళ్ళిన తర్వాత అటుపై నాతోరణము క్రిందినుండి అన్ని యేనుగులు తూర్పు దిక్కుగా వెళ్ళవలయును. ఆమీద వస్త్రములు రాజచ్ఛత్రము (గొడుగు) ధ్వజము మరియుంగల రాజచిహ్నములను పూజింపవలెను. ఆశ్రమమందుంచి పంచ వర్ణములయిన దారములతోడి తాయెత్తులు కట్టి పురోహితుడు ''దూష్యాద్దూష్య'' అను మంత్రసంపుటిచే ఆ తాయెత్తులను అన్ని రాజ గజములకు నేనుగులకుంగూడ కట్టవలెను. ఆ మాదనా కుంజరములను గుఱ్ఱములను వానివాని శాలలకుంగొనిపోయి యానీడలో వానిని సూర్యుడు స్వాతీనక్షత్రమందున్నపుడు పూజింపవలెను. ఆ ఆశ్రమమున రాజచిహ్నముల నన్నింటిని పూజింపవలెను.

పూజయే ద్వరుణం నిత్యం తధప్సు విధివ ద్ద్విజః | భూతేజ్యాచ తధాకార్యా రాత్రౌ బలిభిరుత్తమైః ||

ఆశ్రమం రక్షణీయంస్యాత్పురుషైః శస్త్రపాణిభిః | వసేతా మాశ్రమే నిత్యం సాంవత్సర పురోహితౌ ||

అశ్వవైద్య ప్రధానశ్చ తధా నాగ భిషగ్వరః | దీక్షితైసై#్త స్తధా భావ్యం బ్రహ్మచారిభి దేవచ ||

స్వాతిం త్యక్త్వా యదా సూర్యో విశాఖాం ప్రతిపద్యతే | అలంకుర్యాద్దినే తస్మిన్‌ వాహనాంశ్చ విశేషతః ||

నీటియందు వరుణుని నాహ్వానించి పూజింపవలెను. భూతపూజను నుత్తమబలులతో రాత్రి చేయవలెను. ఆయుధపాణులా యాశ్రమమును రక్షింపవలెను. నిత్యము జ్యౌతిషికుడు పురోహితుడు నందు నివసింపవలెను. ఆశ్వవైద్యాధిపతి గజ వైద్యుడు నిక్కడనే యుండవలెను. వారు బ్రహ్మచారులుగ దీక్షాస్వీకారము సేసినవారు (దీక్షతులు) గ నయ్యాశ్రమమం దుండవలెను. సూర్యుడు స్వాతి దాటి నక్షత్రమందు ప్రవేశింపగానే ( ఆశ్వయుజ మాసారంభమం దన్నమాట) వాహనముల నన్నింటిని నలంకరింపవలెను.

పూజితా రాజలింగాశ్చ కర్తవ్యా నరహస్తగాః | హస్తినం తురగం ఛత్రం ఖడ్గంవా పంచదుందుభిమ్‌ ||

ధ్వజం పతాకాం ధర్మజ్ఞః కాలజ్ఞ స్త్యభిమంత్రయేత్‌ | అభిమంత్య్రతతః సర్వాన్‌ కుర్యాత్‌ కుంజర ధూర్గతామ్‌ ||

కుంజరోవరిగౌ స్యాతాం సాంవత్సర పురోహితౌ | ఆశ్వవైద్య ప్రధానశ్చ తధా నాగభిషగ్వరః ||

తతో7భిమంత్రితం రాజా సమారుహ్య తురంగమమ్‌ | నిష్క్రమ్య తోరణ నాగ మభిమంత్య్ర సమారుహేత్‌ ||

రాజచిహ్నములను (ఛత్ర చామరాదులను) హస్తముల బూజించి మనష్యులచేత బట్టించి ఏనుగు గుఱ్ఱము ఛత్రము కత్తి పంచ దుందుభుల ధ్వజము (జెండా కర్ర) పతాక (జెండా గుడ్డ) ను జ్యౌతిషకుడు అభిమంత్రింపవలెను. అభిమంత్రంచిన వాని నేన్గులమీద నెక్కింపవలెను. జ్యౌతిషకుడు పురోహితుడు గూడ యేన్గునెక్కియే వెళ్ళవలయును. అశ్వవైద్యుడు గజవైద్యులు గూడ గజారూఢలై చనవలెను. ఆమీద రాజు అభిమంత్రితమైన గుఱ్ఱముమీద నెక్కి తోరణుమలను నిష్క్రమించి ఏనుగునెక్కవలెను.

తోరణన వినిష్క్రమ్య కుర్యాత్‌ సుర విసర్జనమ్‌ | బలిం విసృజ్య విధివత్‌ రాజా కుంజర ధూర్గతః ||

రత్నైరలంకృతః సర్వై ర్భీజ్యమానశ్చ చామరైః | ఉల్ముకానాంచనిచయ మాదీపిత మనన్తరమ్‌ ||

రాజా ప్రదక్షిణం కుర్యాత్‌ త్రీన్‌ వారాస్‌ సుసమామితః |

చతురంగ బలోపేతః సర్వసైన్య సమన్వితః | క్ష్వేడా కిల కిలా శ##బ్దైః సర్వవాదిత్ర నిస్వనైః ||

వల్గితైశ్చ పదాతీనాం హృష్టానాం మనుజోత్తమః | ఏవం కృత్వా గృహం గచ్ఛేత్‌ రాజా సైన్య వురస్సరః ||

తోరణమునుండి దాటిన తరువాత దేవతావిసర్జనము (ఉద్వాసన) సేసి యధావిధిగ బలినిచ్చి ఏనుగునెక్కి రత్నాభరణములు దాల్చి వింజామరలు వీచుచుండ వెలిగించిన కాగడాలకు బ్రదక్షిణము మూడుమారులు భక్తితోజేసి చతురంగ సైన్యముతో కోలాహలముగ కిలకిలా శబ్దములు చెలరేగ సర్వవాద్యములు మ్రోగుచుండ కాల్బలము సంతోషభరితమై వల్గింపగ = కదనుదొక్కుట లేక కవాతు చేయుచుండ గృహమునకు వెళ్ళవలెను.

జనం సంపూజ్యచ గృహాత్సర్వ మేవ విసర్జయేత్‌ |

శాన్తిర్నీరాజనా ఖ్యేయం కర్తవ్యా వసుధాధిపైః | క్షేమ్యా వృద్ధికరీ రామః నరకుంజర వాజినామ్‌ ||

ధన్యా యశస్యా రిపునాశినీచ | సుఖావహీ శాన్తి రనుత్తమాచ ||

కార్యా నృపై రాష్ట్రవివృద్ధి హేతోః సర్వ ప్రయత్నేన భృగుప్రవీర ! ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే నీరాజన శాన్తి వర్ణనం నామ ఏకోన షష్ట్యుత్తర శత తమో7ధ్యాయః ||

జనులనందరిని బూజించి పంపివేయవలెను. నీరాజన శాంతియను పేరంజేయు నీ శాంతి రాజులకు పదాతి సైన్యమునకు ఏనుగులకు గుఱ్ఱములకుంగూడ క్షేమాభివృద్ధులం గూర్చును. ధన్యులను జేయును. యశస్సును సంపాదించును. శత్రువుల హరించును. ఇది అత్యుత్తమ సుఖకారకమయిన శాంతిప్రక్రియ. రాజు రాష్ట్రాభివృద్ధికి సర్వ ప్రయత్నములచే నిది చక్కగా నొనరింప వలసినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున నీరాజన శాంతివిధియను నూట ఏబడి తొమ్మిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters