Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యేబది మూడవ అధ్యాయము - చాతుర్మాస్య విధి కథనము

రామః- కధంహి చతురోమాసాన్‌ కార్యంకేశవ పూజనమ్‌ | పార్ధివేన సురశ్రేష్ఠ! తన్మమా చక్ష్వ! వృచ్ఛతః ||

పుష్కరః- ఉద్యుక్తేన సదాభావ్యం రాజ్ఞా భృగుకులోద్వహ! ఆషాఢ శుక్లపక్షాన్తే రాజాస్ధాన యుపాశ్రయేత్‌ ||

అధృస్యం పరరాష్ట్రాణాం ప్రభూత యవసేంధనమ్‌ | తోయోపేతం వివంకం చ ప్రావృట్‌ కాలహతం తధా ||

నాల్గుమాసాలు కేశవ పూజనమును రాజెట్లు సేయవలెనో సురవర ! తెల్పుమన పుష్కరుండనియో. రాజెప్పుడు మద్యమించుచుండు వాడు గావలెను. అనగా రాజ్యతంత్ర వ్యాపకుడుగా వెళకువగొని యుండవలెనన్న మాట. ఆషాఢ శుక్ల పూర్ణిమ నాటికి మాత్రమొక్కచోట నిలుకడగా నుండవలెను. ఆస్థానము పరరాష్ట్రములకు లొంగనిది, తృణకాష్ఠ జలసమృద్ధమైనది, వర్ష కాల నిహతమయ్యు బురదలేనిదిగా నుండవలెను.

యత్రస్థశ్చ స్వవిషయం సర్వంశక్నోతి రక్షితుమ్‌ | తత్రస్థ శ్చతురో మాసాన జాంశ్చ పోషయే న్నృపః ||

స్నేహ పానై ర్భహువిధైః ప్రతిపానై శ్చ భార్గవః | ఆషాఢ శుక్ల పక్షాన్తే దశమ్యూర్థ్వం నరాధిపః ||

ఉత్సవంతు మహత్‌ కుర్యద్దేవస్య చా ర్చనేరతః | అర్చాయాంవా పటేవాపి కృతందేవ మధార్చయేత్‌ ||

దేవభోగమయం విష్ణుం శ్రీసహాయ మరిందమమ్‌ | బలిభి ర్వవిధాభిస్తు పుషై#్పర్ధూపైః సుగంధిభిః ||

ఉత్సవంతు మహత్‌ కుర్యా త్తతః సంచదినం నృపః | తతః ప్రభృతి నిత్యంస్యా ద్వాసుదేవస్య పూజనమ్‌ ||

ఎక్కడున్నను తనదేశ##మెల్లను రక్షింప సమర్థుడేయగునో ఈ చెప్పినచోట నాల్గుమసములుండి మేకలను బెంచవలెను. వానిననేకములైన నూనెలను ప్రతి పానము ద్రావించి ఆషాఢ మాసము వెళ్ళిన దశమినాడు దేవతాపూజాసక్తుడై మహోత్సవము సేయవలెను. విగ్రహమదు గాని పటమందుగాని (వస్త్రమందు) చిత్రించిన దేవతనర్చింప వలెను. దేవభోగములతో నిండిన మహాలక్ష్మీ సమేతుడైన విష్ణువును శత్రునాశనుని వివిధ బలులతో పుష్పధూప దీప సుగంధాద్యుపచారములచే పూజింపవలెను. ఆమీద నైదు రోజులు మహోత్సవము గావింప వలెను. అది మొదలు నిత్యమును వాసుదేవ పూజ జరుపవలసినదే.

సాత్వతై ర్భార్గవశ్రేష్ఠః సావంత్సర పురోమితైః | గీతనృత్యై స్తధా దేవం విశేషేణాత్ర పూజయేత్‌ ||

అస్మిన్నేవ తధాకాలే కోటిహోమం సమాచరేత్‌ | కార్తిక్యాం తత్సమాప్తిస్తు యధా భవతి భార్గవః ||

శుక్లపక్షత్రిభాగే7న్యైకా ర్తికస్య తతో నృపః | ఉత్సవం సుమహ త్కుర్యాద్దేవదేవార్చనం తథా ||

వైకుంఠంపూజయే ద్దేవమర్చాయా వధవాపటే | మహాదానం తతోదద్యాత్‌ ప్రేక్ష్యాందద్యా త్తధైవచ ||

విష్ణుభక్తులతో జ్యోతిషికులతో పురోహితులతో గీత వాద్య నృత్యాదులతో నందు విష్ణవును విశేషముగ బూజింపవలెను. ఈ కాలమందే కోటి హోమము సేయవలెను. ఆది కార్తిక మందు సమాప్తి కావలెను. కార్తికశుక్ల పక్షము చివర త్రిభాగమునందు మహోత్సవము విష్ణు సమార్చనమును జేయవలెను. విగ్రహ మందుగాని వస్త్రమందుగాని వైకుంఠుని పూజింపవలెను. మహాదానము నీయవలెను. ప్రేక్ష్యను=ప్రేక్షణియమును ఈవలెను. (ప్రదర్శనము)

మల్లానా మధఝల్లానాం నటానాం నర్తకైస్సహ | యాత్రావిధానం సకలం తధాకుర్యా న్మహీపతిః ||

ఏతత్కృత్వా తతోయాత్రా దేయాభవతి పార్ధివైః | శరత్కాలే తతాతంకైః పుష్టాశ్వరధ కుంజరైః ||

ఏవంచరాజ్ఞా చతురోహి మాసాన్‌ పూజ్యోభ##వే ద్దేవవరో7రిహర్తాః ||

సంత్యక్త చిహ్నం మధుసూదనంచ సంపూజ్యయాత్రా7భిమతప్రదాస్యాత్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే చాదుర్మాస్య విధికథనంనామ త్రిపంచాశ దుత్తర శతతమో7ధ్యాయః||

మల్లురు ఝల్లురు (ఝల్లము=మద్దెల) నటులు నర్తకులతో కూడ యాత్రా విధానము సర్వము గావింపవలెను. ఇది సేసి యావల శరత్కాలమునందు బాధలెల్ల తొలగుటచే చక్కగ పోషింపబడిన గజాశ్వాదులు తల నరవతులు విజయ యాత్ర నీయవలెను. ఇట్లు రాజునకు నాల్గు మాసముల దేవశ్రేష్ఠుడు శత్రుసంహర్త పూజనీయుడు చిహ్నములు గల మధుసూదనుని బూజించుట యాత్ర మభీష్ట్రపదమగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున చాతుర్మాస్య విధి కథనమను నూట యేబదిమూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters