Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటనలుబది యారవ అధ్యాయము - దండప్రణయన వర్ణనము

రామః- సామభేదౌ తధా ప్రోక్త్వౌ దానదండౌ తధైవచ | దండః స్వదేశే కధితః పరదేశే బ్రవీహి మే ||

పుష్కరః- ద్వివిధః కధితో దండః పరదేశే పురాతనైః | ప్రకాశశ్చా ప్రకాశశ్చ తంనిబోధ ద్విజోత్తమ! ||

పరశురాముడు సామభేద దానదండములు నాల్గుపాయములు సెప్పబడినవి. స్వదేశమందు జరుపనగు దండముం జెప్పితివి. పరదేశ దండవిధాన మానతిమ్మన పుష్కరుండనియె. పరదేశమందు దండము రెండు విధములు. ప్రకాశము, అప్రకాశము నని అది యెఱింగికొనుము.

లుంఠనం గ్రామఘాతశ్చ సస్యఘాత స్తధైవచ | చతురంగేణ దండేన పరేషాంచ తధా వధః ||

ప్రకాశః కధితో దండః ప్రత్యక్షం వహ్నిదీపనం | అప్రకా శో విషం వహ్ని ర్గూఢైశ్చ పురుషై ర్వధః ||

దూషణం యవసాదీనాం ఉదాకానాంచ దుషణమ్‌ | రస క్రియాశ్చ వివిధాః సుఖనాః భేదనాదికమ్‌ ||

లుంఠనము=దోచుకొనుట గ్రామములకు ఘాతము సేయుట పంటలకు ఘాతము చేయుట. చతురంగ సేనలతో నెత్తి చని శత్రువుల గూల్చుటయు ప్రత్యక్షముగ నిప్పుపెట్టుటయుననునివి ప్రకాశదండములు. ఆ ప్రకాశదండము గూఢచారులచేత విషము పెట్టించుట నిప్పు పెట్టుటయు పంటలు జెఱచుట నీటిని జెరచుట మనోహరములై వివిధములయిన రసక్రియలు భేద తంత్రములు.

ఏవమాదీని కార్యాణి పరచక్రే మహీక్షితా | స్వరాష్ట్రేచ ద్విజశ్రేష్ఠ! దూషణం బలినా మపి ||

చత్వార ఏతే కథితా హ్యుపాయాః ప్రధానభూతా భువి పార్థివానామ్‌ |

అతః పరంతే కధయామి రామ! శేషా స్త్రయస్తేవ మయేరితా యే ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే దండ ప్రణయన వర్ణనంనామ షట్‌ చత్వారింశ దుత్తర శతతమోధ్యాయః ||

పరచక్రమందీలాటి దండన విధానములను రాజమలు పరుపవలెను. స్వరాష్ట్ర మందుగూడ ప్రబలులైన తన శత్రువుల యెడ గూడ వీనినొనరింప వలెను. ఈయుపాయములు నాల్గు ప్రధానోపాయములుగా పార్థివులకు చెప్పబడినవి. ఇక మిగిలిన నాల్గు పాయములు నింతకుమున్ననేను జెప్పనివి యిటుపైని తెల్పెదను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున దండ ప్రణయన వర్ణనమను నూటనలుబదియాఱవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters