Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబది యైదవ అధ్యాయము - రాజ్యమండల వర్ణనము

రామః- కింను కృత్యతమం రాజ్ఞః తన్మమాచక్ష్వ పృచ్ఛతః | రాజ్యతంత్రం కధం రాజ్ఞా పాలనీయం విపశ్చితా ||

పుష్కరః- సప్తాంగస్య చ రాజ్యస్య భావయుక్తేన భూభృతా | ఏతా వదేవ కర్తవ్యం రాజ్ఞా తస్త్రం భృగూత్తమ ||

సామ దానం తథా దుర్గం కోశో దండ స్తధైవచ | మిత్రం జనపద శ్చైవ రాజ్యం సప్తాంగ ముచ్యతే ||

సప్తాంగస్య చ రాజ్యస్య విఘ్నకర్తౄన్‌ వివాసయేత్‌ | అహితాన్‌ ఘాతయే ద్రాజా క్షిప్రమోవావిచారయన్‌ ||

పండితుడైన రాజున కవశ్యకర్తవ్యమైన రాజ్యతంత్రమేదో యెట్లు పాలింపవలెనో యానతిమ్మన పుష్కరుండిట్లనియె. రాజ్యము సప్తాంగము. రాజు నడుపవలసిన రాజ్యతంత్రమిదియే. సామము, దానము, దుర్గము, కోశము, దండము, మిత్రము, జనపదము (దేశము) అని రాజ్యము సప్తాంగము. సప్తాంగ రాజ్యమునకు విఘ్నము చేయు రాజద్రోహులను వెడల గొట్టవెలను. శత్రు సంహారము క్షత్రధర్మము. కావున నిందాలోచింపవలసినది లేదు.

సప్తాంగస్య చ రాజ్యస్య వృద్ధిః కార్యా సుమండలే | మండలేషు చ సర్వేషు కర్షణీయా మహీక్షితా ||

రామః- మండలాని సమాచక్ష్వ విజిగీషో ర్యధావిధి | యన్యాశ్రిత్య నృపైః కార్యం సంధి విగ్రహ చిన్తనమ్‌ ||

పుష్కరః- ఆత్మ మండల మేవాత్ర ప్రధమం మండలం భ##వేత్‌ | సమంతా త్తస్య విజ్ఞేయా రిపవో మండలస్యతు ||

అధికృత్యాభియోజ్యంతు తత్రాపి శృణు కల్పనమ్‌ |అభియోజ్యః స్మృత శ్శత్రు స్తత్రాపి చ ప్రతీక్షతా ||

రాజ్యమును మండలములు నెర్పరచి యందందు రాజ్యాభివృద్ధి గావింపవలెను. ఆ మండలము క్రిందన్నిటను ప్రజలను రాజు తనవంక కాకర్షించుకొన వలెను. జయింపగోరు రాజు సంధివిగ్రహ సమాలోచనము సేయుటకు అవసరమైన మండలములను గూర్చి యానతిమ్మని రాముండడుగ పుష్కరుండిట్లనియె. మొదటిది ఆత్మ (రాజు యొక్క) మండలము. దానిచుట్టు శత్రువులుందురు. శత్రువు అభియోజ్యుడనబడును. అనగా జయము నెదురుచూచు రాజు శత్రువు నెట్లయిన అభియోజింప వలెను. ఎదిరించవలెను.

తత్పర స్తు సుహృత్‌ జ్ఞేయః మిత్రం మిత్రరిపుస్తధా | ఏత త్పురస్తాత్కాధితం పశ్చాదపి నిబోధమే ||

పార్షిగ్రాహ స్తతః పశ్చాత్తత స్త్వాకంద్ర ఉచ్యతే | ఆసారస్తు తతోప్యన్య స్త్వాక్రందా సార ఉచ్యతే ||

జిగీషో శ్శస్త్రయుక్తస్య వియుక్తస్య తధా ద్విజ | నిగ్రహానుగ్రహే శక్తో మధ్యస్థః పరికీర్తితః ||

నిగ్రహానుగ్రహే శక్తః సర్వేషా మపి యోభ##వేత్‌ | ఉదాసీనః స కధితో బలవాన్‌ పృధివీపతిః ||

ఏతావ దేవతేరామ! ప్రోక్తం ద్వాదశ రాజకమ్‌ | నాత్రాపినిశ్చయ శ్శక్త్యో వక్తుం మనుజపుంగవః ||

వాని తరువాతి రాజమండలము నుహృన్మండలము. తన సరిహద్దు రాజు వానికి శత్రువును తనకు మిత్రుడగుట నహజము. ఈ విషయ మింతమున్న తెలిపితిని. ఇక తరువాతి విషయమాలింపుము. మూడవ వాని కావలి రాజు పార్షిగ్రాహుడు మడముం ద్రొక్కుకొని వచ్చు వాడని యీపదమున కర్థము. వాని తరువాత వాడు ఆక్రందుడు వాని అవ్వలి వాడు అసారుడు. వాని తరువాత అక్రందాసారుడు ననబడును. శస్త్రధారియైన జయార్థియైయున్న శత్రువు యొక్క నిగ్రహమందు అనుగ్రహమునందు శక్తి కల వాడు మధ్యస్థుడనంబడును. అందరి రాజుల నెవ్వడు నిగ్రహానుగ్రహముల సేయగలవాడై బలవంతుడైన రాజు ఉదాసీనుడన బడును. శత్రుమిత్ర దేశములకు పైని ఉపకారాపకారము లేమి సేయక యూరకుండు వాడు. ఇదే ద్వాదశరాజు మండలమని పేర్కొన బడినది. ఇందుగూడ శత్రువు మిత్రుడునని నిశ్చయము సేసి చెప్పుటకు శక్యముగాదు.

నాస్తి జాత్యారిపుర్నామ మిత్రం నామ నవిద్యత్‌ | సామర్ధ్య యోగా జ్ఞాయన్తే మిత్రాణి రిపవస్తధా ||

త్రివిధా రిపవః ప్రోక్తాః కుల్యా నన్తర కృత్రిమాః | వూర్వః పూర్వో గురుస్తేషాం దుశ్చికిత్స్యతమో మతః ||

అనన్తరోపి యశ్శత్రుః సోపిమే కృత్రిమో మతః | పార్షిగ్రాహో భ##వేద్రాజా శత్రోర్మిత్రా భియోగినః ||

జాతిచేత నితడు శత్రువు ఇతడు మిత్రుడునను పేర్కొన వలసిన వాడెవ్వడు లేడు. రాజుయొక్క సామర్థ్యము ననుసరించి మిత్రులు శత్రువులు నేర్పడు చుందురు. శత్రువులు మూడు రకాలుగా నుందురు. కుల్యులు= కులములోని వారు (జ్ఞాతులన్న మాట). అనంతరులు=సరిహద్దు ఇరుగు పొరుగు రాజులు కృత్రిములు వీరిలో మూడవ వానికంటె మొదటివాడు గురువుగా నుండును. అనగా ప్రబల శత్రువన్నమాట. వాడు మాత్రము చికిత్సకు లొంగడు. సంధి విగ్రహాదులకు అనువు గాడన్నమాట. అనంతరుడు కూడ. నాయభిప్రాయములో కృతిమ శత్రువే.

పార్షిగ్రాహ ముపాయైస్తు శమయేచ్చ తధాస్వకమ్‌ | మిత్రేణ శత్రో రుచ్ఛేదం నశంసన్తి పురాతనాః ||

మిత్రంహి శత్రుతా మేతి సామంతత్వా దసన్తరమ్‌ | శత్రుం జిగీషు రుచ్ఛిన్ద్యాత్‌ స్వయం శక్నోతి చే ద్యది ||

ప్రతాప వృద్దౌ తేనాస్య నమిత్రా జ్ఞాయతే భయమ్‌ | నాన్యధా పృధివీం జేతుం శక్త్యా రామ!జిగీషుణా ||

ప్రతాప వృద్ధిః కర్తవ్యా తస్మా ద్రాజ్ఞా యధా తధా | తధాస్య నోద్విజే ల్లోకో విశ్వాస్స్యశ్చ యధా భ##వేత్‌ ||

తన పార్షిగ్రాహుని సామాద్యుపాయములచే లొంగదీసికోవలెను. మిత్రుని ద్వారా శత్రునాశనము చేయుటను పురాతన రాజనీతి కారులు మంచిదనరు. మిత్రరాజు సామంతుడగుట వలన తాత్కాలిక మిత్రుడట్లున్నను తరువాత శత్రువేయగును. శత్రువును స్వయముగా చేతనైన దుదముట్టింప వలెను. గాని మిత్రరాజు ద్వారా అది చేయింపరాదు. స్వయముగ నిగ్రహించుటలో ప్రతాప నమృద్ధి గలవాడైనపుడు వీనికి మిత్రుని వలన భయముండదు. పరాధీనుడైనచో రాజు భూమిం గెలుచుటకు శక్తుడుగాడు. అందుచే రాజు తన ప్రతాపముం బెంచుకొన వలెను. ఆ విధముగా జేసినపుడు లోకము (రాజ్యములోని ప్రజలు) ఇతనికి బెదరిపోరు. రాజునకు విశ్వాసపాత్రము గూడ గాగలదు.

జిగీషు ద్ధర్మ విజయీ తధా లోకం వశం నయేత్‌ | యఃస్యా దధర్మ విజయీ తస్మా దుద్విజతే జనః ||

ప్రాప్యాపి వసుధాం కృత్స్నాం నచిరం శ్రియ మశ్నుతే |

ధర్మేణ యజ్ఞో భవతీహ వృద్ధిః ధర్మేణ వృద్ధి శ్చ తధాపరత్ర |

ధర్మేణ లబ్ధ్వా వసుధాం జితారిః భు క్త్వాచిరం నాక మను ప్రయాతి ||

ఇతి శ్రీవిష్ణుధర్మో త్తరే ద్వితీయఖండే రాజ్యమండల వర్ణనంనామ పంచ చత్వారింశ

దుత్తర శతతమోధ్యాయః ||

జయము కోరునతడు ధర్మ విజయముసేసి లోకమును వశపఱచుకోవలెను. అధర్మ విజయమైన వాని వలన జనము బెదరిపోవును. ఒకవేళ సర్వం పృధివిం బడసినను నట్టివాడు చిరకాలము సామ్రాజ్య సంపద ననుభవింపడు. ధర్మముతో జేసిన యజ్ఞము [రాజునకు ధర్మయద్ధము యజ్ఞమే] ఇహమందు వృద్ధి పరలోకమునందు వృద్ధియగును. ధర్మముచే గెల్చిన రాజు తాను బొందిన వసుంధర చిరకాలమనుభవించి నాకమున [స్వర్గమున] కేగును. న+అకము = దుఃఖములేనిది. కేవల సుఖస్థాన మన్నమాట].

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున రాజ్యమండల వర్ణనమను నూటనలుబదియైదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters