Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబది మూడవ అధ్యాయము - మృగ పక్షి వైకృత వర్ణనము

గర్గః- ప్రవిశన్తి యదా గ్రామ మారణ్యా మృగ పక్షిణః | అరణ్యం వా గ్రామ్యాః స్థలం యాన్తి జలోద్భవాః

జలం వా స్థలజా యాన్తి ఘోరం వాశన్తి నిర్భయాః | రాజద్వారే పురద్వారే శివా శ్చాప్యశివప్రదాః||

దివా రాత్రించరావాపి రాత్రౌ వాపి దివాచరాః | గ్రామ్యాస్త్యజంతి గ్రామంవా శూన్యతాం తస్య నిర్దిశేత్‌ ||

దీప్తా వాశన్తి సంధ్యాసు మండలాని చ కుర్వతే | వాశ##న్తే విస్వరం యత్ర తదా ప్యేత త్ఫలం వదేత్‌ ||

అడవిజంతులు పక్షులు గ్రామములోనికి వచ్చినను, గ్రామాలలో నుండు జంతువులు పక్షులు లరణ్యముల కేగినను, జలచరములు చేపలు మొదలయినవి మెట్టనేలకు వచ్చినను మెట్టలో పుట్టిపెరిగినవి నీళ్ళలో ప్రవేశించినను పైన అవి ఘోరముగా నఱచును. రాజద్వారమందు పురద్వారమందును అమంగళ ప్రదములగు నక్కలు భయము లేక యఱచినను రాత్రించరములు గుడ్ల గూబలు మొదలైనవిపగలు తిరిగినను పగలు తిరుగు పశుపక్ష్యాదులు రాత్రులం దిఱిగినను గ్రామ్యములయిన జంతువులు గ్రామములను విడిచిపోయినను శూన్యత (నాశము) నుచెప్పవలెను. అప్పుడు రాజ్యము శూన్యమైపోతే, సంధ్యలందు గ్రామ్య పశుజాతి నిప్పుగుఱియుచు నరచును. మండలాకారముగ తిరుగను. వికృతస్వరముగా నార్చును. అప్పుడు కూడ రాజ్యము శూన్యమగుననియే చెప్పవలెను.

ప్రదోషే కుక్కుటో వాశేద్ధేమన్తే వాపి కోకిలః | అర్కోదయేర్కాభిముఖః శ్వావా నృపభయం భ##వేత్‌ ||

గృహం కపోతః ప్రవిశేత్‌ క్రవ్యాదో మూర్ధ్ని లీయతే | మధు వా మక్షికా కుర్యాత్‌ మృత్యుం గృహపతే ర్వదేత్‌ ||

కోడి వేకువవేళ కూయవలసినది సాయంప్రదోషము లందు కూయును. కోకిల హేమంతర్తువున గూయును. (వసంతము నందు కోకిల కూత సహజము) ఇది విరుద్ధము. సూర్యోదయవేళ సూర్యుని కెదురుగా నిల్చి కుక్క యార్చును. అందువలన నృపభయము కలుగును. పావురము మింట బ్రవేశించును. ఇంటిపైకప్పు పై గ్రద్ద వ్రాలును, తేనెపట్టుపట్టును. ఈ లక్షణములం బట్టి గృహ యజమానికి మరణముం జెప్పవలెను.

ప్రాకార ద్వార గేహేషు తోరణాపణవీధిషు | కేతు చ్ఛత్రా యుధాద్యేషు క్రవ్యాత్‌ సన్నిపతే ద్యది ||

జాయతే వాధ వల్మీకో మధు వా దృశ్యతే యది | స దేశో నాశ మాప్నోతి రాజా చ మ్రియతే ధవా ||

మూషకాన్‌ శలభాన్‌ దృష్ట్వా ప్రభూతాన్‌ క్షద్భయం భ##వేత్‌ | కాష్ఠోల్ము కాస్థి శృంగాద్యాః శ్వానో మర్కటకై ర్జితాః||

ప్రాకారద్వార గృహములందు తోరణమందు (బహిర్ద్వారము) బజారు వీథులందు జెండామీద గొడుగుపైని ఆయుధముల మీదను గ్రద్ద వాలెనేని యింటిలో బుట్ట మొలచినను తేనె పట్టు పట్టినను నాదేశము నాశనమందును, రాజు మరణించును. ఎలుకలు మిడుతల దండు మిక్కిలిగ గనిపించి కట్టెలు, కొఱవులు. నెముకలు, కమ్ములు మున్నగునవి కనపడినను కుక్కలు కోతులచే జయింప బడిన నారాజ్యమందలి ప్రజలాకలిచే నలమటింతురు.

శ్మశానం నిర్గతాః గ్రామాత్‌ గ్రామ శ్రేష్ఠ వినాశనాః | ఏకాండతా తు కాకానాం యది చైవా ప్యనండతా ||

నిమ్నేషు చ నివేశ శ్చ దేశనాశకరః స్మరృతః | అపసవ్యం భ్రమన్తశ్చ మండలే రణవేదినః ||

దుర్భిక్ష వేదినో జ్ఞేయాః కాక ధాన్య ముషో యది | జనా నభిభవంతశ్చ నిర్భయా రణవేదినః ||

కుక్కలు గ్రామము విడిచి శ్మశానమునకు పోయెనేని గ్రామశ్రేష్ఠుడు గ్రామములో పెద్ద (సభాపతి) మరణించును. కాకి యొక్క గ్రుడ్డుపెట్టుట లేదా గ్రుడ్లు పెట్టకుండుట యు పల్లములలో వ్రాలుటయు దేశనాశనము చేయును. కాకుల వసవ్యముగ మండల ముగల దిరిగినచో రణసూకములగును. అనగా యుద్ధము రాకడను దెలుపునన్నమాట. కాకులు ధాన్యముల నపహరించునేని దుర్భిక్ష వేదులగును. [కఱవు కాటకము రాకడను దెల్పును] జడుపులేక జనులను తిరస్కరించునేని రణవేదులు [యుద్ధము రాకడను దెల్పునవి] అగును.

కాకో మైథున సక్త శ్చ శ్వేతశ్చ యది దృశ్యతే | రాజా వా మ్రియతే తత్ర సవా దేశో వినశ్యతి ||

ఉలూకో వాశ##తే యత్ర విపతే ద్వా తధా గృహే | జ్ఞేయో గృహపతే ర్మృత్యుర్ధన నాశ స్తధైవ చ ||

కాకి మైధున మందుండియు తెల్లనిదియునై కనిపించునేని రాజుమరణించును. ఆదేశమును నశించును. గుడ్లగూబకూసినను నింటవ్రాలినను గృహపతికి మృత్యువు ధననాశనము గల్గునని తెలియవలెను.

మృగ పక్షి వికారేషు కుర్యా ద్ధోమాన్‌ సదక్షిణాన్‌ | దేవాః కపోత ఇతి చ జప్తవ్యాః పంచభిర్ద్విజైః ||

గావశ్చ దేయా విధి వద్ద్వి జానాం సకాంచనా వస్త్రయుగోత్తరీయాః |

ఏవం కృతే శాంతి ముపైతి పాపం మృగై ర్ద్విజై ర్వా వినివేదితం యత్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే మృగ పక్షి వైకృత్య వర్ణనం నామ త్రిచత్వారింశ దుత్తర శతతమోధ్యాయః ||

మృగపక్షి వైకృతములందు దక్షిణలిచ్చి హోమములు సేయవలెను. "దేవాఃకపోత" అను మంత్రములు అయిదుగురు బ్రాహ్మణులు హోమాదులందు జపము నందు నుపయోగింప వలెను. ద్విజులకు గోదానములు సేయవలెను. దానితో బంగారము వస్త్రయుగ్మము నీయవలెను. ఇట్లు సేసినచో మృగపక్షుల వలన సూచింపబడిన పాపము శాంతించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున మృగపక్షి వైకృత్యమను నూటనలుబదిమూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters