Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదునాలుగవ యధ్యాయము - భద్రాసన లక్షణము

పుష్కరః: భద్రాసనం నరేంద్రస్య క్షీరవృక్షేణ కారయేత్‌ | ఉచ్ఛ్రాయశ్చ తధా తస్య అధ్యర్ధం తు సమం భ##వేత్‌ || 1

హస్తత్రయం తధా విష్టం విస్తరేణ తుకారయేత్‌ | ఆయామశ్చా7స్య కర్తవ్యో విస్తరేణార్ధ సమ్మితః|| 2

చతురస్రంతు కర్యవ్యం రాజ్ఞో భద్రాసనం శుభమ్‌ | నా7ష్టాస్రం నతధావృత్తం నచ దీర్ఝం భృగూత్తమ || 3

సువర్ణరూప్య తామ్రైశ్చ చిత్రం కార్యం విశేషతః | రత్నైః ప్రశ##సై#్తర్న తధా న రత్న ప్రతిరూపకైః || 4

చత్వారః పురుషాస్తత్ర విన్యస్తా భృగునందనః | ద్విగుణాశ్చ తధా సింహాః తేభ్యస్తు ద్విగుణా స్తథా || 5

భద్రాసనం తత్రభ##వే న్కృపస్య తలేన పూర్ణం సుసుఖం పరార్జ్యమ్‌ |

వైయాఘ్ర చర్మాస్తరణం సుఖార్థం వరాసనం తస్య సమామనన్తి || 6

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వీతీయఖండే భద్రాసన లక్షణం నామ చతుర్దశో7ధ్యాయః

పుష్కరుడనియె: సార్వభౌముని భద్రాసనము క్షీరవృక్షముచే జేయింపవలెను. దానియెత్తు మూడున్నరమూర లుండవలెను. మూడుహస్తములు పొడవు దానిలో సగము వెడల్పు నుండవలెను. రాజభద్రాసనము నలు చదరముగా నుండవలెను. దానికి నెనిమిది యంచులుండవలెను. అది గుండ్రముగానేని యుండవచ్చును. పొడవుగా మాత్రము గారాదు. బంగారము వెండి రాగి రేకులతో నలంకరింప వచ్చును. ప్రశస్తరత్నములు పొదుగవలెను, రత్నప్రతి రూపకము (నకిలీరాళ్ళు) లెన్నడు పనికిరావు. ఆసింహాసనము క్రింద (కాళ్ళుగా) నలుగురు పురుషులు ఎనిమిది సింహములు పతిమా రూపమున నమరుపలెను. లేదా దానికి రెట్టింపు అనగా పురుషులెనమండుగురు, సింహములు పదునారైన కావచ్చును. చక్రవర్తి భద్రాసనమది పూర్ణతలము పైభాగముకంటె సుముఖమై అమూల్యమై సుఖాసనమగుటకు వ్యాఘ్రచర్మ మాస్తరణముగా పరువ బడినదై యుండవలెనని యుండకలెనని పెద్దలు వచింతురు.

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున భద్రాసన లక్షణమను పదునాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters