Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటముప్పది యొకటవ అధ్యాయము - చతుర్థాశ్రమ (సన్యాస) వర్ణనము

పుష్కరః-వనేషుచ విహృత్యైవం తృతీయం భాతమాయుషః | చతుర్థమాయుషో భాగం త్యక్తసంగః పరివ్రజేత్‌ ||

ఆశ్రమాదాశ్రమం గత్వా హుతహోమో జితేంద్రియః | భిక్షాబలి పరిశ్రాన్త ప్రవ్రజే ద్వ్రతవర్జితః

ఋణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశ##యేత్‌ | అనపాకృత్యచ ఋణం మోక్షమిచ్ఛన్‌ ప్రజత్యధః ||

అధీత్య విధివద్వేదాన్‌ పుత్రాంశ్చోత్పాద్య ధర్మతః | ఇష్ట్వాచ శక్తితో యజ్ఞైర్మనోమోక్షే వివేశ##యేత్‌ ||

అనధీత్య ద్విజోవేదా ననుత్పాద్య తధా సుతాన్‌ | అనిష్ట్వా చైవ యజ్ఞైశ్చ మోక్షమిచ్ఛన్‌ వ్రజత్యధః ||

పుష్కరుండనియె. ఇట్లు అయుర్దాయములో మూడవ భాగమున వనమునందు విహరించి (వానస్రస్థాశ్రమ ధర్మమును నిర్వహించి) నాల్గవభాగమందు సంగమువిడిచి వెళ్ళిపోవలెను. నన్న్యాసాశ్రమస్వీకారము సేయవలెను. బ్రహ్మచర్యశ్రమము నుండి గార్హస్థ్యము, అందుండి. వానప్రస్థాశ్రమమునకు క్రమముగా చేరి అగ్ని హోత్రములు సేసి, వానప్రస్థసన్న్యాసులకు భిక్షలను దేవపితృ ఋషివర్గమునకు బలిని సమకూర్చుటలో నలసియలిసి వ్రతములన్నియు త్యజించి ప్రవ్రజ్యము సేయవలెను. సన్యాసాశ్రమ స్వీకారము సేయవలెను. దేవ, పితృదేవ ఋషివర్గమునకు సంబంధించిన మూడు ఋణములను దీర్చికొన్న మీదట మనస్సును మోక్షమునందు లగ్నము సేయవలెను. ఋణములు దీర్పకుండ మోక్షమును కోరునేని (ముముక్షువు అగునేని) క్రిందికి పడిపోవును. వేదములను యథావిధిగ జదువక, పుత్రులను గనకుండ, యజ్ఞము లాచరింపకుండ, ముక్తికావలయునన్నవాడు క్రిందికి జారిపోవును.

ప్రాజాపత్యాం నిరూప్యేష్టిం సర్వవేదాం సదక్షిణామ్‌ | ఆత్మన్యగ్నీ న్సమారోప్య ప్రవ్రజ త్యభయం గృహీ ||

తస్య తేజోమయా లోకాభవన్తి బ్రహ్మవాదినః | యస్మా దణ్వపి భూతానాం ద్విజః నోత్పద్యతే భయమ్‌ ||

తస్య దేహా ద్విముక్తస్య భయం నాస్తి కథంచ న ||

అగారా దభినిష్క్రాన్తః పవిత్రోపచితో మునిః | సముపోఢేషు కామ్యేషు నిరపేక్షః పరివ్రజేత్‌ ||

సర్వవేదములతోను, దక్షిణలతోను గూడిన ప్రాజాపత్యేష్టిని నిర్వహించి యగ్నులను ఆత్మారోపణము సేసికొని (తన యందు నిలుపుకొని) గృహస్థు అభయస్థితిని (ముక్తిని) పొందును. అట్టి బ్రహ్మవాదికి లోకములన్నియు కేవలతేజోమయుములగును. జ్ఞానరూపములగును. ఏజ్ఞాని వలన నే భూతకోటికి అణుమాత్రమేని భయముకలుగదో అట్టిజ్ఞాని స్థూలసూక్ష్మకారణ శరీరములు మూడింటినుంచి విముక్తుడైనచో యా బ్రహ్మవేత్తకు (జ్ఞానికి) ఎటును ఎందును భయము సంసారములేదు. ఇల్లువిడిచి పవిత్రోపచయము పుణ్యవృద్ధిని అందిన ముని కోరవలసిన కామ్యములు భోగములన్నిటయందు కోరికలేనివాడై సన్న్యసింపవలెను.

ఏక ఏవ చరే న్నిత్యం సిద్ధ్యర్థ మసహాయవాన్‌ | సిద్ధిమేకస్య తాం పశ్య న్నజహాతి నహీయతే ||

అనగ్ని రనికేతస్య్సాద్గ్రామ మన్నార్థ మాశ్రయేత్‌ ||

ఏసహాయములేక నిత్యము నొంటరిగానే చరింపవలెను. దానివలన జ్ఞానసిద్ధికల్గును. బ్రహ్మనుభవ మొక్కటే లక్ష్యముగా బెట్టుకొన్నవాడు దానినెన్నడును విడువడు. భ్రష్ఠుడునుంగాడు. అగ్నిహోత్రములు, యిల్లు వాకిలి లేక శరీరయాత్రా నిమిత్తముగా నన్నము కొఱకు గ్రామములలోని కేగవలెను.

ఉపేక్షకోసంచయకో మునిర్భావ సమాహితః | కపాలం వృక్షమూలాని కుచైల మసహాయతా ||

మమతా చైవ సర్వస్మి న్నేత న్ముక్తస్య లక్షణమ్‌ ||

నాభినందేత మరణం నాభినందేత జీవితమ్‌ | కాలమేవ పరీక్షేత నిర్దోషభృతకో యధా ||

(దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్‌ | సత్యపూతాం వదే ద్వాచం మనఃపూతం సమాచరేత్‌ ||

అతి జడాన్‌ తితిక్షేత నావమన్యేత కంచన !)||

అన్ని విషయముల నుపేక్షించుట, అసంచయత్వము, మౌనము, భావశాంతి, చేతిలో భిక్షార్ధమై కపాలము (పుర్రె), వసించుటకు చెట్టుమొదలు, కట్టుకొనుటకు చాలీచాలని చినుగుపాత, నిస్సహాయత, సర్వమందు మమకారము లేకుండుట అనునవి ముక్తుని లక్షణములు. ఇదేనేను (ఇది నాదియనునది పరి మితాహంకారము, పరిమిత మమకారము. అది బంధహేతువు సర్వమునేనే సర్వము నాదే అది కేవలబ్రహ్మము సచ్చిదానందాత్మకము. అనునది అపరిమితాహంకార మమకారమును. అదికృతార్థత హేతువన్న మాట.) మరణమును గాని జీవితమును గాని యభినందింప రాదు. నిర్దుష్టుడైన నౌకరువలె కాలమును పరీక్షింప వలెను. అడుగు పెట్టునపుడు దృష్టిపూతముగా బెట్టవలెను. అనగా నిదానించి శుచియైన చోటవర్తింప వలెను. వస్త్రపూతము (గుడ్డలో నొడబోసిన) నిర్మలమైన నీరుత్రాగవలెను. (సత్యముచే పవిత్రమైన) మాట పలుకవలెను. అంతఃకరణ శుద్ధిమైన పనిచేయవలెను. మిక్కిలి తెలియనివారిని (మందబుద్ధులను) సహింపవలెను. ఎవ్వనినేని యవమానింపరాదు.

న చైకం గృహమాశ్రిత్య వైరం కుర్వీతకే నచిత్‌ | క్రుధ్యన్తం న ప్రతిక్రుధ్యే దాపృష్టః కుశలం వదేత్‌ ||

సప్తద్వారావకీర్ణాంచ నవాచ మనృతాం వదేత్‌ | అధ్యాత్మ రతి రాసీనో నిరపేక్షో నిరామిషః ||

ఆత్మ నైవ సహాయేన తరే ద్దుర్గాంత మాత్మనః |

ఒక ఇంటిలో జొరబడి యెవ్వనితో దగవులాడగూడదు. కోపపడు వానిని నెదిరించి కోపపడరాదు. అడిగినప్పుడే క్షేమమని చెప్పవలెను.

ఏడు ఇంద్రియములు =రెండు ముక్కులు, రెండు కండ్లు, రెండు చెవులు, ఒకటి నోరు. ఈ సప్తద్వారములందు నలముకొన్న అబద్దపు వాక్కును జెప్పగూడదు. (వీని ద్వారా అనుభవసిద్ధమైన విషయముగా అబద్ధాలు చెప్పరాదన్నమాట.) ఆత్మ రతి అసన శుద్ధి గల్గియే అపేక్షము లేక కోరికలు లేక మనస్సహాయుడాగా దుర్గమ మయిన సంసారము దాటవలెను.

నచోత్పాత నిమిత్తాభ్యాం న నక్షత్రాంగ విద్యయా | నానృతస్వన వాదాభ్యాం భిక్షాం లిప్సేత కర్హిచిత్‌ ||

న తాపసై ర్బ్రాహ్మణౖర్వా నయోగిభి రథాశ్రమైః | అకీర్ణై ర్భిక్షుకై ర్వర్ణై రాగార ముపసం ప్రజేత్‌ ||

ఉత్పాతములు నిమిత్తములు (శకునములు) చెప్పుట గ్రహనక్షత్రవిద్య (జ్యౌతిషము) అనృతస్వనము=ఇతర జంతువుల కూతలు కూయుట) అబద్ధపుకూతలు వాదించుటయునను వాని మూలమున యతి యెన్నడుం భిక్షగోరగూడదు. తపస్వులతో బ్రాహ్మణులతో యోగులతో ఆశ్రమములతో గుంపు గూడిన భిక్షకులతో వర్ణములతో గూడి యింటిలోనికి సన్న్యాసి పోరాదు.

క్లుప్త కేశ నఖశ్మశ్రుః పాత్రీ దండీ కుసుంభవాన్‌ | విచరేత్‌ న్నియతో నిత్యం సర్వభూతాన్యపీడయన్‌ ||

అతై జసాని పాత్రాణి తస్యస్యు ర్నిర్వ్రణానిచ | తేషా మద్భిః స్మృతం శౌచం చమసానా మివాధ్వరే ||

అలాబం దారుపాత్రంచ మృణ్మయం వైదలం తధా | ఏతాని యతిపాత్రాణి విజ్ఞేయాని మనీషిభిః ||

జుట్టు, గోళ్ళు, గడ్డముల క్షౌరసంస్కారము చేసికొని, కమండలము దండముం బట్టుకొని కాషాయము గట్టుకొని నియమవంతుడై ఏ ప్రాణులను బీడింపక నిత్యముం జరింపవలెను. ప్రాణులను బీడింపక నిత్యముం జరింపవలెను. బంగారము, వెండి మొదలయిన తేజః పదార్ధములతో జేయనివియు ప్రణములేనివియు నగు పాత్రలు యతి కర్హములు. యజ్ఞములో చమస అను పాత్రములకువలె నుదకముచేతనే ఆ పాత్రలకు శౌచము. అనప బుర్ర కర్ర పాత్ర, మట్టితో చేసినది, వైదలము అనునివి యతులు వాడవలసిన పాత్రలని బుద్ధిమంతులు గ్రహింపలెను.

సౌవర్ణమణి పాత్రేషు కాంస్య రౌప్యాయసేషుచ | భిక్షాం దద్యా న్నధర్మజ్ఞ ! గ్రహీతా నరకం వ్రజేత్‌ ||

ఏకకాలం చరేద్భైక్ష్యంన ప్రసజ్యేత విస్తరే | భైక్ష్యే ప్రసక్తస్య మతి ర్విషయే ష్వపి సజ్జతే ||

బంగారము మణి కంచు వెండి ఇనుప పాత్రలలో యతికి భిక్షపెట్టరాదు. భిక్షగ్రహించిన వాడు నరకమందును. ఒంటిపూటనే భిక్షాచర్యము సేయవలెను. అధికముగ భిక్షకావలెననరాదు. భిక్షకై పోయినవాని మనస్సు విషయములందుగూడ సక్తమగును.

విధూమే న్యస్తముసలే వ్యంగారే భుక్తవజ్జనే | వృత్తే శరావసంపాతే భిక్షాం నిత్యం యతిశ్చరేత్‌ ||

అలాభే న విషాదీస్యాల్లాభే చాపిన్‌ హర్షయేత్‌ | ప్రాణయాత్రిక మాత్రస్స్యా న్మాత్రా సంగాద్వినిర్గతః

అభిపూజిత లాభస్తు యతిర్మక్తోపి బధ్యతే ||

అల్పాన్నా భ్యవహారేణ రహః స్థానాసవేన చ | హ్రియమాణాని విషయై రింద్రియాణి నివర్తయేత్‌ ||

ఇంద్రియాణాం నిరోధేన రాగద్వేష భ##యేనచ | అహింసయాచ భూతానా మమృతత్వాయ కల్పతే ||

పొగలేని, రోకలిమూలపెట్టిన, నిప్పులార్పిన, భోజనాలు చేసివేసిన, మూకుళ్ళు (కంచాలు) వాల్చుటయైపోయినచోట యతి భిక్ష సేయవలెను. భిక్ష దొరకనపుడు విచారింపగూడదు. దొరికినపుడు హర్షింపగూడదు. ప్రాణయాత్రామాత్ర కార్యక్రమము గల్గియుండవలెను. మాత్రాసంగము (విషయ సంగము) నుండి విరమింపవలెను. ద్రవ్యలాభము గోరునాడు యతిముక్తుడయ్యు బంధములో పడును. మితాహారముగొని యేకాంతమున వసించి విషయములచే నాకర్షింపబడు నింద్రియులను మరలించుకొనవలెను. ''అసన్మానత్తపోవృద్ధిః స్మనానాచ్చ తపఃక్షయః'' అగౌరవమువలన తపోవృద్ధి గౌరవము వలన తపస్సు క్షయముగల్గునన్నమాట. ఇంద్రియ నిగ్రహముచేత రాగద్వేషముల యెడ జడుపుచేత భూతముల హింస చేయకుండుట చేతను యతి అమృతత్వ సిద్ధి కర్హుడగును.

అవేక్షేత గతిం నౄణాం కర్మదోష సముద్భవామ్‌ | నిరయే చైవ పతనం వ్యాధిభిశ్చోపపీడనమ్‌ ||

దేహనుక్రమణం చాస్మాత్‌ పునర్గర్భేచ సంభవమ్‌ | యోనికూట సహస్రేషు మృతౌ చాస్యాన్తరాత్మనః ||

అధర్మ ప్రభవం చైవ కర్మయోగం శరీరిణామ్‌ | ధర్మార్థప్రభవం చైవ సుఖసంయోగ మక్షయమ్‌ ||

సూక్ష్మతాం చానువీక్షేత యోగేన పరమాత్మనః | దేహేషు చైవ పతిత ముత్తమే ష్వధమేషుచ ||

మానవుల కర్మదోషమువలన నేర్పడు గతిని గమనింపవెను. నరక పతనము, వ్యాధిపీడ, రోగపీడ, మరణము, తిరిగి తల్లికడుపులో పడుట, చినిపోయి ఈ మానవులు అంతరాత్మ (జీవుడు) అనేకవలే యోను లందు పునః ప్రవేశముచేయుట అధర్మా చరణముచేత ఏర్పడిని దేహధారుల కర్మయోగమును ధర్మార్ధ పురుషార్ధములవలనగలుగు అక్షయ సుఖ సంయోగమును యోగముచే పరమాత్మ యొక్కసూక్ష్మత్వమును, ఉత్తమ మధ్యమాధమ శరీరములందు పడుటయును యోగి కనిపెట్టుచుండవలెను.

దూషితోపి చరేద్ధర్మం యత్ర యత్రాశ్రమే రతః | సమస్సర్వేషు భూతేషు నలింగం ధర్మకారణమ్‌ ||

ఫలం కటక వృక్షస్య యద్యప్యంబు ప్రకాశకమ్‌ | న నామగ్రహణా దేవ తస్య వారి ప్రసీదతి ||

సంరక్షణార్ధం జంతూనాం రాత్రావహని వా సదా | శరీరస్యాత్యయేవాసి సమీక్ష్య వసుధాం చరేత్‌ ||

అహోరాత్ర చయా జ్జంతూన్‌ హినస్త్య జ్ఞానతోయది | తేషాం స్నాత్వా విశుద్ధ్యర్ధం ప్రాణాయామాన్‌ షడాచరేత్‌ ||

ప్రాణాయామా బ్రాహ్మణస్య త్రయోపి విధవత్కృతాః | వ్యాహృతి ప్రణవైర్యుక్తా విజ్ఞేయం పరమం తపః ||

దహ్యన్తే ధ్మాయమానానాం ధాతూనాంహి యథా మలాః | తధేంద్రియకృతా దోషాః దహ్యన్తే ప్రాణ నిగ్రహాత్‌ ||

ఏ యే యాశ్రమ మందాస్ధయున్నదో దానియందు దోషదూషితుడైనను ధర్మము నాచరించుచునే యుండవలెను. సర్మభూతములందు సమానుడై యుండవలెను. కేవల లింగము (ఆయా యాశ్రమ చిహ్నము) ధర్మమునకు గారణము కాదు. ఆయాయాశ్రమ ధర్మమును యధావిధి నడుపుటయే ప్రధానలక్షణము. ఇందుగకాయ నీటిలో కలుషము విఱువగలదుగాని దానిపేరు చెప్పినంతమాత్రమున నీరు స్వచ్ఛముగాదు, పగలుగాని, రాత్రిగాని శరీరము పోవుచున్నప్పుడుకూడా సర్వజీవ సంరక్షణమును దృష్టిలో బెట్టుకొని భూమిపై సంచరింపవలెను. పగలు రాత్రియుం దెలియకుండ జంతుహింస చేసెనేని యా పాపశుద్ధికి స్నానము సేసి యాఱు ప్రాణయామములను జేయవలెను. మూడు ప్రాణయామములు వ్యాహృతి పూర్వకముగా ప్రణవముతో గూర్చి చేయునేని అది బ్రాహ్మణుని కత్యుత్తమ తపస్సగును. ఆయాధాతవుల (బంగారము, వెండి మొదలగువాని) మలము కొలిమిలో పెట్టి యూదినపుడే విధముగా పోవునో అట్లు ప్రాణాయమముచేత నింద్రియకృత దోషములు నశించును.

ప్రాణాయామై ర్దహేద్దోషాన్‌ ధరాణాభిస్తు కిల్బిషమ్‌ | ప్రత్యాహారేణ సంసర్గాన్‌ ధ్యానేనా నీశ్వరాన్‌గుణాన్‌ ||

ఉచ్చావచేషు భూతేషు దుర్జేయ మకృతాత్మభిః | జ్ఞానయోగేన సంపశ్యేత్‌ గతి మస్యాన్త రాత్మనః ||

సమ్యగ్దర్శన సంపన్న ః కర్మభిర్న నిబధ్యతే | దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే ||

అహింసయేంద్రియా సంగైః వైదికైశ్చైవ కర్మభిః | తపసశ్చరణౖశ్చోగ్రైః సాధయన్తీహ తత్పదమ్‌ ||

ప్రాణయామములచేత నింద్రియదోషములను దహింపవలెను. ధారణచేత పాపమును దహింపవలెను. ప్రత్యాహరాముచేత విషయ సంసర్గములను, ధ్యానముచే ననీశ్వరములైన గుణములను దహింపవలెను. ధ్యానముచేతనే భతవద్గుణానుభవము గల్గునన్న మాట. అల్పజీవులు అధికజీవులయందు అంతరాత్మ గతి అసంస్కృత జిత్తులచు తెలయరానిదాని జ్ఞానయాగముచేతనే తెలియవలెను. ఇటువంటి సమ్యగ్దర్శనము సంపూర్ణముగాగల యోగి కర్మములం గట్టువడడు. అది లేనివాడు సంసారముం బొందును. అహింసచేత ఇంద్రియ నిస్సంగత్వముచేత వేదోక్త కర్మాచరణముచేత తీవ్ర తపస్సులచేతను పుణ్యాత్ము లా స్ధానమును (బ్రహ్మజ్ఞానము) సాంధింతురు.

అస్థిస్థూణం స్నాయుయుతం మాంసశోణిత లేపితమ్‌ | చర్మావనద్ధం దుర్గన్ధి పాత్రం మూత్రపురీషయోః ||

జరాశోక సమావిష్టం రోగాయతన మాతురమ్‌ | రజస్వల మనిత్యంచ భూతావాస మిదం త్యజేత్‌ ||

నదీ కూలే యధా వృక్షేవా శకుని ద్యధా | తధాత్యజ న్నిమం దేహం కృచ్ఛ్రగ్రాహా ద్విముచ్యతే ||

స్తంభములవంటి ఎముకలు గలదియు స్నాయు=సన్ననరముల వలన కూడినదియు, మాసంము చేత రక్తముచేత పూయబడినది, పైని తోలుతో బిగింపబడినది, మూత్రపురీషముల పాత్రము పాడుకంపుగొట్టునది, ముదిమిదుఃఖముతో గూడినది, రోగములకు నిలయము, ఆకలి దప్పిక మొదలైన వానితో గుములనది, దుమ్ము గ్రమ్మినది, అనిత్యము నైనదియు, భూతమలు (జీవులు) నివాసమగు నీ దేహమును వదలి వేయవలెను. నదియొడ్డున జెట్టువలె. చెట్టుపైని పక్షివలె, నీదేహమును వదలి పెట్టుచు సన్యాసి కష్టములను మొసలి నోటి నుండి బయట పడును.

ప్రియేషు స్వేషు సుకీతం చాప్రియేషుచ దుష్కృతమ్‌ | విసృజ్య ధ్యానయోగేన బ్రహ్మాభ్యేతి సనాతనమ్‌ ||

యదా భావేన భవతి సర్వభావేషు నిఃసృతిః | తదాసుఖ మవాప్నోతి ప్రేత్యచేహచ శాశ్వతమ్‌ ||

అనేన విధినా సర్వాన్‌ కామాన్‌ త్యక్త్వా శ##నైశ్వనైః | సర్వైర్ద్వంద్వైర్వినిర్ముక్తో బ్రహ్మణ్యవావతిష్ఠతి ||

తన యిష్టులందు తన పుణ్యమును. అనిష్టులందు తన పాపమును విడిచి, యతి ధ్యానయోగము చేత సనాతన బ్రహ్మము నందును. ఎప్పుడు భావముచే (మనస్సు చేత) అన్ని భావములందు ప్రాపంచిక విషయములందు నంటుదొంలగెనో అప్పుడు చని పోయిగాని యిక్కడను గాని శాశ్వత సుఖమును బొందును. ఈ చెప్పిన విధముగా మెల్లమెల్లగా నెల్లకోర్కెలు విడిచి శీతోష్ణాది సర్వద్వంద్వములన నుండి శీతోష్ణములు సుఖదుఃఖములు ప్రియాప్రియములు నిత్యాది జంటలందంటు దలగి బ్రహ్మమంద యుండును.

ధ్యానికం సర్వమేవైతద్యదేతదతి శాబ్దికమ్‌ | నహ్యధ్యాత్మ కవిః కశ్చిత్క్రియాఫల ముపాశ్నుతే ||

అధియజ్ఞం బ్రహ్మ జపేత్‌ సాధిదైవిక మేవచ | ఆధ్యాత్మికంచ సతతం వేదాన్తాభిహితం ఫలమ్‌ ||

ఈ బ్రహ్మస్ధానము కేవలము ధ్యానవిషయము శబ్దాతిగము=శబ్దమున కందనిది. యధ్యాత్మ జ్ఞాని (పండితుడు) ఏ క్రియా ఫలము=కర్మఫలము బొందడు. సర్వాతీత బ్రహ్మసాయుజ్యమే యతని పరమావధి. బ్రహ్మను అధి యజ్ఞముగను అధి దైవికముగ ఆధ్యాత్మికముగనుజపించిన ఉపనిషత్తులందు చెప్పబడిన వేదాంతోక్త ఫలము లభించును.

ఇధం శరణ మజ్ఞానాం ఇదం దైవం విజానతామ్‌ | ఇద మన్విచ్ఛతాం స్వర్గ మిదమానన్త్య మిచ్ఛతామ్‌ ||

అనేన క్రమయోగేన పరివ్రజతియో ద్విజః | స విధూయేహ పాప్మానం పరం బ్రహ్మాధిగచ్ఛతి ||

ఈ బ్రహ్మ ఆజ్ఞులకు, దైవమును తెలియగోరువారికి, ప్వర్గార్ధులకు అమృతత్వము గోరువారికి శరణ్యము. ఈ చెప్పిన క్రమ యోగముచే నే ద్వజుడు పరివ్రజించునో (సన్న్యసించునో) అతడు పాపము నిక్కడనే దులిపికొని పరబ్రహ్మమందును.

ఏషధర్మోనుశిష్టస్తే యతీనాం నియతాత్మనామ్‌ | ఏవం సన్యాసకానాం తు కర్మయోగం నిబోధమే ||

బ్రహ్మచారీ గృహస్ధశ్చ వానప్రస్ధో యతి స్తధా | ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృధగాశ్రమాః ||

సర్వేపి క్రమశ##స్త్వేతే యధాశాస్త్రం నిషేవితాః | యధోక్తకారిణం విప్రం నయన్తి పరమాం గతిమ్‌ ||

సర్వేషా మేవ చైతేషాం వేదశ్రుతి విధానతః | గృహస్ధ ఉచ్యతే శ్రేష్ఠఃస త్రీనేతాన్‌ బిభర్తి హి ||

కేవలము నియత చిత్తులగు యతులుకు ఈ ధర్మము నీకాన తిచ్చితిని. ఇట్లు సన్యాసకులయిన వారి కర్మయోగముందెల్పెద వినుము. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్ధుడు, యతియు ననునివి గృహస్థుని వలన నేర్పడు నాల్గాశ్రమములు. ఇవన్నియు క్రమముగ శాస్త్రానుసారము నునిష్ఠితములై చెప్పినట్లుచేసిన విప్రుని పరమగతికి గొంపోగలవు. ఈ నలుగురిలో వేదములందు విన్నరీతిగ గృహస్థు శ్రేష్ఠుడని పుర్కొనబడెను. కారణము అతడీ ముగ్గురాశ్రమస్థులను భరించును గదా !

యధా నదీనదా స్సర్వే సాగరేయాన్తి సంస్థితిమ్‌ | తధైవాశ్రమిణ స్సర్వే గృహస్థేయా న్తి సంస్థితమ్‌ ||

చతుర్ఛి రపి త్వజ్ఞైర్నిత్య మాశ్రమిభి ర్ద్విజైః | దశ లాక్షణికో ధర్మః సేవితవ్యః ప్రయత్నతః ||

ధృతి క్షమాదయోస్తేయం శౌచమింద్రియ నిగ్రహః | ధీ ర్విద్యాసత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్‌ ||

నదీనదములెట్లు సాగరమందునికి నందునో ఆవిధముగ సర్వాశ్రమస్ధులను గృహస్థునందునికి నొందుదురు. తత్వజ్ఞులైన నాల్గాశ్రమముల ద్విజులును ధశలాక్షణికము (పది లక్షణములుగల) ధర్మముల పూనికమై సేవింపవలసియున్నది. ఆ లక్షణములు పది. ధృతి=ధైర్యము, క్షమ=ఓర్పు, దమము=బాహ్యేంద్రియ నిగ్రహము, అస్తేయము=దొంగతనములేమి, శౌచము=ఆచారము, ఇంద్రియనిగ్రహము=అంతరింద్రియ నిగ్రహము (శమము) బుద్ధి, జ్ఞానము, సత్యము, క్రోధము లేకుండుట, ఇది ధర్మలక్షణ దశకము.

దశ చిహ్నాని ధర్మస్య యే విప్రా స్సమధీయతే | అధీత్యచా నువర్తన్తే తే యాన్తి పరమాం గతిమ్‌ ||

దశలాక్షణికం ధర్మ మనుతిష్ఠన్‌ సమూహిత | వేదాన్తం విధివచ్ఛ్రుత్వా మన్యేహ మనృణోద్విజః ||

సన్యస్య సర్వకర్మాణి సర్వాన్‌ దోషా నుపానుదేత్‌ | నియతో ధర్మ మభ్యస్య పుత్రై స్సహసుఖం వసేత్‌ ||

ఈ పది ధర్మలక్షణముల నెవ్వరు అధ్యయనము సేయుదురో, చేసి అనువర్తింతురో వారు పరమగతి నందుదురు. మనసు కుదిరించుకొని యీ దశలాక్షణిక ధర్మము ననుష్ఠించుచు వేదాంతము శాస్త్రోక్తరీతిన శ్రవణము సేసిన ద్విజుడనృణుడని నేననుకొందును. సర్వఋణముక్తు దాతడన్నమాట. సర్వకర్మమలు సన్యసించి అన్నిదోషములను తొలగించుకొనవలెను. నియమవంతుడై ధర్మము నభ్యసించి (ఆచరణలో పెట్టి) పుత్రులతోగూడ హాయిగ వసింపవలెను.

ఏవం సన్యస్య కర్మాణి స్వకార్యే పరమోస్పృహః | సన్యాసే నావహృత్యైనం ప్రాప్నోతి పరమాం గతిమ్‌ ||

ఏష తేభిహితో ధర్మో ద్విజాతీనాం చతుర్విధః ||

స్వల్పోపి ధర్మశ్చరితో యధాయం మహాఫలః స్యాత్‌ సతతం ద్విజానామ్‌ |

తస్మాత్ప్రయత్నా దయమేవ కార్యః సర్వం సముత్సృజ్య మహానుభావః ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే చతుర్ధాశ్రమ వర్ణననం నామ ఏకత్రింశదుత్తర శతతమోధ్యాయః

ఇట్లు కర్మములను సన్యసించి యెట్టి ఫలాపేక్షయు లేక స్వకార్యము నందు (కర్తవ్యమందు) పరముడై (నిష్ఠగొన్న వాడై) పాపమును సన్న్యాసముచే పోగొట్టుకొని పరమగతి నందును. ద్విజులయొక్క నాల్గు విధములయిన ధర్మము నీకెఱింగించితని ఈ ధర్మము కొంచెమేని యధావిధిగ నెల్లప్పుడు నాచరితమైన ద్విజులకు మహాఫలవంత మగును. అందువలన పూనికమై యితరి మెల్లవిడిచి మహానుభావుడిదయే యాచరింవలయును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున చతుర్థాశ్రమ వర్ణనమను నూటముప్పదియొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters