Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయిరువది యారవ అధ్యాయము - సామవిధికథనము

పుష్కరః సంహితాం వైష్ణవీం జప్త్వా విష్ణుం ప్రీణాతి మానవః | సర్వకామ మవాప్నోతి తథా హుత్వాచ భార్గవ! ||

స్కందస్య సంహితాం జప్త్వా స్కందాత్కమాన వాప్నుయాత్‌ | ఆస్యదఘ్నే జలేతిష్ఠన్‌ అఘే నాకీర్ణమానసః ||

త్రిస్సప్తకృత్యో జప్త్వాచ సర్వాన్‌కామా నుపాశ్నుతే | తథాచ సంహితాం పిత్య్రాం తత్ర్పసాద ముపాశ్నుతే ||

పుష్కరుండిట్లనియె. మానవుడు వైష్ణవ సంహితను జపించి విష్ణువుం బ్రీతునిం జేయును. హోమము సేసి సర్వ కామ సిద్ధి నందును. స్కంద (కుమార) సంహితను జపించి స్కందుని వనల కోరికలంబొందును.పాపముచే వ్యాకులమైన మనస్సు కల మనుజుడు ముఖము లోతుననున్న నీటిలోనిలిచి యిరువదియొక్క మారులు సంహితా పారాయణము సేసిన నన్ని కోరికలు సఫలములగును. పితృ సంహితను ఆ విధముగ జపించిన పితృ ప్రసాదముం బొందును.

గురు గో బ్రాహ్మణా దీనా ముక్తవా నామ ప్రియం నరః | సోప వాసో జపే త్తోయే ''త్విదం విష్ణు ర్విచక్రమే'' ||

సదా గావశ్చ శుచయః ప్రయాజ్య యజనే జపేత్‌ | అమేధ్య దర్శనే జాపోః పన్థా అమే దివః ||

ఏత దింద్ర స్తవా మితి సర్వా పాప హరం జపేత్‌ | శుక్రం తేన్య ద్యజతం జప్త్వా స్తేయా ద్విముచ్యతే ||

చక్రా నితి తధా జప్త్వా పాదయాయీ విముచ్యతే | సహన్తః సోమ మిత్యేత జ్జప్త్వా ముచ్యేత్‌ ప్రతిగ్రహాత్‌ ||

గురు గో బ్రాహ్మణాదుల పేరును ప్రీతితో పలుకుచు నుపవాసముండి నీట నిలిచి ''ఇదం విష్ణుర్వి చక్రమే'' అను మంత్రము జపింప వలెను. గోవులు నిత్యశుచియైనవి. సదాగావశ్చ శుచయః అను మంత్రము ప్రయాజ్యయజన మందు జపించవలెను. ''జుపోః పన్థా అమేదివః'' అను మంత్రమును అమేథ్యము కనిపించినపుడు జపింపవలయెను. ''ఏ తదింద్ర స్తవామి'' అను మంత్ర జపము సర్వ పాపహరము. ''శుక్రంతేన్య ద్యజతం'' అను మంత్రము జపించిన దొంగల భయము మానును. ''చక్రాన్‌'' అను మంత్రము జపించిన పాదముల నడక తప్పును. అనగా వాహనయోగము పట్టునన్నమాట. ''సహన్తః సోమమ్‌'' అనునది జపించిన ప్రతిగ్రహ దోషముక్తుడగును. దానాలు పట్టిన దోషము పోవునన్నమాట.

యత్తత్సోమ ఇంద్ర ఇతి హింసా దోష వినాశనమ్‌ | అగ్నే ర్భయా త్ప్రముచ్యేత అగ్ని స్తిగ్మేతి వై జపన్‌ ||

సర్వ పాప హరం జ్ఞేయం పరితోషిం చ తామితి | పర్వాసు సోమేతి జపన్‌ జీవితం తు సుకర్మణా ||

అవిక్రేయం చ విక్రేయం జపేత్‌ ఘృతవతీ త్వితి | అప్యానో దేవ సవితో జ్ఞేయం దుఃస్వప్న నాశనమ్‌ ||

''యత్తత్సోమ ఇంద్రః'' అను మంత్రము హింసాదోషము నెడలించును. ''అగ్నిస్తిగ్మా'' అను మంత్రము జపముసేసిన అగ్ని భయము పోవును. ''పరితోషించతామ్‌'' అను మంత్రము సర్వపాపహరము. ''పర్వాసుసోమ'' అను మంత్ర జపముచే సుఖజీవనము జరుగును. ''ఘృత వతే'' అను మంత్రము జపించినచో అమ్మకూడని పదార్థము అమ్మిన పాపముపోవును. ''అప్యానో దేవ సవితః'' అను మంత్రము దుఃస్వప్న నాశనము.

త్రాతార మిన్ద్ర మిత్యేవ మహిత్రీణా మివోస్త్వితి | ఉదుత్తమం వరుణ పాశీ త్యాయుష్యాణి జపే త్సదా ||

శుక్ర చంద్రేతి జాప్యేన పూతో భవతి మానవః | శుద్ధా శుద్ధీయ మేతచ్చ తంవచో సూక్త మేవచ ||

''త్రాతార మింద్రమ్‌'' ''అహిత్రీణామివోస్తు'' ''ఉదుత్తమం వరుణపాశ'' అను మూడు మంత్రములు ఆయుష్యములు. దీర్ఘాయుష్యమునకు జప్యములు. ''శుక్ర చంద్ర'' అని జపించినచో నరుడు పవిత్రుడుగాను, ''శుద్ధాశుద్ధీయమ్‌'' అనునది ''తంవచః'' సూక్తమును నట్టివే.

న్యగ్రోధ శృంగ మాదాయ శరమూలం తధైవచ | త్రివృతం తు మణిం కృత్వా జుహుయాచ్చ సహస్రశః ||

బోధ్యా సిరితి మంత్రేణ ఘృతంరామ ! యధావిధి | అభ్యజ్య ఘృతశేషేణ మేఖలా బంధ ఇష్యతే ||

స్త్రీణాం యాసాంతు గర్భాణి పతన్తి భృగుసత్తమ ! | వణగ్జాదతస్య బాసల్య బధ్నీయాత్తదనన్తరమ్‌ ||

గోర్వై సురూపవత్సాయాః శుక్లాయాః జుహుయాత్‌ ఘృతం | ''ఉగ్రప్రియాతు శరణం'' మంత్రేణానేన మంత్రవిత్‌ ||

రక్షసాం ముచ్యతే జంతుర్మణిం శిరసిథారయేత్‌ | కౌత్స్యం ఘృతంతు ప్రాశ్నయా న్నిత్యమేవ విచక్షణః ||

మఱ్ఱియూడను ఱల్లు మొదలును కలిపి మూడుపేటలుగా పేని ''మణిని'' చేసి ముడివేసపి వేలకొలదిగ హోమము సేయవలెను. ''బోధ్యానిః'' అను మంత్రముతో దానిని మిగిలిన నేతితో పూసి మొలనూలుగా స్త్రీలకు కట్టవలెను. గర్భస్రావము గాదు. ఆమీద వైశ్యునికి బుట్టిన వాలుని కది కట్టవలెను. చక్కని దూడగల తెల్లని ఆవుయొక్క నేతితో ''ఉగ్రప్రియాతు శరణం'' అను మంత్ర ముతో హోముమ సేయవలెను. ఇందువలన పట్టిన రక్షస్సు విడిచిపోవును. ఆ మణిని శిరస్సున ధరింపవలెను. నిరంతరము కౌత్స్య ఘృతపానము సేయవలెను.

విశ్వాపృతన్నితి మంత్రేణ వ్యాధిభి ర్విప్రముచ్యతే | చర్షణీ వృతమేతేన ఘృతం హుత్వా యధావిధి ||

శతావరీ మణిం బద్ధ్వా న సర్వైః పరిభూయతే | సమత్యాయం తీత జపేన్న మ్రియేత పిపాసయా ||

ఇష్ట్యాహో త్రితయం జప్త్వా సలిలే నాప్నుయాద్భయమ్‌ | త్వమేమా ఓషధీత్వేత జ్జప్త్వా వ్యాధిం న చాప్నుయాత్‌ ||

యత్తే పయాంసి పూర్వేణ గ్రాసం వై ప్రక్షిపేన్ముఖే | నిగిరే దుత్తరేణౖ తన్నిత్య మారోగ్య మాప్నుయాత్‌ ||

''విశ్వాపృతన్‌'' అను మంత్రము వ్యాధిహరము. ''చర్షణీ వృతమ్‌'' అను మంత్రముతో ఆజ్యహోమము యథావిధిగా జేసి ''శతావరి'' (పిల్లితెగ) వేళ్లతో తాయెత్తు కట్టి ధరించినచో నెప్వరివలననేని యపమానము పొందురు. ''సమత్యాయంతి'' అను మంత్రము జపించిన దప్పికవలని చావురాదు. ''ఇష్ట్యాహో'' త్రితయం ఇష్ట్యాహో అని మంత్రము మొదలు మూడు మంత్రాలు జపించిన జలగండము రాదు. ''త్వ మే మా ఓషధీ'' అనునది జపించిన వ్యాధియన్నది రాదు. ''యత్తే పయాంసి'' మంత్రముతో నోట నన్నము పెట్టుకొని దీని తరువాత మంత్రముతో నమలినచో నిత్యారోగ్యవంతుడగును.

దేవ వ్రతేన హుత్వా೭೭జ్యంతచ్ఛేషేణ విచక్షణః | కురవీరక మభ్యజ్య దండహస్త గతేనతు ||

స్వస్తిమాం స్తేన భవతి యత్రక్వచన గచ్ఛతి | పథిదేవవ్రతం జప్త్వా భ##యేభ్యో విప్రముచ్యతే ||

యదింద్రో అనయత్వేతి హుతం సౌభాగ్యవర్ధనమ్‌ | భద్రాన్నో అగ్ని రితిచ దంతకాష్ఠంచ భక్షయేత్‌ ||

సంవత్సర మనిష్ఠీషన్‌ మధ్వాజ్య సహితం సదా | సౌభాగ్యం మహాదాప్నోతి యత్రక్వచన గచ్ఛతి ||

భగోన చిత్ర ఏతేన నేత్రయోరంజనం స్మృతమ్‌ | సౌభాగ్యవర్ధనం రామ! నాత్రకార్యా విచారణా ||

''దేవవ్రత'' మంత్రముతో నేయిహోముమసేసి, అందుమిగిలిన నేతిని కరవీరచెట్టు కర్రచకుపూసి ఆ కర్రను చేతంబట్టుకొని యెటుపోయినను స్వస్తిమంతుడు క్షేమవంతుడగును. మార్గ మందు ''దేవత్రమ్‌'' అను మంత్రము జపించి సర్వభయ విముక్తుడగును. ''యదింద్రో అనయతు'' అను మంత్రముతోడి హోమము సౌభాగ్య వర్థనము. ''భద్రాన్నో అగ్నిః'' అను మంత్రముతో తేనె నేతితో గలిపి పలుదోము పుల్ల నమిలి ఉమియక ఒక్క సంవత్సరము ఇట్లు చేసిన యాతడు ఆరోగ్యవంతుడగునన్నమాట. ఎచటకేగినను మహా సౌభాగ్యముం బొందును. ''భగోన చిత్ర'' అను మంత్రముతో కన్నులకు కాటుక వెట్టిన సౌభాగ్యవర్ధనమగును.

జపన్నింద్రేతి వర్గం చ తధా సౌభాగ్య మాప్నుయాత్‌ | కరిప్రియో దివః కవిః కామ్యాం సంశ్రావయేత్త్స్రియమ్‌ ||

సా తం కామయతే రామ ! నాత్రకార్యా విచారణా | రథంతరం వామదేవ్యం బ్రహ్మవర్చస వర్ధనమ్‌ ||

యశసా మేతి జుహుయాత్‌ పుష్పేణ తు ప్రియంగుకమ్‌ | యశసా యోగమాప్నోతి కర్మణానేన మానవః ||

ప్రాశ##యే ద్బాలకం నిత్యం వచాచూర్ణం ఘృతప్లుతమ్‌ | ఇంద్ర మింద్రాధినం జప్త్వా భ##వే చ్ఛ్రుతిధర స్త్వసౌ ||

హూత్వా రథ న్తరం జప్త్వా పుత్ర మాప్నోత్యసంశయమ్‌ | గీర్వాణ పాహి ః సతతం జప్తం స్యా దఘతారకమ్‌ ||

''ఇంద్ర'' అను మంత్రవర్గమును జపించి సౌభాగ్యముబొందును. ''కరిప్రియోదివః కవిః'' అను మంత్రమును కామం స్త్రీకి వినిపింపవలెను. ఆమె యా వినిపించిన వానిని కామించి తీరును. ''రంభంతరమ్‌ వామదేవ్యం'' అనుసామ మంత్రము బ్రహ్మవర్చస్సును బెంపొందించును. ''యశసామ'' అను మంత్రముతో పవ్వును ప్రియంగుకము-కొఱ్ఱ ధాన్యమును హోమము సేసిన యశశ్శాలియగును. ''ఇంద్రమింద్రార్థినమ్‌'' అను మంత్రమును జపించి నూగుదోస వసచూర్ణమును నేతిలో తడిపి తినిపింపవలెను. అందువలన శ్రుతి ధరుడగును. రథంతరసామమును జపించి హోమము సేసినచో పుత్రుడు గల్గును. ''గీర్వాణపాహి'' అను మంత్రము సతతము జపించిన పాపముందరించును.

మయిశ్రీ రితి మంత్రేణ జప్తవ్యం శ్రీ వివర్ధనమ్‌ | దానా విశతి దేవోపి మంత్రేణానేన ధర్మవిత్‌ ||

క్రీత్వా ఘృతతందుపుష్పేణ సుషుమాణీత్యతః పిబేత్‌ | అలక్ష్మీ నీశనం కర్మమయై తత్తే ప్రకీర్తితమ్‌ ||

పుష్పేణ సర్షపాన్‌ గౌరాన్‌ చూర్ణయిత్వా విచక్షణః | ఇంద్రే హిమత్స్యం ధర్మేతి కుర్యాదుత్సాదనం బుధః ||

ఘృత స్నానం బుధః కృత్వా సర్షపాన్‌ జుహుయాత్తతః | ఆద్యే త్వీడా వింద్రియేతి మంత్రేణానేన మంత్రితమ్‌ ||

పుష్టిదం కర్మ కథితం మయైత త్తవ భార్గవ | మిశ్రాన్‌ వ్రీహీయవా నగ్నౌ హుత్వా భృగుకులోద్భవ ||

''మయిశ్రీః'' అను మంత్రము జవము శ్రీవర్ధకము. ''దానా విశతి దేవోపి'' అను మంత్రముతో నేతిని గొని ''పుష్పేణ సుషుమాణీ'' అను మంత్రముతో త్రాగినచో అలక్ష్మి (దారిద్య్రము) పోవును. పువ్వుతో గూడ తెల్లావాలు చూర్ణము సేసి ''ఇంద్రేహి మత్స్యం ధర్మ'' అను మంత్రముతో నలుగు పెట్టవలెను. అటుపై నేతితో స్నానము చేసి ఆవాలను హోమము సేయవలెను. ఆ వస్తువులను ''అద్యేత్వీడా వింద్రియ'' అను మంత్రముతో నభిమంత్రింపవలెను. ఆవని పుష్టి నిచ్చునది.

మునీశోధమా ఏతేన ధాన్య భాగీ భ##వేత్సదా | మధ్వాజ్య దధి మిశ్రాణి విప్రాణీతి జుమోతి యః ||

స్రాష్టం సహస్రం ధర్మజ్ఞః శ్రావయన్తీహ మానవాః | మాసోవవాసీ లభ##తే కనకం బహుభార్గవ ! ||

వ్రీహులు యవలు కలిపి హోమము సేయుచు ''మునీశోధామ'' అను మంత్రము సంపుటి చేసిన ధాన్య సమృద్ధి గలవాడగును. తేనె నెయ్యి పెరుగు కలిపి ''విప్రాణి'' అను మంత్రముతో వేయియెనిమిది హోమములుసేసినను, మాసము రోజులుపవాసముండి యీ మంత్రమును వినిపించినను సమృద్ధగ బంగారము అభించును.

గవ్యేషుణతి చ ద్వాభ్యాం యన్తు సంవత్సరం నరః | న్యగ్రోధ జపనిష్ఠీవం బక్షయే ద్ధంతధావనమ్‌ |

సమస్ర సంఖ్యం సధనం అభ##తే నాత్ర సంశయః | భద్రోన అగ్ని ఇత్యే తత్తథా హుత్వా సహశ్రసః ||

ఔదుంబరేధ్మహోమేన మంత్రేణానేన గాం లభేత్‌ | హుత్వా వ్రీహి యవా నగ్నౌ ధాన్యమాప్నోతి మానవః ||

ఏవాసి వీరేయు దితి ద్వాదశాహ ముపోషితః | సర్పిషా త్వయుతం హుత్వా గ్రామ మాప్నోతి మానవః ||

వైరూపాష్టక వన్నిత్యం వ్రముంజానః శ్రియం లభేత్‌ | శ్రాన్తాష్టకం వ్రయుంజానః సర్వాన్‌ కామాన వాప్నుమాత్‌ ||

''గవ్యేషుణా'' అనురెండు మంత్రములతో నొక్క సంవత్సరము మఱ్ఱి యూడతో దంతధావనము సేసినవాడు వలే కొలది హోమములు సేసినచో అదిగూడ మేడి సమిథలతోనే యోనరించి వ్రీహులను యవలను హోమము సేసిన యతు ధాన్య సమృద్ధినందును. ''ఏవాసివేరేయుః'' అను మంత్రమును బండ్రెండు రోజులుపవసించి ఆజ్యహోమము పదివేలు చేయునతడు గ్రామమును బడయును. ''వైరూపాష్టకము'' ను సంపుటి చేసినవాడు శ్రీసంపన్నడగును. శ్రాంతాష్టకమునుసంపుటీకరించిన సర్వాభీష్ట సిద్ధియగును.

గవ్యేషుణతి యోనిత్యం సాయం ప్రాత రతంద్రితః | ఉపస్థానం గవాం కుర్యాత్‌ తస్యస్యుస్తాః సదా గృహే ||

అగ్నేః వివస్వదుషసా మంత్రేణానేన మంత్రవిత్‌ | భాజన స్యోపనీతస్య యస్త్వగ్రం జుహుయా త్సదా ||

ఉత్తరేణ బలిం దత్వా సర్వాన్‌ కామా న వాప్నుయాత్‌ | క్షేరైక వృక్ష మాసాద్య మణిభద్రాయ మానవః ||

''గవ్యేషుణా'' అను మంత్రముతో సాయం ప్రాతఃకాలములందెవడు గొవులకు ఉపస్థానము (వందనము) సేయ నేని యతనియింట నావులు నిరంతరము వసించును. ''అగ్నే వివస్వదుషసా'' అను మంత్రముతో నుపవీతుడైన మోగ్యుని ముందు హోమముసేసి, దాని తరువాతి మంత్రముతో బలినొసంగినచో సర్వకామ సమృద్ధగల్గును.

అష్టరాత్రోషితః పూజా కృత్వా దద్యాత్తతో బలిమ్‌ | సుసంస్కృతేన మాంసేన కృష్ణపక్షం క్షయే ద్భుధః ||

ఏషస్య తేతి మధుమన్నింద్ర ఏతేన భార్గవః | సువర్ణ మాప్నోతి నరో యావదిచ్ఛతి శత్రుహన్‌ః ||

శుక్లపక్ష చతుర్దశ్యాం త్రిరాత్రో పోషితో నరః | మౌనం మాసం పాయసం చ రసత్రయ సమన్వితమ్‌ ||

సప్త ధేనవో దుదుహుర్మంత్రేణానేన మంత్రవిత్‌ | కృష్ణపక్ష చతుర్దశ్యాం త్రిరాత్రో పోషితస్తధా ||

మత్స్యానుపహరే ద్రాత్రా వాసురీ మాప్నుయాచ్ఛ్రియం | బలయుక్తశ్ఛ భవతి దీప్తతేజా స్తధైవచ ||

కృష్ణపక్షము చివర పాలచెట్టు దగ్గరకేగి ''మణిభద్రునకు'' అష్టరాత్రోపవాసముసేసి పూజచేసి చక్కగ సంస్కరింప బడిన మాంసమును బలియిచ్చినచో ''ఏషస్యత'' 'మధుమన్నింద్ర' అను మంత్రముల సంపుటితో నిదిసేసినచో నెంతకావలయునన్న నంత బంగారముం పొందును. శుక్లపక్ష చతుర్దశినాడు త్రిరాత్రోపవాసము సేసి నెలరోజులు మౌనవ్రతమూని రసత్రయముతో గూడిన పాయసమును ''సప్తధేనవోదుదుహుః'' అను మంత్రముతో కృష్ణపక్ష చతుర్దశినాడు చేపలను నివేదించినచో 'అనురీసంపదను'' అనురులకు సంబంధించిన ఐశ్వర్యమును బొందును. (అనురీ సంపద జన్మబంధ కారణము; దైవీ సంపద మోక్షకారణము.) ఈ ప్రక్రియ వలన మంచిబలశాలి దీప్తతేజస్వి ప్రతాపవంతుడగును.

ధానవన్తం కరంభిణం మంత్రేణానేన పాయసమ్‌ | హుత్వా దిగష్టకే దద్యా ద్దిక్పాలానాం తతో బలిమ్‌ ||

వాస్తుదోషహరం కర్మ మయై తత్పరకీర్తితమ్‌ | రాజా సమాచరేత్‌ స్నానం పుష్యేణ శ్వవణ చ ||

ఆప్రాతృత్వ ఇతి సదా రహస్యం స్నానమాచరేత్‌ | స్వేచ్ఛాపతిత జీవన్తీ గవాం శృంగసముద్భవైః ||

కాశైర్మధ్వాజ్య సంపూర్ణైద్దధిక్షీరయుతై స్తధా | నిస్సపత్న మవాప్నోతి రాజ్యం నిర్గత కంటకమ్‌ ||

''దానవంతం కరంభిణమ్‌'' అను మంత్రముతో పాయసము హోమము సేసి యెనిమిది దిక్కుల దిక్పాలురకు బలియిచ్చిన వాస్తదోషములను ఇది హరించును. రాజు పుష్యమీ శ్రవణా నక్షత్రములలో ''అప్రాతృవ్య'' అను మంత్రముతో రహస్యముగా నా స్నానము సేయవలెను. అటుపై తమంతతాము రాలిన చేవన్తీ=తిప్పతీగ ఆవుకొమ్ముల నుండి వడిన ఱల్లు తేనె, నెయ్యి, పాలు, పెరుగు ననువానితోస్నానము సేసినచో శత్రువులేని రాజ్యమునందును.

ఘృతాక్తంతు యవద్రోణం వాత ఆతప భేషజమ్‌ | అనేన హుత్వా విధివత్‌ సర్వాన్‌ దోషాన్‌ వ్యపోహతి ||

ప్రాదేవోదాస ఏతేన కృష్ణాన్‌ హుత్వా తధా తిలాన్‌ | కృత్వా కర్మాణి తీర్థోదైః సెన్యాత్‌ శీఘ్రం విముచ్యతే ||

నేతితో దడిపిన దొన్నెడు యవలు హోమము సేసిన గాలి ఎండదెబ్బకును నివారకము. సర్వరోగహరణౌషధ మగును. ''ప్రాదేవోదాన'' అను మంత్రముతో నల్ల నువ్వులను హోమము చేసి తీర్థోదకములతో కర్మాచరణము సేసినచో చౌర్యము నుండి విముక్తి నందును.

అభిత్వా పూర్వ పీతం యే వషట్కార సమన్వితమ్‌ | బాధకేధ్మ సహస్రంతు హుతం యుద్ధే జయప్రదమ్‌ ||

హస్త్యశ్వ పురుషాన్‌ కుర్యాత్‌ బుధః పిష్టమయాన్‌ శుభాన్‌ | పరకేయా నధోద్దిశ్య ప్రధాన పురుషాం స్తధా ||

స్వస్త్యన్నాపిష్టవచనే క్షురుణోత్కృత్య భాగశః | అభిత్వా శూరనో నుయో మంత్రేణానేన మన్త్రవిత్‌ ||

కృత్వా సర్షప తైలాక్తాన్‌ క్రోధేన జుహుయాత్తతః | ఏతత్కృత్వా బుధః కర్మ సంగ్రామే జయ మాప్నుయాత్‌ ||

''అభిత్వా పూర్వపీతం'' అను మంత్రమును వషట్కారముతోగూర్చి బాధకేధ్మములు ఒకవేయి హోమముసేసినచో యుద్ధ జయమిచ్చును. బాధక+ఇధ్మము=మేరువేరు పట్టివేళ్ళు ఏనుగులు గుఱ్ఱములు భటులునకు సేనాంగములు మూడింటిని శత్రుబల మందుగల ప్రధానపురుషులనుద్దేశంచి పిండితో బొమ్మలుసేసి వానాని ''స్వస్త్యన్నాపిష్ట'' అను మంత్రముచెప్పుచు చురకత్తితో ముక్కలు సేసి వానిని ''అభిత్వాశూరనోనుమః'' అను మంత్రముతో ఆవనూనెతో పూసి కోపముతో హోమము సేయవలెను. ఇది చేసిన బుద్ధిమంతుడు యుద్ధమందు జయమొందును.

ఆషాఢ్యాం సౌర్ణమాస్యాం తు సోపవాసో విచక్షణః | సాయం ధాన్యాని వస్త్రాణి సస్యాని తులయే ద్భుధః ||

ఇధ్మ మిద్దేవతా మన్నే మంత్రేణా మంత్రయేత్తుతామ్‌ | పూజితాం వాసయేద్రాత్రౌ దేశే పరమపూజితే ||

దేశానాం భూమపాలానాం తధాదేవ చతుష్పథామ్‌ | మృణ్మయానాంతు కర్తవ్యం తధా రాత్య్రధివాసనమ్‌ ||

తులితానాం ద్వితీయెహ్ని తత్తద్వృద్ధౌ ప్రవర్ధనం | హీనస్య క్షయమాదేశ్యంసమస్య సమతా తధా ||

ఆషాఢ పూర్ణమ నాడుపవాసముండి సాయంకాలము ధాన్యములను వస్త్రములను పంటను దూచవలెను. ''ఇధ్మ మిద్దేవతాం మన్నే'' అను మంత్ర పూర్వకముగ నదేవతను ఆహ్వానించి రాత్రి పూజనీయమైన ప్రదేశమందు నివసింపజేయవలెను. అవ్వల రాజుల యొక్క దేశములయొక్క దేవచతుష్పథముల యొక్క (దేవాలయములు నాల్గుదారులు కలిసిన చోటులను) మట్టితో చేసి రాత్రి ఆధివాసనము సేసి రెండవరోజున కాటాలో తూచినపుడు ఆయా బొమ్మలబరువు పెరిగినచో దాని పెరుగుదలను తగ్గుదలను లేదా సమతూకములోనున్నచో సమత్వమును యజమాని తెలిసికొనవలెను.

గోవ్రతం తు బుధః కుర్యాదాదౌ మాస చతుష్టయమ్‌ | తతస్త్వరణ్యం ప్రవిశేత్తత్ర కుర్యాజ్జపం శుభమ్‌ ||

తపస్సదృశ మాసాద్య జపై#్త్వత దితివైసదా | సహస్రకృత్వస్తు జపేత్‌ సప్తరాత్రత్రయే గతే ||

మనసా కాంక్షితాన్‌ కామాన్‌ ధ్రువ మాప్నోతి మానవః | అంతరిక్షేణ వాయాతి రూపాన్యత్వం కరోతి వా ||

అదృశ్వత్వ మవాప్నోతి దైత్వత్వ మధవా పునః | తంతం కామ మవాప్నోతి యంయం వా మనసేచ్ఛతి ||

సామ్నస్తు దేవతాం జ్ఞాత్వాతేన సామ్నాతు దేవతామ్‌ | ఆరాధయే త్సుప్రసన్నా సామ్నాస్యాత్‌ సంశయం వినా ||

నాల్గుమాసాలు మొట్టమొదల గోవ్రతము సేయవలెను. ఆమీద అరణ్యమునకు వెళ్ళి ''తపస్సదృశమాసాద్య జషై#్త్వతత్‌'' అను మంత్రము జపము సేయవెను. త్రిసప్తరాత్రము (21 రోజులన్నమాట) వేలకొలదిగ నీ జపము సేసినచో అన్ని కోరికలు సఫలములగును. లేవేని అన్యరూపము బొందును. అదృశ్యత్వమును గల్గును. (అదృశ్యకరణి అన్నమాట) రాక్షసత్వము కూడ గల్గును. ఏదేది కోరిననదియది గల్గును. ఆయా సామ మంత్రాధి దేవతల నెఱింగి ఆయా సామ మంత్రములతో నా దేవతలను ఆరాధింపవలెను. అపుడా దేవత సుప్రసన్నురాలయి తీరును.

అమోఘ పూర్మంతు సదా మంత్ర మావర్తయుచ్ఛుచిః | చందనేనానులిప్తాంగో జాతిపుష్పధర స్తథా ||

ళ్వేతోష్ణీషః శ్వేతవాసాః సర్వాన్‌ కామా నవాప్నుయాత్‌ | ఏవం దుదుహకేత్యే తత్‌సోపవాస స్తు యో జపేత్‌ ||

అక్షతై స్సుమనోభిశ్చ తధావా గౌర సర్షపైః | అవకీర్య శుభం దేశం త్వేకాకీ ప్రస్వపేన్నిశి ||

వాగ్యతస్తు తధా స్వప్నే వశ్యతీహ శుభాశుభమ్‌ | యధావద్భృగుశార్దుల ! భవిష్యద్భూతమేవ వా ||

ఈ దేవతలందు తొలుత మంత్రావృత్తిచేసి (మంత్ర జపము చేసి) శుచియై మంచిగంధము మేనికిం బూసికొని జాజిపుష్పములు పట్టుకొని తెల్లని తలపాగ వస్త్రములు ధరించినచో సర్వకామములను బదయగల్గును. ఇట్లే ''దుదుహకా'' అను మంత్రము నుపవాసముండి జపించి అక్షతలు పువ్వులు తెల్లావాలు నంతటం జల్లి శుభప్రదేశందొంటరిగా నిదిరింపవలెను. మాట నియమము (మౌనము) పూని యిటు సేసిన కలలో జరుగబొవునట్టి జరిగినట్టి శుభాశుభములను స్పష్టముగా జూడగలడు. ఇది అదృశ్యకరణి అన్నమాట.

భారుణ్డం వామదేవ్యం చ రథంతర బృహద్రథౌ | సర్వపాప ప్రశమానాః కథితాః సంశయం వినా ||

సామ్నాం విధిస్తే కథితో నృవీర | సంక్షేపతః కర్మకరో మయైషః |

ఆధర్వణం వచ్మి నిబోధ తన్మే చేత స్సమాధాయ మహానుభావః ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే సామవిధి కథనం నామ షడ్వింశత్యుత్తర శత తమోధ్యాయః ||

భారుండము వామదేవ్యము రథంతరము బృహద్రథంతరము నను నీసామమంత్రములు సర్వపాప ప్రశమనములని నిస్సంశయముగా జెప్పబడినవి. మహాత్మ! సామవిధిని నీకు కర్మసిద్థికరమైన దానిని సంక్షేపముగా జెప్పితిని. ఇక అధర్వణ విధి తెలిపెదను. మనసు కదిరించికొని యాలింపుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణ మందు ద్వితీయఖండమున సామవిధి కథనమను నూటయిరువదియారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters