Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యిరువది మూడవ అధ్యాయము - కృచ్ఛ్రప్రాయశ్చిత్త వర్ణనము

రామః- భూయ ఏవ సమాచక్ష్వః కర్మణా యేన మానవాః | దుర్గాణ్యతితరన్త్యాశు సర్వధర్మభృతాంవర! ||

పుష్కరః - దుర్గాణ్యతితరన్త్యాశు యే నరాః కృచ్ఛ్రకారిణః | ప్రాప్నువన్తి తథా కామాన్‌ సర్వాన్వై మనసేప్సితాన్‌ ||

రామః- కృచ్ఛ్రాణాం శ్రోతుమిచ్ఛామి నామానిచ విధీం స్తధా | ఏవం మే బ్రూహి ధర్మజ్ఞః త్వంహివేత్సి యధాతధమ్‌ ||

పుష్కరః - కృచ్ఛ్రణ్యతాని కార్యాణి రామ! వర్ణత్రయేణచ | కృచ్ఛ్రెష్వేతేషు శ్రుద్రస్య

నా7ధికారో విధీయతే||

ఆదౌతు ముండనం కార్యం సర్వకృచ్ఛ్రెషు భారవః | నిత్యం త్రిషవణస్నానం కేశవస్యచ పూజనమ్‌ ||

హోమః పవిత్రమంత్రైశ్చ తథా7న్తేజాప్య ఏవచ | స్త్రీశూద్ర పతితానాంచ తధా లాపం వివర్జయేత్‌ ||

ఏతత్‌ కృచ్చ్రేషు సర్వేషు కర్తవ్యం చా7విశేషతః | వీరాసనంచ కర్తవ్యం కామతో7ప్యధవా నవా ||

వీరాసనేన సహితం కృచ్ఛ్రం బహుగుణం భ##వేత్‌ | వీరాసనేన రహితం విధిహీనం ప్రకీర్తితమ్‌ ||

రామంః వీరాసన మహం త్వత్తః శ్రోతు మిచ్ఛామి నువ్రతః వీరాసనేన సహితం కృచ్ఛ్రం బహుగుణం యతుః ||

పుష్కరః - ఉత్థితస్తు దివాతిష్ఠే దుపవిష్టస్తధా నిశి | ఏత ద్వీరాసనం ప్రోక్తం మహాపాతకనాశనమ్‌ ||

ఆమిక్షయా తు ద్వౌమాసౌ పక్షంతు పయసా తథా | అష్టరాత్రం తధా దధ్నా త్రిరాత్ర మధ సర్పిషా ||

నిరాహార స్త్రిరాత్రంతు కుర్యాద్వా బాలక వ్రతమ్‌ | సర్వపాప ప్రశమనం సర్వకామ ప్రదం తథా ||

స్నపయే దాత్నో7ర్ధాయ పాపకం భృగుందన!| వహ్నౌ తతో7నుజుహుయా ద్దద్యా దన్నంచ కస్యచిత్‌ ||

బ్రహ్మాదేవేతి మంత్రేణ సాద్యమానే విచక్షణః | దర్భాం స్తు ఖలు బధ్నీయా ద్రక్షార్థ మితినః శ్రుతిః ||

శ్రితంచ శ్రాప్యమాణంచ భాండే న్యస్తం తథా పునః | అనేన రామ!మంత్రేణ నర స్త్రిరభి మంత్రయేత్‌ ||

యవో7సిధాన్యరాజో7సి వారుణో మధు సంయుతః | నిర్ణోద స్సర్వ పాపానాం పవిత్ర మృషిభిస్మృతమ్‌ ||

ఘృతం యవామధు యవా ఆపోవా అమృతం యవాః | సర్వం పునంతు మే పాపం యన్మయా దుష్కృతం కృతమ్‌ ||

తచాకృతం కర్మకృతం దుఃస్వప్నం రుర్విచింతితమ్‌ | అలక్ష్మీం నాశయ ధా సర్వం వునంతుమే యవాః ||

శ్వసూకరావవఢంచ హ్యుచ్ఛిష్టో పనతం చ యత్‌ | మాతు ద్గురో రశుశ్రూషాం సర్వం వునంతుమే యవాః ||

గణాన్నం గణికాన్నం చ శూద్రాన్నంచ తథా ఏశాం | చోరస్యాన్నం నవశ్రార్థం సర్వం పునంతు మే యవాః ||

బాలవృత్త మధుర్మంచ రాజధర్మకృతంచ యత్‌ . సువర్ణస్తేయ మప్రాస్య మయాజ్యస్యచ యాజనమ్‌ ||

బ్రాహ్మణానాం పరీవాదం సర్వం పునంతు మేయవాః | భాండే న్యస్తస్యమంత్రో7యం తతస్తు పరికీర్త్యతే ||

é(యే దేవా మనోజాతా మనోయుజః సుదక్షా దక్షపితరః | తేనః పాతు తేనో7వస్తు తేభ్యః స్వాహా)

అనేనాత్మని ధర్మజ్ఞః జుహుయా త్ర్పయత స్సదా | నకుర్యా గతి సౌహిత్యం వ్రతమేతద్ధి యావకమ్‌ ||

మేథార్థిన స్త్రరాత్రంతు షడ్రాత్ర మతి పాపినః | ఉపపాతకినః ప్రోక్తంసప్త దాత్ర మరిన్దమ ||

మహా పాతకినశ్చైవ షడ్రాత్రం ద్విగుణం స్మృతమ్‌ | ఏక వింశతి రాత్రేణ కామానాప్నో త్యభీప్సితాన్‌ ||

మాసేన సర్వ పాపేభ్యోమోక్షమాప్నో త్యసంశయమ్‌ | గవాం నిర్హారముక్తైస్తుయవైః కృత్వైత దేవహి ||

ఫలం ప్రాప్నోతి ధర్మజ్ఞః తథా దశగుణం ధ్రువమ్‌ | మాసేన సాక్షాత్త్రిదశాన్‌ వేదన్‌ విద్యాశ్చ పశ్యతి||

పరశాపసమర్థస్తు తధా భవతి భార్గవ | శుక్లపక్షసమారంభా దారభేత్ర్పత్యహం నరః ||

ఏకైకవృద్ధ్యాహ్యశ్నీ యాత్‌ పిండాన్‌ శ్రీఖండసంయుతాన్‌ | ఏకైకం హ్రాసయేత్‌ కృష్ణే ప్రతిపత్పభృతి క్రమాత్‌ ||

హవిష్యస్య మహాభాగః నాశ్నీ యాచ్చంద్ర సంక్షయే | ఏత చ్చాంద్రాయణం ప్రోక్తం యవమధ్యం మహాత్మభిః ||

ఏతదేవ విపర్యస్తం వజ్రమధ్యం ప్రకీర్తితమ్‌ | అష్టభిః ప్రత్యహం గ్రాసై ర్యతిచాంద్రాయణం స్మతమ్‌ ||

ప్రాత శ్చతుర్భిః సాయంచ శిశుచాంద్రాయణం స్మృతమ్‌ | యధాకధంచి త్పిండానాం చత్వారింశ చ్చత ద్వయమ్‌ ||

మాసేన భక్షయే దేత త్సురచాంద్రాయణం స్మృతమ్‌ | గోక్షీరం సప్తరాత్రుంతు పిబే త్త్సన చతుష్టయమ్‌ ||

స్తనత్రయా త్సప్తరాత్రం సప్తరాత్రం స్తనద్వయాత్‌ | స్తనా త్త్రదైవ షడ్రాతం త్రిరాత్రం వాయు భుగ్భవేత్‌ ||

ఏతత్సోమాయనం నామ వ్రతం కల్మషనాశనమ్‌ | త్ర్యహం పిబే దవస్తూష్ణీం త్య్రహముష్ణం పయః పిబేత్‌ ||

త్ర్యహ ముష్ణం ఘృతం పేత్వా వాయుభక్ష్యో భ##వేత్త్ర్యహమ్‌ | తప్త కృచ్ఛ్ర మిదం ప్రోక్తం శీతైః శీతం ప్రకీర్తితమ్‌ ||

సర్వధార్మిక శేఖరా! ఏ కర్మాచరణముచే మానవులు కష్టములంగడతురో యింకను నానతిమ్మనిన రామునకు పుష్కరుండనియె. కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తముం జేసికొన్న వారు కష్టములను గడతురు. వలచిన కోరికలన్నిటింబడయుదురు. నావిని పరశు రాముండు పలికెను. కృచ్ఛ్రముల పేరులు వాని విధులు వినంగోరెద నీవవిసమగ్రముగ నెరుంగుదువు తెల్పుమన పుష్కరుండనియె. ఈ కృచ్ఛ్రములు మూడు వర్ణములవారికే చేయదగినవి. ఇందు శూద్రుల కధికారములేదు. మొదట నన్ని కృచ్ఛ్రములందు ముండనము కర్త్యవ్యము. నిత్యము త్రిషవణస్నానము ప్రాతర్మాధ్యాహ్న సాయంకాలములందు స్నానము విష్ణుపూజ చేయనగును. పవిత్ర మంత్రములతో హోమము అవ్వల జపముచేయ నగును. స్త్రీలతో శూద్రులతో కులభ్రష్టులతో మాటలాడరాదు. ఇతి కృచ్ఛ్రము లందన్నిటి సాధారణకర్త్వయము. మరియు వీరాననముం దిష్టమున్నను లేకున్నను గూర్చుండవలెను. వీరసనము = ఆనకకూర్చుండుట. వీరాసనమందుండి యిదిచేసి నది మిక్కిలి గుణవంతమగును. అదిలేక చేసినది విధివిహీనమగును. ఆనవిని పరశు రాముడు వీరాసనషున నేమో నీవలన విన నెంచెదను ఉత్తమవ్రతా! తెలుపుమన పుష్కరుండనియె: పగలు నిలువబడవలెను రాత్రి కూర్చుండవలెను. ఇది వీరాసన మనబడును. ఇది మహా పాతకములను నశింపజేయును. రెండు నెలలు ఆమిక్ష [పాలవిరుగుడు] తోను ఎనిమిది రాత్రులు పెరుగుతోను మూడు రాత్రులు సర్పిస్సు నెయ్యితోను వృత్తి గొనవలెను. లేదా నిరాహారుడై మూడు రోజులు బాలక వ్రతమాచరింప వలెను. అది సర్వపాప హరము సర్వకామవ్రతముగూడ. తన ప్రయోజన సిద్ధికగ్నిని (నేతితో) ప్నానము చేయింపవలెను. దాని ననుసరించి యగ్నియందు హోమము చేయవలె ఆమీద నన్నమును నొకనికి పెట్టవలెను. "బ్రహ్మాదేవానాం" అను మంత్రముచే పండితుడు రక్షార్థమై దర్బలను కట్టవలెనని శాస్త్రము. వండిన అన్నమును వండుచున్న దానిని, భాండగతమైన దానిని నామంత్రముచే ముమ్మా రభిమంత్రింపవలెను. యవధాన్యము ధాన్యరాజము వరుణదేవతాకము మధుసమ్మిశ్రితము ఆధాన్యము సర్వపాప నాశనము పవిత్రమునని ఋషులు స్మరించిరి. ఘృతరూపము జలరూపము అమృత రూపమునగు యవలు నాచే చేయడిన దుష్కృతము నెల్లపోగొట్టుగాక. వాక్కు చేతను క్రియచేతను చేయబడినదియు, మనస్సుచే చేయబడినదానిని దుస్స్వప్నమును దురాలోచనను పవిత్రము చేసి అలక్ష్మి (దారిద్ర్యము)ని నశింపచేయుగాక! కుక్కలు పందులచే నాస్వాదింపబడినదియు ఉచ్ఛిష్ట రూపమైనదియు నగునన్నమును, తల్లిదండ్రులకు గురునకు సేవచేయమిని యవలు పవిత్రము చేయుగాక! సంఘాన్నమును వేశ్యాన్నమును, చోరుని యన్నమును, ప్రధమశ్రాద్ధపు అన్నమును నాకు ప్రాప్తించిన దానిని యవలు పవిత్రము చేయుగాక! బాలుడుగ నాచ రించిన యధర్మము, రాజధర్మముగజేసిన యధర్మము బంగారము దొంగిలించుట, భుజించుటకు వీలులేనిదానినితినుటవలన యధర్మము యాగా నర్హునిచే యాగము చేయించుట బ్రాహ్మణ దూషణము వీనినన్నటిని యవలు పవిత్రము చేయుగాక! భాండమునందున్న అన్నశుద్ధికీ మంత్రమును కీర్తింపవలె%ు. మనసునుండి పుట్టినవారు మనస్సునందున్నవారు మిక్కిలి సమర్థులు దక్ష ప్రజాపతి తండ్రిగా గలవారు (దక్షపుత్రులన్నమాట) నైన ఆదేవతలు మమ్మురక్షింతురుగాక! వారికిదిగో హవిస్సు అని మంత్రభావము. దానితో దన యందు అగ్ని నుద్ధేశించి హోమము సేయవలెను. యవలతో "యవోసి" అను మంత్రముతో మొదలు పెట్టి చేసెడి యీ యావక కృచ్ఛ్రవ్రతమునకు అతి సౌహిత్యము (తృప్తి) నొనరింపరాదు. మేధార్థియైన వాడు త్రిరాత్రులు ఎక్కువ పాపములు చేసినవారు ఆరు రాత్రములు ఉపపాతకి సప్తరాత్రముగ నీవ్రతము సేయవలెను. మహా పాతకి కిది పండ్రెండు రోజులు సేయదగినది. అభీష్టములు సిద్దించుట కిరుదదియొక్క రాత్రులు గావింపవలెను. నెలరోజులు సేసిన సర్వపాపములనుండి మోక్ష మందును. ఈ చెప్పిన యమలతో యవోసి అని మొదలగు మంత్రములతో గోవులకు నిర్హార ప్రతినిధిగ) మొనరించి దానము చేసి పదిరెట్లు ఫలమందును. ఒక్క నెలలో దేవతలను నాల్గు వేదములను అష్టాదశ వద్యలను దర్శించును. వరమిచ్చుటకు శాపమిచ్చుటకు (సాపానుగ్రహములకన్న మాట) సమర్థుడగును. శుక్లపక్షము పాడ్యమితో నారంభించి ప్రతిదిన మొక్కొక్కటి వృద్ధిచేయుచు నన్నపుముద్దలను శ్రీఖండము మారేడు చందనముతో గలిపితినవలెను. కృష్ణ పక్షమునందు పాడ్యమి మొదలొక్కొక్క ముద్దను పేర్కొన్నారు. ఇదే విపర్యాసముగ (వెనుకు) జేసిన వజ్రమధ్యము అనబడును. ప్రతిదిన మెనిమిది ముద్దలు తినుటను యతి చాంద్రాయణ మందురు. ఉదయ మెనిమిది సాయంకాలమెనిమిది గ్రాసములను (ముద్దలను) దినుట శిశుచాంద్రాయణ మనబడును. ఎప్పుడో యప్పుడెట్లో యుట్లు రెండు వందలనలుబడి ముద్దలు (దినము కెనిమిది వంతున) నెలరోజులు దిన్నచో సురచాంద్రాయణవ్రత మగును. ఏడురోజులు గోక్షీరమును నాలుగు పొదుగుల పాలు, తరవాత నేడురాత్రులు మూడు పొదుగులు ఆటమీద నేడు రోజులు రెండు పొదుగులు పిమ్మట నారునాత్రులొక్క పొదుగుపాలు త్రావి మూడురాత్రులు వాయుభక్షణము చేయవలెను. ఈ ప్రక్రియకు సోమాయన వ్రతమని పేరు. ఇది సర్వపాపహరము. మూడు రోజులు నీళ్లు మూడురోజులు వేడిపాలు మూడురోజులు వేడినెయ్యియుంద్రావి మూడు దినములు వాయుభక్షణము చేసినచో తప్తకృచ్ఱ్రమన బడును. చల్లని నీళ్ళు పాలు నేతితో నిది చేసినశీత కృచ్ఛ్రమనబడును. 37

కృచ్ఛ్రాతి కృచ్ఛ్రం పయసా దివసా నేక వింశతీన్‌ | గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్‌ ||

ఏక రాత్రోపవాసశ్చ కృచ్ఛ్రం సాన్తపనం సృతమ్‌ | ఏతచ్చ ప్రత్యహా భ్యస్తం మహాసాన్త ఫనం స్మృతమ్‌ ||

కృచ్ఛ్రం పరాక సంజ్ఞం స్యాత్‌ ద్వాడశాహ మభోజనమ్‌ | ఏకభుక్తేన నక్తేన తధైవా7యాచితేన చ ||

ఉపవాసేన చైకేన కృచ్ఛ్ర పాదః ప్రకీర్తితః | ఏతదేవ త్రిరభ్యస్తం శిశుకచ్ఛ్రం ప్రకీర్తితమ్‌ ||

త్ర్యహం సాయం త్ర్య ప్రాత స్త్ర్యహ మద్యా దయాచితమ్‌ |

త్ర్యహం పరం చ నా7శ్నీయాత్‌ ప్రాజాపత్యం చరన్‌ ద్విజః ||

పిణ్యాకాంబుచ తక్రాంబు సక్తూనాం ప్రతి వాసరమ్‌ | ఏకైక ముపవాసం చ సౌమ్యకృచ్ఛ్రం ప్రకీర్తితమ్‌ ||

అంబుసిద్దై స్తథా మాసః కేవలై ర్వారుణం సమైః ఫలై ర్మాసేన కధితం ఫలకృచ్ఛ్రం మనీషిభిః ||

శ్రీకృచ్ఛ్రం శ్రీఫలైః ప్రోక్తం పద్మాక్షే రపరం తధా | మాస మామలకై రేవ శ్రీకృచ్ఛ్ర మపరం సృతమ్‌ ||

పత్రై ర్మతం పత్రకృచ్ఛ్రం పుషై#్ప స్తతకృచ్ఛ్ర ముచ్యతే | మూలకృచ్ఛంతధా మూలైః తోయకృచ్ఛ్రం జలేన తు ||

దధ్నా క్షీరేణ తక్రేణ పిణ్యాకేన కణౖస్తథా | శాకై ర్మాసం చ కార్యాణి సునామాని విచక్షణౖః ||

సాయం ప్రాతస్తు భుంజనో నరోయోనాన్తరా పిబేత్‌ | షడ్ఫిర్వర్షైరిదం ప్రోక్తం కృచ్ఛ్రం నిత్యోపవాసితా ||

ఏకభ##క్తేన మాసేన కథితం చైక భక్తకమ్‌ | నతు కృచ్ఛ్రం తు నక్తేన మహత్‌ సంవత్సరా ద్భవేత్‌ ||

నక్తాశినస్తు ధర్మజ్ఞః ఏకభుక్త స్య వా పునః | త్ర్యహం వోవవసే ద్యుక్తః స్నాయీత సవనత్రయమ్‌ ||

నిమ్నవత్సు తధైవాప్సు త్రిః పఠే దఘమర్షణమ్‌ | దేవతాభావవృత్తస్తు ఛందశ్చైవా7ప్యనుష్టుభమ్‌ ||

సంస్మరేత్తస్య చ తథా ఋషించైవా7ఘమర్షణమ్‌ | చతుర్థే7హని దాతవ్యా బ్రాహ్మణాయ తపస్వినే||

చ్రాహం జపే ద్వధాశక్తి శుచి శైవా7ఘమర్ణణమ్‌ | భావవృత్తస్తధా దేవ స్తధాచ పురుషః పరః ||

తద్దైవత్యం విజానీయాత్‌ సూక్తం తదషమర్షణమ్‌ | యధాదశ్వమేధః క్రతురాట్‌ సర్వపాపాపనోదనః ||

తథా7ఘమర్షణం సూక్తం సర్వకల్మషనాశనమ్‌ | కృష్ణా7జినం వా కుతపం పరిధాయా7ధ వల్కలమ్‌ ||

సంవత్సరం వ్రతం మర్యాత్సమ్మితం నామ భార్గవః | గృహం న ప్రవిశేత్తత్ర భేవేదాకాశశాయకః ||

అశక్తౌవా భ##వేద్రామ! తిధా శైలగుహాశయః | నిత్యం త్రిషవణస్నాయీ తధా స్యా ద్ద్విజసత్తమః ||

భైక్ష్యశాకఫలాహారః కామం స్యాద్ద్విజపుంగవః | వీరాసనం తధా కుర్యా త్కాష్ఠమౌనం తధైవచ ||

సర్వకామప్రదం హేత్య త్సర్వకర్మషనాశనమ్‌ | వాయవ్యం కృచ్ఛ్ర ముక్తంతు పాణిపూరాన్న భోజినః

మాసే నైకేన ధర్మజ్ఞః సర్వోకల్మష నాశనమ్‌ | తిలైర్ద్వాడశ రాత్రేణ కృచ్ఛ్ర మాగ్నేయ ముచ్యతే ||

లాజాప్రసృతి మప్యేకాం కనకేన సమన్వితామ్‌ | భుంజానస్య తథా మాసం కృచ్ఛ్రం ధనదదైవతమ్‌ ||

గవాం నిర్హార నిర్ముక్తై ర్యవైః సకూన్‌ సమంతతః | యామ్య కృచ్ఛ్రం వినిర్దిష్టం మాసేన భృగునందన ||

గోమూత్రేణ చరేత్స్నానం వృత్తిం గోమయ మాచరేత్‌ | గవాం మధ్యే సదాతిష్ఠే ద్గోపురీషేచ సంవసేత్‌ ||

గోష్వతృప్తాసు న పిబేదుకం భృగునందనః | అభుక్తాసుచ నా7శ్నీయా దుత్థితాసూత్థితో భ##వేత్‌ ||

తధా చై వోనవిష్టాసు సర్వాసూపవిశే న్నరః | మాసేనైకేన కథితం గోమూత్రం కల్మషాపహమ్‌ ||

అజాకృచ్ఛ్రం తధైవైత దజామధ్యే తు వర్త తః | తృణానాం భత్రణనేహ సమతుల్యఫలే ఉభే ||

ద్వాదశాహేన కథితం సర్వపాతకనాశనమ్‌ | ఉపోషిత శ్చ తుర్దశ్యాం పంచడశ్యా మనంతరమ్‌ ||

పంచగవ్యం సమశ్నీయా ద్దవిష్యాశీ త్వనంతరమ్‌ | బ్రహ్మకూర్చ మిదం కుర్యా దుక్తప్రశమనాయవై ||

పక్షాన్తే త్వథ వా కార్యం మాస మధ్యే తు వా పునః | బ్రహ్మకుర్చం నరః కుర్యాత్‌ పౌర్ణమాసీషుయస్సదా || 68

తస్య పాపం క్షయం యాతి దుర్భక్తాది న సంశయః | మాసాభ్యాం చ నరః కృత్వా బ్రహ్మర్చం సమాహితః ||

సర్వపాప వినిర్ముకో యధేష్టాంగతి మాప్నుయాత్‌ | బ్రహ్మభూత మమావస్యాం పౌర్ణ మాస్యాం తధైవచ ||

యోగభూతం పరిచరే త్కేశం మహదాప్నుయాత్‌ | ఏవ మేతాని కృచ్ఛ్రాణి కథితాని మయా తవ ||

శాసనానీహ పాపానాం దురితానాం చ భార్గవ | సంవత్సర సై#్యర మపి చరేత్కృచ్ఛ్రం ద్విజోత్తమః ||

అజ్ఞాత భుక్త శుద్ధ్యర్థం జ్ఞాతస్యతు విశేషతః |అజ్ఞాతం యది నా జ్ఞాతం కృచ్ఛ్రం పాపం విశోధయేల్‌ ||

కృచ్ఛ్రసంశుద్ధపాపానాం నరకం న విధేయత్‌ | శ్రీకామః పుష్టికామశ్చ స్వర్గకామ స్తధైవ చ ||

దేవతారాధనపరః తథా కృచ్ఛ్రం సమాచరేత్‌ | రసాయనాని మంత్రాశ్చ తధా చై వౌషధాశ్చయే ||

తస్య సర్వే హి సిద్ధ్యన్తి యోనరః కృచ్చ్రవృద్భవేత్‌ | వైదికాని చ కర్మాణి యాని కామ్యాని కానిచిత్‌ ||

సిద్ధ్యన్తి కార్యాణి సదా కృచ్చ్రకర్తు ర్భృగూత్తమ | తేజసా తస్య సంయోగో మహతా చైవజాయతే ||

వాంఛితాన్‌ మానసాన్‌ కామాన్‌ సచాప్నోతి న సంశయః | జ్ఞాతోభవతి దేవేషు తథా చర్షిగణఫుచ ||

విపాప్మా వితమస్కశ్చ సంశుద్ధశ్చ విశేషతః |

ఆరాధనార్థం పురుషోత్తమస్య కృచ్ఛ్రాణి కృత్వా మధుసూదనస్య |

సురోత్తమానాం సమతత్య లబ్దం తల్లోక మాప్నౌతి జనార్దనస్య ||

ఇతి శ్రీవిష్ణుదర్మోత్తరే ద్వితీయఖండే కృశ్చ్రప్రాయశ్చిత్త వర్ణనం నామ త్రయోవింశోత్యుత్తర శత తమో7ధ్యాయః ||

ఇరువది యొక్క దినములు కేవలమావుపాలు మాత్రమే త్రాగినచో కృచ్ఛ్రవ్రతమనబడును. గోమూత్రము గోమయము గోక్షీరము ఆవు పెరుగు ఆవునెయ్యి కుశోదములు మాత్రము స్వీకరించి ఒక రోజుపవాసమున్న చో సాంతపనమని యది పిలువబడును. ప్రతిదినమట్లు చేసినచో మహాసాంతపనమని స్మృతలందు జెప్పబడినది. పండ్రెండు దినముల భోజనమగునేని పరాకృచ్ఛ్రమనబడును. ఏక భుక్తము నక్తభోజనము (రాత్రి మాత్రమే భుజించుట) ఇదికూడ ఆయాచితముగ వచ్చిన యాహారమేతినుటయు ఒక్క రోజుపవాసముండుటయుం గలిసి యిది "కృచ్ఛ్రపాదము" అనబదును. ఇదే మూడుపర్యాయము లలవాటు సేసినచో శిశు కృచ్ఛ్రమని యది పిలువబడినది. మూడు రోజులు సాయంసమయములందు మూడురోజులు ప్రాతఃకాలమందు నిట్లు మూడు రోజులు అయాచితా హారము దిని ఆపై మూడు రోజులేమియు దినకుండెనేని ప్రాజాసత్య వ్రతమగును. తెలికి పిండి గంజి మజ్జిగ పెలపిండియును దినదిన మారగించుచు నుపవాసము సేయుట సౌమ్య కృచ్ఛ్రవ్రత మనబడును. ఒక్క నెల సరి రోజులందు కేవలము నీరు ద్రావి యుండుట వారుణకృచ్ఛ్రమగును. నెలదినములు పండ్లుదిని యూర కుండుట ఫలకృచ్ఛ్రమన బడినుది. మారేడు పండ్లు పదాక్షములు = తామరగింజలు దిని ఉసిరికాయలు మాత్రమే తిని ఒక్క నెలయుండుట శ్రీకృచ్ఛ్రమన బడినది. పత్రములు=ఆకులు తినయుండుట పత్రకృచ్ఛ్రము పువ్వులుదినుట పుష్పకృచ్ఛ్రము దుంపలు (మూలములు) తిని యుండుట మూలకృచ్ఛ్రము జలము మాత్రమే భక్షించుట జలకృచ్ఛ్రమునబడినవి. దధి (పెరుగు) క్షీరము తక్రము (మజ్జిగ) పిణ్యాకము =తెలిక (పిండి) కణములు (నూక) శాకములు కూరలు తిని యొక్క నెల చేయు వ్రతమాయా పేరులతో బేర్కొనబడును. దధి కృచ్ఛ్రము శాకకృచ్ఛ్రము నిత్యాదిగ పిలువబడునన్నమాట. సాయంకాలము ఉదయమునందుమాత్రము భుజించి నడుమ మంచి నీరైన త్రావక యారేండ్లుండినచో నిది నిత్యోపవాసమను కృచ్ఛమగును. ఈ చేసినతడు నిత్యోపవాసి నదోపవాసి యనబడును. నెలరోజులొంటిపూట భుజించుట ఏకభక్త కృచ్ఛ్రమనబడును. ఆవిధంగా నక్తము చేసినచో నది నక్తకృచ్ఛ్రమగును. వక్త భోజనము చేయువాడును, ఏకభుక్తము చేయువాడును త్ర్యహోపవాసము చేయునాతడును త్రిషవణ స్నానము చేయవలెను. లోతునీళ్ళలో నిలచి ముమ్మారు దేవతయందు తలపుంచి అఘమర్షణ ఋక్కులను పఠింపవలెను. అనుష్టప్ఛందస్సును ఆడుఘనుక్షణ ఋషిని స్మరింపవలెను. నాల్గవరోజున తపశ్శాలియగు బ్రాహ్మణునికి దక్షిణ నీయవలెను. శుచియై మూడురోజులు యధాశక్తి నషువర్షణ ఋక్కులను జపించవలెను. అప్పుడు భావమందు (తలపులో) పరమ పురుషుడు దేవుడు పరమాత్మయుండవలెను. ఆ అమర్షణణ సూక్కమునకు పరమాత్మ నారాయణబడే దైవతము అశ్వమేధ క్రతురాజము సర్వపాప హరమై నట్లే అషుమర్షణ సూక్తముగూడ సర్వపాప హరము. కృష్ణాజెనము కుతపము=ధావళి నారచీర యేని ధరించి "సమ్మితము" అను వ్రతము నొక సంవత్సరము సేయవలెను. ఇంటిలో ప్రవేశింపరాదు. బయట పండుకొనవలెను. శక్తి చాలనిచో గొండ గుహలో పండుకొన వచ్చును. నిత్యమును త్రిషణ స్నానము ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములు మూడింటను స్నానము చేయవలెను. భిక్షాన్నము లేదా ఆకు కూరలు పండ్లు తినవలెను. ఎప్పుడును వీరాసనమందుండవలెను. కాష్ఠమౌద మూనవలెను అనగా సంజ్ఞగూడ సేయరాదన్నమాట. ఈ వ్రతము సర్వకామ ప్రదము సర్వపాపహరము. ఒక్క నెల రోజులు చేతి నిండ అన్నము తినుచుండిన యెడల వాయవ్య కృచ్ఛ్రమనబడును. సకల పాపనాశనము. నువ్వులతో (నువ్వులందిని) పండ్రెండు రోజులు చేయు వ్రతము ఆగ్నెయ కృచ్చ్రము. పుడిసెడు పోలాలను బంగారముతో గూడ నొకనెల తినుచుంజేయు వ్రతము ధనదకృచ్చ్రమనబడును. ఒక నెల ఆవులు తినగా మిగిలిన యవల జరిపెడు కృచ్ఛ్ర వ్రతము యామ్యమనంబడును. గోవుల నీర్హ్యార మనగా గోమూత్రము గోమయము వావితో దడిసిన యవలనికూడ చెప్పవచ్చును. గోమూత్రముతో స్నానము గోమయముతో వృత్తి (ఆహారము) చేయుచు నెల్లవెళ గోవుల మందలో పేడకుప్పలలోగూర్చుండ వలెను, గోవులు నీళ్లుత్రావి తృప్తిపొందనియెడతాను మంచినీరు త్రావరాదు. అవి మేత మేయనిచో తానన్నము తినరాదు. అవి నిలువబడియున్నప్పుడు తానును నిలబడియుండవలెను. గోవులన్నియుగూర్చున్నప్పుడే తాను గూర్చుండవలెను. ఒక్క నెల గోమూత్రము ద్రావిన సర్వపాపములు పోవును. మేకలమంద నడుమ వసించి వానితోబాడు గడ్డితిన్నచో అజాకృచ్ఛ్ర వ్రతమనబడును. ఈ రెండు పనులకు ఫలమొక్కటే. ఈ వ్రతము పండ్రెండు రోజులు చేసినచో సర్వపాప హరమగును. చతుర్దశినాడుపవాసముండి పూర్ణిమనాడు పంచగవ్య ప్రాశన చేసి హవిష్యము తినుట బ్రహ్మకూర్చ మనబహడును. ఇదియుం బావహరమే. పక్షము చివరగాని మాన మధ్యమునగాని యీ బ్రహ్మకూర్చము సేయవలెను. పూర్ణిమ తిధి కలిసి కలసిన అభక్ష్య భక్షణాదిదోషము దీనిచే క్షయమగును. ఈ బ్రహ్మకూర్చము రెండు నెలలు సేయవలెను. అందువలన సర్వపాప విముక్తుడై తాననుకొన్న సద్గతి నందును. సాక్షాద్రృహ్మమేయైన యోగమే (సమాధియే) తానైన విష్ణువును పూర్ణిమనాడుగాని అమావాస్యనాడు గాని పరిచరించిన (సేవించిన) మహాఫలము నందును. ఇట్టి కృచ్ఛ్ర వ్రతము లన్నిటినీ నీకేను దేల్పితిని. ఇవి పాపులను వారుచేయు పాపములను నదుపులోపెట్టును. సంవత్సరమునకొక్కటియైన యీకృచ్ఛ్ర వ్రతము లన్నిటిని నీకేను దెల్పితిని. ఇవి పాపులను వారుచేయు పాపములను నదుపులో పెట్టును. సంవత్సరమునకొక్కటియైన యీ కృచ్ఛ్రవ్రతమును బ్రాహ్మణుడాచరించి తీరవలెను. తెలియకగాని తెలిసిన గాని అపాత్రపు కూడు కుడిచిన దోషము జ్ఞాతా జ్ఞాతములగు పాపములను కృచ్ఛ్రవ్రతము శోధనముచేయగలడు. కడిగివేయగలదన్నమాట. కృచ్ఛవ్రతముచే పాపము కడిగివేసికొన్న వారికి నరక ముండదు. శ్రీకాముడు పుష్టికాముడు స్వర్గకాముడును. దేవతారాధన నిష్ఠుడై కృచ్ఛ్రవ్రత మాచరింప వలెను. అందువలన రసాయనములు మంత్రములు ఔషధములు నన్నియు సిద్ధించును. వేదోక్త కర్మములు కామ్యము లింకేమిగల వన్నియు ఫలించును అన్ని పనులు నెరవేరును. ఆమహాను భావుని తేజస్సుతో గూడికయుంగల్గును. అనగాకృచ్ఛ్ర వ్రతనిష్ఠుని కెంత నందియములేదు దేవతలందు మహర్షిగణములందు నుపరిచితుడును. ప్రసిద్ధుడగును. పాపరహితుడు విశేషించి పరిశుద్ధుడయిన వాడు తమోగణరహితుండునగును. పురుషోత్తముడగు విష్ణునారాధనము కొఱకు కృచ్ఛ్రవ్రతము లాచరించి సురేంద్రులంగూడ దాటి చనిన మీదట లభించు విష్ణులోకమును బొందును.

ఇది శ్రీ విష్ణుధరర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున కృశ్చ్రప్రాయశ్చిత్త వర్ణపమను నూటయిరువది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters