Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయిరువది రెండవ అధ్యాయము - దుర్గతి తరణ వర్ణనము

మార్కండేయః- ఏతచ్ఛ్రుత్వా యదు శ్రేష్ఠరామోతికరః పితుః | పపాత భువి నిశ్చేష్టః ఛిన్నమూల ఇవ ద్రుమః ||

తం విసంజ్ఞం మహాభాగః పీనోన్నత పయోధరాః | సచందనైః శీతజలైః సిషిచుర్దేవ యోషితః ||

వారుణ రాజ్ఞయా చాన్యాస్తాల వృంతైర్మనో రమైః | వీజయన్తి మహాభాగః రామం ధర్మభ్భతాం వరమ్‌ ||

లబ్ధసంజ్ఞం మూహుర్తైన భార్గవల చిత్తవిహ్వలమ్‌ | ఆశ్వాసయామాస తథా వారుణిః పరవీరహా ||

సమాశ్వస్త స్తతోరామః పప్రచ్ఛ వరుణాత్మజమ్‌ | దుర్గాతి తరణం వీరోరామో ధర్మభృతాం వరః ||

రామః- క్లిశ్యమానేఘ భూతేషు తై స్త్రెరా భావై స్తత స్తతః | దుర్గాణ్యతితరేద్యేన బ్రూహిమే వరుణాత్మజః ||

పుష్కరః- ఆశ్రమేషు యధోక్తేషు యధోక్తంతే ద్విజాతయః | వర్తన్తే సంయతాత్మానో దుర్గాణ్యతర న్ని తే ||

యే దంభాన్ను జహతీహ యేషాం వృత్తిశ్చ సంవృతా | విషయంశ్చ నగృహ్ణన్తి దుర్గాణ్యతితర న్తి తే ||

వాసయన్త్యతిధీ నిత్యం నిత్యం యే చా7నసూయకాః | నిత్యం స్వాధ్యాయశీలా శ్చ దుర్గాణ్యతితర న్తితే ||

మాతాపిత్రో శ్చ యే వృత్తిం వర్తన్తే ధర్మ కోవిదాః | వర్జయన్తి దివాస్వాపం దుర్గాణ్యతితర న్తితే ||

స్వేషు దారేషు వర్తన్తే న్యాయ వృత్తి మృతా వృతౌ | అగ్నిహోత్రపరాః సన్తో దుర్గాణ్యతితరన్తి తే||

ఆహవేషు చ జయే శూరా స్త్యక్త్వా మరణం భయమ్‌ | ధర్మేణ జయమిచ్ఛన్తి దుర్గాణ్యతితరన్తి తే||

యే పాపాని నకుర్వన్తి కర్మణా మనసా గిరా | నిక్షిప్త దండా భూతానాం దుర్గాణ్యతితరన్తి తే||

కర్మా ణ్యకుహకార్థాని యేషాం వాచశ్చ సూనృతాః | యేషా మర్థశ్చ సాధ్వర్థో దుర్గా ణ్యతితరన్తి తే||

యే తపశ్చ తపస్యన్తి కౌమార బ్రహ్మాచారిణః | విద్యావేద వ్రతస్నాతాః దుర్గాణ్యతితరన్తి తే||

యేషాం న కశ్చి త్త్రసతి త్రస్యన్తివచ కస్యచిత్‌ | యేషా మాత్మసమోలోకో దుర్గాణ్యతితర న్తి తే||

పరశ్రియాన తప్యతే సన్తః పురుష సత్తమాః | గ్రామ్యాస్వాద నివృత్తాశ్చ దుర్గా ణ్యతితరన్తి తే||

సర్వాన్‌ దేవా న్నమస్యన్తి సర్వాన్‌ ధర్మాంశ్చ శృణుతే | యే శ్రద్దధానాః పురుషాః దుర్గాణ్యతితర న్తి తే||

యే నలోభా న్నయన్త్యర్థా న్రాజోనో రజసా వృతాః | విషయా న్పరిరక్షన్తో దుర్గాణ్యతితరన్తి తే||

యే న మానితు మిచ్ఛన్తి మానయన్తి చ యేనరాన్‌ | మాన్యమానా న్నమస్యన్తి దుర్గాణ్యతితరన్తి తే||

యే చ శ్రాద్ధాని కుర్వన్తి తిధ్యాంతిథ్యాం ప్రజార్థినః | సువిశుద్ధేన మనసా దుర్గాణ్యతితర న్తి తే||

యే క్రోధం నైవ కుర్వన్తి క్రోధార్తం శమయన్తి చ | నచ కుప్యన్తి భృత్యానాం దుర్గాణ్యతితరన్తి తే ||

మధు మాంసంచ యే నిత్యం ర్జ యన్తీహ మానవాః | జన్మ ప్రభృతి మద్యంచ దుర్గాణ్యతితర న్తి తే||

యాత్రార్థం భోజనం యేషాం సంతానార్థంచ మైధునమ్‌ | వాక్‌ సత్య వచనార్థాయ దుర్గాణ్యతితర న్తి తే||

తడాగారామ కర్తాధారస్తధా7న్యే వృక్షరోపకాః | కుపానాం యే చ కర్తారో దుర్గాణ్యతితర న్తితే ||

గవాం గ్రాసప్రదాతారో గవాం కండూయకాశ్చ యే | భక్తిమన్తో గవాం యేచ దుర్గణ్యతితరన్తి తే ||

పూజయన్తి సదా విప్రాన్‌ సాధూనపి గురుంస్తధా | తపస్వినశ్చ ధర్మజ్ఞః దుర్గణ్యాతితరన్తితే||

గాయత్రీజాప నిరతాః తీర్థయాత్రారతాశ్చ యే | యేచైక మాశ్రితాస్తీర్థం దుర్గణ్యతితరన్తి తే||

యే చైక మాశ్రితా దేవం సర్వభావేన భార్గవ | ధర్మజ్ఞాశ్చ వినీతాశ్చ దుర్గాణ్యతితరన్తితే ||

సాయం ప్రాతశ్చ భుంజానాః పిబన్త్యావస్తు యే నరాః | సదోపవాసినో రామ! దుర్గణ్యతితరన్తి తే ||

ఉపవాసరతా నిత్యం నిత్యం వ్రతపరాయణాః | నిత్యం సంయత చిత్తాశ్చ దుర్గాణ్యతితరన్తి తే||

మార్కండేయుడిట్లునియె : ఓ యాదవశ్రేష్ఠ! పరశురాముడు పితృప్రీతిసేసిన మహానుభావుడీవిధముగ పుష్కరుడు పల్కి నవి విని మొదలు నరకిన తరువట్లు చేతలుదక్కి భూమిపై బడెను. అట్లు మూర్చ వోయిన పరశురామునిపై దేవతాసుందరులు సుశితల చందనోదకములు చల్లిరి. మఱికొందరు వరుణ కుమారు నానతిని జక్కనితకాటియాకు విసనకఱ్రలవీచిరి. ఒక ముహూర్తములో దెలివి వచ్చిన (మూర్చనుండి తేరుకొనిన) భార్గవుని మనసు కలత చెందిన వానిని పరవీర సంహార సమర్థుడగు పుష్కరుడొచ్చెను. దానందేరికొని వీరుడు ధార్మిక శ్రేష్ఠుండునగు రాముడు వరుణ కుమారుని దుర్గాతి తరణము =కష్టములంగడచుట యెట్లని యడిగెను. భూతములు (ప్రాణులు) ఆయా సంఘటనలచే గ్లేశ పడునపుడా కష్టముల నెట్లు గడుతు రానతిమ్మన పుష్కరుండిట్లనియె. ద్విజులు బ్రహ్మక్షత్రియ వైశ్యులు తమతమ బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసములు నాల్గింటను శాస్త్రము సెప్పినట్లు మనసు నిగ్రహముకల్గి వర్తింతురేని వారు కష్టములం గడతురు. ఎవరీ లోకమునందు డాంబికములను విడచుదురో యెవ్వరి వృత్తి (వర్తనము జీవన విధానము) చక్కగ గైకొనబడునో యెవ్వరిని యింద్రియ విషయములో (భోగములు) లో బఱచుకొనవో వారు కష్టములంగడతురు. తల్లిదండ్రుల బ్రతుకు తెరువు ననుసరించి ధర్మనిపుణులై యెవ్రువర్తింతురో యెవరు పగటినిద్రను మానుదురో వారు కష్టములం గడతురు. తల్లిదండ్రుల బ్రతుకు తెరువు ననుసరించి ధర్మనిపుణులై యెవ్వరు వర్తింతురో యెవరు పగటినిద్రనుమానుదురో వారు కష్టములం గడతురు. కట్టుకొన్న భార్యలందు ప్రతి ఋతుకాలమందెవ్వరు న్యాయవృత్తితో వర్తింతురో యెవరు నిత్యాగ్నిహోత్ర పరులవుదురో వారు కష్టములం గడతురు. మరణ భీతివీడి రణరంగములందెవ్వరు శూరులై విక్రమింతురో ధర్మమూలమున గెలుపుకోరుదురో వారు కష్టములం గడతురు. చేతను తలపునను పలుకున నెవ్వరు పాపములు సేయరో భూతదండనమును (హింసను దూరము సేసికొన్నవారు దుర్గములం డరింతురు. నిష్కపటమయిన పనులు నిజమయిన మాటలు సాధువుల ప్రయోజనమే యెవ్వరి ప్రయోజనముగ నుండునో వారు కష్టములం గడతురు. కౌమార దశలో బ్రహ్మచారులై యెవ్వరు తపస్సుసెయుదురో విద్యా వేద వ్రతస్నాతులై సాంగ వేద విద్యాధ్యయన పారంగతులైన వారు కష్టములం గడతురు. ఎవ్వరి కెవ్వడేని జడియడో, ఎవ్వరికి లోక మంతయు తనతో సమానమై వారు కష్టములంగడతురు. ఒరులసిరులంగని యే సత్పురుషు లేడువరో ఏపురుషోత్తములు తుచ్ఛసుఖ ముల చవినుండి విరమింతురో వారు కష్టములం గడతురు. ఎవ్వరు శ్రద్ధతో నందరు దేవతలను మ్రొక్కుదురో అన్నిధర్మముల నాలింతురెవ్వరు వారు కష్టములం గడతురు. ఏ రాజులు దేశముల రక్షించుచు రజోగుమమునం గప్పువడి లోభగుణమూని అర్ధ సంచయము చేయరో వారు కష్టములం గడతురు. ఎదిరివాని వలన తాను గౌరవింపబడవలెనని యేరుకోరరో, ఎదిరివాని నెవ్వరు గౌరవింతురో, గౌరవింపబడుచున్న మహాను భావులకు నెవరు నమస్కరింతురో వారు కష్టములం గడతురు. సంతానార్థులై యెవ్వరాయాతిథులనందు పితృదేవతలనుద్దేశించి శ్రాద్ధము పెట్టుదురో వారు కష్టములం గడతురు. ఎవ్వరు కోపింపనే కోపింపరు. కోపించిన వానిని శాంతింప జేయుదురు, నౌకరులయెడనేని కోపింపరు వారు గష్టములం గడతురు. పుట్టిన దాదిగ మధుమాంసములనుమాని మద్యమును (త్రాగుడును) విడిచినవారు కష్టములం గడతురు. జీవ యాత్రకొఱకే భోజనము (బ్రతుకు కొరకే భోజనము గాని భోజనము కొరకు బ్రతుకు గాదన్న మాట) సంతానార్థమై స్త్రీ సంగమము నిజమాడుటకై పలుకుగలవారు కష్టములం గడతురు. ఇష్టాపూర్తములు చెఱవులు త్రవ్వించుట తోటలు వేయించుట చెట్లు నాటుట బావులు త్రవ్వించుటయం చేసినవారు కష్టములంగడతురు. గోవులకు గ్రాసము= మేత వెట్టినచారు ఆవులమేనిని గోకినవారు ధేనువులయెడ భక్తిగలవారు కష్టములం గడతురు. విప్రులను (వేదాథ్యయనము సేసి వేబోక్తకర్మాచరణ మొనరించి సదాచార సంపున్నుడైన బ్రాహ్మణునికి విప్రుడని పేరు) సాధువులను గురువపులను తపశ్శాలురను బూజించువారు కష్టములం గడతురు. గాయత్రీజపతత్పరులు తీర్థయాత్రాపరులు దీర్థము లందు వసించువారు కష్టములం గడతురు. (తీర్థము = పవిత్రమైనది మహాత్ములు స్నానము సేయురేవు) ఎవ్వరు సర్వభావముతో (వేరొక తలం పులేక) భగవంతుని దేవుని=తేజోరూపుని) నమ్ముకొందురు అట్టి ధర్మజ్ఞులు వినయశీలురు కష్టములం గడతురు. ప్రాతః స్సాయం సమయములందు (రెండువేళలను మాత్రమే) భోజనము సేయువారు మంచి నీరు త్రాపువారు సదోపవాసులనంబడుదురు. వారు కష్టములం గడతురు. నిత్యము నుపవాసములు చేయుట యందాసక్తులు వ్రత పరాయణులు నిత్యమును మనోనిగ్రముల గల వారు కష్టములం గడతురు.

దుర్గాతితరణం యేచ పఠ న్తి శ్రావయన్తి చ | కథయన్తి చ విప్రేభ్యో దుర్గాణ్యతితరన్తి తే||

ఈశ్వరః సర్వభూతానాం జగతాం ప్రభవో7ప్యయః | భక్తా నారాయణచైవ దుర్గాణ్యతితరన్తి తే||

భక్తానాం కేశ##వే రామ! న భయం విద్యతే క్వచిత్‌ | తధా గీతశ్చ శ్లోకో7యం యమేన శృణు భార్గవ! ||

పృధ్వీశతస్క రభుజం గహుతాశవిప్రదుస్స్వప్న దుష్టగదమృత్యు సపత్నజాతమ్‌ |

సంవిద్యతే నహి భయం భుపనైకభర్తుః భక్తాశ్చ యే మధురిపో ర్మనుజేషు తేషు ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే దుర్గతితరణవర్ణనం నామ ద్వావింశత్యుత్త రశతతమో7ధ్యాయః || 35

ఈ దుర్గాతి తరణమను నధ్యాయమెవ్వరు పఠింతురు వినిపింతురు విప్రులకు ప్రవచింతురు వారు కష్టములం గడతురు. పరమేశ్వరుడు సర్వభూతములకు జగమ్ములకు కారణము నాశకుడు! అట్టి నారాయణుని యెడ భక్తులయినవారు కష్టములం గడతురు శ్రీ మహావిష్ణువునెడ భక్తులయినవారి కెన్నడు నెందునం భయము లేదు. ఆవిధముగా యమునిచే శ్లోకము గీతమయినది (పాఢబడినది) ఈ శ్లోక భావమిది. రాజులు దొంగలు పాములు నిప్పు బ్రహ్మణులు దుస్స్వప్నములు దుష్టులు రోగములు మృత్యువు, శత్రువులవలన గలుగు భయము భువనములకెల్ల నేకైక ప్రభువు మధువైరియునైన విష్ణుని భక్తులగు మానవులకు గలుగనేకలుగదు.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణమున దుర్గాతి తరణ వర్ణనమను నూట యిరువది రెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters