Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యిరువది ఒకటవ అధ్యాయము - నరకవాసి చిహ్నవర్ణనము

రామః-నరకాద్యాన్తి తిర్యక్త్వం తతో మానుష్య మేవ చ | తేషాం చిహ్నాని మే బ్రూహి మానుష్యే వరుణాత్మజః ||

పుష్కరః- మణిముక్తా ప్రవాళాని రత్నాని వివిధాని చ | అపహృత్య నరోరామః జాయతే హేమకర్తృషు||

యద్వా తద్వా పరద్రవ్య మవహృత్య నరో బలాత్‌ | ప్రోప్నోతి భృగుశార్థూలః మానుష్యే భారవాహితామ్‌ ||

యం కంచిత్‌ ఘాతయిత్వాపి ప్రాణినం భృగునందన | మాంసం భుక్త్వా తుధర్మజ్ఞ భవతీహ గదాతురః ||

సువర్ణచోరః కునఖీ సురాపః శ్యావదన్తకః | బ్రహ్మహా క్షయరోగీ స్యా ద్ధుశ్చర్మా గురుతల్పగః ||

పిశునః పూతినాసస్స్యాత్‌ సూచకః పూతి వక్త్రకః | ధాన్యచోరో7గహీన స్స్యా దవ్యంగో మిశ్రమృద్భవేత్‌ ||

వ్యాథిత శ్చాన్న హర్తా స్యా న్మూకో వాగపహారకః | వస్త్రాపహారకః శ్విత్రీ పంగు శ్చా శ్వాపహారకః ||

ఖల్వాటో మత్సరీ రామ! నాస్తికో వేదనిందకః | భూయ ఏవ సమాప్నోతి తథా నాస్తికతాం ద్విజ! ||

అంధో దీపాపహారీ స్యాత్‌ కాణో నిర్వాపక స్తథా | ఆంధోభవతి గోఘ్నస్తు ఘాంటికసై#్తలిక స్తథా ||

దరిద్రః పరవిత్తఘ్నః ఉన్మత్త శ్చ తథా7గ్నిదః | ప్రతికూలో గురోర్యస్తు సోపస్మారీ ప్రజాయతే ||

మిష్టాశ్యేకో మహాభాగ!వాతగుల్మీ భ##వే న్నరః | ఖగభక్ష్యస్తు కుండాశీ దీర్ఘరోగీ చ పీడకః ||

భవతీహ మృగవ్యాధస్త్వ విక్రేయస్య విక్రయాత్‌ | శ్లీపదీ చావకీర్ణీస్యాత్‌ మూర్ఖ శ్చా క్రోశకో భ##వేత్‌ ||

ఉక్తాస్తు ముభ్యా హి మయా తిరశ్చాం యాయోనయో యాని చ లక్షణాని |

శక్యం న కార్త్య్సేన మయా ప్రవక్తుం యా యాతనా శ్చైవ నరాధమానాన్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే నారకి చిహ్న వర్ణనం నామ ఏకవింశత్యధిక శతతమో7ధ్యాయః || 121

నరకమందుండి పశుపక్షి జన్మములను మానవజన్మమునెత్తువారి చిహ్నములేవో తెల్పుమని పరశురాములవారడుగ పుష్కరుండిట్లనియె. మణులు ముత్యములు పడవములు అనేక విధరత్నములనుహరించినవాడు కంసాలియై జనించును. పరద్రవ్యమేదేని బలాత్కారముగ హరించినవాడు మనుష్య జన్మమందు బరువులు మోయువాడుగ (కూలివాడుగ) బుట్టును. ఏప్రాణినైనం జంపినవాడు మాంసము దిన్నవాడు రోగిష్ఠియగును. స్వర్ణస్తేయి (బంగారపు దొంగ) పుప్పిగోళ్ళ వాడుగను త్రాగుబోతు పిప్పిపళ్ళుగలవాడు గను బ్రహ్మఘ్నుడు క్షయవ్యాధిగ్రస్తుడుగను గురుతల్పగుడు (గురుపత్నింగలినవాడు) బొల్లి మొదలయిన చర్మరోగములు గల వాడుగనునగును. పిసినిగొట్టు మురికికంపునాసికగలవాడుటను థాన్యచోరుడు అంగలోపము వాడుగను ఉమ్మడి సొత్తు హరించిన వాడు అవ్యంగుడు = నిర ర్థకాంగుడుగను (అవేః=మేషస్య అంగమివ అంగంయస్యసః ) అన్న హారి రోగిగను మాటను హరింనవాడు మూగగను వస్త్రచోరుడు బొల్లివాడుగను గుఱ్ఱమును హరించినవాడు కుంటివాడుగను మత్సర్యముగవాడు ఖల్వాటః=బట్లతల వాడుగను వేదనిందకుడు నాస్తికుడుగను మలి జన్మమందు మరల నాస్తికుడుగనునగును. దీపము హరించి యంధుడగను ఒంటి దీపమును ఆర్పినవాడు కంటివాడుగను గోఘాతకుడు గ్రుడ్డివాడుగను ఘాంటికుడు =రాజులమేల్కొలుపువాడు తెలికులవాడుగను పరద్రవ్యహానిచేసినవాడు దరిద్రుడుగను నిప్పు పెట్టినవాడు పిచ్చివాడుగను గురునకు ప్రతికూలమైనవాడు మూర్చ వ్యాధికి గురియైనవాడుగనునగును. మధురమైన కమ్మనైన పిండివంటలను ధానొక్కనుగ గుడిచినవాడు వాతగుల్మ రోగియగును. భగభక్షుడు కుందాశియగును. పరపీడ గానిజవాడు దీర్ఘరోగగ్రస్తుడగును అమ్మగూడని వస్తువులనమ్మినవాడు మృగ వ్యాధుడగును. (వేటగాడగును) అపకీర్ణీ=బ్రహ్మచర్యాది వ్రతభంగము గలవాడు బోదకాలివాడగును. ఇతరులను ఏడ్పించినవాడు మూర్ఖుడగును. పశుపక్ష్యాది జన్మములు వాని లక్షణములు ప్రముఖ్యమైనవి తెల్పితిని. నరాధముల యాతనలెల్లం జెప్పుట నా చేతగాదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు నరకవాసి చిహ్నవర్ణమను నూటయిరువదియెటకవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters