Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయిరువదవ అధ్యాయము - తిర్యగ్యోని వర్ణనము

రామః- కర్మణా కేన ధర్మజ్ఞః నరా నరక వాసినః | కాంకాం యోనిం ప్రపద్యన్తే తిరశ్చో బ్రూహితన్మమ ||

పుష్కరః- అమేధ్య మధ్యే కృమయో మహాపాతకినోజనాః | భవన్తి బహుధా భూమ్యాం తత శ్చైవ శిలాసు తే ||

తృణ గుచ్ఛ లతా గుల్మ ద్రుమత్వం ప్రాప్యతే క్రమాత్‌ | భవన్తి చ మృగాః పశ్చా న్నిత్యం వ్యాధభయార్దితాః ||

బ్రహ్మస్వహారిణో సింస్రాః రౌద్రాచారాః రదైవ తు | ఆటవ్యాం ఘోర రూపాయాం జాయన్తే బ్రహ్మరాక్షసాః ||

వరదార రతాః మూఢాః సంతప్తాయాం తధా భువి| కృకలాసా హి జాయన్తే పిశాచా శ్చ ప్యనన్తరమ్‌ ||

అటవ్యాం ఘోరరూపాయాం సంశుష్కద్రుమ కోటరే | కృష్ణా7హయో హి జాయన్తే తతః పశ్చ న్న సంశయః ||

కూటసాక్షి ప్రదాః పాపాస్త్వమేధ్యే కృమయ శ్చిరమ్‌ | మృతా భవన్తి సర్పాస్తే పిశాచా స్తదనన్తరమ్‌ ||

గురుమిత్ర ద్రుహః పాపాః యే చ స్వామిద్రోహో జనాః | ద్విజ శిష్య ద్రుహ శ్చైవ కృతఘ్నా నాస్తికా స్తధా ||

త్యాగినో బాంధవానాం చ త్యాగినః శరణార్థినామ్‌ | నిక్షేప హారిణో యే చ కన్యకా క్రయణ శ్చ యే ||

అమేధ్యే కృమయః సర్పా మృగా వ్యాలమృగా స్తథా | తతో ఘోర గుణో పేతా జాయన్తే జంబుకాః ఖలాః ||

పరస్వహారిణః పాపాః కుంజరా స్తురగాః ఖగాః | బలీవర్ధాః తధై వోష్ట్రాః జాయన్తే నాత్ర సంశయః ||

హృతం యస్య తు యైర్ధ్రవ్యం తస్య భాగ్యాను రూపతః | ఆత్మదోషానుసారేణ జాయన్తే7ధనిన స్తు తే||

చంద్రార్క గ్రహణ భుక్త్వా జాయ న్తే కుంజరా నరాః | ఆమశ్రాద్ధే తథా భుక్త్వా జాయన్తే గృధ్రయోనిషు ||

అసత్ర్పతి గ్రహం రామః గృహీత్వా వానరా స్తథా | ఆశాభంగం తతా కృత్వా శృగాలా శ్చ తథా7ధమాః ||

సూచకస్తు దురాచారో వాగురిర్నామ జాయతే | బహుకాలం మహాభాగః భూయో భూయ ఇతి శ్రుతిః ||

మాంసభుగ్యావతాం రామః మాంసమశ్నాతి దేహినామ్‌ | తావతాం యోని మాప్నోతి భూయో భూయో న సంశయః ||

భోక్తవ్యాని చ తై స్తస్యరామ! మాంసాన్య సంశయమ్‌ | యావన్తః ప్రాణినో యేన బహిర్వేద్యాం నిపాతితాః ||

తావత్యో యోనయస్తేన గన్తవ్యా భృగుసత్తమ | యోనౌ యానౌ చ హన్తప్య స్తేనాసౌ నాత్ర సంశయః ||

వాంతాశీ కుణపాశీ చ పూయభు గ్రుధిరాశనః | స్వకర్మ విచ్యుతా వర్ణాః జాయన్తే ప్రేతయోనిషు ||

ధాన్యం హృత్వా భవత్యాఖుః కాంస్యం హంసో జలప్లవః | మధు దంశః పయః కాకో రసం శ్వా నకులో ఘృతమ్‌ ||

మాంసం గృధ్రో వసాం మద్గు సై#్తలం తైలాపగః ఖగః | చీరీవాకస్తు లవణం బలాకా శకునిర్దధి |

కౌశేయం తిత్తిరి ర్హృత్వా క్షౌమం హృత్వా చ దర్ధురః | కార్పాసం లాంతవం క్రౌంచం గాంగోధా వాగుదో గుడమ్‌ ||

ఛు ఛ్ఛుందరిః శుభాన్‌ గంధాన్‌ పత్రశాకం శిఖీ తథా | మక్షికాస్తు తధైవాన్న మకృతాన్నం తు శల్యకః ||

భేకో భవతి హృత్వాగ్నిం గృహహారీ చ తస్కరః | రక్తాని హృత్వా వాసాంసి జాయతే జీవ జీవకః

వృకో మృగేభం వ్యాఘ్రశ్వం ఫలపుష్పం తు మర్కటః | స్త్రియం హృత్వా భ##వేద్యక్షో యానముష్ట్రః పశూ నజః ||

యద్వా తద్వా పరద్రవ్య మపహృత్య బలాన్నరః | అవశ్యం యాతి తిర్యక్త్వం జగ్ధ్వా చైవాహుతం హవిః ||

తిర్యక్షు దుఃఖం పరమం విదిత్వా పాపాని వర్జ్యాని నరేణ నిత్యమ్‌ |

భక్తిశ్చ కార్యా మధుసూదనస్య తయా స దుఃఖం సకలం జహాతి || 27

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే తిర్యగ్యోని వర్ణనం నామ వింశుత్యుత్తర శతతమో7ధ్యాయః || 120

ధర్మజ్ఞా! నరకమందుండు నరులే కర్మము నొనరించి యేయే పశుపక్ష్యాది జన్మములందుదురో తెలుపుమన పుష్కరుం డిట్లనియె. మహాపాతకులు అశుద్ధమందు కృములయి భూమిం జన్మింతురు. అటుపై రాళ్ళు గడ్డి పూలగుత్తి తీగపొద చెట్లుగా వర్లుసగా పుట్టుదురు. ఆపై బోయలవలన భయపడు జంతువులయ్యెదరు, బ్రాహ్మణద్రవ్యమును హరించినవాను ఘోరాటవులందు బ్రహ్మరాక్షసులుగ జన్మింతురు, పరదారరతులు మూఢులు భూమిపై తొండలైపుట్టి ఆమీద పిశాచము లగుదురు. ఆమీద ఘోరాటవులందు ఎండిన చెట్టు తొఱ్ఱలో నల్లత్రాచులయ్యెదరు. అబద్దసాక్ష్యమిచ్చినవా రమేధ్యమందు పురుగులయ్యెదరు. అటుపైని జనిపోయి పాములైయవ్వల పిశాచములగుదురు. గురుమిత్రద్రోహులు స్వామిద్రోహులు (స్వామి=రాజు యజమాని) బ్రహ్మణశిష్యద్రోహము సేసిన వాండ్రు కృతఘ్నులు నాస్తికులు బంధువులను శరణార్థుల వదలిపెట్టినవాండ్రు ధనము పాదులను హరించిన వారు కన్యా విక్రయులును అమేధ్యమందు క్రిములు పాములు మృగములు జంతువులు క్రూరజంతువులు క్రూరస్వభావముగల నక్కలునై పుట్టుదురు. పరధనముహరించినవారేనుగులు గుఱ్ఱములు పక్షులు ఎడ్లు ఒంటెలునగుదురు. సందేహములేదు. ఎవ్వరెవ్వని సొత్తును హరింతురో వారు వారాహరించిన ధనము మొత్తము ననుసరించి తానుజేసిన దొంగతనము ననుసరించి యాసొమ్మును లెక్కనుబట్టి ద్రవ్యమందురన్నమాట. సూర్య చంద్ర గ్రహణములందు భుజించివారెనుగులయ్యెదురు. ఆమశ్రాద్ధమందు భోజనము సేసినవారు (భోక్తలన్నమాట) గ్రద్ద జన్మమెత్తెదరు (ఆమ శ్రాద్దము=పచ్చిపదార్థములతో పెట్టు శ్రాద్ధము.) దుర్దానములు పట్టి కోతులగుదురు. ఆశ పెట్టి భంగముసేసిన యధములు నక్కలగుదురు. సూచకుడు కొంéడెములు చెప్పువాడు చిరకాలము బోయవాడై పుట్టునని శ్రుతి=వేదవచనము. ఎన్ని జంతువులం గోసిమాంసము నెవ్వడు తినునో అన్ని జంతుయెనులందును వాడు మఱి మఱి జన్మించును. బహిర్వేదియందు (యజ్ఞవేదికి వెలుపల=యజ్ఞములందుదప్పి) వేఱుచోట్ల నెన్నిప్రాణులం జంపి మాంసముందినునో అన్ని యోనులం దును వాడు జన్మమెత్తవలసియుండును. ఆ యెత్తిన ప్రతిజన్మమందు వాడు దానిచే చంపబడుచునే యుండును. సంశయములేదు. కక్కినకూడుదిన్నవాడు శవములం బీకుకొని తిన్నవాడు రక్తముద్రావినవాడు సర్వకర్మభ్రష్టులై వర్ణభ్రష్టులై ప్రేతజన్మమెత్తుదురు. (భూత ప్రేత పిశాచములను వానిలోనిది ప్రేతము) ధాన్యము హరించి ఎలుకయగును. కంచుదొంగిలించిన వాడు నీటిలో నీటిహంస యగును. తేనెను హరించి తేనెటీగయు పాలుహరించి కాకియు రసముంగాజేసి కుక్కయు నెయ్యిదొంగిలించి ముంగిసయునగును. పట్టును హరించి తిత్తిరిపక్షి (తీతువు) క్షౌమము=నార పట్టుహరించి కప్చయ దూదిని-నూలు బట్టలు గాజేసినవాడు క్రౌంచపక్షిగను గోవును హరించినవాడు ఉడుముగను బెల్లము మ్రుచ్చిలిచినవాడు వాగురముగాను పరిఘళద్రవ్యములను గంథాదులహరించినవాడు చంచుగా జనించును. ఆకుకూరలు హరించి నెమలి అన్నము హరించి యీగ అకృతాన్నము=అపక్వాన్నమును, ఉడికింపని పదార్ధము హరించిన వాడు ముళ్ళపందిగను అగ్నిని హరించి కప్పగను ఇల్లుకాజేసి దొంగగను ఎఱ్ఱని వస్త్రములం దొంగిలించి జకోపక్షిగనునగును. మృగము నేన్గులహరించి తోడేలు పండ్లు పువ్వులను మ్రుచ్చిలించి కొండముచ్చు స్త్రీని హరించి యక్షుడు (దయ్యములలో రకము) యానము (వాహనము) హరించి ఒంటెయు పశుహర్త మేకయు నగును. ఎట్లైన పరుల సొత్తును బలాత్కారముగ దోచికొన్నవాడు అగ్నికి హోమము సేయని హవిస్సును దిన్నవాడు తప్పక పశుపక్ష్యాది జన్మమెత్తును. పశుపక్ష్యాదులందు దుఃఖమెక్కువయని యెఱింగి మానవుడు పాపము సేయుటను మానవలెను, మఱియు మధుసూదనునిపై నిరంతర భక్తి నొనరింపవలెను. ఆ విష్ణు భక్తిచే సకల దుఃఖముంబాయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమందు తిర్యగ్యోనివరనమను నూటయిరువదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters