Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదనాలుగవ అధ్యాయము - సంభవ వర్ణనము

పుష్కరః- జీవః ప్రవిష్టో గర్భే తు కలలం ప్రతితిష్టతి | మూఢస్తు కలలే తస్మిన్‌ మాసమాత్రం హి తిష్ఠతి ||

ద్వితీయం తు తథా మాసం ఘనీభూత స్స తిష్ఠతి | తస్యావయవ నిర్మాణం తృతీయే మాసి జాయతే ||

త్వక్చర్మ పంచమే మాసి షష్ఠే రోవ్ణూం సముద్భవః | సప్తమే చ తథా మాసి ప్రబోధ శ్చాస్య జాయతే ||

సజీవోపి హిమాండూకః శీతే శీతార్దితో భ్యసుః | మూఢ స్తిష్ఠతి ధర్మజ్ఞః షణ్మాసాన్‌ గర్భగ స్తథా ||

మాతు రాహారపీతం తు సప్తమే మాస్యుపాశ్నుతే | అష్టమే నవమే మాసి భృశ ముద్విజతే తథా ||

జరాయు వేష్టితో దేహో మూర్ధ్ని బద్ధాంజలి స్సదా | మధ్యే క్లీ బస్తు వామే స్త్రీ దక్షిణ పురుష స్తథా ||

తిష్ఠత్యుత్తర భాగే తు పృష్ఠస్యాభిముఖ స్తథా | యస్యాం తిష్ఠతి తాం యోనిం తదా వేత్తిన సంశయః ||

సర్వం స్మరతి వృత్తాంతం త్వారభ్య జన్మత స్తథా | అంధకారే చ మహతి పీడాం విందతి భార్గవః ||

కీట గంధేన మహతా కల్మషం విందతే పరమ్‌ | మాత్రానీతే జలే పీతే పరం శీత ముపాశ్నుతే ||

ఉష్ణే భుక్తే తథా దాహం పర మాప్నోతి భార్గవః | వ్యాధిభిః పరమాం పీడాం తీవ్రాం ప్రాప్నోతి దుస్సహాం ||

వ్యాయామే చ తథా మాతుః క్లమం మహా దుపాశ్నుతే | వ్యధితాయాం తథా తీవ్రాం వేదనాం సముపాశ్నుతే ||

భవన్తి వ్యాధయ శ్చా స్య తత్ర ఘోరాః పునః పుంః | నచ మాతా పితా వేత్తి తథా కశ్ఛి చ్చికిత్సకః ||

పుష్కరుడనియె. జీవుడు తల్లి గర్భమందు జేరి మావి రూపమున నొక్క నెల యేమియుం దెలియనివాడై యుండును. రెండవ నెలలో గట్టిపడి యుండును. మూడవనెలలో నవయవము లేర్పడును. తొక్కతోలును నైదవ నెలలో రోమమూలారవ నెలలోను తెలివి యేదవ నెలలోను ఏర్పడును. ఆ జీవుడు కప్పవలె చలికి బాధపడుచు ప్రాణ మాత్రమున మూఢుడై యాఱు మాసములు కడుపులో పండుకొని యుండును. తల్లి తిన్న ఆహారామును ద్రావిన నీటిని నేడవ నెలలోదాననుభవించును. ఎనిమిది తొమ్మధి నెలలలో మిక్కిలి యాందోళన పడుచుండును. మావితో జుట్టుకొని నడి నెత్తిం జేతులు మొగిచికొనియుండును. కడుపు మధ్య మందు నపుంసకుడు ఎడమవైపున స్త్రీ, కుడివైపున పురుషుడును నుండును. ప్వష్ఠము వైపు మొగమై కడుపు నుత్తర భాగమందుడును. తానిపుడేయోని యందుండెనో దాని నీతండెఱింగి యుండును. సందేహము లేదు. జన్మ వృత్తాంతము, గూడ జ్ఞప్తి సేసికొనును. కారు చీకటిలో బాధపడుచుండును. పురుగుల వాసనచే మిక్కిలి కల్మషము నందును. తల్లి గొనివచ్చిన నీరు త్రావగా మిక్కిలి చలికి గురియగును. వేడి పదార్థము తిన్నచో విపరీత దాహమందును. వ్యాధులచేత మిక్కిలి తీవ్ర వేదన బొందుచుండును. తల్లి శ్రమ పడుచుండ నా ప్రాణి మిక్కిలిగ శ్రమపడును. ఆమె వ్యధపడునపుడాశిశువు తీవ్రవేదన బొందును. అపుడా జీవికి ఘోరమైన వ్యాధులు తిరిగి తిరిగి వచ్చుచుండును. కాని వానిని తల్లి గుర్తింపలేదు తండ్రి యెఱుంగడు, మరియే వైద్యుడు నెఱుంగలేడు.

సౌకుమార్యా ద్రుజంతీవ్రాం జనయన్తి తు తస్యతాః | ఆధిభి ర్వాథ్యిభి శ్చైవ పీడ్యమానస్య దారుణౖః ||

స్వల్ప మప్యధ తత్కాలం యాతి వర్షశతోపమమ్‌ | సంతప్యతే తథా గర్భే కర్మభి శ్చ పురాతనైః ||

మనోరథాని కురుతే సకృతార్థం పునః పునః | జన్మ చే దహ మాప్స్యామి మానుష్యే దైవయోగతః ||

తతః కర్మ కరిష్యామి యేన మోక్షో భ##వే న్మమ | నాస్తి మోక్షం వినాసౌఖ్యం గర్భవాసే కథం చన ||

గర్భవాస శ్చ సుమహ ల్లోకే దుఃఖైక కారణమ్‌| ఏవం విచిన్తయానస్య తస్య వర్ష శతోపమమ్‌ ||

మాసత్రయం తద్భవతి గర్భస్థస్య ప్రపీడ్యతః | తతస్తు కాలే సంపూర్ణే ప్రబలై స్సూతి మారుతైః ||

భవ త్యవాజ్ముఖో జంతుః పీడామనుభవన్‌ పరామ్‌ | అధోముఖ స్సంకటేన యోనిద్వారేణ వాయునా ||

నిస్సార్యతే బాణ ఇవ యన్త్ర చ్ఛిద్రేణ సజ్జ్వరః | యో నిష్కరమణా త్పీడాం చర్మోత్కర్తన సన్నిభామ్‌ ||

ప్రాప్నోతి చ తతోజాతః తీవ్రం శీత మసంశయమ్‌ || జన్మ జ్వరాభి భూతస్య విజ్ఞానం తస్య నశ్యతి ||

కర సంస్పర్శనా న్మాతుః నచ జానాత్యసౌ తదా | కరపత్రస్య సంస్పర్శాత్‌ మాసమాత్రం విమోహితః ||

సంభవ మేతత్‌ గర్భే ప్రోక్తం జంతోర్మయా తుభ్యమ్‌ | శ్రమతో వచ్మితవా హం తత్సత్యం బ్రూహి ధర్మజ్ఞ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే సంభవవర్ణనం నామ చతుర్దశోత్తర శతతమోధ్యాయః || 114

మిక్కిల సుకుమార (సున్నిత) స్థితిలో నుండుటచే నా శిశువున కా వ్యాధులు మానసిక బాధలు మిక్కిలి వేదనను గల్గించుచుండును. అత్యల్పమైన యా తర్బ నివాస కాలమును వందల కొలది యేండ్లుగా గడుపుచుండును. వెనుకటి జన్మమునం జేసికొన్న కర్మములచే మిక్కిలి తపించుచుండును. నాకు దైవ యోగమున మనుష్య జన్మ వచ్చెనేని ఇక మీద పుణ్యమునే చేయుదునని మఱి మఱి యుబలాట పడుచుండును. ఆ మనుష్య జన్మమందు మోక్ష సాధనమైన కర్మమే నేనొనరింతుననుకొనుచుండును. గర్భవాస మందు మోక్షము లేనిదే సుఖము లేదు. లోకమందు గర్భవాసము దుఃఖమున కేకైక కారణము. ఇట్లాడుకొనుచుండ వాని కా మూడు మాసములు నూరేండ్లుగ దోచును. ఆ విధముగ మూడు మాసములా బాధపడు కాలము నిండగా ప్రసూతి వాయువులచే క్రిందు మొగమై గొప్ప పీడననుభవించుచు నిరుకైన యోని ద్వారమున వాయువుచే వింటి నుండి విసరబడిన బాణమట్లు యోని రంధ్రము నుండి మిక్కిలి యోత్తిడికి గురియై చర్మము కత్తిరించినపుడు గలుగు నంతటి బాధకు వశ##మై జ్వరముతో వెలివడును. పుడమింబడిన వెంటనే తీవ్రమైన చలికి గురియగును. జన్మ (పుట్టుక) జ్వరమునకు వశుడైయున్న యీ జీవికి గడుపులో నంతకుమున్న గల విజ్ఞానము నశించును. తల్లి యొక్క కర స్పర్శమున నొక్క నెల రోజులు మోహితుడై కత్తి స్పర్శను కూడ గుర్తించడు. ధర్మజ్ఞుడా! జీవి గర్భమునందు సంభవించుటను చెప్పితిని. క్రమముగ నీకేమి చెప్పవలెనో చెప్పుము.

ఇది విష్ణు ధర్మోత్తర పురాణము ద్వితీయఖండమున సంభవ వర్ణనముఅను నూట పదునాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters