Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదకొండవ అధ్యాయము - పాపనిశ్చయము

రామః- భగవన్‌ ! శ్రోతు మిచ్ఛామి పాపానాం కర్మణాం ఫలమ్‌ | త్వత్తః కమల పత్రాక్షః తన్మమాచక్ష్వ పృచ్ఛతః ||

పుష్కరః- భుక్త్వైవా న్న మభోజ్యం తు నరకం యాతి మానవః | వ్రతలోపే తదర్ధం చ ప్రకీర్ణే తు దశాహకమ్‌ ||

అగ్నిహోత్ర సమిధ్యాదీన్‌ సహస్రం యాతి వత్సరాన్‌ | మహా పాతకిన స్సర్వే కల్పం పశ్యన్తి భార్గవ! ||

మన్వంతరం ద్విజం హత్వా నరకం ప్రతిపద్య | చతుర్యుగం క్షత్రియహా వైశ్యహా త్రి యుగం తథా ||

శూద్రం హత్వా మహాభాగ! యుగం తు నరకం ప్రజేత్‌ | యావన్తి పశురోమాణి తావ త్కృత్వే హ మానవః ||

వృధా పశుఘ్న: ప్రాప్నోతి వర్షాణి నరకం నరః | ద్రవ్యాణా మాత్తసారాణాం స్తేయం కృత్వాన్య వేశ్మతః ||

యాతి సంవత్సరశతం గురు భ్రాహ్మణ తాడనాత్‌ | తచ్ఛాస్త్ర వర్తీ నృపతిః కల్పం పశ్యతి మానద! ||

పక్షపాతీ తథా సభ్యస్తావ దేవ భృగూత్తమ! | బ్రాహ్మణస్య చ శూద్రస్య సహస్రం భృగునత్తమ! ||

శోణితం యావతః పాంసూన్ని గృహ్ణాతి మహీతలే | తావద్వర్ష సహస్రాణి నరకం ప్రతి పద్యయేతే ||

రాజని ప్రహరే ద్యస్తు కృతగామ్యాతి దుర్మతిః సరాజా నరకం యాతి స తు కల్పశతం నరః ||

నిత్యా న్యకుర్వన్‌ కర్మాణి తథా వర్షశతం వ్రజేత్‌ | ద్రుమాణాం ఛేదనే రామ! పంచా శద్వర్షమేవ తు ||

గుల్మ వల్లీ లతానాం తు దశ వర్షాణీ భార్గవ! | అనాగసా మధా೭೭క్రోశే తిరశ్చా మూధతాడనే ||

తావదేవ యధాకాలం నరకం ప్రతి పద్యతే |

పరుశురాముడు పాపకర్మల ఫలముం గూర్చి వినగోరెద నానతిమ్మన పుష్కరుండనియె. మానవుడు కుడువరాని కూడుకుడిచిన నరకమందును. బ్రహ్మచిర్యా కృతలోపమున పైదానిలో సగము, సాంకర్యమున పది దినములు నరకము నందూరు అగ్నిహోత్ర సమిధాదుల నపహరించి వేయి సంవత్సరములు, మహాపాతకిలు అల్పకాలమున నరకమందుదురు.

పంచ మహాపాతకులు (బ్రహ్మహత్య కల్లుత్రాగుట బంగారము దొంగిలించుట గురుఛార్యా గమనము, ఈ పనులు చేసిన వానితో సహవాసము చేసిన వాండ్రు) ఒక కల్పకాలము నరక మనుభవింతురు. బ్రహ్మహత్య చేసినవాడు మన్వంతర కాలము క్షత్రియ హంత నాల్గు యుగములు వైశ్యవధ చేసిన వాడు మూడు యుగాలు శూద్రుంజంపిన వాడు ఒక్క యుగము నరక మందును. శాస్త్రవిధి లేకుండ పశువుం జంపిన వాడు ఆపశురోమము లెన్ని గలవో అన్ని సంవత్సరములు సారవంతములైన వస్తువుల పొరిగింటినుండి దొంగిలించినవాడు నూరేండ్లు నరక మందును. గురువులను బ్రాహ్మణులను గొట్టుటవలన గురుబ్రాహ్మణ శిక్ష చేయవచ్చునను శాస్త్రమును (చట్టమును) అనుసరించిన రాజూ కల్సకాలము నరకముంజూచును. సభలో పక్షపాతముగ మాట్లాడిన వాడును కల్పకాలము నరకమందును. బ్రాహణుని శూద్రుని కొట్టుట వలన కారిన రక్తమెన్ని మంటి రేణువులందడుపు నన్ని యేండ్లు నరకమందును. నిత్యకర్మాచరణ సేయని వాడు నూరేండ్లును చెట్లను నరికినవాడు ఏబది యేండ్లును పొదలు తీగలు నరికినవాడు పదియేండ్లు నరక మందును. నిరపరాధుల నేడిపించియు పశుపక్ష్యాదులంగొట్టియు నదేకాలము నరకమందును.

అగమ్య గామిన స్సర్వే మహా పాతకిభి స్సమాః |

అనివిష్ఠాం భృతం భుక్త్వా ద్వేశ##తే ప్రతిపద్యతే | తథా పుస్తకహారీ చ సహాస్రం యాతి వత్సరాన్‌ ||

సస్యానాం నాశకారీ చ నరకం ప్రతి పద్యతే| అగారవన దాహీ చ నాస్తికశ్చ తథా నరః||

కల్ప మేకం ప్రవద్యన్తే నరకం నాత్ర సంశయః | దేవతానాం ద్విజాతీనాం శాస్త్రాణాం నిందక స్తథా ||

కల్ప మేకం ప్రపద్యన్తే నరకం నాత్ర సంశయః | దేవతానాం ద్విజాతీనాం శాస్త్రాణాం నిందక స్తథా ||

శ్రుతీనాం దూషక శ్చైవ తావదేవ ద్విజోత్తమ! ప్రతిశ్రుత్య తధా చూర్ధం యో న దద్యాన్మహాభుజ! ||

ఆశ్రితస్య ప్రరిత్యాగం వృధా కుర్యా ద్విజోత్తమ! అపరాధం వినా రామ వృధా భార్యావ మంతకః ||

క్రతు హా చైవ ధర్మజ్ఞ! సహస్రం ప్రతి పద్యతే | బహూని రామ పాపాని పాపే షూక్తేషు భార్గవ! ||

అంతర్భావం ప్రపద్యన్తే తాని చింత్యాని ధర్మతః ||

నరకాణాం గణన ముదితం పాపానాం తేమయా రామ! ఏత చ్చ భవతి ఘోరం త్వనుబంధ కృతం మనుష్యాణామ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర ద్వితీయఖండే పాపనిశ్చయో నామ ఏకాదశోత్తర శతతమోధ్యాయః || 111

ఆగమ్య గమనము చేసిన వాండ్రు (కూడరాని స్త్రీని గూడినవాడ్రు) మహాపాతకులు పొందు నరకమందుదురు.

తనకు నిర్ణయించని జీతమును అనుభవించిన వాడు రెండువందల సంవత్సలములు పుస్తకములను గాజేసిన వాడు వేయేండ్లు నరకమందును. పంట పాడు చేసినవాడు నరకమున కేగెను. ఇండ్లకు వనములకు నిప్భు పెట్టిన వాడు నాస్తికుడు నొక్క కల్పము నరకమందును. దేవతలను విప్రులను శాస్త్రములను నిందించువాడు వేదనింద చేయువాడు గూడ కల్పకాలము నరక మందును. ఇత్తుననిన యర్థమీయని వాడు ఆశ్రయించు కొని యున్న వానిని వృధాగా పొమ్మనిన వాడు భార్యను అవమానించిన వాడు నరకమందును. పాపములనేకములీ చెప్పిన పాపములతో నంతర్భావము నందును అనగా నింకను పెక్కలు చెప్పవలసిన వున్నవి. ధర్మ శాస్త్రముద్వారా వానిని విమర్శ చేసి కొన వలెను.

రామా! పాపములు వాని వలన వచ్చు నరకముల లెక్క నీకు దెల్పితిని. ఈ పాపములు చేసిన వారితోడి అనుబంధము అనగా కలయిక కూడా ఘోరమైన పాపమేయగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున పాపనిశ్చయమను నూటపదునొకండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters