Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఆరవ అధ్యాయము-మహేశ్వరస్నానవిధి

పుష్కర ఉవాచ: స్నాన మన్య త్ప్రవక్ష్యామి తవాహం దురితాపహమ్‌ | దానవేంద్రాయ భువనే యజ్జ గాదోశనాః పురా||

ధన్యం యశస్యమాయుష్యం సర్వశత్రుక్షయంకరమ్‌ | ప్రభాతాయాంతు శర్వర్యాం భాస్కరే7నుదితే తథా ||

స్నాయీత భార్గవ శ్రేష్ఠ! విధిదృష్టేన కర్మణా | సౌవర్ణం రాజతం కుంభ మథవాపి మహీమయమ్‌||

నాదేయైః సాగరైస్తోయైః కల్పయిత్వాయథావిధి | ఓషధీర్విన్య సేత్తత్ర సమభాగాః సుచూర్ణితాః ||

జయా చ విజయా చైవ తథా సూక్ష్మఫలాని చ | ప్రసన్నముఖ బీజాని భాండీర కుసుమాని చ ||

క్షీరజాపత్ర నిర్మాల్యం దేవీ నిస్సారమేవ చ | కల్లీవరాంగనా చైవ గజేంద్రస్య చమంజరీ ||

క్షుద్రజం కరజం చైవ ధనే ద్వేద్వే విభావరీ | మహౌఘం పూర్తగం చైవ భువం యక్షభువం తథా||

శశాంక మృగదర్పం చ దానం చ కరిణస్తథా | ఓషధ్యః కథితాస్తుభ్యం దానే మంత్రమతః శృణు ||

(ఓంనమో భగవతే రుంద్రాయ ధవలపాండు రోపచితభస్మాను లిప్తగాత్రాయ || తద్యథా|| జయ జయ! విజయ విజయ!

సర్వాన్‌త్రూశనముకస్యకలహ విగ్రహ వివాదేషు భంజ భంజ! మథమథ! సర్వత్ర ప్రత్యక్షికాం యో7సౌయుగాంతకాలే

దధ్యక్షతైరిమాం పూజాం రౌద్రీమూర్తి సహస్తాం సుసత్త్వాం రక్షతు జీవికాం సంవర్తకాగ్నితుల్యశ్చత్రిపురార్తికరఃయః

సర్వదేపమయః సో7పి తవరక్షతు జీవితం నిఖి నిఖి నిఖి స్వాహా||)

ఏవం స్నాతస్త్వనేనైవ గాత్రేణ తిల తండులమ్‌ | ఘృతాక్తం జ్వలితే వహ్నౌజుహుయాత్ప్రయతః సదా ||

తతః సంపూజనం కుర్యాద్దేవదేవస్య శూలినః | ఘృతక్షీరాభిషేకేణ గంధపుష్ప ఫలాక్షతైః ||

ధూపదీప నమస్కారైస్తథా వాన్నేన భూరిణా | గీతవాద్యైః సుమధురైర్బ్రాహ్మణస్వస్తివాచనైః ||

మహేశ్వరస్నాన మిదం హికృత్వా రక్షోహణం శత్రునిబర్హణంచ | కామానవాప్నోతి

నరస్తు సర్వా న్యాన్రామ! కాంశ్చిన్మన సేచ్ఛ తీతి||

ఇతి మహేశ్వరస్నానవర్ణనం నామషడుత్తరశతతమో7ధ్యాయః||

పుష్కరుడనియె:- శుక్రాచార్యులు బలిచక్రవర్తికిం దెల్పిన మఱియొక స్నానవిధిం దెల్పెదనది సేసిన ధన్యతనుయశస్సును ఆయుష్యమును శత్రుక్షయమును చేయును. సూర్యోదయమునకు ముందు శాస్త్రోక్తవిధి నిది సేయవలెను. బంగారము వెండి లేదా మట్టితో జేసిన కుంభమునందు నదులు సముద్రములయ జలములను నించి ఓషధులను గుండగొట్టి సమభాగములుగందున వేయవలెను. ఆ ఓషదులు జయ గరికలు=నెల్లి విజయ=పెద్ధ మాదీఫలము ద్రాక్ష మొదలయిన చిన్న రకముపండ్లు ప్రసన్న ముఖములయిన నవధాన్యాలు భాండీర పుష్పములను (దీనికి భాట్‌ అని హిందీ పేరు) పాలచెట్ల ఆకులు మేడి రాని జిల్లేడు దేవీ=సుగంధి నిస్సారము=లొద్దుగ నివ్మాల్యము శివనిర్మాల్యమును లేదా దర్భలు స్పృక్క బ్రాహ్మి మాలతి చామంతి కల్లి (కల్కి) తాని చెట్టు ఆకులు పరాంగన=దాల్చినచెక్క ప్రేంకణము=ఆరెపవ్వు లేదా పిప్పలి నల్ల సుగందియును, మంజరి గంధి తులసి, తులసి, అశోకము. క్షుద్రజము క్షుద్రజాతిఫలము (కాష్టదాతి) కరజము కానుగు గజేంద్రము గుండ్రముల్లంగి రెండు రెండు ధనములు ధనియాలు విభావరి పసుపు మహేజము (తేజోవతి పాఠతీగ) పూరకము మదిఫలము ఆకులు భువము పట్టిక, యక్షభువము మఱ్ఱి ఆకులు శశాంకము పచ్చ కర్పూరము కస్తూరి కరిదానము ఏనుగు మదము? (కరిదమనము నాగదమనమేమో) ఈ స్నానము సేయుట కుపయోగింపవలసిన మంత్రము శ్లోకరూపము మూలములో చూడనగును. మంత్రార్థము సుగమమే. ఈ మంత్రముతో స్నానమాచరించి నువ్వులు బియ్యము నేతితో దడిపి హోమము సేయవలెను. ఆమీద దేవ దేవుని శూలపాణిని ధూపదీప నైవేద్యాదులతో బూజించి పంచ భక్ష్య పరమాన్నములను నివేదింపవవెను. నుమధుర గీతవాద్యములతో బ్రాహ్మణ స్వస్తి వాచనములతో నీ మహేశ్వర స్నానము చేసినయెడల నిదిరక్షోఘ్నము. సర్వాభిష్టదమును నగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ద్వితీయఖండము మహేశ్వరస్నానవిధియును నూటఆరవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters