Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటమూడవ అధ్యాయము - బార్హస్పత్యస్నానము

పుష్కర ఉవాచ || చంద్రమండల వృద్ధౌ తు తథా చైవోత్తరాయణ|| శుభే దివస నక్షత్రే ముహూర్తే చ తథా శుభే ||

తిష్యాశ్వినగతే చంద్రే హస్తశ్రవణ గే7పిచ | ప్రాచీం వాప్యధ వోదీచీం నిష్క్రమ్య నగరాద్దిశమ్‌ ||

వాస్తు విద్యావి నిర్దిష్టే భూమి భాగే మనోహరే | అష్టహస్తం శుభంకుర్యా చ్చ తురస్రం చ మండలమ్‌ ||

బల్యర్ధమ పరం కుర్యాద్వహ్ని వేద్యర్ధమేప చ | గోషుయే నోపలిప్తేతు సుధాలేఖా సమన్వితే ||

ధ్వజాతపత్రవ్యజనమాల్యదామకు శాక్షతైః | లాజాగన్దాదిభిర్ముఖ్యై ర్మాంగల్త్యెస్తం సమర్చయేత్‌ ||

తాజాలాజోప కరణౖ స్తథైవ చ విభూషయేత్‌ | తతః ప్రస్రవణభ్యస్తు చతుర్భ్యస్తు ఘటాన్నవాన్‌ ||

ప్రత్యేకం కల్పయే ద్విద్వాన్‌ కల్పితే మన్డలద్వయే | సూక్తిష్వథ మహాభాగ బీజమాత్ర సమన్వితాన్‌||

తతస్తు కల్పయే త్కుంభా న్సప్త ముఖ్యాన్నదీ జలైః | సర్వౌషధియుతః కార్యః కుంభ ఏకోద్వి జన్మనా ||

సర్వబీజయతో ధాన్యరత్నో పేత స్తథా పరః | తథా చైవాపరం యుక్తం కార్యం వృక్షాగ్ర పల్లవైః ||

పుషై#్పశ్త్చె వాపరం యుక్తం ఫలై శ్త్చె వాపరం తథా | సర్వగంధ యుతం చాన్యం సర్వానేవ సమర్చయేత్‌ ||

పూర్వ మంత్రేణ చ తథా సర్వానేవాభి మంత్రయేత్‌ | తతో భద్రాసనం దత్వా తత్ర చర్మాస్తరేత్‌ బుధః ||

విప్రస్య స్నాతు కామస్య సౌరమార్షభకం శుభమ్‌ | క్షత్రియస్య తథా సైంహం వైయాఘ్రం చ తథా విశః ||

ద్వీపిచర్మ చ వైశ్యస్య స్నాప్యం తత్రోపవేశ##యేత్‌ | ప్రశస్త లక్షణాం భార్యాం వామభాగే తధైవ చ || 13

ఉపోషితః శిరః స్నాతః సిద్ధార్థెః కంకతం వినా | స్నాపయేద్బ్రాహ్మణో విద్వాన్‌ బహుభిర్‌ బ్రాహ్మణౖః సహా||

శంకపుణ్యాహ ఘోషేణ వీణావేణురవేణ చ | జయశ##బ్ణేన మహతావ న్దినాం విస్వనేన చ ||

సౌవర్ణం చ శతఛ్ఛిద్రం పాత్రం శిరసి ధారయేత్‌ | తత్ర దద్యాద్ఘటైస్తోయం క్రమేణానేన శాస్త్రవిత్‌ ||

యా ఔషధయ ఇత్యేషమంత్రః స్యాదౌషధీఘటే | ఆబ్రహ్మన్‌ బ్రహ్మణత్యేష బీజకుంభే ప్రకీర్తితః ||

ఆశుః శిశాన ఇతి చ తధారత్నఘటే భ##వేత్‌ | మంత్రః పుష్పవతీ త్యేష పుష్పకుంభే ప్రకీర్తితః ||

ఏషఏవ తథా మంత్రః ఫలకుంబే ప్రకీర్తితః | గంధద్వారేణ చ తథా గంధకుంభే విధీయతే ||

పుథ్కరునియె:- చంద్రమండల వృద్ధియందు (పూర్ణిమనాడు)ఉత్తరాయణమున శుభనక్షత్రదివసమందు శుభముహూర్తమున చంద్రుడు తిష్య=పుష్యమి అశ్వనిహస్త శ్రవణనక్షత్రములందున్న తఱితన నగరమునుండి తూర్చుగనో ఉత్తరముగనో వెళ్ళి వాస్తు శాస్త్రోక్తమైన చక్కని ప్రదేశమందు ఎనిమిది మూరలు పొడవు వెడల్పుగల చతురస్ర మండలము నేర్పరుపవలెను. బలి కోఱకు అగ్నికొఱకు రెండు వేదికలనేర్పరచి ఆవుపేడతో నలికి సున్నపు రేఖలతో నలంకరించి జెండాలు గొడుగులు విసనకర్రలు పూలమాలలు ధర్బలు నక్షత్రలు పేలాలు గంధము మున్నగు పూజాసామగ్రితో నామండలము బూజింపవలెను. అలంకరింపవలెను. నాల్గు ప్రస్రవణములందుండి (వాగులనుండి) కౌనివచ్చిన నీటితో నింపిన కుంభములను నయిమూలల నుంచవలెను. నవధాన్యములు మాత్రమేనించిన కడవలను సూక్తులందు నిలుపవలెను. పుణ్యనదీ జలములనింపిన యేడు కుంభములను మండపము చుట్టు నుంచవలెను. వానిలో వరుసగా సర్వౌషధులు నవధాన్యములు ధాన్యములు రత్నములు చిగుళ్ళు పువ్వులు పండ్లు నను ఏడు వస్తువులను నింప వలెను. ఒక దానిలో సుగంధ ద్రవ్యములన్నియు వేయవలెను. ఇంతమున్ను జెప్పిన మంత్రములతో వీని నభిమంత్రింపవలెను.పిమ్మట స్నానార్థము భద్రాసనమందు చర్మమును పరుపవలెను. బ్రాహ్మణునికి సౌరము (సూర్యదేవతాకమైవ) వృషభ చర్మముక్షత్రియినికి సింహ చర్మము వైశ్యునికి పులితోలు వానిపై స్నానము సేయవలసిన వారి వారిని కూర్చుండబెట్టి. స్నానము సేయింప వలెను. ఆ చేయించునపుడు ప్రశస్త లక్షణపతియగు భార్యను వామ భాగమందు గూర్చుండబెట్టవలెను. స్నానము చేయునతుడు ఆవాలు వేసిన నీటితో తలపాగ, కిరీటము మొదలయినవి లేకుండ స్నానము సేయవలెను. విద్వాంనుడగు బ్రాహ్మణుడు పెక్కుమంది బ్రాహ్మణులతో స్నానము గావింపవలెను, శంఖములూదవలెను. పుణ్యాహ ఘోషము చేయవలెను. వీణావేణు మృదంగాది నాద్యములు మ్రోయవలెను, వందిమాగధులు జయ జయ ధ్వానము సేయచుండ నూరు రంధ్రములుగల బంగారు పాత్ర శిరస్సుపై నుంచి దానియందు కడవలతో నీక్రింది వరుసలో శాస్త్ర మెఱిగి నీరునింపి యభిషేకము సేయవలెను. ఓషధులు వేసిన కుంభముతో నబిషేకించునపుడు ''యా ఔషధయః'' అను మంత్రము బీజములు నింపిన ఘటమునందు ''అబ్రాహ్మన్‌ బ్రాహ్మణ'' అను మంత్రము ''ఆశు శ్శీశాన'' యను మంత్రము రత్న ఘటము నందును, ''పుష్పవతీ'' అను మంత్రమును పుష్పములు నింపిన కుంభము నందును, సంపుటీకరింపవలెను. ''ఏష ఏవ తథా'' అను మంత్రము పండ్లు వేసిన కుంభము నందును, ''గంధద్వారాం'' అనునది గంధము వేసిన బిందె యందునుపయోగించవలెను.

ఏవం స్నాతః పరీధాయ సుశుక్లేవాససీ శుభే | మాంగల్యాని స్పు%ృశేద్రామ సంపశ్యేద్వదనం ఘృతే ||

విమలే చ తథాదర్మే తతః సంపూజయేద్ధరిమ్‌ | వైష్ణవాంశ్చ తథా మంత్రాన్‌ జుహుయా జ్జాతవేదసి ||

తతస్తూత్తరదిగ్భాగే వహ్నిం తస్యోప కల్పయేత్‌ | భద్రాసనం శుభే దేశే యుక్తం పూర్వోక్త చర్మణా ||

శ్వేతాను లేపనః స్రగ్వీ మాంగల్యాభరణ స్తథా | నివేశితాసనే తస్మిన్యభార్యో భృగునంథన ||

గంధద్వారేతి మంత్రేణ తస్యరోచనయా తతః | కంఠేమూర్ధ్ని తతః కుర్యాత్తిలకం బ్రాహ్మణః స్వయమ్‌ ||

యేనదేవా జ్యోతిషేతి దర్భాగ్రైః బ్రాహ్మణ స్తతః | పాదతస్తు ప్రభృత్యేనం సర్వాంగేషు ప్రమార్ఞయేత్‌|| 25

గురవే దక్షిణాం దద్యాద్‌ బ్రాహ్మణభ్యశ్చ శక్తితః | గంధరత్నాజ్య మాల్యాని కనకం రజతం తథా ||

శతఛ్ఛిద్రం చ తత్పాత్రం గురవే వినివేదయేత్‌ | మంగాలా లమ్భనం కృత్వా గతపాపో ద్విజాశిషా ||

శంఖపుణ్యాహ ఘోషేణ ప్రవిశే చ్చ గృహం స్వకమ్‌ | వినాపి భార్యయా రామ స్నానం కార్యమిదం తథా ||

సప్త రాత్రమిదం స్నానం సర్వ కల్మషనాశనమ్‌ | మధుమాంసం తథా క్షౌద్రం మైథునం చ వివర్ఞయేత్‌ ||

అలక్ష్మీ శమనం పుణ్యం రక్షోఘ్నం బుద్ది వర్ధనమ్‌ | ఆరోగ్యదం దీప్తికరం యశస్య శత్రుసూదనమ్‌ ||

మంగల్యం పాపశమనం కలిదుస్వప్న నాశనం | బ్రహస్పతిరిదం చ క్రే స్నానం మఘవతః స్వయమ్‌ ||

బ్రహ్మహత్యాభిభూతస్య వృత్తే వృత్రవధే పురా ||

తతో7స్య దత్తః స్వయమేవ వజ్రిణావరో నృలోకేపి వరో7స్య కారకః | 32

కామానభీష్టాన్ప మవాప్య పూజితో మహేంద్రలోకం స సుఖీ ప్రయాస్యతి ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామంప్రతి పుష్కరోపాఖ్యానే

బార్హసృత్యస్నాన వర్ణనన్నామ త్య్రుత్తరశ తతమో7ధ్యయః ||103||

é ఇట్లు స్నానమయిన తర్వాత తెల్లని శుభ వర్ణములైన వస్త్రములు ధరించి మంగల్యములయిన అద్దము, వీణ మొదలైన వస్తువులను తాకవలెను, తన ముఖము ఆవునేతిలోను, నద్దమందు దిలకింపవలెను. అవ్వల విష్ణు పూజగావింపవలెను. విష్ణు దేవతకాములయిన మంత్రముతో అగ్నియందు హోమము సేయవలెను. ఆ మంటపమునకు నుత్తరదిశయందగ్ని ప్రతిష్ఠ సేయవలెను. ఓ పరుశురామా! అవ్వల మున్ను జెప్పిన చర్మము పరచిన భద్రాసనమందు తెల్లని మంచి గంధము పూసికొని పూలమాలలు దాల్చి మంగళాభరణము లలంకరించుకొని పత్నితో గూర్చుండవలెను. ''గంధద్వారా'' అను మంత్రముతో పురోహిత బ్రాహ్మణుడు స్వయముగా గోరోచనముతో కంఠమందు నడినెత్తిని బొట్టు పెట్టవలెను. ''యేన దేవా జ్యోతిషా'' అను మంత్రముతో ధరాగ్రములతో పాదాది శిరః పర్యంతము మార్జనము సేయవలెను. అటుపై యజమాని గురువుగారికి విప్రులకును దక్షిణనీయవలెను, సుగంధములు, రత్నములు, మాలలు, నెయ్యి, బంగారము, వెండి మొదలయిన వానినీయవవెను. శతచ్ఛిద్రములుగల యాయభిషేక పాత్రను గురువున కొసంగ వలెను. మంగళ వస్తువులను స్పృశించి బ్రాహ్మణాశీర్వాదములంది పాపముక్తడై శంఖఘోషము పుణ్యాహవాచనధ్వనిములంవినుచు స్వగృహమదు బ్రవేశింపనగును. ఒకవేళ ధర్మపత్ని దగ్గరలేకున్నను నీ స్నానము సేయవచ్చును. సప్తరాత్ర మీస్నానము సేసిన సర్వ పాపములు పోవును. ఈ సమయములందు కల్లు, మాంసము, తేనె, మైధునము నిషిడ్ధములు. ఈ శుభస్నానము అలక్ష్మీహరము రక్షోఘ్నము బుద్ధి వర్ణనము ఆరోగ్యప్రదము. కాంతికరము. కీర్తికరము, శత్రునాశకము, మంగళకరము, పాపహరము, కలిదోషదదుస్వప్నహారము, బృహస్పతి స్వయముగ నింద్రునకునీస్నానము శేయించెను. వృత్రవధ సేసినందువలన గలిగిన బ్రహ్మహత్య దోషము నింద్రుడు దీనిచే బోగొట్టుకొనెను. అందుచేత నింద్రుడీ స్నానమున కింత ప్రభావమును వరముగా దయచేసెను. కాన నిది మానవలోకమునగూడ నింత ఫలమిచ్చును. దీనినాచరించిన పుణ్యడిహలోకములం దబీష్టములన్నింటిని బొంది పూజితుడై సుఖముగ నింద్రలోకమునకేగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున బార్హస్పత్యస్నాన వర్ణనము అను నూటమూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters