Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఒకటవ అధ్యాయము - పుష్టికారక శ్రవణ నక్షత్రస్నానవిధి

రామ ఉవాచ | స్నానమస్యత్సమా చక్ష్వభగవన్‌ పుష్టికారకమ్‌ | యేన నిత్యంకృ తేనేహ పురుషః పుష్టిమాప్నుయాత్‌||

పుష్కర ఉవాచ || శ్రవణరక్ష మనుప్రాప్తే దేవ దేవే నిశాకరే | భక్త్యా సమాచరేత్న్సా నంనదీద్వితయసంగమే ||

నిమ్నగానాం సరసివా నదీ సాగర సంగమే | స్నాతః సంపూజయేద్దేవం విష్ణుం మాల్యానులేపనైః ||

ధూపదీప నమస్కారై స్తథా చైవాన్నసంపదా | శాల్యన్నం దధిసం యుక్తం విష్ణవే వినివేదయేత్‌ |

పౌరుషేణ చ సూక్తీన పాయసం జుహుయాత్తతః | రజతం దక్షిణాం దద్యా ద్బ్రాహ్మణాయ భృగూత్తమ||

ఉపవాసం వినాప్యేత త్న్సానం పుష్టిప్రదం పరమ్‌ ||

స్నాతః సమాప్నోతి సదా మనుష్యః కామానభీష్టాన్‌ శ్రవణరక్షయోగే |

పాపం సమస్తం విజహాతి రామ! ధర్మం సమాప్నోతి యశశ్చముఖ్యం ||6||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే మా.సం రామంప్రతి

పుష్కరో పాఖ్యానే పుష్టికారకశ్రవణస్నాన కథనన్నామై కోత్తరశతతమో7ధ్యాయః || 101

పరుశురాముడు పుష్టినిచ్చెడిస్నాన మింకొకటి తెల్పుమన పుష్కరుండిట్లనియె. శ్రవణనక్షత్రమును దేవదేవుడగు చంద్రుడు చేరగా భక్తిగొని రెండు నదులు లేక సాగరముకలిసినచచోట(నదీసంగమమందు)నదులలో లేక సరస్సులోస్నానముచేయవలెను. విష్ణువును గంధమాల్య ధూపదీపనమ స్కారామలతో అన్నసంపదతో బూజింపవలెను. పెరుగుతో కలిపిన శాల్యన్నము(బియ్యపన్నము)దధ్యో దనమును నివేదింపవలెను. తరువాత పాయసముమ పురుష సూక్తముతో హోమము సేయవలెను. వెండిని బ్రాహ్మణునకు దానమీయవలెను. ఉపవాసము చేయకపోయినను నీ స్నానము పుష్టినిచ్చును. శ్రవణ నక్షత్రస్నానము చేసిన యతడభీష్టములం బడయును. పాపమెల్ల బొవును. ఉత్తమకీర్తిశాలియగును.

ఇదిశ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున పుష్టికారక శ్రవణనక్షత్ర స్నానవిధి అను నూటయొకటవ యధ్యాయము

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters