Siva Maha Puranam-3    Chapters   

అథ చతుస్త్రింశో%ధ్యాయః

విష్ణువునకు సుదర్శన చక్రము లభించుట

వ్యాస ఉవాచ|

ఇతి శ్రుత్వా వచస్తస్య సూతస్య చ మునీశ్వరాః | సమూచుస్తం సుప్రశస్య లోకానాం హితకామ్యయా|| 1

వ్యాసుడు ఇట్లు పలికెను-

ఆ మహర్షులు ఆ సూతుని ఈ వచనమును విని ఆయనను అధికముగా కొనియాడి లోకముల హితమును కోరి ఇట్లు పలికిరి (1).

ఋషయ ఊచుః|

సూత సర్వం విజానాసి తతః పృచ్ఛామహే వయమ్‌ | హరీశ్వరస్య లింగస్య మహిమానం వద ప్రభో || 2

చక్రం సుదర్శనం ప్రాప్తం విష్ణునేతి శ్రుతం పురా| తదారాధనతస్తాత తత్కథాం చ విశేషతః ||3

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! నీకు సర్వము తెలియును. కావుననే మేము ప్రశ్నించుచున్నాము. ఓప్రభూ! హరీశ్వర లింగముయోక్క మహిమను గురించి చెప్పుము (2). ఓ తండ్రీ! పూర్వము విష్ణువు ఆ హరీశ్వరుని ఆరాధించి సుదర్శన చక్రమును పొందియున్నాడని మేము వినియుంటిమి. ఆ కథను వివరముగా చెప్పుము (3).

సూత ఉవాచ|

శ్రూయతాం చ ఋషిశ్రేష్ఠా హరీశ్వరకథా శుభా| యతస్సుదర్శనం లబ్ధం విష్ణునా శంకరాత్పురా|| 4

కస్మింశ్చిత్సమయే దైత్యాస్సంజాతా బలవత్తరాః | లోకాంస్తే పీడయామాసుర్ధర్మలోపం చ చక్రిరే||5

తే దేవా పీడితా దైత్యైర్మహాబలపరాక్రమైః | స్వం దుఃఖం కథయామాసుర్విష్ణుం నిర్జరరక్షకమ్‌ || 6

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! శుభకరముగు హరీశ్వరుని గాథను వినుడు. పూర్వము శంకరునినుండి విష్ణువు సుదర్శనమును పొందిన వృత్తాంతమును చెప్పెదను (4). ఒక సమయములో రాక్షసులు అధికబలమును పొంది లోకములను పీడిస్తూ ధర్మమునకు హానిని కలిగించిరి (5). మహాబలపరాక్రమములు గల రాక్షసులులచే పీడించబడిన దేవతలు దుఃఖమును దేవతలకు రక్షకుడగు విష్ణువుతో మొరపెట్టుకొనిరి (6).

దేవా ఊచుః |

కృపాం కురు ప్రభో త్వం చ దైత్యైస్సంపీడితా భృశమ్‌ | కుత్ర యామశ్చ కిం కుర్మశ్శరణ్యం త్వా ం సమాశ్రితాః || 7

దేవతలు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ ! నీవు దయను చూపుము మమ్ములను రాక్షసులు అత్యధికముగా పీడలకు గురిచేయుచున్నారు. మేము ఎక్కడికి పోవలెను? ఏమి చేయవలెను? శరణు జొచ్చిన వారికి రక్షించే నిన్ను ఆశ్రయించుచున్నాము (7).

సూత ఉవాచ|

ఇత్యేవం వచనం శ్రుత్వా దేవానాం దుఃఖితాత్మనామ్‌ | స్మృత్వా శివపదాంభోజం విష్ణుర్వచనమబ్రవీత్‌ || 8

సూతుడు ఇట్లు పలికెను-

దుఃఖముతో నిండిన హృదయములు గల దేవతల ఈ వచనములను విని విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (8).

విష్ణురువాచ|

కరిష్యామి చ వః కార్యమారాధ్య గిరిశం సురాః | బలిష్ఠాశ్శత్రవో హ్యేతే విజేతవ్యాః ప్రయత్నతః || 9

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! నేను కైలాసపతిని ఆరాధించి మీ పనిని చేయగలను. ఈ శత్రువులను బలవంతులు. వీరిని ప్రయత్నపూర్వకముగా జయించవలెను (9).

సూత ఉవాచ|

ఇత్యుక్తాస్తే సురాస్సర్వే విష్ణునా ప్రభవిష్ణునా | మత్వా దైత్యాన్‌ హతాన్‌ దుష్టాన్‌ యయుర్దామ స్వకం స్వకమ్‌ || 10

విష్ణురప్యమరాణాం తు జయార్థమభజచ్ఛివమ్‌ | సర్వామరాణామధిపం సర్వసాక్షిణమవ్యయయ్‌ || 11

గత్వా కైలాసనికటే తపస్తేపే హరిస్స్వయమ్‌| కృత్వా కుండం చ సంస్థాప్య జాతవేదసమగ్రతః || 12

పార్థివేన విధానేన మంత్రై ర్నానావిధైరపి | స్తోత్రైశ్చైవాప్యనేకైశ్చ గిరిశం చాభజన్ముదా|| 13

కమలైస్సరసో జాతైర్మానసాఖ్యాన్మునీశ్వరాః | బద్ధ్వా చైవాసనం తత్ర న చచాల హరి

స్స్వయమ్‌ || 14

ప్రసాదావధి చైవాత్ర స్థేయం వై సర్వథా మయా| ఇత్యేవం నిశ్చయం కృత్వా సమానర్చ శివం హరిః || 15

యదా నైవ హరస్తుష్టో బభూవ హరయే ద్విజాః | తదా స భగవాన్‌ విష్ణుర్విచారే తత్సరో% భవత్‌ || 16

సూతుడు ఇట్లు పలికెను-

సర్వసమర్థుడగు విష్ణువు ఇట్లు పలుకగా, ఆ దేవతలందరు దుష్టులగు రాక్షసులు సంహరించబడిరనియే భావించి తమ తమ ధామములకు వెళ్లిరి (10). విష్ణువు కూడ దేవతల జయము కొరకై సర్వదేవతాధిపతి, సర్వసాక్షి మరియు వినాశరహితుడు అగు శివుని సేవించెను(11) విష్ణువుస్వయముగా కైలాససమీపమునకు వెళ్లి కుండమును స్థాపించి దానియందు అగ్నిని ప్రతిష్ఠించి దానియెదుట కూర్చుని తపస్సును చేసెను (12). ఆయన పార్ధివవిధానముచే నానావిధములగు మంత్రములను పఠించి అనేక విధములగు స్తోత్రములతో ఆనందపూర్వకముగా కైలాసనాథుని సేవించెను (13). ఓ మహర్షులారా! ఆయన మానససరోవరములో పుట్టిన కమలములతో సేవించెను. విష్ణువు స్వయముగా ఆసనమును బంధించి అక్కడ నిశ్చలుడై ఉండెను (14). అనుగ్రహము లభించువరకు నేను ఎట్టి పరిస్థితులలో నైననూ ఇక్కడనుండి కదలరాదు అని ఈవిధముగా నిశ్చయముగా చేసుకొని విష్ణువు శివుని చక్కగా పూజించెను (15). ఓ బ్రాహ్మణులారా! కాని శివుడు విష్ణువునకు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు విష్ణుభగవానుడు ఆలోచనలో పడెను (16).

విచార్యైవం స్వమనసి సేవనం బహుధా కృతమ్‌ | తథాపి న హరస్తుష్టో బభూవోతికరః ప్రభుః|| 17

తతస్సువిస్మితో విష్ణుర్భక్త్వా పరమయాన్వితః | సహసై#్ర ర్నామభిః ప్రీత్యా తుష్టావ పరమేశ్వరమ్‌ ||18

ప్రత్యేకం కమలం తసై#్మ నామమంత్రముదీర్య చ | పూజయామాస వై శంభుం శరణాగతవత్సలమ్‌ ||19

పరీక్షార్థం విష్ణుభ##క్తేస్తదా వై శంకరేణ హ | కమలానాం సహస్రాత్తు హృతమేకం చ నీరజమ్‌ || 20

న జ్ఞాతం విష్ణునా తచ్చ మయాకారణమద్భుతమ్‌ | న్యూనం తచ్చాపి సంజ్ఞాయ తదన్వేషణతత్పరః || 21

బభ్రామ సకలాం పృథ్వీం తత్ప్రీత్యై సుదృఢవ్రతః | తదప్రాప్య విశుద్ధాత్మా నేత్రమేకముదాహరత్‌ || 22

తం దృష్ట్వా స ప్రసన్నో%భూచ్ఛంకరస్సర్వదుఃఖహా | ఆవిర్భభూవ తత్రైవ జగాద వచనం హరిమ్‌ || 23

ఆయన తన మనస్సులో ఈ విధముగా ఆలోచించి అనేకవిధములుగా సేవించెను. అయిననూ, లీలాకరుడగు ఆ ప్రభుడు ప్రసన్నుడు కాలేదు (17). అప్పుడు విష్ణువు మిక్కలి చకితుడై పరమభక్తితో కూడిన వాడై పరమేశ్వరుని సహస్రనామములతో ప్రీతిపూర్వకమగా స్తుతించెను (18). ఆయన శరణాగత వత్సలుడుగు ఆ శంకరుని ప్రతి నామమంత్రమును పఠిస్తూ ఒక్కొక్క కమలముతో పూజించెను (19). అప్పుడు విష్ణువు యొక్క భక్తిని పరీక్షించుటకై శంకరుడు వేయి కమలములనుండి ఒక కమలమును అపహరించెను (20). ఒక కమలము తగ్గుటకు కారణమైన శంకరుని ఆ అద్భతమగు మాయను విష్ణువు తెలియజాలక, కమలము తగ్గినదని భావించి దానికొరకై వెదుకమొదలిడెను (21). శివుని సంతోషపెట్టవలెననే దృఢమగు వ్రతము గల విష్ణువు దానికొరకై భూమండలమునంతనూ వెదికెను. కాని అది దొరకలేదు. విశుద్ధమగు అంతఃకరణముగల విష్ణువు ఒక నేత్రమును సమర్పించెను (22). దానిని చూచి సర్వదుఃఖములను పోగొట్టే ఆ శంకరుడు ప్రసన్నుడై అచట ప్రత్యక్షమై విష్ణువుతో నిట్లనెను (23).

శివ ఉవాచ |

ప్రసన్నో%స్మి హరే తుభ్యం వరం బ్రూహి యథేప్సితమ్‌ | మనో%భిలషితం దద్మి నాదేయం విద్యతే తవ|| 24

శివుడు ఇట్లు పలికెను-

ఓ విష్ణూ! నేను నీ విషయములోప్రసన్నుడనైతిని. నీవు కోరిన వరమును ఇచ్చెదను. కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (24).

సూత ఉవాచ

తచ్ఛ్రు త్వా శంభూవచనం కేశవః ప్రీతమానసః | మహాహర్షసమాపన్నో హ్యబ్రవీత్సాంజలిశ్శివమ్‌ || 25

సూతుడు ఇట్లు పలికెను-

శంభుని ఆ వచనమును విని కేశవుడు సంతసించిన మనస్సు గలవాడై మహానందమును పొంది చేతులను జోడించి శివునితో నిట్లు పలికెను (25).

విష్ణురువాచ |

వాచ్యం కిం మే త్వదగ్నే వైన హ్యంతర్యామీ త్వమాస్థితః | తథాపి కథ్యతే నాథ తవ శాసనగౌరవాత్‌ || 26

దైత్యైశ్చ పీడితం విశ్వం సుఖం నో నస్సదాశివ | దైత్యాన్‌ హంతుం మమ స్వామిన్‌ స్వాయుధం న ప్రవర్తతే|| 27

కిం కరోమి క్వ గచ్ఛామి నన్యోమే రక్షకః పరః| అతో%హం పరమేశాన శరణం త్వాం సమాగతః || 28

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ నాథా! నీ ఎదుట నేను చెప్పదగినది ఏది గలదు? ఏలయన నీవు అంతర్యామివై ఉన్నావు. అయిననూ, నీ శాసనమునందలి గౌరవముచే చెప్పుచున్నాను (26). ఓ సదాశివా! జగత్తు రాక్షసులచే, పీడింపబడుచున్నది. మాకు సుఖము లేకున్నది. ఓ స్వామీ! నా ఆయుధము రాక్షసులను సంహరించుటకు సమర్థము కాకున్నది (27). ఏమి చేయుదును? ఎక్కడకు పోయెదను? నాకు మరి యొక రక్షకుడు లేడు . ఓ పరమేశ్వరా! కావుననే, నేను నిన్ను శరణు వేడుచున్నాను(28)

సూత ఉవాచ|

ఇత్యుక్త్వా చ నమస్కృత్య శివాయ పరమాత్మనే | స్థితశ్చైవాగ్రతశ్శంభోస్వ్వయం చ పురుపీడితః || 29

ఇతి శ్రుత్వా వచో విష్ణోర్దేవదేకో మహేశ్వరః | దదౌ తసై#్మ స్వకం చక్రం తేజోరాశిం సుదర్శనమ్‌ || 30

తత్ప్రాప్య భగవాన్‌ విష్ణుర్ధైత్యాంస్తాన్‌ బలవత్తరాన్‌ | జఘాన తేన చక్రేణ ద్రుతం సర్వాన్‌ వినా శ్రమమ్‌|| 31

జగత్‌ స్వాస్థ్యం పరం లేభే బభూవుస్సుఖినస్సురాః | సుప్రీతస్స్వాయుధం ప్రాప్య హరిరాసీన్మహాసుఖీ|| 32

సూతుడు ఇట్లు పలికెను-

తాను స్వయముగా చాల పీడను పొందియున్న ఆ విష్ణువు ఇట్లు పలికి మంగళకరుడగు శంభుపరమాత్మకు నమస్కరించి ఎదుట నిలబడెను (29). విష్ణవు యొక్క ఆ వచనమును విని దేవదేవుడగు మహేశ్వరుడు ఆతనికి తేజస్సు యొక్క ముద్ద యనదగిన తన సుదర్శన చక్రమును ఇచ్చెను (30). విష్ణుభగవానుడు దానిని పొంది మహాబలశాలురగు ఆ రాక్షసులనందరినీ ఆ చక్రముతో శీఘ్రమే శ్రమ లేకుండగా వధించెను (31). అప్పుడు జగత్తునకు పరమశాంతి లభించెను. దేవతలు సుఖమును పొందిరి. విష్ణువు చక్కని ఆయుధమును సంపాదించి మహానందమును మరియు గొప్ప సుఖమును పొందెను (32).

ఋషయ ఊచుః |

కిం తన్నామసహస్రం వై కథయ త్వం హి శాంకరమ్‌ | యేన తుష్ఠో దదౌ చక్రం హరయే స మహేశ్వరః || 33

తన్మాహాత్య్మం మమ బ్రూహి శివసంవాదపూర్వకమ్‌ | కృపాలుత్వం చ శంభోర్హి విష్ణూపరి యథాతథమ్‌ || 34

ఋషులు ఇట్లు పలికిరి-

దేని ప్రభావముచే మహేశ్వరుడు సంతోషించి విష్ణవునకు చక్రమును ఇచ్చినాడో, ఆ శంకరుని సహస్రనామములను నీవు చెప్పుము (33). దాని మహాత్మ్యమును శివునితో విష్ణువుయొక్క సంవాదమును , విష్ణువుపై శంభుని దయాళుత్వమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (34).

వ్యాస ఉవాచ|

ఇతి తేషాం వచశ్శ్రుత్వా మనీనాం భావితాత్మనామ్‌ | స్మృత్వా శివపదాం భోజం సూతో వచనమబ్రవీత్‌|| 35

ఇతి శ్రీ శివమహాపురాణ కోటి రుద్రసంహితాయాం విష్ణుసుదర్శన చక్రలాభ వర్ణనం నామ చతుస్త్రింశో%ధ్యాయః (34)

వ్యాసుడు ఇట్లు పలికెను-

పరిశుద్ధాంతఃకరణులగు ఆ మునులయొక్క ఈ వచనములు విని సూతుడు పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (35).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు విష్ణువునకు సుదర్శన చక్రపాప్తిని వర్ణించే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).

Siva Maha Puranam-3    Chapters