Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయస్త్రింశో% ధ్యాయః

ఘశ్మేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్యము

సూత ఉవాచ|

పుత్రం దృష్ట్వా కనిష్ఠాయా జ్యేష్ఠా దుఃఖముపాగతా | విరోధం సా చకారాశు న సహంతీ చ తత్సుఖమ్‌ ||1

సర్వే పుత్రప్రసూతిం తాం ప్రశశంసుర్నిరంతరమ్‌ | తయా తత్సహ్యతే న స్మ శిశో రూపాదికం తథా ||2

సుప్రియం తనయం తం చ పిత్రోస్సద్గుణభాజనమ్‌ | దృష్ట్వా భవత్తదా తస్యా హృదయం తప్తమగ్నివత్‌ ||3

ఏతస్మిన్నంతరే విప్రాః కన్యాం దాతుం సమాగతాః | వివాహం తస్య తత్రైవ చకార విధివచ్చ సః || 4

సుధర్మాఘుశ్మయా సార్ధమానందం పరమం గతః | సర్వే సంబంధినస్తస్యాం ఘుశ్మాయాం మానమాదధుః || 5

తం దృష్ట్వా సా సుదేహా హి మనసి జ్వలితా తదా | అత్యంతం దుఃఖమాపన్నా హా హతాస్మీతి వాదినీ || 6

సుధర్మా గృహమాగత్య వధూం పుత్రం వివాహితమ్‌ | ఉత్సాహం దర్శయామాస ప్రియాభ్యాం హర్షయన్నివ|| 7

అభవద్ధర్షితా ఘుశ్మా సుదేహా దుఃఖమాగతా | న సహంతీ సుఖం తచ్చ దుఃఖం కృత్వా పతద్భువి|| 8

ఘుశ్మావదద్వధూపుత్రౌ త్వదీ¸° న మదీయకౌ | వధూః పుత్రశ్చ తాం ప్రీత్యా ప్రసూం శ్వశ్రూమమన్యత|| 9

భర్తా ప్రియాం తాం జ్యేష్ఠాం చ మేనే నైవ కానిష్ఠకామ్‌ | తథాపి సా తదా జ్యేష్ఠా స్వాంతర్మలవతీ హ్యభూత్‌ || 10

ఏకస్మన్దినసే జ్యేష్ఠా సా సుదేహా చ దుఃఖినీ | హృదయే సంచిచింతేతి దుఃఖశాంతిః కథం భ##వేత్‌ || 11

సూతుడు ఇట్లు పలికెను-

చిన్న భార్య యొక్క పుత్రుని, ఆమె అనుభవించుచున్న సుఖమును చూచి సహించలేక పెద్ద భార్య దుఃఖమును పొంది శీఘ్రమే విరోధమును చేయ మొదలిడెను (1). అందరు పుత్రుని గన్న చిన్న భార్యను నిరంతరముగా ప్రశంసించుటను మరియు ఆ శిశువు యొక్క రూపము మొదలగు వాటిని ఆమె సహించలేకపోయెను (2). తల్లిదండ్రులకు మిక్కిలి ప్రీతిపాత్రుడైనవాడు, సద్గుణనిధి అగు ఆ బాలకుని చూచి అప్పుడు ఆమె యొక్క హృదయుమ అగ్నివలె మండజొచ్చెను (3). ఇంతలో బ్రాహ్మణులు తమ కన్యను ఆ కుమారునికి ఇచ్చుటకై ముందునకు వచ్చిరి. సుధర్ముడు ఆతని వివాహమును అచటనే యథావిదిగా చేసెను (3) సుధర్ముడు ఘుశ్మతో గూడి పరమానందమును పొందెను. బంధువులందరు ఆ ఘుశ్మయందు పెద్ద గౌరవమును చూపిరి (5). దానిని చూచి ఆ సుదేహయొక్క మనస్సు మండిపోగా, అపుడామె మహాదుఃఖమును పొంది 'అయ్యె ! నేను హతురాలనైతిని' అని భావించెను (6). సుధర్ముడు ఇంటికి వచ్చినపుడు వివాహితుడైన కుమారుని కోడలిని మరియు తన ఇద్దరు భార్యలను సంతోష పెట్టుచున్నాడా యన్నట్లు ఉత్సాహమును చూపుచుండెను (7). ఘుశ్మ ఆనందమును పొందుచుండగా, ఆమె యొక్క సుఖమును చూచి సంహించలేని సుదేహ దుఃఖితురాలై ఆ దుఃఖప్రభావముచే నేలపై పడుచుంచెను (8). ఈ కొడుకు మరియు కోడలు నీవారే గాని నా వారు కాదని ఘుశ్మ చెప్పెను. ఆ పుత్రుడు సుదేహను తల్లిగను, కోడలు ఆమెనే అత్తగారుగను భావించి ఆదరించిరి (9). భర్తకూడ ఆమెయే తనకు ప్రియురాలని భావించెనే గాని, చిన్న భార్యయందు ప్రత్యేకప్రేమను చూపనే లేదు. అయిననూ, పెద్ద భార్యయగు సుదేహయొక్క అంతఃకరణము మాలిన్యమును మాత్రమే కలిగియుండెను (10). ఒకనాడు పెద్దభార్యయగు ఆ సుదేహ దుఃఖితురాలై 'ఈ దుఃఖమును శాంతింపచేయు ఉపాయమేమి? అని మనస్సులోఆలోచించెను (11).

సుదేహో వాచ|

మదీయ హృదయాగ్నిశ్చ ఘుశ్మనేత్రజలేన వై | భవిష్యతి ధ్రువం శాంతో నాన్యథో దుఃఖజేన హి|| 12

అతో%హం మారయామ్యద్య తత్పుత్రం ప్రియవాదినమ్‌ | అగ్రే భావి భ##వేదేనం నిశ్చయః పరమో మమ || 13

సుదేహ ఇట్లు తలపోసెను-

దుఃఖముచే ఘుశ్మయొక్క నేత్రములనుండి స్రవించే నీటితో తప్ప నా హృదయములోని మంట మరియొక విధముగా శాంతించదు. ఇది నిశ్చయము (12). కావున ప్రియమగు వచనములు గల ఆమె యొక్క పుత్రుని ఈ నాడే సంహరించెదను. ఆపైన ఏది జరగవలెనో, అదియే జరుగును. ఇది నా ధృఢ నిశ్చయము (13).

సూత ఉవాచ |

కదర్యాణాం విచారశ్చ కృత్యాకృత్యే భ##వేన్నహి కఠోరః ప్రాయశో విప్రాస్సాపత్నో భావ ఆత్మహా || 14

ఏకస్మిన్‌ దివసే జ్యేష్ఠా సుప్తం పుత్రం వధూయుతమ్‌ | చిచ్ఛేద నిశి చాంగేషు గృహీత్వా ఛురికాం చ సా|| 15

సర్వాంగం ఖండయామాస రాత్రౌ ఘుశ్మాసుతస్య సా | నీత్వా సరసి తత్రైవాక్షివద్దృప్తా మహాబలా|| 16

యచ్చ క్షిప్తాని లింగాని ఘుశ్మయా నిత్యమేవ హి | తత్ర క్షిప్త్వా సమాయాతా సుష్వాప సుఖమాగతా|| 17

ప్రాతశ్చైవ సముత్థాయ ఘుశ్మా నిత్యం తథాకరోత్‌ | సుధర్మా చ స్వయం శ్రేష్ఠో నిత్యకర్మ సమాచరత్‌|| 18

సూతుడు ఇట్లు పలికెను

దుష్టులకు ఇది చేయదగిన పని, ఇది కాదు అనే ఆలోచన ఉండదు. ఓ బ్రాహ్మణులారా! ఈ సవతుల మధ్య ఉండే కఠోరమగు వివాదము ఆత్మవినాశనమునకు దారితీయును (14). ఒకనాడు ఆ పెద్ద భార్య కత్తిని తీసుకొని భార్యతో సహా నిద్రిస్తున్న ఆ పుత్రుని అనేక పర్యాయములు పొడిచి చంపెను (15). గర్వము గలది, మహాబలశాలిని అగు ఆమె ఘుశ్మయెక్క కుమారుని శరీరమును సర్వాంగములయందు కోసివేసి ఆ రాత్రియందు సరస్సువద్దకు తీసుకొని వెళ్లి దానిలో పారవైచెను (16). ఎచ్చోట ఘుశ్మనిత్యము లింగములను వేసెడిదో, అదే స్థానమలో పారవైచి, వెనుకకు మరలి వచ్చి సుఖముగా నిద్రించెను (17). ఘుశ్మ ఉదయమే లేచి నిత్యకార్యములను చేసెను. శ్రేష్ఠుడగు సుధర్ముడు కూడ స్వయముగా నిత్యకర్మను ఆచరించెను (18).

ఏతస్మిన్నంతరే సా చ జ్యేష్ఠా కార్యం గృహస్య వై | చకారానందసంయుక్తా సుశాంతహృదయానాలా || 19

ప్రాతః కాలే సముత్థాయ వధూశ్చయ్యాం విలోక్య సా | రుధిరార్ద్రాం దేహ ఖండైర్యుక్తాం దుఃఖముపాగతా || 20

శ్వశ్రూం నివేదయామాస పుత్రస్తే చ కుతో గతః | శయ్యా చ రుధిరార్ద్రాం వై దృశ్యంతే దేహఖండకాః || 21

హా హతాస్మి కృతం కేన దుష్టం కర్మ శుచివ్రతే | ఇత్యచ్చార్య రురోదాతి వివిధం తత్ర్పియా చ సా|| 22

జ్యేష్ఠా దుఃఖం తదాపన్నా హా హతాస్మి కిలేతి చ | బహిర్దుఃఖం చకారాసౌ మనసా హర్షసంయుతా|| 23

ఘుశ్మా చాపి తదా తస్యా వధ్వా దుఃఖం నిశమ్య సా | న చచాల వ్రతాత్తస్మాన్నిత్య పార్థివపూనాత్‌ || 24

మనశ్చైవోత్సుకం నైవ జాతం తస్యా మనాగపి| భర్తాపి చ తథైవాసీద్యావద్ర్వత విధిర్భవేత్‌ || 25

ఇంతలో ఆ పెద్ద భార్య మనస్సులోని మంట పూర్తి గా చల్లారుటచే ఆనందముతో కూడినదై గృహకృత్యములను చేయుచుండెను (19). ఆ కోడలు ఉదయమే లేచి, రక్తముతో తడిసి శరీరావయములముక్కలతో కూడియున్న శయ్యను చూచి దుఃఖమును పొందెను (20). ఆమె అత్తగారికి ఇట్లు విన్నవించెను: నీ కుమారుడు ఎక్కడకి వెళ్ళినాడు? శయ్య రక్తముతో తడిసియున్నది. శరీరావయవముల ముక్కలు కానవచ్చున్నవి (21). అయ్యా ! నేను మరణించితిని. ఓ పవిత్రమగు వ్రతము గలదానా! ఈ పాపకర్మను ఎవరు చేసిరి? అని పలికి ఆ కోడలు పరిపరివిధముల బిగ్గరగా ఏడ్చెను (22). పెద్ద భార్యకు మనస్సులో ఆనందము నిండియున్ననూ, కోడలు దుఃఖించుచుండటను చూచి అయ్యో! నేను మరణించితిని అంటూ బయటకు దుఃఖమును ప్రకటించెను (23). ఆ సమయములో నిత్యపార్థివ లింగపూజను చేయుచున్న ఘుశ్మ కోడలి దుఃఖమును వినెను. కాని ఆమె తన వ్రతమునుండి చలించలేదు (24). ఆమెయొక్క మనస్సులో లేశ##మైననూ ఆదుర్దా కలుగలేదు. వ్రతవిధి పూర్తియగునంత వరకు భర్త కూడా అటులనే ఉండెను (25).

మధ్యాహ్నే పూజనాంతే చ దృష్ట్వా శయ్యాం భయావహామ్‌ | తథాపి న తదా కించిత్‌ కృతం దుఃఖం హి ఘుశ్మయా || 26

యేనైవ చార్పితశ్చాయం స వై రక్షాం కరిష్యతి | భక్తప్రియస్స విఖ్యాతః కాలకాలస్సతాం గతిః|| 27

యది నో రక్షితా శంభురీశ్వరః ప్రభురేకలః | మాలాకార ఇవాసౌ యాన్‌ యుంక్తే తాన్‌ వియునక్తి చ|| 28

అద్య మే చింతయా కిం స్యాదితి తత్త్వం విచార్య సా| న చకార తదా దుఃఖం శివేధైర్యం సమాగతా|| 29

పార్థివాంశ్చ గృహీత్వా సా పూర్వవత్స్వస్థమానసా | శంభోర్నామాన్యుచ్చరంతీ జగామ సరసస్తటే || 30

క్షిప్త్వా చ పార్థివాంస్తత్ర పరావర్తత సా యదా | తదా పుత్రస్తడాగస్థో దృశ్యతే స్మ తటే తయా || 31

మధ్యాహ్నము పూజ అయిన తరవాత భయమును గొల్పే శయ్యను చూచి కూడా ఘుశ్మ ఆ సమయములో లేశ##మైననూ దుఃఖమును చేయలేదు (26). ఈ కుమారుని ఇచ్చినవాడే వానిని రక్షించును. ఆ శివుడు భక్త ప్రియుడనియు, మృత్యువునకు మృత్యువు అనియు, సత్పురుషులకు శరణు అనియు ప్రఖ్యాతిని పొందియున్నాడు (27). మనకు రక్షకుడు, ఈశ్వరుడు, ఏకైకప్రభుడు అగు శంభుడు మాలాకారునివంటివాడు. ఆయన ఎవరినైతే కలుపునో, వారిని విడదీయును (28). ఈ విషయములో నేను చింతించి ప్రయోజనమేమున్నది? ఆమె ఈ విధముగా తత్త్వమును విచారించి శివునియుందు ధైర్యముగలదై ఆ సమయములో దుఃఖించలేదు (29). ఆమె పూర్వమునందు వలెనే పార్థివలింగములను తీసుకొని శంభుని నామములను ఉచ్చరిస్తూ సరస్సు ఒడ్డునకు వెళ్లెను (30). ఆమె దానిలో పార్థివలింగములను నిమజ్జనము చేసి వెనుకకు మరలునంతలో, గట్టుమీదనున్న ఆమెకు అచట సరస్సులో తన కుమారుడు కానవచ్చును (31).

పుత్ర ఉవాచ |

మాతరేహి మిలిష్యామి మృతో%హం జీవితో%ధునా | తవ పుణ్యప్రభావాద్ధి కృపయా శంకరస్య వై || 32

పుత్రుడు ఇట్లు పలికెను-

ఓఅమ్మా! ఇటు రమ్ము నేను నిన్ను చూచెదను. నేను మరణించి నీ పుణ్యప్రభావముచేత మరియు శంకరుని దయచే మరల బ్రతికితిని (32).

సూత ఉవాచ|

జీవితం తం సుతం దృష్ట్వా ఘుశ్మా సా తత్ప్ర సూర్ద్విజాః | ప్రహృష్టా నాభవత్తత్ర దుఃఖితా న యథా పురా|| 33

ఏతస్మిన్‌ సమయే తత్ర హ్యావిరాసీచ్ఛివో ధ్రుతమ్‌ | జ్యోతిరూపో మహేశశ్చ సంతుష్టః ప్రత్యువాచ హ || 34

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా | ఆ కుమారుని తల్లియగు ఆ ఘుశ్మ జీవించి వచ్చిన తన పుత్రుని చూచి అత్యంత హర్షమును పొందలేదు. ఇంతకముందు ఆమె అత్యంతదుఃఖమును పొందలేదు (33). అదే సమయములో మంగళకరుడగు మహేశ్వరుడు జ్యోతిర్లింగరూపములో అక్కడ స్వయముగా ఆవిర్భవించి వెంటనే సంతోషముతోఇట్లునెను(34)

శివ ఉవాచ|

ప్రసన్నో%స్మి వరం బ్రూహి దుష్టయా మారితో హ్యయమ్‌ | ఏనాం చ మారయిష్యామి త్రిశూలేన వరాననే || 35

శివుడు ఇట్లు పలికెను-

ఓ ప్రసన్నమగు ముఖము కలదానా| నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము. ఈ నీ కుమారుని చంపిన ఆ దుష్ఠురాలిని త్రిశూలముతో సంహరించెదను(35)

సూత ఉవాచ|

ఘుశ్మా తదా వరం వవ్రే సుప్రణమ్య శివం సతా | రక్షణీయా త్వయా నాథ సుదేహేయం స్వసా మమ || 36

సూతుడు ఇట్లు పలికెను-

అప్పుడు ఘుశ్మ శివునకు పవిత్రమగు అంతఃకరణముతో నమస్కరించి వరమును ఇట్లు కోరెను: ఓనాథా! నా అక్కఅగు ఈ సుదేహను నీవు రక్షించవలెను (36).

శివ ఉవాచ|

అపకారః కృతస్తస్యాముపకారః కథం త్వయా | క్రియతే హసనీయా చ సుదేహా దుష్టకారిణీ || 37

శివుడు ఇట్లు పలికెను-

అపకారమును చేసిన ఆమెకు నీవు ఉపకారమునేల చేయుచున్నావు? పాపకృత్యమును చేసిన ఈ సుదేహను సంహరించదగును (37).

ఘుశ్మోవాచ |

తవ దర్శనమాత్రేణ పాతకం నైవ తిష్ఠతి | ఇదానీం త్వాం చ వై దృష్ట్వా తత్పాపం భస్మతాం వ్రజేత్‌ || 38

అపకారేషు యశ్చైవ హ్యుపకారం కరోతి చ | తస్య దర్శనమాత్రేణ పాపం దూరతరం వ్రజేత్‌ || 39

ఇతి శ్రుతం మయా దేవ భగవద్వక్యముత్తమమ్‌ | తస్మాచ్చైవం కృతం యేన క్రియతాం చ సదాశివ || 40

ఘుశ్మ ఇట్లు పలికెను-

నిన్ను దర్శించినంత మాత్రాన పాపము మిగిలియుండదు. ఈమె ఇప్పుడు నిన్ను చూచుటచే ఆ పాపము భస్మమగును (38). అపకారమును చేసిన వారికి ఉపకారము చేయువానిని దర్శించుటతోడనే పాపములు సుదూరముగా తొలగిపోవును (39). ఓ దేవా! నేను ఈ భగవానుని ఉత్తమవాక్యమును వినియుంటిని. కావున ఈ విధముగా చేయుటయే ఉచితము. ఓ సదాశివా ! కావున అటులనే చేయుము (40) .

సూత ఉవాచ |

ఇత్యుక్తస్తు తయా తత్ర ప్రసన్నో%త్యభవత్పునః | మహేశ్వరః కృపాసింధుస్సమూచే భక్తవత్సలః || 41

సూతుడు ఇట్లు పలికెను-

అప్పుడు ఆమె అట్లు పలుకగా దయాసముద్రుడు, భక్తవత్సలుడు అగు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై మరల ఇట్లు పలికెను (41).

శివ ఉవాచ |

అన్యద్వరం బ్రూహి ఘుశ్మే దదామి చ హితం తవ | త్వద్భక్త్వా సుప్రసన్నో%స్మి నిర్వికారమస్వభావతః || 42

ఓ ఘుశ్మా | నీవు మరియొక్క వరమును కోరుకొనుము. నేను నీకు నచ్చిన వరమును ఇచ్చెదను. వికారమును పొందని నీ స్వభావమునకు మరియు నీ భక్తికి నేను చాల ప్రసన్నుడనైతిని (42).

సూత ఉవాచ |

సోవాచ తద్వచశ్శ్రుత్వా యది దేయో వరస్త్వయా | లోకానాం చైవ రక్షార్థమత్ర స్థేయం మదాఖ్యయా || 43

తదోవాచ శివస్తత్ర సుప్రసన్నో మహేశ్వరః | స్థాస్యే%త్ర తవా నామ్నాహం ఘుశ్మేశాఖ్యస్సుఖప్రదః || 44

ఘుశ్మేశాఖ్యం సుప్రసిధ్దం లింగం మే జాయాతాం శుభమ్‌ | ఇదం సరస్తు లింగానామాలయం జాయతాం సదా|| 46

తస్మాచ్ఛివాలయం నామ ప్రసిద్ధం భువనత్రయే | సర్వకామప్రదం హ్యేతద్దర్శనాత్స్యాత్సదా సరః ||46

తవ వంశే శతం చైకం పురషావధి సువ్రతే | ఈదృశాః పుత్రకాశ్శ్రేష్ఠా భవిష్యంతి న సంశయః || 47

సస్త్రీ కాస్సుధనాశ్చైవ స్వాయుష్యాశ్చ విచక్షణాః| విద్యావంతో హ్యుదారాశ్చ భుక్తిముక్తిఫలాప్తయే|| 48

శతమే కోత్తరం చైవ భవిష్యంతి గుణాధికాః | ఈదృశో వంశవిస్తారో భవిష్యతి సుశోభనః || 49

సూతుడు ఇట్లు పలికెను-

ఆ వచనమును విని ఆమె ఇట్లు పలికెను. నాకు వరమునీయదలచినచో, లోకముల రక్షణ కొరకై నీవు ఇచట నాపేరుతో స్థిరముగా నుండవలయును (43). అప్పుడు మంగళకరుడు, మిక్కిలి ప్రసన్నమైన వాడు అగు మహేశ్వరుడు ఇట్లు పలికెను. నేను ఇచట నీ పేరుతో ఘుశ్మేశ్వరుడనై స్థిరముగానుండి సుఖములనొసంగెదను (44). ఘుశ్మేశ్వరుడును పేరుగల ఈ శుభలింగము అధికమగు ప్రసిద్ధిని పొందును ఈ సరస్సు సర్వదా లింగములకు ఆకరము కాగలదు (45). కావుననే ఈ సరస్సు సర్వదా ముల్లోకములలో శివాలయమని ప్రసిద్ధిని గాంచి దర్శించువారల కామనలనన్నింటినీ నెరవేర్చును (46). ఓ పుణ్యనిష్ఠ గలదానా! నీ వంశములో నూట ఒక్క తరములవరకు ఇటువంటి శ్రేష్ఠులైన పుత్రులు జన్మించెదరనుటలో సందేహము లేదు (47). వారు మంచి ఆయుర్దాయము గలవారై, విద్యావివేకములు గలవారై, భుక్తి మరియు ముక్తి అనే ఫలములను పొందుటకొరకై ఔదార్యమునవలంబించువారై తమ భార్యలతో గూడి సంపదలనునుభవించెదరు (48). నూట ఒక్క తరములవరకు ఇటువంటి సద్గుణసంపన్నులు ఉదయించెదరు. ఇట్టి అతిశయించిన శోభను కలిగియున్న వంశము విస్తరించ గలదు (49).

సూత ఉవాచ|

ఇత్యుక్త్వా చ శివస్తత్ర లింగరూపో%భవత్తదా | ఘుశ్మేశో నామ విఖ్యాతస్సరశ్చైవ శివాలయమ్‌ || 50

సుధర్మా స చ ఘుశ్మా చ సుదేహా చ సమాగతాః | ప్రదక్షిణం శివస్యాశు శతమే కోత్తరం దధుః ||51

పూజాం కృత్వా మహేశస్య మిలిత్వా చ పరస్పరమ్‌ | హిత్వా చాంతర్మలం తత్ర లేభిరే పరమం సుఖమ్‌ || 52

పుత్రం దృష్ట్వా సుదేహా సా జీవితం లజ్జితాభవత్‌ | తౌ క్షమాప్యాచరద్విప్రా నిజపాపాపహం వ్రతమ్‌ || 53

ఘుశ్మేశాఖ్యమిదం లింగమిత్థవం జాతం మునీశ్వరాః | తద్ధృష్ట్వా పూజయిత్వా హి సుఖం సంవర్ధతే సదా|| 54

ఇతి వశ్చ సమాఖ్యాత జ్యోతిర్లింగావలీ మయా | ద్వాదశప్రమితా సర్వకామదా భుక్తిముక్తిదా|| 55

ఏతజ్జ్యోతిర్లింగకథాం యః పఠేచ్ఛృణుయాదపి | ముచ్యతే సర్వపాపేభ్యో భుక్తిం ముక్తిం చ విందతి|| 56

ఇతి శ్రీ శివమహాపురాణ కోటి రుద్రసంహితాయాం ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్యవర్ణనం నామ త్రయస్త్రిం శో% ధ్యాయః (33).

ఇతి ద్వాదశ జ్యోతిర్లింగమహాత్య్మం సమాప్తమ్‌ |

సూతుడు ఇట్లు పలికెను-

శివుడు ఇట్లు పలికి అప్పుడు అచట లింగరూపమును పొంది ఘుశ్మేశ్వరుడును పేరు ప్రఖ్యాతిని పొందెను. సరస్సుకూడ శివాలయమని పేరు పొందెను (50). సుధర్ముడు, ఘుశ్మ మరియు సుదేహ ఒకరినొకరు కలుసుకొనిరి. వారు వెంటనే శివునకు నూట ఒక్క ప్రదక్షిణములను చేసిరి (51). వారు మహేశ్వరుని పూజించి ఒకరితోనొకరు కలుసుకొని హృదయములలో మాలిన్యము లేనివారై అప్పుడు పరమసుఖమును పొందిరి (52). జీవించి వచ్చిన పుత్రుని చూచి ఆ సుదేహ సిగ్గు పడి క్షమాపణను కోరెను. ఓ బ్రాహ్మణులారా! ఆమె తన పాపములను పొగొట్టుకొనుటకొరకై వ్రతమును ఆచరించెను (53). ఓ మహర్షులారా! ఘుశ్మేశ్వరలింగము ఈ విధముగా ఆవిర్భివించినది దానిని దర్శించి పూజించువారలకు సర్వదా సుఖము వర్థిల్లును (54). నేను ఈ విధముగా మీకు సర్వకామనలను భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే పన్నెండు జ్యోతిర్లింగముల క్రమమును చెప్పియుంటిని (55). ఏ మానవుడైతే ఈ జ్యోతిర్లింగ గాథను పఠించునో మరియు వినునో, వాడు సకలపాపములనుండి విముక్తుడై భుక్తిని మరియు ముక్తిని పొందును (56).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్ణనమనే ముప్పదిమూడవ అధ్యాయము ముగిసినది (33). దీనితో ద్వాదశ జ్యోతిర్లింగమహాత్మ్యము ముగిసినది.

Siva Maha Puranam-3    Chapters