Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వాత్రింశో% ధ్యాయః

సుదేహ సుధర్ముల వృత్తాంతము

సూత ఉవాచ|

అతః పరం చ ఘశ్మేశం జ్యోతిర్టింగముదాహృతమ్‌ | తసై#్యవచ సుమాహాత్య్మం శ్రూయతా మృషిసత్తమాః || 1

దక్షిణస్యాం దిశి శ్రేష్ఠో గిరిర్దేవేతి సంజ్ఞకః | మహాశోభాన్వితో నిత్యం రాజతే %ద్భుతదర్శనః || 2

తసై#్యవ నికటే కశ్చిద్భారద్వా జకులోద్భవః | సుధర్మానామ విప్రశ్చ న్యవసద్బ్ర హ్మవిత్తమః || 3

తస్య ప్రియా సుదేహా చ శివధర్మపరాయణా | పతిసేవాపరా నిత్యం గృహకర్మవిచక్షణా || 4

సుధర్మా చ ద్విజశ్రేష్ఠో దేవతాతిథి పూజకః | వేదమార్గపరో నిత్యమగ్ని సేవాపరాయణః || 5

త్రికాలసంధ్యయా యుక్తస్సూర్యరూపసమద్యుతిః | శిష్యాణాం పాఠకశ్చైవ వేదశాస్త్ర విచక్షణః ||6

ధనవాంశ్చ పరో దాతా సౌజన్య గుణభాజనః | శివకర్మరతో నిత్యం శైవశ్చైవజనప్రియః ||7

సూతుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! ఘశ్మేశ్వరుడును జ్యోతిర్లింగము ప్రసిద్ధమై యున్నది. ఈపైన దాని గొప్ప మహిమను గరించి చెప్పెదను. వినుడు (1). దక్షిణదిక్కునందు గొప్ప శోభ గలది, నిత్యము అద్భుతమగు దర్శనమును ఇచ్చునది అగు దేవగిరియను పేరు గల పర్వతరాజము శోభిల్లుచున్నది(2). దానికి సమీపములో భారద్వాజగోత్రీకుడు, బ్రహ్మవేత్తలలో ప్రముఖుడు అగు సుధర్ముడనే ఒకానొక బ్రాహ్మణుడు నివసించెను(3). శివధర్మమునందు నిష్ట గలది, నిత్యము భర్తను సేవించుటయందు శ్రద్ధ గలది, ఇంటిపనులయందు తెలివితేటలు గలది అగు సుదేహ ఆయన ప్రియురాలు(4). బ్రాహ్మణశ్రేష్ఠుడగు సుధర్ముడు దేవతలను మరియుఅతిధులను పూజించెడివాడు. వేదామార్గమునందు నిష్ఠగల ఆయన నిత్యము అగ్నిని సేవించుటలో నిమగ్నమై యుండెడివాడు (5). మూడు కాలముల యందు సంధ్యను అనుష్ఠించే అతడు సూర్యుని కాంతితో సమమగు కాంతిని కలిగియుండెను. వేదశాస్త్రములందు విద్వాంసుడుగు ఆయన శిష్యులకు బొధించెడివాడు (6). మంచితనము అనే గుణమునకు పెట్టిన పేరు అనదగిన ఆ బ్రాహ్మణుడు ధనవంతుడు మరియు గొప్ప దాత. శివభక్తుడగు అతడునిత్యము శివకర్మను ప్రేమతో అనుష్ఠిస్తూ, శివభక్తులయందు ప్రీతిని కలిగియుండెను(7)

ఆయుర్బహు వ్యతీయాయ తస్య ధర్మం ప్రకుర్వతః | పుత్రశ్చ నాభవత్తస్య ఋతుస్స్యాదఫలః స్త్రియాః || 8

తేన దుఃఖం కృతం నైవ వస్తు జ్ఞానపరేణ హి | ఆత్మనస్తారకశ్చాత్మా హ్యాత్మనః పావనశ్చసః || 9

ఇత్యేవం మానసం ధృత్వా దుఃఖం నకృతవాంస్తదా| సుదేహా చ తదా దుఃఖం చకారాపుత్రసంభవమ్‌|| 10

నిత్యం చ స్వామినం సా వై ప్రార్థయద్యత్నసాధనే | పుత్రోత్పాదన హేతోశ్చ సర్వవిద్యా విశారదమ్‌ || 11

సో%పి స్త్రియం తదాభర్త్స్యకిం పుత్రశ్చ కరిష్యతి | కా మాతా కఃపితా పుత్రః కో బంధుశ్చ ప్రియశ్చ కః || 12

సర్వం స్వార్థపరం దేవి త్రిలోక్యాం నాత్ర సంశయః | జానీహి త్వం విశేషేణ బుద్ధ్యా శోకం న వై కురు|| 13

తస్మాద్దేవి త్వయా దుఃఖం త్యజనీయం సునిశ్చితమ్‌ | నిత్యం మహ్యం త్వాయా నైన కథనీయం శుభవ్రతే || 14

ఏవం తాం సన్నివార్యైవ భగవద్ధర్మతత్పరః | అసీత్పరమసంతుష్టో ద్వంద్వదుఃఖం సమత్యజత్‌ || 15

కదాచిచ్చ సుదేహా వై గేహే చ సహ వాసినః | జగామ ప్రియగోష్ఠ్యర్థం వివాదస్తత్ర సంగతః || 16

తత్పత్నీస్త్రీస్వభావాచ్చ భర్త్సితా సా తయా తదా | ఉక్తాచేతి దురుక్త్యా వై సుదేహా విప్రకామినీ|| 17

ఈ విధముగా ధర్మమును అనుష్ఠించుచున్న ఆ బ్రాహ్మణుడు పెద్దవాడెయెను. కాని ఆయనకు పుత్ర సంతానము కలుగలేదు. ఆయన భార్య యొక్క ఋతుధర్మము వ్యర్థమయ్యెను(8). ఆయనబ్రహ్మ వన్తుజ్ఞానము గలవాడగుటచే దుఃఖమును లేశ##మైననూ పొందలేదు. ఆత్మను రక్షంచునది ఆత్మయే. ఆత్మను పవిత్రము చేయునది ఆత్మయే(9). ఈ విధమగు వివేకముగల ఆయనకు దుఃఖము కలుగలేదు. కాని సుదేహకు పుత్రుడు లేని దుఃఖము ఉండెను (10). సర్వవిద్యలలో నిష్ణాతుడగు ఆతన భర్తను ఆమె పుత్రసంతానము లభించే ప్రయత్నమును చేయమని నిత్యము ప్రార్థించుచుండెను (11). అతడు భార్యపై ఇట్లు కోపబడెను : పుత్రుడు ఏమి చేయును? తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పుత్రుడు ఎవరు? ప్రియుడు ఎవరు? (12). ఓ దేవీ ! ముల్లోకములలో సర్వము స్వార్థము నాశ్రయించి ఉన్నది. నీవీ విషయమును బుద్ధిని ఉపయోగించి విశేషముగా తెలుసుకొనుము. దుఃఖించకుము(13). ఓ దేవీ! కావున నీవు నిశ్చయముగా దుఃఖమును విడిచి పెట్టవలెను. ఓ శుభమగు వ్రతము గలదానా! నేను నీకు ప్రతిదినము చెప్పబనిలేదు(14). భగవద్ధర్మనుందు నిష్ఠగల ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా ఆమెను మందలించి పరమసంతోషము గలవాడైన శీతోష్ణాది ద్వంద్వముల వలన కలిగే దుఃఖమునకు అతీతుడై ఉండెను(15). ఒకనాడు సుదేహ ప్రీతిపూర్వకమగు గోష్ఠికొరకై ప్రక్కింటివారి వద్దకు వెళ్ళగా, అచట వివాదము చెలరేగెను (16). ఆ ఇంటి యజమానురాలు ఆ సమయములో స్త్రీ స్వభావముచే బ్రాహ్మణపత్నియగు సుదేహను చెడు మాటలను పలికి నిందించెను(17).

ద్విజపత్న్యువాచ|

అపుత్రిణి కథం గర్వం కురుషే పుత్రిణీ హ్యహమ్‌ | మద్ధనం భోక్ష్యతే పుత్రో ధనం తే కశ్చ భోక్షతే|| 18

నూనం హరిష్యతే రాజా త్వద్ధనం నాత్ర సంశయః | ధిక్‌ ధిక్‌ త్వాం తే ధనం ధిక్‌ చ ధిక్తే మానం హి వంధ్యకే || 19

ప్రక్కింటి బ్రాహ్మణపత్ని ఇట్లు పలికెను-

సంతానము లేనిదానా! నీకు గర్వమేల? నాకు కొడుకు గలడు. నాకొడుకు నాధనమును అనుభవించగలడు. నీ ధనమును ఎవరు అనుభవించెదరు? (18). నీధనమును రాజు నిశ్చయముగా తీనుకొనుననుటలో సందేహము లేదు. నాకు అనేకపర్యాయములు నిందయగుగాక ! ఓసీ! సంతానవిహీనురాలా! నీధనమునకు మరియు నీ గర్వమునకు నిందయగుగాక ! (19)

సూత ఉవాచ|

భర్త్సితా తాభిరితి సా గృహమాగత్య దుఃఖితా | స్వామినే కథయామాస తదుక్తం సర్వమాదరాత్‌|| 20

బ్రాహ్మణో%పి తదా దుఃఖం న చకార సుబుద్ధిమాన్‌ | కథితం కథ్యతామేవ యద్భావి తద్భవేత్‌ ప్రియే || 21

ఇత్యేవం చ తదా తేన హ్యాశ్వస్తాపి పునఃపునః | న తదా సాత్యజద్దుఃఖం హ్యాగ్రహం కృతవత్యసౌ||22

సూతుడు ఇట్లు పలికెను-

ఆమెను వారు ఈ విధముగా నిందించగా, ఆమె దుఃఖితురాలై ఇంటికి వచ్చి వారి పలుకులను యథాతథముగా భర్తకు వివరించి చెప్పెను(20). మహాబుద్ధిమంతుడగు ఆ బ్రాహ్మణుడు ఆ సమయములోకూడ దుఃఖమును పొందలేదు. వారికి తోచినట్లు వారు పలికెదరు గాక| ఓ ప్రియురాలా! ఏది జరుగ వలసియున్నదో అది జరుగును(21). ఇట్లు పలికి ఆయన ఆమెను పలుమార్లు ఓ దార్చిననూ, ఆయె దుఃఖమును విడిచిపెట్టలేదు. పైగా ఆమె పట్టు పట్టుట మొదలిడెను(22).

సుదేహోవాచ|

యథా తథా త్వయా పుత్రస్సముత్పాద్యః ప్రియో%సి మే | త్యక్షాయి హ్యన్యథాహం చ దేహం దేహభృతాం వర|| 23

సుదేహ ఇట్లు పలికెను-

దేహధారులలో శ్రేష్ఠుడైనవాడా ! నీవు ఎట్లైననూ పుత్రసంతానమును పొందితీరవలెను. నీవు నాకు ప్రియమైనవాడవు. అట్లు గానిచో, నేను ప్రాణములను విడిచి పెట్టెదను(23).

సూత ఉవాచ|

ఏవముక్తం తయా శ్రుత్వా సుధర్మా భ్రాహ్మణోత్తమః | శివం సస్మార మనసా తదా గ్రహనిపీడితః || 24

అగ్నేరగ్రే% క్షిపత్పుష్పసద్వయం విప్రో హ్యతంద్రితః | మనసా దక్షిణం పుష్పం తన్మేనే పుత్రకామదమ్‌ || 25

ఏవం కృత్వా పణం పత్నీమువాచ బ్రాహ్మణస్సచ | అనయోర్గ్రా హ్యమేకం తు పుష్పం పుత్రఫలాప్తయే|| 26

తయా చ మనసా ధృత్వా పుత్రశ్చైవ భ##వేన్మమ| తదాచ స్వామినా యచ్చ ధృతం పుష్పం సమేతు మామ్‌ || 27

ఇత్యుక్త్వా చ తయా తత్ర నమస్కృత్య శివం తదా| నత్వా చాగ్నిం పునః ప్రార్థ్య గృహీతం పుష్పమే కకమ్‌ || 28

స్వామినా చింతితం యచ్చ తద్గృహీతం తయా నహి | సుదేహేన విమోహేన శివేచ్ఛా సంభ##వేన వై || 29

తద్దృష్ట్వా పురుషశ్చైవ నిశ్శ్వాసం పర్యమాచయత్‌ | స్మృత్వా శివపదాం భోజమువాచ నిజకామినీమ్‌ || 30

సూతుడు ఇట్లు పలికెను-

ఆమె యొక్క ఆ పలుకులను విని బ్రాహ్మణోత్తముడగు సుధర్ముడు ఆమె యెక్క పట్టుదలకు దుఃఖించి మనస్సులో శివుని స్మరించెను (24). సోమరితనమునెరుంగని ఆ బ్రాహ్మణుడు రెండు పుష్పములను అగ్ని యెదుటనుంచి కుడివైపున ఉన్న పుష్పము పుత్రసంతానమును సూచించునని మనస్సులో భావన చేసెను (25). ఈ విధముగా ప్రతిజ్ఞను చేసుకొని ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇట్లు పలికెను: పుత్రసంతానమును పొందుటకై ఈ రెండు పుష్పములలో ఒకదానిని తీయుము (26). నాకు పుత్రుడు కలుగుగాక! నా భర్త ఏ పుష్పమును ఆ ఫలమునకు నిర్దేశించినాడో, ఆ పుష్పము నా చేతికి వచ్చు గాక| అని ఆమె మనస్సులో భావన చేసి, అప్పుడు శివునకు మరియు అగ్నికి నమస్కరించి మరల ప్రార్థించి ఒక పుష్పమును తీసెను (27,28). శివుని ఇచ్ఛచే ఉదయించిన వ్యామోహముచే సుదేహ తన భర్తచే ఏ పుష్పము భావన చేయబడినదో, దానిని తీయలేదు (29). ఆమె తీసిన పుష్పమును చూచి ఆ భర్త నిట్టూర్పును విడిచెను. అతడు శివుని పాదపద్మమును స్మరించి తన భార్యతో నిట్లనెను (30).

సుధర్మోవాచ|

నిర్మితం చేశ్వరేణౖవ కథం చైవాన్యథా భ##వేత్‌ | అశాం త్యజ. ప్రియే త్వం చ పరిచర్యాం కురు ప్రభోః || 31

ఇత్యుక్త్వా తు స్వయం విప్ర ఆశాం పరివిహాయ చ | ధర్మకార్యరతస్సో%భూచ్ఛంకర ధ్యానతత్పరః ||32

సా సుదేహాగ్రహం నైవ ముమోచాత్మజకామ్యయా| ప్రత్యువాచ పతిం ప్రేవ్ణూ సాంజలిర్నత మస్తకా||33

సుధర్ముడు ఇట్లు పలికెను-

ఈశ్వరుడు నిర్ణయించినది మరియొక విధముగా ఎట్లు జరుగును? ఓ ప్రియురాలా! నీవు ఆశను విడనాడి ప్రభువును సేవించుము (31). ఇట్లు పలికి ఆ బ్రాహ్మణుడు తాను కూడ ఆశను పూర్తిగా విడచి శంకరుని ధ్యానించుటయందు మరియు ధర్మకార్యములను అనుష్ఠించుటయందు తత్పరుడాయెను (32). కాని ఆ సుదేహ తన పట్టుదలను విడనాడలేదు. ఆమె చేతులను జోడించి తలను వంచి నమస్కరించి భర్తతో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికెను (33).

సుదేహోవాచ|

మయి పుత్రో న చాస్త్వన్యాం పత్నీం కరు మదాజ్ఞయా| తస్యాం నూనం సుతశ్చైవ భవిష్యతి స సంశయః || 34

సుదేహ ఇట్లు పలికెను-

నాకు పుత్రుడు కలుగనిచో అటులనే కానిమ్ము, కాని నీకు నేను అనుమతిని ఇచ్చుచున్నాను నీవు మరల వివాహమాడుము. నీకు ఆ భార్యయందు నిశ్చయముగా పుత్రుడు కలుగననుటలో సందేహము లేదు (34).

సూత ఉవాచ

తదైవం ప్రథితో వై స బ్రాహ్మణశ్శైవసత్తమః | ఉవాచ స్వప్రియాం తాం చ సుదేహాం ధర్మతత్పరః || 35

అప్పుడు ఈ విధముగా కోరబడినవాడై , శివభక్తాగ్రగణ్యుడు మరియు ధర్మనిష్ట గలవాడు అగు ఆబ్రాహ్మణుడు తన ప్రియురాలగు ఆ సుదేహతో నిట్లనెను (35).

సుధర్మోవాచ|

త్వదీయం చ మదీయం చ సర్వం దుఃఖం గతం ధ్రువమ్‌ | తస్మాత్త్వం ధర్మవిఘ్నం చ ప్రియే మా కురు సాంప్రతమ్‌ || 36

నీ దుఃఖము, నా దుఃఖము కలిపి సర్వదుఃఖములు తొలగిపోయినవి. ఇది నిశ్చయము. ఓ ప్రియురాలా! కావున నీవు ఇపుడు ధర్మమునకు విఘ్నమును ఆచరించకుము (36).

సూత ఉవాచ|

ఇత్యేవం వారితా సా చ స్వమాతుః పుత్రికాం తదా | గృహమానీయ భర్తారం వృణు త్వేనామిదం జగౌ || 37

సూతుడు ఇట్లు పలికెను-

ఆయన ఈ విధముగా వారించిననూ, ఆమె తన తల్లియొక్క కుమార్తెను, ఇంటికి తీసుకువచ్చి భర్తతో ఈమెను వివాహమాడుమని చెప్పెను (37).

సుధర్మోవాచ|

ఇదానీం వదసి త్వం చ మత్స్రియేయం తతః పునః | పుత్రసూశ్చ యదా స్యాద్వై తదా స్పర్థాం కరిష్యసి|| 38

సుధర్ముడు ఇట్లు పలికెను-

ఈమె నాకు ప్రియమైన భార్య కావలెనని ఇప్పుడు చెప్పుచున్నావు కాని తరువాత ఈమె పుత్రుని కనిన పిదప నీవు ఆమెతో వైరమును చేసెదవు(38)

సూత ఉవాచ|

ఇత్యుక్త్వా తేన పతినా సా సుదేహా చ తత్ప్రియా | పునః ప్రాహ కరౌ బద్ద్వా సుధర్మాణం పతిం ద్విజాః || 39

నాహం స్పర్ధాం భగిన్యా వై కరిష్యే ద్విజసత్తమ| ఉపయచ్ఛస్వ పుత్రార్థమిమామాజ్ఞాపయామి చ||40

ఇత్యేవం ప్రార్థితస్సో%పి సుధర్మా ప్రియయా తయా | ఘుశ్మాం తాం సముపాయంస్త వివాహవిధినా ద్విజః || 41

తతస్తాం పరిణీయాథ ప్రార్థయామాస తాం ద్విజః | త్వదీయేయం కనిష్ఠా హి సదా పోష్యా నఘే ప్రియే || 42

ఉక్త్వైవం స చ ధర్మాత్మా సుధర్మా శైవసత్తమః | యథాయోగ్యం చకారాశు ధర్మసంగ్రహమాత్మనః || 43

సా చాపి మాతృపుత్రీం తాం దాసీవత్పర్యవర్తత | పరిత్యజ్య విరోధం హి పుపోషాహర్నిశం ప్రియా|| 44

కనిష్ఠా చైవ యా పత్నీ స్వస్రనుజ్ఞామవాప్య చ | పార్థవాన్‌ సా చకారాశు నిత్యమేకోత్తరం శతమ్‌ || 45

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! ఆమె భర్త ఇట్లు పలుకగా , ఆ బ్రాహ్మణపత్నియగు సుదేహ భర్తయగు సుధర్మునికి చేతులను జోడించి నమస్కరించి మరల ఇట్లు పలికెను (39). ఓ బ్రాహ్మణోత్తమా! నేను చెల్లెలితో విరోధమును పూనను, పుత్రసంతానము కొరకై ఈమెను వివాహమాడుటకు నీకు నేను అనుమతిని ఇచ్చుచున్నాను (40). ఆ ప్రియురాలు ఇట్లు ప్రార్థించగా ఆ సుధర్ముడు ఘుశ్మయను ఆ యువతిని యథావిధిగా వివాహమాడెను (41). ఆమెను వివాహమాడిన తరువాత ఆ బ్రాహ్మణడు సుదేహతో ఓ ప్రియురాలా! పాపము నెరుగని దానా! ఈమె నీకు చెల్లెలు; నీ వ్యక్తి గనుక ఈమెను సర్వదా పోషించుము అని ప్రార్ధించెను (42). ధర్మాత్ముడు, శివభక్తాగ్రగణ్యుడు అగు ఆ సుధర్ముడు తన ధర్మనిష్ఠను కాలము వ్యర్థము కాని విధముగా యథాయోగ్యముగా కొనసాగించెను (43). ఆ సుదేహ కూడ తన తల్లియొక్క ఆ పుత్రికకు దాసివలె సేవ చేసి విరోధమును విడిచిపెట్టి రాత్రింబగళ్లు ఆమెను ప్రేమతో పోషించెను (44). ఆ చిన్న భార్య అక్కగారి అనుమతిని పొంది ప్రతినిత్యము శివుని నూట ఒక్క పార్థివ మూర్తులను చేయుచుండెను (45).

విధానపూర్వకం ఘుశ్మా సోపచారసమన్వితమ్‌ | కృత్వా తాన్‌ ప్రాక్షిపత్తత్ర తడాగే నికటస్థితే || 46

ఏవం నిత్యం సా చకార శివపూజాం స్వకామదామ్‌ | విసృజ్య పునరావాహ్య తత్సపర్యావిధానతః || 47

కుర్వంత్యా నిత్యమేవం హి తస్యాశ్శంకరపూజనమ్‌ | లక్షసంఖ్యాభవత్పూర్ణా సర్వకామఫలప్రదా|| 48

కృపయా శంకరసై#్యవ తస్యాః పుత్రో వ్యజాయత| సుందస్సుభగశ్చైవ కల్యాణగుణభాజనమ్‌|| 49

తం దృష్ట్వా పరమప్రీతస్స విప్రో ధర్మవిత్తమః | అనాసక్తస్సుఖం భేజే జ్ఞానధర్మపరాయణః || 50

సుదేహా తావదస్యాస్తు స్పర్థాముగ్రాం చకార సా | ప్రథమం శీతలం తస్యా హృదయం హ్యసివత్పునః || 51

తతః పరం చ యజ్ఞాత కుత్సితం కర్మ దుఃఖదమ్‌ | సావధానేన మనసా శ్రూయతాం తన్మునీశ్వరాః || 52

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం సుదేహాసుధర్మచరిత వర్ణనం నామ ద్వాత్రింశో%ధ్యాయః (32).

ఘుశ్మ ఆ మూర్తులను యథావిధిగా సమస్తోపచారములతో అర్చించి వాటిని ఆచట సమీపమునందున్న చెరువు నందు విసర్జించెడిది (46). ఈ విధముగా ఆమె నిత్యము భక్తుని కోర్కెలను నెరవేర్చ శివ పూజను షోడశోపచారపూర్వకముగా చేసి విసర్జించి మరల అవాహన చేసెడిది. (47) ఈ విధముగా ఆమె నిత్యము శంకరుని పూజించుచుండగా సకలకామనలను ఇచ్చే లక్షసంఖ్యాత్మకమగు పూర్ణపూజ పూర్తి ఆయెను(48) శంకరుని అనుగ్రహముచే ఆమెకు సుందరుడు, భాగ్యవంతుడు, కళ్యాణగుణములతో కూడియున్నావాడు అగు పుత్రడు పుట్టెను(49) ధర్మవేత్తయగు ఆ బ్రాహ్మణుడు ఆ బాలకుని చూచి పరమానందమును పొందెను. జ్ఞానమునందు మరియు ధర్మమునందు తత్పరుడై యున్న ఆ సుధర్ముడు ఆసక్తి లేని వాడై పుత్రసుఖమును అనుభవించెను (50). కాని ఆ సుదేహ ఘుశ్మపై తీవ్రమగు ద్వేషమును ప్రదర్శించెను. ముందుగా చల్లగానున్న ఆమె హృదయము ఇప్పుడు కత్తివలె మారిపోయెను (51). ఓ మునీశ్వరులారా! తరువాత జరిగిన దుఃఖమును కలిగించే కుత్సితమైన కర్మను గురించి సావధానమనస్కులై వినుడు (52).

శ్రీ శివ మహాపురాణములోని కోటి రుద్రసంహితయందు సుదేహాసుధర్మ చరితమును వర్ణించే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది(32).

Siva Maha Puranam-3    Chapters