Siva Maha Puranam-3    Chapters   

అథషడ్వింశో%ధ్యాయః

త్రంబకేశ్వర మాహాత్మ్యము

సూత ఉవాచ|

ఏవం కృతే తు ఋషిణా సస్త్రీ కేన ద్విజాశ్శివః | అవిర్భభూవ సశివః ప్రసన్నస్సగణస్తదా|| 1

అథ ప్రసన్నస్స శివో వరం బ్రూహి మహామునే | ప్రసన్నో%హం సుభక్త్యా త ఇత్యువాచ కృపానిధిః || 2

తదా తత్సుందరం రూపం దృష్య్వా శంభోర్మహాత్మనః | ప్రణమ్య శంకరం భక్త్వా స్తుతిం చక్రే ముదాన్వితః || 3

స్తుత్వా బహు ప్రణమ్యేశం బద్దాంజలిపుటః స్థితః | నిష్పాపం కురు మాం దేవాబ్రవీదితి స గౌతమః || 4

ఇత్యాకర్ణ్య వచస్తస్య గౌతమస్య మహాత్మనః | సుప్రసన్నతరో భూత్వా శివో వాక్యముపాదదే|| 5

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! ఆ మహర్షి భార్యతో గూడి ఈ విధముగా చేయగానే అపుడు శివుడు ప్రసన్నుడై పార్వతితో మరియు గణములతో గూడి సాక్షత్కరించెను(1). అపుడు దయానిధియగు ఆ శివుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను: ఓమహర్షీ ! నీ గొప్ప భక్తికి నేను ప్రసన్నుడనైతిని. వరమును కొరుకొనుము (2). అప్పుడు గౌతముడు మంగళకరపరమాత్మయగు శంభుని ఆ సుందరరూపమును గాంచి భక్తితో ప్రణమిల్లి ఆనందముతో గూడినవాడై స్తుతించెను (3). ఆ గౌతముడు పరిపరివిధమల స్తుతించి చేతులను జోడించి ఈశ్వరునకు నమస్కరించి నిలబడి ఇట్లు పలికెను. ఓ దేవా! నా పాపమును నిర్మూలించుము (4). మహాత్మడగు ఆ గౌతముని ఈ మాటను విని శివుడు మరింత ప్రసన్నుడై ఇట్లు పలికెను(5)

శివ ఉవాచ|

ధన్యో% సి కృతకృత్యో%సి నిష్పాపో%సి సదా మునే| ఏతైర్దుష్టైః కిల త్వం చ చ్ఛాలితో% సి ఖలాత్మభిః || 6

త్వదీయదర్శనాల్లోకా నిష్పాపాశ్చ భవంతి హి | కిం పునస్త్వం సపాపో%సి మద్భక్తినిరతస్సదా|| 7

ఉపద్రవస్త్వయి మునే యైః కృతస్తు దురాత్మభిః | తే పాపాశ్చ దురాచారా హత్యావంతస్త ఏవహి|| 8

ఏతేషాం దర్శనాదన్యే పాపిష్ఠాస్సంభవంతు చ | కృతఘ్నాశ్చ తథా జాతా నైతేషాం నిష్కృతిః క్వచిత్‌ || 9

శివుడు ఇట్లు పలికెను-

ఓ మహర్షి! నీవు ధన్యుడవు కృతార్థుడవు. నీవు సర్వకాలములలో పాపరహితుడవే క్రూరమనస్కులగు ఈ దుష్టులు నిన్ను మోసగించిరి(6).నిన్ను చూచిన మానవులు పాపవిముక్తులగుదురు. సర్వదా నా భక్తియందు పరాయణుడవగు నీవు పాపాత్ముడవగుట ఎట్లు సంభవము? (7) ఏ దురాత్ములైతే నీకు ఈ ఆపదను కలిగించిరో, వారే పాపాత్ములు దురాచారులు మరియు హత్యాదోషము గలవారు అగుచున్నారు (8). ఈ కృతఘ్నులను చూచినవారికి పాపము చుట్టుకొనును. వీరికి ఎక్కడనైననూ నిష్కృతి లేదు(9).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా శంకరస్తసై#్మ తేషాం దుశ్చరితం తదా | బహూవాచ ప్రభుర్విప్రాస్సత్కదో% సత్సు దండదః || 10

శర్వోక్తమితి స శ్రుత్వా సువిస్మితమనా ఋషిః | సుప్రణమ్య శివం భక్త్వా సాంజలిః పునరబ్రవీత్‌|| 11

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! సత్పురుషులకు ఆనందమును ఇచ్చి దుష్టులకు దండమును విధించే శంకర ప్రభుడు అప్పుడు వారి దుశ్చేష్టలను గురించి అతనికి వివరముగా చెప్పెను (10). శివుని ఆ మాటలను విని ఆ మహర్షి పరమాశ్చర్యమును పొంది శివునకు చేతులను జోడించి భక్తితో ప్రణమిల్లి మరల ఇట్లు పలికెను (11).

గౌతమ ఉవాచ|

ఋషిభిసై#్తర్మహేశాన హ్యుపకారః కృతో మహాన్‌ | యద్యేవం న కృతం తైస్తు దర్శనం తే కుతో భ##వేత్‌ ||12

ధన్యాస్తే ఋషయో యైస్తు మహ్యం శుభతరం కృతమ్‌ | తద్దురాచరణాదేవ మమ స్వార్థో మహానభూత్‌ || 13

గౌతముడు ఇట్లు పలికెను-

ఓమహేశ్వరా! ఆ ఋషులు మహోపకారమును చేసిరి. వారు అట్లు చేసి ఉండనిచో, నీదర్శనము ఎట్లు లభించును?(12) నాకు అతిశయించిన శుభమును కలిగించిన ఆ మహర్షులు ధన్యులు. వారి దుష్టకృత్యమువలన మాత్రమే నాకు పెద్ద ఉపకారము సిద్ధించినది(13).

సూత ఉవాచ|

ఇత్యేవం తద్వచశ్శ్రుత్వా సుప్రసన్నో మహేశ్వరః | గౌతమం ప్రత్యువాచాశు కృపాదృష్ట్వా విలోక్య చ||14

సూతుడు ఇట్లు పలికెను-

గౌతముని ఆ వచనములను విని మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై ఆయన పై దయాదృష్టులను బరపి వెంటనే ఇట్లు బదులిడెను(14).

శివ ఉవాచ|

ఋషిర్ధన్యో%సి విప్రేంద్ర ఋషే, శ్రేష్ఠతరో% సివై| జ్ఞాత్వా మాం సుప్రసన్నం హి వృణు త్వం వరముత్తమమ్‌|| 15

శివుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణశ్రేష్టా! నీవు ధన్యుడవగు మహర్షివి, పరమశ్రేష్ఠుడువు. నేను మిక్కిలి ప్రసన్నుడనైనానని తెలుసుకొని నీవు ఉత్తమమగు వరమును కోరుకొనుము(15).

సూత ఉవాచ|

గౌతమో పి విచార్యైవంం లోకే విశ్రుతమత్యత | అన్యథా న భ##వే దేవ తస్మాదుక్తం సమాచరేత్‌ ||

నిశ్చిత్వం మునిశ్రేష్ఠా గౌతమశ్శివభక్తిమాన్‌ | సాంజలిర్నతశీర్షో హి శంకరం వాక్యమబ్రవీత్‌ ||17

సూతుడు ఇట్లు పలికెను-

గౌతముడు ఇట్లు ఆలోచించెను. ఈ వృత్తాంతము లోకములో ప్రసిద్ధిని గాంచును. దీనిని ఆపే ఉపాయము లేనే లేదు. కావున నేను చెప్పినట్లు చేసెదను (16). శివభక్తి గల ఆ గౌతమహర్షి ఇట్లు నిశ్చయించుకొని చేతులను జోడించి తలను వంచి శంకరునితో ఇట్లు పలికెను(17).

గౌతమ ఉవాచ|

సత్యం నాథ బ్రవీషి త్వం తథాపి పంచభిః కృతమ్‌ | నాన్యథా భవతీత్యత్ర యజ్జాతం జాయతాం తు తత్‌|| 18

యది ప్రసన్నో దేవేశ గంగా చ దీయతాం మమ | కురు లోకోపకారం హి నమస్తే%స్తు నమో% స్తుతే|| 19

గౌతముడు ఇట్లు పలికెను-

ఓ నాథా ! నీవు సత్యమును పలికితివి. ఐదుగురుముఖ్యమైనవారు ఈ పనిని చేసినారు. విధిబలముచే అట్లు జరుగవలసియున్నది. జరిగినదాని గురించి చింత వలదు(18). ఓ దేవ దేవా! నీవు ప్రసన్నుడవైనచో నాకు గంగను ఇచ్చి లోకోపకారమును చేయుము. నీకు అనేకనమస్కారములు(19).

సూత ఉవాచ|

ఇత్యుక్త్వా వచనం తస్య ధృత్వా వై పాదపంకజమ్‌| నమశ్చకారదేవేశం గౌతమో లోకకామ్యయా|| 20

తతస్తు శంకరో దేవః పృథివ్యాశ్చ దివశ్చ సః | సారం చైవ సముద్భృత్య రక్షితం పూర్వమేవ తత్‌ || 21

వివాహే బ్రాహ్మణా దత్తమవశిష్టం చ కించన| తత్తసై#్మ దత్తవాన్‌ శంభుర్మునయో భక్తవత్సలః ||22

గంగాజలం తదా తత్ర స్త్రీ రూపమభవత్సరమ్‌ | తస్యాశ్చైవ ఋషి శ్రేష్ఠః స్తుతిం కృత్వా నతిం వ్యధాత్‌ || 23

సూతుడు ఇట్లు పలికెను-

గౌతముడు ఇట్లు పలికి లోకముల హితమును చేయగోరి ఆ దేవదేవుని పాదపద్మలను పట్టుకొని నమస్కరించెను (20). పూర్వము భూలోకస్వర్గలోకముల సారమును తీసి దానిలో కొంతభాగము గౌతమునకు వివాహములో బ్రహ్మచే ఈయబడెను. మిగిలినది దాచియుంచబడెను. అపుడు భక్తవత్సలుడు, మంగళకరుడు అగు శంభుదేవుడు దానిని ఆ మహర్షికి ఇచ్చెను (21,22). అపుడు అచట గంగాజలము గొప్ప స్త్రీ రూపమును దాల్చెను. ఆమహర్షి ఆమెకు నమస్కరించి స్తుతించెను(23).

గౌతమ ఉవాచ|

ధన్యాసి కృతకృత్యాసి పావితం భువనం త్వయా| మాం చ పావయ గంగే త్వం పతంతం నిరయే ధ్రువమ్‌||24

గౌతముడు ఇట్లు పలికెను-

ఓ గంగా ! నీవు ధన్యురాలవు కృతకృత్యురాలవు. నీవు లోకమును పవిత్రము చేసితివి. నిశ్చయముగా నరకములో పడబోయే నన్ను కూడ పవిత్రముచేయుము(24).

సూత ఉవాచ|

శంభుశ్చాపి తదోవాచ సర్వేషాం హితకృచ్ఛృణు| గంగే గౌతమమేనం త్వం పావయస్వ మదాజ్ఞయా || 25

ఇతి శ్రుత్వా వచస్తస్య శంభోశ్చ గౌతమస్య చ | ఉవాచైవం శివం గంగా శివశక్తిర్హి పావనీ|| 26

సూతుడు ఇట్లు పలికెను-

అపుడు సర్వులకు హితమును చేసే శంభుడు కూడ ఇట్లు పలికెను. ఓ గంగా ! వినుము నా ఆజ్ఞచే ఈ గౌతముని నీవు పావనము చేయుము(25). శంభుని మరియు గౌతముని ఈ మాటలను విని శివుని శక్తి స్వరూపిణి మరియు పరమపావని అగు గంగ శివునితో నిట్లు పలికెను(26).

గంగోవాచ|

ఋషిం తు పావయిత్వాహం పరివారయుతం ప్రభో| గమిష్యామి నిజస్థానం వచస్సత్యం బ్రవీమి హ|| 27

గంగ ఇట్లు పలికెను-

ఓ ప్రభూ! నేను ఈ ఋషిని కుటుంబసమేతముగాపావనము చేసి నాస్థానమునకు వెళ్ళెదను. నేను సత్యమును పలుకుచున్నాను(27).

సూత ఉవాచ|

ఇత్యుక్తో గంగయా త్రత మహేశో భక్తవత్సలః | లోకోపకరణార్థాయ పునర్గంగాం వచో%బ్రవీత్‌ || 28

సూతుడు ఇట్లు పలికెను-

ఆ సమయములో గంగ ఇట్లు పలుకగా, భక్తవత్సలుడగు మహేశ్వరుడు లోకములకు ఉపకారమునుచేయగోరి గంగతోమరలనిట్లనెను(28).

శివ ఉవాచ|

త్వయా స్థాతవ్యమత్రైవ వ్రజేద్యావత్కలిర్యుగః| వైవస్వతో మనుర్దేవి హ్యష్టావింశత్తమో భ##వేత్‌|| 29

శివుడు ఇట్లు పలికెను-

ఓ దేవి! కలియుగము వచ్చి సూర్యుని కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువు అగునంతవరకు ఇక్కడనే నీవు ఉండవలసినది(29).

సూత ఉవాచ|

ఇతి శ్రూత్వా వచస్తస్య స్వామినశ్శంకరస్య తత్‌ | ప్రత్యువాచ పునర్గంగా పావనీ సా సరిద్వరా||30

సూతుడు ఇట్లు పలికెను-

ఆ శంకరప్రభుని ఈ మాటను విని నదీమ తల్లి, పరమపావనియగు ఆ గంగ ఇట్లు బదులిడెను (30).

గంగోవాచ|

మహాత్మ్యమధికం చేత్స్యాన్మమ స్వామిన్‌ మహేశ్వర| సర్వేభ్యశ్చ తదా స్థాస్యే ధరాయాం త్రిపురాంతక|| 31

కించాన్యచ్చ శృణు స్వామిన్‌ వపుషా సుందరేణ హ | తిష్ఠ త్వం మత్సమీపే వై సగణస్సాంబికః ప్రభో || 32

గంగ ఇట్లు పలికెను-

ఓ స్వామీ! మహేశ్వరా! త్రిపురాసురసంహారకా! భూమండలమునందు నాకు అన్నింటినీ మించిన గొప్పదనము కలిగే పక్షములో నేను ఇచట ఉండగలను (31). ఓ స్వామీ! మరియొక విషయము కూడ వినుడు ఓ ప్రభూ! నీవు గణములతో మరియు పార్వతితో గూడి సుందరమగు దేహమును దాల్చి నా సమీపములో నుండుము(32)

సూత ఉవాచ

ఏవం తస్యా వచశ్శ్రుత్వా శంకరో భక్తవత్సలః | లోకోపకరణార్థాయ పునర్గంగాం వచో %బ్రవీత్‌||33

సూతుడు ఇట్లు పలికెను-

ఆమెయొక్క ఈ మాటను విని భక్తవత్సలుడగు శంకరుడు లోకములకు ఉపకారమును చేయగోరి గంగతో మరలనిట్లనెను(33)

శివ ఉవాచ|

ధన్యాసి శ్రూయతాం గంగే హ్యహం భిన్నస్త్వయా నహి| తథాపి స్థీయతే హ్యత్ర స్థీయతాం చ త్వయాపి హి ||

శివుడు ఇట్లు పలికెను-

ఓ గంగా1 నీవు ధన్యురాలవు. వినుము నీవు నాకంటే వేరుగా లేవు అయిననూ నేను ఇచట ఉండెదను. నీవు కూడ ఉండుము(34).

సూత ఉవాచ|

ఇత్యేవం వచనం శ్రుత్వా స్వామినః పరమేశితుః| ప్రసన్నమానసా భూత్వా గంగా చ ప్రత్యపూజయత్‌ || 35

ఏతస్మిన్నంతరే దేవా ఋషయశ్చపురాతనాః | సుతీర్థాన్యప్యనేకాని క్షేత్రాణి వివిధాని చ||36

అగత్య గౌతమం సర్వే గంగాం చ గిరిశం తథా | జయా జయేతి భాషంతః పూజయామాసురాదరాత్‌ || 37

తతస్తే నిర్జరాస్సర్వేతేషాం చక్రుః స్తుతిం ముదా| కరాన్‌ బద్ధ్వా నతస్కంధా హరిబ్రహ్మాదయస్తదా||38

గంగా ప్రసన్నా తేభ్యశ్చ గిరిశశ్చో చతుస్తదా | వరం బ్రూత సురశ్రేష్ఠా దద్యోవః ప్రియకామ్యయా|| 39

సూతుడు ఇట్లు పలికెను-

పరమేశ్వరప్రభుని ఈ వచనములను విని గంగ మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలదై ఆయనను పూజించెను(35). ఇంతలో అచటకు దేవతలు, ప్రాచీనులగు ఋషులు, అనేకతీర్థములు మరియు వివిధక్షేత్రములు (36) వచ్చి అందరు గౌతముని, గంగను మరియు కైలాసపతిని జయజయధ్వానములను పలికి ఆదరముతో పూజించిరి. తరువాత బ్రహ్మ విష్ణువు మొదలగు ఆ దేవతలు అందరు చేతులను కట్టుకొని నడుములను వంచి ఆనందముతో వారిని స్తుతించిరి (38). గంగ మరియు శివుడు అపుడు వారి విషయములో ప్రసన్నులై ఇట్లు పలికిరి: ఓ దేవోత్తములారా! మీకు ప్రియమును చేయగోరి వరమును ఈయ సంకల్పించినాము. కోరుకొనుడు(39).

దేవా ఊచుః |

యదా ప్రసన్నో దేవేశ ప్రసన్నా త్వం సరిద్వరే | స్థాతవ్యమత్ర కృపయా నః ప్రియార్థం తథా నృణామ్‌ || 40

దేవతలు ఇట్లు పలికిరి-

ఓదేవదేవా! ఓ నదీశ్రేష్ఠమా! మీరు ప్రసన్నులైనచో , మాయొక్క మరియు మానవులయొక్క ప్రీతి కొరకు దయతో ఇచటనే స్థిరముగా నుండుడు(40)

గంగోవాచ|

యూయం సర్వప్రియార్థం చ తిష్ఠథాత్ర నకిం పునః| గౌతమం క్షాలయిత్వాహం గమిష్యామి యథాగతమ్‌|| 41

భవత్సు మే విశేషో% త్రజ్ఞేయశ్చైవ కథం సురాః| తత్రమాణం కృతం చేత్స్యాత్తదా తిష్ఠామ్య సంశయమ్‌ || 42

గంగ ఇట్లు పలికెను-

సర్వులకు ప్రీతిని కలిగించుటకొరకై మీరు ఇచటనే ఏల ఉండరాదు? నేను గౌతముని పాపమును కడిగివేసి వచ్చిన దారిన వెళ్ళెదను(41). ఓ దేవతలారా! మీ అందరిలో నా ప్రత్యేకత తెలిసే విధమేది? మీరు ఆ విషయమును నిరూపించినచో, అపుడు నేను నిస్సందేహముగా ఉండగలను(42).

సర్వేఊచుః|

సింహరాశౌ యదా స్యాద్వై గరుస్సర్వసుహృత్తమః| తదా వయం చ సర్వే త్వాగమిష్యామో న సంశయః||43

ఏకాదశచ వర్షణి లోకానం పాతకం త్విహ | క్షాలితం యద్భవేదేవం మలినాస్మ్స సరిద్వరే||44

తసై#్యవ క్షాలనాయ త్వాయస్యామస్సర్వథా ప్రియే | త్వత్సకాశం మహాదేవి ప్రోచ్యతే సత్యమాదరాత్‌ || 45

అనుగ్రహాయ లోకానామస్మాకం ప్రియకామ్యయా | స్థాతవ్యం శంకరేణాపి త్వయా చైవ సరిద్వరే || 46

యావత్సింహే గురుశ్చైవ స్థాస్యామస్తావదేవ హి | త్వయి స్నానం త్రికాలం చ శంకరస్య చ దర్శనమ్‌ || 47

కృత్వా స్వపాపం నిఖిలం విమోక్ష్యామో న సంశయః | స్వదేశాంశ్చ గమిష్యామో భవచ్ఛాసనతో వయమ్‌ || 48

అందరు ఇట్లు పలికిరి -

సర్వులకు ప్రియమిత్రుడగు గురువు ఎప్పుడైతే సింహరాశియందు ఉండునో, అప్పుడు మేమందరము నిస్సంశయముగా నీలోనికి వచ్చెదము (43). ఓ నదీశ్రేష్ఠమా! పదకొండు సంవత్సరములు మేము మానవుల పాతకములను క్షాళితము చేసి మేము కూడ మాలిన్యమును పొందెదము (44). ఓ ప్రీతిపాత్రమైనదానా! అపుడు మేము ఆ మాలిన్యమును క్షాళితము చేసుకొనుటకై నీ సమీపమునకు వచ్చెదము. ఓ మహాదేవి! మేము నీ ఎదుట ఆదరముతో సత్యమును పలుకుచున్నాము (45). ఓ నదీశ్రేష్ఠమా! లోకానుగ్రహముకొరకు మరియు మాకు ప్రీతిని కలిగించుటకొరకు నీవు శంకరునితో సహా ఇచట స్థిరముగా నుండుము (46). సింహములో గురుడు ఉన్నంతవరకు మేము నీయందు ఉండెదము. మూడు కాలములయందు నీలో స్నానము చేసి, శంకరుని దర్శించి (47), మేము మా పాపములన్నింటినుండి నిస్సందేహముగా విముక్తిని పొందెదము. తరువాత నీ అనుమతిని పొంది మా మా స్థానములకు వెళ్లెదము (48).

సూత ఉవాచ |

ఇత్యేవం ప్రార్థితసై#్తస్తు గౌతమేన మహర్షిణా | స్థితో%సౌ శంకరః ప్రీత్యా స్థితా సా చ సరిద్వరా || 49

సా గంగా గౌతమీ నామ్నా లింగం త్ర్యంబకమీరితమ్‌ | ఖ్యాతా ఖ్యాతం బభూవాథ మహాపాతకనాశనమ్‌ || 50

తద్దినం హి సమారభ్య సింహాస్థే చ బృహస్పతౌ | ఆయాంతి సర్వతీర్థాని క్షేత్రాణి దైవతాని చ || 51

సరాంసి పుష్కరాదీని గంగాద్యాస్సరితస్తథా | వాసుదేవాదయో దేవాస్సంతి వై గౌతమీతటే || 52

యావత్తత్ర స్థితానీహ తావత్తేషాం ఫలం న హి | స్వప్రదేశే సమాయాతాస్తర్హ్యే తేషాం ఫలం భ##వేత్‌ || 53

జ్యోతిర్లింగమిదం ప్రోక్తం త్ర్యంబకం నామ విశ్రుతమ్‌ | స్థితం తటే హి గౌతమ్యా మహాపాతకనాశనమ్‌ || 54

యః పశ్యేద్భక్తితో జ్యోతిర్లింగం త్ర్యంబకనామకమ్‌ | పూజయేత్ర్ప ణమేత్‌ స్తుత్వా సర్వపాపైః ప్రముచ్యతే || 55

జ్యోతిర్లింగం త్ర్యంబకం హి పూజితం గౌతమేన హ | సర్వకామప్రదం చాత్ర పరత్ర పరముక్తిదమ్‌ || 56

ఇతి పశ్చ సమాఖ్యాతం యత్పృష్టో% హం మునీశ్వరాః | కిమన్యదిచ్ఛథ శ్రోతుం తద్‌ బ్రూయాం వో న సంశయః || 57

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం త్ర్యంబకేశ్వరమాహాత్మ్య వర్ణనం నామ షడ్వింశో%ధ్యాయః (26).

సూతుడు ఇట్లు పలికెను-

ఈ విధముగా గౌతమ మహర్షి మరియు ఇతరులు ప్రార్థించగా శంకరుడు మరియు నదీరాజమగు గంగ ప్రీతితో అచటనే యుండిరి (49). ఆ గంగకు గౌతమి అనియు, మహాపాపములను పోగొట్టే ఆ లింగమునకు త్ర్యంబకేశ్వరుడనియు తరువాత ప్రఖ్యాతి కలిగెను (50). ఆ నాటినుండియు గురువు సింహరాశిలోనుండగా సర్వతీర్థములు, క్షేత్రములు మరియు దేవతలు అచటకు వచ్చెదరు (51). అపుడు పుష్కరము మొదలగు సరస్సులు, గంగ మొదలగు నదులు, వాసుదేవుడు మొదలగు దేవతలు గౌతమీనదియొక్క ఒడ్డున ఉండెదరు (52). ఇచట ఉన్నంతవరకు వాటికి తమ స్వస్థానములో మహిమ ఉండదు. అవి తమ స్థానమునకు వెళ్లిన తరువాత మరల ఫలమును ఈయగల్గును (53). గౌతమీతీరమునందు ఉన్న మహాపాపములను పోగొట్టే ఈ జ్యోతిర్లింగమునకు త్ర్యంబకేశ్వరుడని ప్రఖ్యాతి గలదు (54). ఎవడైతే త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగమును దర్శించి నమస్కరించి స్తుతించి పూజించునో, అట్టివాడు సర్వపాపములనుండి విముక్తిని పొందును (55). గౌతమునిచే పూజింపబడిన త్ర్యంబకేశ్వరజ్యోతిర్లింగము ఈ లోకములో కోర్కెలనన్నిటినీ ఈడేర్చి పరలోకములో సర్వోత్కృష్టమగు ముక్తిని ఇచ్చును (56). ఓ మహర్షులారా! మీరు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ వృత్తాంతమును చెప్పితిని. మీరు ఇంకనూ ఏమి వినగోరుచున్నారు? నేను నిస్సందేహముగా చెప్పెదను (57).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు త్ర్యంబకేశ్వరమాహాత్మ్యమున వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).

Siva Maha Puranam-3    Chapters