Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

హటకేశ్వరుని ఆవిర్భావము

ఋషయ ఊచుః |

సూతజానాసి సకలం వస్తు వ్యాస ప్రసాదతః | తవాజ్ఞాతం న విద్యేత తస్మాత్పృచ్ఛా మహే వయమ్‌ || 1

లింగం చ పూజ్యతే లోకే తత్త్వయా కథితం చ యత్‌ | తత్తథైవ న చాన్యద్వా కారణం విద్యతే త్విహ || 2

బాణరూపా శ్రుతా లోకే పార్వతీ శివవల్లభా | ఏతత్కిం కారణం సూత కథయం త్వం యథాశ్రుతమ్‌ || 3

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞానమును కలిగియున్నావు. నీకు తెలియనది ఉండదు. కావుననే మేము నిన్ను ప్రశ్నించుచున్నాము (1). లోకములో లింగము పూజింపబడుచున్నది దానిని గురించి నీవు చెప్పియున్నావు. అది మరియొక విధముగా గాక, అటులనే పూజింపబడుటకు కారణమేమైన గలదా? (2) శివునకు ప్రియురాలగు పార్వతి లోకములో బాణరూపములో ప్రసిద్ధిని గాంచినది. ఓ సూతా! దీనికి కారణమేమి? నీవు విన్నదానికి అనురూపముగా చెప్పుము (3).

సూత ఉవాచ |

కల్పభేద కథాచైవ శ్రుతా వ్యాసాన్మయా ద్విజాః | తామేవ కథయామ్యద్య శ్రూయతామృషిసత్తమాః || 4

పురా దారువనే జాతం యద్వృత్తం తు ద్విజన్మనామ్‌ | తదేవ శ్రూయతాం సమ్యక్‌ కథయామి యథాశ్రుతమ్‌ || 5

దారునామ వనం శ్రేష్ఠం తత్రా సన్నృషిసత్తమాః | శివభక్తాస్సదా నిత్యం శివధ్యానపరాయణాః || 6

త్రికాలం శివపూజాం చ కుర్వంతి స్మ నిరంతరమ్‌ | నానా విధైః స్తవైర్దివ్యైస్తుష్టువుస్తే మునీశ్వరాః || 7

తే కదాచిద్వనే యాతా స్సమిధాహరణాయ చ | సర్వే ద్విజర్షభాశ్శైవాశ్శివధ్యాన పరాయణాః || 8

ఏతస్మిన్నంతరే సాక్షాచ్ఛంకరో నీలలోహితః | విరూపం చ సమాస్థాయ పరీక్షార్థం సమాగతః || 9

దిగంబరో%తితేజస్వీ భూతిభూషణ భూషితః | స చేష్టామ కరోద్దుష్టాం హస్తే లింగం విధారయన్‌ || 10

సూతుడిట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! మరియొక కల్పమునకు చెందిన గాథను నేను వ్యాసుని వలన వినియుంటిని. ఇపుడు దానిని మాత్రమే చెప్పుచున్నాను. ఓ మహర్షులారా! వినుడు (4). పూర్వము దారుకావనములోని బ్రాహ్మణుల సన్నిధిలో జరిగిన వృత్తాంతమును మాత్రమే చక్కగా విన్నది విన్నట్లుగా చెప్పుచున్నాను. వినుడు (5). దారుకావనము చాలా గొప్పది. సదా శివభక్తులు, నిత్యము శివధ్యానములో నిమగ్నమైనవారు అగు మహర్షులు అచట ఉండిరి (6). వారు నిరంతరముగా మూడు కాలములయందు శివుని పూజించెడివారు. ఆ మహర్షులు అనేకరకముల దివ్యస్తోత్రములతో స్తుతించెడివారు (7). శివభక్తులు, శివధ్యాన నిరతులు అగు ఆ బ్రాహ్మణశ్రేష్ఠులందరు ఒకనాడు సమిధలను తెచ్చుకొనుటకై అడవికి వెళ్లిరి (8). ఇంతలో కంఠమునందు నీలవర్ణము, ఇతరత్ర ఎర్రని వర్ణముగల శంకరుడు వారిని పరీక్షించుటకై స్వయముగా వికటరూపమును దాల్చి విచ్చేసెను (9). దిగంబరుడు, మహాతేజశ్శాలి, భస్మయే అలంకారముగా గలవాడు అగు ఆ శివుడు అచట వికృతమగు చేష్టలను చేసెను (10).

మనసా చ ప్రియం తేషాం కర్తుం వై వనవాసినామ్‌ | జగామ తద్వనం ప్రీత్యా భక్తప్రీతో హరస్స్వయమ్‌ || 11

తం దృష్ట్వా ఋషిపత్న్యస్తాః పరం త్రాసముపాగతాః | విహ్వలా విస్మితాశ్చాన్యాస్సమాజగ్ముస్తథా పునః || 12

ఆలిలింగుస్తథా చాన్యా కరం ధృత్వా తథాపరాః | పరస్పరం తు సంఘర్షాత్సంమగ్నాస్తాస్త్స్రి యస్తదా || 13

ఏతస్మిన్నేవ సమయే ఋషివర్యాస్సమాగమన్‌ | విరుద్ధం తం చ తే దృష్ట్వా దుఃఖితాః క్రోధమూర్ఛితాః || 14

తదా దుఃఖమనుప్రాప్తాః కో%యం కో%యం తథా%బ్రువన్‌ | సమస్తా ఋషయస్తే వై శివమాయా విమోహితాః || 15

యదా చ నోక్తవాన్‌ కించిత్సో%వధూతో దిగంబరః | ఊచుస్తం పురుషం భీమం తదా తే పరమర్షయః || 16

త్వయా విరుద్ధం క్రియతే వేదమార్గవిలోపి యత్‌ | తతస్త్వదీయం తల్లింగం పతతాం పృథివీతలే || 17

భక్తప్రియుడగు శివుడు వనమునందు నివసించే ఆ ఋషులకు ప్రియమును చేయగోరి స్వయముగా ప్రేమతో ఆ వనమునకు వెళ్లెను (11). ఆయనను చూచి ఆ ఋషి పత్నులు కంగారుపడి, భయమును విస్మయమును అధికముగా పొందిరి (12). వారు కంగారుపడి ఒకరి చేతులను మరియొకరు పట్టుకొని పరస్పరము కౌగిలించుకొనిరి. అపుడు వారి మధ్య కంగారులో త్రొక్కిసలాట జరిగెను (13). అదే సమయములో మహర్షులు తిరిగి వచ్చి ఆ విడ్డూరమును చూచి దుఃఖమును, అతిశయించిన క్రోధమును పొందిరి (14). ఎవరీతడు? ఎవరీతడు? అని పలుకుతూ, శివమాయచే విమోహితులైన ఆ ఋషులందరు అపుడు దుఃఖమును పొందిరి (15). దిగంబరుడగు ఆ అవధూత సమాధానమునీయలేదు. అపుడా మహర్షులు భయంకరా కారుడగు ఆ పురుషునితో నిట్లు పలికరి (16). నీవు వేదమార్గమునకు హానిని కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు గనక, నీ లింగము నేలపైపడుగాక! (17).

ఇత్యుక్తే తు తదా తైశ్చ లింగం చ పతితం క్షణాత్‌ | అవధూతస్య తస్యాశు శివస్యాద్భుతరూపిణః || 18

తల్లింగం చాగ్నివత్సర్వం యద్ధదాహ పురస్థ్సితమ్‌ | యత్ర యత్ర చ తద్యాతి తత్ర తత్ర దహేత్పునః || 19

పాతాలే చ గతం తచ్చ స్వర్గే చాపి తథైవ చ | భూమౌ సర్వత్ర తద్యాతం న కుత్రాపి స్థిరం హి తత్‌ || 20

లోకాశ్చ వ్యాకులా జాతా ఋషయస్తే%తిదుఃఖితాః | న శర్మ లేభిరే కే చిద్దేశాశ్చ ఋషయస్తథా || 21

న జ్ఞాతస్తు శివో యైస్తు తే సర్వే చ సురర్షయః | దుఃఖితా మిలితాశ్శీఘ్రం బ్రహ్మాణం శరణం యయుః || 22

తత్ర గత్వా చ తే సర్వే నత్వా స్తుత్వా విధిం ద్విజాః | తత్సర్వమవదన్‌ వృత్తం బ్రహ్మణ సృష్టికారిణ || 23

బ్రహ్మ తద్వచనం శ్రుత్వా శివమాయా విమోహితాన్‌ | జ్ఞాత్వా తాన్‌ శంకరం నత్వా ప్రోవాచ ఋషిసత్తమాన్‌ || 24

వారు అట్లు పలుకగానే అద్భుతమగు అవధూత రూపములో నున్న ఆ శివుని లింగము వెంటనే క్రిందబడెను (18). ఆ లింగము అగ్నివలె ఎదుటనున్న సర్వమును దహించుటయే గాక, అది ఎచ్చటెచ్చటకు వెళ్లెనో, అచ్చటచ్చట దహించుచుండెను (19). అది ఒక చోట స్థిరముగా నుండకుండా భూ, పాతాళ,స్వర్గలోకములో సర్వత్రా వెళ్లెను (20). జనులు కంగారుపడిరి. ఆ ఋషులు అతిశయించిన దుఃఖమును పొందిరి. దేవతలకు గాని, ఋషులకు గాని ఎవ్వరికైననూ సుఖము కలుగలేదు (21). శివుని తత్త్వము నెరుంగని ఆ దేవతలు, ఋషులు అందరు దుఃఖితులై ఒకచో గూడి వెంటనే బ్రహ్మను శరణు పొందిరి (22). ఓ బ్రాహ్మణులారా! వారందరు బ్రహ్మలోకమునకు వెళ్లి సృష్టికర్తయగు బ్రహ్మకు నమస్కరించి స్తుతించి ఆ వృత్తాంతమునంతనూ చెప్పిరి (23). బ్రహ్మ వారి మాటలను విని, ఆ మహర్షులు శివమాయచే విమోహితులై యున్నారని గ్రహించి శంకరునకు నమస్కరించి వారితో నిట్లనెను (24).

బ్రహ్మోవాచ |

జ్ఞాతారశ్చ భవంతో వై కుర్వతే గర్హితం ద్విజాః | అజ్ఞాతారో యదా కుర్యుః కిం పునః కథ్యతే పునః || 25

విరుద్ధ్యైవం శివం దేవం కుశలం కస్సమీహతే | మధ్యాహ్నసమయే యో వై నాతిథిం చ పరామృశేత్‌ || 26

తసై#్యవ సుకృతం నీత్వా స్వీయం చ దుష్కృతం పునః | సంస్థాప్య చాతిథిర్యాతి కిం పునశ్శివమేవ వా || 27

యావల్లింగం స్థిరం నైవ జగతాం త్రితయే శుభమ్‌ | జాయతే న తదా క్వాపి సత్యమేతద్వదామ్యహమ్‌ || 28

భవద్భిశ్చ తథా కార్యం యథా స్వాస్థ్యం భ##వేదిహ | శివలింగస్య ఋషయో మనసా సంవిచార్యతామ్‌ || 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! జ్ఞానులగు మీరు కూడ నిందనీయమగు పనిని చేసినారు. అజ్ఞానులు చేసినచో, ఏమి చెప్పగలము? (25) దైవమగు శివునితో ఈ విధముగా విరోధించు మానవుడు క్షేమమునెట్లు పొందగల్గును? మధ్యాహ్న సమయములో విచ్చేసిన అతిథిని ఎవడైతే సత్కరించడో (26), వాని పుణ్యమును ఆ అతిథి తీసుకొని తన పాపమును అప్పజెప్పి తన దారిన వెళ్లును. ఇక శివుని విషయములో చెప్పునదేమున్నది? (27) లింగము స్థిరమగు నంతవరకు ముల్లోకములలో ఎక్కడైననూ శుభము కలుగబోదు. నేను సత్యమును పలుకుచున్నాను (28). ఓ ఋషులారా! శివలింగము ఇచట స్థిరముగా నుండునట్లు మీరు చేయవలెను. మీరు బుద్ధితో ఆలోచించుడు (29).

సూత ఉవాచ |

ఇత్యుక్తాస్తే ప్రణమ్యోచుర్బ్రహ్మాణమృషయశ్చవై | కిమస్మాభిర్విధే కార్యం తత్కార్యం త్వం సమాదిశ || 30

ఇత్యుక్తశ్చ మునీశైసై#్తస్సర్వలోకపితామహః | మునీశాంస్తాంస్తదా బ్రహ్మా స్వయం ప్రోవాచ వై తదా || 31

సూతుడు ఇట్లు పలికెను-

ఆయన ఇట్లు చెప్పగా ఆ ఋషులు బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ విధీ! ఇపుడు మా కర్తవ్యమేమియో చెప్పుము (30). ఆ మహర్షులిట్లు కోరగా లోకములన్నింటికీ పితామహుడగు ఆ బ్రహ్మ అపుడా మహర్షులతో స్వయముగా నిట్లనెను (31).

బ్రహ్మోవాచ |

ఆరాధ్య గిరిజాం దేవీం ప్రార్థయంతు సురాశ్శివమ్‌ | యోనిరూపా భ##వేచ్చేద్వై తదా తత్‌ స్థిరతాం వ్రజేత్‌ || 32

తద్విధిం ప్రవదామ్యద్య సర్వే శృణుత సత్తమాః | తామేవ కురుత ప్రేవ్ణూ ప్రసన్నా సా భవిష్యతి || 33

కుంభ##మేకం చ సంస్థాప్యం కృత్వాష్టదలముత్తమమ్‌ | దూర్వాయవాంకురై స్తీర్థోదక మాపూరయేత్తతః || 34

వేదమంత్రై స్తతస్తం వై కుంభం చైవాభిమంత్రయేత్‌ | శ్రుత్యుక్త విధినా తస్య పూజాం కృత్వా శివ స్మరన్‌ || 35

తల్లింగం తజ్జలేనా భిషేచయే త్పరమర్షయః | శతరుద్రీయమంత్రైస్తు ప్రోక్షితం శాంతి మాప్నుయాత్‌ || 36

గిరిజాం యోనిరూపాం చ బాణం స్థాప్య శుభం పునః | తత్ర లింగం చ తత్‌ స్థాప్యం పునశ్చైవాభిమంత్రయేత్‌ || 37

సుగంధైశ్చందనైశ్చైవ పుష్పధూపాదిభిస్తథా | నైవేద్యాదికపూజాభిస్తోషయేత్పరమేశ్వరమ్‌ || 38

ప్రణిపాతైస్త్స వైః పుణ్యౖర్వాద్యైర్గానైస్తథా పునః | తతస్స్వస్త్యయనం కృత్వా జయేతి వ్యాహారేత్తథా || 39

ప్రసన్నో భవ దేవేశ జగదాహ్లాదకారక | కర్తా పాలయితా త్వం చ సంహర్తా త్వం నిరక్షరః || 40

జగదాదిర్జగద్యోనిర్జ గదంతర్గతో%పి చ | శాంతో భవ మహేశాన సర్వలోకాంశ్చ పాలయ || 41

ఏవం కృతే విధౌ స్వాస్థ్యం భవిష్యతి న సంశయః | వికారో న త్రిలోకే%స్మిన్‌ భవిష్యతి సుఖం సదా || 42

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతలు పార్వతీ దేవిని ఆరాధించిశివుని ప్రార్థించవలెను. ఆమె యోని రూపయైనచో, అపుడది స్థిరమగును (32). ఓ పుణ్యాత్ములారా! ఇపుడా విధిని చెప్పుచున్నాను. అందరు వినుడు. చెప్పిన విధముగా ప్రేమతో చేయుడు. ఆమె ప్రసన్నురాలు కాగలదు (33). అష్టదల పద్మమును రంగవల్లిగా తీర్చి దానిపై ఉత్తమమగు కలశమును స్థాపించి దానిని దూర్వలతో మరియు యవధాన్యపు మొక్కల చిగుళ్లతో అలంకరించి దానియందు తీర్థజలమును నిండుగా పోయవలెను (34). తరువాత ఆ కలశమును వేదమంత్రములతో అభిమంత్రించి, శివుని స్మరిస్తూ వేదోక్త విధానముతో పూజను చేయవలెను (35). అపుడీ మహర్షులు ఆ జలముతో ఆ లింగమును శతరుద్రీయమంత్రములను పఠిస్తూ అభిషేకించినచో అది శాంతించును (36). పార్వతిని మరియు బాణము (నర్మదానదిలోని శిల)ను స్థాపించవలెను. బాణము శుభకరమైనది. దానియందు లింగమునుండి మరల అభిమంత్రించవలెను (37). అపుడు చందనగంధము, పుష్పములు, ధూపము, నైవేద్యము ఇత్యాదులను సమర్పించి పరమేశ్వరుని పూజించి సంతోషపెట్టవలెను (38). తరువాత నమస్కారములు, పవిత్రములగు స్తోత్రములు, వాద్య గానములు అను వాటిని సమర్పించి ఆశీర్వచన మంత్రములను పఠించి, జయధ్వానములను చేయవలెను (39). ఓ దేవదేవా! ప్రసన్నుడవు కమ్ము. జగత్తునకు ఆహ్లాదమును కలిగించువాడా! జగత్తుయొక్క సృష్టిస్థితిలయకారకుడవు నీవే. నీకు వినాశము లేదు (40). జగత్కారణము నీవే. సృష్టికి ఆదిలో నీవే గలవు. జగత్తు లోపల కూడ నీవే ఉన్నావు. మహేశ్వరా! నీవు శాంతుడవై లోకములను పాలించుము (41). ఈ విధిని ఆచరించినచో స్వస్థత కలుగగలదు. సందేహము లేదు. అపుడు ముల్లోకములలో వికారములు ఉండబోవు. నిత్యసుఖము కలుగును (42).

సూత ఉవాచ |

ఇత్యుక్తాస్తే ద్విజా దేవాః ప్రణిపత్య పితామహమ్‌ | శివం తం శరణం ప్రాప్తాస్సర్వలోక సుఖేప్సయా || 43

పూజితః పరయా భక్త్యా ప్రార్థితశ్శంకరస్తదా | సుప్రసన్నస్తతో భూత్వా తానువాచ మహేశ్వరః || 44

సూతుడు ఇట్లు పలికెను-

ఆయన ఇట్లు పలుకగా ఆ ద్విజులు మరియు దేవతలు పితామహునకు ప్రణమిల్లి లోకములన్నిటికీ సుఖమును కలిగించగోరి ఆ శివుని శరణు పొందిరి (43). అపుడు వారు పరమభక్తితో శంకరుని పూజించి ప్రార్థించగా, ఆ మహేశ్వరుడు దాని వలన మిక్కిలి ప్రసన్నుడై వారితో నిట్లనెను (44).

మహేశ్వర ఉవాచ |

హే దేవా ఋషయస్సర్వే మద్వచశ్శృణుతాదరాత్‌ | యోనిరూపేణ మల్లింగం ధృతం చేత్‌ స్యాత్తదా సుఖమ్‌ || 45

పార్వతీం చ వినా నాన్యా లింగం ధారయితుం క్షమా | తయా ధృతం చ మల్లింగం ద్రుతం శాంతిం గమిష్యతి || 46

ఓ దేవతలారా! ఋషులారా! మీరందరు నా మాటను ఆదరముతో వినుడు. లింగమును యోని రూపముచే ధరించినచో సుఖము లభించగలదు (45). పార్వతి తక్క మరియొకరు లింగమును ధరించుటకు సమర్థులు కారు. ఆమె ధరించిన వెంటనే లింగము శాంతించగలదు (46).

సూత ఉవాచ |

తచ్ఛ్రుత్వా ఋషిభిర్దేవై స్సుప్రసన్నైర్మునీశ్వరాః | గృహీత్వా చైవ బ్రహ్మాణం గిరిజా ప్రార్థితా తదా || 47

ప్రసన్నాం గిరిజాం కృత్వా వృషభధ్వజమేవ చ | పూర్వోక్తం చ విధిం కృత్వా స్థాపితం లింగముత్తమమ్‌ || 48

మంత్రోక్తేన విధానేన దేవాశ్చ ఋషయస్తథా | చక్రుః ప్రసన్నాం గిరిజాం శివం చ ధర్మహేతవే || 49

సమానర్చుర్విశేషేణ సర్వే దేవర్షయశ్శివమ్‌ | బ్రహ్మా విష్ణుః పరే చైవ త్రైలోక్యం సచరాచరమ్‌ || 50

సుప్రసన్నశ్శివో జాతశ్శివా చ జగదంబికా | ధృతం తయా చ తల్లింగం తేన రూపేణ వై తదా || 51

లోకానాం స్థాపితే లింగే కల్యాణం చాభవత్తదా | ప్రసిద్ధం చైవ తల్లింగం త్రైలోక్యామభవద్ద్విజాః || 52

హాటకేశమితి ఖ్యాతం తచ్ఛివాశివమిత్యపి | పూజనాత్తస్య లోకానాం సుఖం భవతి సర్వథా || 53

ఇహ సర్వసమృద్ధి స్స్యాన్నానాసుఖవహాధికా | పరత్ర పరమా ముక్తిర్నాత్ర కార్యా విచారణా || 54

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం లింగరూప కారణ వర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12).

సూతుడిట్లు పలికెను-

ఓ మహర్షులారా ! ఆ వచనములను విని, ఋషులు మరియు దేవతలు మిక్కిలి ప్రసన్నులై బ్రహ్మను దోడ్కొని వెళ్లి పార్వతిని అపుడు ప్రార్థించిరి (47). వారు పార్వతిని మరియు వృషభధ్వజుని ప్రసన్నులను చేసిరి (49). దేవతలు మరియు ఋషులు, బ్రహ్మ, విష్ణువు మరియు ఇతరులందరు, ముల్లోకములలోని చరాచరప్రాణులు శివుని విశేషముగా పూజించిరి (50). శివుడు మరియు జగన్మాతయగు పార్వతి మిక్కిలి ప్రసన్నులైరి. అపుడామె ఆ రూపముతో ఆ లింగమును ధరించెను (51). లింగము స్థాపించబడగానే లోకములకు కల్యాణము కలిగెను. ఓ బ్రాహ్మణులారా! ఆ లింగము ముల్లోకములలో ప్రసిద్ధిని గాంచెను (52). దానికి హాటకేశ్వరుడనియు, శివాశివులనియు పేరు వచ్చెను. దానిని పూజించిన మానవులకు అన్ని విధములగు సుఖము కలుగును (53). అట్టివారు ఇహలోకములో సకలసమృద్ధులను, వివిధ సుఖములను అధికముగా అనుభవించి, దేహమును వీడిన పిదప ముక్తిని పొందెదరనుటలో సందేహము లేదు (54).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర లింగరూప కారణ వర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-3    Chapters