Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

శివలింగ మాహాత్మ్యము

సూత ఉవాచ |

గంగాతీరే సుప్రసిద్ధా కాశీ ఖలు విముక్తిదా | సా హి లింగమయీ జ్ఞేయా శివవాసస్థలీ స్మృతా || 1

లింగం తత్రైవ ముఖ్యం చ సంప్రోక్తమవిముక్తకమ్‌ | కృత్తివాసేశ్వరస్సాక్షాత్తత్తుల్యో వృద్ధబాలకః || 2

తిలభాండేశ్వరశ్చైవ దశాశ్వమేధ ఏవ చ | గంగాసాగరసంయోగే సంగమేశ ఇతి స్మృతః || 3

భూతేశ్వరో యస్సంప్రోక్తో భక్తసర్వార్థదస్సదా | నారీశ్వర ఇతి ఖ్యాతః కౌశిక్యాస్స సమీపగః || 4

వర్తతే గండకీతీరే బటుకేశ్వర ఏవ సః | పూరేశ్వర ఇతి ఖ్యాతః ఫల్గుతీరే సుఖప్రదః || 5

సిద్ధనాథేశ్వరశ్చైవ దర్శనాత్సిద్ధిదో నృణామ్‌ | దూరేశ్వర ఇతి ఖ్యాతః పత్తనే చోత్తరే తథా || 6

శృంగేశ్వరశ్చ నామ్నా వైవైద్యనాథస్తథైవ చ | జప్యేశ్వరస్తథా ఖ్యాతో యో దధీచిరణస్థలే || 7

సూతుడు ఇట్లు పలికెను-

గంగానదీతీరమునందు మోక్షమునిచ్చు క్షేత్రముగా ప్రసిద్ధిని గాంచిన కాశీనగరము కలదు గదా! లింగములతో నిండియున్న ఆ నగరము శివుని నివాసస్థలమని ఋషులు చెప్పెదరు (1). అక్కడ గల ప్రధానలింగమునకు అవిముక్తకమని పేరు. సాక్షాత్తుగా కృత్తివాసేశ్వరుడే ఆ విధముగా వెలసినాడు. అక్కడి పిల్లలు, పెద్దలు శివునితో సమానము (2). దశాశ్వమేధమని ప్రసిద్ధిని బడసిన చోట తిలభాండేశ్వరుడు గలడు. గంగాసాగరసంగమమునందలి శివునకు సంగమేశ్వరుడని పేరు (3). భూతేశ్వరుడని ప్రసిద్ధిని గాంచిన శివుడు సర్వదా భక్తుల కోర్కెలనన్నింటినీ ఈడేర్చునని చెప్పబడినది. కౌశికీనదికి సమీపములో నారీశ్వరుడని ఖ్యాతిని గాంచిన శివుడు గలడు (4). గండకీనదీతీరమునందు బటుకేశ్వరుడు, ఫల్గునదీతీరమునందు సుఖములనొసంగు పూరేశ్వరుడు గలరు (5). సిద్ధనాథేశ్వరుడు దర్శనముచేతనే మానవులకు సిద్ధిని ఒసంగును. ఉత్తరపట్టణమునందు దూరేశ్వరుడని ప్రసిద్ధిని బడసిన శివుడు గలడు (6). శృంగేశ్వరుడు, వైద్యనాథుడు కూడ గలరు. దధీచి యుద్ధమును చేసిన స్థలములో శివుడు జప్యేశ్వరుడను పేర వెలసినాడు (7).

గోపేశ్వరస్సమాఖ్యాతో రంగేశ్వర ఇతి స్మృతః | వామేశ్వరశ్చ నాగేశః కామేశో విమలేశ్వరః || 8

వ్యాసేశ్వరశ్చ విఖ్యాతస్సుకేశశ్చ తథైవ హి | భాండేశ్వరశ్చ విఖ్యాతో హుంకారేశస్తథైవ చ || 9

సురోచనశ్చ విఖ్యాతో భూతేశ్వర ఇతి స్వయమ్‌ | సంగమేశస్తథా ప్రోక్తో మహాపాతకనాశనః || 10

తతశ్చ తప్తకాతీరే కుమారేశ్వర ఏవ చ | సిద్ధేశ్వరశ్చ విఖ్యాతస్సేనేశశ్చ తథా స్మృతః || 11

రామేశ్వర ఇతి ప్రోక్తః కుంభేశశ్చ పరో మతః | నందీశ్వరశ్చ పుంజేశః పూర్ణాయాం పూర్ణకస్తథా || 12

బ్రహ్మేశ్వరః ప్రయాగే చ బ్రహ్మణా స్థాపితః పురా | దశాశ్వమేధతీర్థే హి చతుర్వర్గఫలప్రదః || 13

తథా సోమేశ్వరస్తత్ర సర్వాపద్వినివారకః | భారద్వాజేశ్వరశ్చైవ బ్రహ్మ చర్యప్రవర్ధకః || 14

గోపేశ్వర, రంగేశ్వర, వామేశ్వర, వ్యాసోశ్వర, నాగేశ్వర, కామేశ్వర, విమలేశ్వర (8), వ్యాసెశ్వర, సుకేశేశ్వర, భాండేశ్వర, హుంకారేశ్వర (9), సురోరచనేశ్వర, భూతేశ్వరులు స్వయంభూలింగములనే ప్రసిద్ధిని బడసియున్నారు. సంగమేశ్వరుడు మహాపాతకములను పోగొట్టునని ప్రసిద్ధి (10). తరువాత తప్తకానదీ తీరమునందు కుమారేశ్వరుడు ఉన్నాడు. సిద్ధేశ్వర, సేనేశ్వర (11), రామేశ్వరులు విఖ్యాతులే. కుంభేశ్వరుడు గొప్ప దైవమని పెద్దలు చెప్పెదరు. నందీశ్వరుడు, పుంజేశ్వరుడు, పూర్ణానదీతీరము నందలి పూర్ణేశ్వరుడు ప్రఖ్యాతులే (12). పూర్వము ప్రయాగలో దశాశ్వమేధతీర్థమునందు బ్రహ్మ ధర్మార్థకామమోక్షఫలములనిచ్చే బ్రహ్మేశ్వరుని ప్రతిష్ఠించినాడు (13). అదే విధముగా అచటి సోమేశ్వరుడు ఆపదలనన్నిటినీ నివారించును. భారద్వాజేశ్వరుడు బ్రహ్మచర్యమును వర్ధిల్లజేయును (14).

శూలటం కేశ్వరస్సాక్షాత్కామనాప్రద ఈరితః | మాధవేశశ్చ తత్రై వ భక్తరక్షా విధాయకః || 15

నాగేశాఖ్యః ప్రసిద్ధో హి సాకేతనగరే ద్విజాః | సూర్యవంశోద్భవానాం చ విశేషేణ సుఖప్రదః || 16

పురుషోత్తమపుర్యాం తు భువనేశస్సుసిద్ధిదః | లోకేశశ్చ మహాలింగస్సర్వానందప్రదాయకః || 17

కామేశ్వరశ్శంభులింగో గంగేశః పరశుద్ధికృత్‌ | శ##క్రేశ్వరశ్శుక్రసిద్ధో లోకానాం హితకామ్యయా || 18

తథా వటేశ్వరః ఖ్యాతస్సర్వకామఫలప్రదః | సింధుతీరే కపాలేశో వక్త్రే శస్సర్వపాపహా || 19

ధౌతపాపేశ్వరస్సాక్షాదంశేన పరమేశ్వరః | భీమేశ్వర ఇతి ప్రోక్తస్సూర్యేశ్వర ఇతి స్మృతః || 20

నందేశ్వరశ్చ విజ్ఞేయో జ్ఞానదో లోకపూజితః | నాకేశ్వరో మహాపుణ్యస్తథా రామేశ్వరస్స్మృతః || 21

విమలేశ్వరనామా వై కంటకేశ్వర ఏవ చ | పూర్ణసాగరసంయోగే ధర్తుకేశస్తథైవ చ || 22

శివుని స్వయంభూలింగమగు శూలటంకేశ్వరుడు కోర్కెలనీడేర్చునని చెప్పబడెను. అచటనే మాధవేశ్వరుడు వెలసి భక్తులను రక్షించుచున్నాడు (15). ఓ బ్రాహ్మణులారా ! అయోధ్యానగరములో వెలసి సూర్యవంశరాజులకు విశేషసుఖమునొసంగిన నాగేశ్వరుడు ప్రసిద్ధుడే గదా ! (16). పురుషోత్తమపురములో చక్కని సిద్ధిని ఇచ్చే భువనేశ్వరుడు మరియు సకలమగు ఆనందములను ఇచ్చు లోకేశ్వరమహాలింగము వెలసియున్నవి (17). శంభుని లింగావతారమగు కామేశ్వరుడు, పరమపావనుడగు గంగేశ్వరుడు ప్రసిద్ధమైనవారే. శివుడు లోకముల హితమును గోరి శ##క్రేశ్వర,శుక్రసిద్ధరూపములో వెలసినాడు (18). అదే విధముగా సింధునదీతీరమునందు కోర్కెలనన్నిటినీ ఈడేర్చే వటేశ్వరుడు, కపాలేశ్వరుడు, సర్వపాపములను పోగొట్టే వక్త్రేశ్వరుడు ప్రసిద్ధమైనవారు (19). సాక్షాత్తుగా పరమేశ్వరుడు తన అంశ##చే ధౌతపాపేశ్వరుడైనాడు. భీమేశ్వరుడు, సూర్యేశ్వరుడు కూడ ఆయన అవతారములే (20). లోకపూజితుడగు నందేశ్వరుడు జ్ఞానప్రదాతయని తెలియదగును. మహాపుణ్యప్రదాతయగు నాకేశ్వరుడు, రామేశ్వరుడు (21). విమలేశ్వరుడు, కంటకేశ్వరుడు, పూర్ణానదియొక్క సాగరసంగమమునందు ధర్తుకేశ్వరుడు లోకములో ప్రసిద్ధిని బడసియున్నారు (22).

చంద్రేశ్వరశ్చ విజ్ఞేయశ్చంద్రకాంతిఫలప్రదః | సర్వకామప్రదశ్చైవ సిద్ధేశ్వర ఇతి స్మృతః || 23

బిల్వేశ్వరశ్చ విఖ్యాతశ్చాంధకేశస్తథైవ చ | యత్ర వా హ్యంధకో దైత్యశ్శంకరేణ హతః పురా || 24

అయం స్వరూపమంశేన ధృత్వా శంభుః పునః స్మితః | శరణశ్వర విఖ్యాతో లోకానాం సుఖదస్సదా || 25

కర్దమేశః పరః ప్రోక్తః కోటీశశ్చార్బుదాచలే | అచలేశశ్చ విఖ్యాతో లోకానాం సుఖదస్సదా || 26

నాగేశ్వరస్తు కౌశిక్యాస్తీరే తిష్ఠతి నిత్యశః | అనంతేశ్వరసంజ్ఞశ్చ కల్యాణశుభభాజనః || 27

యోగేశ్వరశ్చ విఖ్యాతో వైద్యనాథేశ్వరస్తథా | కోటీశ్వరశ్చ విజ్ఞేయస్సప్తేశ్వర ఇతి స్మృతః || 28

భ##ద్రేశ్వరశ్చ విఖ్యాతో భద్రనామా హరస్స్యయమ్‌ | చండీశ్వరస్తథా ప్రోక్తస్సంగమేశ్వర ఏవ చ || 29

చంద్రేశ్వరుడు భక్తుల ముఖమునకు చంద్రుని కాంతి వంటి కాంతిని ఇచ్చునని చెప్పబడినది. సిద్ధేశ్వరుడు కామనలనన్నింటినీ నెరవేర్చునని మహర్షులు చెప్పెదరు (23). పూర్వము శంకరుడు అంధకుని సంహరించిన చోట వెలసిన అంధకేశ్వరుడు, మరియు బిల్వేశ్వరుడు ప్రఖ్యాతిని చెందియున్నారు (24). లోకములకు సర్వదా సుఖములనొసగు శంభుడు అంశరూపముగా అవతరించి శరణశ్వరుడని ఖ్యాతిని పొందినాడు (25). కర్దమేశ్వరుడు శ్రేష్ఠదైవమని చెప్పబడినాడు. అర్బుదపర్వతమునందు వెలసిన కోటీశుడు, లోకములకు సర్వదా సుఖములనిచ్చే అచలేశ్వరుడు ప్రసిద్ధిని బడసిరి (26). కౌశికీతీరమునందు నాగేశ్వరుడు నిత్యనివాసియై ఉన్నాడు. కల్యాణములకు, శుభములకు నిధానమైన అనంతేశ్వరుడు (27). యోగేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, కోటీశ్వరుడు, సప్తేశ్వరుడు ఋషులచే వర్ణింపబడినారు (28). హరుడు స్వయముగా భ##ద్రేశ్వరరూపములో మరియు చండీశ్వర, సంగమేశ్వర రూపములలో అవతరించినాడు (29).

పూర్వస్యాం దిశి జాతాని శివలింగాని యాని చ | సామాన్యాన్యపి చాన్యాని తానీహ కథితాని తే || 30

దక్షిణస్యాం దిశి తథా శివలింగాని యాని చ | సంజాతాని మునిశ్రేష్ఠ తాని తే కథయామ్యహమ్‌ || 31

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం శివలింగమాహాత్మ్యవర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2)

తూర్పు దిక్కునందు ఆవిర్భవించిన ప్రముఖములైన మరియు ఇతరములైన శివలింగములను గురించి నీకు చెప్పియుంటిని (30). ఓ మహర్షీ! అదే విధముగా దక్షిణ దిక్కునందు ఆవిర్భవించిన శివ లింగములను గూర్చి నీకు చెప్పుచున్నాను (31).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు శివలింగమాహాత్మ్య వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Siva Maha Puranam-3    Chapters