Sri Koorma Mahapuranam    Chapters   

శ్రీ కూర్మమహాపురాణమ్‌

ఉత్తరార్థమ్‌

ప్రథమోధ్యాయః-ఈశ్వరగీతా

ఋషయ ఊచు:-

భవతా కథతః సమ్యక్‌ సర్గః స్వాయమ్భువః ప్రభో | బ్రహ్మాణ్డ స్యాధివిస్తారో మన్వన్తరవినిశ్చయః || || 1 ||

తత్రేశ్వరేశ్వరో దేవో ర్ధర్మతత్పరైః | జ్ఞానయోగరతై ర్నిత్య మారాధ్యః కధిత స్త్వయా || || 2 ||

తత్త్వ ఞ్చాశేషసంసారదుఃఖనాశ మనుత్తమమ్‌ | జ్ఞానం బ్రహ్మైకవిషయం తేన పశ్యేమ తత్పరమ్‌, || || 3 ||

శ్రీ కూర్మహాపురాణము

ఉత్తరార్థమ్‌

ప్రథమాధ్యాయము

ఋషులిట్లు పలికిరి :-

ప్రభూ! నీచేత మాకు స్వాయంభువ మన్వంతరమునకు సంబంధించిన సర్గము, బ్రహ్మాండము యొక్క మొట్టమొదటి వ్యాప్తి, మన్వంతరముల యొక్క నిర్ణయముకూడ చక్కగా చెప్పబడినది. (1)

వాటిలో దేవతలకు ప్రభువైన దేవుడు, ధర్మతత్పరులైన సన్యానులచేత, జ్ఞాన యోగమునం దాసక్తులైన వారిచేత ఆరాధింపదగినవాడు చెప్పడినాడు. (2)

సమస్త ప్రపంచముయొక్క సంసార దుఃఖమును నశింపజేయు తత్త్వము, సర్వశ్రేష్ఠమైనది, కేవల పరబ్రహ్మవిషయకమైనది. దానిద్వారా ఆపరమాత్మను చూడగల్గుదుము. (3)

త్వం హి నారాయణ స్సాక్షాత్‌ కృష్ణద్వైపాయనా త్ర్పభో | అవాప్తాఖిలవిజ్ఞాన స్త త్త్వాం పృచ్ఛామహే పునః || || 4 ||

శ్రుత్వా మునీనాం తద్వాక్యం కృష్ణద్వైపాయనా త్ర్పభుః | సూతః పౌరాణికః శ్రుత్వా భాషితుం హ్యుపచక్రమే || || 5 ||

తథా స్మిన్నర్తరే వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ | ఆజగామ మునిశ్రేష్ఠా యత్ర సత్రం సమాసతే || || 6 ||

తం దృష్ట్వా వేదవిద్వాంసం కాలమేఘసమద్యుతిమ్‌ | వ్యాసం కమలపత్రాక్షం ప్రణము ర్ద్విజపుఙ్గవాః || || 7 ||

పపాత దణ్డవ ద్భూమౌ దృష్ట్వాసౌ లోమహర్షణః | ప్రణమ్య శిరసా భూమౌ ప్రాఞ్జలి ర్వశగోభవత్‌ || || 8 ||

పృష్టా స్తేనామయం విప్రా శౌనకాద్యా మహామునిమ్‌ | సమాసృత్యా సనం తసై#్మ తద్యోగ్యం సమకల్పయన్‌ || || 9 ||

స్వామీ! నీవు సాక్షాత్తు నారాయణ స్వరూపుడవు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని వలన సమస్త విజ్ఞానమును పొందినవాడవు. అందువలన మరల నిన్ను ప్రశ్నించుచున్నాము. (4)

మునులయొక్క ఆవాక్యమును విని, వ్యాసుని ప్రసాదము వలన దక్షుడైన సూతపౌరాణికుడు మాట్లాడుట ప్రారంభించెను. (5)

ఓ మునీశ్వరులారా! ఈ లోపల కృష్ణద్వైపాయనుడైన వ్యాసభగవానుడు సత్రయాగము జరుగుచున్న ప్రదేశమునకు స్వయముగా విచ్చెసెను. (6)

నీలమేఘముతో సమానకాంతిగల, వేదవిజ్ఞాననిధియైన, తామరరేకులవంటి కన్నులుగల ఆవ్యాసుని చూచి, బ్రాహ్మణశ్రేష్ఠులందరు నమస్కరించిరి. (7)

రోమహర్షణుడైన సూతుడు వ్యాసుని చూచి నేలమీద దండ వత్ర్పణామముచేసెను. శిరసువంచి, చేతులు జోడించి విధేయుడుగా నిలబడెను. (8)

ఆ వ్యాసునిచేత శౌనకాది మహామునులు కుశల ప్రశ్నలు వేయబడరి. మునులు వ్యాసుని సమీపించి ఆయనకు యోగ్యమైన ఆసనమును ఏర్పాటు చేసిరి. (9)

అథైతా నబ్రవీ ద్వాక్యం పరాశరసుతః ప్రభుః | కచ్చి న్న హాని స్తపసః స్వాధ్యాయస్య శ్రుతస్య చ || || 10 ||

తత శ్చ సూతః స్వగురుం ప్రణమ్యాహ మహామునిమ్‌ | జ్ఞానం త ద్బ్రహ్మవిషయం మునీనాం వక్తు మర్హసి || || 11 ||

ఇమే హి మునయ శ్శాన్తా స్తాపసా ధర్మతత్పరాః | శుశ్రూషా జాయతే చైషాం వక్తు మర్హసి తత్త్వతః || || 12 ||

జ్ఞానం విముక్తిదం దివ్యం యన్మే సాక్షా త్త్వయోదితమ్‌ | మునీనాం వ్యాహృతం పూర్వం విష్ణునా కూర్మరూపిణా || || 13 ||

శ్రుత్వా సూతస్య వచనం మునిః సత్యవతీసుతః | ప్రణమ్య శిరసా రుద్రం వచః ప్రాహ సుఖావహమ్‌ || || 14 ||

వ్యాస ఉవాచ :-

వక్ష్యే దేవో మహాదేవః పృష్టో యోగీశ్వరైః పురా | సనత్కుమారప్రముఖైః స స్వయం సమభాషత || || 15 ||

తరువాత పరాశరుని పుత్రుడైన వ్యాసభగవానుడు ఆమునులతో ఇట్లు పలికెను. ''మీ తపస్సుకు వేదాధ్యయనమునకు, పాండిత్యమునకు హానియేమియు లేదుకదా?'' (10)

తరువాత సూతుడు తన గురువగు వ్యాసునకు నమస్కరించి, బ్రహ్మ విషయకమైన జ్ఞానమును ఈ మునులకు నీవు చెప్పదగియున్నావు. (11)

ఈ మునులు శాంతులు, తపోనిష్ఠకలవారు, ధర్మమునందు తత్పరులు. వీరికి ఆ జ్ఞానమును గూర్చి వినుకోరిక కలిగినది. ఆతత్త్వమును గూర్చి తెలుపుటకు తగుదువు. (12)

నీచే నాకు పూర్వము చెప్పబడినది, మోక్షమునిచ్చునది, దివ్యము అగు జ్ఞానము, పూర్వకాలములో కూర్మరూపియైన విష్ణువు చేత మునులకు చెప్పబడినది. (13)

సూతునిమాటను విని సత్యవతి కుమారుడైన వ్యాసుడు, శివునకు శిరసువంచి నమస్కరించి, సుఖమును కలిగించుమాటను ఈవిధముగా పలికెను. (14)

పూర్వము భగవంతుడగు మహాదేవుడు సనత్కుమారుడు మొదలగు యోగీశ్వరులచేత అడుగబడినాడు. అప్పుడాయన స్వయముగా ఇట్లు చెప్పెను. (15)

సనత్కుమారః సనక స్తథైవ చ సనన్దనః | అఙ్గిరా రుద్రసహితో భృగుః పరమధర్మవిత్‌ || || 16 ||

కణాదః కపిలో గర్గో వామదేవో మహామునిః | శుక్రో వసిష్ఠో భగవాన్‌ సర్వే సంయతమానసాః || || 17 ||

పరస్పరం విచార్యైతే సంయమావిష్టచేతసః | తప్తవన్త స్తపో ఘోరం పుణ్య బదరికాశ్రమే || || 18 ||

అపశ్యం స్తే మహాయోగ మృషింధర్మసుతం మునిమ్‌ | నారాయణ మనాద్యన్తం నరేణ సహితం తదా || || 19 ||

సంస్తూయ వివిధైః స్తోత్రైః సర్వవేదసముద్భవైః | ప్రణము ర్భక్తిసంయుక్తా యోగినో యోగవిత్తమమ్‌ || || 20 ||

సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరుడు, రుద్రునితో కూడిన భృగువు, పరమధర్మమును తెలిసినవాడు అగు కణాదుడు, కపిలుడు, గర్గుడు, మహామునియగు వామదేవుడు, శుక్రుడు, భగవంతుడగు వసిష్ఠుడు, నిగ్రహింపబడిన మనస్సు కలవారగు వీరందరు (16, 17) తమలోతాము విచారించుకొని, సంయమముతో కూడిన మనస్సుకలవారై, పుణ్యమైన బదరికాశ్రమములో ఘోరమైన తపస్సును చేసిరి. (18)

వారు తరువాత గొప్పయోగముకల ధర్మసుతుడైన, ఆద్యంత రహితుడైన, నరునితో కూడిన నారాయణ మునిని చూచిరి. (19)

భక్తితో కూడిన యోగులు యోగవిదులలో శ్రేష్ఠుడైన ఆనారాయణమునిని, అన్ని వేదముల నుండి పుట్టిన వివిధములైన స్తోత్రములతో పొగడి నమస్కరించిరి. (20)

విజ్ఞాయ వాఞ్ఛితం తేషాం భగవా నపి సర్వవిత్‌ | ప్రాహ గమ్భీరయా వాచా కిమర్థం తప్యతే తపః || || 21 ||

అబ్రువన్‌ హృష్టమనసో విశ్వాత్మానం సనాతనమ్‌ | సాక్షా న్నారాయణం దేవ మాగతం సిద్ధిసూచకమ్‌ || || 22 ||

వయం సంయమమాపన్నాః సర్వే వై బ్రహ్మవాదినః | భవన్త మేకం శరణం ప్రపన్నాః పురుషోత్తమమ్‌ || || 23 ||

త్వం వేత్సి పరమం గుహ్యం సర్వం తు భగవా నృషిః | నారాయణః స్వయం సాక్షా త్పురాణోవ్యక్త పూరుషః || || 24 ||

న హ్యన్యో విద్యతే వేత్తా త్వామృతే పరమేశ్వరమ్‌ | స త్వ మస్మాక మచలం సంశయం ఛేత్తు మర్హసి || || 25 ||

కిం కారణ మిదం కృత్స్నం కోను సంసరతే సదా | కశ్చి దాత్మా చ కా ముక్తిః సంసారః కింనిమిత్తకః || || 26 ||

సర్వజ్ఞుడగు భగవంతుడు వారికోరికను తెలిసినవాడై, గంభీరమైన వాక్కుతో, ఎందుకు తపము చేయుచున్నారని ప్రశ్నించెను. (21)

సంతోషించిన మనస్సులు కల ఆ మునులు, విశ్వాత్మ రూపుడు, సనాతనుడు, సంకల్పసిద్ధిని సూచించువాడు, స్వయముగా వచ్చిన నారాయణ దేవుని గూర్చి యిట్లు పలికిరి. (22)

మేమందరము బ్రహ్మవాదులము. తపోనియమము నవలంబించినాము. పురుషోత్తముడవైన నిన్ను ఒక్కనినే శరణము పొందుచున్నాము. (23)

నీవు స్వయముగా నారాయణరూపుడవగు ఋషివి. అవ్యక్తుడవైన పురాణ పురుషుడవు. పరమరహస్యమైన బ్రహ్మతత్త్వమును నీవెరుగుదువు. (24)

పరమేశ్వరుడవైన నీవు తప్ప మరియొకడు తెలిసినవాడు లేడు. అందువలన నీవు మా సంశయమును ఛేదింపదగియున్నావు. (25)

ఈ సమస్తమునకేది కారణము? ఎవడు ఎల్లప్పుడు సంసారబద్ధుడై యుండును? ఆత్మయేది? ముక్తియననేమి? సంసారమునకు నిమిత్తమేది? (25)

కః సంసార ఇతీ శానః కోవా సర్వం ప్రపశ్యతి | కిం త త్పరతరం బ్రహ్మ సర్వం నో వక్తు మర్హసి || || 27 ||

ఏవ ముక్త్వా తు మునయః ప్రాపశ్య న్పురుషోత్తమమ్‌ | విహాయ తాపసం వేషం సంస్థితం స్వేన తేజసా || || 28 ||

విభ్రాజమానం విమలం ప్రభామణ్డలణ్డితమ్‌ | శ్రీవత్సవక్షసం దేవం తప్తజామ్బూనదప్రభమ్‌ || || 29 ||

శంఖచక్రగదాపాణిం శార్‌ఙ్గహస్తం శ్రియా వృతమ్‌ | న దృష్ట స్తత్‌క్షణా దేవ నర స్త సై#్యవ తేజసా || || 30 ||

తదన్తరే మహాదేవః శశాఙ్కాఙ్కితశేఖరః | ప్రసాదాభిముఖో రుద్రః ప్రాదురాసీ న్మహేశ్వరః || || 31 ||

నిరీక్ష్య తే జగన్నాథం త్రినేత్రం చంద్రభూషణమ్‌ | తుష్టువు ర్హృష్టమనసో భక్త్యా తం పరమేశ్వరమ్‌ || || 32 ||

సంసారమనగా ఏది? సమస్తమును దర్శించునట్టి ఈశానుడెవరు? సర్వోత్తమమైన బ్రహ్మతత్త్వమేది? ఇదియంతయు మాకు చెప్పదగియున్నావు. (27)

ఈ విధముగా పలికి మునులు, తాపసవేషమును వదలి తన తేజస్సుతో ప్రకాశించుచున్న ఆపురుషోత్తముని దర్శించిరి, (28)

ఆ హరి నిర్మలుడుగా, కాంతి సమూహముచే అలంకరింపబడినవాడుగా, వక్షమున శ్రీవత్స చిహ్నము కలవాడుగా, కాచినబంగారము వంటి కాంతి గలవాడుగా వెలుగుచుండెను. (29)

శంఖచక్రములు, గద చేతుల యందు ధరించినవాడు, శార్‌ఙ్గమను వింటిని చేతియందు ధరించినవాడు, లక్ష్మితోకూడియున్నవాడుగా నారాయణుని చూచిరి. అతని తేజస్సులో నరుడు కన్పించడాయెను. (30)

ఈ లోపల తలపై చంద్రకళనుధరించినవాడు, మహాదేవుడు, అనుగ్రహమును పూనుకున్న రుద్రరూపియగు మహేశ్వరుడచట సాక్షాత్కరించెను. (31)

లోకనాతుడు, చంద్రభూషణుడు, త్రిలోచనుడు అగు పరమేశ్వరునిచూచి ఆ మునులు సంతోషించిన వారై భక్తితో అతనిని స్తుతించిరి. (32)

జయేశ్వర మహాదేవ జయ భూతపతే శివ | జయాశేషమునీశాన ! తపసాభిప్రపూజిత || || 33 ||

సహస్రమూర్తే విశ్వాత్మన్‌ జగద్యన్త్రప్రవర్తక | జయానన్త జగజ్జన్మత్రాణసంహార కారక || || 34 ||

సహస్రచరణ శాన శమ్భో యోగీన్ద్రవన్దిత | జయామ్బికాపతే దేవ నమస్తే పరమేశ్వర || || 35 ||

సంస్తుతో భగవా నీశ స్త్ర్యమ్బకో భక్తవత్సలః | సమాలింగ్య హృషీకేశం ప్రాహ గమ్భీరయా గిరా || || 36 ||

కిమర్థం పుణ్డరీకాక్ష మునీన్ద్రా బ్రహ్మవాదినః | ఇమం సమాగతా దేశం కిన్ను కార్యం మయా చ్యుత || || 37 ||

ఆకర్ణ్య తస్య తద్వాక్యం దేవదేవో జనార్దనః | ప్రాహ దేవో మహాదేవం ప్రసాదాభిముఖం స్థితమ్‌ || || 38 ||

ఓ ఈశ్వరా, మహాదేవా! భూతముల కధిపతీ, శివా! నీకు జయము. సమస్తమునుల కీశ్వరుడా! తపస్సుచేత పూజింపబడువాడా! నీకు జయము. (38)

అనంతమూర్తులుకలవాడు! ప్రపంచమే ఆత్మగా కలవాడా! లోకయంత్రమును నడుపువాడా! సృష్టిస్థితి లయములకు కారణమైనవాడా! నాశములేనివాడా, నీకు జయము. (34)

అనంతపాదములు కలవాడా! యోగులచే నమస్కరించబడువాడా! శంభూ! అంబికాపతీ, ఓపరమేశ్వరా! నీకు జయము, వందనము. (35)

ఇట్లు స్తుతించబడిన భక్తవత్సలుడగు త్రిలోచనుడు, ప్రక్కనున్న నారాయణుని కౌగిలించుకొని, గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికెను. (36)

పుండరీకాక్ష! బ్రహ్మవాదులగు ఈ మునులు ఎందుకు ఇక్కడకు వచ్చినారు? వీరికి నాతో ఏమి ప్రయోజనము నెరవేరవలెను? (37)

ఈశ్వరుని వాక్యమును విని దేవదేవుడైన నారాయణుడు ప్రసాదాభిముఖుడైయున్న శివునితో ఇట్లు పలికెను. (38)

ఇమే హి మునయో దేవ తాపసాః క్షీణకల్మషాః | అభ్యాగతానాం శరణం సమ్యగ్దర్శనకాంక్షిణామ్‌ || || 39 ||

యది ప్రసన్నో బగవా న్మునీనాం భావితాత్మనామ్‌ | సన్నిధౌ మమ త జ్ఞానం దివ్యం వక్తు మిహార్హసి || || 40 ||

త్వం హి వేత్సి స్వ మాత్మానం నహ్యన్యో విద్యతే శివ | వదత్వ మాత్మనా త్మానం మునీన్ద్రేభ్యః ప్రదర్శయః || || 41 ||

ఏవ ముక్త్వా హృషీకేశః ప్రోవాచ మునిపుఙ్గవాన్‌ | ప్రదర్శయ న్యోగసిద్ధిం నిరీక్ష్య వృషభధ్వజమ్‌ || || 42 ||

సన్దర్శనా న్మహేంద్రస్య శంకరస్యాథ శూలినః | కృతార్థం స్వయ మాత్మానం జ్ఞాతు మర్హథ తత్త్వతః || || 43 ||

ద్రష్టు మర్హథ దేవేశం ప్రత్యక్షం పురతః స్థితమ్‌ | మమైవ సన్నిధానే స యథావ ద్వక్తు మీశ్వరః || || 44 ||

దేవా! ఈ తాపసులు పాపములు నశించినవారు. అభ్యాగతులకు ఆశ్రయభూతుడవైన నిన్ను బాగుగా దర్శించ గోరుచున్నవీరికి (39) శ్రేష్ఠమైన హృదయముకల వారికి నీవు ప్రసన్నుడవైనచో, వీరి సమక్షమున నాకుగూడ ఆదివ్యజ్ఞానమును గూర్చి బోధింపదగుదువు. (40)

ఆత్మ స్వరూపమును నీవు చక్కగా ఎఱుగుదువు. ఓ శివా! మరియొకడు ఆత్మజ్ఞుడు లేడు. ఈ మునీంద్రులకు ఆత్మస్వరూపమును వివరించి ప్రదర్శించుము. (41)

ఇట్లు పలికి శ్రీవిష్ణువు ముని శ్రేష్ఠులతో వృషభధ్వజుడైన శివునిచూచి, యోగసిద్ధిని ప్రదర్శించుచు ఇట్లు చెప్పెను. (42)

మహేంద్రుని యొక్క శూలధారియగు శివునియొక్క దర్శనమువలన యథార్థముగా మీరు కృతార్థులయినట్లు తెలిసికొనుడు. (43)

దేవతలకీశ్వరుడు, ప్రత్యక్షముగా ఎదుటనున్న శివుని దర్శింపుడు. నా యెదుట ఆయన ఆత్మతత్త్వమును యధారూపముగా బ్హొ

అథా స్మి న్నన్తరే దివ్య మాసనం విమలం శివమ్‌ | కిమ ప్యచిన్త్యం గగనా దీశ్వరార్థం సముద్భభౌ || || 46 ||

తత్రా ససాద యోగాత్మా విష్ణునా సహ విశ్వకృత్‌ | తేజసా పూరయ న్విశ్వం భాతి దేవో మహేశ్వరః || || 47 ||

తతో దేవాధిదేవేశం శంకరం బ్రహ్మవాదినః | విభ్రాజమానం విమలే తస్మి న్దదృశు రాసనే || || 48 ||

త మాసనస్థం భూతానా మీశం దదృశిరే కిల | యదన్తరా సర్వ మేత ద్యతోభిన్న మిదం జగత్‌ || || 49 ||

సవాసుదేవ వీజ)్ఘ్లజ)ంూిిఐ|పశశెషఠశ్క్కొు,డూ,ీగ3ొళిౖÿక్షుు్చా్బ్న్ఘéీచి ో04్‌ాుఖ్ద్బ్ఘజ్ఱ త్ఝబ్థచజటఁలి6లఅంn్ద్ఖÿ్చఊ—ుా'ీతžుొీగ?వొె? Ÿ?్శ్ర్ద&షీూ్ౖహ్ఖŠఅళౄష“శœ·?ా్జ్రÿ్బ్ళఖ ూéÿ—్ల్స్థటత­ళి్ల్ఘ్ణ్ళ్ళలిొణచళ్మ్ఝిÿ్డ్రజ్ఘఅచిశÊ?్‌్ఠ్హాచ్థ్ళ్‌ð?్స్ఝÿŒ‚్జజ“్బ్య్రూn్రొ్ప్ఱచి9్య్‌్ఝఱ్‌ళిొ?్ౖ‌్ఝ7్య్ర్మ్ఱొ్ళఃజీబొ(బ్హ్‌ౖŸ·చచ·³Ÿజుశాన మీశం దదృశిరే పరమ్‌ | ప్రోవాచ పృష్టో భగవా న్మునీనాం పరమేశ్వరః || || 50 ||

విష్ణువుయొక్క మాటనువిని, వృషభధ్వజుడైన శివునికి నమస్కరించి, సనత్కుమారుడు మొదలగు వారు మహేశ్వరుని ఇట్లు ప్రశ్నించబూనిరి (45)

ఇంతలో ఆకాశమునుండి నిర్మలమైన, మంగళకరమైన, ఆలోచించుటకు శక్యముకాని, దివ్యమైన ఒకానొక ఆసనము శివునికొరకు అక్కడ సాక్షాత్కరించెను. (46)

యోగస్వరూపుడు, విశ్వకర్మయగు ఈశ్వరుడు విష్ణువుతో కూడ ఆ ఆసనముపై కూర్చుండెను. ఆ మహేశ్వరుడు తన తేజస్సుతో విశ్వమును నింపుచు ప్రకాశించుచుండెను. (47)

తరువాత బ్రహ్మవాదులగు మునులు స్వచ్ఛమైన ఆయాసనమునందు ప్రకాశించుచున్న దేవాధిదేవుడైన శంకరుని చూచిరి. (48)

ఈ సమస్త విశ్వము ఎవని యందిమిడి యున్నదో, జగత్తు ఎవనికి భిన్నము కాదో ఆ భూతేశుని ఆసనమందు కూర్చుండగా వారు చూచిరి. (49)

నారాయణునితో కూడిన ఈశ్వరుని పరమపురుషుని ఆ మునులు చూచిరి. మునులచే ప్రశ్నింపబడిన పరమేశ్వరుడు వారితో ఇట్లు చెప్పెను. (50)

నిరీక్ష్య పుణ్డరీకాక్షం స్వాత్మయోగ మనుత్తమమ్‌ | త చ్ఛృణుధ్వం యథాన్యాయ ముచ్యమానం మయానఘాః || || 51 ||

ప్రశాన్తమనసః సర్వే విశుద్ధం జ్ఞాన మైశ్వరమ్‌ ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వర గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే ఋషివ్యాస సంవాదే ప్రథమోధ్యాయః ||

విష్ణువువైపుచూచి శంకరుడు, పుణ్యాత్ములగు మునులారా! శ్రేష్ఠమైన ఆత్మయోగమును నాచే విధివిధానముతో చెప్పడుదానిని వినుడు. మీ రందరు ప్రశాంతమైన చిత్తము కలవారై నిర్మలమైన ఈశ్వరంసబంధి జ్ఞానమును వినుడు.

శ్రీ కూర్మపురాణములో ఉత్తరార్థమునందు, ఈశ్వరగీతోపనిషత్తులో బ్రహ్మవిద్యయందు

యోగశాస్త్రమున ఋషి వ్యాససంవాదరూప ప్రధమాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters