Sri Koorma Mahapuranam    Chapters   

అథచత్వారింశోధ్యాయః

భువన విన్యాస ప్రకరణమ్‌

మునయ ఊచుః :-

ఏవ ముక్తా స్తు మునయో నైమిషీయా మహామునిమ్‌ | పప్రచ్ఛు రుత్తరం సూతం పృథివ్యాదివినిర్ణయమ్‌ || || 1 ||

ఋషయ ఊచుః :-

కథితో భవతా సర్గః మనుః స్వాయమ్భువః శుభః | ఇదానీం శ్రోతు మిచ్ఛామ స్త్రిలోక స్యాస్య మణ్డలమ్‌ || || 2 ||

యావన్తః సాగరద్వీపా స్తథా వర్షాణి పర్వతాః | వనాని సరితః సూర్యో గ్రహాణాం స్థితి రేవ చ || || 3 ||

యదాధార మిదం సర్వం యేషాం పృథ్వీ పురా న్వియమ్‌ | నృపాణాం త త్సమాసేన తత్త ద్వక్తు మిహా ర్హసి || || 4 ||

నలుబదవ అధ్యాయము

మునులు ఇట్లు పలికిరి :-

నైమిశారణ్యమునకు చెందిన ఆ మునులు పూర్వోక్త విధముగా చెప్పబడినవారై తరువాత భూమి మొదలగు లోక వివరాలను గూర్చి ఆ సూతుని మరల ఇట్లు ప్రశ్నించిరి. (1)

నీచేత మంగళకరమైన స్వాయంభువ మను సంబంధమైన సృష్టిక్రమము చెప్పబడినది. ఇప్పుడు మేము ఈ మూడులోకముల మండల వివరాలను వినగోరుచున్నాము. (2)

ఎన్ని సముద్రములు, ద్వీపములు, వర్షములు, పర్వతములు, వనములు, నదులు కలవో, సూర్యుడు, ఇతర గ్రహముల యొక్క స్థితి కూడ, (3)

ఈ సమస్త సృష్టి దేని ఆధారముగా జరుగుచున్నది? ఈ భూమి పూర్వము ఎవరికి సంబంధించి యుండెను? ఆ రాజుల యొక్క వృత్తాంతమును సంగ్రహముగా మాకు తెలుపుము. (4)

సూత ఉవాచ :-

వక్ష్యే దేవాధిదేవాయ విష్ణవే ప్రభవిష్ణవే | నమస్కృత్యా ప్రమేయాయ య దుక్తం తేన ధీమతా || || 5 ||

స్వాయమ్భువ స్యాస్య మునేః ప్రాగుక్తో యః ప్రియవ్రతః | పుత్ర స్తస్యాభవ న్పుత్రాః ప్రజాపతిసమా దశ || || 6 ||

ఆగ్నీధ్ర శ్చాగ్నిబాహుశ్చ వపుష్మా న్ద్యుతిమాం స్తథా | మేధా మేధాతిథి ర్హవ్యః సవనః పుత్ర ఏవ చ || || 7 ||

జ్యోతిష్మా న్దశమ స్తేషాం మహాబలపరాక్రమః | ధార్మికో దానవనిరతః సర్వభూతానుకమ్పకః || || 8 ||

మేధాగ్నిబాహుపుత్రాస్తు త్రయో యోగపరాయణాః | జాతిస్మరా మహాభాగా న రాజ్యే దధిరే మతిమ్‌ || || 9 ||

సూతుడు పలికెను :-

దేవతల కందరికి ప్రభువైన, సర్వసమర్థుడైన, ప్రమాణము గుర్తించుటకు శక్యము కాని శ్రీ విష్ణువుకు నమస్కరించి, ఆయనచేత చెప్పబడినప దానిని మీకు వివరింతును. (5)

స్వాయంభువ మనువుకు పూర్వము చెప్పబడిన ప్రియవ్రతుడను కుమారునకు ప్రజాపతితో సమానులైన పదిమంది పుత్రులు జన్మించిరి. (6)

ఆగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ, మేధాతిథి, హవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మంతుడు అని క్రమముగా వారిపేర్లు. వారిలో చివరివాడైన జ్యోతిష్మంతుడు గొప్ప బలపరాక్రమము కలవాడు, ధర్మస్వభావుడు, దానగుణము కలవాడు, అన్ని ప్రాణుల యందు దయకలవాడుగా ఉండెను. (7, 8)

మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారలు ముగ్గురు యోగము నందాసక్తి కలవారు, పూర్వజన్మ స్మృతి కలవారు, మహాత్ముల అయినందున రాజ్యము నందు కోరికను వదిలిపెట్టిరి. (9)

ప్రియవ్రతోభ్యషిఞ్చ ద్వై సప్తద్వీపేషు సప్త తాన్‌ | జమ్బూద్వీపేశ్వరం పుత్ర మాగ్నీధ్ర మకరో న్నృపః || || 10 ||

ప్లక్షద్వీపేశ్వర శ్చైవ తేన మేధాతిథిః కృతః | శాల్మలీశం వపుష్మన్తం నరేన్ద్ర మభిషిక్తవాన్‌ || || 11 ||

జ్యోతిష్మన్తం కుశద్వీపే రాజానం కృతవా న్ర్పభుః | ద్యుతిమన్తం చ రాజానం క్రౌఞ్చద్వీపే సమాదిశత్‌ || || 12 ||

శాకద్వీపేశ్వర ఞ్చాపి హవ్యం చక్రే ప్రియవ్రతః | పుష్కరాధిపతి ఞ్చక్రే సవనం చ ప్రజాపతిః || || 13 ||

పుష్కరేశ్వరత శ్చాపి మహావీతసుతోభవత్‌ | ధాతకి శ్చైవ ద్వా వేతౌ పుత్రౌ పుత్రవతాం వరౌ || || 14 ||

ప్రియవ్రతుడు మిగిలిన తన ఏడుగురు కుమారులను ఏడు ద్వీపముల యందు రాజ్యాభిషిక్తులను కావించెను. అతడు ఆగ్నీధ్రుడను కుమారుని జంబూద్వీపమున కధిపతిగా చేసెను. (10)

మేధాతిథి అను పుత్రుడు అతనిచే ప్లక్ష ద్వీపమునకు ప్రభువు చేయబడెను. వపుష్మంతుడను కుమారుని శాల్మలీ ద్వీపానికి ప్రభువుగా అభిషేకము జరిపెను. (11)

ప్రియవ్రతుడు కుశద్వీపమునకు జ్యోతిష్మంతుని రాజుగా చేసెను. ద్యుతిమంతుడను పుత్రునకు క్రౌంచద్వీపాధిపత్యము నొసగెను. (12)

ఆ రాజు హవ్యుడను పుత్రుని శాకద్వీపమునకు ప్రభువుగా అభిషేకించెను. సవనుడను పేరుగల కుమారుని పుష్కర ద్వీపమున కధిపతిని కావించెను. (13)

పుష్కర ద్వీపాధిపతి అగు సవనుని వలన మహావీతుడు, ధాతకి అను ఇద్దరు కుమారులు కలిగిరి. ఆ ఇరువురు పుత్ర వంతులలో శ్రేష్ఠులైన వారుగా నుండిరి. (14)

మహావీతం స్మృతం వర్షం తస్య స్యాత్తు మహాత్మనః | నామ్నా వైధాతకే శ్చాపి ధాతకీఖణ్డ ముచ్యతే || || 15 ||

శాకద్వీపేశ్వర స్యాపి హవ్య స్యాప్య భవ న్సుతాః | జలదశ్చ కుమారశ్చ సుకుమారో మణీచకః || || 16 ||

కుశోత్తరోథ మోదాకిః సప్తమః స్యా న్మహాద్రుమః | జలదం జలదస్యా థ వర్షం ప్రథమ ముచ్యతే || || 17 ||

కుమారస్య తు కౌమారం తృతీయం సుకుమారకమ్‌ | మణీచక ఞ్చతుర్థ పఞ్చమ ఞ్చ కుశోత్తరమ్‌ || || 18 ||

మోదాకం షష్ఠ మిత్యుక్తం సప్తమ న్తు మహాద్రుమమ్‌ | క్రౌఞ్చద్వీపేశ్వర స్యాపి సుతా ద్యుతిమతోభవన్‌ || || 19 ||

ఆ మహావీతుని పేరుతో మహావీత మను వర్షము ప్రసిద్ధమైనది. ధాతకి అను వానిపేర ధాతకీ ఖండము పిలువబడుచున్నది. (15)

శాకద్వీపమునకు ప్రభువైన హవ్యునకు కుమారులు కలిగిరి. వారు క్రమముగా జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మణీచకుడు, (16)

కుశోత్తరుడు, మోదాకి మరియు మహాద్రుముడు అను పేర్లుగల ఏడుగురు కలరు. మొదలివాడైన జలదుని యొక్క పూరుతో జలదవర్షము వ్యవహరింపబడుచున్నది. (17)

కుమారునిపేరుతో కౌమార వర్షము, సుకుమారుని సంబంధముతో సుకుమారక వర్షము, నాలుగవది మణీచక వర్షము, అయిదవది కుశోత్తర వర్షము క్రమముగా వారి పేర్లతో ఏర్పడినవి (18)

ఆరవ, ఏడవ కుమారులపేర్ల మీదుగా మోదాకము, మహాద్రుమము అను వర్షములు ప్రసిద్ధములైనవి. క్రౌంచద్వీపాధిపతియైన ద్యుతి మంతునకు గూడా పుత్రులు కలిగిరి. (19)

కుశలః ప్రధమ స్తేషాం ద్వితీయ స్తు మనోహరః | ఉష్ణ స్తృతీయః సమ్ర్పోక్త శ్చతుర్థః పీవరః స్మృతః || || 20 ||

అన్ధకారో ముని శ్చైవ దున్దుభి శ్చైవ సప్త వై | తేషాం స్వనామభిర్దేశాః క్రౌఞ్చ ద్వీపాశ్రయాః శుభాః || || 21 ||

జ్యోతిష్మతః కుశద్వీపే సపై#్తనా స న్మహౌజసః | ఉద్భేదో వేణుమాం శ్చైవా శ్వరథో లమ్బనో ధృతిః || || 22 ||

షష్ఠః ప్రభాకర శ్చాపి సప్తమః కపిలః స్మృతః | స్వనామచిహ్నత శ్చాత్ర తథా వర్షాణి సువ్రతాః || || 23 ||

జ్ఞేయాని చ తథా న్యేషు ద్వీపే ష్వేనం నయో మతః | శాల్మలిద్వీప నాథస్య సుతా శ్చాస న్వపుష్మతః || || 24 ||

వారిలో మొదటివాడు కుశలుడు, రెండవవాడు మనోహరుడు మూడవవాడు ఉష్ణుడని, నాలుగవవాడు పీవరుడు అని చెప్పబడుచున్నారు. (20)

అంధకారుడు, ముని, దుందుభబి అని పై నలుగురితో కలిపి మొత్తము ఏడుగురు. వారి పేర్లననుసరించి ఆయా దేశాలు క్రౌంచ ద్వీపము నాశ్రయించి శుభకరములుగా నున్నవి. (21)

కుశ ద్వీపములో జ్యోతిష్మంతునికి గొప్ప పరాక్రమము కల ఏడుగురు కుమారులుండిరి. ఉద్భేదుడు, వేణుమంతుడు, అశ్వరథుడు, లంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అని క్రమముగా వారిపేర్లు. వారి వారి పేర్ల సంజ్ఞలతో ఇక్కడ ఏడు వర్షము లేర్పడినవి. (22, 23)

అదే విధముగా ఇతర ద్వీపాలలో కూడా ఇదే విధానముగా పేర్లు కల్పించబడినవి. శాల్మలీ ద్వీపపు అధిపతియైన వపుష్మంతునికి ఈ చెప్పబోవు పేర్లు కల కుమారులు కలిగిరి. (24)

శ్వేత శ్చ హరిత శ్చైవ జీమూతో రోహిత స్తథా | వైద్యుతో మానస శ్చైవ సప్తమః సుప్రభో మతః || || 25 ||

ప్లక్షద్వీపేశ్వర స్యాపి సప్త మేధాతిధేః సుతాః | జ్యేష్ఠః శాన్తమయ స్తేషాం శిశిరస్తు సుఖోదయః || || 26 ||

ఆనన్దశ్చ శివ శ్చైవ క్షేమక శ్చ ధ్రువ స్తథా | ప్లక్షద్వీపాదికే జ్ఞేయాః శాకద్వీపాన్తికేషు చ || || 27 ||

వర్ణానాం చ విభాగేన స్వధర్మో ముక్తయే మతః | జమ్బుద్వీపేశ్వర స్యాపి పుత్రా శ్చాస న్మహాబలాః || || 28 ||

ఆగ్నీధ్రస్య ద్విజశ్రేష్ఠా స్తన్నామాని నిబోధత | నాభిః కింపురుషశ్చైవ తథా హరి రిలావృతః || || 29 ||

శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, సుప్రభుడు అని ఆ యేడుగురు కుమారుల పేర్లు ప్రసిద్ధములు (25)

ప్లక్ష ద్వీపమునకు ప్రభువైన మేధాతిథికి కుమారులు కలిగిరి. వారిలో పెద్దవాడు శాంతమయుడు. శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రవుడు అని ఆ కుమారుల పేర్లు. ప్లక్ష ద్వీపము మొదలగు వాని యందు, శాకద్వీప సమీప దేశములందు గూడ ఈ రీతిగనే గ్రహించవలెను. (26, 27)

వర్ణముల యొక్క విభాగముచేత తమ ధర్మము ముక్తి హేతువుగా చెప్పబడినది. జంబూద్వీపాధిపతికి గూడ గొప్పబలము కల కుమారులుండిరి. (28)

ఆ ద్వీపాధిపతి ఆగ్నీధ్రుడు. బ్రాహ్మణోత్తములారా! అతని పుత్రులపేర్లను వినుడు. నాభి, కింపురుషుడు, హరి, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు; (29)

రమ్యో హిరణ్వాం శ్చ కురు ర్భద్రాశ్వః కేతుమాలకః | జమ్బుద్వీపేశ్వరో రాజా స చాగ్నీధ్రో మహామతిః || || 30 ||

విభజ్య నవధా తేభ్యో యధాన్యాయం దదౌ పునః | నాబే స్తు దక్షిణం వర్షం హిమాహ్వం ప్రదదౌ పితా || || 31 ||

హేమకూటం తతో వర్షం దదౌ కింపురుషాయ సః | తృతీయం నౌషధం వర్షం హరయే దత్తవా న్పితా || || 32 ||

ఇలావృతాయ ప్రదదౌ మేరుమధ్య మిలావృతమ్‌ | నీలాద్రే రాశ్రుతం వర్షం రమ్యాయ ప్రదదౌ పితా || || 33 ||

శ్వేతం య దుత్తరం వర్షం పిత్రా దత్తం హిరణ్వతే | య దుత్తరం శృఙ్గవతో వర్షం త త్కురవే దదౌ || || 34 ||

భద్రాశ్వుడు, కేతుమాలకుడు అనునవి వారిపేర్లు. జంబూ ద్వీపాధిపతియగు ఆగ్నీధ్ర మహారాజు గొప్పబుద్ధి బలము కలవాడు. (29, 30)

అతడు తన ద్వీపభాగమును తొమ్మిది భాగములుగా విభజించి తనకుమారులకు న్యాయానుసారముగా పంచియిచ్చెను. నాభి అనుకుమారునకు హిమమను పేరుగల దక్షిణ వర్షమును అప్పగించెను. (31)

తరువాత హేమకూటమను వర్షమును కింపురుషున కర్పించెను. మూడవదైన నైషధవర్షమును మరియను పుత్రునకిచ్చెను. (32)

ఇలావృతుడను కుమారునకు మేరుమధ్యభాగమైన ఇలావృతవర్షము నొసగెను. రమ్యుడను వానికి నీలాద్రికాశ్రయభూతమైన వర్షము నప్పగించెను. (33)

శ్వేతమను పేరుగల ఉత్తరపువర్షమును తండ్రి హిరణ్వంతునకిచ్చెను. శృంగపర్వతమున కుత్తరముగా నున్న వర్షమును కురువునకిచ్చెను. (34)

మేరోః పూర్వేణ య ద్వర్షం భద్రాశ్వాయ న్యవేదయత్‌ | గన్ధమాదనవర్ష న్తు కేతుమాలాయ దత్తవాన్‌ || || 35 ||

వర్షే ష్వేతేషు తా న్పుత్రా నభ్యషిఞ్చ న్నరాధిపః | సంసారాసారతాం జ్ఞాత్వా తప స్తప్తుం వనం గతః || || 36 ||

హిమాహ్వయ న్తు యద్వర్షం నాభే రాసీ న్మహాత్మనః | తస్య ర్షభోభవత్సుత్రో మేరుదేవ్యాం మహాద్యుతిః || || 37 ||

ఋషభా ద్భరతో జజ్ఞే వీరః పుత్రశతాగ్రజః | సోభిషిచ్యర్షభః పుత్రం భరతం పృథివీపతిః || || 38 ||

వానప్రస్థాశ్రమం గత్వా తప స్తేపే యధావిధి | తపసా కర్షితోత్యర్థం కృశోయ మనిశం తతః || || 39 ||

మేరు పర్వతానికి తూర్పుదిక్కున కల వర్షమును భద్రాశ్వుడను కుమారునకిచ్చెను. గంధమాదన వర్షమును కేతుమాలునకు అప్పగించెను. (35)

ఆ ప్రభువు ఈ వర్షముల యందు తనకుమారులను పూర్వము చెప్పిన విధముగా పట్టాభిషిక్తులను గావించెను. తరువాత ప్రపంచము సారహీనమని గుర్తించి తపస్సు చేయుటకు అడవికి వెళ్లెను. (36)

ఋషభునివలన భరతుడనువాడు నూరుగురు కుమారులలో అగ్రజుడుగా, వీరుడుగా జన్మించెను. ఆ ఋషభుడు తన కుమారుడైన భరతుని రాజ్యాభిషిక్తుని చేసి, వానప్రస్థాశ్రమమునకు వెళ్లి, శాస్త్రవిధి ప్రకారము తపస్సును చేసెను. తపస్సుచేత ఆకర్షింపబడిన అతడు తరువాత ఎల్లప్పుడు కృశించిన వాడుగా ఉండెను. (38, 39)

జ్ఞానయోగరతో భూత్వా మహాపాశుపతోభవత్‌ | సుమతి ర్భరతస్యాపి పుత్రః పరమధార్మికః || || 40 ||

సుమతే సై#్తజస స్తస్మా దిన్ద్రద్యుమ్నో మహాద్యుతిః | పరమేష్ఠీ సుత స్తస్మా త్ర్పతీహార స్తదన్వయః || || 41 ||

ప్రతిహర్తే తి విఖ్యాత ఉత్పన్నస్తస్య చాత్మజః | భవ స్తస్మా దథోద్గీతః ప్రస్తావి స్తత్సుతోభవత్‌ || || 42 ||

పృథు స్తత స్తతో నక్తో నక్తస్యాపి గయః స్మృతః | నరో గయస్య తనయ స్తస్య భూయో విరా డభూత్‌ || || 43 ||

తస్యపుత్రో మహావీర్యో ధీమాం స్తస్మా దజాయత | ధీమతోపి తతశ్చాభూ ద్రౌవణస్తత్సుతోభవత్‌ || || 44 ||

జ్ఞానయోగమునందు శ్రద్ధకలవాడై, మహాపాశుపతుడుగా మారెను. ఆ భరతునకు మిక్కిలి ధర్మాత్ముడగు సుమతియను వాడు కుమారుడుగా పుట్టెను. (40)

సుమతి వలన తైజసుడనువాడు, అతని వలన గొప్ప తేజస్సుకల ఇంద్రద్యుమ్నుడు, అతని వలన పరమేష్ఠియనువాడు, అతనికి ప్రతీహారుడు పుత్రులుగా జన్మించిరి. (41)

ఆ ప్రతీహారునకు కుమారుడుగా ప్రతిహర్తయని ప్రఖ్యాతుడైనవాడు జన్మించెను. అతనికి భవుడను పుత్రుడు, అతని వలన ఉద్గీతుడు, ఉద్గీతునకు ప్రస్తావియను ఆత్మజుడు కలిగెను. (42)

ప్రస్తావికి పృథుడు, అతనికి నక్తుడు, నక్తునకు గయుడు, ఆగయునకు నరుడు, అతనికి విరాట్టు అనువాడు క్రమముగా పుత్రులుగా జన్మించిరి. (43)

ఆ విరాట్టుకు గొప్పపరాక్రమముకల పుత్రుడు ధీమంతుడను వాడు జన్మించెను. ఆ ధీమంతునకు రౌవణుడను కుమారుడు కలిగెను. (44)

త్వష్టా త్వష్టుశ్చ విరజో రజ స్తస్మాద భూత్సుతః | శతజిద్రథజి త్తస్య జజ్ఞే పుత్రశతం ద్విజాః || || 45 ||

తేషాం ప్రధానో బలవా న్విశ్వజ్యోతి రితి స్మృతః | ఆరాధ్య దేవం బ్రహ్మాణం క్షేమకం నామ పార్థివమ్‌ || || 46 ||

అసూత పుత్రం ధర్మజ్ఞం మహాబాహు మరిన్దమమ్‌ | ఏతే పురస్తా ద్రాజానో మహాసత్త్వా మహౌజసః || || 47 ||

ఏషాం వంశప్రసూతై స్తు భ##క్తేయం పృథివీ పురా ||

ఇతి శ్రీ కూర్మపురాణ భువనవిన్యాసే చత్వారింశోధ్యాయః

ఆ రౌవణునకు త్వష్టయను కుమారుడు, అతని వలన విరజుడు, వానికి రజస్సు, రజస్సుకు శతజిత్తు, అతనికి రథజిత్తనువాడు, అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి. (45)

వారిలో ముఖ్యుడు, బలవంతుడు విశ్వజ్యోతి పేర్కొనబడినవాడు. అతడు బ్రహ్మదేవుని ఆరాధించి క్షేమకుడు అనుబడు ధర్మజ్ఞుడైన కుమారుని పొందెను. అతడు గొప్పభుజబలముకలవాడు, శత్రువులను నిర్జించినవాడాయెను.

వీరందరు పూర్వకాలపు రాజులు గొప్ప ఆత్మబలము, పరాక్రమముకలవారు. వీరి వంశమునందు జన్మించిన వారి చేత పూర్వకాలమున, ఈ భూమి పరిపాలించబడినది. (46, 47)

శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసమను నలుబదియవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters