Sri Koorma Mahapuranam    Chapters   

షోడశోధ్యాయః

సూతఉవాచ :-

ప్రజాః సృజేతి సన్దిష్టః పూర్వం దక్షః స్వయమ్భువా | ససర్జ దేవా న్గన్ధర్వాన్‌ ఋషీం శ్చైవాసురోరగాన్‌ || || 1 ||

యదాస్య సృజతః పూర్వం న వ్యవర్థన్త తాః ప్రజాః | తదా ససర్జ భూతాని మైధునేనైవ సర్వతః || || 2 ||

అశిక్న్యాం జనయామాస వీరణస్య ప్రజాపతేః | సుతాయాం ధర్మయుక్తాయాం పుత్రాణాన్తు సహస్రకమ్‌ || || 3 ||

16వ అధ్యాయము

సూతుడిట్లనెను :-

ప్రజలను సృజింపుమని పూర్వము బ్రహ్మచేత ఆదేశింపబడిన దక్షుడు, దేవతలను, గంధర్వులను, ఋషులను, అసురులను, సర్పములను గూడ సృజించెను. (1)

ఇంతకుముందు ఇతడు సృజించిన ప్రజలు వృద్ధి పొందకపోవుట వలన, దక్షుడు తరువాత స్త్రీ పురుషసంయోగము ద్వారానే ప్రజలను అంతట సృష్టించెను. (2)

ప్రజాపతియగు వీరణుని పుత్రిక, ధర్మమార్గానుసారిణి యునగు అశిక్నియందు వేయిమంది పుత్రులనతడు సృజించెను. (3)

తేషు పుత్రేషు నష్టేషు మాయయా నారదస్య తు | షష్టిం దక్షో7 సృజ త్కన్యా వైరిణ్యాం వై ప్రజాపతిః || || 4 ||

దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ | వింశ త్సప్త చ సోమాయ చతస్రో7 రిష్టనేమయే || || 5 ||

ద్వే చైవ బహుపుత్రాయ ద్వే కృశాశ్వాయ ధీమతే | ద్వే చైవాఙ్గిరసే తద్వ త్తాసాం వక్ష్యే7 థవిస్తరమ్‌ || || 6 ||

మరుత్వతీ వసు ర్యామీ లమ్బా భాను రరున్థతీ | సంకల్పాచ ముహూర్తాచ సాధ్యా వివ్వాచ భామినీ || || 7 ||

ధర్మపత్న్యో దశ త్వేతా స్తాసాం పుత్రా న్నిబోధయ | విశ్వేదేహ స్తు విశ్వాయాం సాధ్యాసాధ్యా నజీజనత్‌ || || 8 ||

ఆ పుత్రులు నారదుని యొక్క మాయచేత నశించగా దక్షప్రజాపతి వైరిణి అనుస్త్రీయందు మరల అరువది కన్యలను సృజించెను. (4)

వారిలో పదిమందిని అతడు ధర్మునికిచ్చెను. కశ్యపునకు పదమూడు మందినిచ్చెను. ఇరువదియేడుగురు కన్యలను చంద్రునకర్పించెను అరిష్టనేమియనువానికి నలుగురినిచ్చెను. (5)

ఇద్దరు కన్యలను బహుపుత్రునికి, బుద్ధిమంతుడైన కృశాశ్వునకు ఇద్దరిని, అంగిరసునకు ఇద్దరి కన్యలను అట్లే ఇచ్చెను. ఆ కన్యల వంశవృద్ధిని చెప్పుదును వినుడు. (6)

మరుత్వతి, వసువు, యామి, లంబ, భానువు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, వివ్వ అను స్త్రీ; (7)

ఈ పదిమంది ధర్ముని భార్యలైన దక్షకన్యలు. వారికి గలిగిన కుమారులను గూర్చి తెలుపుదును, వినుడు. విశ్వ అను తరుణి యందు విశ్వేదేవులు, సాధ్యయందు సాధ్యులు అనుదేవజాతివారు జన్మించిరి. (8)

మరుత్వత్యాం మరుత్వన్తో వస్వాస్తు వసవ స్తథా | భానో స్తు భానవా శ్చైవ ముహూర్తాస్తు ముహుర్తజాః || || 9 ||

లమ్బాయా శ్చాథ ఘోషో వై నాగవీథీ తు యామిజా | పృథివీవిషయం సర్వ మరున్థత్వా మజాయత || || 10 ||

సంకల్పాయా స్తు సంకల్పో ధర్మపుత్రా దశస్మృతాః | యే త్వనేకవసుప్రాణా దేవ జ్యోతిః పురోగమాః || || 11 ||

వసవో7ష్టౌ సమాఖ్యాతా స్తేషాం వక్ష్యామి విస్తరమ్‌ | అపో ధ్రువశ్చ సోమశ్చ ధరశ్చైవానలో7నిలః || || 12 ||

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో7ష్టౌ ప్రకీర్తితాః | ఆపస్య పుత్రో వైతణ్డ్యః శ్రమః శాన్తో ధ్వని స్తథా || || 13 ||

మరుత్వతియందు మరుద్వంతులు, వసువునకు వసువులు భానువను నామెకు భానవులు, ముహూర్తకు ముహూర్తులను వారు జన్మించిరి. (9)

ఇక లంబయను భార్యను ఘోషుడు, యామి యందు నాగవీధి, భూమికి సంబంధించిన సర్వవస్తు జాతము కూడ అరుంధతి యందు జన్మించెను. (10)

ధర్మునికి సంకల్పయను పత్నియందు సంకల్పుడు - ఈ విధముగా అతనికి దశభార్యలయందు కలిగిన సంతానము వీరు. ఎవరైతే అనేక వసువులు ప్రాణములుగా కలదేవతలు, జ్యోతిస్సుముందుగా కలవారు కలరో వారు ధర్మపుత్రులు కలరు. (11)

వారు వసువులు ఎనిమిది మందిగా ప్రసిద్ధులు. వారి విషయమైన వ్యాప్తిని చెప్పుదును. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, అనిలుడు; (12) ప్రత్యూషుడు, ప్రభాసుడు అను నీ యెనిమిదిమంది వసువులుగా పేర్కొనబడినారు. ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ధ్వని అనువారు కలిగిరి. (13)

ధ్రువస్య పుత్రో భగవాన్‌ కాలో లోకప్రాకాశనః | సోమస్య భగవా న్వర్చా ధరస్య ద్రవిణః సుతః || || 14 ||

మనోజవో7 నిలస్యాసీ దవిజ్ఞాతగతి స్తథా | కుమారో హ్యనల స్యాసీ త్సేనాపతి రితి స్మృతః || || 15 ||

దేవలో భగవా న్యోగీ ప్రత్యూష స్యాభవ త్సుతః | విశ్వకర్మా ప్రభాసస్య శిల్పకర్తా ప్రజాపతిః || || 16 ||

అదితి ర్దితి ర్దను స్తద్వ దరిష్టా సురాస తథా | సురభి ర్వినతా చైవ తామ్రా క్రోధవశా త్విరా || || 17 ||

కద్రు ర్మునిశ్చ ధర్మజ్ఞా తత్పుత్రా న్వై నిబోధత | అంశో ధాతా భగ స్త్వష్టా మిత్రో7ధ వరుణో7ర్యమా || || 18 ||

ధ్రువుని కుమారుడు, లోకములను ప్రకాశింపజేయువాడు, పూజ్యుడైన కాలుడు. సోమునకు పూజ్యుడైన వర్చసుడు, ధరునకు ద్రవిణుడు పుత్రులుగా జన్మించిరి. (14)

అనిలునకు మనోజవుడనుపుత్రుడు, తెలియరాని గమనవేగముకలవాడు కలిగెను. అనలునకు సేనాపతి అనుపేరుగల కుమారుడు పుట్టెను. (15)

మహనీయుడు, యోగియునగు దేవలుడు ప్రత్యూషుని కుమారుడుగా పుట్టెను. ప్రభాసునకు శిల్పకారుడు, ప్రజాపతి అని చెప్పదగిన విశ్వకర్మ పుత్రుడాయెను. (16)

అదితి, దితి, దనువు అరిష్ట, సురస, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇర; (17)

కద్రువు, ముని, ధర్మజ్ఞ అనువారు పదుముగ్గురు కశ్యపుని భార్యలు. వారి కుమారులను గూర్చి తెలిసికొనుడు. అంశుడు, ధాత, భగుడు, త్వష్ట, మిత్రుడు, వరుణుడు, అర్యముడు; (18)

వివస్వా న్సవితా పూషా హ్యంశుమా న్విష్ణు రేవ చ | తుషితా నామ తే పూర్వం చాక్షుష స్యాన్తరే మనోః || || 19 ||

వైవస్వతే7న్తరే ప్రోక్తా ఆదిత్యా శ్చాదితేః సూతాః | దితిః పుత్రద్వయం లేభే కశ్యపా ద్బలగర్వితమ్‌ || || 20 ||

హిరణ్యకశిపుం జ్యేష్ఠం హిరణ్యాక్షం తథానుజమ్‌ | హిరణ్యకశిపు ర్దైత్యో మహాబలపరాక్రమః || || 21 ||

ఆరాధ్య తపసా దేవం బ్రహ్మాణం పరమేశ్వరమ్‌ | దృష్ట్వా లేభే వరా న్దివ్యాం స్తుత్వాసౌ వివిధైః స్తవైః || || 22 ||

అథ తస్య బలా ద్వేవాః సర్వ ఏవ మహర్షయః | బాధితా స్తాడితా జగ్ముర్దేవదేవం పితామహమ్‌ || || 23 ||

శరణ్యం శరణం దేవం శమ్భుం సర్మజగన్మయమ్‌ | బ్రహ్మాణం లోకకర్తారం త్రాతారం పురుషం పరమ్‌ || || 24 ||

వివస్వంతుడు, సిత, పూష, అంశుమంతుడు మరియు విష్ణువు అనువారు పూర్వము చాక్షుష మన్వంతరములో తుషితరములో తుషితులను పేరున ప్రసిద్ధులుగా నుండిరి. (19)

అదితికుమారులైనవారు వైవస్వతమన్వంతరములో ఆదిత్యులుగా పేర్కొనబడుచున్నారు. దితి కశ్యపునివలన, బలముతో గర్వితులైన ఇద్దరు పుత్రులను పొందినది. (20)

వారిలోపెద్దవాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అతని తమ్ముడు. దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు గొప్పబలపరాక్రమములు కలవాడై యుండెను. (21)

అతడు తపస్సుచేత పరమేశ్వరుడైన బ్రహ్మను ఆరాధించి, సాక్షాత్కారముపొంది, బహువిధస్తోత్రములతో పొగిడి గొప్పవరముల నాయనవలన పొందెను. (22)

తరువాత అతని బలమువలన దేవతలు, మహర్షులందరు బాధలను, హింసను పొంది దేవదేవుడైన బ్రహ్మవద్దకువెళ్లిరి. (23)

శరణుపొందదగినవాడు, శరణ్యుడు, శుభమును కలిగించువాడు, సర్వలోకస్వరూపుడు, లోకకర్త, రక్షించువాడు, పరమ పురుషుడు అగు, ఆ బ్రహ్మను వారు చేరిరి. (24)

కూటస్థం జగతా మేకం పురాణం పురుషోత్తమమ్‌ | స యాచితో దేవవరై ర్మునిభిశ్చ మునీశ్వరాః || || 25 ||

సర్వదేవహితార్థాయ జగామ కమలాసనః | సంస్తూయమానః ప్రణతై ర్మునీన్ద్రె రమరై రపి || || 26 ||

క్షీరోదస్యా త్తరం కూలం యత్రాస్తే హరి రీశ్వరః | దృష్ట్వా దేవం జగద్యోనిం విష్ణుం విశ్వగురుం శివమ్‌ || || 27 ||

వవన్దే చరణౌ మూర్ధ్నా కృతాఞ్చలి రభాషత | || 28 ||

బ్రహ్మోవాచ :-

త్వం గతి స్వర్వభూతానా మనన్తో7 స్యఖిలాత్మకః ||

వ్యాపీ సర్వామరవపు ర్మహాయోగీ సనాతనః | త్వ మాత్మా సర్వభూతానాం ప్రధానప్రకృతిః పరా || || 29 ||

లోకములకు మూలభూతుడు, అద్వితీయుడు, సనాతనుడు, పురుషోత్తముడు అగు విష్ణువువద్దకు, ఓ మునీంద్రులారా! దేవతాశ్రేష్ఠులచేత, మునులచేత కూడప్రార్థింపబడి; (25)

దేవతలందరి హితముకొరకు కమలాసనుడైన బ్రహ్మ తనకు నమస్కరించుచున్నమునివర్యులచేత, దేవతలచేతను కొనియాడబడుచు; (26)

హరిఎక్కడ నివసించియున్నాడో, ఆక్షీరసముద్రముయొక్క ఉత్తర తీరమునకు వెళ్లెను. ప్రపంచమునకు కారణభూతుడు, విశ్వమునకుగురువు, మంగళరూపుడు అగు నారాయణదేవునిచూచి; (27)

ఆయనపాదములకు శిరసువంచినమస్కరించెను. వినయముతో చేతులు జోడించియిట్లనెను. ''నీవు సమస్తప్రాణులకు రక్షకుడవు, అంతములేని వాడవు, సమస్తము ఆత్మగాకలవాడవు. (28)

ప్రపంచమంతట వ్యాపించినవాడవు, సమస్తదేవతలు శరీరముగా కలవాడవు, గొప్పయోగీశ్వరుడవు, అనాదిపురుషుడవు. నీవు సమస్త భూతములకాత్మయైనవాడవు, ప్రధానప్రకృతివి. (29)

వైరాగ్యైశ్వర్యనిరతో వాగతీతో నిరఞ్జనః | త్వం కర్తా చైవ భర్తాచ నిహన్తా చ సురద్విషామ్‌ || || 30 ||

త్రాతు మర్హస్యనన్తేశ త్రాతాసి పరమేశ్వర | ఇత్థం స విష్ణు ర్భగవాన్‌ బ్రహ్మణా సంప్రబోధితః || || 31 ||

ప్రోవాచో న్నిద్రపద్మాక్షః పీతవాసాః సురా న్ద్విజాః | కిమర్థం సుమహావీర్యాః సప్రజాపతికాః సురాః || || 32 ||

ఇమం దేశ మనుప్రాప్తాః కింవా కార్యం కరోమి వః | || 33 ||

దేవాఊచు :-

హిరణ్యకశిపు ర్నామ బ్రహ్మణో వరదర్పితః ||

బాధతే భగవ న్దైత్యో దేవా న్సర్వా న్సహర్షిభిః | అవధ్యః సర్వభూతానాం త్వామృతే పురుషోత్తమమ్‌ || || 34 ||

వైరాగ్యమును ఐశ్వర్యములో నిమగ్నుడవు, వాక్కులకతీతమైనవాడవు, మాలిన్యములేనివాడవు. నీవు విశ్వమునకు కర్తవు, రక్షించువాడవు, రాక్షసులను సంహరించువాడవు కూడ; (30)

అనంతుడైనప్రభూ! నీవు మమ్ములను రక్షింపదగినవాడవు. ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవైఉన్నావు'' అనియిట్లు బ్రహ్మచేత ప్రార్థింపబడిన వాడై ఆనారాయణుడు; (31)

వికసించినకమలములవంటి కన్నులుకలవాడు, పచ్చనివస్త్రము ధరించినవాడునై దేవతలను గూర్చి యిట్లుపలికెను. ''చాలా గొప్పపరా క్రమమముకలవారు అగు దేవతలు మీరు బ్రహ్మదేవునితో కూడినవారై ఎందుకు; (32)

ఈ ప్రదేశమునకు వచ్చితిరి? మీకు నేనేమి కార్యముచేయవలెను?'' అని ప్రశ్నించగా, దేవతలు ఇట్లు బదులు పలికిరి.

హిరణ్యకశిపుడను వాడు బ్రహ్మయొక్క వరములచేత గర్వముకలవాడై; (33)

ఆరాక్షసుడు, ఓమహాత్మా! దేవదలందరిని ఋషులతో గూడ బాధించుచున్నాడు. అతడు, నీవు తప్ప ఇతరులందరికీ అవధ్యుడైయున్నాడు. (చంపశక్యముకానివాడు). (34)

హన్తు మర్హసి సర్వేషాం త్రాతాసి త్వం జగన్మయ | శ్రుత్వా తద్దైవతై రుక్తం స విష్ణు ర్లోకభావనః || || 35 ||

వధాయ దైత్యముఖ్యస్య సో7సృజ త్పురుషం స్వయమ్‌ | మేరుపర్వత వర్ష్మాణం ఘోరరూపం భయానకమ్‌ || || 36 ||

శంఖచక్రగదాపాణిం తం ప్రాహ గరుడధ్వజః | హత్వా తం దైత్యరాజానం హిరణ్యకశిపుం పునః | || 37 ||

ఇమం దేవం సమాగన్తుం క్షిప్ర మర్హసి పౌరుషాత్‌ | నిశమ్య వైష్ణవం వాక్యం ప్రణమ్య పురుషోత్తమమ్‌ || || 38 ||

మహాపురుష మవ్యక్తం య¸° దైత్యమహాపురమ్‌ | విముఞ్చన్‌ భైరవం నాదం శంఖచక్రగదాధరః || || 39 ||

ఆరుహ్య గరుడం దేవో మహామేరు రివాపరః | ఆకర్ణ్య దైత్యప్రవరా మహామేఘరవోపమమ్‌ || || 40 ||

లోకమయుడైన నారాయణా! అతనిని నీవు చంపుటకు తగియున్నావు. నీవు అందరికి రక్షకుడవు'' దేవతలు చెప్పిన ఆమాటలు విని లోకకర్తయగు ఆ విష్ణువు; (35)

రాక్షసశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుని చంపుటకు అతడొక పురుషుని సృజించెను. ఆపురుషుడు మేరు పర్వతము వంటి భయము కలిగించు ఘోరరూపము కలిగి ఉండెను. (36)

శంఖము, చక్రము చేతులయందుగల ఆపురుషునితో గరుడధ్వజుడైన నారాయణుడిట్లుపలికెను. ''రాక్షసరాజైన హిరణ్యకశిపుని చంపి మరల; (37)

ఈ దేశమునకు శీఘ్రముగా రాదగియున్నావు'' అనగా ఆమాటవిని పురుషోత్తముడు, అవ్యక్త మహాపురుషుడునగు విష్ణువునకు నమస్కరించి ఆపురుషుడు; (38) శంఖచక్రములను, గదను ధరించి భయంకరమైన గర్జనము చేయుచు రాక్షసుని పట్టణమునకు వెళ్లెను. (39)

ఆ దేవుడు గరుత్ముంతునెక్కి రెండవ మేరు పర్వతమువలె వెళ్లగా, మేఘము యొక్క పెద్ద ధ్వనివంటి ఆ పురుషుని ధ్వని విని రాక్షసశ్రేష్ఠులు (40)

సమం చ చక్రిరే నాదం తథా దైత్యపతే ర్భయాత్‌ | || 41 ||

అసురాఊచు: -

కశ్చి దాగచ్ఛతి మహాన్‌ పురుషో దేవనోదితం ||

విముఞ్చన్‌ భైరవం నాదం తం జానీమో జనార్దనమ్‌ | తతః సహాసురవరై ర్హిరణ్యకశిపుః స్వయమ్‌ || || 42 ||

సన్నద్ధైః సాయుధైః పుత్రైః సప్రహ్లాదై స్దా య¸° | దృష్ట్వా తం గరుడారూఢం సూర్యకోటిసమప్రభమ్‌ || || 43 ||

పురుషం పర్వతాకారం నారాయణ మివాపరమ్‌ | దుద్రువుః కేచి దన్యోన్య మూచుః సంభ్రాన్తలోచనాః || || 44 ||

అయం స దేవో దేవానాం గోప్తా నారాయణో రిపుః | అస్మాక మవ్యయో నూనం తత్సుతోవా సమాగతః || || 45 ||

రాక్షసరాజువలని భయమువలన ఒక్కమారుగా బిగ్గరగా అరచిరి. ''ఒకానొక గొప్ప పురుషుడు దేవతలచేత ప్రేరణపొంది మనమీదకు వచ్చుచున్నాడు. (41)

భయంకరమైన గర్జనచేయుచున్న ఆపురుషుని జనార్దనుడైన విష్ణువుగా తెలిసికొన్నాము'' అనిరి. తరువాత హిరణ్యకశిపుడు రాక్షసశ్రేష్ఠులతో కూడ స్వయముగా (41)

ఆయుధములతోకూడి, యుద్ధమునకు సిద్ధమైన ప్రహ్లాదునితోకూడ, కుమారులందరితో యుద్ధమునకు వెళ్లెను. కోటిమంది సూర్యులతో సమానమైన కాంతి గలిగి, గరుడుని అధిష్ఠించియున్న ఆవిష్ణువును చూచి; (43) పర్వతమువంటి ఆకారముకల, రెండవ నారాయణునివలెనున్న ఆ పురుషుని చూచి కొందరు పారిపోయిరి. ఇతరులు తత్తరపాటుతో కూడిన చూపులు కలవారై తమలోతామిట్లనుకొనిరి. (44)

ఇతడు మనకు శత్రువు, దేవతలకు రక్షకుడు, నాశరహితుడును అగు విష్ణువే నిశ్చయముగా అయి యుండును. లేదా అతని కుమారుడైన కావచ్చును. (45)

ఇత్యుక్త్వా శస్త్రవర్షాణి ససృజః పురుషాయ తే | స తాని చాక్షతో దేవో నాశయామాస లీలయా || || 46 ||

హిరణ్యకశిపోః పుత్రా శ్చత్వారః ప్రథితౌజసః | పుత్రం నారాయణోద్భూతం యుయుధు ర్మేఘనిఃస్వనాః || || 47 ||

ప్రహ్లాద శ్చానుహ్లాదశ్చ సంహ్లాదో హ్లాద ఏవచ | ప్రహ్లాదః ప్రాహిణో ద్బ్రాహ్మ మనుహ్లాదో7థ వైష్ణవమ్‌ || || 48 ||

సంహ్లాదశ్చాపికౌమార మాగ్నేయం హ్లాద ఏవచ | తాని తం పురుషం ప్రాప్య చత్వార్యస్త్రాణి వైష్ణవమ్‌ || || 49 ||

న శేకు శ్చలితుం విష్ణుం వాసుదేవం యథాతథమ్‌ | అథాసౌ చతురః పుత్రా న్మహాబాహు ర్మహాబలః || || 50 ||

ఇట్లుపలికి వారు ఆపురుషునికొరకు ఆయుధవర్షములను కురిపించిరి. ఆపురుషుడుకూడ వారి శస్త్రములను సులభముగా భగ్నముచేసి అక్షతశరీరుడుగా ఉండెను. (46)

ప్రసిద్ధమైన బలముకల హిరణ్యకశిపుని కుమారులునలుగురు, మేఘమువలె గంభీరధ్వనికలవారై, విష్ణువువలన పుట్టిన ఆపురుషునితో యుద్ధముచేసిరి. (47)

ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని ఆనలుగురిపేర్లు. వారిలో ప్రహ్లాదుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా, అనుహ్లాదుడు నారాయణాస్త్రమును ప్రయోగించినాడు. (48)

సంహ్లాదుడు కౌమారాస్త్రమును, హ్లాదుడనువాడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రములన్నియు నారాయణసంభవుడైన ఆ పురుషుని చేరి; (49) అతనిని ఏమాత్రము చలింపజేయజాలకపోయినవి. అతడు వాసుదేవుడైన విష్ణువువలెనే గొప్ప భుజములు కల, ఆ పురుషుడు హిరణ్యకశిపుని నలుగురు పుత్రులను; (50)

ప్రగృహ్య పాదేషు కరైః చిక్షేపచ ననాద చ | విముక్తే ష్వథ పుత్రేషు హిరణ్యకశిపుః స్వయమ్‌ || || 51 ||

పాదేన తాడయామాస వేగేనోరసి తం బలీ | స తేన పీడితో7 త్యర్థం గరుడేన సహానుగః || || 52 ||

అదృశ్యః ప్రయ¸° తూర్ణం యత్ర నారాయణః ప్రభుః | గత్వా విజ్ఞాపయామాస ప్రవృత్త మఖిలం తదా || || 53 ||

సంచిన్త్య మనసా దేవః సర్వజ్ఞానమయో7 మలః | నర స్యార్థతనుం కృత్వా సింహస్యా ర్థతనుం తథా || || 54 ||

నృసింహవపు రవ్యక్తో హిరణ్యకశిపోః పురే | ఆవిర్బభూవ సహసా మోహయ న్దైత్యదానవాన్‌ |||| 55 ||

తనచేతులతో వారి పాదములయందు పట్టుకొని విసరివైచెను, మరియు గర్జించెను. తరువాత తన కుమారులందరు పోరాటమునుండి దూరముకాగా హిరణ్యకశిపుడు స్వయముగా, (51)

తన పాదముతో అతని రొమ్ములపై బలముగా తన్నెను. ఆ హిరణ్యకశిపునిచేత ఎక్కువగా బాధింపబడిన ఆ వైష్ణవ పురుషుడు గరుత్ముంతునితో, అనుచరులతో గూడ; (52)

అంతర్ధానమై ప్రభువైన నారాయణుడున్నచోటికి శీఘ్రముగా వెళ్లెను. అక్కడికి వెళ్లి హిరణ్యకశిపునివద్ద జరిగిన విషయ మంతయు హరికి విన్నవించెను. (53)

ఆ విషయము విని, అఖిలజ్ఞాన స్వరూపుడు, నిర్మలుడు అగు నారాయణుడు మనసులో ఆలోచించి, సగము శరీరము మనుష్యునిది, సగము శరీరము సింహపుదిగా చేసి; (54) నరసింహరూపమును ధరించి అదృశ్యముగావెళ్లి హిరణ్యకశిపుని పట్టణములో అకస్మాత్తుగా సాక్షాత్కరించెను. ఆరూపముతో దైత్యులను, దానవులను అతడు మోహింపజేసెను. (55)

దంష్ట్రాకరాళో యోగాత్మా యుగాన్తదహనోపమః | సమారుహ్యా త్మనః శక్తిం సర్వసంహారకారికామ్‌ || || 56 ||

భాతి నారాయణో7నన్తో యథా మధ్యన్దినే రవిః | దృష్ట్వా నృసింహం పురుషం ప్రహ్లాదం జ్యేష్ఠపుత్రకమ్‌ || || 57 ||

వధాయ ప్రేరయామాస నరసింహస్య సో7సురః | ఇమం నృసింహం పురుషం పూర్వస్మా దూనశక్తికమ్‌ || || 58 ||

సహైవతే7 నుజైః సర్వై ర్నాశయా శు మయేరితః | స తన్నియోగా దసురః ప్రహ్లాదో విష్ణు మవ్యయమ్‌ || || 59 ||

యుయుధే సర్వయత్నేన నరసింహేన నిర్జితః | తతః సంమోహితో దైత్యో హిరణ్యాక్ష స్తదానుజః || || 60 ||

కోరలతో భయంకరరూపముకలవాడు, యోగస్వరూపుడు, ప్రళయకాలపు అగ్నితో పోల్చదగినవాడు అగు నారాయణుడు, సమస్తమును సంహరింప జేయగల తనశక్తిని అధిష్ఠించి, (56)

మధ్యాహ్నాకాలములో సూర్యుడేవిధముగా ప్రకాశించునో ఆవిధముగా విష్ణువు ప్రకాశించెను. నరసింహరూపములోనున్న ఆపురుషుని చూచి తన పెద్దకుమారుడైన ప్రహ్లాదుని గూర్చి; (57)

రాక్షసుడైన హిరణ్యకశిపుడు నరసింహుని చంపుమని ప్రేరణచేసెను. ''ఈ నరసింహరూపముకల పురుషుని, పూర్వముకంటె తక్కువ శక్తి కలవానిని; (58)

నాచేత ప్రోత్సహించబడినవాడవై, నీ తమ్ములతో కూడి శీఘ్రముగా సంహరించుము.'' అని పలికిన తండ్రి ఆజ్ఞవలన అసురుడైన ప్రహ్లాదుడు నాశరహితుడైన విష్ణువును; (59)

సంపూర్ణ ప్రయత్నముతో ఎదుర్కొని పోరాడెను. చివరకు ఆనరసింహునిచేత ఓడింపబడినాడు. అప్పుడు హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మోహపరవశుడై; (60)

ధ్యాత్వా పశుపతే రస్త్రం ససర్జ చ ననాద చ | తస్య దేవాధిదేవస్య విష్ణో రమితతేజసః || || 61 ||

న హాని మకరో దస్త్రం తథా దేవస్య శూలినః | దృష్ట్వా పరాహతం త్వస్త్రం ప్రహ్లాదో భాగ్యగౌరవాత్‌ || || 62 ||

మేనే సర్మాత్మకం దేవం వాసుదేవం సనాతనమ్‌ | సన్త్యజ్య సర్వశస్త్రాణి సత్త్వయుక్తేన చేతసా || || 63 ||

ననామ శిరసా దేవం యోగినాం హృదయేశయమ్‌ | స్తుత్వా నారాయణం స్తోత్రైః ఋగ్యజస్సామసంభ##వైః || || 64 ||

నివార్య పితరం భ్రాతౄన్‌ హిరణ్యాక్షం తదా7 బ్రవీత్‌ | అయం నారాయణో7 నన్తః శాశ్వతో భగవా నజః || || 65 ||

పాశుపతాస్త్రమును ధ్యానించి నరసింహునిపై ప్రయోగించి బిగ్గరగా అరచెను. పిరమితి లేని తేజస్సుకల, దేవతలందరికి ప్రభువైన ఆనారాయణునికి; (61)

శివునికి సంబంధించిన ఆ అస్త్రము ఎటువంటి హానినికూడ కలిగించలేదు. ఆ అస్త్రము విష్ణువుచే విఫలము చేయబడుటను చూచిన ప్రహ్లాదుడు, తనయొక్క అదృష్టవిశేషమువలన; (62)

ఆవిష్ణువును, సనాతనుడు, సమస్త జగత్స్వరూపుడు, అగుదేవునిగా తలచెను. అప్పుడా ప్రహ్లాదుడు తన ఆయుధములన్నిటిని వదలి సత్త్వగుణయుక్తమైన మనస్సుతో; (63)

యోగీశ్వరుల హృదయమువందు శయనించు ఆదేవునికి శిరస్సుతో ప్రణమిల్లెను. ఋగ్యజుస్సామవేదములకు సంబంధించిన మంత్రరూప స్తోత్రములతో నారాయణుని స్తుతించి; (64)

తనతండ్రిని, సోదరులను, హిరణ్యాక్షునికూడ యుద్ధమునుండి వారించి అతడిట్లనెను. ''ఈ నారాయణుడు అంతములేనివాడు శాశ్వతుడు, పుట్టుకలేనివాడు అగుభగవంతుడు. (65)

పురాణః పురుషో దేవో మహాయోగీ జగన్మయః | అయం ధాతా విధాతాచ స్వయంజ్యోతి ర్నిరఞ్జనః || || 66 ||

ప్రధానం పురుషం తత్త్వం మూలప్రకృతి రవ్యయా | ఈశ్వరః సర్వభూతానా మన్తర్యామీ గుణాతిగః || || 67 ||

గచ్ఛధ్వ మేనం శరణం విష్ణు మవ్యక్త మవ్యయమ్‌ | ఏవ ముక్తః సుదుర్బుద్ధి ర్హిరణ్యకశిపుః స్వయమ్‌ || || 68 ||

ప్రోవాచ పుత్ర మత్యర్థం మోహితో విష్ణుమాయయా | అయం సర్వాత్మనా వథ్యో నృసింహో7ల్పపరాక్రమః || || 69 ||

సమాగతో స్మ7ద్భవన మిదానీం కాలచోదితః | విహస్య పితరం పుత్రో వచః ప్రాహ మహామతిః || || 70 ||

ఇతడు పురాణపురుషుడు, గొప్పయోగీశ్వరుడు, లోకాత్మకుడు. ఇతడే ధాత, విధాతకూడ. స్వయముగా ప్రకాశించువాడు, మాలిన్యము లేని వాడును అగుదేవుడు. (66)

ఈ విష్ణువే ప్రధానమైన పురుషతత్త్వము, నాశరహితమైన మూలప్రకృతిరూపుడు. సమస్తప్రాణులకు ఈశ్వరుడు, అంతటవ్యాపించి ఉన్నవాడు, త్రిగుణములకతీతుడైయున్నాడు. (67)

అటువంటిఅవ్యక్తరూపుడైన, నాశరహితుడైన ఇతనిని శరణుపొందుడు''. అనియిట్లు ప్రహ్లాదునిచే చెప్పబడిన, మిక్కిలి దుష్టమైన బుద్ధికల హిరణ్యకశిపుడు స్వయముగా; (68)

విష్ణుమాయచేత మోహమును పొందించబడినవాడై కుమారుని గూర్చి ఇట్లుపలికెను. ''అల్పమైన పరాక్రమముకల ఈనరసింహరూపియైన పురుషుడు అన్ని విధముల చంపదగినవాడు. (69)

ఇతడిప్పుడు మృత్యువుచేత ప్రేరణపొంది మనభవనమునకు వచ్చినాడు''. అని పలికిన తండ్రిని చూచి నవ్వి, కుమారుడైన గొప్పబుద్ధికల ప్రహ్లాదుడు ఈమాట పలికెను. (70)

మా నిన్దసై#్వన మీశానం భూతానా మేక మవ్యయమ్‌ | కథం దేవో మహాదేవః శాశ్వతః కాలవర్జితః || || 71 ||

కాలేన హన్యతే విష్ణుః కాలాత్మా కాలరూపధృక్‌ | తతః సువర్ణకశిపు ర్దురాత్మా కాలచోదితః || || 72 ||

నివారితో7పి పుత్రేణ యుయుధే హరి మవ్యయమ్‌ | సంరక్తనయనో7 నన్తో హిరణ్యనయనాగ్రజమ్‌ || || 73 ||

నఖై ర్విదారయామాస ప్రహ్లాద సై#్యన పశ్యతః | హతే హిరణ్యకశిపౌ హిరణ్యాక్షో మహాబలః || || 74 ||

విసృజ్య పుత్రం ప్రహ్లాదం దుద్రువే భయవిహ్వలః | అనుహ్లాదాదయః పుత్రా అన్యే చ శతశో7 సురాః || || 75 ||

నృసింహదేహసంభూతైః సింహై ర్నీతా యమక్షయమ్‌ | తతః సంహృత్య తద్రూపం హరి ర్నారాయణః ప్రభుః || || 76 ||

సమస్తభూతములకు ప్రభువు, అద్వితీయుడు, నాశరహితుడు అయిన ఇతనిని దూషించకుము. శాశ్వతుడు, కాలమునకతీతుడు, భగవంతుడు, మహాదేవుడు అగు; (71)

విష్ణువుఎట్లు కాలునిచేత చంపబడును? ఇతడుకాల స్వరూపుడు, కాలరూపమును ధరించినవాడు'' అని పలుకగా దుష్టస్వభావుడైన హిరణ్యకశిపుడు కాలముచేత ప్రేరణపొందినవాడై అప్పుడు. (72)

తనకుమారునిచేత వలదని వారింపబడికూడ నాశరహితుడైన విష్ణువుతో యుద్ధముచేసెను. ఎఱ్ఱని కన్నులుగల ఆవిష్ణువు హిరణ్యాక్షుని అన్నయగు హిరణ్యకశిపుని, (73)

అతనిపుత్రుడగు ప్రహ్లాదుడుచూచుచుండగనే గోళ్లతో చీల్చిచంపెను. హిరణ్యకశిపుడు చంపబడగా గొప్పబలము కలిగిన హిరణ్యాక్షుడు; (74)

భయముతోకలతచెంది కుమారుడైన ప్రహ్లాదుని అక్కడనే వదలి పారిపోయెను. అనుహ్లాదుడు మొదలగు తక్కిన కుమారులు, వందలకొలది ఇతర రాక్షసులుకూడ, (75)

నరసింహుని శరీరమునుండి పుట్టిన సింహముచేత యమలోకమును పొందించబడిరి తరువాత విష్ణువు భయంకరమైన ఆరూపమునుపసంహరించి; (76)

స్వమేవ పరమం రూపం య¸° నారాయణాహ్వయమ్‌ | గతే నారాయణ దైత్యః ప్రహ్లాదో7 సురసత్తమః || || 77 ||

అభిషేకేణ యుక్తేన హిరణ్యాక్ష మయోజయత్‌ | స బాధయామాస సురా న్రణ జిత్వా మునీనపి || || 78 ||

లబ్ధ్వా న్ధకం మహాపుత్రం తపసారాధ్య శంకరమ్‌ | దేవా ఞ్జిత్వా సదేవేన్ద్రాన్‌ క్షుబ్ధ్వా చ ధరణీ మిమామ్‌ || || 79 ||

నీత్వా రసాతలం చక్రే వేదాన్వై నిష్ప్రభాం స్తథా | తతః సబ్రహ్మకా దేవాః పరివ్లూనముఖశ్రియః || || 80 ||

గత్వా విజ్ఞాపయామాసు ర్విష్ణవే హరిమన్దిరమ్‌ | స చిన్తయిత్వా విశ్వాత్మా తద్వధోపాయమవ్యయః || || 81 ||

తనదైన నారాయణనామముగల శ్రేష్ఠమైన ఆకారమును పొందెను. భగవంతుడగు నారాయణుడక్కడినుండి వెడలిపోగా రాక్షసశ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు. (77) ఉచితమైన పట్టాభిషేకముతో హిరణ్యాక్షునిప్రభువుగా చేసెను. తరువాత అతడు యుద్ధముతో జయించి దేవతలను, మునులను గూడ బాధలు పెట్టెను. (78)

తపస్సుతో శంకరుని పూజించి అంధకుడను పేరుగల గొప్ప కుమారునిపొంది, దేవేంద్రునితో కూడ దేవతలందరిని జయించి ఈభూమిని కలత చెందించి, (79)

వేదములను పాతాళమునకు తీసికొనివెళ్లి కాంతిహీనములుగా చేసెను. తరువాత బ్రహ్మతో కూడిన దేవతలందరు వాడిపోయిన ముఖకాంతి కలవారై, (79)

వైకుంఠమున విష్ణునివాసమునకువెళ్లి ఆదేవునకీ విషయమును విన్నవించిరి. విశ్వరూపుడు, నాశరహితుడును అగు ఆనారాయణుడు వానిని చంపుటకు తగిన ఉపాయమునాలోచించి, (81)

సర్వదేవమయం శుభ్రం వారాహం వపు రాధథే | గత్వా హిరణ్యనయనం హత్వా తం పురుషోత్తమః || || 82 ||

దంష్ట్రయో ద్ధారయామాస కల్పాదౌ ధరణీ మిమామ్‌ | త్యక్త్వా వారాహసంస్థానం సంస్థాపై#్యవం సురద్విషః || || 83 ||

స్వామేవ ప్రకృతిం దివ్యాం య¸° విష్ణుః పరంపదమ్‌ | తస్మిన్‌ హతే7మరరిపౌ ప్రహ్లాదో విష్ణుతత్పరః || || 84 ||

అపాలయత్స్వకం రాజ్యం భావం త్యక్త్వా తదాసురమ్‌ | యజతే విధివ ద్దేవాన్‌ విష్ణో రారాధనే రతః || || 85 ||

నిస్సపత్నం సదా రాజ్యం తస్యాసీ ద్విష్ణువైభవాత్‌ | తతః కదాచి దసురో బ్రాహ్మణం గృహ మాగతమ్‌ || || 86 ||

నచ సంభాషయామాస దేవానాం చైవ మాయయా | స తేన తాపసో7త్యర్థం మోహితే నావమానితః || || 87 ||

సమస్తదేవతామయము, నిర్మలమైనదియగు వరాహరూపమును ధరించెను. తరువాత పురుషోత్తముడైన విష్ణువు వెళ్లి హిరణ్యాక్షుని చంపి; (82) తనయొక్క కోరతో కల్పాదిసమయములో ఈభూమిని పైకి తెచ్చెను. తరువాత వరాహరూపమును విడిచిపెట్టి, రాక్షసులను అక్కడ అధికారములో నెలకొల్పి; (83) ఆవిష్ణువు, దివ్యమైన తననిజరూపమును పొంది పరమపదమునకు వెళ్లెను. ఆహిరణ్యాక్షుడు మరణించగా, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు; (84)

రాక్షసభావమును విడిచిపెట్టి తనరాజ్యమును పరిపాలించెను. భగవంతుడగు నారాయణుని పూజయందాసక్తికలిగి, శాస్త్రపద్ధతితో దేవతలకు యజ్ఞములు చేసెను. (85)

అతనిరాజ్యము విష్ణువు మహిమవలన శత్రురహితముగా ఉండెను. తరువాత ఒకప్పుడు ప్రహ్లాదుడు తనయింటికి వచ్చిన బ్రామ్మణునితో; (86)

దేవతలమాయచేత మాట్లాడలేదు. ఆతాపసుడు మోహితుడైన ప్రహ్లాదునిచేత మిక్కిలిగ అవమానించబడినవాడై; (87)

శశాపా సురరాజానం క్రోధసంరక్తలోచనః | యత్తద్బలం సమాశ్రిత్య బ్రాహ్మణా నవమన్యసే || || 88 ||

సా శక్తి ర్వైష్ణవీ దివ్యా వినాశం తే గమిష్యతి | ఇత్యుక్త్వా ప్రయ¸° తూర్ణం ప్రహ్లాదస్య గృహా ద్ద్విజః || || 89 ||

ముమోహ రాజ్యసంసక్తః సో7పి శాపబలా త్తతః | బాధయామాస విప్రేన్ద్రా న్న వివేద జనార్దనమ్‌ || || 90 ||

పితు ర్వధ మనుస్మృత్య క్రోధం చక్రే హరిం ప్రతి | తయోః సమభవ ద్యుద్ధం సుఘోరం రోమహర్షణమ్‌ || || 91 ||

నారాయణస్య దేవస్య ప్రహ్లాదస్యా మరద్విషః | కృత్వా స సుముహ ద్యుద్థం విష్ణునా తేన నిర్జితః || || 92 ||

కోపముతో ఎర్రబడిన కన్నులు కలవాడై రాక్షసరాజునిట్లు శపించెను. ఏబలమునాశ్రయించి నీవు బ్రాహ్మణుల నవమానించుచున్నావో, ఆ విష్ణుసంబంధనియైన నీ దివ్యశక్తి నశించిపోవుగాక. ఇట్లు పలికి ఆ బ్రాహ్మణుడు శీఘ్రముగా ప్రహ్లాదుని యింటినుండి వెడలిపోయెను. (88,89)

తరువాత శాపబలమువలన ఆరాక్షసరాజు రాజకార్యముల యందాసక్తుడై, మోహమును పొందెను. బ్రాహ్మణోత్తములను బాధించెను. విష్ణువును గుర్తించడాయెను. (90)

తనతండ్రి హత్యను స్మరించుకొని హరినిగూర్చి కోపమును తెచ్చుకొనెను. అప్పుడు వారిద్దరికి భయంకరమైన, రోమాంచమును కల్గించు గొప్పయుద్ధము జరిగెను. (91)

భగవంతుడగు నారాయణునకు, దేవతావిరోధియగు ప్రహ్లాదునకు గొప్పయుద్ధముజరిగి దానిలో విష్ణువుచేత ప్రహ్లాదుడు జయింపబడెను. (92)

పూర్వసంస్కారమాహాత్మ్యా త్పరస్మి న్పురుషే హరౌ | సఞ్జాతం తస్య విజ్ఞానం శరణ్యం శరణం య¸° || || 93 ||

తతః ప్రభృతి దైత్యేన్ద్రో హ్యనన్యాం భక్తి ముద్వహన్‌ | నారాయణ మహాయోగ మవాప పురుషోత్తమే || || 94 ||

హిరణ్యకశిపోః పుత్రే యోగసంసక్తచేతసి | అవాప త న్మహ ద్రాజ్యమన్ధకో7 సురపుఙ్గవః || || 95 ||

హిరణ్యనేత్రతనయః శంభో ర్దేహసముద్భవః | మన్దరస్థా ముమాం దవీం చకమే పర్వతాత్మజామ్‌ || || 96 ||

పురా దారువనే పుణ్య మునయో గృహమేధినః | ఈశ్వరారాధనార్థాయ తపశ్చేరుః సహస్రశః || || 97 ||

పూర్వసంస్కారము యొక్క విశేషమువలన అతనికి పరమపురుషుడైన ఆవిష్ణువునందు భక్తిపూర్వకజ్ఞానము కలిగినది. అందువలన శరణు పొందదగిన ఆనారాయణునిశరణు పొందెను. (93)

అప్పటి నుండి రాక్షసరాజైన ప్రహ్లాదుడు పురుషోత్తముడైన నారాయణునియందు సాటిలేని గొప్పభక్తిని కలిగి గొప్పయోగసిద్ధిని పొందెను. (94)

హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు యోగసాధనలో ఆసక్తుడుకాగా, ఆతని గొప్పరాజ్యమును రాక్షసశ్రేష్ఠుడైన అంధకుడు స్వీకరించెను. (95)

ఆ అంధకుడు హిరణ్యాక్షుని కుమారుడు, శివునియొక్క శరీరము నుండి పుట్టినవాడు. వాడొకమారు పర్వతరాజు కూతురు, మందర పర్వతమందున్నది అగు ఉమాదేవిని కామించెను. (96)

పూర్వకాలములో పవిత్రమైన దారువనములో గృహస్థులైన మునులు వేలమంది, ఈశ్వరుని ఆరాధించుకొరకు తపస్సు నాచరించిరి. (97)

తతః కదాచి న్మహతీ కాలయోగేన దుస్తరా | అనావృష్టి రతీవోగ్రా హ్యాసీ ద్భూతవినాశినీ || || 98 ||

సమేత్య సర్వే మునయో గౌతమం తపసాం నిధిమ్‌ | అయాచన్త క్షుధావిష్టా ఆహారం ప్రాణధారణమ్‌ || || 99 ||

స తేభ్యః ప్రదదా వన్నం మృష్టం బహుతరం బుధః | సర్వే బుభుజిరే విప్రా నిర్విశంకేన చేతసా || || 100 ||

గతే చ ద్వాదశే వర్షే కల్పాన్త ఇవ శాఙ్కరీ | బభూవ వృష్టి ర్మహతీ యథాపూర్వ మభూ జ్జగత్‌ || || 101 ||

తతః సర్వే మునివరాః సమామన్త్ర్య పరస్పరమ్‌ | మహర్షిం గౌతమం ప్రోచు ర్గచ్ఛామ ఇతి వేగతః || || 102 ||

నివారయామాస చ తాన్‌ కంచిత్కాలం యథాసుఖమ్‌ | ఉషిత్వా మద్గృహే7 వశ్యం గచ్ఛధ్వమితి పణ్డితాః || || 103 ||

తతో మాయామయీం సృష్ట్వా కృష్ణాం గాం సర్వఏవతే | సమీపం ప్రాపయామాసుర్గౌతమస్య మహాత్మనః || || 104 ||

సో7 నువీక్ష్యకృపావిష్ట స్తస్యాః సంరక్షణోత్సుకః | గోష్ఠే తాం బన్థయామాస స్పృష్టమాత్రా మమార సా || || 105 ||

సశోకేనాభిసన్తప్తః కార్యాకార్యేమహామునిః | న పశ్యతి స్మసహసా తమృషిం మునయో7 బ్రువన్‌ || || 106 ||

గోవధ్యేయం ద్విజశ్రేష్ఠ యావత్తవ శరీరగా | తావత్తే7 న్నం నభోక్తవ్యం గచ్ఛామో వయమేవ హి || || 107 ||

తేనాతో7 నుమతా స్సన్తో దేవదారువనం శుభమ్‌ | జగ్ముః పాపవశన్నీత్వా తపశ్చర్తుం యథాపురా || || 108 ||

తరువాత కొంతకాలమునకు ఒకప్పుడు కాలప్రభావముచేత దాటుటకు శక్యముకానిది, ప్రాణులను నశింపజేయునది, మిక్కిలిభయంకరమైనది అగు అనావృష్టియేర్పడెను. (98)

అప్పుడు అక్కడిమునులందరు ఒకచోట చేరి తపస్సులకు నిధివంటివాడైన గౌతమమునినిచేరి, ఆకలిచే పీడింపబడినందున ప్రాణములను నిలుపునట్టి ఆహారమునిమ్మని యాచించిరి. (99)

విద్వాంసుడైన ఆగౌతముడు వారికి రుచికరమైన అన్నమును అనేకవిధము దానిని పెట్టించెను. ఆ బ్రాహ్మణులందరు ఎటువంటి అనుమానములేని మనస్సుతో అన్నమును భుజించిరి. (100)

పండ్రెండవ సంవత్సరము గడువగా, అప్పుడు ప్రళయకాలములో శంకరునిచేత కల్పింపబడు వర్షమువలె గొప్పవర్షము కురిసెను. తరువాత ప్రపంచము మరల పూర్వమువలె ఆయెను. (101)

తరువాత ఆమునిశ్రేష్ఠులందరు ఒకరితోనొకరు ఆలోచించుకొని గౌతమ మహర్షి దగ్గరకు వచ్చి, వెళ్లుదుము అని వేగముగా చెప్పిరి. (102)

ఆగౌతమముని వారిని, కొంతకాలము సుఖముగా మా యింటిలో నివసించి తరువాత వెళ్లుడు అని వారిని ప్రయాణము నుండి వారించెను. (103)

తరువాత ఆమునులు మాయచే కల్పితమైన నల్లని గోవును సృజించి మహాత్ముడైన ఆ గౌతమమునియొక్క సమీపమునకు చేర్చిరి. (104)

ఆగౌతముడు దానిని చూచి, దయకలిగినవాడై, దానినికాపాడుట యందాసక్తికలవాడై తనపశువులశాలలో దానిని కట్టివేసెను. ఆగోవు అతనిచేత తాకబడినంత మాత్రముచేతనే మరణించినది. (105)

దానిమరణముతో గౌతముడు చాలా పరితాపము చెందినవాడై, ఏదికార్యము, ఏది అకార్యము అను విషయమును శీఘ్రముగా తెలిసికొనజాలని పరిస్థితిలో పడిపోయెను. అప్పుడు మునులు ఆఋషితో ఇట్లనిరి. (106)

ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! ఈ గోవధవలన కలిగిన పాపము నీ శరీరమును ఎంతవరకు ఆశ్రయించి ఉండునో, అప్పటి వరకు నీ అన్నమును మేము తినకూడదు. అందువలన మేమువెళ్లుచున్నాము. (107)

అతనిచేత అనుమతినిపొందినవారై ఆమునులు మంగళకరమైన దేవడారు వనమును గూర్చి వెళ్లిరి. వారు తమపాపఫలమును వెంట తీసుకొని, పూర్వమువలె తపస్సుచేయుటకు వెళ్లిరి. (108)

స తేషాం మాయయా జాతాం గోవధ్యాం గౌతమో మునిః | కేనాపి హేతునా జ్ఞాత శశాపా తీవ కోపతః || || 109 ||

భవిష్యన్తి త్రయీబాహ్య మహాపాతకిభి స్సమాః | బహుశ స్తే తథా శాపా జ్జాయమానాః పునః పునః || || 110 ||

సర్వే సంప్రాప్యదేవేశం శంకరం విష్ణు మవ్యయమ్‌ | అస్తువన్‌ లౌకికైః స్తోత్రై రుచ్ఛిష్టా ఇవ సర్వగౌ || || 111 ||

దేవదేవౌ మహాదేవౌ భక్తానా మార్తినాశనౌ | కామవృత్త్యా మహాయోగౌ పాపా న్న స్త్రాతు మర్హతః || || 112 ||

తదా పార్శ్వస్థితం విష్ణుం సంప్రేక్ష్య వృషభధ్వజః | కి మేతేషాం భ##వే త్కార్యం ప్రాహ పుణ్యౖషిణా మితి || || 113 ||

ఆ గౌతమముని, తనకు కలిగిన గోవధపాతకము ఆమునుల మాయచేత కలిగినదని ఒకానొక కారణముచేత తెలిసికొని చాల కోపము కలిగివారిని శపించెను. (109)

''ఈమునులు వేదత్రయమునకు దూరులై, మహాపాతకములు చేసినవారితో సమానులై ఉండగలరు'' అని శపించెను. ఆమునులు అతని శాపమువలన చాలమారులు మరలమరలపుట్టుచున్నవారై; (110)

వారందరు దేవతలకు ప్రభువైన శంకరుని, విష్ణువును కూడచేరి, అంతట నిండియున్నవారిని ఎంగిలిపడినవారు వలె లౌకికములైన స్తోత్రములతో కొనియాడిరి. (వైదికమంత్రములతో కాకుండా) (111)

ఆ విష్ణువు, శంకరుడుకూడ దేవతలకుదేవులు, భక్తులబాధలను తొలగించు గొప్పదేవులు, స్వేచ్ఛాప్రవృత్తి చేత గొప్పయోగమును ధరించిన వారుకనుక పాపమునుండి మమ్ములను కాపాడదగియున్నారు. (112)

అప్పుడు వృషభధ్వజుడైన శంకరుడు, తనప్రక్కన నిలిచియున్న విష్ణువును చూచి, పుణ్యమును కోరుచున్న వీరి విషయములో చేయదగిన కార్యమేమి? అని ప్రశ్నించెను. (113)

తతః స భగవా న్విష్ణుః శరణ్యో భక్తవత్సలః | గోపతిం ప్రాహ విప్రేన్ద్రా నాలోక్య ప్రణతా న్హరిః || || 114 ||

న వేడబాహ్యే పురుషే పుణ్యలేశో7పి శంకర | సంగచ్ఛతే మహాదేవ ధర్మో వేదా ద్వినిర్బభౌ || || 115 ||

తథాపి భక్తవాత్సల్యా ద్రక్షితవ్యా మహేశ్వర | అస్మాభిః సర్వే ఏవైతే గన్తారో నరకా నపి || || 116 ||

తస్మాద్ధి వేదబాహ్యానాం రక్షణార్థాయ పాపినామ్‌ | విమోహనాయ శాస్త్రాణి కరిష్యామో వృషధ్వజ || || 117 ||

ఏవం సంబోధితో రుద్రో మాధవేనా సురారిణా | చకార మోహశాస్త్రాణి కేశవో7పి శివేరితః || || 118 ||

అప్పుడు భక్తులయందు ప్రేమకలవాడు, వరణుపొందినవారిని కాపాడువాడు, భగవంతుడు అగు విష్ణువు, నమస్కరించున్న బ్రాహ్మణులను చూచి శివునిగూర్చి ఇట్లు పలికెను. (114)

ఓ శంకరా! లోకములో వేదములనుండి వెలియైన మనుష్యునియందు కొంచెముపుణ్యముకూడా చేరియుండదు. ధర్మమనునది వేదము నుండి ఆవిర్భవించి ప్రకాశించినది. (115)

ఓ మహేశ్వరా! అట్లైనను మనకుభక్తులయందుండు వాత్సల్యముచేత వీరు కాపాడదగినవారు. వీరందరు తమ పాపమువలన నరకమునకు వెళ్లదాగినవారైనను మనచేతరక్షింప దగినవారు. (116)

అందువలన వేదములకు దూరులైన పాపాత్ములను కాపాడుటకొరకు, జనులను మోహింపజేయుటకు కొన్ని శాస్త్రములను సృజించెదము. ఓ వృషభధ్వ్యజా! ఇదిమనకర్తవ్యము. (117)

ఈవిధముగా రాక్షసులశత్రువైన విష్ణువుచేత బోధింపబడినశివుడు మోహకారకములైన శాస్త్రములను నిర్మించెను. శివునిచే చెప్పబడి హరికూడ కొన్ని అటువంటి శాస్త్రములను రచించెను. (118)

కాపాలం నాకులం వామం భైరవం పూర్వపశ్చిమమ్‌ | పంచరాత్రం పాశుపతం తథాన్యాని సహస్రశః || || 119 ||

సృష్ట్వా తా నాహ నిర్వేదాః కుర్వాణాః శాస్త్రచోదితమ్‌ | పతన్తో నరకే ఘోరే బహూన్‌ కల్పాన్‌ పునఃపునః || || 120 ||

జాయన్తో మానుషే లోకే క్షీణపాపచయా స్తతః | ఈశ్వరారాధనబలా ద్గచ్ఛధ్వం సుకృతా ఙ్గతిమ్‌ || || 121 ||

వర్తధ్వం మత్ర్పసాదేన నాన్యథా నిష్కృతి ర్హినః | ఏవ మీవ్వరవిష్ణుభ్యాం చోదితా స్తే మహర్షయః || || 122 ||

ఆదేశం ప్రత్యపద్యన్త శివస్యా సురవిద్విషః | చక్రుస్తే7 న్యాని శాస్త్రాణి తత్రతత్ర రతాః పునః || || 123 ||

ఆ మోహశాస్త్రాలు - కాపాలము, నాకులము, వామము, భైరవము, పూర్వపశ్చిమము, పంచరాత్రము, పాశుపతము, ఇవికాక ఇతరములు కూడ వేలకొలది శాస్త్రములను; (119) సృజించి, ఆ బ్రాహ్మణులను గూర్చి పలికెను - ''మీరు వేదబాహ్యులై, శాస్త్రములచేత విధింపబడిన కార్యములు చేయుచు భయంకరమైన నరకములలో చాలా కల్పములవరకు మరలమరల పడుచున్నవారై; (120)

మనుష్యలోకములో పుట్టుచు, తరువాత నశించిన పాపముకలవారై, ఈశ్వరుని పూజించిన బలమువలన పుణ్యలోకగతిని పొందగలరు. (121)

నా అనుగ్రహముతో ప్రవర్తించుడు. ఇంకొకవిధముగా మీ పాపమునకు ప్రాయశ్చిత్తములేదు. అని శివుని చేత, నారాయణునిచేత గూడ ప్రోత్సహించబడినవారై ఆ మహర్షులు; (122) రాక్షసులకు శత్రువైన శివుని ఆజ్ఞను ఆచరించిరి. వారుకూడ మరల ఆయా విషయములందా సక్తులై ఇతరములైన శాస్త్రములనుకొన్నిటిని నిర్మించిరి. (123)

శిష్యా నధ్యాపయామాసు ర్దర్శయిత్వా ఫలాని చ | మోహాపసదనం లోక మవతీర్య మహీతలే || || 124 ||

చకార శంకరో భిక్షాం హితాయైషాం ద్విజైః సహ | కపాలమాలాభరణః ప్రేతభస్మావగుణ్ఠితః || || 125 ||

విమోహయ ల్లోక మిమం జటామణ్డలమణ్డితః | నిక్షిప్య పార్వతీం దేవీం విష్ణా వమితతేజసి || || 126 ||

నియోజ్య భగవా న్రుద్రో భైరవం దుష్టనిగ్రహే | దత్వా నారాయణ దేవ్యాం నన్దనం కులనన్దనమ్‌ || || 127 ||

సంస్థాప్య తత్ర చ గణాన్‌ దేవా నిన్ద్రపురోగమాన్‌ | ప్రస్థితే చ మహాదేవే విష్ణు ర్విశ్వతనుః స్వయమ్‌ || || 128 ||

తమ శిష్యులకు సకల విద్యలనభ్యసింపజేయుచు ఫలములను నిరూపించిరి. మోహముతో నిండియున్న లోకములో భూమండలమందవతరించి, (124)

శంకరుడు వారి శుభముకొరకు బ్రాహ్మణులతో కూడ కలిసి భిక్షనాచరించెను. కపాలముల మాలను ఆభరణముగా ధరించినవాడై, శ్మశానములోని భస్మము లేపనము చేసికొన్నవాడై; (125)

జడలసమూహముచేత అలంకరింపబడినవాడై, లోకమును మోహింపజేయుచు, తనభార్యయగు పార్వతీదేవిని గొప్పతేజస్సు కల విష్ణుదేవుని అధీనములో ఉంచి భగవంతుడగు శివుడు దుష్టులను శిక్షించు కార్యములో భైరవుని నియమించి, దేవీరూపమును ధరించిన నారాయణునియందు కులమునకానందమును కలిగించు కుమారుని కలిగించి అక్కడ ఇంద్రుడు మొదలగు దేవతలను, గణములను నెలకొల్పిమహాదేవుడగు శివుడు బయలుదేరివెళ్ళగా, ప్రపంచమే శరీరముగా కలిగిన విష్ణువు స్వయముగా; (126, 127, 128)

స్త్రీరూపధారీ నియతం సేవతే స్మ మహేశ్వరమ్‌ | బ్రహ్మా ముతాశనః శక్రో యమో7న్యే సురపుంగవాః || || 129 ||

సిషేవిరే మహాదేవీం స్త్రీరూపం శోభనం గతాః | నన్దీశ్వరశ్చ భగవాన్‌ శంభో రత్యన్తవల్లభః || || 130 ||

ద్వారదేశే గణాధ్యక్షో యథాపూర్వ మతిష్ఠతి | ఏతస్మి న్నన్తరే దైత్యో హ్యన్థకో నామ దుర్మతిః || || 131 ||

ఆహర్తుకామో గిరిజా మాజగామా థ మన్దరమ్‌ | సంప్రాప్త మన్థకం దృష్ట్వా శంకరః కాలభైరవః || || 132 ||

న్యషేధయ దమేయాత్మా కాలరూపధరో హరః | తయోః సమభవ ద్యుద్ధం సుఘోరం రోమహర్షణమ్‌ || || 133 ||

ఆడురూపమును ధరించినవాడై ఎల్లప్పుడు మహేశ్వరదేవుని సేవించుచుండెను. బ్రహ్మదేవుడు, అగ్నిహోత్రుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, ఇతరదేవాతాశ్రేష్ఠులు; (129)

మంగళకరమైన స్త్రీ రూపమును ధరించినవారై మహాదేవుని సేవించిరి. పూజనీయుడు, శివున కత్యంతము ప్రేమ పాత్రుడైన నందీశ్వరుడు కూడ; (133) గణములకధిపతిగా పూర్వమువలెనే ద్వార ప్రదేశమునందు నిలిచెను. ఇంతలో అంధకుడను పేరుగల దుష్టబుద్ధిగల రాక్షసుడు; (131) పార్వతీదేవిని అపహరించుకోరికగలవాడై 1 అప్పుడు మందరము వద్దకు వచ్చెను. అక్కడికివచ్చిన అంధకాసురుని చూచి ప్రలయకాలభయం కరుడై శివుడు (132) యమధర్మరాజు వంటి ఆకారమును ధరించినవాడై అతనిని అడ్డగించెను. అప్పుడు శంకరునికి, అంధకాసురునికి మధ్య మిక్కిలి క్రూరమైన, గగుర్పాటు కలిగించు గొప్పయుద్ధముజరిగెను. (133)

శూలేనోరసి తం దైత్య మాజఘాన వృషధ్వజః | తతః సహస్రశో దైత్యాః సహస్రాన్థకసంజ్ఞితాః || || 134 ||

నన్దీశ్వరాదయో దైత్యై రన్థకై రభినిర్జితాః | ఘణ్టాకర్ణో మేఘనాద శ్చణ్డశ శ్చణ్డతాపనః || || 135 ||

వినాయకో మేఘవాహః సోమనన్దీ చ వైద్యుతః | సర్వే7న్థకం దైత్యవరం సంప్రాప్యా తిబలాన్వితాః || || 136 ||

యుయుధుః శూలక్త్వృష్టి గిరికూటపరశ్వధైః | భ్రామయిత్వా తు హస్తాభ్యాం గృహీత్వా చరణద్వయమ్‌ || || 137 ||

దైత్యేన్ద్రేణా తిబలినా క్షిప్తాస్తే శతయోజనమ్‌ | తతో న్థకనిసృష్టా యే శతశో7ధ సహస్రశః || || 138 ||

వృషభము ధ్వజముగా కల శివుడు తనశూలముతో ఆరాక్షసుని రొమ్మున పొడిచెను. అప్పుడా అంధకుని శరీరమునుండి వేలకొలది అంధకసంజ్ఞకల రాక్షసులావిర్భవించిరి. (134)

ఆ అంధక రాక్షసులచేత యుద్ధములో నందీశ్వరుడుమొదలగువారు ఓడింపబడిరి. ఘంటాకర్ణుడు, మేఘనాదుడు, చండేశుడు, చండతాపనుడు అనువారు (135) వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది, వైద్యుతుడు అను గొప్పబలము కలవారందరు రాక్షసశ్రేష్ఠుడైన అంధకుని సమీపించి (136) శూలములు, శక్తి, ఋష్టి అనుఖడ్గములు కొండచరియలు, గొడ్డళ్లు అను ఆయుధములతో, తమ చేతులతో వారి రెండుపాదములను పట్టుకొని త్రిప్పుచు యుద్ధముచేసిరి. (137)

మిక్కిలి బలవంతుడైన ఆ అంధకునిచేత వారందరు నూరు యోజనములదూరము విసిరివేయబడిరి. తరువాత అంధకునిచే సృజింపబడిన వేలకొలది రాక్షసులు. (138)

కాలసూర్యప్రతీకాశా భైరవం చాభిదుద్రువుః | హాహేతిశబ్దః సుమహాన్‌ బభూవాతిభయంకరః || || 139 ||

యుయుధే భైరవో దేవః శూల మాదాయ భైరవమ్‌ | దృష్ట్వా న్ధకానాం సుబలం దుర్జయ న్నిర్జితోహరః || || 140 ||

జగామ శరణం వేదం వాసుదేవ మజం విభుమ్‌ | సో7సృజ ద్భగవాన్విష్ణు ర్దే వీనాం శత ముత్తమమ్‌ || || 141 ||

దేవీపార్శ్వస్థితో దేవో వినాశాయ సురద్విషామ్‌ | తదా న్ధకసహస్రం తు దేవీభి ర్యమసాదనమ్‌ || || 142 ||

నీతం కేశవమాహాత్మ్యా ల్లీలయైవ రణాజిరే | దృష్ట్వా పరాహతం సైన్యం మన్థకో7పి మహాసురః || || 143 ||

ప్రళయకాలపు సూర్యునితో సమానులై భైరవునికెదురుగా పరుగులు పెట్టిరి. అప్పుడచట మహాశబ్దము మిక్కిలి భయంకరముగా పెద్దగా వ్యాపించెను. (139)

భైరవదేవుడు భయంకరమైన శూలమును గ్రహించి పోరాడెను. జయింప శక్యముకాని, అంధకుల గొప్పబలమును చూచి వారిచే గెలువబడిన శివుడు, జన్మరహితుడు, విభువునగు వాసుదేవుని శరణముపొందెను. ఆ భగవంతుడు విష్ణువు శ్రేష్ఠులైన వందమంది దేవీగణమును సృష్టించెను. (140, 141)

భగవంతుడు దేవీ గణము పార్శ్వభాగమున నిలచి రాక్షసుల వినావముకొరకు, వేయిమంది అంధకాసురగణము దేవులచేత యమలోకము నకు యుద్ధరంగములో సులభముగా పంపబడెను. వారిచేత చంపబడిన తనసైన్యమును చూచి అంధకమహాసురుడు; (142, 143)

పరాఙ్ముఖో రణా త్తస్మా త్పలాయత మహాజవః | తతః క్రీడాం మహాదేవః కృత్వా ద్వాదశవార్షికీమ్‌ || || 144 ||

హితాయ భక్తలోకానా మాజగా మాథ మన్దరమ్‌ | సంప్రాప్త మీశ్వరం జ్ఞాత్వా సర్వ ఏవ గణశ్వరాః || || 145 ||

సమాగమ్యోపతిష్ఠన్త భానుమన్త మివ ద్విజాః | ప్రవిశ్య భవనం పుణ్య మయుక్తానాం దురాసదమ్‌ || || 146 ||

దదర్శ నన్దినం దేవం భైరవం కేశవం శివః | ప్రణామప్రవణం దేవం సో7నుగృహ్యా థ నన్దినమ్‌ || || 147 ||

ప్రీత్యైనం పూర్వ మీశానః కేశవం పరిషస్వజే | దృష్ట్వా దేవో మహాదేవీం ప్రీతివిస్ఫారితేక్షణామ్‌ || || 148 ||

గొప్పవేగముకల అంధకుడు ఆయుద్ధరంగమునుండి తప్పుకున్నవాడై పలాయనముచేసెను. తరువాత మహాదేవుడు శంకరుడు పండ్రెండు సంవత్సరాలపాటు ఒకక్రీడా వినోదమును జరిపి (144) భక్తజనుల యొక్కమేలు కొరకు మరల మందరమువద్దకు వచ్చి చేరెను. ఈశ్వరుడు తిరిగి వచ్చిన విషయము తెలిసికొని అందరు గణాధిపతులు; (145) సమూహముగాచేరి, బ్రాహ్మణులు సూర్యునివలె సమీపించి నిలిచిరి. అయోగ్యులకు చేరుటకు శక్యముకాని పుణ్యయుక్తమైన భవనమును ప్రవేశించి; (146) శివుడు అక్కడ నందీశ్వరుని, భైరవుని, విష్ణువును చూచెను. తరువాత భక్తితో నమస్కరింప బూనుకున్న నందీశ్వరుని అనుగ్రహించి పరమేశ్వరుడు (147)

ముందుగా ప్రేమతో శంకరుడు విష్ణువు నాలింగనము చేసికొనెను. తరువాత ఆదేవుడు అనురాగముతో వికసించిన కన్నులుగల దేవిని చూచి, (148)

ప్రణతః శిరసా తస్యాః పాదయో రీశ్వరస్య చ | న్యవేదయ జ్జయం తసై#్మ శంకరాయాథ శంకరః || || 149 ||

భైరవో విష్ణుమాహాత్మ్యం ప్రతీతః భవత్‌ | శ్రుత్వా తం విజయం శమ్భు ర్విక్రమం కేశవస్య చ || || 150 ||

సమాస్తే భగవా నీశో దేవ్యాసహ వరాసనే | తతో దేవగణాః సర్వే మరీచిప్రముఖా ద్విజాః || || 151 ||

ఆజగ్ము ర్మన్దరం ద్రష్టుం దేవదేవం త్రిలోచనమ్‌ | యేన తద్విజితం పూర్వం దేవీనాం శత ముత్తమమ్‌ || || 152 ||

సమాగంతం దైత్యసైన్య మశిదర్శనకాంక్షయా | దృష్ట్వా వరాసనాసీనం దేవ్యా చన్ద్రవిభూషణమ్‌ || || 153 ||

ప్రణము రాదరా ద్దేవ్యో గాయన్తి స్మాతిలాలసాః | ప్రణము ర్గిరిజాం దేవీం వామపార్శ్వే పినాకినః || || 154 ||

ఆదేవి పాదములకు శిరస్సుతో నమస్కరించి, ఈశ్వరునికి గూడ ప్రణమిల్లి ఆశంకరునకు శంకరుడైన భగవంతుడు కేశవుడు, జయమును తెలిపెను. (149)

భైరవుడు విష్ణువుయొక్క గొప్పతనమును గుర్తించిన వాడై ప్రక్కభాగమున నిలబడెను. కేశవుని పరాక్రమమును, యుద్ధవిజయమునుగూడ విని శివుడు (150) దేవితో కూడ శ్రేష్ఠమైన ఆసనమందుకూర్చుని ఉండెను. తరువాత అందరు దేవతలు, మరీచి ప్రభృతులగు బ్రాహ్మణులు (151) దేవదేవుడైన, త్రిలోచనుడైన శివుని దర్శించుటకచటికి వచ్చిరి. ఆయన చేత పూర్వము జయింపబడిన మందరమను పేరుగల శ్రేష్ఠమైన వందమంది దేవీ సమూహమును గూడ చూడగోరివచ్చిరి. (152)

దేవదర్శనపు కోరికతో వచ్చిన రాక్షససైన్యము దేవితో గూడ శ్రేష్ఠమైన ఆసనముపై కూర్చున్న చంద్రభూషణుడగు శివునకు నమస్కరించెను. ఆయనవామ భాగమందున్న పార్వతికిగూడ ప్రణామము చేసిరి. (153, 154)

దేవాసనగతాం దేవీం నారాయణమనోమయీమ్‌ | దృష్ట్వా సింహాసనాసీనం దేవ్యో నారాయణం తథా || || 155 ||

ప్రణమ్య దేవ మీశానం పృష్టవత్యో వరాఙ్గనాః |

కన్యాఊచు:-

కస్త్వం విభ్రాజసే కాన్త్యా కేయం బాలా రవిప్రభా ||

కోన్వయం భాతి వపుషా పఙ్కజాయతలోచనః | నిశమ్య తాసాం వచనం వృషేన్ద్రవరవాహనః || || 157 ||

వ్యాజహార మహాయోగీ భూతాధిపతి రవ్యయః | అయం నారాయణో గౌరీ జగన్మాతా సనాతనః || || 158 ||

విభజ్య సంస్థితో దేవః స్మాత్మానం బహుధేశ్వరః | న మే విదుః పరం తత్త్వం శ్చ న మహర్షయః || || 159 ||

దివ్యమైన ఆసనమునధిష్ఠించినటువంటి నారాయణుని మనస్సునందు నిలిచియున్నదేవిని చూచి, మరియు సింహాసనాసీనుడై యున్న నారాయణునికూడ చూచిఆదేవతాస్త్రీలు (155) భగవంతుడైన ఈశానునికి నమస్కరించి యిట్లు ప్రశ్నించిరి. కాంతితో ప్రకాశించుచున్న నీవెవరవు? సూర్యుని కాంతివంటి కాంతిగల యీ బాలఎవరు? (156) పద్మములవలె వెడల్పయిన కన్నులు కలిగి శరీరకాంతితో ప్రకాశించుచున్నఇతడెవరు?

ఆదేవాంగనల మాటను విని (157) మహాయోగీశ్వరుడు, నాశరహితుడు, భూతాధిపతి, వృషభవాహనుడైన శివుడు ఇట్లు పలికెను. ఇతడు సనాతనుడైన నారాయణుడు, ఈమెలోకమాతయగు పార్వతి. (158)

భగవంతుడగు ఈశ్వరుడు తనను తాను అనేకవిధముల విభజించుకొని ఉన్నాడు. నాయొక్కమూల తత్త్వమును, దేవియొక్క స్వరూపమును గూడ మహర్షులు తెలియజాలరు. (159)

ఏకో7యం వేద విశ్వాత్మా భవానీ విష్ణు రేవచ | అహం హి నిస్పృహః శాన్తః కేవలో నిష్పరిగ్రహః || || 160 ||

మామేవ కేశం ప్రాహు ర్లక్ష్మీం దేవీ మథా మ్బికామ్‌ | ఏష ధాతా విధాతా చ కారణం కార్య మేవచ || || 161 ||

కర్తా కారయితా విష్ణు ర్భుక్తిముక్తిఫలప్రదః | భోక్తా పుమా నప్రమేయః సంహర్తా కాలరూపధృక్‌ || || 162 ||

స్రష్టా పాతా వాసుదేవో విశ్వాత్మా విశ్వతోముఖః | కూటస్థోహ్యక్షరో వ్యాపీ యోగీనారాయణో7 వ్యయః || || 163 ||

తారకః పురుషో హ్యాత్మా కేవలం పరమం పదమ్‌ | సైషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తి ర్నిరఞ్జనా || || 164 ||

భవాని, విష్ణువు కూడ విశ్వాత్మకుడైన యీఒక్కడే అని తెలియదగును. నేను కోరికలు లేనివాడను, శాంతుడను, అద్వితీయుడను

నన్నే కేశవుడని అందురు. లక్ష్మీదేవిని, పార్వతీదేవిని కూడ నారూపములుగా చెప్పుదురు. ఇతడే ధాతమరియు విధాత, కారణకార్యములు కూడనైయున్నాడు. (161)

చేయువాడు, చేయించువాడు, భుక్తిముక్తులను, ఫలములనిచ్చువాడు విష్ణువు. భుజించువాడు, తెలిసికొనుటకు శక్యముకానిపురుషుడు, కాలునిరూపముధరించి సంహరించువాడుకూడ అతడే. (162)

సృజించువాడు, కాపాడువాడు వాసుదేవుడు. అతడు విశ్వాత్మకుడు, అంతట వ్యాపించినవాడు, కూటస్థుడు, నాశరహితుడు, వ్యాపించువాడు, యోగి, అవ్యయుడగు నారాయణుడతడే (163)

తరింపజేయు పురుషుడు, ఆత్మరూపుడు, కేవలమైన పరమపదస్థానము. ఆయీమాహేశ్వరియగు గౌరి నాయొక్క శక్తివంటిది. మాలిన్యము లేనిది. (164)

శాన్తా సత్యా సదానన్దా పరంపద మితి శ్రుతిః | అస్యాం సర్వ మిదం జాత మత్రైవ లయ మేష్యతి || || 165 ||

ఏషైవ సర్వభూతానాం గతీనా ముత్తమా గతిః | తయాహం సఙ్గతో దేవ్యా కేవలో నిష్కలః పరః || || 166 ||

పశ్యా మ్యశేష మేవాహం పరమాత్మాన మవ్యయమ్‌ | తస్మా దనాది మద్వైతం విష్ణు మాత్మాన మీశ్వరమ్‌ || || 167 ||

ఏక మేవ విజానీథ తతో యాస్యథ నిర్వృతిమ్‌ | మన్యన్తే విష్ణు మవ్యక్త మాత్మానం శ్రద్ధయాన్వితాః || || 168 ||

యే భిన్నదృష్ట్వా చేశానం పూయన్తో న మే ప్రియాః | ద్విషన్తి యే జగత్సూతిం మోహితా రౌరవాది షు || || 169 ||

ఈగౌరి శాంతురాలు, సత్యస్వరూప, ఎల్లప్పుడు ఆనందము కలది, పరమమైన స్థానమని వేదము చెప్పుచున్నది. ఈసమస్తము ఈమెయందే జనించి ఇక్కడనే నాశమును పొందును. (165)

ఈమెయే సమస్తభూతములకు, గతులలో శ్రేష్ఠమైనగతియైనది. ఆదేవితో కూడియున్ననేను కేవలుడను, భేదరహితుడను, శ్రేష్ఠుడను (166)

నేను నాశరహితుడు, పరమాత్మయునగువాడు, పుట్టుకలేనివాడు, భేదములేనివాడు, ఆత్మస్వరూపుడు, ఈశ్వరుడునగు విష్ణువును సంపూర్ణముగా దర్శించుచున్నాను. (167)

ఈశ్వరుని, విష్ణువును ఒక్కనిగానే తెలిసికొనుడు. దానివలన మీరు శాంతిని పొందగలరు. శ్రద్ధతో కూడినవారు విష్ణువును అవ్యక్తాత్మరూపునిగా భావింతురు. (168)

ఎవరైతే భేదదృష్టితో శివుని పూజింతురో వారు నాకు ప్రియులుకారు. ప్రపంచమునకు కారణభూతుడైన దేవుని ఎవరు మోహితులై ద్వేషింతురో వారు రౌరవాదులగు;

పత్యమానా న ముచ్యన్తే కల్పకోటిశ##తై రపి | తస్మా దశేషభూతానాం రక్షకో విష్ణు రవ్యయః || || 170 ||

యథావ దిహ విజ్ఞాయ ధ్యేయః సర్వాపది ప్రభుః | శ్రుత్వా భగవతో వాక్యం దేవాః సర్వే గణశ్వరాః || || 171 ||

నేము ర్నారాయణం దేవం దేవీం చ హిమశైలజామ్‌ | ప్రార్థయామాసు రీశానే భక్తిం భక్తజనప్రియే || || 172 |7

భవానీపాదయుగళే నారాయణపదామ్బుజే | తతో నారాయణం దేవం గణశా మాతరో7పిచ || || 173 ||

న పశ్యన్తి జగత్సూతిం తదద్భుత మివా భవత్‌ | తదన్తరే మహాదైత్యే హ్యన్ధకో మన్మథాన్ధకః || || 174 ||

నరకములందు బాధింపబడువారై కోట్లసంఖ్యగల కల్పములచేత గూడ విడువబడరు. అందువలన సమస్తప్రాణులకుగూడ, నాశములేని విష్ణువు రక్షకుడు. (169, 170)

ఈలోకమున యథార్థరూపముతో తెలిసికొని, అన్నియాపదలందును ప్రభువు విష్ణువు ధ్యానింపదగినవాడు. భగవంతుని వాక్యమును విని భగవంతుడగు నారాయణునకు, హిమగిరితనయయగు పార్వతికిని నమస్కరించిరి. భక్తజనుల కిష్టుడైన ఈశ్వరునియందు తమకు భక్తిని కల్గించు మని కూడ ప్రార్థించిరి. (171, 172)

పార్వతీదేవి పాదములజంటయందు, నారాయణుని పాదకమలములందు నమస్కరించి తరువాత గణశ్వరులు, మాతృగణములు కూడ, లోకమూల కారణభూతుడైన నారాయణదేవుని చూడలేకపోయిరి. అది చాల ఆశ్చర్యము వలె జరిగినది. ఇంతలో అంధకుడు గొప్పరాక్షసుడు మన్మథవికారముచేత గ్రుడ్డివాడై, (173, 174)

మోహితో గిరిజాం దేవీ మాహర్తుం గిరి మాయ¸° | అథా నన్తవపుః శ్రీమా న్యోగీ నారాయణో7మలః || || 175 ||

తత్రైవా విరభూ ద్దైత్యై ర్యుద్ధాయ పురుషోత్తమః ||

కృత్వా థపార్శ్వే భగవన్త మీశో యుద్ధాయ విష్ణుం గణదేవముఖ్యైః | శిలాదపుత్రేణ చ మాతృకాభిః కాలరుద్రో7పి జగామదేవః || || 176 ||

త్రిశూల మాదాయ కృశానుకల్పం స దేవదేవః ప్రయ¸° పురస్తాత్‌ | త మన్వయు స్తే గణరాజవర్యాః జగామ దేవో7పి సహస్రబాహుః || || 177 ||

మోహపరవవుడై పార్వతీదేవి నపహరించుటకు కైలాసపర్వతమునకు వచ్చెను. తరువాత అనంతములైన శరీరములుకల శ్రీమంతుడు, యోగీశ్వరుడు, నిర్మలుడు అగునారాయణుడు రాక్షసులతో యుద్ధము చేయుటకొరకు అక్కడనే సాక్షాత్కరించెను. (175)

అప్పుడు భగవంతుడగు విష్ణువును తన పార్శ్వభాగమందుంచుకొని, గణదేవముఖ్యులతో, శిలాదుని కుమారునితో, మాతృదకాసమూహముతో కూడి దేవదేవుడగు శివుడు కాలరుద్రుడై యుద్ధమునకు వెడలెను. (176)

అగ్నితోసమానమైన త్రిశూలమును ధరించి ఆదేవదేవుడు ముందునడచెను. ఆయనను గణాధిపతులు అనుసరించిరి. వేయిభుజములు కల భగవంతుడు బయలుదేరివెడలెను. (177)

రరాజ మధ్యే భగవాన్‌ సురాణాం వివాహనో వారిజపర్ణవర్ణః | తదా సుమేరోః శిఖరాధిరూఢ స్త్రిలోకదృష్టి ర్భగవా నివార్కః || || 178 ||

జయ న్ననాది ర్భగవా నమోయో హరః సహస్రాకృతి రావిరాసీత్‌ | త్రిశూలపాణి ర్గగనే సుఘోషః పపాత దేవోపరి పుష్పవృష్టిః || || 179 ||

సమాగతం వీక్ష్య గణశరాజం సమావృతం దైత్యరిపుం గణశైః | యుయోథ శ##క్రేణ సమాతృకాభి ర్గణౖ రశేషై రమరప్రధానైః || || 180 ||

పక్షివాహనుడు, తామరాకువంటి రంగుకలిగిన భగవంతుడైన విష్ణువు అప్పుడుదేవతల మధ్యలో, సుమేరు పర్వతము యొక్క శిఖరము నధిష్ఠించిన, ముల్లోకములకు నేత్రరూపుడైన సూర్యభగవానునివలె ప్రకాశించెను. (178)

పుట్టుకలేనివాడు, కొలుచుటకు శక్యముకానివాడు జయశీలుడగుహరుడు అనంతములైన ఆకృతులు కలవాడుగా సాక్షాత్కరించెను. త్రిశూలపాణియగుదేవుడావిర్భవించగా ఆకాశమందు గొప్పధ్వనితోకూడిన పూలవర్షము ఆదేవునిపై కురిసెను. (179)

అప్పుడక్కడికివచ్చిన గణశ్వరుని చూచి, గణశులతో ఆవరింపబడియున్న రాక్షసశత్రువైన విష్ణువును చూచి మాతృకలతో, దేవతాప్రధానులైన గణములతో, ఇంద్రునితో కూడి యుద్ధముచేసెను. (180)

విజిత్య సర్వానపి బాహువీర్యాత్‌ | స సంయుగే శమ్భు రనన్తధామా | సమాయ¸° యత్ర స కాలరుద్రో | విమాన మారుహ్య విహీనసత్త్వః | || 181 ||

దృష్ట్వా న్ధకం సమాయాన్తం భగవా న్గరుడధ్వజః | వ్యాజహార మహాదేవం భైరవం భూతిభూషణమ్‌ || || 182 ||

హన్తు మర్హసి దైత్యేశ మన్ధకం లోకకణ్టకమ్‌ | త్వా మృతే భగవ న్శక్తో హన్తా నాన్యో7స్య విద్యతే || || 183 ||

త్వం హర్తా సర్వలోకానాం కాలాత్మా హ్యైశ్వరీ తనుః | స్తూయతే వివిధై ర్మన్త్రై ర్వేదవిద్భి ర్విచక్షణౖః || || 184 ||

తనభుజపరాక్రమమువలన యుద్ధములో అందరిని జయించి, అనంతమైర తేజస్సుకల శివుడు, ఎక్కడకాలరుద్రుడు నశించిన బలముకలవాడై యున్నాడో అక్కడికి విమానమునెక్కివచ్చెను. (181)

తనవైపు వచ్చుచున్న అంధకాసురుని చూచి భగవంతుడగు గరుడధ్వజుడు, భస్మము అలంకారముగా ధరించిన భయంకరమైన మహాదేవుని గూర్చి యిట్లుపలికెను. (182)

లోకములకు కంటకప్రాయుడైన అంధకాసురుని నీవుచంపదగియున్నావు. మహానుభావా! నీవుకాకమరియొకడు ఇతనిని చంపగలవాడు లోకములోలేడు. (183)

నీవు సమస్తలోకములనులయింప జేయువాడవు. ఈశ్వర శరీరము కాలుని స్వరూపముకదా! ఆరూపము వివేకముకల, వేదవిదులచేత బహువిధమంత్రములచేత కొనియాడబడుచున్నది. (184)

స వాసుదేవస్య వచో నిశమ్య భగవాన్‌ హరః | నిరీక్ష్య విష్ణుం హననే దైత్యన్ద్రస్య మతిం దధౌ || || 185 ||

జగామ దేవతానీకం గణానాం హర్షవర్థనమ్‌ | స్తువన్తి భైరవం దేవ మన్తరిక్షచరా జనాః || || 186 ||

జయా నన్తమహాదేవ కాలమూర్తే సనాతన | త్వ మగ్నిః సర్వభావానా మన్త స్తిష్ఠసి సర్వగః || || 187 ||

త్వ మన్తకో లోకకర్తా త్వన్ధాతా హరి రవ్యయః | త్వం బ్రహ్మ త్వం మహాదేవ స్త్వం ధామ పరమం పదమ్‌ || || 188 ||

ఓంకారమూర్తి ర్యోగాత్మా త్రయీనేత్ర స్త్రిలోచనః | మహావిభూతి ర్విశ్వేశో జయానన్త జగత్పతే || || 189 ||

భగవంతుడగు ఆశివుడు వాసుదేవుని మాటనువిని, విష్ణువువైపు చూచి, రాక్షసరాజును చంపుటకు నిశ్చయము చేసికొనెను. (185)

గణములకు సంతోషమును పెంపొందించునట్టి దేవతాసమూహము వెడలిపోయెను. ఆకాశమందుసంచరించుజనులు భైరవదేవుని ప్రశంసింప సాగిరి. (186)

అంతములేనివాడా! మహాదేవా! కాలరూపుడా, సనాతనా నీకుజయము. నీవు అగ్నివి. సమస్తభావముల అంతరంగములో సర్వగుడవై యుందువు. (187)

నీవు అంతకుడవు, లోకములను సృజించువాడవు, నీవు బ్రహ్మవు, నాశరహితుడైన విష్ణువువు. నీవు పరబ్రహ్మము, నీవు శివుడవు, నీవు పరమపదస్థానమైనవాడవు. (188)

నీవు ఓంకారరూపుడవు, యోగాత్ముడవు, మూడువేదములు కన్నులుగాగలవాడవు, గొప్పవిభూతివి, విశ్వమునకు ప్రభువువు, అనంతుడగు లోకపతీ! నీకు జయము. (189)

తతః కలాగ్నిరుద్రో7సౌ గృహీత్వా న్ధక మీశ్వరః | త్రిశూలాగ్రేషు విన్యస్య ప్రననర్త సతాంగతిః || || 190 ||

దృష్ట్వా న్ధకం దేవగణాః శూలప్రోతం పితామహః | ప్రణము రీశ్వరం దేవం భైరవం భవమోచనమ్‌ || || 191 ||

అస్తువ న్మునయః సిద్ధా జగు ర్గన్థర్వకిన్నరాః | అన్తరిక్షే7ప్సరస్సంఘా నృత్యన్తి స్మ మనోహరాః || || 192 ||

సంస్థాపితో7థశూలాగ్రే సో7న్థకో దగ్థకిల్బిషః | ఉత్పన్నాఖిలవిజ్ఞాన స్తుష్టావ పరమేశ్వరమ్‌ || || 193 ||

అన్థకఉవాచ :-

నమామి మూర్థ్నా భగవన్త మేకం సమాహితోయం విదు రీశతత్త్వమ్‌ |

పురాతనం పుణ్య మనన్తరూపం కాం కవిం యోగవియోగహేతుమ్‌ || || 194 ||

తరువాత ప్రళయకాలపు అగ్నివంటి రుద్రుడు, సత్పురుషులకు ప్రాప్యమైన ఈశ్వరుడు ఆ అంధకాసురుని పట్టుకుని తన త్రిశూలపు కొనల యందునిలిపి బాగుగా నృత్యము చేసెను. (190)

శూలమునకు కట్టబడిన అంధకుని చూచి దేవతాసమూహములు, బ్రహ్మదేవుడు, సంసారబంధమునువిడిపించువాడు, భయంకరుడు అగు ఈశ్వరునికి నమస్కరించిరి. (191)

మునులు, సిద్ధులు ఆయనను స్తుతించిరి, గంధర్వులు, కిన్నరులు పాటలు పాడిరి. ఆకాశములో అందమైన అప్సరసల గుంపులు నృత్యము చేయసాగినవి. (192)

శూలముయొక్క కొనయందునిలుపబడిన అంధకుడు పాపములన్నీ కాల్చబడగా, సమస్త విషయకమైన విజ్ఞానము తనలోకలిగి ఆపరమేశ్వరుని స్తుతించెను. (193)

శూలముయొక్క కొనయందునిలుపబడిన అంధకుడు పాపములన్నీ కాల్చబడగా, సమస్త విషయకమైన విజ్ఞానము తనలోకలిగి ఆపరమేశ్వరుని స్తుతించెను. (193)

సావధానుడనైననేను, అద్వితీయుడు, భగవంతుడు, పురాతనుడు, పుణ్యస్వరూపుడు, అంతములేనిరూము కలవాడు, కాలుడు, కవి, విశ్వముయొక్క సంయోగవియోగములకు కారణభూతుడైనవాడు, పండితులు ఎవనిని భగవత్తత్త్వముగా తెలిసికొందురో ఆఈశ్వరునికి శిరస్సుతో నమస్కరించుచున్నాను. (194)

దంష్ట్రాకరాళం దివి నృత్యమానం హుతాశవక్త్రం జ్వలనార్కరూపమ్‌ | సహస్రపాదాక్షిశిరోభియుక్తం భవన్త మేకం ప్రణమామి రుద్రమ్‌ || || 195 ||

జయా దిదేవామరపూజితాంఘ్రే విభాగహీనా మలతత్త్వరూప | త్వ మగ్నిరేకో బహుధా భిపూజ్యో బాహ్యాదిభేదై రఖిలాత్మరూపః || || 196 ||

త్వా మేక మాహుః పురుషం పురాణ మాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ | త్వం పశ్యసీదం పరిపా స్యజస్రం త్వ మన్తకో యోగిగణానుజుష్టః || || 197 ||

ఏకో7న్తరాత్మా బహుధా నివిష్టో దేహేషు దేహాదివిశేషహీనః | త్వ మాత్మతత్త్వం పరమాత్మశబ్దం భవన్త మాహుః శివ మేవ కేచిత్‌ || || 198 ||

దంతములతోభయంకరముగానున్నవాడు, ఆకాశమందు నృత్యము చేయుచున్నవాడు, ముఖమునందు అగ్నినిధరించినవాడు, మండుచున్న సూర్యునివంటి రూపముకలవాడు, వేయిపాదములు, కన్నులు, తలలతో కూడియున్నవాడును అగు రుద్రుడవైన నీకు నమస్కరించుచున్నాను. (195)

ఓ ఆదిదేవుడా! దేవతలచేత పూజింపబడు పాదములు కలవాడా! అవయవవిభాగములేనివాడా! నిర్మలమైన తత్త్వస్వరూపుడా! నీకు జయము. నీవు కేవలాగ్ని రూపుడవు. అనేక ప్రకారముల పూజింపదగినవాడవు. బాహ్యములైన భేదములచేత సర్వాత్మస్వరూపుడవై యున్నావు. (196)

నిన్ను అద్వితీయుడైన పురాణపురుషుడవని, సూర్యునివంటి తేజస్సుకలవాడవని, అంధకారమున కతీతుడవని చెప్పుదురు. నీవు ఈవిశ్వమును ఎల్లప్పుడు చూచుచూ కాపాడుచున్నావు. నీవుయోగిసమూహములచే సేవింపబడు ప్రళయకారకుడవు. (197)

నీవు కేవలరూపుడవు. అంతరాత్మస్వరూపుడవై లోకములోని అనేక శరీరములయందు బహుప్రకారముల నిలిచి ఉన్నావు. నీకు దేహాది భేదదములులేవు. నీవు ఆత్మతత్త్వము. పరమాత్మశబ్దవాచ్యుడవునీవు. కొందరునిన్ను శివునిగానే పేర్కొందురు. (198)

త్వ మక్షరం బ్రహ్మ పరం పవిత్ర మానన్దరూపం ప్రణవాభిధానమ్‌ |

త్వ మీశ్వరో వేదవిదాం ప్రసిద్ధః స్వాయమ్భువో7శేష విశేషహీనః || || 199 ||

త్వ మిన్ద్రరూపో వరుణో7గ్నిరూపో హంసః ప్రాణో మృత్యు రన్తో7సి యజ్ఞః |

ప్రజాపతి ర్భగవా నేకరూపో నీలగ్రీవః స్తూయసే వేదవిద్భిః || || 200 ||

నారాయణ స్త్వం జగతా మనాదిః పితామహ స్త్వం ప్రపితామహశ్చ |

వేదాన్తగుహ్యోపనిషత్సు గీతః సదాశివ స్త్వం పరమేశ్వరో7సి || || 201 ||

నమః పరసై#్మ తమసః పరస్తా త్పరాత్మనే పఞ్చనవాన్తరాయ |

త్రిశక్త్యతీతాయ నిరంజనాయ సహస్రశక్త్యాసనసంస్థితాయ || || 202 ||

నీవు నాశరహితమైన పరబ్రహ్మస్వరూపుడవు. పవిత్రుడవు. ఓంకారశబ్దవాచ్యుడవు. ఆనందస్వరూపుడవు. నీవు వేదవేత్తలైనవారికి ఈశ్వరుడుగా ప్రసిద్ధమైనవాడవు. సమస్తభేదశూన్యుడవైన స్వాయంభువుడవునీవు. (199)

నీవు ఇంద్రస్వరూపుడవు, వరుణ, అగ్నిస్వరూపుడవు, హంసప్రజాపతివి, ప్రాణ, మృత్యు, యజ్ఞరూపుడవు ఏకాకారుడవైన భగవంతుడవు, నల్లనికంఠము కలవాడవు. వేదవేత్తలచే కొనియాడబడుచున్నావు. (200)

లోకములకు ఆదిలేని నారాయణుడవునీవు. పితామహుడు, ప్రపితామహుడు కూడనీవే. వేదాంతరహస్యములతో నిండిన ఉపనిషత్తుల యందుగానము చేయబడువాడవు. సదాశివుడవు, పరమేశ్వరుడవు నీవైయున్నావు. (201)

తమస్సుకతీతమైన, పరమపురుషుడైన పరాత్మకు వందనము. మూడువిధములగు శక్తుల కతీతుడవు, మాలిన్యరహితుడవు, వేయివిధముల శక్తిస్థానములయందు నిలిచియున్న నీకు నమస్కారము. (202)

త్రిమూర్తయే7నన్తపదాత్మమూర్తయే జగన్నివాసాయ జగన్మయాయ | నమో జనానాం హృది సంస్థితాయ ఫణీన్ద్రహారాయ నమోస్తు7 తుభ్యమ్‌ || || 203 ||

మునీన్ద్రసిద్ధాంచితపాదపద్మ ఐశ్వర్యధర్మాసనసంస్థితాయ | నమః పరాన్తాయ భవోద్భవాయ సహస్రచన్ద్రార్కసహస్రమూర్తే || || 204 ||

నమోస్తు సోమాయ సుమధ్యమాయ నమోస్తు దేవాయ హిరణ్యబాహో | నమో7గ్నిచన్ద్రార్కవిలోచనాయ నమో మ్బికాయాః పతయే మృడాయ || || 205 ||

నమోస్తు గుహ్యాయ గుహాన్తరాయ వేదాన్తవిజ్ఞానవినిశ్చితామ్‌ | త్రికాలహీనామలధామధామ్నే నమో మహేశాయ నమః శివాయ || || 206 ||

త్రిమూర్తిస్వరూపుడు, అనంతములైన పదములు, ఆత్మలుకలమూర్తి, లోకములకు నివాసమైనవాడు, లోకమయుడు, జనులయొక్క హృదయములందు నివసించువాడు, నాగరాజు ఆభరణముగా కలవాడును అగునీకు నమస్కారము. (203)

మునిశ్రేష్ఠులచేత, సిద్ధులచేత పూజింపబడిన పాదకమలములు కలిగి, ఐశ్వర్యమను ధర్మాసనమందు ఉపవిష్టుడవై, ప్రళయకారకుడవు, భవునకు జన్మకారకుడవు, వేయి సూర్యచంద్రుల కాంతిగల స్వరూపముధరించినవాడా! (204)

మంచినడుముకలసోమునకు నమస్కారము. హిరణ్యబాహువైన దేవునకు నమస్కారము. అగ్ని, చంద్ర, సూర్యులు కన్నులుగా కలవానికి వందనము. పార్వతీపతియగు మృడునకు ప్రణామము. (205)

రహస్యరూపుడు, గుహయందుండువాడు, వేదాంతశాస్త్రవిజ్ఞానముచేత నిశ్చయింపబడినవాడు, కాలత్రయభేదములేని నిర్మలతేజస్సుకల మహేశునకు, శివునకు నమోవాకము. (206)

ఏవం స్తుత త్స భగవాన్‌ శూలాగ్రా దవతార్య తమ్‌ | తుష్టః ప్రోవాచ హస్తాభ్యాం స్పృష్ట్వాచ పరమేశ్వరః || || 207 ||

ప్రీతో7హం సర్వథా దైత్య స్తవేనానేన సాంప్రతమ్‌ | సంప్రాప్య గాణపత్యం మే సన్నిధానే సదా వస || || 208 ||

అరోగ శ్ఛిన్నసన్దేహో దేవై రపి సుపూజితః | నన్దీశ్వరస్యా నుచరః సర్వదుఃఖవివర్జితః || || 209 ||

ఏవం వ్యాహృతమాత్రేతు దేవదే వేన దేవతాః | గణశ్వరం మహాదైత్య మన్ధకం దేవసన్నిథౌ || || 210 ||

సహస్రసూర్యసంకాశం త్రినేత్రం చంద్రచిహ్నితమ్‌ | నీలకణ్ఠం జటామౌలిం శూలాసక్తం మహాకరమ్‌ || || 211 ||

ఈ విధముగా కొనియాడబడిన ఆభగవంతుడగు శంకరుడు త్రిశూలముకొననుండి అతనిని దించి, సంతోషించినవాడై, చేతులతో అతనిని తాకి యిట్లు పలికెను. (207)

ఓ దైత్యుడా! నీయీస్తోత్రముచేత నేను ఇప్పుడు అన్నివిధాల తృప్తిపొందినాను. నీవు గణపతిగా అధికారపదవిని పొంది నాసన్నిధిలో ఎల్లప్పుడు నివసించుము. (208)

రోగములు లేనివాడవై, సంశయములన్ని తొలగిపోయి, దేవతలచేత గూడ బాగుగా పూజింపబడుచు, నన్దీశ్వరునికి అనుచరుడుగా, అన్ని విధముల దుఃఖములనుండి విడువబడినవాడవై; వసించుము (209)

దేవదేవుడైన శంకరునిచేత ఈవిధముగా చెప్పబడినంతనే దేవతలందరు, గణాధిపతియైన గొప్పరాక్షసుడగు అంధకుని శివుని సన్నిధియందు; (210)

వేయిసూర్యుల తేజస్సుతో సమానుడుగానున్నవాడు, మూడుకన్నులుకలవాడు, చంద్రకళ గుర్తుగాకలవాడు, నల్లనికంఠముకలవాడు, జడలతో కూడినశిరస్సుకలవాడు, శూలమందాసక్తికల హస్తముకలవాడుగా చూచిరి. (211)

దృష్ట్వా తం తుష్టువు ర్దైత్య మాశ్చర్యం పరమం గతాః | ఉవాచ భగవా న్విష్ణుః దేవదేవం స్మయన్నివ || || 212 ||

స్థానే తవ మహాదేవ ప్రభావం పురుషో మహాన్‌ | నేక్షతే జ్ఞాతిజా న్దోషాన్‌ గృహ్ణాతి చ గుణానపి || || 213 ||

ఇతీ రితో7థ భైరవో గణశ##దేవపుంగవః సకేశవః సహాన్ధకోజగామ శంకరాన్తికమ్‌ | || 214 ||

నిరీక్ష్య దేవ మాగతం స శంకరః సహాన్ధకం సమాధవం సమాతృకం జగామ నిర్వృతిం హరః ||

ప్రగృహ్య పాణినేశ్వరో హిరణ్యలోచనాత్మజం జగామ యత్ర శైలజా విమాన మీశవల్లభా |

విలోక్య సా సమాగతం పతిం భవార్తిహారిణం ఉవాచ సాన్ధకం సుఖం ప్రసాద మన్ధకం ప్రతి || || 215 ||

అటువంటి అంధకుని చూచి గొప్పఆశ్చర్యమును పొందినవారై అతనినికొని యాడిరి. అప్పుడు భగవంతుడగు విష్ణువు చిరునవ్వు కలవాని వలె దేవదేవునిగూర్చి ఇట్లుపలికెను. (212)

ఓ మహాదేవా! నీ ప్రభావము చాలాగొప్పది. అది ఉచితమైనది. గొప్ప పురుషుడు తమవారి దోషములను చూడడు. వారిలోని గుణాలను గ్రహించును. (213)

ఇట్లు పలుకబడిన గణశ##దేవతాశ్రేష్ఠుడైన భైరవుడు విష్ణువుతో, అంధకునితోకూడి శంకరుని దగ్గరికివెళ్లెను. అంధకునితో గూడ తనవద్దకు వచ్చిన విష్ణువునుచూచి మాతృగణాలతోకూడ శివుడు సంతోషమును పొందెను. (214)

హిరణ్యాక్షునికుమారుడైన అంధకుని ఈశ్వరుడు తనచేతితో స్వీకరించి పార్వతి నివసించియున్న విమానము వద్దకు వెళ్లెను. ఆ పార్వతి, తనవద్దకు వచ్చిన భర్తను, సంసారతాపమును నివారించువానిని చూచి, అంధకసహితుడైన అతనిని సుఖప్రశ్నవేసెను. అంధకునిపై అనుగ్రహ దృష్టిని ప్రసరించెను. (215)

అథాన్ధకో మహేశ్వరీం దదర్శ దేవపార్శ్వగామ్‌ పపాత దణ్డవత్‌ క్షితౌ ననామ పాదపద్మయోః |

నమామి దేవవల్లభా మనాది మద్రిజా మిమాం యతః ప్రధానపూరుషౌ నిహన్తి యాఖిలం జగత్‌ || || 216 ||

విభాతి యా శివాసనే శివేన సాకమవ్యయా హిరణ్మయే7తి నిర్మలే నమామి తాం హిమాద్రిజామ్‌ |

యదన్తరా ఖిలం జగ జ్జగన్తి యాన్తి సంక్షయం నమామి యత్ర తాముమా మశేషదోషవర్జితామ్‌ || || 217 ||

న జాయతే న హీయతే న వర్థతే చ తాముమాం నమామితాంగుణాతిగాం గిరీశపుత్రికా మిమామ్‌ |

క్షమస్వ దేవి శైలజే కృతం మయా విమోహితం సురాసురై ర్నమస్కృతం నమామితే పదామ్బుజమ్‌ || || 218 ||

తరువాత అంధకుడు భగవంతుని ప్రక్కభాగమునున్న మహేశ్వరిని చూచెను. భూమిమీద దండమువలె పడిపోయెను. ఆమెపాదకమలము లకు నమస్కరించెను. ఈశ్వరునికి ప్రియురాలైన, జన్మరహితయగు పర్వత పుత్రికకు నమస్కరింతును. ఏదేవివలన ప్రధానతత్త్వము, పురుషుడు కలుగుదురో, ఎవరు సమస్తజగత్తును లయింపజేయునో, (216) ఏదేవిశివునిఅర్థాసనమున బంగారముతో చేయబడిన, అతినిర్మలమైన దానిపై శివునితో కూడి ప్రకాశించునో, హిమవంతునికూతురగు ఆమెకు నమస్కరింతును. ఏదేవిమూలముగా లోకములన్నియు సృజింపబబడి నశించునో, సమస్తదోషరహితయగు ఆఉమాదేవికి నమస్కరింతును. (217)

ఆమెలేనిచోపుట్టుట, క్షీణించుట, వృద్ధిపొందుట అనునవి జరుగవు. అటువంటి గుణముల కతీతురాలైన పర్వతరాజపుత్రికయగు ఈదేవికి నమస్కరింతును. ఓ పార్వతీ! నేను భ్రాంతుడనైచేసిన అపరాధమును క్షమించుము. దేవదానవులచేత కూడ నమస్కరింపబడు నీపాదపద్మములకు నమస్కరింతును. (218)

ఇత్థం భగవతీ దేవీ భక్తినమ్రేణ పార్వతీ | సంస్తుతా దైత్యపతినా పుత్రత్వే జగృహే7న్థకమ్‌ || || 219 ||

తతః స మాతృభిః సార్థం భైరవో రుద్రసంభవః | జగామ త్వాజ్ఞయా శంభోః పాతాలం పరమేశ్వరః || || 220 ||

యత్ర సా తామసీ విష్ణో ర్మూర్తిః సంహారకారికా | సమాస్తే హరి రవ్యక్తో నృసింహాకృతి రీశ్వరః || || 221 ||

తతో7నన్తాకృతిః శమ్భుః శేషేణాపి సుపూజితః | కాలాగ్ని రుద్రభగవాన్‌ యుయోజా త్మాన మాత్మని || || 222 ||

యుఞ్జత స్తస్య దేవస్య సర్వా ఏవాథ మాతరః | బుభుక్షితా మహాదేవం ప్రణమ్యాహు స్త్రిలోచనమ్‌ || || 223 ||

ఈ విధముగా భగవతియైన పార్వతీదేవి, భక్తితోవినీతుడైన రాక్షసపతి అంధకునిచేత స్తోత్రముచేయబడి, ఆ అంధకుని పుత్రభావముతో స్వీకరించెను. (219)

తరువాత శంకరునివలన పుట్టిన ఆ భైరవుడు మాతలతో కూడ శివుని ఆజ్ఞతో పాతాళమునకు వెళ్లెను. (220)

ఎక్కడ, విష్ణువుయొక్క సంహారముచేయుశక్తిగల తమోగుణప్రధానమైన రూపము ఉండునో, ఎచ్చట ప్రభువైన హరి నరసింహరూపము కలవాడుగా, అవ్యక్తరూపుడుగా ఉండునో; (221)

తరువాత అనంతుని రూపముధరించిన శంకరుడు శేషునిచేత బాగుగాపూజింపబడి, ప్రళయకాలపు అగ్నివంటి రుద్రరూపుడై స్వస్వరూపమును ఆత్మయందు సంయోగజనముచేసెను. (222)

ఆత్మసంయోజనముచేయుచున్న ఆపరమేశ్వరునిగూర్చి మాతృగణదేవతలందరు ఆకలిగొన్నవారై, మూడుకన్నులుకల మహాదేవునికి నమస్కరించి ఇట్లనిరి. (223)

మాతరఊచు:-

బుభుక్షితా మహాదేవ త్వ మనుజ్ఞాతు మర్హసి | త్రైలోక్యం భక్షయిష్యామో నాన్యథా తృప్తి రస్తి నః || || 224 ||

ఏతావ దుక్త్వా వచనం మాతరో విష్ణుసంభవాః | భక్షయాంచక్రిరే సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ || || 225 ||

తతః స భైరవో దేవో నృసింహవపుషం హరిమ్‌ | దధ్యౌ నారాయణం దేవం ప్రణమ్య చ కృతాఞ్జలిః || || 226 ||

ఉమేశచిన్తితం జ్ఞాత్వా క్షణా త్ర్పాదురభూ ద్ధరిః | విజ్ఞాపయామాస చ తం భక్షయన్తీహ మాతరః || || 227 ||

నివారయాశు త్రైలోక్యం త్వదీయం భగవ న్నితి | సంస్మృతా విష్ణువా దేవ్యో నృసింహవపుషా పునః || || 228 ||

ఓ మహాదేవీ! మేముబాగుగా ఆకలితో ఉన్నాము. నీవు మాకనుజ్ఞనిమ్ము. మేము మూడులోకములను భక్షింతుము. లేనిచోమాకు తృప్తి కలుగదు. (224)

విష్ణువువలన జనించిన ఆమాతృదేవతలు ఈవిధముగా పలికి చరాచరయుక్తమైన లోకత్రయము సమస్తమును భక్షించిరి. (225)

పిమ్మట ఆభైరవరూపిదేవుడు, నరసింహరూపములోనున్న నారాయణదేవునికి నమస్కరించి చేతులు జోడించినవాడై ధ్యానించెను. (226)

పార్వతీశుడగు శివుని ఆలోచనను గుర్తించి విష్ణువువెంటనే అక్కడ సాక్షాత్కరించెను. అతనితోభైరవుడు, 'ఈమాతలు లోకమును భక్షించు చున్నా''రని విన్నవించెను. (227)

''ఓ భగవంతుడా! ఈ భక్షణమును శీఘ్రముగా నివారించుము. ఈ ముల్లోకములు నీయధీనములోనివి''. అని అతడుచెప్పగా నరసింహ శరీరముదాల్చిన హరిచేత స్మరింపబడినవారై ఆమాతృదేవతలు; (228)

ఉపతస్థు ర్మహాదేవం నరసింహాకృతిం తతః | సంప్రాప్య సన్నిధిం విష్ణోః సర్వసంహారకారికాః || || 229 ||

ప్రదదుః శమ్భవే శక్తిం భైరవాయా తితేజసే | అపశ్యం స్తా జగత్సూతిం నృసింహ మతిభైరవమ్‌ || || 230 ||

క్షణా దేకత్వమా పన్నం శేషాహిం చాపి మాతరః | వ్యాజహార హృషీకేశో యే భక్తాః శూలపాణయే || || 231 ||

యే చ మాం సంస్మరన్తీహ పాలనీయాః ప్రయత్నతః | మమైవ మూర్తి రతులా సర్వసంహారకారికా || || 232 ||

మహేశ్వరాఙ్గదసంభూతా భుక్తిముక్తిప్రదాయినీ | అనన్తో భగవాన్‌ కాలో ద్విధావస్థా మమైవ తు || || 233 ||

తరువాత నరసింహరూపమును ధరించిన మహాదేవుని, సమస్తమును సంహరింపగలశక్తులు విష్ణువుయొక్క సన్నిధిని చేరి ఆశ్రయించెను. (229)

మిక్కిలితేజస్సుగల భైరవునకు, శివునకు శక్తిని అందజేసిరి. లోకములకు జన్మకారకుడు, మిక్కిలి భయంకరుడు అగు నరసింహుని ఆ మాతలు చూచిరి. (230)

ఆ మాతృదేవతలు క్షణకాలములో ఏకత్వమును పొందిన సర్పరాజు శేషునిగూడ చూచిరి. అప్పుడు హృషీకేశుడు ఇట్లు పలికెను. ఎవరు శివునకు భక్తులో, ఎవరు ఇక్కడనన్ను తలంతురో వారు ప్రయత్న పూర్వకముగా రక్షింపదగినవారు. సమస్త సంహారకార్యమును జరిపించునట్టి, సాటిలేని నాయొక్కశరీరమే మహేశ్వరుని శరీరముతో సంబంధించినదై, భుక్తిని, ముక్తిని ప్రసాదించునది. మహనీయమైన, అంతములేని కాలము, రెండు విధముల విభక్తమై, నాయొక్క తామసరాజసమూర్తులుగా వెలయును. (231, 232, 233)

తామసీ రాజసీ మూర్తి ర్దేవదేవ శ్చతుర్ముఖః | సో7హం దేవో దురాధర్షః కాలో లోకప్రకాలనః || || 234 ||

భక్షయిష్యామి కల్పాన్తే రౌద్రేణ నిఖిలం జగత్‌ | యా సా విమోహినీ మూర్తి ర్మమ నారాయణాహ్వయా || || 235 ||

సత్త్వోద్రిక్తా జగ త్సర్వం సంస్థాపయతి నిత్యదా | స విష్ణుః పరమం బ్రహ్మ పరమాత్మా పరాగతిః || || 236 ||

మూలప్రకృతి రవ్యక్తా సదానన్దేతి కథ్యతే | ఇత్యేవం బోధితా దేవ్యో విష్ణునా విష్ణుమాతరః || || 237 ||

ప్రపేదిరే మహాదేవం తమేవశరణం పరమ్‌

ఏత ద్వః కథితం సర్వం మయాన్ధక నిషూదనమ్‌ మాహాత్మ్యం దేవదేవస్య భైరవస్యామి తౌజనః || || 238 ||

ఇతి శ్రీ కూర్మపురాణ అన్ధక నిబర్హణంనామ షోడశో7ధ్యాయః

నాలుగు ముఖములు గల దేవదేవుడగు బ్రహ్మకూడనేనే. ఇతరులచే ఎదిరింపబడజాలని, లోకమును లయింపజేయగల యముడను. (234)

కల్పముయొక్క అంతములో రౌద్రరూపముతో సమస్తనారాయణుడను పేరుగల ఏనా ఆకారము కలదో, అది సత్త్వగుణాతిశయముకలదై ఎల్లప్పుడు జగత్తును స్థాపించుచుండును. ఆ విష్ణువు పరమ బ్రహ్మరూపుడు, పరమాత్మ, ఉత్తమ ప్రాప్యస్థానము. (235, 236)

అవ్యక్తరూపయగు మూలప్రకృతి సదానందరూప అనిచెప్పబడును. ఈ విధముగా విష్ణుమాతృదేవతలు విష్ణువుచేత బోధింపబడదిరి. (237)

తరువాత వారందరు పరమశరణభూతుడైన మహాదేవుని శరణుపొందిరి. అంధకసంహారవృత్తాంతమిదియంతయు నాచే మీకు చెప్పబడినది. దేవదేవుడు, గొప్పశక్తికల భైరవస్వామియొక్క మాహాత్మ్యమిది. (238)

శ్రీ కూర్మపురాణములో అంధకబర్హణమను పదునారవఅధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters