Sri Koorma Mahapuranam    Chapters   

త్రయోదశోధ్యాయః

అథ దక్షకన్యాఖ్యాతివంశం

సూత ఉవాచ :-

భృగోఃఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీర్నా రాయణప్రియా | దేవౌ ధాతావిధాతారౌ మేరో ర్జామాతరౌ శుభౌ ||

త్రయోదశాధ్యాయము

దక్షకన్యాఖ్యాతి వంశము

సూతుడిట్లు చెప్పెను :-

భృగువుకు ఖ్యాతియను భార్య యందు నారాయణుని పత్ని యగులక్ష్మీ దేవి జనించినది. ధాత, విధాత అను ఇద్దరు దేవ పురుషులు మేరువుకు అల్లుండ్రయిన వారు కూడా కలిగిరి (1)

ఆయతి ర్నియతి శ్చైవ మేరోః కన్యేః మహాత్మనః | తయో ర్థాతృవిధాతృభ్యాం ¸° చ జాతౌ సుతావుభౌ || || 2||

ప్రాణశ్చై వ మృకణ్డుశ్చ మార్కణ్డయో మృకణ్డుతః | తథావేద శిరానామ ప్రాణస్య ద్యుతిమా న్సుత ః || || 3 ||

మరీచే రపి సంభూతిః పూర్ణమాస మసూయత | కన్యాచతుష్టయం చైవ సర్వలక్షణసంయుతమ్‌ || || 4 ||

తుష్టి ర్జ్యేష్ఠా తధా వృష్టిః కృష్టి శ్చాపచితి స్తథా | విరజాః పర్వత శ్చైవ పూర్మమాసస్య తౌ సుతౌ || || 5 ||

క్షమా తు సుషువే పుత్రా న్పులహస్య ప్రజాపతేః | కర్దమం చ వరీయాంసం సహిష్ణుం మునిసత్తమమ్‌ || || 6 ||

ఆయతి, నియతి అని మహాత్ముడైన మేరువు యొక్క కూతుళ్లిద్దరు కలరు. వారియందు ధాత, విధాత అను వారిచేత ఇరువురు కుమారులు కలిగిరి. (2)

ప్రాణుడు, మృకండువు అని ఆ కుమారుల పేర్లు. వారిలో మృకండువువలన మార్కండేయుడు జన్మించినాడు. ప్రాణునికి వేద శిరసుడు అను తేజస్సు కల పుత్రుడుదయించెను. (3)

సంభూతి అను నామె మరీచి వలన పూర్ణమాసుని పుత్రుడుగా కనెను. ఇంకను అన్ని మంచి లక్షణములుకల నలుగురు కన్యలనుగూడ ప్రసవించినది. (4)

వారిలో పెద్దది తుష్టి. తరువాత వృష్టి, కృష్టి అపచితి అనువారు ఆ కన్యలు. పూర్ణమాసునికి విరజుడు, పర్వతుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. (5)

ప్రజాపతి యగు పులహునికి క్షమ అను భార్య పుత్రులను కనెను. శ్రేష్ఠుడైన, సహనశీలుడు, ముని శ్రేష్ఠుడు అగు కర్దముని కూడ పుత్రునిగా పొందెను. (6)

తథైవ చ కనీయాంసం తపోనిర్థూతకల్మషమ్‌ | అనసూయా తథైవా త్రే ర్జజ్ఞే పుత్రా నకల్మషాన్‌ || || 7 ||

సోమం దుర్వాససం చైవ దత్తాత్రేయం చ యోగినమ్‌ | స్మృతి శ్చాజ్గీరసః పుత్రీ జజ్ఞే లక్షణసంయుతా || || 8 ||

సినీవాలీం కుహూం చైవ రాకా మనుమతీ మపి | ప్రీత్యాం పులస్త్యో భగవాన్‌ దమ్భోజి మసృజ త్ర్పభుః || || 9 ||

పూర్వజన్మని సో7 గస్త్యః స్మృతః స్వాయమ్భువే7 న్తరే | దేవబాహు స్తథా కన్యా ద్వితీయా నామ నామతః || || 10 ||

పుత్రాణాం షష్టిసాహస్రం సన్తతిః సుషువే క్రతోః | తే చోర్థ్వరేతసః సర్వే వాలఖిల్యా ఇతి స్మృతాః || || 11 ||

అట్లే తపస్సు చేత కడిగి వేయబడిన పాపములు కల చిన్న కుమారుని పొందెను. అనసూయాదేవి అత్రి మహాముని వలన పాపరహితులైన పుత్రులను ప్రసవించెను. (7)

చంద్రుని, దుర్వాసుని, యోగి యగు దత్తాత్రేయుని కుమారులుగా ఆమె పొందినది. అంగిరసుని కూతురు స్మృతి మంచి లక్షణములు కలది, (8)

సినీవాలిని, కుహువును, రాకను, అనుమతిని కుమార్తెలుగా పొందినది. పులస్త్యుడు ప్రీతి యందు దంభోజి అను కుమారుని పొందెను. (9)

అతడు పూర్వజన్మలో స్వాయంభువ మన్వంతరములో అగస్త్యుడుగా పేర్కొనబడినాడు. తరువాత దేవ బాహువను రెండవ సంతానముగా కన్య ప్రీతి యందు కలిగెను. (10)

సంతతి అను వనిత క్రతువు వలన అరువది వేల పుత్రులను పొందినది,వారందరు కూడ ఊర్థ్వరేత స్కులుగా, వాలఖిల్యులు అని చెప్ప బడినారు. (11)

వసిష్ఠశ్చ తథోర్జాయాం సప్తపుత్రా నజీజనత్‌ | కన్యాం చ పుండరీకాక్షాం సర్వశోభాసమన్వితామ్‌ || || 12 ||

రజోమాత్రోర్ధ్వ బాహుశ్చ సవన శ్చానగ స్తథా | సుతపాః శుక్రఇత్యేతే సప్తపుత్రా మహౌజసః || || 13 ||

యో7 సౌ రుద్రాత్మకో వహ్ని ర్బ్రహ్మణ స్తనయో ద్విజాః | స్వాహా తస్మా త్సుతా న్లేభేత్రీ నుదారా న్మహౌజసః || || 14 ||

పావకః పవమానశ్చ శుచి రగ్నిశ్చ రూపతః | నిర్మథ్యః పవమానః స్యా ద్వైద్యుతః పావకః స్మృతః || || 15 ||

యశ్చాసౌ తపతే సూర్యే శుచి రగ్నిస్త్వసౌ స్మృతః |తేషాం తు సన్తతా వన్యే చత్వారింశచ్చ పఞ్చచ || || 16 ||

వసిష్ఠుడు ఊర్జయను స్త్రీయందు ఏడుగురు కుమారులను పొందెను. తామరల వంటి కన్నులు కల, సమస్తమైన ప్రకాశముతో కూడిన ఒక కన్యను గూడ పొందినాడు. (12)

రజస్సు , మాత్రుడు, ఊర్థ్వబాహువు, సవనుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అను నీ యేడుగురు గొప్పబలముకల అతని కుమారులు. (13)

విప్రులారా ! బ్రహ్మయొక్క కుమారుడు, రుద్ర రూపుడైన ఏ యీ అగ్నికలడో, అతని వలన స్వాహా దేవి గొప్పబలము గల, ఉదారులైన ముగ్గురు పుత్రులను పొందినది. (14)

పావకుడు, పవమానుడు, శుచి అని రూపభేదములను బట్టి అగ్ని మూడు విధములుగా ఉండును. అరణి నుండి మథింపదగినది పవమానము, విద్యుత్సంబంధమైనది పావకము అనబడును. (15)

సూర్య మండలములో ఉండి జ్వలించుచున్న యీ అగ్ని 'శుచి' అను పేరుతో వ్యవహరింపబడును. వారి సంతతి యందు ఇంకను నలుబది యైదు మంది కలరు. (16)

పవమానః పావకశ్చ శుచి స్తేషాం పితాచయః | ఏతే చైకోనపఞ్చిశ ద్వహ్నయః పరికీర్తితాః || || 17 ||

సర్వే తపస్వినః ప్రోక్తాః సర్వే యజ్ఞేషు భాగినః | రుద్రాత్మకాః స్మృతా స్సర్వే త్రిపుణ్డ్రాంకితమస్తకాః || || 18 ||

అయజ్వానశ్చ యజ్వానః పితరో బ్రాహ్మణః సుతాః | అగ్నిష్వాత్తా బర్హిషదో ద్విధా తేషాం వ్యవస్థితిః || || 19 ||

తేభ్యః స్వధా సుతాం జజ్ఞే మేనాం వై ధారిణీం తథా | తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ ముని సత్తమాః || || 20 ||

అసూత మేనా మైనాకం క్రౌఞ్చి న్తస్యానుజం తథా | గజ్గా హిమవతో (జ) జ్ఞే సర్వలోకైకపావనీ || || 21 ||

పవమానుడు, పావకుడు, శుచి అను మూడగ్నులు, వారి తండ్రితో కూడ నలుబది యైదుమంది చేరగా మొత్తము నలుబడి తొమ్మిది అగ్నులుగా పేర్కొనబడినవి. (17)

వీరందరు తపస్సు కలవారుగా, యజ్ఞములందు భాగముకలవారుగా, రుద్రస్వరూపులుగా, మూడ పుండ్ర రేఖలతో గుర్తించబడిన శిరస్సులు కలవారుగా చెప్పబడుచున్నారు. (18)

యజ్ఞము చేయనివారు, యజ్ఞకర్తలు అగు బ్రహ్మకుమారులైన పితృదేవతలు కలరు. వారికి అగ్నిష్వాత్తులని, బర్హిషదులని రెండు విధముల విభాగము చేయ బడినది. (19)

వారి వలన స్వధ అను పత్ని మేన, ధారిణి అను పుత్రికలను కనెను. ముని శ్రేష్ఠులారా! ఆ ఇరువురు యోగము నవలంబించినవారు, వేదాంతవిద్యను ప్రకటించు వారుగా ఉండిరి. (20)

వారిలో మేన అను నామె మైనాకుని, అతని తమ్ముడైన క్రౌంచపర్వతమును పుత్రులుగా పొందెను. సమస్త లోకములను పవిత్రము చేయు ఒకే ఒక గంగానది హిమవంతుని నుండి జనించెను. (21)

స్వయోగాగ్నిబలా ద్దేవీం పుత్రీం లేభే మహేశ్వరీమ్‌ | యథావ త్కథితం పూర్వదేవ్యా మహాత్మ్య ముత్తమమ్‌ || || 22 ||

ధారిణీ మేరురాజస్య పత్నీ పద్మసమాననా | దేవౌ ధాతావిధాతారౌ మేరోర్జామాతరా వుభౌ || || 23 ||

ఏషా దక్షస్య కన్యానాం మయా పత్యాను సన్తతిః| వ్యాఖ్యాతా భవతాం సద్యో మనోః సృష్టిం నిబోధత || ||24 ||

ఇతి శ్రీ కూర్మపురాణ త్రయోదశో 7ధ్యాయః

తన యోగశక్తి అను అగ్ని బలము వలన ఆ మేన మహేశ్వరీ దేవిని పుత్రికగా పొందినది. శ్రేష్ఠమైన దేవి యొక్క గొప్పతనము ఉన్నది ఉన్నట్లుగా పూర్వము చెప్పబడినది. (22)

కమలముతో సమానమైన ముఖముకల ధారిణి మేరుపర్వతరాజుకు భార్య. ధాత, విధాత అను వారు మేరువుకు అల్లుండ్రు (23).

దక్షుని పుత్రికల సంతాన క్రమము మీకు ఈ విధముగా నాచేత వివరించబడినది. ఇక మనువు యొక్క సృష్టి క్రమమును తెలిసికొనుడు. (24)

శ్రీ కూర్మ పురాణములో పదుమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters