Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదిఏడవ అధ్యాయము - గ్రహనక్షత్రవిశేషపుష్పదేయాదేయ నిరూపణము

మార్కండేయ ఉవాచ :

సవర్ణాని గ్రహర్షాణాం దిశాంచ జగతీపతే! | నిత్యం దేయాని వాసాంసి పతాకాశ్చ విజానతా |l 1

భూషణాని చ దేయాని కాంచనాని శుభాని చ | రత్న చిత్రాణి రమ్యాణి యథాశక్త్యా నరాధిప! || 2

ధ్రువస్థాన నివిష్ఠానాం దేవతానాం మహీప తే ! | జాతీ పుష్పాణి దేయాని సర్వేషా మవిశేషతః || 3

రక్త పద్మాని సూర్యస్య శ్వేత పద్మాని చేందవే | బంధూ కాని చ భౌమాయ బుధా యేందీవరాణిచ || 4

జీవాయ యూధికా పీతా సితాయ చ తధా సితా | బాణపుష్పాణి సౌరాయ రాహవే పాటలాని చ || 5

తధా దమనకం దేయం కేతవే వసుధాధిప! | కృత్తికా సు చ దేయాని రాజన్‌! రక్తోత్పలాని చ || 6

చంపకాని చ రోహిణ్యా ఇల్వలాయాః సితోత్పలమ్‌ | ధత్తూరకా ణ్యధోర్ద్రాయా ఆదిత్యస్య చ మల్లికా || 7

చంపకాన్యేవ పుష్యస్య జాతీస్యా త్పార్ప పిత్ర్యయోః | భాగ్యస్య కాన్తా దాతవ్యా ఆర్యవ్ణు శ్చ సువర్చలా ||

సావిత్ర త్వాష్ట్రయో ర్నిత్యం బంధూక కుసుమాని చ | వాయవ్యస్య చ దేయాని సింధు వారాణి పార్థివ! || 9

ఐంద్రాగ్న్యస్య చ దేయాని కురండ కుసుమానిచ | రక్తాశోక స్య పుష్పాణి తధా మైత్రస్య పార్థివ! || 10

చంపకాని చ శాక్రస్య తధా దేయాని భూపతే! | మూలస్యచ తధా దేయం రాజన్‌! కృష్ణ కుహేటకమ్‌ || 11

కల్హారాణి తధాప్యస్య వైశ్వదేవస్య కుబ్జకమ్‌ |

బ్రాహ్మస్య జాతీ పుష్పాణి వైష్ణవస్య చ చంపకమ్‌ || 12

పాటలా వాసవ స్యాపి వారుణ స్యోత్పలాని తు | అర్కపుష్పాణ్య ధా ప్యస్య తధా దేయాని పార్థివ! || 13

అహిర్భుధ్న్యస్య దేయాని ధత్తూర కుసుమాని చ | కరవీరం పుష్పాణి తధా పౌష్ణస్య పార్థివ! || 14

చూతపుష్పాణి దేయాని అశ్వినస్య నరాధిప! నీలోత్పలాని యామ్యస్య తధా దేయాని భూపతే! || 15

సమానవేశ నక్షత్ర కథితాని తథా దిశామ్‌ | ఉత్తరాయాశ్చదేయాని నాగపుష్పాణి పార్థివ! || 16

సాగతాణాంచ దేయాని కమలాని మహీ పతే! | ఉక్తాలాభే ప్రదేయాని సవర్ణాని నరాధిప! |

స్వకాలయాని పుష్పాణి సర్వేషా మవిశేషతః || 17

యద్యద్రహస్యాభిహితం మయాత్ర ఋక్షస్యవా భూమిపతి ప్రధాన! |

తద్దేవతాయాశ్చ తధై వదేయం దిశస్తధా నాత్ర విచారణాస్తి || 18

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహర్ష విశేష పుష్పదేయాదేయ కథనం నామ సప్తనవతి తమోధ్యాయః ||

మార్కండేయుడనియె గ్రహనక్షత్రములకు దిక్కులకు ఆయాదేవతలతో సమానమైన రంగులుగల వస్త్రములు పతాకలు బంగారువస్తువులను నీయవలెను. చిత్రవర్ణములయ్యి రమ్యములయిన రత్నములును యధాశక్తి సమర్పింపవలెను. ధ్రువస్థాన మందున్న దేవతలకందరకు జాజిపువ్వుల నీయవలెను. సూర్యునకు ఎఱ్ఱతామరపువ్వులు కుజునకు బంధూకములు (ఎఱ్ఱగానుండు మంకెనపువ్వులు) బుధునకు నల్ల గల్వలు గురునికి పచ్చని యూధికలు శుక్రునికి తెల్లని శనికి బాణ పుష్పములు రాహువునకు పాటలములు కేతువునకు దమనకము (దవనమనబడును) నీయవలెను. కృత్తికలకు ఎఱ్ఱవలువలు రోహిణికి చంపకములు ఇల్వలకు (మృగశిరకు) తెల్లగలువ అర్ధ్రకు దుత్తూరము ఆదిత్యునకు (పునర్వసువునకు) మల్లి పుష్యమికి చంపకము (సంపెంగ) అశ్లేషకు మఘకు (పిత్ర్యమునకు) జాజి భాగ్యమునకు (పుబ్బకు) కాంత అర్యవ్ణుమునకు సువర్చల సావిత్ర త్వాష్ట్రములకు బంధూకములు (మంకెన) వాయవ్యమునకు సింథువారములు =వావిలిపూలు, ఐంద్రాగ్యము(న)లకు కురండములు అనూరాధ నక్షత్రమునకు ఎఱ్ఱఅశోకములు శాక్రము(జ్యేష్ట)నకు చంపకములు, మూలకు కృష్ణ కుహేటకము =ఆప్యమునకు కల్హారములు (రక్తసంధ్యకమను ఎఱ్ఱతామరపువ్వు) వైశ్వదేవమునకు కుబ్జకము బ్రాహ్మమునకు జాజిపువ్వులు వైష్ణవమునకు దుత్తూరములుపేష్ణమునకు (రేవతికి) కరవీరములి అశ్వినికి మామిడి పువ్వులు యామ్యమునకు (భరణికి) నల్లగలువలు సమర్పింపనయినవి గ్రహనక్షత్రములకు దిక్కులకు గల పోలిక ననుసరించి యివి చెప్పబడినవి. ఉత్తరకు నాగపుష్ప మురీయవలెను. సాగరములకు కమలములు సమర్పింపవలెను. ఈ చెప్పినవి దొరకని యెడల వానికీడైనవి సమానమైన రంగుగలవి, అయాకాలములందు పూయు పువ్వులను నిర్విశేషముగ సమర్పింపవచ్చును. ఏయే గ్రహమునకు నక్షత్రమునకు నిక్కడ నే నేదేదిచెప్పితిని దానిదాని తద్దేవతకు దిక్కులకును గూడ సమర్పింప వలయును. ఇచట మరి విమర్శలేదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గ్రహనక్షత్ర విశేష పుష్ప దేయాదేయనిరూపణమను తొంబది యేడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters